new president
-
ఎటూ తేలని బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి(BJP State new President) ఎన్నిక ఎటూ తేలడం లేదు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై స్థానిక నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు శనివారం ఇక్కడకు రావాల్సిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్(Sunil Bansal) పర్యటన వాయిదా పడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనుండగా, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో బన్సల్‌ను ఢిల్లీలోనే ఉండాలని జాతీయ నాయకత్వం సూచించినట్టు సమాచారం. పార్టీకి సంబంధించి రాష్ట్రాన్ని 38 సంస్థాగత జిల్లాలుగా బీజేపీ విభజించింది.వాటిలో 19 జిల్లాలకు అంటే సగం జిల్లాలకు అధ్యక్షులను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేశారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం అయ్యింది. ఈ ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేశాక తదుపరి కార్యాచరణను చేపట్టనున్నారు. అయితే తొలుత జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల నుంచి బన్సల్ అభిప్రాయాలు సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షకులు, కేంద్రమంత్రి శోభా కరాంద్లజే అధ్యక్షుడి నియామకానికి సంబంధించి మరోసారి రాష్ట్ర నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతారు. ఈమె నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు అందాక, రాష్ట్ర అధ్యక్షుడి పేరును జాతీయ నాయకత్వం ప్రకటిస్తుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. సైద్ధాంతిక నేపథ్యమా లేక ప్రజల్లో గుర్తింపా? రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం బీజేపీలో పాత–కొత్త నేతల మధ్య పోటీ తీవ్రంగా సాగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న, బలమైన సైద్ధాంతిక నేపథ్యమున్న వారికే అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని పాత నాయకులు కోరుతున్నారు. ఇటీవల కొందరు నాయకులు ఢిల్లీ కూడా వెళ్లి మరోసారి జాతీయ నేతలకు ఈ విషయం విన్నవించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో పార్టీ మరింత విస్తరించి, వచ్చే ఎన్నికల్లో అధికారం లోనికి రావాలంటే ప్రజల గుర్తింపుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వారికి అవకాశం కల్పించాలని ఇటీవలి మూడు, నాలుగేళ్ల కాలంలో పార్టీలో చేరిన కొత్త నాయకులు గట్టిగా కోరుతున్నారు.జాతీయ నాయకత్వం సైతం ఈసారి కొత్త వారికి అవకాశం కల్పింస్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు జరుపుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పాత వారికి అవకాశం కల్పిస్తే, తమకు ఆ పదవిని ఇవ్వాలని కోరుతున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు, ఇతర నేతలున్నారు. ఇంకోవైపు నుంచి ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, అరి్వంద్ ధర్మపురి, ఎం.రఘునందన్ రావు, ఇతర నాయకులు తమను అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు. సామాజిక సమతూకంపై భరోసా ఇప్పటివరకు నియమించిన 19 జిల్లాల అధ్యక్షుల్లో సామాజిక సమీకరణలు సరిగా పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. మహిళలకు ఒక్కరికి కూడా అవకాశం లభించకపోగా, బీసీల్లోని కొన్ని కులాలను ఈ పదవుల కోసం పరిగణనలోకి తీసుకోలేదని నిరసనలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే మిగిలిన 19 జిల్లాల అధ్యక్షుల నియామకం తర్వాత సామాజిక సమతుల్యత నెరవేరుతుందని, మొత్తంగా జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత లభిస్తుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.నేడు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై భేటీశనివారం ఉదయం ఓ ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై బీజేపీ కీలక భేటీ జరగనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలందరూ పాల్గొననున్నారు. -
టీబీజేపీ కొత్త అధ్యక్షుడికి లైన్ క్లియర్
-
సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా షరా
డమాస్కస్: సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా తిరుగుబాటు నేత అహ్మెద్ అల్ షరా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాత్కాలిక శాసనసభను ఏర్పాటు చేసే బాధ్యతను షరాకు అప్పగించినట్లు సిరియా సైనిక అధికారి హసన్ అబ్దెల్ ఘనీ ప్రకటించారు. షరా నాయ కత్వం వహిస్తున్న హయత్ తహ్రీర్ అల్–షామ్ (హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగు బాటు కూటమి మెరుపు దాడులు చేసి గత ఏడాది డిసెంబర్ ఎనిమిదో తేదీన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనకు చరమగీతం పాడిన విషయం విదితమే. -
క్లైమాక్స్‌కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడెవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ తమ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట అకస్మాత్తుగా బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి కిషన్‌రెడ్డి తాత్కలికంగా బీజేపీ సారథ్య బాధ్యతలు నెట్టుకొస్తున్నారు. అయితే ఫుల్ టైం అధ్యక్షుడిగా రాష్ట్రమంతగా తిరిగి పార్టీని పటిష్టం చేసే నాయకుడికోసం తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం పేరుతో అధిష్టానం బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో పెట్టింది.అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. కానీ ఇప్పటి వరకు అధ్యక్షుడి నియామకం హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. దానికి ప్రధాన కారణం అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువకావడంతో పాటు, ఒకరిపై ఒకరు పోటాపోటీగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దాంతో అధ్యక్షుడి ఎంపిక బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఒకరికి పదవి ఇస్తే మరొకరు పనిచేయకుండా, సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ ఎంపిక ప్రక్రియను సాగదీస్తోంది. అయితే, అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు అధిష్టానం పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని తమతమ బలాలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు బలం కాగా, ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. మరో వైపు ధర్మపురి అరవింద్ రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి తన సత్తాను చాటారు. తొలి ప్రయత్నంలోనే కేసీఆర్ కూతరు కవితను ఓడించి అధిష్టానం దృష్టిలో పడ్డ అరవింద్ రెండో సారి కూడా గెలిచి తాను బలమైన నేతనని నిరూపించుకున్నారు.అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తారని, అందరినీ కలుపుకుపోలేరని ఆయన వ్యతిరేకవర్గం ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల బలాలను, బలహీనతలను అధిష్టానం బేరీజు వేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ బీసీని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈసారి బీసీకే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఫ్లోర్ లీడర్‌గా మహేశ్వర్ రెడ్డిని నియమించిన అధిష్టానం, అధ్యక్ష పదవి బీసీకే అప్పగిస్తామనే సంకేతం పంపింది. ఈ కోణంలో కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లో ఎవరో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్‌రెడ్డిని యథావిధిగా మరికొంత కాలం కొనసాగించే అవకాశముంది. -
జనవరిలోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, న్యూఢిల్లీ: జనవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. జనవరి 10 నాటికి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తికానుండగా, రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలు 15 నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత జనవరి నెలాఖరు కల్లా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో గత ఏడాది కాలంగా జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన పురోగతిపై అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నుంచి నివేదిక తీసుకున్నారు.అంతేగాక పార్టీ అంతర్గత ఎన్నికలపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, పార్టీ జాతీయ పదాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ నుంచి డి.పురందేశ్వరి సమావేశానికి హాజరయ్యారు. నడ్డా దిశా నిర్దేశం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని ఏడాది పొడవునా నిర్వహించడం, దేశంలోని వివిధ ప్రదేశాలలో అటల్జీ జీవితానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించడంపై నడ్డా దిశానిర్దేశం చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, విజయాలు, ప్రధానంగా కార్గిల్ యుద్ధం, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, పోఖ్రాన్ అణు పరీక్ష, స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి ప్రాజెక్ట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి విజయాలను ప్రదర్శించనున్నారు. ఇలావుండగా వివాదాస్పద అంశాలపై ప్రకటనలు, వ్యాఖ్యలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం సూచించింది. -
నమీబియాకు తొలి అధ్యక్షురాలు
నమీబియా ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించింది. నెటుంబో నండీ ఎండైట్వా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాపో పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. నమీబియాలో అధ్యక్ష పదవికి, నేషనల్ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ జరుగుతుంది. 72 ఎండైట్వా 57 శాతం ఓట్లు సాధించారు. శాంతి, సుస్థిరత కోసం దేశం ఓటేసిందని ఫలితాల అనంతరం ఆమె అన్నారు. 1960ల్లో దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. 96 స్థానాలకు స్వాపో పార్టీ 51 స్థానాలు గెలిచి మెజారిటీ సాధించింది. ఇండిపెండెంట్ పేట్రియాట్స్ ఫర్ ఛేంజ్ (ఐపీసీ) పార్టీ 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, ఫలితాలను కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది. నిష్కళంక నేత ఎన్ఎన్ఎన్ అని పిలుచుకునే ఎండైట్వా పార్టీలో దిగ్గజ నేత. ఆఫ్రికా ఖండంలోని అతి కొద్ది నాయకురాళ్లలో ఒకరు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు. పాస్టర్ కూతురు అయిన ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ఎదిగారు. గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగారు. నిష్కళంక నేతగా ఆమెకున్న ప్రతిష్ట ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించింది. బలమైన గ్రామీణ మూలాలతో 30 లక్షల మంది జనాభా ఉన్న నమీబియా ప్రధానంగా యురేనియం, వజ్రాల ఎగుమతిదారు. దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం అధికం. దేశ సంపద స్థానికులకు ఉపయోగపడటం లేదు. 15–34 ఏళ్ల మధ్య వయసు్కల్లో నిరుద్యోగం 46 శాతముంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. అధిక నిరుద్యోగం, అసమానతల కారణంగా స్వాపో పార్టీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మూలాలు స్వాపోకు కలిసొచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్
న్యూఢిల్లీ: 2024–25 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్‌గా ఇమామి లిమిటెడ్ ఎండీ హర్షవర్ధన్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.నవంబర్ 21న ఫిక్కీ 97వ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఫిక్కీ ప్రెసిడెంట్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా ఉన్నారు.ఇదీ చదవండి: అభినవ ‘టాటా’! సంపదలో భారీ మొత్తం విరాళం -
ఇండోనేసియా అధ్యక్షుడిగా సుబియాంతో
జకార్తా: ఇండోనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబొవో సుబియాంతో(73) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో సుబియాంతో తోపాటు ఉపాధ్యక్షుడిగా గిబ్రాన్ రకబుమింగ్ రకా(37) ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షుడు విడొడొ కుమారుడైన రకా సుకార్తా మేయర్‌గా సైతం పనిచేశారు. ప్రమాణ స్వీకారం ఓపెన్ టాప్ వ్యాన్‌లో వచ్చిన సుబియాంతోకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పార్లమెంట్ భవనం, అధ్యక్ష భవనం రహదారి కిక్కిరిసింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. సుబియాంతో ఖురాన్ సాక్షిగా ప్రమాణం చేశారు. -
ఏఏఏఐ అధ్యక్ష నియామకం
హైదరాబాద్: సౌత్ ఏషియా ఆఫ్ గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సీఈవో అయిన ప్రశాంత్ కుమార్, అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెంట్‌గా మరోసారి ఎన్నికయ్యారు. ముంబైలో సమావేశమైన ఏఏఏఐ వార్షిక జనరల్ బాడీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి కొత్త పాలకమండలిని ఎన్నుకుంది. హవాస్ ఇండియా గ్రూప్ సీఈవో అయిన రాణా బారువా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మోహిత్ జోషి, సంతోష్ కుమార్, కె.శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని కొత్త ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయామ్స్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: ‘ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి) ఎన్నికయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఐఎన్ఎస్ బిల్డింగ్‌లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో 2024–25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్‌ను ఎన్నుకోగా.. వివేక్ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, కరణ్ రాజేంద్ర దర్దా (లోక్మత్) ఉపాధ్యక్షుడిగా, తన్మయ్ మహేశ్వరీ (అమర్ ఉజాలా) కోశాధికారిగా, మేరీపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ తెలిపింది. కేఆర్పీ రెడ్డి (సాక్షి), వివేక్ గొయెంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్), అతిదేవ్ సర్కార్ (టెలిగ్రాఫ్), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ఐ.వెంకట్ (ఈనాడు), జయంత్ మమెన్ మాథ్యూ (మలయాళ మనోరమ)లు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
‘టీపీసీసీ కొత్త అధ్యక్షుడిపై’ నిర్ణయం తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జునఖర్గేను కోరారు. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ఖర్గేతో రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీకి కొత్త «అధ్యక్షుడిగా ఎవరిని నియ మించినా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ చెప్పినట్టు సమాచారం.త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర ఆంశాలపైనా చర్చించినట్టు తెలిసింది. పదవుల భర్తీల్లో భాగంగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశా లపైనా మంతనాలు జరిపినట్టు సమాచారం. రైతు రుణమా ఫీ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ, సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా చర్చించి, ఆహ్వానించినట్టు తెలిసింది. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ.వేణుగోపాల్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రేవంత్‌తో సింఘ్వీ భేటీసాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వీని ప్రకటించాక మొదటిసారి ఉభయులూ సమావేశమయ్యారు. సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 21న నామినేషన్ దాఖలు సహా వివిధ అంశాలపై లోతుగా చర్చించినట్టు అభిషేక్ మను సింఘ్వీ ట్వీట్ చేశారు. -
కమలానికి కొత్త సారథి.. ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకపు అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి సమస్య, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం, కేడర్‌లో నిరాసక్తత, నిస్తేజం పెరుగుతున్న నేపథ్యంలో... కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఇంకా ఎప్పుడు నియమిస్తుందా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవితో పాటు, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన రాష్ట్ర పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించ లేకపోతున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కిషన్‌రెడ్డి కూడా వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తప్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విన్నవించినట్టు సమాచారం. దీంతో పాటు మరో మూడు నాలుగు నెలల్లో స్థానికసంస్థల ఎన్నికలు జరగొచ్చుననే రాజకీయవర్గాల అంచనాల నేపథ్యంలో గ్రామ, మండల ,జిల్లా స్థాయిల్లో పార్టీ పటిష్టతతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడమనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది.స్థానిక ఎన్నికల్లో... జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతగా కేడర్, స్థానిక నాయకుల బలం లేని బీజేపీ.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేతను కొత్త అధ్యక్షుడిని నియమిస్తే...ఎన్నికల్లోగా సంస్థాగతంగా పార్టీ బలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.ఈటల వైపే మొగ్గు...?బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం..పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గట్టిగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, టి.రాజాసింగ్, ముఖ్యనేతలు ఎన్.రామచంద్రరావు, చింతల రామచంద్రా రెడ్డి, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు పోటీపడుతున్నారు.బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినందున, రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందినవారినే అధిష్టానం నియమిస్తుందని పార్టీలో పలువురు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వాదన రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన ఈటల రాజేందర్‌కు అడ్వాంటేజ్‌గా మారొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల వైపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ బన్సల్ వంటి వారు మొగ్గుచూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బీసీ వర్గాల నుంచే ఎంపికచేస్తే ఈటలతో పాటు అర్వింద్ ధర్మపురి, పాయల్‌శంకర్, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు పేర్లను సైతం పరిశీలిస్తారని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన ఈటలకు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచాక కొత్త, పాత అంటూ ఉండదని, రాష్ట్రంలో పార్టీ గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా విస్తరించి, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇది అడ్డంకి కాకూదని వాదిస్తున్న వారూ పార్టీలో ఉన్నారు.అలాగైతే రామచంద్రరావుకే.. సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యతని స్తే... మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని పార్టీ వర్గాలంటున్నాయి. కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దన్న కొందరి అభ్యంతరాల నేపథ్యంలో సంఘ్ పరివార్ కూడా మద్దతిస్తే రామచంద్రరావుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని పార్టీ నాయకులు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. -
తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకంపై సస్పెన్స్
-
ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
సాక్షి, విజయవాడ: ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాస్‌ను నియమించే అవకాశాలున్నాయి. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పల్లా శ్రీనివాస్‌ను టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించనున్నారని సమాచారం.కాగా, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడు.. కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్ధానంలో మరో సీనియర్ నేతకు ఏపీ పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గాజువాక నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్‌రావు పేరును త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
టీపీసీసీ కొత్త బాస్ ఎవరు?.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?
తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీకాలం కూడా ఈ నెలలో ముగుస్తుండటంతో గాంధీభవన్‌కు కొత్త బాస్ నియామకం అనివార్యమైంది. టీ.పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏఐసీసీ పెట్టిన నిబంధన వారికి తలనొప్పిగా మారిందట. ఇంతకీ కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ పదవికి పెట్టిన నిబంధన ఏంటి? పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నాయకులు ఎవరు?తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎం పదవి వరించింది. అయితే లోక్‌సభ ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉండటంతో ఆయన్నే పీసీసీ చీఫ్‌గా కొనసాగించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. అదే సమయంలో రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కూడా ఈ నెల 27తో ముగియబోతోంది.దీంతో జోడు గుర్రాలపై ఉన్న రేవంత్‌రెడ్డికి పార్టీ బాధ్యతల నుంచి విముక్తి కలిగించి, ఆయన పూర్తిగా పాలన మీదే దృష్టి సారించేలా చూడాలని పార్టీ నాయకత్వం నిర్ణయిచింది. అందుకే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయగలిగే నేతను పీసీసీ చీఫ్‌గా నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో విస్తృతంగా జరుగుతోంది. గాంధీభవన్ బాస్‌గా హై కమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారట. పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే దానిపై హై కమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అనేక పలువురు సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఇద్దరు కుమారులకు సీట్లు ఇప్పించుకుని గెలిపించుకున్న సీనియర్ నేత జానారెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోరుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి కావాలని హైకమాండ్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ సైతం ఆ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించినా సంపత్‌కు టిక్కెట్ దక్కలేదు. అందుకే ఆయన పీసీసీ పదవి విషయంలో పట్టుపడుతున్నారు. ఎస్టీ సామాజికవర్గాల నుంచి మంత్రి సీతక్క, బలరాం నాయక్ కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.చాలా మంది పీసీసీ చీఫ్ రేసులో ఉన్నప్పటికీ ఒక్కరికి ఓకే పదవి అనే నిబంధన ఏఐసీసీ పెట్టడంతో చాలా మంది సీనియర్లు అసంతృప్తి కి లోనవుతున్నారట. పీసీసీ పదవి ఆశిస్తున్న పలువురు నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. దీంతో వీరందరికీ ఏఐసీసీ నిబంధన ఇబ్బందికరంగా మారిందట. కర్నాటక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్.. పీసీసీ చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పక్క రాష్ట్రంలో లేని నిబంధన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అంటూ ఇక్కడి సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న మంత్రులు అధికార పదవి వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. అయితే కొందరు నేతలు మాత్రం చట్టసభల్లో లేనివారు, ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనివారికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీకి ఎక్కువ సమయం ఇస్తారని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. -
అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్‌గా మధు శశిధర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్, సీఈవోగా మధు శశిధర్ నియమితులయ్యారు. అపోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా 2023 అక్టోబర్‌లో ఆయన చేరారు. యూఎస్‌లోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ సంస్థలో పలు హోదాల్లో పనిచేశారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ట్రెడిషన్ హాస్పిటల్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఇంటర్నల్ మెడిసిన్, పల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. -
టీఎఫ్‌డీఏ నూతన అధ్యక్షుడిగా వీరశంకర్
తెలుగు సినీ దర్శకుల సంఘం (టీఎఫ్‌డీఏ) సంఘం నూతన అధ్యక్షుడిగా దర్శకుడు బి. వీరశంకర శ్రీనివాస్ (వీరశంకర్) గెలుపొందారు. 2024–2026 సంవత్సరాలకు గాను ఆదివారం హైదరాబాద్‌లో టీఎఫ్‌డీఏ ఎన్నికలు జరిగాయి. దర్శకుల సంఘంలో దాదాపు 2000 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి బి. వీరశంకర శ్రీనివాస్, వి. సముద్రరావు, జి. రామ్‌ప్రసాద్, ఏఎస్ రవికుమార్ చౌదరి, పానుగంటి రాజారెడ్డి పోటీ చేశారు. ఈ పోటీలో 536 ఓట్లతో వీరశంకర్ విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా నీలం సాయిరాజేశ్, ఎమ్వీఎన్ రెడ్డి (వశిష్ఠ), జనరల్ సెక్రటరీగా సీహెచ్ సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా వద్దానం రమేశ్, కస్తూరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీఎస్ ప్రియదర్శి, డి. వంశీకృష్ణ జయకేతనం ఎగురవేశారు. ట్రెజరర్‌గా పీవీ రామారావు గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ. కృష్ణమోహన్, అల్లా భక్స్, రాజా వన్నెంరెడ్డి, శైలేష్ కొలను, శ్రీరామ్ ఆదిత్య తుర్లపాటి, కూరపాటి రామారావు, లక్ష్మణరావు చాపర్ల, ప్రవీణ మడిపల్లి, రమణ మొగిలి, కొండా విజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు దర్శకుల సంఘం స్థాయిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లేందుకు అందరం కలిసి కృషి చేస్తాం. ఇప్పుడు ఉన్న టీఎఫ్డీఏను ‘టీఎఫ్‌డీఏ 2.ఓ’ అన్నట్లుగా వర్క్ చేస్తాం. హైదరాబాద్‌కు ఎవరైనా పర్యాటకులు వస్తే టీఎఫ్‌డీఏ బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలన్నట్లుగా చేస్తాం. మంచి ఆలోచనలుంటే ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది’’ అన్నారు. -
తైవాన్ అధ్యక్ష పీఠంపై జాతీయవాది
తైపీ: చైనాతో విభేదాలు తారస్థాయికి చేరిన వేళ స్వయం పాలిత తైవాన్‌లో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. కరడుగట్టిన జాతీయవాదిగా పేరొందిన డీపీపీ అభ్యర్థి లై చింగ్ టె నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతంఉపాధ్యక్షుడైన లై 40 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థులైన చైనా అనుకూల ప్రధాన విపక్షమైన కొమింటాంగ్ (కేఎంటీ) పార్టీ అభ్యర్థి హో యు ఈ 33 శాతం ఓట్లతో ఓటమి చవిచూశారు. మరో విపక్షం తైవాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి కో వెన్ జెకు 26 శాతం ఓట్లు దక్కాయి. ఎనిమిదేళ్లుగా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న తై ఇంగ్ వెన్ చైనా పట్ల అనుసరించిన దూకుడైన విధానాలను లై మరింత ముందుకు తీసుకు వెళ్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్ ద్వీపం చుట్టూ ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతోపాటే తైవాన్‌కు దన్నుగా నిలుస్తున్న అమెరికాతోనూ చైనా విభేదాలు తీవ్రతరమయ్యేలా కనిపిస్తున్నాయి. తైవాన్‌కు ఆయుధాల సరఫరాతో పాటు అన్నివిధాలా అమెరికా సహకరిస్తుండటం తెలిసిందే. పార్లమెంటులో చుక్కెదురు తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓ పార్టీ వరుసగా మూడుసార్లు నెగ్గడం ఇదే తొలిసారి. కానీ అధ్యక్ష పదవితో పాటే తైవాన్ పార్లమెంటుకు కూడా జరిగిన ఎన్నికల్లో మాత్రం అధికార డీపీపీ ఓటమి చవిచూసింది! 113 స్థానాలకు గాను 51 సీట్లతో సరిపెట్టుకుంది. విపక్ష కేఎంటీ 52, టీపీపీ 8 సీట్లలో నెగ్గాయి. పార్లమెంటులో మెజారిటీ సాధనకు ఆ రెండు పారీ్టలూ చేతులు కలిపే అవకాశాలున్నాయి. అధ్యక్ష పీఠంపై చైనా వ్యతిరేక డీపీపీ కొనసాగనుండగా పార్లమెంటుపై మాత్రం చైనా అనుకూల కేఎంటీ కూటమికి ఆధిపత్యం దక్కేలా ఉండటం ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర పిపాసి 64 ఏళ్ల లై చింగ్ టె స్వతంత్ర పిపాసిగా, ప్రస్తుత అధ్యక్షురాలు వెన్ను మించిన జాతీయవాదిగా పేరొందారు. తైవాన్ స్వతంత్ర దేశమని, ఈ విషయంలో చైనాతో ఎలాంటి చర్చలకూ ఆస్కారం లేదని ఆయన చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. చైనా కూడా లైని విపరీతంగా ద్వేషిస్తుంది. ఆయనను ఎన్నుకుంటే తీవ్ర చర్యలు తప్పవని పోలింగ్ వేళ తైవాన్ ప్రజలను నేరుగానే హెచ్చరించింది. తైవాన్‌తో యుద్ధమా, శాంతా అన్నది వారి తీర్పును బట్టే ఉంటుందని పేర్కొంది. కానీ ప్రజలు తమ తీర్పు ద్వారా ఆ హెచ్చరికలను బేఖాతరు చేశారు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. డ్రాగన్ దేశం గత 40 ఏళ్లలో తొలిసారిగా ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజల కొనుగోలు శక్తి శరవేగంగా క్షీణిస్తోంది. దాంతో జిన్‌పింగ్ ప్రతిష్ట నానాటికీ మసకబారుతోంది. ఈ నేపథ్యంలో చైనీయుల మనసు గెలుచుకునేందుకు తైవాన్‌పై ఆయన దూకుడు పెంచే ఆస్కారం లేకపోలేదని భావిస్తున్నారు. బలప్రయోగం ద్వారా దాన్ని విలీనం చేసుకునే ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని పాశ్చాత్య రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు తైవాన్లోనూ ఆర్థికాభివృద్ధి బాగా నెమ్మదించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరుగుతున్నాయి. ఇంటా బయటా ఎదురవుతున్న ఈ పెను సమస్యలను కొత్త అధ్యక్షుడు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. -
Wrestling Federation of India: సస్పెన్షన్‌ను పట్టించుకోం... కమిటీని గుర్తించం!
న్యూఢిల్లీ: ఇంత జరిగినా కూడా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్ర క్రీడాశాఖ విధించిన సస్పెన్షన్‌ను పట్టించుకోమని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నియమించిన అడ్‌హక్ కమిటీని కూడా గుర్తించబోమని ధిక్కారపు ధోరణిని ప్రదర్శించారు. త్వరలోనే జాతీయ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్íÙప్ పోటీలను నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. ‘మేం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యాం. రిటరి్నంగ్ అధికారి దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేశారు. అలాంటి కార్యవర్గాన్ని ఎందుకు విస్మరిస్తారు. అడ్‌హక్ కమిటీతో మాకు సంబంధం లేదు. మా సమాఖ్యను మేమే నడిపించుకుంటాం త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పోటీల నిర్వహణపై నిర్ణయం కూడా తీసుకుంటాం’ అని సంజయ్ వెల్లడించారు. నియమావళిని అతిక్రమించలేదని ఇదివరకే క్రీడాశాఖకు సంజాయిషీ ఇచ్చామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. -
ఐఎస్ఎంఏ అధ్యక్షుడిగా మండవ ప్రభాకర్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) కొత్త అధ్యక్షుడిగా నూజివీడు సీడ్స్ (ఎన్ఎస్ఎల్), ఎన్ఎస్ఎల్ షుగర్స్ లిమిటెడ్ సంస్థల చైర్మన్ మండవ ప్రభాకర్ రావు ఎన్నికయ్యారు. ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలో జరిగిన 89వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ పేరును ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ)గా మార్చారు. సంస్థ ఉపాధ్యక్షుడిగా ధామ్‌పూర్ బయో ఆర్గానిక్స్ (డీబీవో) ఎండీ గౌతమ్ గోయల్‌ను ఎన్నుకున్నారు. దేశీయంగా జీవ ఇంధనాలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దూరదృష్టితో తమ సంస్థ పేరులో బయో ఎనర్జీని కూడా చేర్చినట్లు ఐఎస్ఎంఏ తెలిపింది. దేశీయంగా చక్కెర పరిశ్రమ.. ఇంధన పరిశ్రమగా రూపాంతరం చెంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. -
రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి
జైపూర్: రాజస్థాన్‌లో బీజేపీ కొత్త చీఫ్‌ను నియమించనుంది. కేంద్ర మంత్రి, బార్మర్ ఎంపీ కైలాష్ చౌదరిని రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా నియమించే అవకాశం ఉంది. జాట్ సామాజిక వర్గమే లక్ష్యంగా అధిష్ఠానం పావులు కదుపుతున్నట్లు సమాచారం. కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో జాట్లకు రిజర్వేషన్ కల్పిచింది బీజేపీయే. కానీ ఇటీవల కాలంలో జాట్ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. రాజస్థాన్‌లో దాదాపు 60 స్థానాల్లో జాట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయా స్థానాల్లో వీరి మద్దతు ఫలితాలను తారుమారు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కైలాష్ చౌదరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ నియామకం అయిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా ప్రమాణం చేశారు. రాజపుత్, దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. అటు.. ముఖ్యమంత్రిగా బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను నియమించారు. రాష్ట్రంలో సీఎంగా భజన్ లాల్ శర్మ ఎంపికైన తర్వాత మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ సభ్యుల పేర్లను ఎంపిక చేయడానికి భజన్ లాల్ శర్మ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర నాయకులతో సమావేశమవుతారు. అటు.. ప్రస్తుత రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషికి కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: Varanasi: నేడు ప్రధాని మోదీ వారణాసి రాక.. -
ఇమ్రాన్ స్థానంలో గోహర్ అలీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్–ఇ– ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్‌గా గోహర్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల గుర్తుగా ‘బ్యాట్’ కొనసాగాలంటే సంస్థాగత ఎన్నికలు జరపాల్సిందేనన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎన్నిక జరిగినట్లుగా భావిస్తున్నారు. గోహర్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు. శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోహర్(45) పార్టీ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నికైనట్లు డాన్ పత్రిక తెలిపింది. తోషఖానా అవినీతి కేసు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ సెప్టెంబర్ నుంచి జైలులో∙ఉన్నారు. అందుకే, సంస్థాగత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు. -
క్రెడాయ్ నూతన కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెసిడెంట్‌గా వీ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా బీ జగన్నాథరావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఎన్ జైదీప్‌రెడ్డి ఎన్నికయ్యా రు. వైస్ ప్రెసిడెంట్లుగా బీ ప్రదీప్‌రెడ్డి, సీజీ మురళీ మోహన్, కొత్తపల్లి రాంబాబు, ఎం శ్రీకాత్‌లు, ట్రెజరర్‌గా మనోజ్ కుమార్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీలు జీ నితీష్ రెడ్డి, క్రాంతికి రణ్‌రెడ్డిలు ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఏ వెంకట్ రెడ్డి, బీ జైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ బన్సల్, సీ అమరేందర్‌రెడ్డి, సుశీ ష్ కుమార్ జైన్, మోరిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్, ఎన్ వంశీధర్‌రెడ్డిలు వ్యవహరిస్తారు. 2023–25 సంవత్సరాలకు ఈ పదవిలో కొనసాగుతారు. -
ఆయన దయ వల్లే ఈ హోదా – జానీ మాస్టర్
‘‘ఈ రోజు మాకు (డ్యాన్స్ మాస్టర్స్) ఇంత పేరు, హోదా వచ్చి కార్లలో తిరుగుతున్నామంటే ముక్కురాజు మాస్టర్ దయే. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం కూడా ఆయనే. యూనియన్ తరఫున ఆయన వారసురాలికి చిరు కానుకగా రెండు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ నూతన అధ్యక్షుడు జానీ మాస్టర్ అన్నారు. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కేఎల్ దామోదర ప్రసాద్ విశిష్ఠ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘నూతన కార్యవర్గం యూనియన్ సభ్యుల మంచి కోసం పని చేయాలి. జానీ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి డ్యాన్స్ మాస్టర్లు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా యూనియన్ సొంత స్థలం, భవనం కోసం కృషి చేస్తా’’ అన్నారు జానీ మాస్టర్. ఈ కార్యక్రమంలో మద్రాస్ డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ దినేష్ మాస్టర్, పలువురు డ్యాన్స్ మాస్టర్స్ పాల్గొన్నారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షునిగా రాకేశ్ శర్మ
న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్)కి 2023–24 కాలానికి నూతన అధ్యక్షునిగా రాకేశ్ శర్మ(ఆజ్ సమాజ్) ఎన్నికయ్యారు. వార్తాసంస్థలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్ సంస్థల సంఘమైన ఐఎన్ఎస్ 84వ వార్షిక సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఇప్పటిదాకా సంస్థకు కె.రాజ ప్రసాద్ రెడ్డి(సాక్షి) అధ్యక్షునిగా కొనసాగిన విషయం తెల్సిందే. 2023–24 కాలానికిగాను ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా శ్రేయాంస్ కుమార్(మాతృభూమి), వైస్ ప్రెసిడెంట్‌గా వివేక్ గుప్తా(సన్మార్గ్), గౌరవ ట్రెజరర్‌గా తన్మైయ్ మహేశ్వరి(అమర్ ఉజాలా) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కె.రాజ ప్రసాద్ రెడ్డి(సాక్షి), ఐ.వెంకట్(ఈనాడు, అన్నదాత)సహా 41 మంది ఎన్నికయ్యారు. సొసైటీకి సెక్రెటరీ జనరల్‌గా మేరీ పాల్ ఎంపికయ్యారు. మరోవైపు అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో తనకు పూర్తి సహాయక సహకారాలు అందించిన ఐఎన్ఎస్ ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, తదితరులకు మాజీ అధ్యక్షుడు కె.రాజ ప్రసాద్ రెడ్డి(కేఆర్పీ రెడ్డి) కృతజ్ఞతలు తెలిపారు. -
మరో ఘనత.. సింగపూర్ అధ్యక్ష పీఠంపై భారతీయుడు
సింగపూర్: అంతర్జాతీయ రాజకీయాల్లో మరో భారతీయుడు పతాకశీర్షికలకెక్కారు. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న ఆర్థికవేత్త థర్మాన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన చైనా మూలాలున్న ఎంగ్కోంక్ సాంగ్( 15.72 శాతం ఓట్లు), తన్కిన్ లియాన్ (13.88 శాతం)లను వెనక్కి నెట్టేసి ఏకంగా 70.4 శాతం ఓట్లు సాధించి షణ్ముగరత్నం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అధ్యక్ష భవనం ఇస్టానాలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, భారతీయ మూలాలున్న జడ్జి సుందరేశ్ మీనన్ ఈయనతో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. బహుళ జాతుల, సమ్మిళిత సమాజాభివృద్ధికి కృషిచేస్తానని అధ్యక్ష హోదాలో షుణ్ముగరత్నం హామీ ఇచ్చారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం ఆరేళ్లపాటు అధ్యక్షునిగా పాలన కొనసాగిస్తారు. Tharman Shanmugaratnam was sworn in as Singapore's ninth President on Thursday, September 14, 2023. He was elected in the 2023 presidential election with 70.41% of the vote. Congrats!#Singapore #inauguration #presidentofsingapore #tharmanshanmugaratnam [📸 CNA/Jeremy Long] pic.twitter.com/7JtMOYGLLE — Bryan Toh (@bryan__toh) September 15, 2023 -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
‘‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్సీసీ) అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నవారికి కృతజ్ఞతలు. గత ఏడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ అసోసియేషన్‌కి పూర్తి సమయం కేటాయించలేకపోయాను.. ఈ ఏడాది కచ్చితంగా సమయం కేటాయించి అందరితో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను’’ అని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన ‘తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి’ పాలక మండలిని శనివారం ప్రకటించారు. ‘టీఎస్ఎఫ్సీసీ’ అధ్యక్షునిగా సునీల్ నారంగ్ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా వీఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి, సెక్రటరీగా కె. అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్‌గా చంద్ర శేఖర్ రావు ఎన్నికయ్యారు. అలాగే 15 మంది ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ–‘‘టీఎస్ఎఫ్సీసీ’ పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అందరూ చిత్ర పరిశ్రమ, కార్మికుల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి’’ అన్నారు. ఇంకా నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడారు. -
సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా దినేశ్‌కు బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేశ్ బాధ్యతలు స్వీకరించారు. బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. అలాగే, ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమాని సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో 2023–24కు గాను కొత్త ఆఫీస్–బేరర్లను ఎన్నుకున్నారు. -
నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్
ఖట్మాండు: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్రను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంతో ప్రధానమంత్రి ప్రచండ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అధికార సంకీర్ణ కూటమి అభ్యర్థి రామచంద్రను ఎన్నిక కోసం తెరవెనుక ప్రచండ పన్నిన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్టు సెంటర్) తో పాటు ఎనిమిది పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి పార్లమెంటులో రెండో అతి పెద్ద పార్టీ సీపీఎన్–యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా గెలిస్తే నేపాల్ ప్రభుత్వంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉండేది. -
Peru: అధ్యక్షుడి అభిశంసన, ఆపై అరెస్టు
లీమా: రాజకీయ సంక్షోభానికి నెలవైన దక్షిణ అమెరికా దేశం పెరూ పాలనా పగ్గాలు హఠాత్తు గా చేతులు మారాయి. తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని పెడ్రో క్యాస్టిల్లో ప్రకటించిన కొద్దిగంటల్లోనే పరిణామాలు చకచకా మారిపోయాయి. పార్లమెంట్‌ను రద్దుచేయబోతున్నట్లు, దేశవ్యాప్త కర్ఫ్యూ అమల్లోకి రాబోతోందని ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిల్లోను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు వెనువెంటనే అభిశంసనతోపాటు అధ్యక్ష పీఠం నుంచి తప్పించారు. ఆయన అరెస్ట్, నిర్బంధం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలోనే ఉపాధ్యక్షురాలు డినా బొలౌర్టే.. అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాన్ని అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది. -
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా
బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్ లులా(77) ఎన్నికయ్యారు. ఆదివారం(అక్టోబర్ 30) జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోను ఓడించి బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇరువురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్వల్ప తేడాతో బోల్సోనారోపై లులా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో లులాకు 50.9శాతం ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఆ దేశ అత్యున్నత ఎన్నికల విభాగం తెలిపింది. తాజా ఎన్నికతో లులా డ సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ప్రెసిడెంట్‌గా చేశారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వా.. అధికారం కోల్పోయి తర్వాత అవినీతి ముద్రతో జైలుకు వెళ్లారు. బయటకు వచ్చి రాజకీయ పోరాటంలో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు లులా డ సిల్వా. ‘దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తాను. ఆయుధాల వినియోగాన్ని తగ్గించేందుకు పాటుపడతాం. అలాగే అమెజాన్ అడవులను రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం కావాలి. ప్రపంచ దేశాలు అందుకు సహకరించాలి. ప్రపంచ వ్యాణిజ్యం మరింత పారదర్శకంగా చేస్తాం.’ అని పేర్కొన్నారు లులా. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన క్రమంలో 2018లో పోటీ చేసేందుకు అనర్హులుగా మారారు లులా. 2021లో ఆయనపై ఉన్న కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వాకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అంతర్జాతీయ అంశాలపై సహకారం అందిస్తామన్నారు. Congratulations to @LulaOficial on winning the Presidential elections in Brazil. I look forward to working closely together to further deepen and widen our bilateral relations, as also our cooperation on global issues: PM @narendramodi — PMO India (@PMOIndia) October 31, 2022 ఇదీ చదవండి: Morbi Tragedy: కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై పుతిన్ సంతాపం -
పగ్గాలు చేపట్టిన ఖర్గే
న్యూఢిల్లీ: సహచర నాయకుడు శశిథరూర్‌ను ఓడించి ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పదవిలో కొనసాగుతున్న తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (75) ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు లాంఛనంగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ‘‘అధ్యక్ష బాధ్యతల బరువు నేటితో దిగిపోయింది. నాకు చాలా ఊరటగా ఉంది’’ అంటూ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు! మార్పు సహజమంటూ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడారు. కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో పాటు పార్టీ అగ్ర నేతలంతా పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైనట్టు ఖర్గేకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఒక మామూలు కార్యకర్త కుమారుడైన అతి సాధారణ కార్యకర్తను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ కుటుంబం మొత్తానికీ కృతజ్ఞతలు. ఇది గొప్ప గౌరవం. నిరంతరం కష్టించి పని చేస్తా. ప్రతి కార్యకర్తకూ గొంతుకగా మారతా. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ నాయకత్వాన్ని పెంపొందిస్తా’’ అని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఖర్గేను సోనియా స్వయంగా అధ్యక్ష కార్యాలయంలోకి తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. తన పక్క కుర్చీలో కూర్చోవాల్సిందిగా ఖర్గే కోరగా సున్నితంగా తిరస్కరించారు. ‘భయపడొద్దు’ నినాదంతో ముందుకు తన ముందున్న సవాళ్ల గురించి పూర్తి అవగాహన ఉందని ఖర్గే అన్నారు. పార్టీగా కాంగ్రెస్‌కు ఇది కష్టకాలమేనని అంగీకరించారు. అయితే కార్యకర్తలు తమలో ఉన్న భయాలను పారదోలితే ఎంతటి సామ్రాజ్యమైనా వారిముందు మోకరిల్లుతుందన్నారు. రాహుల్ ఇచ్చిన ‘భయపడొద్దు’ నినాదం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో బీజేపీని ఓడించేందుకు నేతలు, కార్యకర్తలూ స్వరశక్తులూ ధారపోయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో 50 శాతం పదవులను 50 ఏళ్లలోపు వయసు వారికే ఇవ్వడం వంటి నిర్ణయాలతో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను సంపూర్ణంగా అమలు చేసి సమూల మార్పులు తేవాల్సి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై కళ్లు మూసుకుంటూ ఆశ్రిత పెట్టుబడిదారీ మిత్రులకు సర్వం దోచిపెడుతోందని మండిపడ్డారు. ‘‘గాడ్సేను దేశభక్తునిగా, గాంధీని దేశద్రోహిగా చిత్రిస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి సంఘ్ పరివార్ రాజ్యంగం తెచ్చే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. ఈ అబద్ధాలను బట్టబయలు చేసి, మోసాలను ఎండగట్టి, విద్వేష ప్రచారాలను తుత్తునియలు చేసి తీరతామన్నారు. పార్టీని ఖర్గే మరింత పటిష్టపరుస్తారని, స్ఫూర్తిదాయకంగా నడుపుతారని సోనియా విశ్వాసం వెలిబుచ్చారు. ఇంతకాలం తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఓటమిని మాత్రం ఎన్నడూ అంగీకరించలేదని అన్నారు. దేశ ప్రజాస్వామిక సూత్రాలకే పొంచి ఉన్న పెను ముప్పును దీటుగా ఎదుర్కోవడం ఇప్పుడు పార్టీ ముందున్న పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే ఈ కాలంలో సోనియా మాత్రం స్వార్థరహితంగా పార్టీని ముందుకు నడిపారంటూ ఖర్గే కొనియాడారు. సునాక్‌కు సోనియా లేఖ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ను సోనియా అభినందించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమంటూ ఆయనకు లేఖ రాశారు. ఆయన హయాంలో ఇరు దేశాల సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. ఆఫీస్ బేరర్ల రాజీనామాలు... 47 మందితో స్టీరింగ్ కమిటీ 47 మందితో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని నూతన అధ్యక్షుడు ఖర్గే నియమించారు. కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ ఏర్పాటయ్యేదాకా దాని బాధ్యతలను ఖర్గే సారథ్యంలోని ఈ కమిటీ చూస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా, రాహుల్‌తో పాటు గత సీడబ్లు్యసీ సభ్యుల్లో అత్యధికులకు కమిటీలో చోటు దక్కింది. ప్రియాంక, ఏకే ఆంటోనీ, అంబికా సోని, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా, దిగ్విజయ్‌సింగ్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు కమిటీలో ఉన్నారు. సీడబ్లు్యసీ ప్రత్యేక ఆహ్వానితుల్లో మాత్రం ఎవరికీ చోటు దక్కలేదు. కొత్త టీములను ఏర్పాటు చేసుకునేందుకు ఖర్గేకు వీలు కల్పిస్తూ అంతకుముందు సీడబ్లు్యసీ సభ్యలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు తదితర ఆఫీసు బేరర్లంతా ఆయనకు లాంఛనంగా రాజీనామాలు సమర్పించారు. అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికను ఆమోదించేందుకు వచ్చే మార్చిలో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశముంది. ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో గుజరాత్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. -
సోనియా ఎప్పుడూ పదవులు ఆశించలేదు: ఖర్గే
-
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణస్వీకారం
-
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖర్గే..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర నాయకులు హాజరయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు.. సోనియా, రాహుల్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోనియా కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను ఖర్గేకు అప్పగించారు. అనంతరం మాట్లాడుతూ ఖర్గే ఎంతో అనుభవం ఉన్న నాయకుడని కొనియాడారు సోనియా. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మరింత ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖర్గే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమిస్తారని పేర్కొన్నారు. ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. పార్టీలోని అందరి సహకారం తనకు చాలా అవసరమని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ ఏనాడు పదవులు ఆశించలేదని కొనియాడారు. ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని ఖర్గే చెప్పారు. అలాగే అధికార బీజేపీపై విమర్శలు గిప్పించారు ఖర్గే. కమలం పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌పై ఖర్గే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర నేతగా ఆయన అరుదైన ఘనత సాధించారు. జగ్జీవన్ రామ్ తర్వాత ఆ పదవి చేపట్టిన రెండో దళిత నేతగా నిలిచారు. చదవండి: నికార్సైన కాంగ్రెసోడా.. మునుగోడుకు రా! -
కార్మిక సంఘం నాయకుడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. ఖర్గే ప్రస్థానం..
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. 24 ఏళ్ల తర్వాత ఆ పదవి చేపడుతున్న గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిగా అరుదైన ఘనత సాధించారు. జగ్జీవన్ రామ్ తర్వాత కాంగ్రెస్ సారథి అయిన రెండో దళిత నేతగా నిలిచారు. కాంగ్రెస్‌తో 50 ఏళ్లకుపైగా అనుబంధం ఉన్న ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. 80 ఏళ్ల ఖర్గే.. 1942 జూలై 21న కర్ణాటక బీదర్‌లో జన్మించారు. కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై 1969లోనే ఆ పార్టీలో చేరారు. గుల్బర్గాలోని సేథ్ శంకర్‌లాల్ లహోతి కాలేజీలో లా చదివారు. జూనియర్ న్యాయవాదిగా ఉన్నసమయంలోనే కార్మిక సంఘాల కేసులను వాదించి గెలిచారు. 1969లోనే గుల్బార్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. 1972లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1973లో ఒక్ట్రోయి అబాలిషన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకలో మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడటానికి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక కీలకంగా వ్యవహరించింది. 1976లో ప్రాథమిక విద్యా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 16,000కుపై ఎస్సీ,ఎస్టీ టీచర్ల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశారు. దేవరాజ్ హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా, గుండూరావు కేబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగాకూడా పనిచేశారు. ఎస్ఎం కృష్ణ హయాంలో హోంమంత్రిగా ఉన్నారు. విజయాలు అలవాటుగా.. ► ఖర్గేకు రాజకీయాల్లో విజయాలు అలవాటుగా మారాయి. 12 సార్లు ఎన్నికల్లో(అసెంబ్లీ, లోక్‌సభ కలిపి) పోటీ చేసిన ఆయన.. 2019 మినహా ప్రతిసారి ఘన విజయం సాధించారు. 2004లో కర్ణాటక అసెంబ్లీకి వరుసగా 8 సార్లు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత మరోసారి గెలిచి ఛితపూర్ అసెంబ్లీ నుంచి వరుసగా 9 సార్లు పోటీ చేసి గెలిచిన నేతగా రికార్డు నెలకొల్పారు. ► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేశారు ఖర్గే. 2014-2019వరకు లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ► 2021 ఫిబ్రవరి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు ఖర్గే. అప్పటినుంచి 2022 అక్టోబర్ 1 వరకు రాజ్యసభ ప్రతిపక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన కారణంగా ఆ పదవికి రాజీనామా చేశారు. చదవండి: ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం -
ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా మప్పన్న మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు 7వేలకు పైగా ఓట్లు(7,897 ఓట్లు) పోల్ కాగా.. శశిథరూర్‌కు పది శాతం ఓట్లు(1072 దాకా) పోలయ్యాయి. చెల్లని ఓట్లు 416. దీంతో 6,822 ఓట్ల భారీ మెజార్టీతో ఖర్గే గెలుపొందినట్లు సమాచారం. సుమారు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు, అదీ గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కావడం విశేషం. 80 ఏళ్ల వయసున్న మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక ఖర్గే విజయంపై మరో అభ్యర్థి శశిథరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
గంగూలీ కథ ముగిసినట్లే..!
టీమిండియాకు ఆడే సమయంలో కెప్టెన్‌గా చక్రం తిప్పిన సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా.. బీసీసీఐ బాస్‌గానూ గత మూడేళ్లలో తనదైన ముద్ర చూపించాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు ఉండాలని ఆశపడిన గంగూలీకి ఆ అవకాశం లేనట్లే. అధ్యక్ష పదవి రెండోదఫా ఇచ్చే సంప్రదాయం లేదని దాదాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐపీఎల్ చైర్మన్ పదవిని తిరస్కరించిన దాదా.. ఐసీసీ పదవికి కూడా గంగూలీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో దాదా కథ ఇక ముగిసినట్లేనని క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. పాత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని సాగనంపేందుకే బోర్డు పెద్దలు నిర్ణయించారు. ఇది ఎవరూ ఊహించని అనూహ్య పరిణామం! ఎందుకంటే బోర్డు అధ్యక్ష స్థానం కోసమే గంగూలీ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు. పదవుల మధ్య విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్) మినహాయింపు కోసం న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. కానీ బోర్డు కార్యవర్గంలో మాత్రం తన మాట నెగ్గించుకున్నట్లు లేడు. అందుకే తెరపైకి రోజర్ బిన్నీ వచ్చారు. భారత్ తొలి వన్డే ప్రపంచకప్ (1983) విజేత జట్టు సభ్యుడైన బిన్నీకే బీసీసీఐ పెద్దలు జైకొట్టడంతో అనూహ్యంగా మంగళవారం 67 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. కార్యదర్శిగా మళ్లీ జై షా కొనసాగేందుకు రంగం సిద్ధమైంది. అతను కూడా ఆ పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. ఈనెల 18న బీసీసీఐ ఎన్నికలు జరుగుతాయి. ఐపీఎల్ కమిషనర్ పదవి తిరస్కరణ కొన్ని రోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసిన ‘దాదా’ మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు బోర్డు ఉన్నతాధికారులతో మంతనాలు జరిపాడు. వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో గంగూలీ తన పదవిని అట్టిపెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా కనుసన్నల్లోని బోర్డు వర్గాలు గంగూలీని కొనసాగించేందుకు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా బిన్నీని తెరపైకి తెచ్చారు. గంగూలీని ఐపీఎల్ కమిషనర్ పదవి తీసుకోమన్నారు. కానీ బోర్డులో అధ్యక్షుడిగా పనిచేసిన ‘దాదా’ ఓ సబ్ కమిటీకి చీఫ్ అయ్యేందుకు నిరాకరించారని బోర్గు వర్గాలు తెలిపాయి. దీంతో కమిషనర్ బ్రిజేశ్ పటేల్ స్థానంలో ప్రస్తుత కోశాధికారి, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడైన అరుణ్ ధుమాల్‌ను ఐపీఎల్ కమిషనర్‌గా నియమించే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర బీజేపీ నేత, ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు ఆశిష్ షెలార్ ఇకపై బోర్డు కోశాధికారిగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు అత్యంత సన్నిహితుడు దేవజిత్ సైకియా సంయుక్త కార్యదర్శిగా ఖరారయ్యారు. ఉపాధ్యక్ష పదవి మాత్రం రాజీవ్ శుక్లా నుంచి మారడం లేదు. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడైన రాజీవ్ శుక్లా మరోసారి ఆ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీలో కీలక పదవికి గంగూలీని నామినేట్ చేసే అంశం అసలు బోర్డులో చర్చకే రాలేదని పూర్తిగా బోర్డు పదవులపైనే ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. చదవండి: 'ఇలాగే ఉంటే టెన్త్ కూడా పాసవ్వలేవన్నారు' -
షాకింగ్.. గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు!
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు నియంత్రణ అంతా చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చేతుల్లోనే ఉందని వదంతులు వ్యాపించాయి. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. జిన్‌పింగ్‌ను చైనా కమ్యూనిస్టు పార్టీ ఆర్మీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత హౌస్ అరెస్టు చేశారు. ఈ రూమర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ సారి చెక్ చేయండి. అని సుబ్రహ్మణ్య స్వామి రాసుకొచ్చారు. New rumour to be checked out: Is Xi jingping under house arrest in Beijing ? When Xi was in Samarkand recently, the leaders of the Chinese Communist Party were supposed to have removed Xi from the Party’s in-charge of Army. Then House arrest followed. So goes the rumour. — Subramanian Swamy (@Swamy39) September 24, 2022 కొందరు చైనీయులు కూడా ఇలాంటి పోస్టులే చేశారు. జిన్‌పింగ్‌ను ఆర్మీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందని, ఆయన స్థానంలో లీ కియామింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ గానీ, ఆ దేశ అధికారిక మీడియా గానీ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఇది నిజమేనా? లేక రూమారా? అనే విషయంపై అయోమయం నెలకొంది. వీడియో వైరల్ చైనా ఆర్మీ వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్ చేరుకున్నాయని, హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని ఓ చైనా మహిళ వీడియోను షేర్ చేసింది. జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోందని పేర్కొంది. #PLA military vehicles heading to #Beijing on Sep 22. Starting from Huanlai County near Beijing & ending in Zhangjiakou City, Hebei Province, entire procession as long as 80 KM. Meanwhile, rumor has it that #XiJinping was under arrest after #CCP seniors removed him as head of PLA pic.twitter.com/hODcknQMhE — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) September 23, 2022 అకస్మాతుగా ఎందుకీ రూమర్? చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల అవినీతి వ్యతిరేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరు మాజీ మంత్రులకు ఉరి శిక్ష విధించింది. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ ఆరుగురు జిన్‌పింగ్ రాజకీయ ప్రత్యర్థి వర్గానికి చెందినవారని తెలుస్తోంది. దీంతో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలు ఆయనపై ఆగ్రహంతో పదవి నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిన్‌పింగ్‌ను ఆర్మీ గృహ నిర్బంధం చేసిందనే వదంతిని మొదటగా ఆయన రాజకీయ ప్రత్యర్థి వర్గమే వ్యాపింపజేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిన్‌పింగ్ ఇటీవలే ఉజ్బెకిస్థాన్ సామర్కంద్లో జరిగిన షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొన్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. 77 మంది వలసదారులు మృతి -
బైచుంగ్ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కొత్త అధ్యక్షుడిగా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు.. బీజేపీ నేత కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యాడు. టీమిండియా మాజీ ఫుట్‌బాల్ స్టార్ బైచుంగ్ భుటియాతో జరిగిన పోటీలో 33-1 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. మొత్తం 34 ఓట్లలో భుటియాకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. కాగా 34 సభ్యుల ఓటర్ల జాబితాలో భూటియాకు మద్దతుదారులు కరువయ్యారు. 85 ఏళ్ల భారత ఫుట్‌బాల్ సమాఖ్య చరిత్రలో ఒక మాజీ ఆటగాడు అధ్యక్షుడిగా ఎంపికవ్వడం ఇదే తొలిసారి. ఇక మాజీ ప్లేయర్ అయిన చౌబే గతంలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లకు ఆడాడు. అయితే చౌబే ఇండియా సీనియర్ జట్టుకు ఎప్పుడూ ఆడింది లేదు. కానీ పలుమార్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇండియా తరపున ఏజ్ గ్రూపు ఇంటర్నేషనల్ టోర్నీల్లో మాత్రం అతను ప్రాతినిధ్యం వహించాడు. తన ప్రత్యర్థి ఉన్న భూటియాతో కలిసి చౌబే గతంలో ఈస్ట్ బెంగాల్ జట్టుకు కలిసి ఆడాడు. ఏఐఎఫ్ఎఫ్ ఉపాధ్యక్షుడి పోస్టుకు కర్నాటక ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్.ఏ హరిస్ గెలుపొందాడు. రాజస్థాన్‌కు చెందిన మన్వేందర్ సింగ్‌పై హరిస్ విజయం సాధించాడు.అలాగే ట్రెజరరీ పోస్టును అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కిపాఅజయ్ దక్కించుకున్నాడు. ఇక చౌబే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున బెంగాల్‌లోని కృష్ణానగర్ సీటు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యాడు. కాగా ఆగస్టు 17న ఏఐఎఫ్ఎఫ్లో తృతీయ పక్షం జోక్యం సహించేది లేదని 'ఫిఫా' పలుమార్లు హెచ్చరించినప్పటికి అఖిల భారత సమాఖ్య ఫుట్‌బాల్ ఫెడరేషన్ పట్టించుకోలేదు. దీంతో ఫిఫా భారత్ ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం విధించింది. ఏఐఎఫ్ఎఫ్ పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేస్తేనే నిషేధం ఎత్తివేస్తామని ఫిఫా తెలిపింది. కాగా భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఆగస్టు 27న ఎత్తివేసింది. ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏఐఎఫ్ఎఎఫ్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. We congratulate Mr. @kalyanchaubey on being elected as the President, Mr. @mlanaharis as the Vice President, and Mr. Kipa Ajay as the Treasurer of the All India Football Federation 🙌🏼#AIFFGeneralBodyElections2022 🗳️ #IndianFootball ⚽ pic.twitter.com/YRwexiUntx — Indian Football Team (@IndianFootball) September 2, 2022 -
ఆగస్టు 21 తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు సోనియా గాంధీ. కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 21 నుంచి కొత్త అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ పదవికి పోటీ పడే అంశంపై పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటన చేయకపోవటంపై ఉత్కంఠ నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన క్రమంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం మరోమారు పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. గాంధీయోతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. కాంగ్రెస్ నేతల్లో చాలా మంది అధ్యక్ష పదవి గాంధీ కుటుంబంలోని వ్యక్తే చేపట్టాలని, అదే పార్టీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిన సందర్భంలో పార్టీ సీనియర్ నేతలకు కీలక సూచనలు చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు రాజీనామా చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ 2017లో సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 543 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితం కావటంతో మే నెలలో పార్టీ పగ్గాలను వదులుకున్నారు రాహుల్ గాంధఈ. పార్టీ అధ్యక్షుడి ఎన్నికల తర్వాతే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఇతర పోస్టులకు ఎన్నికలు నిర్వహించటం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం సెప్టెంబర్ 7న ప్రారంభించనున్న భారత్ జోడో యాత్రపైనే దృష్టిసారించారు. ఇదీ చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి -
ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని ముర్ము తాత్కాలిక నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకయ్య నాయుడు 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, మత నాయకులు, బ్రహ్మ కుమారీస్ నిర్వాహకులు కూడా ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముర్ము నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. -
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు గొటబయా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనే వెల్లడించారు. ప్రమాణ స్వీకారం అనంతరం విక్రమసింఘే పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. హింస, విధ్వంసాన్ని అరికట్టే అంశంలో సైనిక దళాలకు తగిన అధికారాలు, స్వేచ్ఛ కల్పించామన్నారు. దేశంలో హింసను ప్రేరేపించడానికి ఫాసిస్ట్ గ్రూప్‌లు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తియుత ప్రదర్శనలు, నిరసనలకు తాను వంద శాతం మద్దతు ఇస్తానని అన్నారు. నిరసనకారులకు, విధ్వంసాలకు పాల్పడేవారికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తన మొదటి కార్యాచరణ 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించడమేనని విక్రమసింఘే స్పష్టం చేశారు. ఇందుకోసం అతిత్వరలోనే ముసాయిదా సిద్ధం చేస్తామన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి అధికారాల్లో కోత విధించి, పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు కల్పిస్తూ 2015లో 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ వెనుక అప్పట్లో విక్రమసింఘే కీలకంగా వ్యవహరించారు. 2019 నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక గొటబయా రాజపక్స ఈ రాజ్యాంగ సవరణను రద్దు చేశారు. తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిని ‘హిజ్ ఎక్సలెన్సీ’ అని గౌరవ సూచకంగా సంబోధించడాన్ని నిషేధించారు. ప్రెసిన్షియల్ జెండాను సైతం రద్దు చేశారు. దేశానికి జాతీయ జెండా ఒక్కటే ఉండాలన్నారు. అధ్యక్షుడి పేరిట మరో జెండా అక్కర్లేదన్నారు. నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 20న పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ అబేయవర్దనే తెలియజేశారు. ఈ నెల 19న నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అధ్యక్ష పదవి ఖాళీగా ఉందంటూ శనివారం పార్లమెంట్‌కు అధికారికంగా సమాచారం అందిస్తారు. శ్రీలంకలో పార్లమెంట్లో రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుండడం 1978 తర్వాత ఇదే మొదటిసారి. వచ్చే నెల 28 దాకా దేశం విడిచి వెళ్లొద్దు శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహిందా రాజపక్స, ఆయన సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూలై 28వ తేదీ వరకూ దేశం విడిచివెళ్లొద్దని న్యాయస్థానం వారిని ఆదేశించింది. -
యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు కొత్త అధ్యక్షుడిగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని శనివారం అక్కడి మీడియా అధికారికంగా ప్రకటించింది. అనారోగ్య సమస్యలతో యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ఇప్పుడు అధికారికంగా యూఏఈ అధ్యక్షుడిగా ప్రకటించారు. షేక్ ఖలీఫా పదవిలో ఉన్నప్పటికీ ఆయన అనారోగ్యం కారణంగా.. చాలా ఏళ్ల నుంచి షేక్ మొహమ్మద్ బిన్నే పాలన వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. షేక్ ఖలీఫా మరణంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. షేక్ మొహమ్మద్‌ను ఎంబీజీగా వ్యవహరిస్తుంటారు. అధ్యక్ష ప్రకటన నేపథ్యంలో.. UAE యొక్క ఏడు ఎమిరేట్స్ పాలకులతో కూడిన ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సభ్యులను కలుసుకున్నారాయన. ఎన్నో మార్పులు.. ఎడారి సంప్రదాయ దేశం యూఏఈ గడ్డ మీద ఎన్నో సంస్కరణలకు తాత్కాలిక అధ్యక్షుడి హోదాలోనే షేక్ మొహమ్మద్ కారణం అయ్యారు. అంతరిక్షంలోకి యూఏఈ పౌరుడ్ని పంపడం, మార్స్ పరిశోధనలో భాగం కావడం, మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్‌ను ప్రారంభించడం, విదేశాంగ విధానాలను మెరుగు పర్చడం లాంటి ఎన్నో పనులు చేశారు. అమెరికా జోక్యాన్ని తగ్గించడం, ఇజ్రాయెల్‌తో సంబంధాలు, యెమెన్ యుద్ధంలో పాల్గొనడం లాంటి కీలక పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి కూడా. చదవండి👉🏼: యూఏఈ అధ్యక్షుడి కన్నుమూత! -
సీఐఐ ప్రెసిడెంట్‌గా సంజీవ్ బజాజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్‌గా బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ బాధ్యతలు స్వీకరించారు. 2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించారు. బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), అలియాంజ్ ఎస్ఈ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్.దినేశ్ నియమితులయ్యారు. -
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్‌సింగ్ వారింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) నూతన అధ్యక్షుడిగా అమరీందర్‌సింగ్ రాజా వారింగ్‌ను పార్టీ అధినేత సోనియా గాంధీ శనివారం నియమించారు. ప్రతాప్‌సింగ్ బాజ్వాను అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) కొత్త నాయకుడిగా నియమించారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నవజోత్‌సింగ్ సిద్ధూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాజీనామా చేశారు. అమరీందర్‌సింగ్ రాజా వారింగ్ పంజాబ్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు. -
చిలీ అధ్యక్షుడిగా గాబ్రియెల్
శాంటియాగో: వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్ బొరిక్ చిలీ కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 36 ఏళ్ల బొరిక్ రాకతో ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఆర్థికంగా సంపన్న దేశమైన చిలీలో అసమానతలు ఎక్కువగా ఉండడంతో తరచూ ఆందోళనలు జరుగుతుంటాయి. పదిహేడేళ్ల పాటు మిలటరీ నియంతృత్వం రాజ్యమేలి, రక్తపాతం జరిగిన చిలీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించి నాలుగేళ్లే అయింది. బొరిక్ తన కేబినెట్లో 14 మంది మహిళల్ని చేర్చుకొని తమది ఫెమినెస్ట్ కేబినెట్ అని చాటి చెప్పారు. మరో 10 మంది పురుషులు మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 56% ఓట్లతో కన్జర్వేటివ్ అయిన జాస్ ఆంటోనియా కాస్ట్‌పై గాబ్రియెల్ బొరిక్ విజయం సాధించారు. -
ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు? పుతిన్ ప్లాన్ బయటకు..
ఉక్రెయిన్ ఆక్రమణ గనుక సక్సెస్ అయినా, ఉక్రెయిన్ కాళ్ల బేరానికి వచ్చినా.. తాను అనుకున్న ప్లాన్‌ను అమలు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండేందుకు వీలుగా ఆ దేశానికి తమతో స్నేహంగా మెలిగే, నమ్మకమైన వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలనే నిర్ణయానికి పుతిన్ వచ్చినట్లు భోగట్టా. ఏది ఏమైనా.. రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిజ్ఞ చేయడం తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్స్కీని గద్దె దించి(అవసరమైతే బలగాలతో హతమార్చి!).. తదుపరి అధ్యక్షుడిగా విక్టర్ యనుకోవిచ్‌ను ప్రకటించాలని పుతిన్ యోచిస్తున్నట్లు ది కీవ్ ఇండిపెండెంట్ ఒక కథనం ప్రచురించింది. ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడైన విక్టర్ యనుకోవిచ్.. ప్రస్తుతం రష్యా ఆశ్రయంలో ఉన్నాడు. 2010లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికైన యనుకోవిచ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు వెల్లువెత్తడంతో రష్యాకు పారిపోయాడు. ప్రస్తుతం యనుకోవిచ్‌ను బెలారస్ రాజధాని మిన్స్క్ లో దించాడు పుతిన్. దీంతో ఇవాళ చర్చల సందర్భంగా యనుకోవిచ్‌ను అధ్యక్షుడిని చేసే ప్రతిపాదన సైతం ఉంచుతారనే వాదన వినిపిస్తోంది. అప్పుడు.. ఇప్పుడు రష్యాకి అనుకూలుడే! యనుకోవిచ్1997 నుండి 2002 వరకు తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ఒబ్లాస్ట్‌కు గవర్నర్‌గా విధులు నిర్వర్తించాడు. అటుపై యనుకోవిచ్ 2006 నుండి 2007 వరకు 2005కి ముందు కొద్ది కాలం పాటు దేశ ప్రధాన మంత్రిగా పని చేశాడు. 2010లో ఉక్రెయిన్‌కు నాల్గవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2013లో Viktor Yanukovych అధికారంలో ఉండగా.. రష్యాతో సన్నిహిత సంబంధాలను కోరుతూ యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ వ్యాప్తంగా ప్రదర్శనలు చెలరేగాయి. యనుకోవిచ్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పుతిన్ చేసిన ఫలితాలు కాస్త ఉంటే ఫలించేవే. కానీ, యనుకోవిచ్ కీవ్ నుంచి ఖార్కివ్‌కు పారిపోవడంతో చివర్లో బెడిసి కొట్టింది. 2013 నవంబర్ నుంచి నెలన్నరపాటు యూరోమెయిడాన్ నిరసనలు, ఆ వెంటనే మెయిడాన్ నిరసనలతో ఉక్రెయిన్ అట్టుడికి పోయింది. నిరసనకాలకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఆపై గద్దె దిగిపోయిన యనుకోవిచ్ క్రెమ్లిన్ సంరక్షణలో ఉంటున్నాడు. యనుకోవిచ్ పారిపోయిన రోజున.. ఉక్రెయిన్ పార్లమెంట్ అతని తొలగింపునకు ఓటింగ్ నిర్వహించింది. అయితే ఇది అన్యాయమంటూ యనుకోవిచ్, అతని మద్ధతుగా రష్యా ప్రకటన విడుదల చేశాయి. ⚡️Media: Putin wants to reinstate Yanukovych as president of Ukraine. Viktor Yanukovych is allegedly in Minsk, and the Kremlin is preparing an operation to replace Zelensky with the ex-president ousted by the EuroMaidan Revolution in 2014, according to Ukrainska Pravda’s sources — The Kyiv Independent (@KyivIndependent) March 2, 2022 యనుకోవిచ్ నేపథ్యం.. సోవియట్ యూనియన్ తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో జన్మించాడు యనుకోవిచ్. రెండేళ్ల వయసులో తల్లిని పొగొట్టుకుని.. తండ్రి పట్టించుకోకపోవడంతో రోడ్డు పాలయ్యాడు. వీధుల వెంట అడుక్కుని తిరుగుతూ జీవనం కొనసాగించానని, ఆకలితో విలవిలలాడిపోయానని, తన బాల్యం ఎంతో ఘోరంగా గడిచిందంటూ తరచూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటాడు యనుకోవిచ్. అనూహ్యంగా జీవితం మలుపు తిరగడంతో(అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఉక్రెయిన్ మీడియా ఇప్పటికీ ఆరోపిస్తుంటుంది) వ్యాపారవేత్తగా, ఆపై రాజకీయాలతో రాణించి క్రమక్రమంగా ఎదిగాడు. పదిహేడేళ్ల వయసులో దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన యనుకోవిచ్.. అధికారంలోకి వచ్చిన యువత నేర ప్రవృత్తి చట్టాల మార్పునకు ప్రయత్నించాడు. BREAKING: Russia has brought former Ukrainian President Yanukovych to Minsk. Putin is preparing to proclaim him the new President of Ukraine. Source: @ukrpravda_news pic.twitter.com/Zpmf87eIEs — Visegrád 24 (@visegrad24) March 2, 2022 అయితే పలు ఆరోపణల మధ్య వివాదాస్పద ఎన్నికలలో 2004లో మొదటిసారి అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. ఉక్రెయిన్ సుప్రీం కోర్ట్ ఫలితాలను రద్దు చేయడానికి, మళ్లీ ఎన్నికలు పెట్టాలని ఆదేశించడంతో ఉక్రెయిన్‌లో ‘ఆరెంజ్ విప్లవం’ మొదలైంది. యనుకోవిచ్ రెండో ఎన్నికల్లో యుష్చెంకో చేతిలో ఓడిపోయాడు. నిరసనకారులు యనుకోవిచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పటికీ, EU-ఉక్రెయిన్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేయడానికి యనుకోవిచ్ నిరాకరించడంతో నవంబర్ 2013లో కైవ్‌లోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. కైవ్‌లోని మైదాన్ వద్ద జరిగిన ప్రధాన ప్రదర్శనతో నిరసనకారులు ఉక్రెయిన్‌లో పోలీసులతో హింసాత్మకంగా ఘర్షణ పడ్డారు. నిరసనలు ప్రధానంగా సెంట్రల్ కైవ్‌లోని మైదాన్ నెజాలెజ్నోస్టిలో జరిగాయి. ఇది యనుకోవిచ్ వ్యతిరేక నిరసనలకు ర్యాలీ పాయింట్‌గా మారింది. యనుకోవిచ్ దేశం విడిచి పారిపోవడంతో నిరసనకారులు చివరకు శాంతించారు. ఆపై ప్రదర్శనకారులు అధ్యక్ష పరిపాలన, అతని ప్రైవేట్ ఎస్టేట్‌పై నియంత్రణ సాధించారు. రష్యా రాజకీయాల్లోనూ జోక్యం పెట్రో పోరోషెంకో తర్వాత ఒలెక్సాండర్ తుర్చినోవ్ అధికారంలోకి రావడంతో యనుకోవిచ్ దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. పాత కేసులు తిరగదోడతారనే భయంతో రష్యా శరణార్థిగా ఉంటున్నాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ తర్వాత.. ఏదో ఒక రోజు యనుకోవిచ్‌ని ఉక్రెయిన్ గద్దెపై మళ్లీ కూర్చోబెడ్తా అంటూ పుతిన్ వ్యాఖ్యానించడం విశేషం. అప్పటి నుంచి రష్యా ఆర్థిక వ్యవస్థలో, పాలనపరమైన విషయాల్లోనూ యనుకోవిచ్ జోక్యం చేసుకుంటూ వస్తున్నాడు. యనుకోవిచ్ నిర్ణయాలకు పుతిన్ గౌరవం ఇస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో హాస్యనటుడు జెలెన్స్కీ Zelensky 2019లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఉక్రెయిన్ను యూరోపియన్ యూనియన్, నాటోలో చేరే దిశగా జెలెన్స్కీ ప్రయత్నాలు పుతిన్‌కు నచ్చకపోవడం, అది ఇప్పడు యుద్ధానికి దారి తీయడం తెలిసిందే కదా!. -
జర్మనీ అధ్యక్షునిగా మళ్లీ స్టెయిన్‌మెయర్
బెర్లిన్: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయర్ (66) మరో ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై ఆయన్ను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకుంది. అధికార పక్షంతో పాటు అత్యధిక విపక్షాలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి. మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ హయాంలో స్టెయిన్‌మెయర్ రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పని చేశారు. జర్మనీలో అధ్యక్ష పదవి లాంఛనప్రాయమైనది. -
చిలీ అధ్యక్షుడిగా బోరిక్
శాంటియాగో: చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం మాజీ నేత గాబ్రియెల్ బోరిక్(35) ఘన విజయం సాధించారు. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బోరిక్ సునాయాసంగా రికార్డు స్థాయిలో 56% ఓట్లు గెలుచుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి జోస్ ఆంటోనియో కాస్ట్ కంటే 10 పాయింట్లు ఎక్కువగా సాధించారు. దేశ పాలనపగ్గాలు చేపట్టిన ఆధునిక ప్రపంచ యువ నేతల్లో ఒకరిగా, అత్యంత పిన్న వయస్కుడైన చిలీ అధ్యక్షుడిగా బోరిక్ నిలిచారు. రాజధాని శాంటియాగోలో విజయోత్సవాల్లో భారీగా హాజరైన ప్రజలు, ముఖ్యంగా యువతనుద్దేశించి బోరిక్ స్థానిక మపుచె భాషలో ప్రసంగించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రకటించారు. ప్రజలందరికీ సమానంగా న్యాయం అందిస్తానని వాగ్దానం చేశారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, బోరిక్‌తో ఫోన్లో సంభాషించారు. మార్చిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఆయనకు సహకారం అందిస్తానని చెప్పారు. -
ఐఎన్ఎస్ ప్రెసిడెంట్‌గా మోహిత్ జైన్
సాక్షి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ప్రెసిడెంట్‌గా ఎకనమిక్ టైమ్స్‌కు చెందిన మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ‘సాక్షి’ దినపత్రిక అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కె.రాజప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం వర్చువల్ విధానంలో జరిగిన సొసైటీ 82వ వార్షిక సాధారణ సమావేశంలో 2021–22 సంవత్సరానికి ఐఎన్ఎస్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన ‘హెల్త్ అండ్ యాంటిసెప్టిక్’కు చెందిన ఎల్.ఆదిమూలం నుంచి మోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. రాకేష్ శర్మ (ఆజ్ సమాజ్)ను వైస్ ప్రెసిడెంట్‌గా, తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా)ని గౌరవ కోశాధికారిగా ఎన్నుకున్నట్లు సొసైటీ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ తెలిపారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నికైన 41 మందిలో ‘అన్నదాత’.. ఐ. వెంకట్ ఉన్నారు. -
దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్
తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన అధ్యక్షునిగా దర్శకుడు– రచయిత – నటుడు యనమదల కాశీ విశ్వనాథ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నవంబర్ 14న (ఆదివారం) జరిగిన ఎన్నికల్లో కాశీ విశ్వనాథ్ ప్యానల్ జయకేతనం ఎగురవేసింది. సముద్ర, చంద్రమహేశ్ ప్యానల్స్ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అధ్యక్షునిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వీఎన్ ఆదిత్య, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మేర్లపాక గాంధీ, జీ.ఎస్.రావు, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లాభ„Š , పీవీ రమేశ్ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ. ప్రేమ్ రాజ్, నీలం సాయిరాజేశ్, ఎం. సాయి సురేంద్ర బాబు, కూరపాటి రామారావు ఎన్నికయ్యారు. మహిళల రిజర్వేషన్ కోటాలో సౌజన్య, ప్రవీణలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
‘వెపా’ ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఎన్నిక
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలకు సంబంధించిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ (వైపా) ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఏకగ్రీవంగా ఎన్నికైంది. భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2021–23 కాలానికి వైపా స్టీరింగ్ కమిటీలో ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఉండనుండగా, ఈజిప్ట్.. స్విట్జర్లాండ్ వైస్–ప్రెసిడెంట్లుగా వ్యవహరించనున్నాయి. బ్రెజిల్, దక్షిణ కొరియా మొదలైన తొమ్మిది దేశాలు ప్రాంతీయ డైరెక్టర్లుగా ఉంటాయి. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే వైపా మండలిలో ఐక్యారాజ్య సమితికి చెందిన వివిధ సంస్థలు, వరల్డ్ బ్యాంక్ మొదలైన వాటికి సభ్యత్వం ఉంది. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక, సమన్వయ ఏజెన్సీగా ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటైంది. వ్యాపారాలను స్వాగతించేందుకు పలు కీలకమైన ఆర్థిక సంస్కరణల అమలుకు భారత్ నిరంతరం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. దీనితో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కలి్పంచేందుకు అవకాశమున్న 155 బిలియన్ డాలర్ల పైగా సూచనప్రాయ పెట్టుబడులకు ఇన్వెస్ట్ ఇండియా సమన్వయకర్తగా వ్యవహరిస్తోందని వివరించారు. -
అఫ్గానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా బరాదర్?
కాబూల్: అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా పని చేసిన అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో విదేశాలకు పరారయ్యారు. దేశంలో ఇక తాలిబన్ పాలన ఖాయమే అని తేలినప్పటికీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఇప్పటికే చర్చ మొదలయ్యింది. తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత డిప్యూటీ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కల్లోల అఫ్గాన్ పాలనా పగ్గాలను బరాదర్‌కు కట్టబెట్టేందుకు తాలిబన్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్ల రాజకీయ విభాగం చీఫ్‌గా పలుదేశాలతో సంబంధాలు నెరపడం ఆయనకు అనుకూలించే అంశమని భావిస్తున్నారు. ముల్లా ఒమర్‌కు కుడిభుజం ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ 1968లో అఫ్గానిస్తాన్‌లోని ఉరుజ్గన్ ప్రావిన్స్‌లో దే రహ్వోద్ జిల్లాలో వీత్మాక్ అనే గ్రామంలో జన్మించారు. పుట్టుక రీత్యా సదోజాయ్ తెగకు చెందిన దుర్రానీ పుష్తూన్ వర్గానికి చెందినవాడు. యువకులుగా ఉన్నప్పుడే ముల్లా మహమ్మద్ ఒమర్, బరాదర్ మంచి స్నేహితులయ్యారు. 1980వ దశకంలో కాందహార్ ప్రాంతంలో సోవియట్–అఫ్గాన్ యుద్దంలో బారదార్ పాల్గొన్నాడు. అప్పట్లో సోవియట్ యూనియన్ మద్దతుతో కొనసాగుతున్న అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫ్గాన్ ముజాహిదీన్ అనే సంస్థలో చేరి పోరాటం సాగించాడు. నిజానికి మొదట్లో అతడి పేరు చివరన బరాదర్ లేదు. ప్రాణ స్నేహితుడు, తాలిబన్ వ్యవస్థాపకుడైన ముల్లా మహమ్మద్ ఒమర్ అతడి పేరు చివర బరాదర్(సోదరుడు) అని చేర్చాడు. సోవియట్–అఫ్గాన్ యుద్దం తర్వాత కాందహార్ ప్రావిన్స్‌లోని మైవాంద్లో ఒమర్‌తో కలిసి ఓ మదర్సాను బరాదర్ నిర్వహించాడు. దక్షిణ అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ముఠాను స్థాపించేందుకు ఒమర్‌కు తోడుగా నిలిచాడు. కుడిభుజంగా వ్యవహరించాడు. అఫ్గాన్‌లో 1996 నుంచి 2001 వరకూ కొనసాగిన తాలిబన్ పాలనలో బరాదర్ ఎన్నో కీలక పదవులు దక్కించుకున్నాడు. హెరాత్, నిమ్రుజ్ ప్రావిన్స్‌ల గవర్నర్‌గా పనిచేశాడు. ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా, సెంట్రల్ ఆర్మీ కార్ప్స్ కమాండర్గానూ సేవలందించినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ డిప్యూటీ మినిస్టర్‌గా కూడా పనిచేసినట్లు అమెరికాకు చెందిన ఇంటర్‌పోల్ వెల్లడించింది. ► ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తాలిబన్ల ఆధ్యాత్మిక కేంద్రం, వారి పాలన కొనసాగినప్పుడు రాజధాని అయిన రెండో అతిపెద్ద నగరం కాందహార్‌కు మంగళవారం చేరుకున్నాడు. ► బరాదర్ గత కొన్న నెలలుగా ఖతార్‌లోనే గడిపాడు. అమెరికాతోపాటు అఫ్గాన్ ప్రతినిధులతో శాంతి చర్చల్లో పాలు పంచుకున్నాడు. ► అఫ్గాన్ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణపై జరిగిన చర్చల్లో బరాదర్‌దే కీలక పాత్ర. ► తాలిబన్ మిలటరీ ఆపరేషన్లలో చురుగ్గా వ్యవహరించడంతోపాటు 2004, 2009లో అఫ్గాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు చొరవ చూపాడు. ► కాందహార్ ఎయిర్‌పోర్టులో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు ఘన స్వాగతం లభించింది. తాలిబన్లు అతడికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. బరాదర్ అరెస్టు.. టర్నింగ్ పాయింట్ 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్ కాయిదా దాడుల తర్వాత అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌పై దండెత్తింది. అమెరికా మద్దతు ఉన్న నార్తన్ అలయెన్స్‌కు వ్యతిరేకంగా బరాదర్ పోరాటం ప్రారంభించాడు. 2010 ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లోని కరాచీలో అరెస్టయ్యాడు. బరాదర్ అరెస్టు తాలిబన్లపై తాము సాగిస్తున్న యుద్ధంలో టర్నింగ్ పాయింట్ అని అమెరికా సైనికాధికారులు వ్యాఖ్యానించారంటే అతడి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం బరాదర్‌ను జైలు నుంచి విడుదల చేసినట్లు 2018 అక్టోబర్ 25న తాలిబన్లు ప్రకటించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే పాక్ ప్రభుత్వం అతడిని విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన తర్వాత ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నాడు. దోహాలోని తాలిబన్ దౌత్య కార్యాలయం అధినేతగా నియమితుడయ్యాడు. అమెరికాతో జరిగిన చర్చల్లో తాలిబన్ల తరపున పాల్గొన్నాడు. 2020 ఫిబ్రవరిలో అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించిన దోహా ఒప్పందంపై సంతకం చేశాడు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2021 ఆగస్టు 17న ఖతార్ నుంచి స్వదేశం అఫ్గానిస్తాన్‌కు తిరిగొచ్చాడు. 2001లో తాలిబన్ ప్రభుత్వం పతనమైన తర్వాత అతడు అఫ్గాన్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. -
తానా నూతన అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి
వాషింగ్టన్: నీతి, నిజాయితీ, నిరాడంబరత, మంచితనం, మాటకు బద్దులై వుండటం, మానవతా దృక్పథం, ప్రజా సేవా తత్పరత మొదలైన సాత్విక లక్షణాలన్నింటి సమాహారమే అంజయ్య చౌదరి లావు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా ( 2021-23) బాధ్యతలు స్వీకరించ బోతున్న మానవత్వం పరిమళించిన మంచి మనిషి అంజయ్య చౌదరి లావు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ మనసా, వాచా, కర్మణా స్వాగతిస్తున్నారు. మాటల్లో నిష్కల్మషం, ఆచరణలో నిజాయితీ, అంజయ్య చౌదరి లావు ఔన్నత్యానికి నిదర్శనం. కష్టపడటం కాలంతో పరిగెత్తడం, అనుకున్న లక్ష్యం సాధించే వరకు అనునిత్యం అలుపెరగని పయనం సాగించనున్నారు. తెలుగు వారి పట్ల ప్రేమ వారి సమస్యల పరిష్కారం కొరకు కడదాకా పోరాడే యోధుడు అంజయ్య చౌదరి లావు . డాలర్ల వేటలో మానవ సంబంధాలను మరుస్తున్న ఈరోజుల్లో ఖండాంతరాల అవతల కూడా కాసులకు అతీతంగా సేవలందించి అందరి మన్ననలను పొందుతున్న తెలుగుతేజం అంజయ్య చౌదరి లావు. తానా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయడం నిజంగా పర్వదినం. తన కుటుంబ శ్రేయస్సు కాకుండా అమెరికాలోని తెలుగువారు కుటుంబాలను కూడా తన కుటుంబంగా భావించి ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఏ సమయంలో వచ్చినా వెంటనే స్పందించి , వారికి కొండంత ధైర్యాన్ని కల్పించి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తున్న అంజయ్య చౌదరి లావు కి అభినందనలను తెలియజేశారు. తెలుగువారి సేవలో పరమాత్మను సేవిస్తూ తన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకొని పోతూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకోవాలని అంజయ్య చౌదరి లావు లక్ష్యం . ఆ లక్ష్య సాధన కోసమే ఆయన నిరంతరం ఆరాటపడుతున్నారు. కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఉన్న పెద్దఅవుటుపల్లి గ్రామంలో లావు సాంబశివరావు - శివరాణి దంపతులకు 1971 మార్చి 27 న అంజయ్య చౌదరి జన్మించారు. తండ్రి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా విశాఖపట్నంలో పనిచేయడం వలన అంజయ్య చౌదరి చిన్నతనంలోనే బాబాయి లావు రంగారావు,పిన్నమ్మ కోటేశ్వరమ్మ ల సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా గన్నవరం లోని సెయింట్ జాన్స్ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడలోని గౌతమి రెసిడెన్షియల్ కళాశాలలో, ఉన్నత విద్య బీటెక్ బళ్ళారి లోను, ఎంటెక్ గుల్బర్గా కళాశాలలో పూర్తిచేశారు. పూవు పుట్టగానే పరిమళించినట్లు గా అంజయ్య చౌదరి చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నారు. 1988 లో అమెరికా వెళ్లి అట్లాంటాలో నివాసమున్నారు. 1997 లో అనకాపల్లి కి చెందిన నతాషా తో వివాహం జరిగింది. అంజయ్య చౌదరి లావు గారికి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీకాంత్ చౌదరి, కుమార్తే అక్షిణ శ్రీ చౌదరి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ,వారికి ఆపన్నహస్తం అందించడంలోనే జీవిత పరమార్థం దాగి ఉన్నదని భావించే అంజయ్య చౌదరికి కుటుంబ ప్రోత్సాహం బాగా తోడయింది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ సహకారం తప్పక ఉంటుందనే అక్షరసత్యం నిజం చేస్తూ అంజయ్య చౌదరి లావు ప్రతి విజయం వెనుక వారి ధర్మపత్ని చేయూత, ప్రోత్సాహం ఉంది. ఆమె ప్రోద్బలంతోనే అంజయ్య చౌదరి సేవా కార్యక్రమాలకు ఎదురులేకుండా ( తానా ఎమర్జెన్సీ అసిస్టెంట్స్ మేనేజ్మెంట్ ) తానా టీమ్ స్క్వేర్ అంజయ్య చౌదరి లావుగా పేరుపొందారు. పేద ప్రజల గుండెచప్పుడు పెద అవుటపల్లి పల్లి గ్రామంలో ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కలిగినా కార్పొరేట్ వైద్యులు వారి తలుపు తట్టి ఉచితంగా వారికి రోగాలు నయం చేస్తున్నారు . ఈ సామాజిక, ఆరోగ్య చైతన్యం వెనుక ఉన్నది ఒకే ఒక్కరు. ఆయనే అంజయ్య చౌదరి లావు. తన చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి , సొంత లాభం కొంత మానుకొని స్వగ్రామానికి తోడ్పాటును అందించాలనే జన హితుడు ఆయన పేర్కొన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పటల్ వైద్యబృందం సహకారంతో హృద్రోగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గుండె వ్యాధులు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు. జైపూర్ నుండి వికలాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలను తెప్పించి పంపిణీ చేయించారు. తాను ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా తాను పుట్టి పెరిగి నడిచివచ్చిన దారిని మర్చిపోకుండా అందరినీ కలుపుకొని పోతూ తన స్వగ్రామం పెద్ద ఉటపల్లి అభివృద్ధికి నడుం బిగించిన అజాతశత్రువు అంజయ్య చౌదరి. "ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల అని నమ్మి " ఎన్నో సేవా కార్యక్రమాలకు స్వయంగా అంజయ్య చౌదరి విరాళం అందించారు . మిత్రులు సహృదయులు వద్ద నుండి విరాళాలు సేకరించి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. గ్రామంలోని అనాధ పిల్లలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. నిరు పేద పిల్లలకు కానుకలు, ఆటబొమ్మలు పంపిణీ, విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ, అనాధ శరణాలయం లో అన్నదానం, గ్రామంలో మొక్కలు నాటడం చేపట్టారు. తానా స్కాలర్షిప్పులు వంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించారు. భారతదేశంలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. గ్రామాభివృద్ధి లో చౌదరి అలుపెరుగని కృషి చేస్తున్నారు. పెద్ద అవుటపల్లి గ్రామంలో మొదలైన అంజయ్య చౌదరి లావు సామాజిక సేవా పరిమళం మెల్లమెల్లగా అమెరికా అంతా వ్యాపించింది . అమెరికన్ రెడ్ క్రాస్ ఇతర జాతీయ ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాల నిర్వహణ లో అంజయ్య చౌదరి చురుగ్గా పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా జరిగిన అనేక రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అక్కడ నిర్వహించే వైద్య శిబిరాలు తగిన హాల్స్ ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమకూర్చటం, ధన సహాయం చేయడం, వైద్యం కోసం వచ్చిన వారికి తగిన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. " ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న " అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసిస్తూ సాటి మనిషికి సాయం పడటం వారికి ప్రేమను పంచడం ఇవే నా జీవితాన్ని నడిపించే అంజయ్య చౌదరి లావు మూలసూత్రాలంటారు అన్నదానం " అన్నం పరబ్రహ్మ స్వరూపం " అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి వారిని ఆదుకోవడం కన్నా మంచి పని ఏమి ఉంటుందని భావించారు అంజయ్య చౌదరి లావు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి స్తోమతను బట్టి గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక వృద్ధ శరణాలయాల్లో అన్నదానం చేస్తూ అందరి అభిమానాన్ని అంజయ్య చౌదరి లావు చూరగొన్నాడు. పదవులకే వన్నెతెచ్చిన అంజయ్య చౌదరి లావు అంజయ్య చౌదరి లావు పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి . వరించిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చాడు. అతి చిన్న వయసులోనే అనేక పదవులు చేపట్టారు. తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ గా మొదలైన వారి ప్రయాణం నేడు తానా అధ్యక్షులు వరకూ వచ్చింది. "తానా" టీమ్ స్క్వేర్ చైర్మన్ (2011-13) "తానా" సంయుక్త కోశాధికారి ( 2013-15) "తానా" టీమ్ స్క్వేర్ మెంటర్ చైర్మన్ (2013 -15 ) "తానా" కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ (2015 - 17 ) "తానా' టీమ్ స్క్వేర్ కో చైర్ (2015 - 17) "తానా" జనరల్ సెక్రటరీ (2017 - 19) తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ ( 2017 -19) "తానా" ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (2019 - 21 ) "తానా" ప్రెసిడెంట్ ( 2021 -23) తెలుగు వారి సేవలో అమెరికాలో ఉద్యోగం చేస్తూనే అంజయ్య చౌదరి లావు అక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం తానా సంస్థలో సభ్యులుగా చేరారు. తెలుగువారు హత్యకు గురైనా, రోడ్డు ప్రమాదాల్లో మరణించినా వారి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడంలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరుండి అన్ని తానై పూర్తి చేసేవారు. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇండియా నుండి అమెరికా కి వెళ్లి ఇబ్బందులకు గురైతే వారికి అండగా నిలిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ , ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ఫేస్బుక్ సమాచారం ఆధారంగా ఇబ్బందుల్లో ఉన్న వారి సమాచారాన్ని తెలుసుకొని వారికి సహాయపడేవారు. కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా సుమారు 100 కు పైగా సేవా కార్యక్రమాలు అమెరికా వ్యాప్తంగా చేశారు. ముఖ్యంగా బోన్‌మారో డ్రైవ్ , బ్లడ్ డ్రైవ్, ఫుడ్ అండ్ టాప్ డ్రైవ్, ట్రైనింగ్ వర్క్ షాప్, టాక్స్ సెమినార్లు, ఫైనాన్స్ ప్లానింగ్ సెమినార్ నిర్వహించి ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొనేలా తన వంతు సహాయం అందించారు. ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకునేందుకు 2008వ సంవత్సరంలో ప్రారంభించబడిన టీమ్ స్క్వేర్ సంస్థకు చైర్మన్ గా పనిచేసిన కాలంలో అంజయ్య చౌదరి చేసిన సేవలు అనిర్వచనీయం. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ సుమారు 600 మంది కార్యకర్తలను సంధాన పరుస్తూ సేవా యజ్ఞాన్ని కొనసాగించారు. రానున్న రోజుల్లో "తానా" కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిపేందుకు ,తానా యాష్చంద్రిక లను దశదిశలా వ్యాపింప చేసేందుకు అంజయ్య చౌదరి లావు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆశిద్దామని పేర్కోనారు. -
సీఐఐ ప్రెసిడెంట్‌గా నరేంద్రన్
న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా 2021–22 సంవత్సరానికిగాను టాటా స్టీల్ సీఈవో, ఎండీ టి.వి.నరేంద్రన్ నియమితులయ్యారు. 2016–17లో సీఐఐ తూర్పు ప్రాంత చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ ఎన్నికయ్యారు. అలాగే సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ బాధ్యతలు చేపట్టారు. -
సినీ కార్మికులను బతికించుకుంటాం: అనిల్
తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 18 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి కొమర వెంకటేష్‌పై విజయం సాధించారు అనిల్ కుమార్. ప్రధాన కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారి ఆశయాలతో కార్మిక వర్గాన్ని సంక్షేమబాటలో తీసుకుని వెళతాం. సినీ కార్మికుల ఐక్యత కోసమే మేం పోరాడి గెలిచాం. కరోనా వల్ల ఇబ్బందులపాలైన కార్మికులను ఆదుకోవడంపై మొదట దృష్టి పెడతాం. చిరంజీవిగారు, భరద్వాజగారు, సి. కల్యాణ్ వంటి సినీ ప్రముఖులు, ఛాంబర్, నిర్మాతల మండలిల సహకారంతో సినీ కార్మికులను బతికించుకుంటాం’’ అన్నారు. -
టాంజానియా సామియా!
పురుషులతో సమానంగా రాజకీయాలను శాసిస్తున్నారు నేటితరం మహిళలు. న్యూజిలాండ్, బార్బడోస్, డెన్మార్క్, ఈస్టోనియా వంటి దేశాలను మహిళా అధ్యక్షులు సమర్థవంతంగా పాలిస్తూ... దేశాభివృద్ధిలో తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఈ దేశాల సరసన టాంజానియా దేశం కూడా చేరింది. టాంజానియా దేశపు మాజీ అధ్యక్షుడు మరణించడంతో.. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సామియా సులుహు హసన్ దేశపు తొలి మహిళా అధ్యక్షురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా చరిత్రలో ఇప్పటివరకు మహిళలెవరూ అధ్యక్షులు కాలేదు. మూడురోజుల క్రితం మాజీ అధ్యక్షుడు జాన్ మగుఫులీ కరోనా, గుండెసంబంధ సమస్యలతో మరణించారు. దీంతో ఉపాధ్యక్షురాలైన సామియా సులుహు హసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి దేశంలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. టాంజానియా రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా కారణంతోగానీ, లేదా అధ్యక్షుడు మరణించినప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నవారే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. అంతకుముందు ఉన్న అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని ఏళ్లు అధ్యక్షులుగా కొనసాగవచ్చు. 1960 జనవరి 27 పుట్టిన సామియా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి అధ్యక్షురాలుగా ఎదిగారు. అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన జంజీబార్ ప్రాంతంలో పుట్టిన సమియాను పిపోడే అని ప్రేమగా పిలుస్తారు. జంజీబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్‌లో స్టాటిస్టిక్స్ చదివిన సామియా, ముజంబే యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ డిప్లామా ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టాపొందారు. సామియా సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ప్రణాళికా, అభివృద్ధి మంత్రిత్వ శాఖ లో క్లర్క్‌గా పనిచేశారు. ఆ తరువాత ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా పట్టా పొందారు. వ్యవసాయ అధికారి హఫీద్ అమీర్‌ను సామియా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. సామియా కుమార్తె కూడా జంజీబార్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యురాలిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో సామియాది 20 ఏళ్ల ప్రస్థానం. 2000వ సంవత్సరంలో లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె.. జంజీబార్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కు ప్రత్యేక సభ్యురాలిగా ఎంపికయ్యారు. అప్పటి టాంజానియా అధ్యక్షుడు అమనీ అబేది కరుమే క్యాబినెట్లో ఉన్నతస్థాయి మహిళా మంత్రిగా కూడా పనిచేశారు. జంజీబార్ పర్యాటక శాఖ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, యూత్ ఎంప్లాయిమెంట్, మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగానేగాక, కేంద్ర వ్యవహారాల ఇంఛార్జి మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. మకుండుచి నియోజక వర్గ ఎంపీగా 2010 నుంచి2015 వరకు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చామా చా మాపిండుజీ(సీసీఎం) పార్టీతరపున 2015లో యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాకు సమియా పదో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. జంజీబార్ నుంచి ఎన్నికైన తొలి ప్రెసిడెంట్‌గానూ, తూర్పు ఆఫ్రికా దేశాల్లో రెండో మహిళా ప్రెసిడెంట్‌గానూ సామియా నిలుస్తారు. ఆఫ్రికా దేశమైన రువాండాకు 1993 జూలై 18 నుంచి అగాతే ఉవిలింగియమానైన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈమె మరణించే వరకు పదవిలో కొనసాగారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన సామియా 2025 వరకు పదవిలో కొనసాగనున్నారు. టాంజానియా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సామియా సులుహు హసన్ -
మహిళలు ఎక్కువే మాట్లాడాలి
టోక్యో ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో నిన్న ఒక్కరోజే 12 మంది మహిళలు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇప్పటికే ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి 19 మంది! దీంతో బోర్డులో మహిళల శాతం 42 అయింది. (మొత్తం సభ్యులు 45 మంది). ఈ మెరుపు నియామకాలు చేపట్టింది ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీకి కొత్తగా వచ్చిన మహిళా ప్రెసిడెంట్ సీకో హషిమొటొ. ‘బోర్డు మీటింగులలో ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడతారు‘ అని కామెంట్ చేసి, ప్రెసిడెంట్ పదవి పోగొట్టుకున్న 83 ఏళ్ల యషిరొ మొరి స్థానంలోకి వచ్చిన మహిళే హషిమొటొ. ‘ఎక్కువ మాట్లాడతారు‘ అనే కామెంట్ కు తగిన సమాధానంగా ఎక్కువ మంది మహిళలను బోర్డు రూమ్ లోకి తీసుకున్న హషిమొటొ.. జెండర్ ఈక్వాలిటీ కోసం మరికొన్ని చేర్పులు కూడా ఉంటాయంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ దగ్గర పడ్డాయి. జూలై 23 నుంచి ఒలింపిక్స్, తర్వాతి నెలకే ఆగస్టు 24 నుంచి పారా ఒలింపిక్స్. ఈ రెండు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ కమిటీ ప్రెసిడెంట్ ఒక మహిళ. సీకో హషిమొటొ. ఆమె కూడా ఒకప్పుడు క్రీడాకారిణే. ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్‌లో కాంస్య పతకం సాధించారు. ఇప్పుడిక ఒలింపిక్స్ నిర్వహణ అధికారాలలో స్త్రీ సాధికారతను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కమిటీ ప్రెసిడెంట్ పదవి అకస్మాత్తుగా ఖాళీ అవడంతో గత వారమే హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చారు. ప్రెసిడెంటుగా తన తొలి ప్రసంగంలో ఆమె చెప్పిన మాట.. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులలో మహిళల సంఖ్యను పెంచబోతున్నానని. చెప్పినట్లే మొన్న బుధవారం ఒకేసారి పన్నెండు మంది మహిళలను బోర్డు సభ్యులుగా నియమించారు హషిమొటో! బోర్డులో మొదట ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి మొత్తం ఇప్పుడు పందొమ్మిది మంది అయ్యారు. ఈ పన్నెండు మందిని చేర్చుకోవడం కోసమే బోర్డులోని మొత్తం సభ్యుల సంఖ్యను 35 నుంచి 45కు పెంచారు హషిమొటో. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. స్త్రీలపై పాత ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలకు తగిన సమాధానం కూడా అయింది! ∙∙ సీకో హషిమొటోకు ముందరి ప్రెసిడెంట్ యషిరో మొరి. నిజానికి ఆయన నేతృత్వంలోనే ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ టోక్యో ఒలింపిక్స్‌ని నిర్వహించవలసి ఉంది. మీటింగుల మీద మీటింగులు జరుగుతున్నాయి. మీడియాకు ఎప్పటికప్పుడు మీటింగులలో మాట్లాడుకున్న నిర్వహణ వివరాలు ఆయనే అందించాలి. అలా అందిస్తున్న క్రమంలోనే యషిరో మాట జారారు. ‘‘మీటింగులలో ఈ ఆడవాళ్లు ఎందుకంత ఎక్కువగా మాట్లాడతారో!’’ అని అన్నారు. అలా అనడం వివాదం అయింది. జపాన్‌లోని మహిళా కమిషన్లు, సంఘాలు ఆయన అలా అనడాన్ని ఖండించాయి. యూనివర్సిటీ విద్యార్థినులు యషీరో రాజీనామాను కోరుతూ ప్రదర్శనలు జరిపారు. ‘‘క్షమాపణలు చెబితే సరిపోదు, రాజీనామా చేయాల్సిందే’’ అని పట్టుపట్టారు. ప్రభుత్వానికి తలవొగ్గక తప్పలేదు. ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలోకి హషిమొటొ వచ్చారు. ఈ అధికార మార్పిడంతా వారం పది రోజుల్లోనే జరిగిపోయింది. ఆడవాళ్లు మీటింగులలో ఎక్కువ మాట్లాడతారని అన్నందుకు జవాబుగా అన్నట్లు ఎక్కువమంది ఆడవాళ్లను బోర్డులోకి తీసుకున్నారు హషిమొటో. ‘‘వేగంగా పని చేసి, గట్టి ఫలితాలను సాధిస్తే మనం ఏమిటో రుజువు అవుతుంది’’ అని తన తొలి బోర్డు మీటింగులోనే మహిళల్ని ఉత్సాహపరిచారు హషిమొటొ. ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ ర్యాంకుల ప్రకారం స్త్రీ పురుష సమానత్వంలో జపాన్ 135 దేశాలలో 121వ స్థానంలో ఉంది. ఆ అంతరాన్ని తగ్గించడం కోసం అన్ని రంగాల బోర్డు రూమ్‌లలో మహిళల సంఖ్యను పెంచడం ఒక మార్గం అని కూడా ఫోరమ్ అభిప్రాయపడింది. ఆ విషయాన్నే చెబుతూ.. ఈ నెల 25న ఒలింపిక్ జ్యోతి తన ప్రయాణాన్ని ప్రారంభించేనాటికి బోర్డులో మరికొన్ని మార్పులు తేబోతున్నట్లు హషిమొటొ తెలిపారు. బోర్డులో ప్రస్తుతం ఏడుగురు వైస్–ప్రెసిడెంట్లు ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే మహిళ. బహుశా మహిళా వైస్–ప్రెసిడెంట్ల సంఖ్యను కూడా హషిమొటొ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆ సంగతిని శుక్రవారం వెల్లడించబోతున్నట్లు ఆమె తెలిపారు. -
జూన్‌లో నూతన అధ్యక్షుడు
సాక్షి,న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడు నెలల్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేప«థ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికను జూన్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకు మేలో అ«ధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు వాయిదా వేశారు. శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రసంగంతో ప్రారంభమైంది. రైతు ఆందోళ నలపై కేంద్రం అత్యంత దారుణంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. రైతు ప్రతినిధులతో చర్చల్లో ప్రభుత్వ అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెం ట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియా దిశానిర్దేశం చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలబ డాలని, దేశవ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అంతేగాక కోవిడ్–19 విషయంలో టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను అభినందించడంతో పాటు, పంపిణీ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రజలు వాక్సినేషన్‌కు ముందుకు రావాలని తీర్మానం చేసింది. అలాగే, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా పంపిణీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను బహిర్గత పరచాలని కోరింది. దేశ రక్షణకు సంబం ధించిన వ్యాఖ్యలతో బహిర్గతమైన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి వాట్సాప్ చాట్ వ్యవహారంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేసింది. గహ్లోత్ సీరియస్ సీడబ్ల్యూసీ సమావేశంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలపై రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని సమాచారం. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదా అని గహ్లోత్ ప్రశ్నించారు. గతేడాది ఆగస్టు 24న జరిగిన సమావేశంలోనూ ఆజాద్, శర్మ తదితర నాయకులు పార్టీ అధినేత్రిని ఉద్దేశించి రాసిన ఒక లేఖలో లేవనెత్తిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ లేఖ బహిర్గతం అయినప్పటినుంచి పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొనసాగుతున్న విష యం తెలిసిందే.ఆ లేఖపై సంతకం చేసిన నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని గత సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఆజాద్, కపిల్ సిబల్ అభ్యంత రం వ్యక్తం చేసిన తరువాత, కాంగ్రెస్ అధిష్టా నం డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోకి వెళ్లింది. -
జో బైడెన్ ఉద్వేగ భరిత ప్రసంగం
వాషింగ్టన్: ‘ఈ రోజు అమెరికాది. ఈ రోజు ప్రజాస్వామ్యానిది. ఇది ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు. దేశ పునరుజ్జీవానికి మనమంతా అంకితమైన రోజు’ అని అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ తన తొలి ప్రసంగంలో అభివర్ణించారు. గత నాలుగేళ్లుగా లోతుగా గాయపడిన దేశానికి చికిత్స చేసి, విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా చేయడం ప్రస్తుతం తన ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘ఇది వ్యక్తిగత విజయం కాదు. ఈ విజయాన్ని ఒక ప్రత్యేక కారణంతో ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ కారణం ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్య విజయం’ అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు, వారి వాణికి గుర్తింపు లభించిన రోజు ఇదన్నారు. ‘ప్రజాస్వామ్యం అత్యంత విలువైనదన్న విషయాన్ని మనం మరోసారి గుర్తించాం. చదవండి: (ప్రెసిడెంట్.. బైడెన్) డెమోక్రసీ అత్యంత సున్నితమైందన్న విషయాన్నీ నేర్చుకున్నాం. మిత్రులారా.. ఈ క్షణం.. ప్రజాస్వామ్యం విజయం సాధించిన క్షణం’ అని ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. గత అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార తీరు కారణంగా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా అధికార మార్పిడిలో సంక్లిష్టతలు చోటు చేసుకున్న నేపథ్యంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధ్యక్షుడిగా దాదాపు 21 నిమిషాల పాటు చేసిన తొలి ప్రసంగంలో దేశ ప్రజలకు బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని వారిని కొనియాడారు. జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై జరిపిన హింసాత్మక దాడిని ప్రస్తావిస్తూ.. ‘రెండు వారాల క్రితం ఇక్కడే ప్రజాస్వామ్యాన్ని ఓడించేందుకు విఫల ప్రయత్నం జరిగింద’ని బైడెన్ గుర్తు చేశారు. అధ్యక్షుడిగా తన ముందున్న సవాళ్లను, అమెరికా గత ఘనతను, అంతర్జాతీయ ప్రతిష్టను మళ్లీ సాధించేందుకు రూపొందించిన ప్రణాళికలను తొలి సందేశంలో దేశ ప్రజలకు బైడెన్ వివరించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడం, జాత్యహంకారాన్ని రూపమాపడం, వాతావరణ మార్పును ఎదుర్కోవడం.. తన ముందున్న ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు. వీటిపై విజయం సాధించేందుకు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా శ్వేత జాత్యంహకారాన్ని ఐక్యంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. అందరికీ సమాన న్యాయం ఎంతో దూరంలో లేదన్నారు. ‘బైడెన్ అమెరికాకు అధ్యక్షుడు. అమెరికన్లందరికీ అధ్యక్షుడు. తనకు ఓటేసిన వారికి, ఓటేయని వారికీ అధ్యక్షుడు’ అని స్పష్టం చేశారు. ‘మార్పు సాధ్యం కాదని అనకండి. మార్పు సాధ్యమే. కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయడమే దేశంలో వచ్చిన సానుకూల మార్పునకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. కమల హ్యారిస్ దేశ ఉపాధ్యక్షురాలైన తొలి ఇండో–ఆఫ్రో అమెరికన్ మహిళ అన్న విషయం తెలిసిందే. దేశ ప్రజల మధ్య ఆగ్రహావేశాల్ని రగల్చి, దేశాన్ని విభజించే కుట్ర చేశారని ఈ సందర్భంగా ప్రత్యర్థులపై బైడెన్ ఆరోపణలు గుప్పించారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వారు అబద్ధాలను ప్రచారం చేశారన్నారు. సవాళ్లను ఎదుర్కో వడం అమెరికాకు కొత్తేం కాదని, ప్రతీ సారి సవాళ్లు, సమస్యలపై విజయం సాధిస్తూనే ఉందని దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. కరోనా వైరస్ అమెరికాను ఆర్థికంగా, సామాజికంగా దారుణంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన అమెరికన్ల కన్నా కరోనా కారణంగా చనిపోయిన అమెరికన్ల సంఖ్య ఎక్కువని గుర్తు చేశారు. వేలాది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, లక్షలాది వ్యాపారాలు మూతపడ్డాయని ఆవేదన చెందారు. దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కలసికట్టుగా ఎదుర్కుందామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా.. గత నాలుగేళ్ల ట్రంప్ హయాంలో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ కూటములను సమీక్షిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ‘ప్రపంచంలోని మంచి అంతటికి అమెరికా నాయకత్వం వహించే కాలం మళ్లీ వస్తుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ కూటములను ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతామన్నారు. ‘శాంతి, అభివృద్ధి, భద్రతలకు విశ్వసనీయ భాగస్వామిగా అమెరికా ఉంటుంది’ అని ప్రపంచ దేశాలకు భరోసానిచ్చారు. కమలా హ్యారిస్ డ్రెస్ డిజైనర్లు నల్లజాతీయులే వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ ప్రమాణ తన స్వీకారోత్సవం సందర్భంగా క్రిస్టోఫర్ జోన్ రోజర్స్, సెర్గియో హడ్సన్ అనే ఇద్దరు నల్ల జాతీయులు రూపొందించిన వస్త్రాలు ధరించారు. నల్ల జాతీయురాలైన కమలా హ్యారిస్ ఈ విధంగా అమెరికా ప్రజలకు ఒక సానుకూల సందేశం ఇచ్చినట్లయ్యింది. ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ రాల్ఫ్ లారెన్ సూట్లో మెరిసిపోయారు. బైడెన్ దంపతుల ఆత్మీయ ఆలింగనం, కమలను అభినందిస్తున్న భర్త డగ్లస్ -
'ఆటా' కొత్త అధ్యక్షునిగా భువనేశ్ బుజాల
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా భువనేశ్ బుజాల పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీ నివాసి అయిన భువనేశ్ 2004వ సంవత్సరం నుంచి ఆటాలో ఉత్సాహంగా పాలుపంచుకొంటున్నారు. 2014లో జరిగిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌లో కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన నాశ్విల్లే నగరంలో జనవరి 16న జరిగిన 'ఆటా' కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారు. డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్‌గా జయంత్ చల్లా, కాశీ విశ్వనాధ్ కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హనుతిరుమల్ రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి, రామ్ అన్నాడీ , రవీందర్ గూడూర్, రింద సామ, శరత్ వేముల, సుధీర్ బండారు & విజయభాస్కర్ తూపల్లి ఎన్నికయ్యారు. ఇక ఆటా ప్రెసిడెంట్‌గా భువనేశ్ భూజాల, సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, ట్రెజరర్‌గా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రెజరర్‌గా విజయ్ కుందూరు ఎన్నిక అయ్యారు. నష్విల్లె నగరంలో జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ప్రెసిడెంట్‌గా మధు బొమ్మినేని ఎన్నికయ్యారు. ఇక ప్రెసిడెంట్ భువనేశ్ మాట్లాడుతూ.. ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తున్నామని చెప్పారు. ఆపదలో ఉన్న తెలుగు వారు ఆటా సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆటా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా ఎల్లప్పుడూ పెద్ద పీఠ వేస్తుందని పేర్కొన్నారు. మన మాతృభూమిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ నిర్వహణ కార్యక్రమంలో అమెరికాలో పుట్టిపెరిగిన మన పిల్లలను భాగస్వాములను చేయడానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆయన బోర్డును కోరారు. యూత్ కమిటీ ఏర్పాటు చేశారు. మొట్ట మొదటసారిగా ఆటా కన్వెన్షన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1 నుంచి 3 తేదీలలో నిర్వహిస్తున్నామని అందరూ తప్పక పాలుపంచుకోవాలన్నారు. కోవిడ్-19 సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవీ విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్ల, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డిని బోర్డు అభినందించింది. నాశ్విల్లే నగరంలో ఆతిధ్యం ఇచ్చిన ఆటా సభ్యులకు బోర్డు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఆటాకి తోడ్పాటునందిస్తున్న లోకల్ ఆర్గనైజషన్స్ను బోర్డు కొనియాడింది. -
లేడీ గాగా..జెన్నిఫర్ లోపెజ్..!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అమెరికాలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడిగా జో బైడెన్(78), ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్(56) వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వెస్ట్‌ఫ్రంట్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మాత్రమే హాజరుకానున్నారు. పలు కార్యక్రమాలు వర్చువల్‌గానే ఉంటాయి. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 10వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్లో పహారాకు నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే పరేడ్ కూడా వర్చువల్‌గానే ఉంటుందని ప్రమాణ స్వీకార కమిటీ ప్రకటించింది. -
నిరాడంబరంగా బైడెన్ ప్రమాణం
వాషింగ్టన్: జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కోవిడ్–19 ముప్పు నేపథ్యంలో నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన కొద్దిమంది సమక్షంలోనే అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారని జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ ఆన్ ఇనాగరల్ సెరిమనీస్(జేసీసీఐసీ) వెల్లడించింది. పార్లమెంటు సభ్యులు తమతో పాటు మరొక్కరిని మాత్రమే ఈ కార్యక్రమానికి తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రావద్దని, ఇళ్లలోనే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని ప్రజలకు సూచించింది. సాధారణంగా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జేసీసీఐసీ సుమారు 2 లక్షల ఆహ్వాన పత్రాలను పంపిణీ చేస్తుంది. కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఈ సారి నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించారు. భారత్ వెంటే యూఎస్ చైనాతో సరిహద్దు ఘర్షణల సమయంలో అమెరికా భారత్ వెంటే ఉందని వైట్ హౌజ్ సీనియర్ అధికారి ఒకరు గుర్తు చేశారు. ఆ సమయంలో నైతిక మద్దతుతో పాటు భారత్‌కు అవసరమైన సహకారం అందించామన్నారు. దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, తైవాన్ మొదలైన ప్రాంతాల్లో చైనా దురాక్రమణవాదంపై ఆందోళన వెలిబుచ్చారు. భారత్, అమెరికాల మధ్య రక్షణ రంగ సహకారం పెంపొందడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో కృషి చేశారని ఓ అధికారి అన్నారు -
డాక్టర్ ఫస్ట్ లేడీ అంటే తప్పేంటి!?
అమెరికా కొత్త అధ్యక్షుడి సతీమణి డాక్టర్ జిల్ బైడెన్ తన పేరులోని ‘డాక్టర్’ అనే మాటను వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టకముందే తీసి పక్కన పెట్టేయాలని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు సూచించడం.. పురుషాహంకారంపై మహిళల ఆగ్రహాగ్నికి తాజా ఆజ్యం అయింది. ఒక మహిళ సొంతంగా ఏం సాధించినా గుర్తింపు లభించదా?! అమెరికా ప్రథమ మహిళ అయినా, భర్త చాటున ఆయన నీడలో ఉండిపోతేనే ఆమెకు గుర్తింపూ గౌరవమూనా?! తనకంటూ ఒక ఉనికిని, అస్తిత్వాన్ని ఆమె ఏర్పరచుకుంటే వెక్కిరింపులు, పరిహాసాలు తప్పవా అని హిల్లరీ క్లింటన్, మిషెల్ ఒబామా, ఇంకా ఇతర ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ జిల్ బైడెన్‌కు మద్దతుగా నిలబడుతున్నారు. కొద్ది రోజుల్లో డాక్టర్ జిల్ బైడెన్ అమెరికా ‘ప్రథమ మహిళ’ కాబోతున్నారు. అయితే ‘డాక్టర్’ అనే టైటిల్‌ని మించిన తలమానికం మాత్రం కాదు ఆమెకు ఆ ‘ఫస్ట్ లేడీ’ అనే గుర్తింపు. విద్యాబోధనలో పదమూడేళ్ల క్రితం పీహెచ్డీ చేశారు జిల్ బైడెన్. అప్పట్నుంచే ఆమె పేరుకు ముందు డాక్టర్ అనే మాట ఉంది. ఊరికే మాట వరసకు ఉండటం కాదు. ఆ మాటను ప్రాణప్రదంగా ప్రేమిస్తారు జిల్ బైడెన్. ప్రేమించడం అంటే.. ఒబామా హయాంలో ఎనిమిదేళ్ల తన ‘ద్వితీయ మహిళ’ హోదాలో కూడా ఒక్కనాడూ ఆమె తన ఉద్యోగాన్ని రెండోస్థానంలో వదిలేయలేదు! యూనివర్సిటీ ప్రొఫెసర్‌గానే ఉండిపోయారు. ఒకవేళ తను ప్రథమ మహిళ అయినా కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పడమే తన తొలి ప్రాధాన్యం అని ఎన్నికలకు ముందే ప్రకటించారు డాక్టర్ జిల్ బైడెన్. డాక్టరేట్ అన్నది ఆమె సాధించిన విజయం. అది ఆమె సంతోషం. అయితే ఆమె ప్రథమ మహిళ అయ్యాక తన పేరుకు ముందున్న ‘డాక్టర్’ అనే ఆ టైటిల్‌ను తీసి పక్కన పెట్టేయకపోతే వైట్ హౌస్ గౌరవానికి భంగం కలుగుతుందని జోసెఫ్ ఎప్‌స్టెయిన్ అనే ఆయన ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రికలో డిసెంబర్ 11 న రాసిన ఒక అపహాస్య వ్యాసం ఆమె అస్తిత్వాన్ని, సంతోషాన్ని హరించే విధంగా ఉంది. ఒక స్త్రీ.. ‘డాక్టరేట్’ను తన ఉనికిగా చెప్పుకోవడం కూడా తప్పేనా! ఆమె భర్త అమెరికా అధ్యక్షుడు అయితే మాత్రం ఆమె తన డాక్టరేట్‌ను దాచిపెట్టి, అతడి నీడలో ఉండిపోవలసిందేనా అని హిల్లరీ క్లింటన్, మిషెల్ ఒబమా, మార్టిన్ లూథర్ కింగ్ కుమార్తె బెర్నీస్ కింగ్, మరికొందరు ప్రముఖులు జిల్ బైడెన్‌కు మద్దతుగా నిలబడంతో స్త్రీని లోకువ చేసే మగబుద్ధిపై అగ్రరాజ్య విద్యావంతులలో చర్చ మొదలైంది. ∙∙ ‘ఇదొక పెద్ద కామెడీ. నియమ విరుద్ధం’ అంటాడు జోసెఫ్ ఎప్‌స్టెయిన్. కామెడీ, నియమ విరుద్ధం ఏంటంటే జిల్ బైడెన్ తన పేరుకు ముందు ‘డాక్టర్’ అనే టైటిల్‌ని అలాగే ఉంచేసుకోవడం అట! వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఆయన రాసిన ఆ వ్యాసం శీర్షిక ఎలా ఉందో చూడండి. ‘వైట్ హౌస్‌లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? లేకుంటే కనుక ఒక ఎం.డి. కావాలి’. వెక్కిరింపు అన్నమాట. డాక్టర్ అంటే ఆయన ఉద్దేశంలో డెలివరీ చేయగలిగిన డాక్టర్ మాత్రమే. ఆ మాట కూడా రాశాడు. ‘జిల్ బైడెన్ ఎడ్యుకేషన్ సైన్సెస్‌లో పీహెచ్.డి చేశారు. ఆమె చేసింది మెడికల్ డిగ్రీ కాదు. కాన్పు చేసి, బిడ్డను బయటికి తీసినవాళ్లు మాత్రమే తమ పేరుకు ముందు ‘డాక్టర్’ అని ఉంచుకోవాలి’ అంటాడు! ఇంకా ఆ వ్యాసంలో జిల్ బైడెన్‌ను ‘కిడ్డో’ అని, ‘ఫ్రాడ్యులెంట్’ అని, ‘ఎ టచ్ కామిక్’ అనీ నానా మాటలూ అన్నాడు. ఆమె చిన్న పిల్లట. జోసెఫ్ ఎప్‌స్టెయిన్ కూడా చిన్నపిల్లాడేం కాదు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ‘ది అమెరికన్ స్కాలర్ మేగజీన్’ మాజీ ఎడిటర్. అంతటి మనిషిలో ఇంతటి స్త్రీద్వేషం, పురుషాహంకారం ఏమిటి?! ∙∙ జనవరి 20 తన భర్త అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జిల్ బైడెన్‌కు రెండు బాధ్యతలు అవుతాయి. అమెరికా ప్రథమ మహిళగా ఒకటి, నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్న బాధ్యత ఒకటి. ఈ రెండో బాధ్యతనే ఆమె ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పేరుకు ముందు డాక్టర్ అనే టైటిల్ ఉన్నా, లేకున్నా పాఠాలు చెప్పడం అనే ఆసక్తి ఆమెకు మొదటి నుంచీ ఉంది. జోసెఫ్ ఎప్స్టీన్ గారు మాత్రం పాఠాలు చెప్పడంలోని ఆమె నిబద్ధతను వదిలేసి, పాఠాలు చెప్పడంలో ఆమె సాధించిన డాక్టరేట్ వెంట పడ్డారు! ఈయన వ్యాసానికి వెస్టెర్న్ కెంటకీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాల్టన్ హాన్లీ తగిన సమాధానమే చెప్పారు. ‘జిల్ బైడెన్ తన టైటిల్‌ని వదిలేయడం కాదు. జోసెఫ్ ఎప్స్టెయినే అదనంగా ఒక డిగ్రీ పట్టాను సంపాదించాలి. తన ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోడానికి’’ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ భర్త ఎంహాఫ్.. ‘ఇలాంటివి ఒక పురుషుడిపై రాయరెందుకు?’ అని ట్వీట్ చేశారు. అందరికన్నా ముందు జిల్ బైడెన్‌కు మద్దతుగా మాట్లాడింది ఆయనే. తర్వాత మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్, మార్టిన్ లూథర్ కింగ్ కూతురు బెర్నైస్ కింగ్, జో బైడెన్ ప్రతినిధి మైఖేల్ లా రోసా, మరో ప్రథమ మహిళ మిషెల్ ఒబామా.. జిల్ బైడెన్ వైపు గట్టిగా నిలబడ్డారు. ప్రముఖులు, మెడికల్ డాక్టర్లు కూడా జిల్ బైడెన్ కు సంఘీభావం తెలిపారు. అనేకమంది మహిళలు ఆమె గౌరవార్థం తమ ట్విట్టర్ అకౌంట్లో తమ పేరుకు ముందు ‘డాక్టర్’ అనే మాట (ఆనరఫిక్)ను జత కలుపుకున్నారు. కొందరైతే ‘పురుషాహంకారం’, ‘స్త్రీ ద్వేషం’లో జోసెఫ్ ఎప్‌స్టెయిన్‌కు డబుల్ పీహెచ్డీ ఇవ్వాలి అని సున్నితంగా రెండు అంటించారు. ఇన్‌స్టాలో మిషెల్ మద్దతు ‘‘ఆడపిల్లలకు మాత్రమే కాదు. మహిళలందరికీ జిల్ రోల్ మోడల్. వైట్ హౌస్‌లో ఎనిమిదేళ్లు తనను దగ్గరగా చూశాను. ప్రొఫెషనల్ ఉమన్ అంటే తనే అనిపించింది. ఒక బాధ్యత కాదు. కాలేజ్‌లో పాఠాలు, ఇంట్లో తల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా అన్ని పాత్రల్లోనూ తను ఆదర్శంగా ఉండేవారు. ప్రొఫెషనల్‌గా ఉండే ఒక మహిళ.. ఆమె ‘డాక్టర్’, ‘మిస్’, ‘మిసెస్’, ఆఖరికి ‘ఫస్ట్ లేడీ’ అయినా, ఎంత సాధించినా ఆమె శక్తిని గౌరవించడం కన్నా, ఆమెను అపహాస్యం చేయడమే ఎక్కువగా ఉంటుంది. తరాలుగా స్త్రీ ఎదుర్కొంటున్న వివక్షే ఇది. అయినా స్త్రీ ఎప్పటికప్పుడు తనను తను నిరూపించుకుంటూనే ఉంది. జిల్ బైడెన్ కన్నా మెరుగైన ‘ఫస్ట్ లేడీ’ ఉంటారా?!’’ కాబోయే అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో మిషెల్ ఒబామా -
ఫిక్కీ నూతన కార్యవర్గం
న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన కార్యవర్గం ఎంపికైంది. 2020–21 సంవత్సరానికి ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉదయ్ శంకర్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ, స్టార్ అండ్ డిస్నీ ఇండియాలకు ఏపీఏసీ అండ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈయనతో పాటు ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హిందుస్తాన్ యూనీలివర్ (హెచ్‌యూఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్‌గా ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లోస్ ఎండీ సుభ్రకాంత్ పాండా నియమితులయ్యారు. -
యూపీఏకు పవార్ సారథ్యం?
సాక్షి, న్యూఢిల్లీ: మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్‌ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో శరద్ పవార్ విపక్ష బృందానికి సారథ్యం వహించి బుధవారం రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ముందు రైతుల అభ్యంతరాల అధ్యయనం, విపక్షాలను ఏకం చేసేందుకు పవార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. శరద్ పవార్ నివాసంలో రైతుల సమస్యలపై విపక్ష నాయకులతో సమావేశాలు సైతం జరిగాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రపతితో భేటీ తర్వాత యూపీఏ అధ్యక్ష బాధ్యతల మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మారారు. అయితే, వయోభారం కారణంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొనేందుకు, యూపీఏ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, త్వరలోనే ఆ బాధ్యతలను అనుభవం కలిగిన నేతకు అప్పగించాలని చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ, యూపీఏ చైర్‌పర్సన్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కొనసాగారు. ఈసారి మాత్రం ఆమె రాజకీయాలకే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సోనియాగాంధీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుభవజ్ఞుడైన, అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపగల చైర్పర్సన్ అవసరమని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన శరద్ పవార్, సోనియా గాంధీ తర్వాత తదుపరి యూపీఏ చైర్‌పర్సన్‌గా ఎంపిక విషయంలో ముందు వరుసలో ఉన్నారు. యూపీఏ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే విషయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ, రాజకీయంగా వారు ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పవార్ ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్‌కు దాదాపు అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగే స్వభావం ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి షాకిచ్చి ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్ కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారు. రాజకీయ సూత్రధారిగా కూడా శరద్ పవార్ ఏడాదిగా సక్సెస్ అయ్యారు. ఇతర రాజకీయ పార్టీలతో కలుపుకొని ముందుకెళ్ళే స్వభావం, యూపీఏ చీఫ్‌గా పొత్తులను నిర్వహించేటప్పుడు కీలకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్‌గాంధీతో మాట్లాడేందుకే ఇష్టపడని మమతా బెనర్జీతో పోలిస్తే, పవార్ వ్యవహార శైలి కారణంగా పొత్తు రాజకీయాలు కష్టం కాకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. అదంతా ఒట్టిదే: ఎన్సీపీ ముంబై: సోనియాగాంధీ వైదొలిగితే యూపీఏ సారథ్య బాధ్యతలను తమ నేత శరద్ పవార్ చేపట్టే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఎన్సీపీ ఖండించింది. అవన్నీ మీడియా ఊహాగానాలేనని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపసే కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, కొందరి స్వార్థం కోసం ఇటువంటి నిరాధార అంశాలను మీడియా బయటకు తెస్తోందని ఆయన ఆరోపించారు. శరద్ పవార్(80) జాతీయ స్థాయి పాత్ర సైతం పోషించగల సమర్థులు, జనం నాడి తెలిసిన వ్యక్తి అని శివసేన పేర్కొంది. -
ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్
న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్ నియమితులయ్యారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఫిక్కీ తెలిపింది. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఉన్నారు. ఈ నెల 11–14 తేదీల్లో జరగనున్న ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో శంకర్ బాధ్యతలు చేపడతారని ఫెడరేషన్ తెలిపింది. ది వాల్ట్ డిస్నీ కంపెనీకి ఏషియా పసిఫిక్ ప్రెసిడెంట్‌గా, స్టార్ అండ్ డిస్నీ ఇండియాకు చైర్మన్‌గా ఉదయ్ శంకర్ ఉన్నారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగానికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్ కావటం ఫిక్కీ చరిత్రలోనే తొలిసారి. -
ఇవే బైడెన్ ప్రాథమ్యాలు..!
వాషింగ్టన్: అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నిౖకైన కమల హ్యారిస్ పనిచేయాలనుకుంటున్నారని ఆయన బృందం వెల్లడించింది. కోవిడ్–19 నియంత్రణ, మళ్లీ అభివృద్ధి పట్టాల పైకి ఆర్థిక రంగం, వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల అంతం, వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం.. ఇవే బైడెన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించింది. అధికార మార్పిడి విధుల్లో ఉన్న బైడెన్ బృందం ఈ విషయాన్ని తమ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఈ లక్ష్యాల సాధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సమగ్ర వ్యూహంతో ఈ లక్ష్యాలను సాధించాలని బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ప్రజారోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించడం తక్షణ విధిగా బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. వైరస్ వల్ల కుదేలైన కుటుంబాలను, చిన్న వ్యాపారాలను, బాధితులను, కోవిడ్–19పై పోరాడుతున్న యోధులను పరిరక్షించడానికి ప్రాథాన్యం ఇస్తున్నట్లు వివరించింది. కరోనా నియంత్రణ తరువాత.. మంచి వేతనాలు లభించే లక్షలాది ఉద్యోగాల కల్పన బైడెన్ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని తెలిపింది. అత్యుత్తమ అమెరికాను నిర్మించే దిశగా దేశంలోని ఉద్యోగులకు, కార్మికులకు అవసరమైన అన్ని హక్కులు, సదుపాయాలను కల్పించాలని సంకల్పించినట్లు వెల్లడించింది. ఒకవైపు కరోనాను నియంత్రిస్తూనే, మరోవైపు, ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం జరిగేలా, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల తొలగింపు బైడెన్ ప్రభుత్వ మూడో లక్ష్యమని వివరించింది. అమెరికా సమాజంలో భాగమైన బ్లాక్స్, బ్రౌన్స్ సంక్షేమం, వారి అభివృద్ధి కేంద్రంగా ఆర్థిక వృద్ధి సాగాలనేది నూతన ప్రభుత్వ ఆలోచన అని పేర్కొంది. దేశంలోని అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేసింది. బైడెన్‌కు ఇప్పుడే ‘విషెస్’ చెప్పం! మాస్కో/బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన వెలువడేవరకు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలపకూడదని రష్యా, చైనా నిర్ణయించాయి. అమెరికా చట్టాలు, నిబంధనల ప్రకారం బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు స్పష్టమైన తరువాతే తాము స్పందిస్తామని తెలిపాయి. ఎన్నికలపై తలెత్తిన న్యాయ వివాదాలు పరిష్కారమై, ఫలితాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాతే బైడెన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందిస్తారని సోమవారం రష్యా ప్రకటించింది. బైడెన్ విజయం అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలపని దేశాల్లో చైనా, రష్యాతోపాటు బ్రెజిల్, టర్కీ, మెక్సికో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ఎన్నిక కావడంపై చైనా అధికారికంగా స్పందించలేదు ఈ విషయంలో అంతర్జాతీయ సంప్రదాయాలను పాటిస్తామంది. అక్కడి మీడియా మాత్రం వారి ఎన్నికను నిర్ధారిస్తూ పలు విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించింది. -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా జ్ఞానేంద్రో
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్చ్ఐ) కొత్త అధ్యక్షుడిగా మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్రో నింగోంబం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన వీడియో సమావేశంలో ఆయనను ఎన్నుకుంటూ హెచ్ఐ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈశాన్య రాష్ట్రాల నుంచి హెచ్ఐ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నింగోంబం నిలిచారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉండనున్నారు. ఆయన 2009–14 మధ్య మణిపూర్ హాకీ సీఈవోగా పనిచేయడం విశేషం. 2018లో అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ ఎన్నిక చెల్లదంటూ గతంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ క్రీడా నియమావళి ప్రకారం ఏ వ్యక్తి కూడా వరుసగా మూడు పర్యాయాలు ఆఫీస్ బేరర్‌గా ఉండరాదు. ముస్తాక్ అహ్మద్ 2010–14 మధ్య హెచ్ఐ కోశాధికారిగా, 2014–18 మధ్య సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 2018లో జాతీయ క్రీడా నియమావళి నిబంధనలను ఉల్లంఘిస్తూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాంతో ఆగ్రహించిన క్రీడా మంత్రిత్వ శాఖ... అహ్మద్‌ను వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అహ్మద్‌ను సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకోవడం విశేషం. -
డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడవు శనివారంతో ముగియగా... అధ్యక్ష పదవి రేసులో రోహన్ మాత్రమే ఉండటంతో అతడిని ఏకగ్రీవం చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అధ్యక్ష పదవిలో రోహన్ వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఉండనున్నారు. గతంలో అరుణ్ జైట్లీ 1999 నుంచి 2013 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాది అయిన రోహన్... తండ్రి బాటలోనే నడుస్తూ డీడీసీఏ అధ్యక్ష పదవిని అలంకరించడంతో పలువురు క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కోశాధికారి, డైరెక్టర్ పదవుల కోసం నవంబర్ 5–8 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. కోశాధికారి పదవి కోసం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా సతీమణి శశి, గౌతమ్ గంభీర్ మేనమామ పవన్ గులాటి మధ్య పోటీ నెలకొని ఉంది. -
అక్టోబర్ 18 వరకు నామినేషన్లు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ పదవి కోసం నామినేషన్లు వేసేందుకు ఈ నెల 18ని తుది గడువుగా విధించింది. అయితే గతంలో ప్రతిష్టంభనకు కారణమైన కీలక నిబంధన విషయంలో స్పష్టత ఇవ్వకుండానే ఐసీసీ దీనిని ప్రకటించడం ఆసక్తికరం. ప్రస్తుతం ఐసీసీలో 17 మంది బోర్డు సభ్యులకు ఓటు హక్కు ఉంది. నిబంధనల ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే మూడింట రెండో వంతు మెజార్టీ ఉండాలి. అంటే కనీసం 11 లేదా 12 మంది సభ్యుల మద్దతు అవసరం. కొన్ని దేశాలు మాత్రం సాధారణ మెజార్టీ ప్రకారం... అంటే ఎక్కువ మంది ఎవరికి మద్దతు పలికితే వారిని ఎంపిక చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏకగ్రీవం సాధ్యం కాకపోతే ఎన్నికను ఎలా నిర్వహిస్తారనేది చూడాలి. -
పక్షపాతం లేకుండా వ్యవహరించండి: పైలట్
సాక్షి, జైపూర్: ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయడంతో సచిన్ పైలట్‌ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ నూతన అధ్యక్షుడిగా గోవింద్ సింగ్ దోతస్రా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడికి సచిన్ పైలట్ అభినందనలు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి, పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారు. ‘రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన దోతస్రాజీకి అభినందనలు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలను ఎటువంటి ఒత్తిడి, పక్షపాతం లేకుండా పూర్తిగా గౌరవిస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అలానే అసెంబ్లీ స్పీకర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు సచిన్ పైలట్. (రాజస్తాన్ హైడ్రామా : పట్టు కోల్పోతున్న పైలట్!) ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు ఎదురుతిరిగిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఈ నెల 14న పార్టీ హైకమాండ్ తొలగించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో సచిన్ పైలట్‌తోపాటు ఆయనకు మద్దతిస్తున్న 18 ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేయగా వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
కొత్త సారథి కావలెను
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ నిర్లిప్త ధోరణి, పార్ట్ టైమ్ పాలిటిక్స్‌పై పార్టీ నేతలు విసిగిపోతున్నట్టే కనిపిస్తోంది. అత్యంత కీలకమైన సవాళ్లు ఎదురైన సమయంలో కూడా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం, ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి వీరవిధేయులు మాత్రం సోనియాయే పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నా కాంగ్రెస్‌కి పూర్వవైభవం తీసుకురావడానికి రాహుల్ గాంధీ చిన్నపాటి ప్రయత్నం చేయకపోవడం, మతపరమైన అంశాల్లో బీజేపీని ఇరుకున పెట్టే విధంగా వ్యూహరచన చేయలేకపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశను నింపుతోంది. రాహుల్ ఏం మాట్లాడినా అవి పార్టీకే ఎదురు తిరుగుతూ ఉండడంతో రాహుల్ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని ఇన్నాళ్లూ డిమాండ్ చేసినవారే ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అనంతరం అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో మరో గత్యంతరం లేక సోనియా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. సోనియాకు వయసు మీద పడినా, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా రాహుల్‌తో పోల్చి చూస్తే ఆమె నయం అన్న అభిప్రాయానికి చాలా మంది నేతలు వస్తున్నారు. లేదంటే కాంగ్రెస్‌కి కొత్త సారథి వచ్చినా మంచిదేనన్న అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ నిర్లిప్తతను బహిరంగంగానే నాయకులు ఎండగడుతున్నారు. మరికొందరు అంతర్గత సంభాషణల్లో రాహుల్ తీరుతెన్నులపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌధురి రాహుల్, ప్రియాంకలు ఇద్దరూ పార్టీకి దూరంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ మనుగడ సాధించలేదా ? అని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరేమన్నారంటే రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారో లేదో తేల్చి చెప్పడం లేదు. ఆయన నాన్చుడు ధోరణి వల్ల కాంగ్రెస్ పార్టీకి దారి తెన్నూ తెలియడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి కరుకు చురుకు కలిగిన అధ్యక్షుడి అవసరం ఉంది – శశిథరూర్, ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. సోనియాగాంధీ తాత్కాలికంగా మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడెవరో తేల్చాలి. ఒకవేళ రాహుల్ గాంధీ పోటీ పడకపోతే కొత్త వారికి పగ్గాలు అప్పగించాలి – అభిషేక్ మను సింఘ్వి, ఎంపీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించగలిగే నాయకురాలు సోనియా గాంధీ మాత్రమే. పార్టీకి మంచి భవిష్యత్ ఉండాలంటే సోనియాయే పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టాలి – మనీశ్ తివారీ, ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులెవరూ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలని భావించడం లేదు. ఎందుకంటే గాంధీ కుటుంబానికి వ్యతిరేకులెవరైనా ఆ పదవిలోకి వస్తే కష్టం – సందీప్ దీక్షిత్, ఎంపీ -
శ్రీలంకకు 3,230 కోట్ల సాయం
న్యూఢిల్లీ: శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం, దౌత్య సంబంధాలను బలపరుచుకోవాల్సిన ఆవశ్యకతపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశం అనంతరం లంక ప్రభుత్వానికి సుమారు రూ.3,230 కోట్ల రుణ సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గోతబయ రాజపక్స మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కి వచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశం దృష్టిసారించింది. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... శ్రీలంక సత్వరాభివృద్ధి పథంలో పయనించేందుకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు రూ.3,230 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్‌లో శిక్షణ పొందుతున్నట్టు ప్రధాని వెల్లడించారు. లంక అధ్యక్షుడు గోతబయ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. రాజపక్సకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో ఘనంగా స్వాగతం పలికారు. -
కాంగ్రెస్ చీఫ్‌గా మళ్లీ రాహుల్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ మరోసారి అధ్యక్షుడు కానున్నారా? ఈ సంవత్సరం చివరిలోగా మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు. పార్టీలోని వివిధ వర్గాల నుంచి తీవ్రంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో రాహుల్ గాంధీ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్నారని వారు గట్టిగా చెబుతున్నారు. ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిని చేయాలని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ చాలా కీలకమని, అందువల్ల ఆ రాష్ట్రంపై మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సోనియాగాంధీ ఇప్పటికే ప్రియాంక గాంధీకి సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అధ్యక్షురాలిగా తాను ఉన్నప్పటికీ.. తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల.. రాహుల్ మరోసారి పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సోనియా కోరుకుంటున్నారని పేర్కొన్నాయి. ఈ సంవత్సరం చివరినాటికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని పేర్కొన్నాయి. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో డిసెంబర్ నెలలో ఏఐసీసీ భేటీ జరిగే అవకాశముందని వెల్లడించాయి. 17 మంది పార్టీ సీనియర్ సభ్యులతో ఒక పాలసీ అండ్ స్ట్రాటెజీ గ్రూప్‌ను బుధవారం సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. ఆ బృందంలో రాహుల్ గాంధీ సభ్యుడిగా ఉన్నారు కానీ ప్రియాంక గాంధీ లేకపోవడం గమనార్హం. రాహుల్‌కు సన్నిహితులైన పలువురు యువ నేతలకు కూడా ఈ బృందంలో చోటు దక్కింది. దాంతో రాహుల్ మరోసారి క్రియాశీలకం కానున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సోనియా గాంధీ నేతృత్వంలోని ఆ బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగొయి, సుశ్మిత దేవ్, రాజీవ్ సతవ్, జ్యోతిరాదిత్య సింధియా, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా.. తదితరులున్నారు. ఈ గ్రూప్ ఏర్పాటు గురించి పార్టీ తరఫున అధికారిక ప్రకటన ఏదీ వెలుపడలేదు. కానీ సభ్యులకు వ్యక్తిగతంగా సమాచారమిచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ బృందం భేటీ అవుతుందని, ఎకానమీ, పౌరసత్వ సవరణ బిల్లు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం.. తదితరాలపై చర్చించనుందని వెల్లడించాయి. -
బెంగాల్ టైగర్ ఈజ్ బ్యాక్
-
‘విజ్జీ’ తర్వాత...
భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేయబోతున్న రెండో వ్యక్తి సౌరవ్ గంగూలీ. గంగూలీకి ముందు 1954–56 మధ్య కాలంలో మహరాజా ఆఫ్ విజయనగరం (పూసపాటి విజయానంద గజపతి రాజు) బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు (2014 ఐపీఎల్ బాధ్యతలు చూడమంటూ సుప్రీం కోర్టు తాత్కాలికంగా సునీల్ గావస్కర్‌ను అధ్యక్షుడిని నియమించడాన్ని మినహాయిస్తే). ‘విజ్జీ’గా సన్నిహితులతో పిలిపించుకున్న మహరాజుకు పరిపాలనాధికారిగా మంచి పేరే వచ్చింది. అయితే అంతకు రెండు దశాబ్దాల క్రితం ఆటగాడిగా వ్యవహరించిన సమయంలో ఆయన వ్యవహారశైలికి సంబంధించి అనేక ఆసక్తికర కథనాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం వివాదాస్పదమైనవే. అపార సంపద ఉండటంతో దిగ్గజాలు జాక్ హాబ్స్, హెర్బర్ట్ సట్‌క్లిఫ్‌లను పిలిపించి తన సొంత ప్యాలెస్‌లోని క్రికెట్ గ్రౌండ్లలో ఆయన ఆడింపజేసేవారు. 1930ల్లో భారత క్రికెట్లో రాజు ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది. 1932 ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తూ ‘డిప్యూటీ వైస్ కెప్టెన్’గా రాజు సిద్ధమయ్యారు. అయితే అనారోగ్యంతో వెళ్లలేకపోయినా... 1936 సిరీస్‌కు కెప్టెన్ హోదాలో ఇంగ్లండ్ వెళ్లారు. అయితే ఆ సిరీస్ మొత్తం వివాదమే. టీమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ లాలా అమర్నాథ్ను క్రమశిక్షణ పేరుతో ఒక్క టెస్టు కూడా ఆడకుండానే స్వదేశం పంపించారు. ఆ పర్యటనలో ఆడిన అన్ని మ్యాచ్‌లు కలిపి 16.21 సగటుతోనే 600 పరుగులు చేశారు. అందులోనూ ప్రత్యర్థి కెప్టెన్లకు ‘తనకు ఫుల్ టాస్‌లు, సులువైన బంతులు వేయాలంటూ’ బంగారు వాచీలు కూడా బహుమతిగా ఇచ్చి చేసిన పరుగులే! ఇంగ్లండ్‌తో 3 టెస్టుల్లో కలిపి చేసింది 33 పరుగులే. స్వదేశం వచ్చాక తీవ్ర విమర్శలు రావడంతో ఆట నుంచి తప్పుకున్న మహరాజు మళ్లీ భారత్ తరఫున ఆడలేదు. ‘ఆయనకు ఉన్న రోల్స్‌రాయిస్ కార్లకంటే చేసిన పరుగులు తక్కువ’ అంటూ అప్పట్లో ఒక జోక్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే పరిపాలకుడిగా ప్రశంసలు అందుకున్న మహరాజును మరచిపోకుండా బీసీసీఐ ‘విజ్జీ ట్రోఫీ’ పేరిట ఇంటర్ యూనివర్సిటీ జోనల్ టోర్నమెంట్‌ను ప్రస్తుతం నిర్వహిస్తోంది. -
భారత క్రికెట్లో మళ్లీ ‘దాదా’గిరి!
దాదాపు 20 ఏళ్ల క్రితం... భారత క్రికెట్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడే బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం బీసీసీఐ పరువు తీసింది. కెప్టెన్సీ నా వల్ల కాదంటూ సచిన్ స్వచ్ఛందంగా తప్పుకుంటూ కీలక సమయంలో కాడి పడేశాడు. అలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దగలడంటూ గంగూలీని నమ్మి బోర్డు బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్‌గా తన తొలి వన్డే సిరీస్‌ను గెలిపించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సౌరవ్... తదనంతర కాలంలో భారత క్రికెట్ రాత మార్చిన అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పుడు కూడా... భారత క్రికెట్ పరిపాలన పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు... ఎన్నికైన ఆఫీస్ బేరర్లతో కాకుండా 33 నెలలుగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేతృత్వంలోనే పాలన నడుస్తోంది. అవగాహనలేమి, అనుభవలేమివంటి సమస్యలతో సీఓఏ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు క్రికెట్‌ను దెబ్బ తీశాయి. అర్థంపర్థం లేని నిబంధనలు సరైన నిర్ణయాధికార వ్యవస్థ లేకుండా గందరగోళానికి దారి తీశాయి. ఇలాంటి సమయంలో గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా వస్తున్నాడు. అభిమానులు ఆత్మీయంగా ‘దాదా’ అని పిలుచుకునే బెంగాలీ బాబు ఇక్కడా తన ముద్ర చూపించగలడా! వేచి చూడాలి. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని బాగు చేసేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు కాబోయే కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. అందు కోసమే ఇక్కడ అడుగు పెట్టినట్లు అతను చెప్పాడు. సోమవారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడాడు. అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. ఈ నేపథ్యంలో వేర్వేరు అంశాలపై తన ఆలోచనలు, ప్రణాళికల గురించి సౌరవ్ వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే... పూర్వ వైభవం తెస్తా... దేశం తరఫున ఆడి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన నాకు ఈ పెద్ద పదవి దక్కడం కూడా గొప్పగా అనిపిస్తోంది. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇప్పటికే బోర్డు పేరు ప్రఖ్యాతులు బాగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో నేను బాధ్యతలు చేపడుతున్నాను. కాబట్టి దీనిని చక్కబెట్టేందుకు నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా. వచ్చే కొన్ని నెలల్లో అన్నీ సరిదిద్ది సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం. అపెక్స్ కౌన్సిల్‌లోని నా సహచరులందరితో కలిసి పని చేసి బీసీసీఐకి పూర్వ వైభవం తీసుకొస్తాం. వారి మ్యాచ్ ఫీజు పెంచాలి... ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అందరం కలిసి చర్చిస్తాం. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల బాగోగులు చూడటం గురించే. అప్పట్లో దీని గురించి నేను సీఓఏకు కూడా సూచనలు చేసినా వారు పట్టించుకోలేదు. మన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడంపై ముందుగా దృష్టి పెడతా. వారికి లభిస్తున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇదో సవాల్.... ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా లేక ఏకగ్రీవంగా ఎంపికైనా బాధ్యతలో మాత్రం తేడా ఉండదు. అందులోనూ ప్రపంచ క్రికెట్లో పెద్ద బోర్డుకు నాయకత్వం వహించడం చిన్న విషయం కాదు. ఆర్థికంగా బీసీసీఐ ఎంతో పరిపుష్టమైన వ్యవస్థ కాబట్టి నాకు ఇది సవాల్లాంటిది ఊహించలేదు... నేను బోర్డు అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. మీరు అడిగినప్పుడు నేను కూడా బ్రిజేష్ పటేల్ పేరే చెప్పాను కానీ నేను పైకి వెళ్లేసరికి అంతా మారిపోయింది. నేను బోర్డు ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు కాబట్టి ఇలా కూడా అవకాశం దక్కుతుందని అనుకోలేదు. 10 నెలలకే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనుండటం పట్ల ఎలాంటి బాధ లేదు. అది నిబంధన కాబట్టి పాటించాల్సిందే. నాకు తండ్రిలాంటి జగ్మోహన్ దాల్మియా నిర్వహించిన బాధ్యతలను నేను కూడా చేపట్టగలనని ఎప్పుడూ ఊహించలేదు. గతంలో శ్రీనివాసన్‌లాంటి అనేక మంది వ్యక్తులు సమర్థంగా బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలు మాట్లాడలేదు... కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాతో ఏ రాజకీయ నాయకుడు కూడా సంప్రదింపులు జరపలేదు. నాకు అభినందన సందేశం పంపిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు. సమర్థుడు కావాలని.... భారత జట్టు కెప్టెన్‌గా ఆడటంకంటే గొప్ప గౌరవానికి మరేదీ సాటి రాదు. 2000లో నేను కెప్టెన్ అయినప్పుడు కూడా ఫిక్సింగ్‌లాంటి సమస్యలు ఉన్నాయి. నేను వాటిని సరిదిద్దగలనని వారు భావించారు. ఇక్కడ అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఆటగాడా, కాదా అనేది అనవసరం. సమర్థుడు కావడం ముఖ్యం. ఐసీసీకి 75–80 శాతం ఆదాయం భారత క్రికెట్ నుంచే వస్తున్నా... గత మూడు నాలుగేళ్లుగా మనకు న్యాయంగా వారి నుంచి ఆశించిన రీతిలో నిధులు రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొంటాం. అదో పెద్ద సమస్య.... పరస్పర ప్రయోజనం (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా అయితే క్రికెట్ వ్యవస్థలో అత్యుత్తమ వ్యక్తులను తీసుకొచ్చి పని చేయించుకోవడం కష్టమైపోతుంది. వారు వేరే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తారు. ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే నిబంధన పాటిస్తే మాజీ ఆటగాళ్లెవరూ ముందుకు రారు. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత వారికి ఆర్థిక భద్రత లేకపోతే మనసు పెట్టి ఎలా పని చేస్తారు.