Kanaa Movie
-
అలా అనుకోకపోతే పేరు మార్చుకుంటా
‘‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చూసి బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా సరే.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ‘రాజేంద్రప్రసాద్ మా నాన్నగారు అయ్యుంటే బాగుండు’ అనుకోకపోతే నా పేరు మార్చుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఐశ్వర్యారాజేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కనా’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యారాజేశ్తోనే ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించారు. దిబు నినన్ థామస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అభిరుచి ఉన్న నిర్మాత ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. అభిరుచికి, డబ్బుకి సంబంధం లేదు. రామారావుగారు ఇప్పటికీ, ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ గొప్ప కథ. ఈ సినిమాలో కామెడీ, తండ్రీ కూతుళ్ల బంధం ఉంటుంది. భీమనేని శ్రీను నా నుంచి చాలా సున్నితమైన నటన రాబట్టుకున్నాడు’’ అన్నారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం టీజర్ చూశాను.. వాస్తవానికి దగ్గరగా ఉంది. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. తల్లిదండ్రులతో అమ్మాయిల రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? అమ్మాయిల కలలకు తల్లిదండ్రులు ఎలా సపోర్టివ్‌గా నిలిచారు? అనే అంశాలను సినిమాలో చర్చించారు. ఇలాంటి చిత్రాల వల్ల ఉమెన్ క్రికెట్‌ను ప్రోత్సహించాలన్న విషయం మరింత మందికి చేరువ అవుతుంది. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనకు ఈ సినిమా దోహదం చేస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘మా రామారావు అన్నయ్య రీమేక్ చేసిన సినిమాలన్నీ హిట్లు, రికార్డులు బద్దలు కొట్టాయి. చిరంజీవిగారివంటి ఎందరో పెద్ద స్టార్స్‌తో సినిమాలు తీసినా, ఆయన తీసిన చిన్న సినిమాలే సెన్సేషన్ హిట్లు.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు తీసుకొచ్చాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆయన కొడుకు వల్లభ సక్సెస్‌కి నాంది అవుతుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘ఐశ్వర్య నటిస్తోందనిపించదు.. నటన ఆమెకు నల్లేరు మీద నడకలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారు, ఐశ్వర్య పోటీపడి మరీ నటించారు. రామానాయుడుగారిలాంటి టాప్ 10 నిర్మాతల్లో రామారావుగారు ఒకరు’’ అన్నారు. ఐశ్వర్యారాజేష్ మాట్లాడుతూ – ‘‘కనా’ నా జీవితాన్ని మార్చింది. తెలుగులో నా తొలి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’ కావడం అదృష్టం. రామారావుగారి ప్రొడక్షన్లో నా తొలి సినిమా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా హక్కులు నాకు కావాలని ఐశ్వర్యను అడిగితే ఇప్పించింది. సావిత్రిగారు, శారదగారు.. ఇప్పుడు కీర్తీ సురేశ్, సమంత బాగా నటిస్తారు. వారికి ఏ మాత్రం తీసిపోకుండా నటించగలదు ఐశ్వర్య’’ అన్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ పి.రామ్మోహన్రావు, నిర్మాతలు పోకూరి బాబూరావు, కె. అశోక్ కుమార్, జి.విజయ రాజు, కార్తీక్ రాజు, నటుడు మహేశ్, డైరెక్టర్ క్రాంతిమాధవ్, ‘కనా’ చిత్ర దర్శకుడు, కథా రచయిత అరుణ్ రాజా కామరాజు, కెమెరామెన్ ఆండ్రూ, సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
అదే అంకిత భావంతో ఉన్నా
‘‘యాభై ఏళ్ల క్రితం నా మూవీ మేకింగ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అలాగే పని జరగనప్పుడు వచ్చే కోపం కూడా అలానే ఉంది. కానీ పని విషయంలో మాత్రం అంకిత భావం తగ్గలేదు. టెక్నికల్‌గా చాలా అడ్వాన్డ్స్ స్టేజ్‌కి వచ్చాం. సినిమా క్వాలిటీ పెరగడంతో మంచి సినిమాలు రావడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. తమిళంలో రూపొందిన ‘కనా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ కమర్షియల్‌పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేఎస్. రామారావు చెప్పిన విశేషాలు. ► మా బ్యానర్లో రాబోతున్న మంచి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళంలో విడుదలైన ‘కనా’ సినిమాను చూశాను. ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశాం. తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మంచి ఎమోషనల్ స్టోరీ. క్రికెట్ బేస్‌తో పాటు కంటెంట్ ఉన్న స్టోరీ. ఈ చిత్రం క్రికెట్ అభిమానులతోపాటు యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు భీమనేని తెరకెక్కించారు. ► ఒక సాధారణ రైతుబిడ్డగా పుట్టి ఇండియా క్రికెట్ టీమ్‌లో ఆడాలని కష్టపడే ఓ యువతి పాత్రలో ఐశ్వర్య నటించింది. ప్యారలల్‌గా రైతుసమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి అమర్నాథ్ సీనియర్ హీరో. మన కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు తను. వీరిద్దరి వారసత్వ నటన ఐశ్వర్యకు వచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన పాత్ర చేశారు. శివ కార్తికేయన్, ‘వెన్నెల’ కిశోర్, కార్తీక్‌రాజు క్యారెక్టర్స్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. జూలై 2న ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను జరపబోతున్నాం. ఈ కార్యక్రమానికి విమెన్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా చేసిన మిథాలీరాజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. ► పెద్దసినిమాలు చేస్తున్నప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటానో ‘పుణ్యస్త్రీ, మాతృదేవోభవ, ముత్యమంత ముద్దు’ తీస్తున్నప్పుడూ అంతే సంతృప్తిగా ఫీలవుతాను. ఇవన్నీ కూడా సినిమాలపై ఇంకోవైపు నాకున్న ఇంట్రెస్ట్‌ను తెలియజేసే చిత్రాలు..‘కౌసల్య కృష్ణమూర్తి’ కూడా అలాంటిదే. -
అందరూ కనెక్ట్ అవుతారు
‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘కణా’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దర్శకునిగా భీమనేని శ్రీనివాసరావు అయితే కరెక్ట్ అనిపించింది. తనను సంప్రదించగానే ఇష్టంతో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చేశాడు’’ అని చిత్ర సమర్పకులు కేయస్ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేశ్ టైటిల్ రోల్లో, రాజేంద్రప్రసాద్, కార్తీక్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని భీమనేని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘అందరూ కనెక్ట్ అయ్యే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్గార్ల టైమ్‌లో ‘అమరసందేశం’ వంటి మంచిసినిమాలో హీరోగా నటించిన దివంగత హీరో అమర్నాథ్ మనవరాలు, హీరో రాజేశ్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం అవుతున్నారు. తను చాలా మంచి నటి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్ వస్తోంది. తనతో మరో సినిమా కూడా చేయబోతున్నా. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావస్తోంది. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథలు కోరుకుంటారు. అలాంటి వాటికోసం వెతుకుతున్న టైమ్‌లో ‘కణా’ సినిమా చూశా. ఈ చిత్రం తెలుగు రీమేక్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటే నా వరకూ వస్తుందా? అనుకున్నా. ఓ రోజు రామారావుగారు ఫోన్ చేసి ‘కణ’ రీమేక్ హక్కులు కొన్నాను, మనం చేద్దామనగానే చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఆయన్ని కలిసి ‘ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం సార్ చేద్దా’మన్నాను. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి క్రికెట్ నేర్చుకుని, అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించింది? అన్నదే చిత్రకథ. ఇందులో తండ్రి, కూతురు మధ్య మంచి ఎమోషన్స్ ఉంటాయి. కథానాయిక తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు నటించారు. తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యారాజేష్ ఇతర భాషల్లో నటిగా నిరూపించుకుని మా సినిమాతో తెలుగుకి పరిచయం అవుతున్నారు. తనలో చాలా ప్రతిభ ఉంది. ఎమోషనల్ సీ¯Œ ్స తీస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా గ్లిజరిన్ వాడలేదు. తను పిలిస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి’’ అన్నారు. కెమెరామెన్ ఆండ్రూ, ఆర్ట్ డైరెక్టర్ శివ శ్రీరాములు పాల్గొన్నారు. -
అవునా! నిజమేనా?
మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి చాలా ముఖ్యమైనవి, విశేషం అయినవి. వీటిలో ఏది జరగాలన్నా కాలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక సెలబ్రిటీల విషయం ఈ రెండు అంశాలకు మీడియా ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా కథానాయికల ప్రేమ, పెళ్లి విషయాల గురించి ఏ మాత్రం ఉప్పు అందినా, ఆ విషయానికి ప్రాముఖ్యత నిస్తారు. తాజగా నటి ఐశ్వర్యారాజేశ్కు కల్యాణ గడియలు దగ్గర పడ్డాయనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు మోసేస్తున్నాయి. పదహారణాల తెలుగమ్మాయి ఐశ్వర్యారాజేశ్. తన తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నటిగా రంగప్రవేశం చేశారు. అయితే మొదట్లో ఈ అమ్మడికి హీరోయిన్గా మంచి అవకాశాలు రాకపోయినా, నటిగా తనేమిటో నిరూపించుకోవడంపైనే ఐశ్వర్యారాజేశ్ దృష్టి పెట్టారు. సరిగ్గా అలాంటి అవకాశమే కాక్కముట్టై చిత్రంలో వరించింది. అందులో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో ఏ హీరోయిన్ చేయనటువంటి సాహసం చేసి నటించారు ఐశ్వర్య. కథానాయకిగా రాణిస్తున్నా, ఇప్పటికి ఆమె కాక్క ముట్టై ఐశ్వర్యారాజేశ్ అనే ముద్ర నుంచి బయటపడలేదు. ఇటీవల కనా చిత్రంలో హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో నటించి విమర్శకులను సైతం మెప్పించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరోయిన్గా ఐశ్వర్యారాజేశ్ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మాతృభాషలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఆమెకు సంబంధించి ఇక వార్త సామాజిక మాధ్యమల్లో వైరల్ అవుతోంది. అదే త్వరలో పీపీపీ డుండుండుంకు రెడీ అవుతోందన్న వార్త. ప్రస్తుతం ఐశ్వర్య వయసు 29 ఏళ్లు. దీంతో పెళ్లికి తయారవుతోందనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఒక నటుడి ప్రేమలో ఉన్నారని, ఇటీవల ఒక చిత్రంలో తమ్ముడిగా ముఖ్యపాత్రలో నటించిన ఆ నటుడితో ఐశ్వర్యారాజేశ్ ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారన్న టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇందులో నిజం ఎంత ఉందన్నది తెలియాలంటే ఐశ్యర్యారాజేశ్ స్పందించాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఈ ప్రేమ,పెళ్లి ప్రచారానికి తను ఎలా రెస్పాండ్ అవుతారో. -
క్రీడల నేపథ్యంలో మరో సినిమా..!
‘ఆటగదరా శివ’ ఫేం ఉదయ్ శంకర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా ఓ సినిమా ప్రారంభమైంది. నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి తొలి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మిస్తోంది. తమిళనాట హీరో విజయ్ ఆంటోని హీరోగా సలీం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు (సోమవారం) హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియోలో ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్, జెమిని కిరణ్, శరత్ మరార్, ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్ధ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ముఖ్య అతిథులుగా హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కథా చిత్రమిదని దర్శకుడు ఎన్ వి.నిర్మల్ కుమార్ తెలిపారు. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలోను, విదేశాలలోను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. -
దంగల్‌లా హిట్టవ్వాలి!
కోలీవుడ్ మూవీ కనా హిందీ చిత్రం దంగల్‌లా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు నటుడు సత్యరాజ్ అన్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ఏ చిత్రం చూసినా సత్యరాజ్ కనిపిస్తున్నారు. కథకు బలాన్ని చేకూర్చే పాత్రల్లో నటిస్తున్న సత్యరాజ్ తాజాగా కనా చిత్రంలో కీలక పాత్రను పోషించారు. నటుడు శివకార్తికేయన్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యరాజేశ్ కథానాయకిగా నటించింది. మరో ముఖ్య పాత్రలో శివకార్తికేయన్ నటించిన ఈ చిత్రానికి అరుణ్రాజా కామరాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమా మహిళా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఉంటుంది. కనా చిత్రం ఈ నెల 21న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ చిత్రం బాగుంటే ప్రేక్షకులే విజయతీరాలకు చేరుస్తారన్నారు. క్రికెట్ గురించి తెలియకపోయినా నటి ఐశ్వర్యరాజేశ్ అందులో శిక్షణ తీసుకుని నటించడం సవాల్‌తో కూడిన విషయం అన్నారు. అందుకు ఆమె చాలా శ్రమించారని అన్నారు. క్రీడా నేపథ్యంతో కూడిన చిత్రాలు ఏ భాషలోనైనా విజయం సాధిస్తాయని, అలా ఈ కనా చిత్రం హిందీ చిత్రం దంగల్‌లా విజయం సాధించాలని కోరుకుంటున్నానని సత్యరాజ్ అన్నారు. ఆయన్ని తండ్రి స్థానంలో చూస్తున్నా.. చిత్ర కథానాయకి ఐశ్వర్యరాజేశ్ మాట్లాడుతూ అందరూ చెప్పినట్లు ప్రతి చిత్రానికి కఠినంగా శ్రమించాలనే కోరుకుంటానని అంది. అలా ఈ చిత్రంలో తాను శ్రమించి నటించడానికి దర్శకుడు అరుణ్రాజా కామరాజా, ఇతర యూనిట్ సహకారం అందించి ప్రోత్సహించారన్నారు. తన తండ్రి ఉండి ఉంటే నటుడు సత్యరాజ్ లాగే ప్రోత్సహించేవారని, అందుకే సత్యరాజ్‌ను తన తండ్రి స్థానంలో చూసుకుంటున్నానని పేర్కొంది. చిత్ర హీరో దర్శన్ అందరికీ నచ్చే నటుడిగా ఎదుగుతారని కితాబిచ్చింది. కనా చిత్రం కోలీవుడ్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని ఐశ్వర్యరాజేశ్ వ్యక్తం చేసింది. -
‘గెలిస్తేనే.. నీ గొంతు వినబడుతుంది’
కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివ కార్తికేయన్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘కనా’. మహిళా క్రికెటర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అరున్ రాజ కామరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఓ గ్రామిణా ప్రాంతంలో పెరిగిన అమ్మాయి జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎలా ఎదిగింది. ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.