sucess meet
-
ప్రేక్షకుల వల్లే అది సాధ్యమైంది
‘‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదల రోజే ఓ పెద్ద హిందీ సినిమా(జవాన్) రిలీజ్ అవుతోందని తెలినప్పుడు ఆందోళన చెందాం. కానీ ఈ నెల 7 నుంచి మొదలైన ప్రీమియర్స్ నుంచి ఇప్పటి వరకూ మా సినిమాకు మంచి స్పందన లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల మౌత్‌టాక్‌తోనే ఇది సాధ్య మైంది.. మాకు పెద్ద హిట్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సినిమా విజయోత్సవంలో నవీన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను అందరికంటే ముందు చూసిన చిరంజీవిగారు హిట్ అవుతుందన్నారు.. ఆయన మాటే నిజం అయింది’’ అన్నారు. ‘‘నాకు వచ్చిన ఓ ఐడియాను నవీన్ , అనుష్కలతో పాటు నిర్మాతలు నమ్మకుంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు’’ అన్నారు పి.మహేశ్‌బాబు. దర్శకులు మారుతి, నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్‌ఎకేఎన్ మాట్లాడారు. -
వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి
‘‘సినిమా అభిమానులంటే ఒక రకమైన దురభిప్రాయం ఉన్నటువంటి సమయం నుంచి నేను ఈ పరిశ్రమను చూస్తున్నాను. ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టుకోవడం, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరోని తిట్టుకోవడం... ఈ క్రమంలో చదువులపై అశ్రద్ధ వహించి, జీవితంలో పైకి రావాలనే తపన లేకుండా ఉంటారని.. ఇలా సమాజంలో అభిమానుల గురించి దురభిప్రాయం ఉండేది. అలాంటివి నా చెవిన పడ్డాయి. అలాంటి సమయంలో నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నాకంటూ అభిమానులు ఏర్పడితే.. నా అభిమానులను చూసి, సమాజం గర్వపడేలా వారిని తీర్చిదిద్దాలని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి మంచి సామాజిక కార్యక్రమాలు చేశాను. నా పిలుపు మేరకు వచ్చిన నా అభిమానుల గురించి వారి తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా మాట్లాడటం చూస్తుంటే.. నా అభిమానులను చూసి నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది’’ అన్నారు చిరంజీవి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. మాస్మూవీ మేకర్స్ పతాకంపై సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘బేబీ’విజయోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పాత తరంతోనే ఇండస్ట్రీ ఉంటే అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి. అప్పుడే మన పరిశ్రమ నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటుంది. రాజమౌళివంటి దిగ్గజ దర్శకులు ఉన్నారు కాబట్టే మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి వెళ్తున్నాయి. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. వాళ్లను యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకుని కొత్త కంటెంట్‌తో రాగలిగితే అంతకుమించిన ప్రత్యుపకారం ఇండస్ట్రీకి మరొకటి ఉండదు. ఎస్కేఎన్ , సాయి రాజేష్, మారుతి.. ఇలా నా అభిమానులను చూస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలుగుతుంది. నా అభిమానులు చేసిన ‘బేబి’ ప్రయత్నం ప్రజాశీస్సులు పొంది, ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ ఆనందంలో భాగం కావాలనే నేను ఇక్కడికి వచ్చాను. ‘బేబి’ ఎడ్యుకేషనల్ ఫిల్మ్‌లా అనిపించింది. చాలామంది యువత సోషల్ మీడియా ఆకర్షణలో పడిపోయి, సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అవుతున్నారు. యువతే కాదు..వారి తల్లిదండ్రులు కూడా ఈ మూవీని చూసి, ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాకు, ఆయన మా సినిమా సక్సెస్మీట్కు రావడం సంతోషంగా ఉంది’’ అని ‘బేబి’ చిత్రయూనిట్ పేర్కొంది. -
ప్రేక్షకులు మరోసారి నిరూపించారు
‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్ , సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. డా బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్కు అతిథిగా హాజరైన దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ప్రజల జీవన విధానాలను, వారి ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని కథ సిద్ధం చేసుకుంటే సక్సెస్ వస్తుందని ప్రేక్షకులు మరోసారి నిరూపించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘ఇలాంటి కథలు మన జీవితాలను ప్రపంచానికి తెలియజేస్తాయి’’ అన్నారు ‘బలగం’ ఫేమ్ సుధాకర్‌రెడ్డి. ‘‘‘బలగం’ తరహాలోనే ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా మంచి విజయం సాధించింది’’ అన్నారు తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు. ‘‘నేటివిటీతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ఈ సినిమాపై మాకు ఉన్న నమ్మకం వమ్ము కాలేదు’’ అన్నారు నిర్మాతలు. -
ఆ ప్రయత్నంలో విజయం సాధించాం
‘‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారు. అందుకే ఈ ప్రెస్‌మీట్‌ని రామకోటి ఉత్సవం అని పిలిచాం. రామ నామాన్ని ప్రతి గడపకు చేర్చాలన్నదే యూనిట్ ఆలోచన. ఆ ప్రయత్నంలో విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల అన్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతీసనన్ సీత పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ‘రామ జయం, రఘురామ జయం’ పేరుతో నిర్వహించిన సక్సెస్ మీట్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆదిపురుష్’ చిత్రాన్ని నైజాంలో దాదాపు 500 స్క్రీ¯Œ ్సకి పైగా రిలీజ్ చేశాం. తొలి రోజు నైజాంలో 13.65 కోట్లు, రెండో రోజు దాదాపు 8 కోట్లు వసూళ్లు వచ్చాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత భీమ్ శ్రీనివాస్ మాట్లాడారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇల్లు కట్టుకుంటా: 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని
బీచ్‌రోడ్డు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు కట్టుకుంటా.. తెలుగు భాష నేర్చుకుంటానని హీరో విజయ్ ఆంటోనీ అన్నారు. బిచ్చగాడు–2 సినిమా సక్సెస్ మీట్‌ను శనివారం బీచ్‌రోడ్డులో నిర్వహించారు. బిచ్చగాడు, బిచ్చగాడు–2 సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. భవిష్యత్తులో తన చిత్రాల షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లో జరుపుతామన్నారు. త్వరలోనే బిచ్చగాడు–3 కూడా తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ఈ చిత్రం 2026లో విడుదలవుతుందన్నారు. ఈ సందర్భంగా బిచ్చగాడు 2లోని చెల్లి చెల్లి పాట పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ బిచ్చగాడుని మించి బిచ్చగాడు–2 విజయవంతం అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు సినిమాలు తెలుగులో సూపర్ హిట్లు కావడం ఆనందంగా ఉందన్నారు. డిస్ట్రిబ్యూటర్ సురేష్ మాట్లాడుతూ బిచ్చగాడు–2 సినిమా తమిళంలో కన్నా తెలుగులోనే బాగా విజయవంతం అయ్యిందన్నారు. ఆంధ్రాలోనే అతి పెద్ద థియేటర్ అయిన జగదాంబలో బిచ్చగాడు–2 సినిమా హౌస్‌ఫుల్‌గా నడుస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పూర్వీ పిక్చర్స్ ద్వారా విడుదలైందని తెలిపారు. కథ బాగుంటే హీరో ఎవరైనా సరే సినిమా హిట్ అవుతుందనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ అధినేత వి.జగదీష్, మేనేజర్ రాజు, పూర్వీ పిక్చర్స్ అధినేత నాయుడు తదితరులు పాల్గొన్నారు. 2026లో బిచ్చగాడు 3 -
వర్షం సినిమా చూశాక అమ్మలో సంతోషం.. మళ్లీ ఇప్పుడా పరిస్థితి
‘‘అన్నీ మంచి శకునములే’ కుటుంబమంతా కూర్చొని చూసే సినిమా. ఇంకా చూడనివారు థియేటర్స్‌కి వెళ్లి చూడండి. మా బ్యానర్లో ఇంతకుముందు వచ్చిన చిత్రాల్లానే ‘అన్నీ మంచి శకునములే’ వంటి ఓ మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది’’ అని నిర్మాత ప్రియాంకా దత్ అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత ట్రెండ్‌లోనూ ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. మా బ్యానర్లో నటించిన ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ మంచి స్టార్స్ అయ్యారు.. అలాగే సంతోష్‌కి కూడా ఆ రేంజ్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా అంటే కేవలం మాస్ కాదు.. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘20 ఏళ్ల క్రితం నాన్నగారు (డైరెక్టర్ సంతోష్) తీసిన ‘వర్షం’ సినిమా చూశాక మా అమ్మలో సంతోషం చూశాను. ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ మా అమ్మలో అదే ఆనందం తీసుకువచ్చింది’’ అన్నారు సంతోష్ శోభన్ . -
ముగ్గురు మావయ్యల పేర్లు చెప్పగానే దద్దరిల్లిన ఆడిటోరియం..
-
గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనగానే సంయుక్త రియాక్షన్ చూడండి..
-
'దసరా' డైరెక్టర్‌కు 'బీఎండబ్లూ' కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా దసరా. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది.పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తాచాటుతుంది. ఇక దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే శ్రీకాంత్ ఓదెల సూపర్ సక్సెస్ అయ్యారు. గతంలో రంగస్థలం సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ గతంలో పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు చేసినా కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు దసరాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందడంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఖరీదైన ‘బీఎమ్‌డబ్లూ’ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. కరీంనగర్లో జరిగిన దసరా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన అందరి ముందే డైరెక్టర్‌కు కారును ప్రజెంట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యాంకర్ స్రవంతి చొక్కారపుపై ఆర్. నారాయణమూర్తి సీరియస్
తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్లో డెబ్యూ ఇచ్చారు. .రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. తాజాగా హైదరాబాద్‌లో మూవీ టీం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. యాంకర్ స్రవంతి చొక్కారపుపై సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సార్ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టుల గురించి మాట్లాడిన ఆయన చివర్లో హైపర్ ఆది గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో మళ్లీ మైక్ తీసుకొని అతని గురించి మాట్లాడుతుండగా అది గమనించని యాంకర్.. స్టేజ్‌పై మరో గెస్ట్‌ను పిలిచింది. దీంతో కోప్పడిన ఆయన ‘ఏ పిల్లా ఆపు.. ఏ అమ్మాయ్ టైరో టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్’.. అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
'పఠాన్' సక్సెస్‌పై ఎమోషనల్ అయిన దీపికా పదుకొణె
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 500కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే బాలీవుడ్లో `కేజీఎఫ్2` ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసి హిందీ సినిమా చరిత్రలోనే హయ్యేస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ వీకెండ్‌గా పఠాన్ నిలిచింది. ఈ క్రమంలో చిత్ర బృందం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పఠాన్‌పై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు దీపికా పదుకొణె ఎమోషనల్ అయ్యింది. దీపికా మాట్లాడుతూ.. ''సినిమా రిలీజ్ నాడు థియేటర్‌కి వెళ్లి ఆడియెన్స్ రెస్పాన్స్ చూద్దామనుకున్నా. కానీ ఆరోజు కుదర్లేదు. కానీ ఈరోజు మీ అందరి ప్రేమ, ప్రశంసలు పొందుతుంటే చాలా ఆనందంగా, ఓ పండుగలా అనిపిస్తుంది. ఓం శాంతి ఓం సినిమా నుంచి షారుక్ ఖాన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆరోజు నన్ను నమ్మి ఆయన అవకాశం ఇచ్చి ఉండకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నిజాయితీగా, చిత్తశుద్దితో పని చేస్తే అందుకు బహుమతిగా ఇలాంటి ప్రేమ, ప్రశంసలు దక్కుతాయాని పఠాన్ రుజువు చేసింది'' అంటూ దీపికా కంటతడి పెట్టింది. View this post on Instagram A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) -
నాన్న జోలికొస్తే ఊరుకోము.. రామ్‌చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య విజయ విహారం వరంగల్‌లోని హన్మకొండలో నిర్వహించారు. ఈ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న రామ్‌చరణ్ వేదికపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవిగారిని ఏమైనా అనగలిగితే కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రమే అనగలరు. నాన్న సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్‌గా ఉంటేనే ఇన్ని వేల మందిమి వచ్చాం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలీదు. ఆయన సైలెంట్‌గా ఉంటారేమోకాని మేం ఉండం.మేం క్వైట్‌గా ఉండం. అందరూ గుర్తుపెట్టుకోండి' అంటూ రామ్‌చరణ్ హెచ్చరించాడు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మరింది. ఈ సందర్భంగా కొందరు నిర్మాతలకు సైతం చరణ్ చురకలించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో పనిచేసిన హీరోలందరికి హిట్లు ఇచ్చారని, కొందరు నిర్మాతలు, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని, సినిమా ఎలా తీయాలి, ఎలా చూసుకోవాలనేది అంటూ చరణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
అన్ని భాషల్లో మా సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంది : నిర్మాత
‘‘మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మా ‘జగమే మాయ’ నిరూపించింది. ఇలానే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్‌తో వస్తాం’’ అని నటుడు చైతన్యా రావు అన్నారు. ధన్యా బాలకృష్ణ, చైతన్యా రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జగమే మాయ’. ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 15న రిలీజైంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉదయ్ కోలా మాట్లాడుతూ– ‘‘విడుదలైన అన్ని భాషల్లోనూ మా సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంది’’ అన్నారు. ‘‘ఉదయ్‌గారు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తోంది’’ అన్నారు సునీల్ పుప్పాల. -
థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న మట్టి కుస్తీ.. రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు
తమిళసినిమా: నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి నిర్మించిన చిత్రం కట్టా కుస్తీ. మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందటం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నై వడపళనిలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించింది.నటి ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ కట్టా కుస్తీ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది టీం వర్కుతో రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దీనిని తన సెకండ్ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నారన్నారు. ఈ చిత్ర టీం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.దర్శకుడు చెప్పిన చిత్రంలోని ఆడ మగ సమానం అనే థాట్ నచ్చడంతో చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. తన విజయానికి అమ్మ, అక్క, తన భార్య కారణమన్నారు. వారంతా తనకు చాలా సపోర్టుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తానే కాదు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నిజమన్నారు. నిర్మాతగా మారడానికి కారణం నటుడిగా తన కలలను నిజం చేసుకోవడానికే అని చెప్పారు. కట్టా కుస్తీ చిత్ర తొలి ఆటను తాను మదురైలో ప్రేక్షకుల మధ్య చూశానని, థియేటర్లో మహిళల ఆదరణను చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందని, ఇంకా వసూలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మంచి అనుభూతినిచ్చింది. -
ప్రేక్షకులు మరోసారి నిరూపించారు
‘‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ వంటి చిన్న సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు కట్టిపడేశావు అని ఆడియన్స్ అంటున్నారు. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. ఆ థ్రిల్, ఫీలింగ్ ఓటీటీలో చూస్తే రావు’’ అని చిత్ర దర్శకుడు గురు పవన్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నీఫర్ జంటగా నటించిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం విజయోత్సవంలో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘కంటెంట్ బాగుంటే చిన్న చిత్రమైనా ఆదరిస్తామని మా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సినిమా విడుదలైన అన్ని చోట్ల షోలు పెంచుతున్నారు’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో సినిమా తీశారనే మంచి పేరు వచ్చింది’’ అన్నారు అట్లూరి నారాయణ రావు. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్. -
తమిళ ఇండస్ట్రీకి మంచిరోజులొచ్చాయి : హీరో శింబు
తమిళసినిమా: తమిళ సినిమాకు మంచిరోజులు నడుస్తున్నాయి అని అన్నది ఎవరో తెలుసా? ఇంకెవరు సంచలన నటుడు శింబు. ఈ మాట ఆయనకే వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆ మధ్య వరుస ప్లాపులతో సతమతం అయిన శింబుకు మానాడు చిత్రం ఊపిరి పోసింది. ఆ తరువాత ఆయన నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. బాలీవుడ్ భామ సిద్ధిసిద్నానీ నటించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ గత సెప్టెంబర్ 15న విడుదల చేసింది. గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందననే తెచ్చుకున్నా వసూళ్ల పరంగా చిత్ర యూనిట్‌ను ఖుషి చేసింది. ముఖ్యంగా శింబు ఖాతాలో మరో హిట్ చిత్రంగా నమోదు కావడంతోపాటు నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన వెందు తనిందదు కాడు చిత్రం రూ.60 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కాగా చిత్ర అర్ధ శతదినోత్సవం వేడుకను బుధవారం సాయంత్రం చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు శింబు మాట్లాడుతూ ఇప్పుడు తమిళ సినిమాకే గోల్డెన్ డేస్ నడుస్తున్నాయని అన్నారు. కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రం నుంచి మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్, కన్నడ చిత్రం కాంతార నుంచి ఇటీవల విడుదలైన లవ్ టుడే చిత్రం వరకు ఉన్న అన్ని చిత్రాలు మంచి ఆదరణ పొందాయన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించాలనే కోరిక తో వస్తున్న దర్శకుల కలలను సాకారం చేసేలా తమిళ సినిమా వారిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను తన ఇమేజ్‌కు భిన్నంగా ముత్తు పాత్రగా మారి నటించిన గ్యాంగ్ స్టార్ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, ఘన విజయాన్ని అందించారన్నారు. నిర్మాత ఐసరి గణేష్ చిత్రాన్ని భారీగా నిర్మించారని, వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ తన సొంత సంస్థ లాంటిదన్నారు. గౌతమ్ మీనన్ చిత్రాన్ని కొత్తగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. తను కోరగానే చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరించిన ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు అన్నారు. ఇది విజయోత్సవ వేడుకగా కాకుండా ఇందులో పనిచేసిన నటీనటులు సాంకేతిక వర్గాన్ని గౌరవించాలని భావించినట్లు నిర్మాత ఐసరి గణేష్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఉదయనిధి స్టాలిన్, ఆర్కే సెల్వమణి, ఉదయకుమార్, అరుళ్ మణి, ధనుంజయ్, శరత్ కుమార్, రాధిక పలువురు సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
ఓరి దేవుడా అద్భుతాలు సృష్టిస్తుంది
‘‘ఓరి దేవుడా’ చిత్రం అందరి మనసుల్ని టచ్ చేస్తుంది. ఎంటర్టైనింగ్గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులే కాదు.. విమర్శకులకు కూడా బాగా నచ్చింది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓరి దేవుడా’. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ప్రసాద్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ–‘‘ఓరి దేవుడా’ టీమ్ అంతా మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుంది’’ అన్నారు. ‘‘ఓరి దేవుడా’ ప్లెజెంట్ లవ్ స్టోరీ.. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక. ‘‘యువ ప్రేక్షకులే కాదు.. కుటుంబ ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తున్నారు’’ అన్నారు అశ్వత్ మారిముత్తు. హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్, మ్యూజిక్ డైరెక్టర్ లియోన్, నటుడు వెంకటేష్ కాకమాను తదితరులు మాట్లాడారు. -
గణేష్‌కు ఆ అదృష్టం దక్కింది
‘‘నా చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన ‘స్వాతిముత్యం’తోనే ప్రేక్షకులు తనను నటుడిగా అంగీకరించడం నాకు హ్యాపీగా ఉంది. దర్శకుడు లక్ష్మణ్‌ను కూడా ప్రేక్షకులు అంగీకరించారు. తొలి సినిమాతోనే ప్రేక్షకాదరణ పొందాలంటే అదృష్టం ఉండాలి. అది ‘స్వాతిముత్యం’తో గణేష్‌కు దక్కడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజైంది. సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘స్వాతిముత్యం’ రిలీజైన తొలి రోజు, రెండో రోజు కలెక్షన్స్ చూసి భయపడ్డాం. కానీ మూడో రోజు నుంచి వసూళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’ సినిమా ఉన్నా ‘స్వాతిముత్యం’కూ ప్రేక్షకాదరణ లభించింది. ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్లో చిరంజీవిగారు ‘స్వాతిముత్యం’ సినిమాను కూడా ఆదరించాలని చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు. గణేష్‌ను హీరోగా లాంచ్ చేసిన నాగవంశీ, చినబాబులకు రుణపడి ఉంటాను. ఓ నిర్మాతగా నేను కూడా ఇలాంటి లాంచింగ్‌ను గణేష్‌కు ఇచ్చి ఉండేవాడిని కాదేమో! ఇక బాలకృష్ణగారి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను రీ రిలీజ్ చేయడం వల్ల వచ్చిన ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలను బసవతారకం ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నాం. ఎన్టీఆర్‌గారి ‘ఆది’ సినిమాను కూడా రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇక ‘జగదేకవీరుని కథ’ సినిమాను మళ్లీ తీయాలన్నది నాకున్న లక్ష్యాల్లో ఒకటి. ఎప్పటికైనా తీస్తా’’ అన్నారు. ‘‘తొలి సినిమాతోనే నటుడిగా నాకు ఇంత మంచి పేరు వస్తుందని ఊహించలేదు’’ అన్నారు గణేష్. ‘‘రిపీట్ ఆడియన్స్ ఉన్న చిత్రం ‘స్వాతిముత్యం’. నన్ను నమ్మి, ప్రోత్సహించిన నాగవంశీ, చినబాబు, బెల్లంకొండ గణేష్గార్లకు ధన్యవాదాలు. దర్శకుడిగా నా రెండో సినిమా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్ కె. కృష్ణ. -
బెల్లంకొండ గణేష్ కంటే బాల మురళీగానే తృప్తి కలిగింది : హీరో
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజైంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ – ‘‘తెరపై గణేష్ కాదు.. బాలమురళీయే (సినిమాలో గణేష్ పాత్ర) కనిపిస్తున్నాడన్నప్పుడు నటుడిగా ఓ పది మార్కులు సాధించాననే తృప్తి కలిగింది. ఈ కథను నా దగ్గరకు తీసుకు వచ్చి, నా నుంచి నటనను రాబట్టుకున్న లక్ష్మణ్‌కు థ్యాంక్స్. ఈ కథను ఎక్కువగా నమ్మి, నిర్మించిన నాగవంశీగారికి రుణపడి ఉంటాను’’ అని అన్నారు. ‘‘ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వారు ఏ విధంగా స్పందిస్తారు? అనే అంశం ఆధారంగా ఈ సినిమా చేశాం. కథ చెప్పగానే అంగీకరించిన గణేష్‌కు, కథను నమ్మి.. అదే నమ్మకాన్ని మా అందరిపై ఉంచిన నాగవంశీగారికి ధన్యవాదాలు’’ అన్నారు లక్ష్మణ్ కె. కృష్ణ. ‘‘స్వాతిముత్యం’ రిలీజ్‌కు ముందు చిరంజీవిగారు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు చిరంజీవిగారి ‘గాడ్‌ఫాదర్’, ‘స్వాతిముత్యం’ చిత్రాలు విజయాలు సాధించి నందుకు హ్యాపీగా ఉంది. ‘స్వాతిముత్యం’ సినిమాకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది’’ అన్నారు నాగవంశీ. దివ్య శ్రీపాద, సురేఖా వాణి పాల్గొన్నారు. -
అందుకే 'సీతారామం'లో నటించాను: దుల్కర్ సల్మాన్
ప్రస్తుత రోజుల్లో సినిమాల సక్సెస్ అరుదైపోయిందనే చెప్పాలి. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే సుముఖత చూపడం లేదు. ఎందుకు కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. అయితే మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే. ఇందుకు ఉదాహరణ సీతారామం. తమిళంలో అనువాద చిత్రంగా రూపొందిన తెలుగు చిత్రం ఇది. దుల్కర్ సల్మాన్, ఉత్తరాది భామ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఇందులో నటి రష్మిక మందన్నా, టాలీవుడ్ నటుడు సుమంత్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. అశ్వినీదత్ సమర్పణలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈచిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత 5వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. త్వరలో హిందీలోనూ వి డుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో లైకా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం చెన్నైలో చిత్ర సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ముందుగా లైకా సంస్థ నిర్వాహకుడు త మిళ్ కుమరన్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్ విజయవంతమైన చిత్రాల వరుసలో సీతారామం నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై కూడా మంచి కథా చిత్రాలను అందిస్తామని పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ సీతారామం కథ విన్నప్పుడే ఇది డ్రీమ్ చిత్రం అని భావించానని చేశారు. ఇది అద్భుతమైన క్లాసికల్ ప్రేమ కావ్యం అని పేర్కొన్నారు. ఇంతకుముందు వినని కథ కావడం, చాలా ఒరిజినల్‌గా అనిపించడంతో తాను నటించడానికి అంగీకరించానన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అన్నారు. చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ సీతారామం చిత్రం తమిళనాడులోనూ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం వావ్ అనిపించడం వెనుక పెద్ద వార్ ఉందన్నారు. ముఖ్యంగా చిత్ర యూనిట్ మూడున్నర ఏళ్ల శ్రమ ఉంటుందన్నారు. కాశ్మీర్‌లోని డిఫరెంట్ డిఫికల్ట్ లొకేషన్లో మైనస్ 24 డిగ్రీల చలిలో షూటింగ్ నిర్వహించామన్నారు. నటుడు దుల్కర్ సల్మాన్, ఇతర నటీనటులు, యూనిట్ సహకారంతోనే ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు. -
'సీతారామం' మూవీ సక్సెస్ మీట్.. ఫోటోలు వైరల్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణాన్ని తీసుకొచ్చిందీ సినిమా. సీత, రామ్‌ల లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
మళ్లీ పుట్టినట్లు అనిపించింది.. ఆ మాటలు వింటే భయమేసేది
‘‘బింబిసార’ రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్ఠ్‌కు ధన్యవాదాలు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కొంతమంది మాటలు వింటే భయమేసేది. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాను.. ‘బింబిసార’ విషయంలో అదే నిజమైంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘మేజర్, విక్రమ్’ సినిమాలు మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘బింబిసార, సీతారామం’ ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను’’ అన్నారు. ‘‘మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వశిష్ఠ్. డిస్ట్రిబ్యూటర్లు శివరాం, ఎల్.వి.ఆర్, హరి, ఎ.ఎం.ఆర్ పాల్గొన్నారు. -
నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చారు : బిగ్‌బాస్ ఫేం అమిత్
‘‘గోవులను సంరక్షించుకోవాలనే సందేశాన్ని ‘నల్లమల’ సినిమా ద్వారా ప్రజలకు వివరించిన రవి చరణ్‌ని అభినందిస్తున్నాను. గో సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ‘నల్లమల’ లాంటి సందేశాత్మక సినిమాలు మరిన్ని రావాలి’’ అని ‘యుగతులసి ఫౌండేషన్’ చైర్మన్ కె.శివ కుమార్ అన్నారు. అమిత్ తివారీ, భానుశ్రీ జంటగా, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో రవి చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నల్లమల’. నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎమ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో అమిత్ తివారి మాట్లాడుతూ– ‘‘క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చిన ఆర్ఎమ్కి థ్యాంక్స్. రెండున్నరేళ్ల మా కష్టానికి ‘నల్లమల’ విజయంతో తగిన ప్రతిఫలం దొరికింది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకి మా సినిమా నచ్చింది. నా మొదటి చిత్రానికే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రవిచరణ్. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, పాటలు, సంగీతం: పి.ఆర్. -
పార్టీ లేదా 'పుష్ప'.. సక్సెస్ మీట్ క్యాన్సిల్
Pushpa Movie Massive Success Party Cancelled In Kakinada: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. డిసెంబర్17న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా అదరగొట్టగా, రష్మిక మందన్నా శ్రీవల్లిగా కనువిందు చేసింది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిపోయిన పుష్ప ప్రస్తుతం సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తుంది. ఈ సందర్భంగా వివిధ నగరాల్లో మూవీ టీం సక్సెస్ పార్టీలు నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(డిసెంబర్24)న కాకినాడలో సక్సెస్ మీట్ జరగాల్సి ఉంది. అయితే అనుమతులు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. -
'మానాడు' మూవీ సక్సెస్ జోష్‌లో హీరో శింబు
Simbu thanks fans for overwhelming support for Maanaadu: మానాడు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. వీ.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 25వ తేదీ తెరపైకి వచ్చిన మానాడు చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్ర దర్శక నిర్మాతలను తన ఇంటికి పిలిపించుకొని అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాత సురేష్ కామాక్షి ట్విట్టర్లో పేర్కొంటూ ‘సూపర్ స్టార్ ఆహ్వానం, అభినందనలు ఈ చిత్ర విజయాన్ని దృవపరిచాయి. మంచిని వెతికి అభినందించే ఈ మనసే ఇంకా మిమ్మల్ని ఉన్నత సింహాసనంపై కూర్చోబెట్టింది. గొప్ప ఫలితాన్ని పొందాం. యూనిట్ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. -
త్వరలోనే సీక్వెల్ ఉంటుంది
‘‘జాతి రత్నాలు’ సినిమా చూడమని నా స్నేహితులు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల చూడలేకపోయాను. నవీన్, ప్రియదర్శి, రాహుల్ దగ్గర ఎంతో కళ ఉంది.. ఇప్పుడు వారికి సమయం వచ్చింది’’ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘థియేటర్లలో నవ్వులు పూయించేందుకు చేసిన మా ప్రయత్నం ఫలించింది’’ అన్నారు అనుదీప్. ‘‘చిత్రం భళారే విచిత్రం’ విడుదలైనప్పుడు వచ్చిన క్రేజ్‌ని మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’’ అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. ‘‘త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. -
నాకీ సినిమా జీవితాంతం గుర్తుంటుంది
‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ఇంటర్వెల్ బ్యాంగ్ రజనీకాంత్ గారి ‘బాషా’ స్థాయిలో ఉందని అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల స్పందన మాకొక ధైర్యాన్ని ఇచ్చింది. కొత్త కంటెంట్‌తో సినిమాలు చేయవచ్చనే నమ్మకం పెరిగింది. మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు లాభాలతో హ్యాపీగా ఉన్నాం అని చెబుతున్నారు. జీవితాంతం నాకీ సినిమా గుర్తుంటుంది’’ అన్నారు. ‘‘నా ఫస్ట్ మూవీని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు డెన్నిస్ జీవన్. ‘‘మా సినిమా పంపిణీదారులందరూ ఫోన్ చేసి, ‘సేఫ్ అయ్యాం, సంతోషంగా ఉన్నాం’ అని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఒక ప్రేక్షకుడిగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ లాంటి మంచి సినిమా చూసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను’’ అన్నారు కోన వెంకట్. -
ఒక లోకం... రెండు కోట్లు
‘‘పోలీస్ స్టోరీ’ సినిమా 25 సంవత్సరాల వేడుకకి వెళ్లినప్పుడు బెంగళూరులో ‘శశి’ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటని కన్నడలో తర్జుమా చేసి, వింటున్నారు. తమిళనాడులో కూడా ఈ పాటకు స్పందన చాలా బాగుంది. ఆది కెరీర్లో బెస్ట్ సాంగ్ ఇది. ఈ పాటలాగే ‘శశి’ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. అరుణ్ సంగీతం అందించారు. చంద్రబోస్ రాసిన ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట రెండు కోట్లకు పైగా వ్యూస్ దాటింది. ఈ సందర్భంగా ‘ఒకే ఒక లోకం..’ పాట సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘పాటను ఇంతలా ఆదరించినవారికి థ్యాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ నాయుడు నందికట్ల. ‘‘2021లో ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపజేస్తో్తంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామేన్ అమర్నాథ్ బొమ్మిరెడ్డి, మాటల రచయిత రవి, స్క్రీన్ ప్లే రైటర్ మణి, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్.పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
నా సినిమా విజయం కంటే ఎక్కువ సంతోషపడ్డా
‘‘ఈ వేడుకకు అతిథిలా రాలేదు. నితిన్ సక్సెస్‌ని ఎంజాయ్ చేయడానికి తన ఫ్రెండ్‌లా వచ్చాను. నా సినిమా సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో నితిన్ సక్సెస్‌ను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. నితిన్, రష్మికా మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో రెండో సినిమా కూడా హిట్ కొట్టడం కష్టమంటారు. వెంకీ పాసయ్యాడు. రష్మిక నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తున్నాయి. తనతో కలసి త్వరలోనే యాక్ట్ చేయాలనుంది. మణిశర్మగారి అబ్బాయి సాగర్ మహతి మంచి సాంగ్స్ ఇచ్చారు. నితిన్ నేను ఈ మధ్య మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలనుకుంటున్నాను. సింగిల్ అని చెప్పి రిలీజ్ కంటే ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అందర్నీ మోసం చేశాడు’’అన్నారు. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ నిర్మాణసంస్థతో ‘అ ఆ’ చేశాను. పెద్ద హిట్ అయింది. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. దీనికి కారణమైనన దర్శక–నిర్మాతలకు «థ్యాంక్స్. రష్మికతో నటన, డ్యాన్సులు నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’’ అన్నారు. రష్మిక మాట్లాడుతూ – ‘‘భీష్మ’ మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నితిన్‌గారు, వెంకీ గారు అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన నితిన్‌గారికి, నిర్మాత వంశీగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. -
ఈ సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్, రవితేజ పుట్టినరోజు వేడుకను ఆదివారం చిత్రబృందం నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ – ‘‘డిస్కో రాజా’ సినిమాలో నా పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. నాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రామ్ తాళ్లూరి ప్యాషనేట్ నిర్మాత’’ అన్నారు. ‘‘సంవత్సరానికి మూడు సినిమాలు ఇవ్వగల సత్తా ఉన్న హీరో రవితేజ. ఆయన ఎనర్జీ ఆ రేంజ్లో ఉంటుంది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి. ‘‘ఈ సినిమాను అందరూ ప్రేమించి, ఎంతో ఆనందంతో పని చేశారు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు ఆనంద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు పాయల్. ‘‘రవితేజగారి పుట్టినరోజుకి మంచి సినిమా ఇచ్చాం అనుకుంటున్నాను’’ అన్నారు రామ్ తాళ్లూరి. ‘‘నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఏ భాషలో అయినా సరే సిక్స్‌ప్యాక్ విలన్ కావాలన్నది నా కోరిక’’ అన్నారు సునీల్. ‘‘వీఐ ఆనంద్ క్లారిటీ ఉన్న దర్శకుడు. రవితేజగారి ఎనర్జీ లెవల్స్ సూపర్’’ అన్నారు రాంకీ. ‘‘మూవీను ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు బాబీ సింహా. ఈ కార్యక్రమంలో ‘సత్యం’ రాజేష్, కెమెరామేన్ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు. -
జీవితాంతం రుణపడి ఉంటా
‘‘వారానికి మూడు రోజులు బుల్లితెరపై కని పిస్తాను. వెండితెర మీద రెండు గంటలపాటు కనిపించే పాత్ర చేస్తానని నా జీవితంలో ఊహించలేదు’’ అని ‘సుడిగాలి’ సుధీర్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో సుధీర్ మాట్లాడుతూ– ‘‘నా కోసం థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా. మా సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది’’ అన్నారు. ‘‘మా సినిమా రెండు రోజుల్లోనే 4కోట్ల 50 లక్షలు గ్రాస్ సాధించింది. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని ‘సాఫ్ట్వేర్’ శేఖర్ రాజుగా మార్చుకున్నాను’’ అన్నారు శేఖర్ రాజు. ‘‘మా సినిమాకి తెలుగులోనే కాదు.. కర్ణాటక లోనూ వసూళ్లు బాగున్నాయి’’ అన్నారు ధన్య బాలకృష్ణ. సంగీత దర్శకుడు భీమ్స్, లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ, నైజాం డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
సక్సెస్‌మీట్ అంటే సినిమా ఫ్లాప్
‘‘మత్తు వదలరా’ సినిమా గురించి మంచి టాక్స్ వినిపిస్తున్నాయి.. స్పందన బాగుందా చెర్రీ(నిర్మాత చిరంజీవిని ఉద్దేశించి). ఏంటీ.. ఇది సక్సెస్మీటా? కాదు కాదా? ఎందుకంటే టాలీవుడ్ సినిమా డిక్షనరీ వేరే ఉంది.. బాబుగారూ అంటే హీరో.. సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్ అయిందని అర్థం(నవ్వుతూ)’’ అని సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. ఆయన తనయులు శ్రీసింహా హీరోగా, కాలభైరవ సంగీత దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టై¯Œ మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కీరవాణి మాట్లాడుతూ– ‘‘2000సంవత్సరం కెరీర్ పరంగా నాకు చాలా బ్యాడ్‌టైమ్.. డబ్బుల పరంగానూ బ్యాడ్‌టైమే. ఆ రోజుల్లో నేను బాధ్యత తీసుకోవాల్సినటువంటి కుటుంబీకులు దాదాపు 30మంది ఉన్నారు. ఓ సందర్భంలో సింగపూర్ వెళ్లడం గురించి ఇంట్లో చర్చ వచ్చింది.. అక్కడికి వెళ్లేంత డబ్బులు మనవద్ద లేవని నేను అంటుంటే.. ‘నేను తీసుకెళతాను’ అన్నాడు కాలభైరవ.. అప్పుడు వాడికి నాలుగేళ్లు’.. ఇప్పటి వరకూ నన్ను తీసుకెళ్లేంత రెమ్యూనరేషన్ వాడికి రాలేదు కానీ, ‘మత్తు వదలరా’ తో వచ్చిందనుకుంటున్నా(నవ్వుతూ).. మంచి సినిమా తీసిన యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మత్తు వదలరా’ కథని రితేష్ రానా చెప్పినప్పుడు అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందనిపించింది. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో ఇప్పుడు ప్రమోషన్స్ పెంచాం’’ అన్నారు. ‘‘రితేష్ రానా చెప్పిన కథ విన్నాక సినిమా చేయం అనే అవకాశమే లేదు.. అంత బాగుంది’’ అన్నారు మైత్రీ మూవీస్ నిర్మాత రవిశంకర్. ‘‘షకలక’ శంకర్‌తో వినోద సన్నివేశాలు చిత్రీకరించాం.. కానీ, ఆ కామెడీ ట్రాక్ కథని ముందుకు తీసుకెళ్లదు అనిపించి పెట్టలేదు’’ అన్నారు రితేష్ రానా. ‘‘నటుడిగా నాకు రోల్ మోడల్ అంటూ ఎవరూ లేరు. అందరి సినిమాలూ చూస్తా’’ అన్నారు శ్రీ సింహా. ‘‘నాన్న(కీరవాణి), బాబాయ్(రాజమౌళి) గార్లు చెప్పకపోయినా వారి వల్లే మాకు ఈ అవకాశం వచ్చిందనుకుంటున్నాం’’ అన్నారు కాలభైరవ. నటుడు నరేశ్ అగస్త్య, కెమెరామెన్ సురేశ్ సారంగం పాల్గొన్నారు. -
శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కాన్సెప్ట్, కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ, వంటి వారు డిఫరెంట్ సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రోత్సాహంతోనే ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. వీరిలానే నన్ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఉదయ్ శంకర్. ఎన్వీ నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా జి. శ్రీరామరాజు, భరత్ రామ్ నిర్మించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ– ‘‘డిసెంబరు 6న మూడు మ్యాచ్‌లు గెలిచాయి. ఒకటి దిశ ఘటనలో దోషులకు సరైన శిక్ష పడింది. రెండు... టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించింది. మూడు.. ‘మిస్‌మ్యాచ్’ చిత్రం విజయం సాధించింది. మా చిత్రంపై పాజిటివ్ మౌత్‌టాక్ నడుస్తోంది. మా సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ప్రతి రివ్యూలోనూ కంటెంట్, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా యని రాశారు. ఈ క్రెడిట్ కథ అందించిన భూపతిరాజాగారికి దక్కుతుంది. కథను చక్కగా తెరకెక్కించారు నిర్మల్ కుమార్’’ అన్నారు. ‘‘నేనీ వేదికపై ఉన్నానంటే కారణం జీవీజీ రాజుగారు. తెలుగులో నేను చేసిన స్ట్రయిట్ మూవీ ఇది. భూపతిరాజాగారు మంచి కథ అందించారు’’ అన్నారు నిర్మల్ కుమార్. ‘కుటుంబంతో సరదాగా చూసే చిత్రం ఇది. సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు శ్రీరామరాజు. ‘‘అమ్మాయి లక్ష్యం కోసం ఓ అబ్బాయి ప్రేమికుడిగా ఎంత తాపత్రయపడ్డాడు? అనే అంశం సినిమాలో ఒక హైలైట్ పాయింట్. రెండు కుటుంబాల కథ ఇది’’ అన్నారు భూపతిరాజా. నిర్మాత జీవీజీ రాజు, సంగీత దర్శకుడు గిఫ్టన్, కెమెరామేన్ గణేష్, ఎడిటర్ రాజా, రచయిత రాజేంద్రకుమార్ తదితరులు మాట్లాడారు. -
పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ 'మిస్ మ్యాచ్'
ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బేనర్‌పై జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా, శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్‌తో దూసుకపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ.. ‘ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉందిమంచి కథా బలం ఉన్న సినిమా. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు. ‘మా బేనర్ లో తొలి చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని వర్గాల ఆడియన్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజానికి అవసరమైన స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా. పూర్తిగా పాజిటివ్ కంటెంట్. కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా’ అని నిర్మాత శ్రీరామ్‌రాజు పేర్కొన్నారు. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..‘ఈ శుక్రవారం మూడు మ్యాచ్ లో గెలిచాం. ఒకటి 'దిశ నిందితుల ఎన్కౌంటర్, రెండు టీమ్ ఇండియా క్రికెట్ లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తొలిప్రేమ లోని ‘ఈ మనసే’ పాటకి థియేటర్ లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్ అందించిన గిఫ్టన్ గారికి థ్యాంక్స్’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు నిర్మల్ కుమార్, సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య, సంధ్య, వెంకట రామారావు, శ్రీ రామ్ బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘మిస్ మ్యాచ్’ మూవీ రివ్యూ -
నా నమ్మకం నిజమైంది
ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి కాస్త నిరాశకు లోనయ్యాం. కానీ శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్‌ఫుల్ అవ్వడం, అన్ని చోట్ల కలెక్షన్స్ కూడా బాగుండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యాం. సినిమా చూసినవాళ్లు బాగుంది చూడమని ఇంకో పదిమందికి చెబుతున్నారు. నేను ఏదైతే నమ్మి సినిమాను తీశానో అది నిజమైంది. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. ఈషా, సత్యదేవ్ బాగా నటించారు. శ్రీనివాస్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఆయన బ్యానర్లోనే ‘భార్యదేవోభవ’ అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాను. ఓ ప్రముఖ హీరో నటిస్తారు. పదిమంది హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘విద్య’ పాత్రను బాగా చేశానని చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘థ్రిల్లర్ సినిమాని బాగా గ్రిప్పింగ్‌గా తీశాడని కె.రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి చెప్పడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. సత్యదేవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, ముస్కాన్, కెమెరామన్ అంజి మాట్లాడారు. -
ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం
‘‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాని ప్రేక్షకులను నవ్వించడానికే తీశామని ముందు నుంచి చెబుతున్నాం. మా సినిమాపై వస్తున్న రివ్యూలను స్వాగతిస్తున్నా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘నాకు వస్తున్న ఫోన్ కాల్స్‌ని బట్టి మా చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉందంటున్నారు. ప్రతి షోకు జనాలు పెరుగుతున్నారు’’ అన్నారు. ‘‘నవ్వించడానికి సినిమా తీశాం.. ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం. కామెడీ, మ్యూజిక్, ట్విస్ట్‌లు బావున్నాయని అంటున్నారు.. మాకు అదే చాలు. అందరం సంతోషంగా ఉన్నాం’’అన్నారు దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి. ‘‘అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘మేము హిట్ కొట్టాం అని గర్వంగా చెబుతున్నాను. ఆడియన్స్‌కు ధన్యవాదాలు’’ అన్నారు ఎడిటర్ చోటా కె. ప్రసాద్. ‘‘మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు’’ అన్నారు సంగీత దర్శకుడు సాయి కార్తీక్. -
అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ
‘‘ఖైదీ’ సినిమాని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్. ఇంతకు ముందు నన్ను ‘ఆవారా’ కార్తీ అనేవారు.. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లినా ‘ఖైదీ’ కార్తీ అని పిలుస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు కార్తీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ ఈ నెల 25న విడుదల చేశారు. బుధవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తమిళనాడు, కేరళలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మా సినిమాకు మంచి స్పందన వస్తోంది. ‘ఖైదీ’లో ఢిల్లీ (కార్తీ పాత్ర పేరు)లాంటి పాత్ర నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ రాసిన, తీసిన విధానం అద్భుతం. నాకు ఒక బామ్మ ఫోన్ చేసి, మంచి సినిమా, గొప్ప సినిమా చేశావని ప్రశంసించారు.. అదే నిజమైన సక్సెస్. ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చిన ఎస్.ఆర్. ప్రభుకు థ్యాంక్స్. ‘ఖైదీ’ టైటిల్ పెడితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అయ్యింది. రవితేజగారు ఫోన్ చేసి, ‘ఇటువంటి సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ‘ఖైదీ 2’ కూడా ఉంటుంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘ఈ దీపావళికి ‘ఖైదీ’ వెలుగులు నింపింది. మా సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించింది’’ అన్నారు. ‘‘ఖైదీ’కి భారీ సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎస్.ఆర్. ప్రభు. -
వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం
అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమైన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్స్‌గా నటించారు. హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సక్సెస్ మీట్లో హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘చాలా సంవత్సరాలుగా దర్శకత్వం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. వయసు కాదు.. ప్రతిభే ముఖ్యం అని నమ్మిన కోటేశ్వరరావుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహించే మీడియా రంగంలో నేను ఉన్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ పాలకుర్తి. ‘‘మాకు ఎంతో సహకారం అందించిన మైత్రీ మూవీస్ రవిగారు, నిర్మాత అనిల్ సుంకరగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు అనురాగ్ కొణిదెన. లిరిసిస్ట్ తిరుపతి జవాన్, హీరోయిన్ శ్వేతా అవస్తి మాట్లాడారు. -
సూపర్మార్కెట్లో థ్రిల్
హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’. శ్రీనాధ్ పులకరం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎల్సాగోష్ కథానాయికగా నటించారు. బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో గౌతంరాజు మాట్లాడుతూ– ‘‘యూత్ ఫుల్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. క్లైమాక్స్ వరకూ సస్పెన్స్ అలానే ఉండి ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. మా అబ్బాయి కృష్ణ ముందు నుంచి చిరంజీవిగారి అభిమాని. ఈ చిత్రంలో డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన 33 ఏళ్ల నుంచి చాలా మందికి సాయం చేస్తూ వచ్చాను. మా సినిమాకి ఇంకా మంచి హైప్ వచ్చేలా మీడియా చేస్తే.. దానివల్ల మరికొంత మందికి సహాయం చేసే అవకాశం వస్తుంది’’ అన్నారు. ‘‘మా సినిమా పాజిటివ్ వైబ్స్‌తో వెళుతోంది. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగా చేసిన మా డైరెక్టర్‌కి థ్యాంక్స్. యంగ్ టీమ్ చాలా కష్టపడి సినిమా చేశాం’’ అన్నారు కృష్ణ. ‘‘మా చిత్రం బాగుందని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే పూర్తిస్థాయిలో ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడంలో అంతగా సక్సెస్ కాలేదనిపిస్తోంది’’ అని శ్రీనాధ్ పులకరం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బోలే షవాలీ, కెమెరా: ఎ. విజయ్‌కుమార్. -
ప్రతిరోజు గర్వపడుతూ ఈ సినిమా చేశాను
వినాయకుడు టాకీస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా, రచయిత అబ్బూరి రవి విలన్‌గా, సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆది మాట్లాడుతూ– ‘‘సినిమా చూసిన అందరూ నేను చేసిన అర్జున్ పండిట్ పాత్ర చాలా బావుందని అభినందిస్తున్నారు. ప్రతి రోజూ గర్వపడుతూ ఈ సినిమా చేశాను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ పాజిటివ్ రిపోర్ట్స్ చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు. సాయికిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘మా చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుండి సినిమా బావుంది అనే టాక్ రావడం ఆనందంగా ఉంది. సినిమా విజయం వెనక ఎంతో మంది ప్రోత్సాహం ఉంది. టెక్నీషియన్స్, మా టీమ్ అందరి హార్డ్ వర్క్‌తో ఈ సినిమా పూర్తయింది. సినిమా కొత్తగా ఉందని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ రాజు, పార్వతీశం, పద్మనాభ రెడ్డి, అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు. -
ఒకటే మాట.. సూపర్ హిట్
‘‘ప్రీమియర్ షోస్ పడినప్పటి నుంచి పాజిటివ్ టాక్ మొదలైంది. ఆనందంతో నిద్రపట్టలేదు. చిరంజీవిగారు, అల్లు అరవింద్‌గారు ఫోన్ చేసి అభినందించారు. ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు మా టీమ్‌ది’’ అన్నారు వరుణ్ తేజ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే, మృణాళిని రవి, అథర్వ ముఖ్య పాత్రధారులుగా రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చిందని చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో నాగబాబు, 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ తదితరులు కేక్ కట్ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ‘‘అందరి నోటా ఒకటే మాట.. సూపర్‌హిట్ అని. వరుణ్ వన్ మేన్ షో అంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేయడంతో మాకు ఇంకా ఎనర్జీ వచ్చింది. కొంతమందైతే నీ కెరీర్ బెస్ట్ వర్క్ అన్నారు. వరుణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కావడం ఆనందం’’ అన్నారు హరీశ్ శంకర్. -
మార్షల్ నచ్చితే నలుగురికి చెప్పండి
‘‘ఖడ్గం, మహాత్మ’ తర్వాత అంత వైవిధ్యమైన పాత్ర ‘మార్షల్’ చిత్రంలోనిదే అని కొందరంటున్నారు. ఫోన్ చేసి దర్శకుడి గురించి, అభయ్ గురించి అడుగుతున్నారు’’ అని శ్రీకాంత్ అన్నారు. జయరాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక, మేఘా చౌదరి జంటగా, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్’. అభయ్ అడక నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను ఆదివారం నిర్వహించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా సక్సెస్ అవడం చాలా సంతోషంగా ఉంది. విమర్శకులు కూడా అభినందిస్తున్నారు. సినిమా చూడండి, నచ్చితే నలుగురికి చెప్పండి’’ అన్నారు. ‘‘మా సినిమా ఫస్ట్ రోజు డల్‌గా స్టార్ట్ అయినా, మౌత్ టాక్ బాగుంది. కలెక్షన్స్ పికప్ అయ్యాయి. నిర్మాతగా సంతృప్తికరంగా ఉన్నాను’’ అన్నారు అభయ్. ‘‘శ్రీకాంత్అన్న పాత్ర, అభయ్ పాత్ర సినిమాకు ప్లస్ అయ్యాయి’’ అన్నారు జయరాజ్ సింగ్. ‘‘సినిమాకు వస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. బాగా చేశానని అభినందిస్తున్నారు’’ అన్నారు మేఘా చౌదరి. -
శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు
‘‘సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం కూడా అవసరం. అప్పుడే ఇంకా మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంది. సినిమా చూసినవారు ‘శంకరాభరణం, మాతృదేవోభవ’ లాంటి గొప్ప సినిమా అని అభినందిస్తున్నారు. ఇకపై కూడా మా బ్యానర్లో మా గత సినిమాల్లానే క్వాలిటీతో పాటు మంచి పర్పస్ ఉన్న సినిమాలే అందిస్తాం’’ అన్నారు కేయస్ రామారావు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో పాటు కలెక్షన్లూ సాధిస్తోందని చిత్రబృందం తెలిపింది. శనివారం సక్సెస్ మీట్లో ఐశ్వర్యా రాజేశ్ మాట్లాడుతూ – ‘‘తమిళంలో ఎలా ఆదరించారో తెలుగులోనూ ఈ సినిమాను అలానే ఆదరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి ఈ ప్రశంసలను సపోర్ట్‌గా భావిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాకు పునాది కథ. మంచి కథ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాం. ఈ బ్యానర్లో గతంలో వచ్చిన గొప్ప సినిమాలకు దీటుగానే ఈ సినిమా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘ఒక గొప్ప సినిమాకు పాటలు రాసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాంబాబు గోసాల. ‘‘కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి సినిమాయే ‘కౌసల్య కృష్ణమూర్తి’’ అన్నారు బీఏ రాజు. ‘ఇండియన్ 2’ నుంచి తప్పుకున్నాను కమల్‌హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌ది ఓ కీలక పాత్ర. డేట్స్ క్లాష్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు. ఇలాంటి సినిమా వదులుకోవడం బాధగా ఉందని ఐశ్వర్య తెలిపారు. -
ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు
‘‘గుణ 369’ సినిమా చూసి మా అమ్మ తొలిసారి ఏడవటం చూశాను. ఈ చిత్రం తర్వాత నన్ను చూసి అమ్మ గర్వపడుతోంది. కొందరు మహిళలు నన్ను పట్టుకొని ఏడుస్తుంటే సినిమాకి ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమైంది’’ అని హీరో కార్తికేయ అన్నారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మించిన ఈ సినిమా ఈనెల 2న విడుదలైంది. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కార్తికేయ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో జీవితాంతం గుర్తు పెట్టుకొనే చిత్రం ‘గుణ 369’. నాకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే భవిష్యత్తులో వంద బ్లాక్ బస్టర్లు ఇవ్వగలననే ధైర్యం వచ్చింది. ఇకపై నేను ఎంపిక చేసుకునే సినిమా కథల మీద ఈ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చిత్రంతో బాధ్యతగల నటుడిగా పేరొచ్చింది. ఆ పేరు ఎంత ఖర్చుపెట్టినా రాదు. ఇందుకు నిర్మాతలకు థ్యాంక్స్.. దర్శకునికి రుణపడి ఉంటాను’’ అన్నారు. అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ–‘‘గుణ 369’ విడుదల తర్వాత కర్నూలు నుండి వైజాగ్ వరకు టూర్‌కి వెళ్లాం. మంచి సినిమా తీశారు.. హ్యాపీగా ఉన్నామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమాను యూత్, మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ అభినందిస్తున్నారు. ఏ దర్శకునికైనా ఇంతకన్నా ఏం కావాలి’’ అన్నారు. ‘‘హన్మకొండలో 9నెలల పసికందు శ్రీహితపై అత్యాచారం, హత్య జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ రోజు ఆ పాప తల్లిదండ్రులు జగన్, చరితలు ఫోన్ చేసి, ‘గుణ 369’ సినిమా చూసి, ఫోన్ చేశాం అని చెబుతుంటే మంచి సినిమా తీశాం అనే ఫీలింగ్‌తో హాయిగా ఉంది. మా చిత్రాన్ని శ్రీహితకు అంకితమిస్తున్నాం’’ అని ప్రవీణ కడియాల అన్నారు. -
సినిమా అదిరింది అంటున్నారు
‘‘కంటినిండా నిద్రపోయి సుమారు వారమైంది. ఎంతో నమ్మి ‘నిను వీడని నీడను నేనే’ సినిమా తీశాం. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని టెన్షన్ పడ్డాను. మొన్న మేమంతా తిరుమలకు వెళ్లాక, టెన్షన్ తట్టుకోలేక ఫోన్ స్విచ్చాఫ్ చేశా. శుక్రవారం ఉదయం ఆట పడ్డాక ఫోన్ ఆన్ చేశా’’ అని సందీప్ కిషన్ అన్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్, అనన్యాసింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. తొలి ఆట నుంచి సినిమాకు హిట్ టాక్ రావడంతో టపాసులు కాల్చి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు యూనిట్. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘శుక్రవారం ఒంటిగంటకు ఫోన్ స్విచ్ఛాన్ చేశా. చాలామందికి ఫోన్లు చేశా.. ‘చాలా మంచి సినిమా తీశారు భయ్యా. ఫస్టాఫ్ అదిరింది. లాస్ట్‌లో ఎమోషన్ అదిరిపోయింది, సినిమా సూపర్‌గా ఉంది.. చివరలో ఏడ్చాం’ అంటూ చాలా పాజిటివ్‌గా చెబుతుంటే సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి, కలెక్షన్లు బావున్నాయని చెబుతున్నారు. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సోమవారం నుంచి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో తీసిన తొలి చిత్రం సక్సెస్ఫుల్ అయింది. షోలన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మరికొన్ని షోలు పెంచమని అడుగుతున్నారు’’ అని దయా పన్నెం అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా హిట్ కావడంతో సంతోషంగా ఉన్నా. సందీప్ కిషన్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. మా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అనన్యా సింగ్. నిర్మాత సుప్రియ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ పాల్గొన్నారు. -
ఏజెంట్ కంటిన్యూ అవుతాడు
స్వధర్మ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నవీన్ పొలిశెట్టి, శృతిశర్మ జంటగా స్వరూప్ ఆర్ ఎస్‌జె దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘ఈ సక్సెస్ మా టీమ్ రెండున్నరేళ్ల కష్టం. సినిమా రిలీజ్ వరకు ఫుల్ టెన్షన్ పడ్డాం. అసలు రెండు, మూడు థియేటర్స్ దొరుకుతాయో లేదో అనుకున్నాం. అయితే మా సినిమా 70 థియేటర్లలో విడుదలైంది. విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెడుతున్నాం. విజయ్ దేవరకొండ మొదటి నుండి మమ్మల్ని సపోర్ట్ చేశారు. బన్నీ (అల్లు అర్జున్) ట్వీట్ చేయటంతో పాటు మమ్మల్ని పిలిచి ఓ అరగంట మాట్లాడారు. నేనీ రోజు ఇక్కడ నిలబడి ఉండటానికి కారణం మా దర్శకుడు స్వరూప్, నిర్మాత రాహులే’’ అన్నారు. స్వరూప్ మాట్లాడుతూ– ‘‘డిజిటల్ మాద్యమం పెరగిన తర్వాత కూడా మా సినిమా మూడో వారంలోకి రావటం ఆనందంగా ఉంది. ఏజెంట్‌కు పార్ట్–2 ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. మేం ఉన్నంతకాలం ఈ సినిమాకు ఫ్రాంచైజీ వస్తూనే ఉంటుంది’’ అన్నారు. రాహుల్ మాట్లాడుతూ– ‘‘సినిమాపై చాలామందికి అపనమ్మకాలు ఉండేవి. వాటన్నింటినీ దాటుకొని ఈ రోజు సినిమా హిట్ అవటం హ్యాపీగా ఉంది. థియేటర్స్ అడిగినప్పుడు ఫస్ట్ షోకు తీసేసే సినిమాకు థియేటర్స్ ఎందుకు? అన్నారు. సినిమా తీయటం కంటే రిలీజ్ చేయటం కష్టం. రేపు రిలీజ్ అన్నప్పుడు కూడా టెన్షన్ పడ్డాను’’ అన్నారు. -
ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం
‘‘మా సినిమాకి తొలిరోజు మిక్డ్స్ టాక్ వచ్చింది. తర్వాత వెంటనే యావరేజ్ అన్నారు. చిన్నవాళ్లం.. అందరూ ఆశీర్వదించండి. మరిన్ని సినిమాలు చేసేలా ప్రోత్సహించండి’’ అని సప్తగిరి అన్నారు. ఆయన హీరో గా, వైభవీజోషి కథానాయికగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. అర్చన కీలక పాత్రలో నటించారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర, జి.ఎన్.రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సప్తగిరి మాట్లాడుతూ– ‘‘మన బడ్జెట్‌ను, మన టార్గెట్‌ను రీచ్ అయ్యామని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్యగారు చెప్పడంతో హ్యాపీ. పరిశ్రమలో నిర్మాతలది దైవస్థానం. మా నిర్మాతలు జి.ఎన్.రెడ్డి, నరేంద్రగారికి ధన్యవాదాలు. సెకండాఫ్‌లో 10 నిమిషాలు తగ్గిస్తున్నాం. ఇక 100 శాతం గ్రాండ్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా భారీ హిట్ అవ్వాలని మేం కోరుకోలేదు. కానీ మా శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలని మాత్రం కోరుకున్నాం.. అది దక్కినందుకు అందరం తృప్తిగా ఉన్నాం. సప్తగిరిలాంటి హీరోను నమ్ముకుంటే కచ్చితంగా 200 కుటుంబాలు బతుకుతాయి’’ అన్నారు నిర్మాత నరేంద్ర. ‘‘వజ్ర కవచధర గోవింద’ సినిమాని 400 థియేటర్లలో విడుదల చేశాం. 2 రోజులకు రూ.90లక్షల గ్రాస్ వసూలు చేసింది’’ అన్నారు బ్రహ్మయ్య. ‘‘కాలేజ్, స్కూల్ ఓపెనింగ్ టైమ్‌లోనూ మా సినిమా ఇంత బాగా ఆడుతోంది. థియేటర్లలో జనాలు నవ్వుతుంటే ఆనందంగా ఉంది’’ అని అరుణ్ పవార్ అన్నారు. ‘‘ఈ సినిమాలో నల్లూరి ప్రసన్నలక్ష్మీ అనే ఎమ్మెల్యేపాత్ర చేశాను’’ అన్నారు అర్చన. -
కిల్లర్ రియల్ సక్సెస్
‘‘ఇప్పుడు సినిమాలు హిట్ సాధించడం అరుదైపోయింది. ‘కిల్లర్’ చిత్రం రియల్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు డబ్బుతోపాటు ప్రశంసలు దక్కడం గర్వంగా ఉంది’’ అని అర్జున్ అన్నారు. విజయ్ ఆంటోని, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘కొలైగారన్’. ఇందులో ఆషిమా నర్వాల్ కథానాయికగా నటించారు. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్కుమార్, టి.శ్రీధర్ ఈ చిత్రాన్ని ‘కిల్లర్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ నెల 7న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో విజయ్‌ఆంటోని మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి ‘కిల్లర్’ సినిమాతో నిరూపితమైంది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో అర్జున్‌గారు నటించడం మా ప్రధానబలం. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి వెళ్లాలి’’ అని అన్నారు. ‘‘దాదాపు 35 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా నన్ను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణగారికి కృతజ్ఞతలు. ‘కిల్లర్’ చిత్రం బాగా ఆడుతోంది. రెండోవారంలో 60థియేటర్స్ పెరగడం ఈ సినిమా విజయానికి సంకేతం. విజయ్ ఆంటోనీ, ఆండ్రూస్ బాగా చేశారు’’ అన్నారు అర్జున్. ‘‘విజయ్ ఆంటోని వల్లే ఈ అవకాశం వచ్చింది. అర్జున్‌గారు నటించడం హైలైట్. ఈ సినిమా సక్సెస్‌లో మా టీమ్ కీలకం’’ అన్నారు ఆండ్రూ. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అంజయ్య, ప్రదీప్, కథానాయిక ఆషిమా నర్వాల్, నటి భానుశ్రీ, సంగీత దర్శకుడు సైమన్ కింగ్ పాల్గొన్నారు. -
ఏడు రోజులు.. ఏడు కోట్లు
విశ్వక్సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. వాంగ్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటేరాజు సమర్పణలో విశ్వక్సేన్ సినిమాస్, టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 31న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో కరాటేరాజు మాట్లాడుతూ– ‘‘దాదాపు రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్‌వర్క్ చేసి, ఎంతో కష్టపడి విశ్వక్ సేన్ ‘ఫలక్‌నుమా దాస్’ చేశాడు.. ఆ కష్టం ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. మా సినిమా 7 రోజుల్లో 7 కోట్ల 50 లక్షలు వసూలు చేసిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువైందని అనడంతో రీ ఎడిటింగ్ చేశాం. భారీ క్యాస్టింగ్‌తో ‘ఫలక్‌నుమా దాస్ 2’తో ప్రేక్షకుల ముందుకు వస్తాం’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ ‘ఫలక్‌నుమా దాస్’తో ధమ్కీ ఇచ్చా.. నా తర్వాతి సినిమాతో షాక్ ఇస్తా’’ అన్నారు. ‘‘శివ, చందమామ’ సినిమాల్లో నా పాత్రలకు ఎంత పేరొచ్చిందో, వాటి తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’లో చేసిన పాత్రకూ అంతే పేరొచ్చింది’’ అన్నారు నటుడు ఉత్తేజ్. సహనిర్మాత: మాణిక్యరావు, హీరోయిన్ ప్రశాంతి, నటులు జీవన్, యశ్వంత్, సంజయ్, టోనీ, కౌశిక్, కార్తిక్, వివేక్ పాల్గొన్నారు. -
బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి...
