Uday Shankar
-
శభాష్ శంకర్! పదిహేనేళ్ల వయస్సులోనే ఏఐ స్టార్టప్‌గా..
ఇష్టానికి కష్టం తోడైతే చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించవచ్చు... అని చెప్పడానికి ఉదాహరణ కేరళలోని ఎర్నాకుళంకు చెందిన ఉదయ్ శంకర్. పదిహేనేళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ఔరా అనుకునేలా చేశాడు. ఇప్పటి వరకు 10 ఏఐ యాప్‌లు, 9 కంప్యూటర్ ప్రోగ్రామ్స్, 15 రకాల గేమ్స్ డిజైన్ చేశాడు..బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్.‘ యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది. ఏఐ స్టార్టప్ ‘ఉరవ్’తో మరో అడుగు ముందు వేశాడు.కోచిలో జరిగిన అంతర్జాతీయ జెన్ఏఐ సదస్సులో ఉదయ్‌శంకర్ స్టార్టప్ ‘ఉరవ్’కు సంబంధించి ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. చిన్న వయసులోనే రోబోటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు ఉదయ్. అది పాషన్‌గా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. కోవిడ్ కల్లోల సమయంలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. సమయాన్ని వృథా చేయకుండా ఆన్లైన్లో పైథాన్ప్రోగామింగ్ నేర్చుకున్నాడు. యాప్ డెవలప్మెంట్పై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టు సాధించాడు.ఒకరోజు తన బామ్మకు కాల్ చేశాడు ఉదయ్. ‘కొద్దిసేపటి తరువాత నీకు ఫోన్ చేస్తాను’ అని ఫోన్ పెట్టేసింది బామ్మ. అంతవరకు వేచి చూసే ఓపిక లేని ఉదయ్ బుర్రలో ‘బామ్మ డిజిటల్ అవతార్’ను సృష్టించాలని, ఆ అవతార్‌తో ఏఐ ఉపయోగించి మాట్లాడాలనే ఐడియా తట్టింది. ఆ ఐడియాను సాకారం చేసుకున్నాడు. బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్.‘యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది.ఏఐ స్టార్టప్ ‘ఉరవ్’ మరో అడుగు ముందు వేశాడు. ఏఐ రిమోట్ టీచర్ మిస్ వాణి, ఏఐ పర్సనలైజ్డ్ మెడికల్ అండ్ క్లినికల్ అసిస్టెంట్ మెడ్ఆల్కా, ఏఐని ఉపయోగించి ఫొటో నుంచి 3డీ ఇమేజెస్ సృష్టించే మల్టీటాక్ అవతార్ ఏఐ సూట్... మొదలైనవి కంపెనీ ్రపాడక్ట్స్. తండ్రి డా.రవి కుమార్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తల్లి శ్రీకుమారి ఉదయ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్ శంకర్. -
ప్రేక్షకులు మరోసారి నిరూపించారు
‘‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ వంటి చిన్న సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు కట్టిపడేశావు అని ఆడియన్స్ అంటున్నారు. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. ఆ థ్రిల్, ఫీలింగ్ ఓటీటీలో చూస్తే రావు’’ అని చిత్ర దర్శకుడు గురు పవన్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నీఫర్ జంటగా నటించిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం విజయోత్సవంలో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘కంటెంట్ బాగుంటే చిన్న చిత్రమైనా ఆదరిస్తామని మా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సినిమా విడుదలైన అన్ని చోట్ల షోలు పెంచుతున్నారు’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో సినిమా తీశారనే మంచి పేరు వచ్చింది’’ అన్నారు అట్లూరి నారాయణ రావు. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్. -
‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ మూవీ రివ్యూ
టైటిల్: నచ్చింది గాళ్ ఫ్రెండూ నటీనటులు: ఉదయ్ శంకర్, జెన్నీఫర్ ఇమ్మానుయేల్, సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ నిర్మాణ సంస్థ:శ్రీరామ్ మూవీస్ నిర్మాత: అట్లూరి నారాయణ రావు దర్శకత్వం: గురు పవన్ సంగీతం: గిఫ్టన్ సినిమాటోగ్రఫర్:సిద్దం మనోహార్ ఎడిటర్: ఉడగండ్ల సాగర్ విడుదల తేది: నవంబర్ 11,2022 కథేంటంటే.. ఈ సినిమా కథంతా ఒకే రోజులో జరుగుతుంది. బీకామ్ చదివిన రాజా(ఉదయ్ శంకర్) జులాయిగా తిరుగతూ.. షేర్ మార్కెట్లో పెడ్డుబడులు పెడుతుంటాడు. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలలో శాండీ(జెన్నీఫర్ ఇమ్మానుయేల్) ఫోటో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. స్నేహితుడు చెర్రీ( మధునందన్) ఇంటర్వ్యూ కోసమని బైక్‌పై వెళ్తుంటే దారి మధ్యలో శాండీ కనిస్తుంది. ఆ రోజు శాండీ బర్త్‌డే. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేందుకు శాండీ వెళ్తుంటే.. ఓ అపరిచితుడి నుంచి ఆమె మొబైల్ ‘ఈ రోజు నువ్వు ఎవరితో మాట్లాడినా..వాళ్లు చనిపోతారు’ అనే సందేశం వస్తుంది. కానీ శాండీ దాన్ని జోక్‌గానే తీసుకుంటుంది. అయితే నిజంగానే శాండీ ఎవరితో మాట్లాడిన వారు హత్య చేయబడతారు. రాజా కూడా శాండీతో మాట్లాడతాడు. ప్రేమిస్తున్నానని చెబుతాడు. శాండీ కూడా రాజాని ప్రేమించినట్లు చేస్తుంది. కట్ చేస్తే..కాసేపటికే రాహుల్ అనే వ్యక్తి తన జీవితంలో ఉన్నాడని, త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతుంది. శాండీ ఎందుకలా చేసింది? ఆమె నేపథ్యం ఏంటి? శాండీకి సందేశం పంపిన ఆ అపరిచితుడు ఎవరు? ఆమెతో మాట్లాడిని వారిని ఎందుకు హత్య చేశారు? విక్రమ్ రాయ్ ఎవరు? కృష్ణ పాండే(శ్రీకాంత్ అయ్యంగార్) వల్ల ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆపదలో ఉన్న శాండీని రాజా ఎలా కాపాడాడు? చివరకు రాజా,శాండీ ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇది. సినిమాలో ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. దర్శకుడు గురు పవన్ ఓ లవ్‌స్టోరీని ఆన్ లైన్ ట్రేడింగ్‌తో ముడిపెట్టి కథను రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా రొటీన్ లవ్ సీన్స్‌తో సోసోగా సాగుతుంది. శాండీని రోడ్డుపై చూడడం.. ఆమె వెంటపడడం.. చివరకు రాజా ప్రేమలో శాండీ పడడం..ఇలా ప్రథమార్థం సింపుల్‌గా సాగుతుంది. కానీ అసలు ఆ మర్డర్లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలు ఆడియన్స్‌లో ఎంతో ఆసక్తిని రేకిస్తాయి. ఇంటర్వెల్ ముందు కాస్త సస్పెన్స్ వీడుతుంది. ఇక సెకండాఫ్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. షేర్ మార్కెట్ మోసాలు, మధ్య తరగతి వాళ్ల మీద ఉండే ప్రభావం తదితర అంశాలను టచ్ చేస్తూ సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్‌లో హీరో చెప్పే స్పీచ్ బాగుంటుంది. సెకండాఫ్ మాదిరే ఫస్టాఫ్ కూడా బలంగా ఉండి ఉండే సినిమా ఫలితం మరోలా ఉండేది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకి ‘నచ్చింది గాల్ ఫ్రెండూ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సినిమా అంతా ఉదయ్ శంకర్, జెన్నీఫర్ చుట్టే తిరుగుతుంటుంది. రాజా పాత్రకి ఉదయ్ శంకర్ న్యాయం చేశాడు. ఫస్టాఫ్‌లో లవర్ బాయ్‌గా కనిపిస్తూనే.. సెకండాఫ్‌లో తనలోని మాస్ యాంగిల్‌ని చూపించాడు. డైలాగ్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. శాండీగా జెన్నీఫర్ ఇమ్మానుయేల్ మెప్పించింది. ఆమెకిది తొలి సినిమా.అయినప్పటికీ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. మధు నందన్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. కృష్ణ పాండే పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒదిగిపోయాడు. తెరపై కనిపించేదే కాసేపే అయినా.. కథను మలుపు తిప్పే పాత్ర తనది. సుమన్, పృధ్వీరాజ్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. గిఫ్టన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సిద్దం మనోహార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వైజాగ్ అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ ఉడగండ్ల సాగర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచేప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. -
‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’లో ప్రత్యేకత ఇదే : నిర్మాత
ఉదయ్ శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ "నచ్చింది గాళ్ ఫ్రెండూ". జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మించారు. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు (ఈ నెల 11) ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అట్లూరి నారాయణరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►హీరో నారా రోహిత్ నాకు మంచి మిత్రుడు. నిర్మాతగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నప్పుడు ఆయనకు చెబితే ముందు డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఇన్వాల్వ్ అవడం ..బిజినెస్ తెలుకున్నాక ప్రొడ్యూసింగ్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అలా నారా రోహిత్ నటించిన సావిత్రి సినిమాను కొన్ని ఏరియాలు పంపిణీ చేశాం. తర్వాత శ్రీవిష్ణు హీరోగా నీదీ నాదీ ఒకే కథ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మా సంస్థకు కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రసంశలు అందించింది. ►ఉదయ్ శంకర్ నాన్న శ్రీరామ్ గారు మా గురువుగారు. ఉదయ్ నటించిన ఆటగదరా శివా, మిస్ మ్యాచ్, క్షణక్షణం వంటి చిత్రాలు చూశాక...ఆయన హీరోగా మంచి థ్రిల్లర్, హ్యూమర్ సినిమాలు చేయొచ్చు అనిపించింది. చెన్నైలో కొందరు దర్శకులు, రచయితలు చెప్పిన కథలు విన్నా అవి ఆకట్టుకోలేదు. గురుపవన్ తనకు చెప్పిన కథ గురించి ఉదయ్ మాతో డిస్కస్ చేశారు. ఆ కథ మేమూ విన్నాం. బాగా నచ్చడంతో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాం. ► ఉదయ్ కామెడీ బాగా డీల్ చేయగలడు. అందుకే ఈ చిత్రాన్ని కేవలం థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కాకుండా కామెడీ, రొమాన్స్ చేర్చాం. లవ్ స్టోరి అంటే కేవలం ఒక అబ్బాయి అమ్మాయి వెంట పడటం, బాధ్యత లేకుండా తిరగడం చూపిస్తుంటారు. ఈ సినిమా అలా ఉండదు. మన యువతకూ కొన్ని లక్ష్యాలు, బాధ్యతలు, దేశం పట్ల ప్రేమ ఉన్నాయని చెబుతున్నాం. అదే ఈ మూవీలో ప్రత్యేకత. ► ఉదయ్ రాజారాం పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మధునందన్ ఫ్రెండ్ రోల్ చేశాడు. ఈ మూడు పాత్రల మధ్యే మేజర్ సినిమా సాగుతుంది. ఇది రోడ్ జర్నీ మూవీ కాదు. కొన్ని సీన్స్ ఉంటాయి. సినిమా మేకింగ్ లో మేము ఎక్కడా ఇబ్బంది పడలేదు. సొంతంగా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ► దర్శకుడు గురుపవన్ కథ ఎలా చెప్పాడో అంతే బాగా తెరకెక్కించాడు. చెప్పిన షెడ్యూల్స్ చెప్పినట్లు కంప్లీట్ చేశాడు. ఒక టీమ్ లా అంతా కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. త్వరలో ఉదయ్ తో మరో సినిమా చేస్తున్నాం. అలాగే నారా రోహిత్ హీరోగా ఓ చిత్రాన్ని, ఓ పెద్ద హీరోతో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ నెక్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్తాయి. -
ఆ సీన్ కోసం తక్కువ తిన్నా: హీరోయిన్
ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా గురుపవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో జెన్నిఫర్ మాట్లాడుతూ – ‘‘నా స్వస్థలం ముంబై. ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ చేసిన తర్వాత జర్నలిజంలో డి΄÷్లమా కోర్సు చేశాను. ఆ తర్వాత యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. వెస్ట్రన్ డాన్సులతో ΄ాటు భరత నాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నాకు ‘బాయ్స్ విల్ బీ బాయ్స్’ అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే సినిమాటోగ్రాఫర్‌గా చేసిన మనోహర్‌గారు ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’కు నన్ను ప్రిఫర్ చేశారు. ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న సంధ్య అనే పాత్ర చేశాను. కొన్ని సన్నివేశాల కోసం బికినీ ధరించాను. అయితే దర్శకుడు నన్ను అందంగా చూపించారు కానీ అసభ్యంగా చూపించలేదు. అలాగే ఓ సీన్ కోసం రెండు రోజులు చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నాను. దర్శకులు గురు పవన్‌గారికి కథ పట్ల మంచి క్లారిటీ ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్, హీరోయిన్స్‌లో సమంత అంటే ఇష్టం’’ అని అన్నారు. -
‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ కాన్సెప్ట్ ఆసక్తిగా ఉంది: వెంకటేశ్
‘‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా ఆసక్తిగా ఉంది.. విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఈ మూవీతో ఉదయ్ శంకర్‌కి, యూనిట్‌కి మంచి విజయం రావాలి’’ అని హీరో వెంకటేష్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా మధునందన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. గురు పవన్ దర్శకుడు. అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని వెంకటేష్ రిలీజ్ చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఒక రోజు జరిగే కథే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్ ఉన్న మా సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్‌ఫుల్ కంటెంట్‌గా రూపొందిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు అట్లూరి నారాయణరావు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహార్, సంగీతం: గిఫ్టన్. -
'గర్ల్‌ఫ్రెండ్ నచ్చింది' అంటున్న యంగ్ హీరో
‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న తాజా త్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెన్నీఫర్ హీరోయిన్. డా. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. కాగా నేడు (జూలై 19) ఉదయ్ శంకర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం ఉదయ్ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ –‘‘చంద్ర సిద్ధార్థ్గారి దర్శకత్వంలో వ్చన ‘ఆటగదరా శివ’తో నా జర్నీ స్టార్ట్ అయ్యి బుధవారానికి (జులై 20) నాలుగేళ్లు పూర్తవుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు గురు పవన్ మంచి కమర్షియల్ ప్రేమ కథను సెలెక్ట్ చేసుకుని ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రపొందుతున్న వ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అట్లూరి నారాయణరావు. ‘‘సెప్టెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు గురు పవన్. సంగీత దర్శకుడు గిఫ్టన్ ఎలియాస్, సినివటోగ్రాఫర్ సిద్ధం మనోహర్, నటుడు సౌరవ్ మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ ముంద్రు. -
‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’అంటున్న ఉదయ్ శంకర్
గురు పవన్ దర్శకత్వంలో యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జెన్నీ హీరోయిన్గా నటిస్తుండగా, మధునందన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఈ మూవీ టైటిల్‌ని రివీల్ చేసింది చిత్రబృందం. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ ఓ పోస్టర్ని వదిలారు. అందులో హీరోయిన్ కు రోజ్ ఫ్లవర్ ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్న హీరోని వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు. ఈ పోస్టర్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే ఆసక్తి కలుగుతోంది. సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో చూపించబోతున్నారు. -
యూత్ ని ఆకట్టుకునేలా ఉదయ్ శంకర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్!
Uday Shankar New Movie First Look Poster: వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంసాదించుకున్నాడు యంగ్ హీరో ఉదయ్ శంకర్ . ఇప్పుడు ఆయన హీరోగా గురు పపవన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతుంది. కాగా, మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఉదయ్ శంకర్ యూత్‌ని ఆకట్టుకునేలా చాలా స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. మధునందన్ , హీరోయిన్ జన్నీ ఫర్ లుక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కమర్షియల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ప్రయోగాలు చేయాలంటే ధైర్యం కావాలి
‘‘ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ‘చావు కబురు చల్లగా’ చేస్తున్నప్పుడు అది ఎక్స్‌పీరియ¯Œ ్స చేశాను. ‘క్షణక్షణం’తో అలాంటి ధైర్యం చేసిన వర్లుగారిని, మౌళిగారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగుండటంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూష¯Œ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, జియా శర్మ జంటగా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షణ క్షణం’. డాక్టర్ వర్లు, మన్నం చంద్ర మౌళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ‘బన్నీ’ వాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఇష్టంతో కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి వస్తారు. నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సినిమాను ప్రేమించాను కాబట్టే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. వారసులకైనా మొదటి సినిమా వరకే అడ్వాంటేజ్.. ఆ తర్వాత వాళ్లు నిరూపించుకోవాల్సిందే’’ అన్నారు. ‘‘క్షణక్షణం’ ట్రైలర్ ఎంత బాగుందో, సినిమా కూడా అంతే బాగుంటుంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘క్షణక్షణం’లో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు కార్తీక్ మేడి కొండ. ‘‘హాలీవుడ్ నిర్మాత వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. అదే ప్యాష¯Œ ను ఉదయ్‌లో చూశా’’ అన్నారు డాక్టర్ వర్లు. జియా శర్మ, సంగీత దర్శకులు రోష¯Œ సాలూరి, రఘు కుంచె మాట్లాడారు. -
క్షణక్షణం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది
‘‘సస్పెన్స్, డార్క్ కామెడీ జానర్‌తో పాటు కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘క్షణక్షణం’ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కూడా ఉత్కంఠగా సాగుతుందని తెలిసింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా, జియా శర్మ హీరోయిన్గా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్షణక్షణం’. డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని మారుతి విడుదల చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘క్షణక్షణం’లో డార్క్ కామెడీ బాగా కుదిరింది. మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడంతో పాటు, మా టీమ్‌కి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్‌గా తీశాం. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది.. దీంతో ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు. మా సినిమా ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్ కానివ్వదు. సందర్భానికి తగ్గట్టు వచ్చే పాటలు సినిమా మూడ్‌ని మరింత ఎలివేట్ చేస్తాయి’’ అన్నారు కార్తీక్ మేడికొండ. శ్రుతీసింగ్, సంగీత దర్శకులు కోటి, రఘుకుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కె. సిద్ధార్థ్ రెడ్డి, సంగీతం: రోషన్ సాలూరి. -
ఫిక్కీ నూతన కార్యవర్గం
న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన కార్యవర్గం ఎంపికైంది. 2020–21 సంవత్సరానికి ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉదయ్ శంకర్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ, స్టార్ అండ్ డిస్నీ ఇండియాలకు ఏపీఏసీ అండ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈయనతో పాటు ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హిందుస్తాన్ యూనీలివర్ (హెచ్‌యూఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్‌గా ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లోస్ ఎండీ సుభ్రకాంత్ పాండా నియమితులయ్యారు. -
ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్
న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్ నియమితులయ్యారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఫిక్కీ తెలిపింది. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఉన్నారు. ఈ నెల 11–14 తేదీల్లో జరగనున్న ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో శంకర్ బాధ్యతలు చేపడతారని ఫెడరేషన్ తెలిపింది. ది వాల్ట్ డిస్నీ కంపెనీకి ఏషియా పసిఫిక్ ప్రెసిడెంట్‌గా, స్టార్ అండ్ డిస్నీ ఇండియాకు చైర్మన్‌గా ఉదయ్ శంకర్ ఉన్నారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగానికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్ కావటం ఫిక్కీ చరిత్రలోనే తొలిసారి. -
‘మిస్ మ్యాచ్’ సక్సెస్ మీట్
-
శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కాన్సెప్ట్, కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ, వంటి వారు డిఫరెంట్ సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రోత్సాహంతోనే ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. వీరిలానే నన్ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఉదయ్ శంకర్. ఎన్వీ నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా జి. శ్రీరామరాజు, భరత్ రామ్ నిర్మించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ– ‘‘డిసెంబరు 6న మూడు మ్యాచ్‌లు గెలిచాయి. ఒకటి దిశ ఘటనలో దోషులకు సరైన శిక్ష పడింది. రెండు... టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించింది. మూడు.. ‘మిస్‌మ్యాచ్’ చిత్రం విజయం సాధించింది. మా చిత్రంపై పాజిటివ్ మౌత్‌టాక్ నడుస్తోంది. మా సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ప్రతి రివ్యూలోనూ కంటెంట్, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా యని రాశారు. ఈ క్రెడిట్ కథ అందించిన భూపతిరాజాగారికి దక్కుతుంది. కథను చక్కగా తెరకెక్కించారు నిర్మల్ కుమార్’’ అన్నారు. ‘‘నేనీ వేదికపై ఉన్నానంటే కారణం జీవీజీ రాజుగారు. తెలుగులో నేను చేసిన స్ట్రయిట్ మూవీ ఇది. భూపతిరాజాగారు మంచి కథ అందించారు’’ అన్నారు నిర్మల్ కుమార్. ‘కుటుంబంతో సరదాగా చూసే చిత్రం ఇది. సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు శ్రీరామరాజు. ‘‘అమ్మాయి లక్ష్యం కోసం ఓ అబ్బాయి ప్రేమికుడిగా ఎంత తాపత్రయపడ్డాడు? అనే అంశం సినిమాలో ఒక హైలైట్ పాయింట్. రెండు కుటుంబాల కథ ఇది’’ అన్నారు భూపతిరాజా. నిర్మాత జీవీజీ రాజు, సంగీత దర్శకుడు గిఫ్టన్, కెమెరామేన్ గణేష్, ఎడిటర్ రాజా, రచయిత రాజేంద్రకుమార్ తదితరులు మాట్లాడారు. -
పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ 'మిస్ మ్యాచ్'
ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బేనర్‌పై జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా, శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్‌తో దూసుకపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ.. ‘ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉందిమంచి కథా బలం ఉన్న సినిమా. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు. ‘మా బేనర్ లో తొలి చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని వర్గాల ఆడియన్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజానికి అవసరమైన స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా. పూర్తిగా పాజిటివ్ కంటెంట్. కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా’ అని నిర్మాత శ్రీరామ్‌రాజు పేర్కొన్నారు. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..‘ఈ శుక్రవారం మూడు మ్యాచ్ లో గెలిచాం. ఒకటి 'దిశ నిందితుల ఎన్కౌంటర్, రెండు టీమ్ ఇండియా క్రికెట్ లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తొలిప్రేమ లోని ‘ఈ మనసే’ పాటకి థియేటర్ లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్ అందించిన గిఫ్టన్ గారికి థ్యాంక్స్’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు నిర్మల్ కుమార్, సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య, సంధ్య, వెంకట రామారావు, శ్రీ రామ్ బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘మిస్ మ్యాచ్’ మూవీ రివ్యూ -
‘మిస్ మ్యాచ్’మూవీ ఎలా ఉందంటే?
మూవీ: మిస్ మ్యాచ్ జానర్: లవ్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా నటీనటులు: ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్, ప్రదీప్ రావత్, సంజయ్ స్వరూప్, రేణుక, రూపాలక్ష్మి, భద్రం తదితరులు సంగీతం: గిఫ్టన్ ఇలియాస్ కథ: భూపతి రాజా దర్శకత్వం: నిర్మల్ కుమార్ నిర్మాతలు: జి. శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్ ‘ఆటగదరా శివ’ లాంటి డీసెంట్ హిట్ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్న యంగ్ హీరో ఉదయ్ శంకర్. మరోవైపు ‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్లో తళుక్కుమన్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ‘సలీం’ ఫేమ్ ఎన్వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఎన్నో అంచనాల మధ్య నేడు ‘మిస్ మ్యాచ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయిందా? టాలీవుడ్లో ఐశ్వర్య మరోసారి సత్తాచాటిందా? హీరోగా ఉదయ్ శంకర్ ద్వితీయ విఘ్నం దాటాడా? అనేది చూద్దాం. మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ చెప్పినట్టే భిన్న ధృవాల్లాంటి ఓ జంట ప్రేమకథకు అందమైన దృశ్యరూపమే ‘మిస్ మ్యాచ్’. ఏ కథలో చూసినా కులం, మతం, డబ్బు, పరువు వంటివి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. కానీ ఈ కథలో ప్రేమకు, పెళ్లికి ఆట అడ్డుగా నిలిచింది. కుస్తీ ఆటనే ప్రాణంగా భావించే హీరోయిన్ కుటుంబం.. క్లాస్ అండ్ డీసెంట్‌గా ఉండే హీరో ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాల సంఘర్షణ మధ్య హీరోహీరోయిన్లు వారి ప్రేమను దక్కించుకున్నారా? దంగల్ బ్యాచ్‌కు పొంగల్ బ్యాచ్‌కు మ్యాచ్ ఓకే అయిందా? లేక మిస్ మ్యాచ్ అయిందా? అనేదే సినిమా కథ. కథ: గోవింద్ రాజు(ప్రదీప్ రావత్)కు రెజ్లింగ్(కుస్తీ)అంటే ఇష్టం.. కాదు ప్రాణం. దేశానికి ఆడే అవకాశం తనకు రాకపోవడంతో తన కూతురు మహాలక్ష్మి(ఐశ్వర్యా రాజేశ్) ద్వారా తన కలను నెరవేర్చుకోవాలని నిరంతరం తపిస్తుంటాడు. మరోవైపు చిన్నప్పుట్నుంచి చదువు తప్ప మరో ధ్యాస లేకుండా పెరిగిన సిద్దార్థ్(ఉదయ్ శంకర్) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యూయేట్ పట్టా అందుకొని సొంతంగా ఎమ్ఎన్సీ కంపెనీ స్థాపిస్తాడు. అయితే అనుకోకుండా ఓ పోగ్రామ్‌లో భాగంగా హీరోహీరోయిన్లు కలుసుకుంటారు. వీరిద్దరి కలయిక కాస్త ప్రేమగా మారుతుంది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలిపి పెళ్లికి అంగీకరించేలా ఒప్పిస్తారు. అయితే సిద్దార్థ్ తండ్రి పెళ్లి జరగాలంటే మహాలక్ష్మి కుటుంబానికి ఓ కండీషన్ పెడతాడు. దీనికి మహాలక్ష్మి కుటుంబం రియాక్షన్ ఏంటి? ఆ షరతుకు మహాలక్ష్మి ఫ్యామిలీ ఒప్పుకుందా? ఇంతకీ ఆ కండీషన్ ఏంటి? ఆ తర్వాత జరిగిందేంటి? సిద్దార్థ్ మహాలక్ష్మిల ప్రేమ గెలిచిందా? రెండు కుటుంబాలు చివరికి వీరి పెళ్లికి అంగీకరించాయా? అనేదే మిస్ మ్యాచ్ కథ. నటీనటులు: ‘ఆటగదరా శివ’ తో నటుడిగా వందకు వంద మార్కులు సాధించిన ఉదయ్ శంకర్ ఈ సినిమాలో సిద్ధార్థ్గా జీవించాడు. నటనకు అత్యంత స్కోప్ ఉన్న ఈ సినిమాలో హీరోగా, తన హీరోయిజంతో ఉదయ్ శంకర్ మెప్పిస్తాడు. డ్యాన్స్, ఫైట్, ఎమోషన్‌తో నటుడిగా ఉదయ్ శంకర్ ఓ మెట్టు పైకెక్కాడు. ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో మాదిరిగానే ఈ సినిమాల కూడా మన పక్కింటి అమ్మాయిగా కౌసల్య కృష్ణమూర్తి కనిపిస్తుంది. క్రీడాకారిణిగా, తండ్రి ఆశయం కోసం కష్టపడే కూతురిగా, స్నేహితులతో కలిసి అల్లరి పిల్లగా, ప్రేమికురాలిగా, తన ప్రేమను దక్కించుకోవాడానికి తాపత్రయ పడే సగటు అమ్మాయిగా ఐశ్వర్యా, మహాలక్ష్మి పాత్రలో జీవించేసింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ స్క్రీన్‌పై కనిపించాడు ప్రదీప్ రావత్. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో కాకుండా హీరోయిన్ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. ఇక యధావిధిగా సంజయ్ స్వరూప్ హీరో తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక భద్రం, రేణుకతో పాటు హీరో ఫ్రెండ్స్‌గా నటించిన ఇద్దరు నటులు ఫస్టాఫ్‌లో తమ కామెడీతో అలరిస్తారు. మిగతా తారాగణం తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ‘సలీమ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన నిర్మల్ కుమార్ ‘మిస్ మ్యాచ్’తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఓ సున్నితమైన ప్రేమ కథా అంశాన్ని తీసుకొని అన్ని కమర్షియల్ అంశాలను జోడించి ప్రేక్షకులకు అందించడంలో డైరెక్టర్ తొలి ప్రయత్నంలోనే విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు. హీరోహీరోయిన్లతో పాటు వారి కుటుంబాల బ్యాగ్రౌండ్, సిద్ధార్థ్ మహాలక్ష్మిల ప్రేమ, ఆ తర్వాత గొడవలతో ఫస్టాఫ్ మొత్తం చకాచకా సాగిపోతుంది. అంతేకాకుండా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక మొదటి భాగంలో నెక్ట్స్ ఏంటి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించేలా దర్శకుడు చాలా చక్కగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్ చేశాడు. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి దర్శకుడు కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. అయితే ఎక్కడా కూడా ప్రేమ, ఎమోషన్స్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో సగటు ప్రేక్షకుడు క్లైమాక్స్ వరకు ఏం జరగబోతోందనే ఆసక్తిని కనబరుస్తాడు. ఇక సెకండాఫ్‌లో వచ్చే తొలిప్రేమలోని ‘ఈ మనసే..’ సాంగ్ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లేలా ఉంది. అయితే ఈ పాటను ఏమాత్రం చెడగొట్టకుండా సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్ అద్భుతంగా రీమిక్స్ చేశాడు. ఇక మిగతా పాటలు కూడా సినిమాకు కరెక్ట్ యాప్ట్ అయ్యేలా ఉన్నాయి. సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్బ్‌గా పాటలు రాశారు రచయితలు. మాటల రచయిత తమ ఫవర్ ఫుల్ డైలాగ్‌లతో పాటు, హార్ట్‌టచింగ్ మాటలను అందించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ‘రంగస్థలంలో చూసేవాడు, ఆడేవాడు, గెలిచేవాడు అనే ముగ్గురు మాత్రమే ఉంటారు. చివరికి గెలిచేవాడిదే సమస్తం’అంటూ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక స్టంట్ మాస్టర్ శక్తి శరవణన్ హీరోతో చాలా స్టైలీష్‌గా ఫైట్ చేయించాడు. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెడితే బాగుండేది. ఇక సినిమాకు తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ నటన ఫస్టాఫ్ ‘ఈ మనసే’ రీమిక్స్ సాంగ్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్ కొన్ని సాగదీత సీన్లు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
కథే హీరో అని నమ్ముతా
‘‘కథే హీరో అని నమ్మే వ్యక్తిని నేను. స్టోరీ బాగుంటేనే హీరోకి, సినిమాకు పేరు వస్తుంది. అందుకే నేను స్టోరీనే హీరోగా భావిస్తాను. ముందు కథ. తర్వాతే హీరో’’ అన్నారు ఉదయ్ శంకర్. నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా జి. శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్ నిర్మించిన ‘మిస్ మ్యాచ్’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. కానీ, చదువు పూర్తి చేసి, బెంగళూరులో డెంటిస్ట్‌గా చేస్తున్నప్పుడు ‘సినిమాల్లోకి వెళ్లడానికి ఇదే కరెక్ట్ టైమ్’ అనుకుని, వచ్చాను. ఈ హీరో కొత్తగా ప్రయత్నించాడు అనుకోవాలనే మొదటి సినిమాగా ‘ఆటగదరా శివ’ చేశాను. నా రెండో మూవీకి కథలు అనుకుంటున్న సమయంలో భూపతిరాజాగారు ‘మిస్ మ్యాచ్’ స్టోరీ లైన్ చెప్పారు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్లే సినిమాలో ‘మిస్ మ్యాచ్’. హీరో ఓ ఐటీ ఉద్యోగి. హీరోయిన్ రెజ్లర్. వీరిద్దరూ ప్రేమలో పడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? కుటుంబ సమస్యలను ఎలా పరిష్కరించారు? అన్నదే కథ ’’ అన్నారు. -
మిస్ మ్యాచ్ హిట్ అవుతుంది
ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎన్వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ చిత్రంలోని ‘ఈ మనసే...’ గీతాన్ని పవన్ కళ్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఉదయ్ శంకర్‌కు శుభాకాంక్షలు.. చిత్ర యూనిట్‌కు అభినందనలు’’ అన్నారు. ‘‘నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌గారు నటించిన ‘తొలిప్రేమ’ చిత్రంలోని ‘ఈ మనసే..’ పాటను ‘మిస్ మ్యాచ్’ లో నాపై చిత్రీకరించటం, దాన్ని ఆయన విడుదల చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది.. ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు’’ అన్నారు శ్రీరామ్. ‘‘ఈ సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి.. శ్రోతలకు నచ్చుతాయి’’ అన్నారు సంగీత దర్శకుడు గిఫ్టన్. ఈ చిత్రానికి కెమెరా: గణేష్ చంద్ర. -
టైటిల్ కొత్తగా ఉంది
‘‘మిస్ మ్యాచ్’ టైటిల్ కొత్తగానూ, ఆసక్తి కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన ‘సలీమ్’ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. అతను తెలుగులో తొలిసారి తీసిన ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుంది’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎన్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని ‘అరెరే అరెరే..’ అంటూ సాగే తొలి పాటని త్రివిక్రమ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అరెరే అరెరే..’ మెలోడి సాంగ్ వినాలనిపించేదిగా ఉంది. ‘మిస్ మ్యాచ్’ కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఉదయ్ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘ఆటగదరా శివ’కు త్రివిక్రమ్‌గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని పాటని విడుదల చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. మరో రెండు పాటలను విభిన్నంగా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీరామ్. ‘‘అరెరే అరెరే..’ మెలోడీ, రొమాంటిక్ సాంగ్. శ్రోతలకు త్వరగా నచ్చే పాట ఇది’’ అన్నారు డైరెక్టర్ ఎన్. వి.నిర్మల్. ‘‘సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి’’ అన్నారు సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్. ఈ చిత్రానికి కెమెరా: గణేష్ చంద్ర. -
మిస్ మ్యాచ్ పెద్ద విజయం సాధించాలి
ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎన్వి నిర్మల్ కుమార్ దర్శకత్వంలో శ్రీరామ్ రాజు, భరత్‌రామ్ నిర్మించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. డిసెంబరు 6న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ–‘‘మిస్ మ్యాచ్’ టైటిల్ అద్భుతంగా ఉంది. భూపతిరాజాగారు కథ అందిస్తే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తమిళంలో ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమా తీసిన నిర్మల్ కుమార్‌కు ఇది తెలుగులో తొలి సినిమా. ఉదయ్ బాగా నటించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలిని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేందర్‌రెడ్డిగారికి థ్యాంక్స్. భూపతిరాజాగారు ఇచ్చిన కథను నిర్మల్ కుమార్‌గారు చక్కగా తెరకెక్కించారు.‘తొలి ప్రేమ’ (1998) చిత్రంలోని ‘ఈ మనసే’ సాంగ్‌ను సింగిల్ షాట్లో పూర్తి చేశాం. ఐశ్యర్యా మంచి కోస్టార్’’ అని అన్నారు. ‘‘తెలుగులో ఇది నా తొలి సినిమా. ఉదయ్, ఐశ్వర్యల కెమిస్ట్రి బాగా కుదిరింది’’ అన్నారు నిర్మల్ కుమార్. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నిర్మల్ కుమార్ మా బ్యానర్లో తొలి సినిమా చేయడం çహ్యాపీ. తన క్రమశిక్షణతో యూనిట్ గౌరవాన్ని సంపాదించుకున్నారు ఉదయ్’’ అన్నారు శ్రీరామ్‌రాజు. ‘‘రెండు కుటుంబాల కథ ఇది’’ అన్నారు రచయిత భూపతి రాజా. డైలాగ్ రైటర్స్ రాజేంద్రకుమార్, మధుసూదన్, సంగీత దర్శకుడు గిఫ్టన్ మాట్లాడారు. -
ఇద్దరు గొడవపడితే ఒకరు గెలుస్తారు అదే..
‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఈజ్ ద రియల్ మ్యాచ్ అనేది ఉప శీర్షిక. ఎన్వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించాడు. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఉన్నాయి. తాజాగా ట్రైలర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ‘ఇద్దరు గొడవపడితే ఒకరు గెలుస్తారు.. అదే ఇద్దరు కాంప్రమైజ్ అయితే ఇద్దరూ గెలుస్తారు, ఆటకు గొడవకు తేడా తెలియన మనుషులు ఎంత చదువు కుంటే మాత్రం ఏం లాభం, నీ లైఫ్‌లో చివరి వరకు ఉండేది కుస్తీ మాత్రమే.. సిద్దూ ఉండడు’అంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ సినిమాలో కూడా క్రీడాకారిణిగా కనిపించనున్న ఐశ్వర్యా.. కుస్తీతో పాటు ప్రేమలోనే గెలవడానికి పడే సంఘర్షణ హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక సంజయ్‌స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు గిఫ్టన్ ఇలియాస్ సంగీతం అందిస్తున్నాడు. -
ఐశ్వర్యా రాజేష్ కొత్త సినిమా స్టిల్స్
-
రెండు కుటుంబాల కథ
‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. తమిళంలో విజయ్ ఆంటోని హీరోగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన ఎన్వి. నిర్మల్ కుమార్ ‘మిస్ మ్యాచ్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమాని డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ కథలో హీరోగా నటించే అవకాశం రావడం నా అదృష్టం. కథ, కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు. ‘‘రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. హీరోహీరోయిన్లు పోటీ పడి నటించారు’’ అన్నారు కథా రచయిత భూపతి రాజా. ‘‘సరికొత్త కథ, కథనాలతో రూపొందిన ‘మిస్ మ్యాచ్’ సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మల్ కుమార్. ‘‘ఒక మంచి కథని మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేశాను. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి’’ అని జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ అన్నారు. సంజయ్‌స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కెమెరా: గణేష్ చంద్ర. ∙ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేశ్ -
రెండు కుటుంబాల మధ్య మిస్ మ్యాచ్
‘‘మిస్ మ్యాచ్’ టీజర్ ఆసక్తిగా ఉంది. కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఉదయ్ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజాగారికి, డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్’’ అని హీరో వెంకటేష్ అన్నారు. ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా తమిళ చిత్రం ‘సలీం’ ఫేమ్ ఎన్.వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను వెంకటేష్ విడుదల చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘ఆటకదరా శివ’కు వెంకటేష్‌గారు చాలా సహకారం అందించారు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్’ టీజర్ ఆయన చేతుల మీదగా విడుదలవడం సంతోషంగా ఉంది. భూపతిరాజాగారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు ఎన్.వి.నిర్మల్. ‘‘ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు శ్రీరామ్. ‘‘రెండు కుటుంబాల మధ్య జరిగే కథే ‘మిస్ మ్యాచ్’’ అన్నారు రచయిత భూపతిరాజా. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కెమెరా: గణేష్ చంద్ర.