న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన కార్యవర్గం ఎంపికైంది. 2020–21 సంవత్సరానికి ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉదయ్ శంకర్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ, స్టార్ అండ్ డిస్నీ ఇండియాలకు ఏపీఏసీ అండ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈయనతో పాటు ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హిందుస్తాన్ యూనీలివర్ (హెచ్‌యూఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్‌గా ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లోస్ ఎండీ సుభ్రకాంత్ పాండా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment