ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా శ్రేయామ్స్‌ కుమార్‌ | M V Shreyams Kumar elected president of INS | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా శ్రేయామ్స్‌ కుమార్‌

Published Sat, Sep 28 2024 5:36 AM | Last Updated on Sat, Sep 28 2024 6:56 AM

M V Shreyams Kumar elected president of INS

సాక్షి, న్యూఢిల్లీ: ‘ది ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ’ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్‌ కుమార్‌ (మాతృభూమి) ఎన్నికయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఐఎన్‌ఎస్‌ బిల్డింగ్‌లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. 

ఈ సమావేశంలో 2024–25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్‌ కుమార్‌ను ఎన్నుకోగా.. వివేక్‌ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, కరణ్‌ రాజేంద్ర దర్దా (లోక్‌మత్‌) ఉపాధ్యక్షుడిగా, తన్మయ్‌ మహేశ్వరీ (అమర్‌ ఉజాలా) కోశాధికారిగా, మేరీపాల్‌  ప్రధాన కార్యదర్శిగా  ఎన్నికైనట్లు ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ తెలిపింది.

 కేఆర్‌పీ రెడ్డి (సాక్షి), వివేక్‌ గొయెంకా (ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌), అతిదేవ్‌ సర్కార్‌ (టెలిగ్రాఫ్‌), మహేంద్ర మోహన్‌ గుప్తా (దైనిక్‌ జాగరణ్‌), ఐ.వెంకట్‌ (ఈనాడు), జయంత్‌ మమెన్‌ మాథ్యూ (మలయాళ మనోరమ)లు ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement