శైలేశ్ గుప్తా, కె.రాజప్రసాద్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా మిడ్–డే వార్తాసంస్థకు చెందిన శైలేశ్ గుప్తా ఎన్నికయ్యారు. 2019–20 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా శైలేశ్ గుప్తా సేవలు అందించనున్నారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఐఎన్‌ఎస్ 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. డెప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎల్.ఆదిమూలన్, వైస్ ప్రెసిడెంట్‌గా డీడీ పుర్‌కాయస్థ, గౌరవ కోశాధికారిగా నరేశ్ మోహన్, సెక్రటరీ జనరల్‌గా మేరీపాల్ ఎన్నికయ్యారు. ఐఎన్‌ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సాక్షి (విశాఖపట్నం) తరఫున కె.రాజప్రసాద్ రెడ్డి(కేఆర్‌పీ రెడ్డి)సహా 41 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీలోని కొందరు సభ్యులు:
ఎస్.బాలసుబ్రమణ్యం ఆదిత్యన్ (డైలీ తంతి), గిరీశ్ అగర్వాల్ (దైనిక్ భాస్కర్, భోపాల్), సమహిత్ బల్ (ప్రగతివాది), గౌరవ్ చోప్రా (ఫిల్మీ దునియా), విజయ్ జవహర్‌లాల్ దర్దా (లోక్‌మత్, నాగ్‌పూర్), వివేక్ గోయంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ముంబై), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ప్రదీప్ గుప్తా (డాటాక్విస్ట్), సంజయ్ గుప్తా (దైనిక్ జాగరణ్, వారణాసి), మోహిత్ జైన్ (ఎకనమిక్ టైమ్స్), ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి ఆరోగ్య మాసిక), విలాస్ ఎ. మరాఠి (దైనిక్ హిందుస్తాన్, అమరావతి), హర్ష మాథ్యూ (వనిత), అనంత్ నాథ్ (గృహశోభిక, మరాఠి), ప్రతాప్ జి.పవార్ (సకల్), ఆర్‌ఎంఆర్ రమేశ్ (దినకరణ్), కె. రాజ ప్రసాద్ రెడ్డి (సాక్షి, విశాఖపట్నం), అతిదేవ్ సర్కార్ (ది టెలిగ్రాఫ్), శరద్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్, పట్నా), రాకేశ్ శర్మ (ఆజ్ సమాజ్), ప్రవీణ్ సోమేశ్వర్ (ది హిందుస్తాన్ టైమ్స్), కిరణ్‌ఠాకూర్ (తరుణ్ భారత్, బెల్గాం), బిజూ వర్గీస్ (మంగళం వీక్లీ), వివేక్ వర్మ (ది ట్రిబ్యూన్), ఐ.వెంకట్ (సితార), తిలక్ కుమార్ (దెక్కన్ హెరాల్డ్, ప్రజావాణి), అఖిల ఉరంకార్ (బిజినెస్ స్టాండర్డ్), జయంత్ మమెన్ మాథ్యూ (మళయాళ మనోరమ).
Comments
Please login to add a commentAdd a comment