
న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్ నియమితులయ్యారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఫిక్కీ తెలిపింది. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఉన్నారు. ఈ నెల 11–14 తేదీల్లో జరగనున్న ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో శంకర్ బాధ్యతలు చేపడతారని ఫెడరేషన్ తెలిపింది. ది వాల్ట్ డిస్నీ కంపెనీకి ఏషియా పసిఫిక్ ప్రెసిడెంట్‌గా, స్టార్ అండ్ డిస్నీ ఇండియాకు చైర్మన్‌గా ఉదయ్ శంకర్ ఉన్నారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్ కావటం ఫిక్కీ చరిత్రలోనే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment