ఐఎన్‌ఎస్‌ అధ్యక్షునిగా రాకేశ్‌ శర్మ | Rakesh Sharma elected President of the Indian Newspaper Society | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షునిగా రాకేశ్‌ శర్మ

Oct 1 2023 5:39 AM | Updated on Oct 1 2023 5:39 AM

Rakesh Sharma elected President of the Indian Newspaper Society - Sakshi

న్యూఢిల్లీ: ది ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌)కి 2023–24 కాలానికి నూతన అధ్యక్షునిగా రాకేశ్‌ శర్మ(ఆజ్‌ సమాజ్‌) ఎన్నికయ్యారు. వార్తాసంస్థలు, మ్యాగజైన్‌లు, పీరియాడికల్స్‌ సంస్థల సంఘమైన ఐఎన్‌ఎస్‌ 84వ వార్షిక సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఇప్పటిదాకా సంస్థకు కె.రాజ ప్రసాద్‌ రెడ్డి(సాక్షి) అధ్యక్షునిగా కొనసాగిన విషయం తెల్సిందే.

2023–24 కాలానికిగాను ఐఎన్‌ఎస్‌ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా శ్రేయాంస్‌ కుమార్‌(మాతృభూమి), వైస్‌ ప్రెసిడెంట్‌గా వివేక్‌ గుప్తా(సన్మార్గ్‌), గౌరవ ట్రెజరర్‌గా తన్మైయ్‌ మహేశ్వరి(అమర్‌ ఉజాలా) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా కె.రాజ ప్రసాద్‌ రెడ్డి(సాక్షి), ఐ.వెంకట్‌(ఈనాడు, అన్నదాత)సహా 41 మంది ఎన్నికయ్యారు. సొసైటీకి సెక్రెటరీ జనరల్‌గా మేరీ పాల్‌ ఎంపికయ్యారు. మరోవైపు అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో తనకు పూర్తి సహాయక సహకారాలు అందించిన ఐఎన్‌ఎస్‌ ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, తదితరులకు మాజీ అధ్యక్షుడు కె.రాజ ప్రసాద్‌ రెడ్డి(కేఆర్‌పీ రెడ్డి) కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement