ప్రేక్షకులు మరోసారి నిరూపించారు | Nachindi Girl Friendu Telugu Movie Success Meet | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు మరోసారి నిరూపించారు

Nov 14 2022 1:19 AM | Updated on Nov 14 2022 1:19 AM

Nachindi Girl Friendu Telugu Movie Success Meet - Sakshi

జెన్నీఫర్‌, ఉదయ్‌ శంకర్

‘‘నచ్చింది గాళ్‌ ఫ్రెండూ’ వంటి చిన్న సినిమాను పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు కట్టిపడేశావు అని ఆడియన్స్‌ అంటున్నారు. థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాల్సిన మూవీ ఇది. ఆ థ్రిల్, ఫీలింగ్‌ ఓటీటీలో చూస్తే రావు’’ అని చిత్ర దర్శకుడు గురు పవన్  అన్నారు. ఉదయ్‌ శంకర్, జెన్నీఫర్‌ జంటగా నటించిన చిత్రం ‘నచ్చింది గాళ్‌ ఫ్రెండూ’.

అట్లూరి ఆర్‌. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం విజయోత్సవంలో ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘కంటెంట్‌ బాగుంటే చిన్న చిత్రమైనా ఆదరిస్తామని మా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సినిమా విడుదలైన అన్ని చోట్ల  షోలు పెంచుతున్నారు’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో సినిమా తీశారనే మంచి పేరు వచ్చింది’’ అన్నారు అట్లూరి నారాయణ రావు. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement