దంగల్‌లా హిట్టవ్వాలి! | Sivakarthikeyan Debut Production Venture Kanaa Pressmeet | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 16 2018 10:43 AM | Last Updated on Sun, Dec 16 2018 10:43 AM

Sivakarthikeyan Debut Production Venture Kanaa Pressmeet - Sakshi

కోలీవుడ్‌ మూవీ కనా హిందీ చిత్రం దంగల్‌లా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు నటుడు సత్యరాజ్‌ అన్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ఏ చిత్రం చూసినా సత్యరాజ్‌ కనిపిస్తున్నారు. కథకు బలాన్ని చేకూర్చే పాత్రల్లో నటిస్తున్న సత్యరాజ్‌ తాజాగా కనా చిత్రంలో కీలక పాత్రను పోషించారు. నటుడు శివకార్తికేయన్‌ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యరాజేశ్‌ కథానాయకిగా నటించింది. మరో ముఖ్య పాత్రలో శివకార్తికేయన్‌ నటించిన ఈ చిత్రానికి అరుణ్‌రాజా కామరాజా దర్శకత్వం వహించారు.

ఈ సినిమా మహిళా క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కింది. వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఉంటుంది. కనా చిత్రం ఈ నెల 21న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సత్యరాజ్‌ మాట్లాడుతూ చిత్రం బాగుంటే ప్రేక్షకులే విజయతీరాలకు చేరుస్తారన్నారు.

క్రికెట్‌ గురించి తెలియకపోయినా నటి ఐశ్వర్యరాజేశ్‌ అందులో శిక్షణ తీసుకుని నటించడం సవాల్‌తో కూడిన విషయం అన్నారు. అందుకు ఆమె చాలా శ్రమించారని అన్నారు. క్రీడా నేపథ్యంతో కూడిన చిత్రాలు ఏ భాషలోనైనా విజయం సాధిస్తాయని, అలా ఈ కనా చిత్రం హిందీ చిత్రం దంగల్‌లా విజయం సాధించాలని కోరుకుంటున్నానని సత్యరాజ్‌ అన్నారు.

ఆయన్ని తండ్రి స్థానంలో చూస్తున్నా..
చిత్ర కథానాయకి ఐశ్వర్యరాజేశ్‌ మాట్లాడుతూ అందరూ చెప్పినట్లు ప్రతి చిత్రానికి కఠినంగా శ్రమించాలనే కోరుకుంటానని అంది. అలా ఈ చిత్రంలో తాను శ్రమించి నటించడానికి దర్శకుడు అరుణ్‌రాజా కామరాజా, ఇతర యూనిట్‌ సహకారం అందించి ప్రోత్సహించారన్నారు. తన తండ్రి ఉండి ఉంటే నటుడు సత్యరాజ్‌ లాగే ప్రోత్సహించేవారని, అందుకే సత్యరాజ్‌ను తన తండ్రి స్థానంలో చూసుకుంటున్నానని పేర్కొంది. చిత్ర హీరో దర్శన్‌ అందరికీ నచ్చే నటుడిగా ఎదుగుతారని కితాబిచ్చింది. కనా చిత్రం కోలీవుడ్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని ఐశ్వర్యరాజేశ్‌ వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement