
‘ఆటగదరా శివ’ ఫేం ఉదయ్ శంకర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా ఓ సినిమా ప్రారంభమైంది. నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి తొలి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మిస్తోంది. తమిళనాట హీరో విజయ్ ఆంటోని హీరోగా సలీం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం ఈ రోజు (సోమవారం) హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియోలో ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్, జెమిని కిరణ్, శరత్ మరార్, ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్ధ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ముఖ్య అతిథులుగా హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కథా చిత్రమిదని దర్శకుడు ఎన్ వి.నిర్మల్ కుమార్ తెలిపారు. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలోను, విదేశాలలోను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment