జెన్నిఫర్, వెంకటేష్, ఉదయ్ శంకర్
‘‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా ఆసక్తిగా ఉంది.. విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఈ మూవీతో ఉదయ్ శంకర్‌కి, యూనిట్‌కి మంచి విజయం రావాలి’’ అని హీరో వెంకటేష్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా మధునందన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. గురు పవన్ దర్శకుడు.
అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని వెంకటేష్ రిలీజ్ చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఒక రోజు జరిగే కథే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్ ఉన్న మా సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్‌ఫుల్ కంటెంట్‌గా రూపొందిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు అట్లూరి నారాయణరావు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహార్, సంగీతం: గిఫ్టన్.
Comments
Please login to add a commentAdd a comment