![Miss Match Movie Press Meet - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/5/miss.jpg.webp?itok=_W0M5IeD)
ఉదయ్‌శంకర్
‘‘కథే హీరో అని నమ్మే వ్యక్తిని నేను. స్టోరీ బాగుంటేనే హీరోకి, సినిమాకు పేరు వస్తుంది. అందుకే నేను స్టోరీనే హీరోగా భావిస్తాను. ముందు కథ. తర్వాతే హీరో’’ అన్నారు ఉదయ్ శంకర్. నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా జి. శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్ నిర్మించిన ‘మిస్ మ్యాచ్’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి.
కానీ, చదువు పూర్తి చేసి, బెంగళూరులో డెంటిస్ట్‌గా చేస్తున్నప్పుడు ‘సినిమాల్లోకి వెళ్లడానికి ఇదే కరెక్ట్ టైమ్’ అనుకుని, వచ్చాను. ఈ హీరో కొత్తగా ప్రయత్నించాడు అనుకోవాలనే మొదటి సినిమాగా ‘ఆటగదరా శివ’ చేశాను. నా రెండో మూవీకి కథలు అనుకుంటున్న సమయంలో భూపతిరాజాగారు ‘మిస్ మ్యాచ్’ స్టోరీ లైన్ చెప్పారు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్లే సినిమాలో ‘మిస్ మ్యాచ్’. హీరో ఓ ఐటీ ఉద్యోగి. హీరోయిన్ రెజ్లర్. వీరిద్దరూ ప్రేమలో పడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? కుటుంబ సమస్యలను ఎలా పరిష్కరించారు? అన్నదే కథ ’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment