
బీజేపీ సారథిగా అమిత్ షా!
ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, ఆ పార్టీ కొత్త అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, ఆ పార్టీ కొత్త అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం ఢిల్లీలో సమావేశంకానున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు,.. అమిత్ షా నియామకానికి ఆమోద ముద్రవేసే సూచనలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 71 స్థానాలు సాధించిపెట్టడంలో షా కీలకపాత్ర పోషించారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌నుంచి అమిత్ షా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి రామ్‌మాధవ్‌ను బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు సుముఖత వ్యక్తం చేశాయి. మరోవైపు తాను బీజేపీలో చేరడంలో కొత్తేం లేదని రామ్ మాధవ్ తెలిపారు. బీజేపీ నాయకత్వం తనకు ఏ బాధ్యత అప్పగిస్తుందో తెలియదన్నారు.