‘గెలిస్తేనే.. నీ గొంతు వినబడుతుంది’ | Kollywood Hero Sivakarthikeyan Production Kanaa Trailer | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 25 2018 11:42 AM | Last Updated on Sun, Nov 25 2018 2:37 PM

Kollywood Hero Sivakarthikeyan Production Kanaa Trailer - Sakshi

కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివ కార్తికేయన్‌ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘కనా’. మహిళా క్రికెటర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అరున్‌ రాజ కామరాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఐశ్వర్యా రాజేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.

ఓ గ్రామిణా ప్రాంతంలో పెరిగిన అమ్మాయి జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎలా ఎదిగింది. ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement