సింగపూర్: అంతర్జాతీయ రాజకీయాల్లో మరో భారతీయుడు పతాకశీర్షికలకెక్కారు. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న ఆర్థికవేత్త థర్మాన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణస్వీకారం చేశారు.
ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన చైనా మూలాలున్న ఎంగ్‌కోంక్ సాంగ్( 15.72 శాతం ఓట్లు), తన్‌కిన్ లియాన్ (13.88 శాతం)లను వెనక్కి నెట్టేసి ఏకంగా 70.4 శాతం ఓట్లు సాధించి షణ్ముగరత్నం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
అధ్యక్ష భవనం ఇస్టానాలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, భారతీయ మూలాలున్న జడ్జి సుందరేశ్ మీనన్ ఈయనతో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. బహుళ జాతుల, సమ్మిళిత సమాజాభివృద్ధికి కృషిచేస్తానని అధ్యక్ష హోదాలో షుణ్ముగరత్నం హామీ ఇచ్చారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం ఆరేళ్లపాటు అధ్యక్షునిగా పాలన కొనసాగిస్తారు.
Tharman Shanmugaratnam was sworn in as Singapore's ninth President on Thursday, September 14, 2023. He was elected in the 2023 presidential election with 70.41% of the vote. Congrats!#Singapore #inauguration #presidentofsingapore #tharmanshanmugaratnam
— Bryan Toh (@bryan__toh) September 15, 2023
[📸 CNA/Jeremy Long] pic.twitter.com/7JtMOYGLLE
Comments
Please login to add a commentAdd a comment