mid day
-
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శైలేష్ గుప్తా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా మిడ్–డే వార్తాసంస్థకు చెందిన శైలేశ్ గుప్తా ఎన్నికయ్యారు. 2019–20 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా శైలేశ్ గుప్తా సేవలు అందించనున్నారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఐఎన్ఎస్ 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. డెప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎల్.ఆదిమూలన్, వైస్ ప్రెసిడెంట్‌గా డీడీ పుర్కాయస్థ, గౌరవ కోశాధికారిగా నరేశ్ మోహన్, సెక్రటరీ జనరల్‌గా మేరీపాల్ ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సాక్షి (విశాఖపట్నం) తరఫున కె.రాజప్రసాద్ రెడ్డి(కేఆర్పీ రెడ్డి)సహా 41 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలోని కొందరు సభ్యులు: ఎస్.బాలసుబ్రమణ్యం ఆదిత్యన్ (డైలీ తంతి), గిరీశ్ అగర్వాల్ (దైనిక్ భాస్కర్, భోపాల్), సమహిత్ బల్ (ప్రగతివాది), గౌరవ్ చోప్రా (ఫిల్మీ దునియా), విజయ్ జవహర్లాల్ దర్దా (లోక్మత్, నాగ్‌పూర్), వివేక్ గోయంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ముంబై), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ప్రదీప్ గుప్తా (డాటాక్విస్ట్), సంజయ్ గుప్తా (దైనిక్ జాగరణ్, వారణాసి), మోహిత్ జైన్ (ఎకనమిక్ టైమ్స్), ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి ఆరోగ్య మాసిక), విలాస్ ఎ. మరాఠి (దైనిక్ హిందుస్తాన్, అమరావతి), హర్ష మాథ్యూ (వనిత), అనంత్ నాథ్ (గృహశోభిక, మరాఠి), ప్రతాప్ జి.పవార్ (సకల్), ఆర్ఎంఆర్ రమేశ్ (దినకరణ్), కె. రాజ ప్రసాద్ రెడ్డి (సాక్షి, విశాఖపట్నం), అతిదేవ్ సర్కార్ (ది టెలిగ్రాఫ్), శరద్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్, పట్నా), రాకేశ్ శర్మ (ఆజ్ సమాజ్), ప్రవీణ్ సోమేశ్వర్ (ది హిందుస్తాన్ టైమ్స్), కిరణ్‌ఠాకూర్ (తరుణ్ భారత్, బెల్గాం), బిజూ వర్గీస్ (మంగళం వీక్లీ), వివేక్ వర్మ (ది ట్రిబ్యూన్), ఐ.వెంకట్ (సితార), తిలక్ కుమార్ (దెక్కన్ హెరాల్డ్, ప్రజావాణి), అఖిల ఉరంకార్ (బిజినెస్ స్టాండర్డ్), జయంత్ మమెన్ మాథ్యూ (మళయాళ మనోరమ). -
నీడా కనిపించట్లేదు..!
చెన్నై,టీనగర్: సాధారణంగా మిట్ట మధ్యాహ్నం ఎండలో మనుషుల నీడ నేలపై కనిపించడం సర్వసాధారణం. అయితే మంగళవారం మధ్యాహ్నం 12.17 గంటలకు నీడ అసలు కనిపించలేదు. దీన్ని చెన్నై, బెంగళూరు వాసులు గుర్తించి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏడాదికి రెండు సార్లు ఈ విధంగా నీడ పడకుండా సూర్యుడు నడినెత్తి పైన ఉంటాడని చెన్నై వాతావరణ పరిశోధకులు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 18న ఈ అరుదైన ఘటన జరిగిందని, ప్రస్తుతం మరోసారి జరిగిందని వివరించారు. -
ధర్మపురిలో పట్టపగలే భారీ చోరీ
ధర్మపురి :పట్టణంలో దొంగలు గురువారం పట్టపగలే భారీ చోరీకి తెగబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనమైంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని గుండయ్యపల్లె సమీపంలో సీపతి రాజన్న నివాసముంటున్నాడు. ఇంటి సమీపంలోనే కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ఉదయం రాజన్న షాపుకు వెళ్లాడు. అతడి భార్య సంధ్యారాణి ఇంటికి తాళం వేసి పక్కింట్లో గణపతికి భోగం వండేందుకు వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళం పగులగొట్టి లోనికి వెళ్లారు. బీరువా తాళం పగులగొట్టి అందులోని బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. అరగంట తర్వాత సంధారాణి ఇంటికి రాగా, తాళం పగిలి ఉంది. అనుమానంతో లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులోని నగలు, నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి బోరున విలపించింది. స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వేలిముద్రలు సేకరించారు. ఇంటి ముందు గేటు వేసి ఉండగానే గోడ ఎక్కి దొంగలు లోనికి వెళ్లిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. -
ఉడికీ,ఉడకని వంటలతో మధ్యాహ్న భోజనం