అల్లు శిరీష్ హీరోగా డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ ట్యాగ్‌లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. మే 17న చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ని కరెక్ట్‌గా చేయాలి. ప్రేక్షకులందరికీ నచ్చేలా తీయాలని మేం సినిమా ఆరంభించే ముందు అనుకున్నాం. అది నెరవేరింది. శిరీష్ ఫెంటాస్టిక్‌గా నటించాడు. శిరీష్‌లో హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. అది కూడా ఈ రోజు నెరవేరింది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ, భరత్, వెన్నెల కిశోర్‌ల కామెడీ హైలైట్ అయ్యాయని అంటున్నారు. శిరీష్ నటించిన బెస్ట్ మూవీ ‘శ్రీరస్తు– శుభమస్తు’ని మించి మా సినిమా వసూళ్లు ఉండాలన్నది మా ఆశ. వీకెండ్‌కే ఆ ఫీట్‌ని సాధిస్తాం’’ అన్నారు. సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మేమందరం సినిమాలో ఎక్కడెక్కడ మంచి స్పందన వస్తుందని అనుకున్నామో, అక్కడే ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పా¯Œ ్స రావటం ఆనందంగా ఉంది. శిరీష్‌గారి యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రోల్ చేస్తున్నప్పుడు పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాను. ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్ ఉంది. ఈ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ గతంలో నేను చేసిన ఏ సినిమాకూ రాలేదు. నాకు ఇంత పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ సంజీవ్దే’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ధీరజ్ పాల్గొన్నారు. -
కథ వినగానే హిట్ అని చెప్పా
‘‘వంశీ పైడిపల్లి ‘మహర్షి’ కథ చెప్పగానే ఈ సినిమా హిట్ అని చెప్పా. డెహ్రాడూన్‌లో షూటింగ్ మొదటి రోజే ‘పోకిరి’కి రెండింతల హిట్ అవుతుందని చెప్పా. నా 25వ సినిమా ఇంత హిట్ కావడం చాలా హ్యాపీ. ఈ సినిమాలో స్టూడెంట్‌గా చేయడం బాగా కిక్ అనిపించింది’’ అని మహేశ్‌బాబు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మహర్షి’. అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించారు. మే 9న రిలీజైన ఈ చిత్రం విజయోత్సవ వేడుకను విజయవాడలోని సిద్ధార్థ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘మహర్షి’లో చేసిన రిషి నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని, ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలే వేరు. నేను ముందుగా అనుకోకపోయినా నా సినిమా హిట్ అయినప్పుడల్లా అమ్మ నన్ను పిలుస్తోంది ఇక్కడికి. రాఘవేంద్రరావు మామయ్యగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ‘రాజకుమారుడు’ సినిమా సమయంలో అన్నీ తానే అయి, ఓ స్నేహితుడిలా నాకు నటన నేర్పినందుకు రుణపడి ఉంటాను. ముగ్గురు గొప్ప నిర్మాతలు నా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అశ్వినీదత్‌గారు నా మొదటి సినిమా, 25వ సినిమా చేయటం చాలా సంతోషం. సినిమాలో పనిచేసిన నరేష్, పూజా, అందరికీ కృతజ్ఞతలు. సినిమాలో మంచి క్యారెక్టర్ చేసిన గురుమూర్తి (వృద్ధ రైతు పాత్ర చేసిన వ్యక్తి) గారి ఆశీస్సులు, దీవెనల వల్లే సినిమాకు ఇంత హిట్ లభించింది. నాన్నగారి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు నచ్చితే ఎంతలా ఆదరిస్తారో నాకు బాగా తెలుసు. వారం రోజుల్లోనే ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయగలను? ఆంధ్రా హాస్పిటల్ రామారావుగారు ఇంతకు ముందు చెప్పారు.. పిల్లలు సర్జరీ సమయంలో నా పేరు వినగానే సంతోషంగా ఫీల్ అవుతున్నారని. నా జీవితంలో ఇదే గొప్ప కాంప్లిమెంట్. పిల్లల జీవితాలను కాపాడటం చాలా గొప్ప విషయం. చాలా గొప్పగా చెబుతున్నా.. మీలాంటి వారితో పని చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా’’ అన్నారు. ‘‘బుద్ధ పౌర్ణమి రోజు మహేశ్‌బాబు అభిమానులకు గొప్ప పండగ. త్రిమూర్తులైన నిర్మాతలకు అభినందనలు. మహేష్ 25వ సినిమా హిట్ కావడంపై నా వందో సినిమా కన్నా ఎక్కువగా సంతోషపడుతున్నా. వంశీ సమాజానికి ఉపయోగపడే సినిమా తీశారు. రైతులు, స్నేహితుడు, సంపాదన వంటి విషయాలను బాగా చూపారు. మహేశ్ నన్ను మామయ్యా అంటే ఇష్టపడతాను, అలానే పిలవాలని కోరుకుంటాను’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘దేశంలో మనమందరం చల్లగా ఉన్నామంటే కారణం ఇద్దరే. ఒకరు జవాన్, మరొకరు రైతు. అటువంటి రైతుల గురించి సినిమా తీసినందుకు చాలా సంతోషం. ఈ సినిమాను రైతులకు అంకితం చేస్తున్నాను. సినిమా కోసం మూడేళ్ల పాటు మహేశ్‌తో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ‘అల్లరి’ నరే‹శ్ చేసిన రవి పాత్ర ఈ సినిమాకు చాలా ముఖ్యమైనది. ఇటువంటి సినిమా చేసే అవకాశం కలిగించిన దిగ్గజ నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా హిట్ కావడానికి సహకరించిన నా టీమ్‌కు రుణపడి ఉంటాను. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమా హిట్‌కి కీలక పాత్ర అయింది’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘‘ఇద్దరు విజయవాడ టైగర్స్‌తో కలసి సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. మే 1న (ప్రీ రిలీజ్ ఫంక్షన్లో) కాస్త ఎక్కువగా మాట్లాడాను అనుకున్నవారికి సినిమా హిట్‌తో నేను మాట్లాడింది నిజమని అర్థమై ఉంటుంది. మహేశ్ నాకు మరో సినిమాకి డేట్స్ ఇస్తే అదే నాకు పెద్ద గిఫ్ట్’’ అన్నారు ‘దిల్’ రాజు.‘‘మహేశ్‌బాబుతో నేను చేసిన ‘రాజకుమారుడు’ ఇక్కడ అలంకార్ థియేటర్లో 100 రోజులు, 4 ఆటలతో ఆడి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ‘మహర్షి’ వాటిని మించి బాగా అడుతోంది. అమెరికాలో కొత్త రికార్డ్ నెలకొల్పుతోంది. వంశీ, సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు అశ్వినీదత్. ‘‘సినిమాను హిట్ చేసిన కనకదుర్గమ్మకు, మహేశ్‌బాబుకు కృతజ్ఞతలు. సినిమా రిలీజ్ కాకుండానే హిట్ అవుతుందని సక్సెస్ మీట్ డేట్‌ను ప్రకటించాను. ఇక మీదట బాబును ‘మహర్షి’ మహేశ్ అని పిలవాలి. సూపర్ స్టార్ అన్నది బిరుదు. మహర్షి అన్నది బాధ్యత. వంశీ తన టీమ్‌తో కష్టపడి గొప్ప విజయాన్ని అందించారు’’ అన్నారు పీవీపీ. ఈ వేడుకలో దర్శకులు వైవీఎస్ చౌదరి, అనిల్ రావిపూడి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నటులు పృథ్వీరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, వైఎస్సార్సీపీ నేత భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. – ‘సాక్షి’, విజయవాడ -
ఫ్యాన్సే కాదు.. నేనూ కాలర్ ఎగరేస్తున్నా
‘‘నా కెరీర్లో ‘మహర్షి’ స్పెషల్ ఫిల్మ్. నా బిగ్గెస్ట్ హిట్స్‌ని వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు, మా నాన్నగారి(కృష్ణ) అభిమానులకు, నా అభిమానులకు హ్యాట్సాఫ్’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. సి. అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడులైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘ఈ రోజు మదర్స్ డే (ఆదివారం). నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ సినిమా రిలీజ్‌కు ముందు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. అమ్మ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. అందువల్లే ‘మహర్షి’ సినిమా ఇంత సక్సెస్ అయ్యింది. అందుకే అమ్మలకు ఈ సినిమా సక్సెస్‌ను అంకితం ఇస్తున్నాం. ‘మహర్షి’ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో వంశీ మాట్లాడుతూ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని అన్నాడు. వాళ్లు (అభిమానులు) కాలర్ ఎత్తారు వంశీ... ఇవాళ నేను కూడా కాలర్ ఎత్తాను. దత్‌గారు నన్ను ఎప్పుడూ ప్రిన్స్ బాబు అని పిలుస్తుంటారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేశ్ అని పిలుస్తారు. ఆ పేరు కోసం ఎప్పుడూ వేచి చూస్తుంటాను. ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ మహేశ్ అని దత్‌గారు అనడంతో చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు. అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘కృష్ణగారు హిట్సాధించిన ఎక్కువ సినిమాలు రైతు నేపథ్యంలో తెరకెక్కినవే. ఇప్పుడు మహేశ్ 25వ సినిమా రైతుల నేపథ్యంలో తెరకెక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సంచలన విజయానికి కారణం మహేశ్‌బాబు, వంశీలే. మే 9న వైజయంతీ బ్యానర్లో విడుదలైన మూడు సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి గౌరవం తీసుకువచ్చినందుకు గర్వంగా ఉంది. ‘దిల్’ రాజును చూస్తే డి.రామానాయుడుగారు గుర్తుకువస్తారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నానంటే సీనియర్ ప్రొడ్యూర్స్ నుంచి నేను పొందిన ప్రేరణే కారణం. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో నేను మాట్లాడిన మాటలు నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఫస్ట్ వీక్‌లోనే మహేశ్‌గారి కెరీర్‌లోని రికార్డులను క్రాస్ చేయబోతున్నాం. ఈ సినిమా విజయం ఎంత పెద్దదో ఇప్పుడే చెప్పలేం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మగారే. ‘మహర్షి’ సక్సెస్ క్రెడిట్లో 80శాతానికిపైగా మహేశ్‌గారికే చెందుతుంది. అశ్వనీదత్‌గారు, పీవీపీగారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్‌గా నాకు జన్మనిచ్చిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. ఇది మైండ్లకు చెప్పే సినిమా కాదు. మనసులకు చెప్పే సినిమా అని చెప్పాను. మనసుతో సినిమా చూసి ఇంత ఆనందాన్ని మాకు ఇస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారు పర్ఫెక్షన్కి నిదర్శనం. నేను సీరియస్ క్యారెక్టర్స్‌ను చేయగలనని నమ్మిన వంశీ, మహేశ్‌లకు థ్యాంక్స్. ఇవాళ మా నాన్న(దర్శక–నిర్మాత ఈవీవీ సత్యనారాయణ) ఉండి ఉంటే చాలా సంతోషంగా ఫీలయ్యేవారు. ఒక డైరెక్టర్‌గా ఆయన గర్వపడేవారు. ఎందుకంటే ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు. ఆ రైతుగా ఇంకా గర్వపడేవారు. హిట్ అన్న పదం విని నాలుగేళ్లు అయ్యింది. ‘మహర్షి’ సక్సెస్‌తో నాకు అనిపించింది... సక్సెస్‌కు కామాలే ఉంటాయి... ఫుల్‌స్టాప్‌లు ఉండవు’’ అన్నారు. ‘‘మహేశ్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ చిత్రం. కథకు తగ్గట్టు సినిమాను తీస్తాడు వంశీ. పెద్ద సినిమాను ఎంత ప్రేమించి తీస్తారో, చిన్న సినిమానూ అంతే ప్రేమించి తీస్తారు ‘దిల్’ రాజు. అశ్వనీదత్ వంటి సీనియర్ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి అవసరం’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ‘‘రైతుల గురించి చర్చించిన ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉండటం హ్యాపీ’’ అన్నారు పృధ్వీ. ‘‘నేను కర్నూలులో స్టేజ్ ఆర్టిస్టుని. షార్ట్స్ఫిల్మ్స్లో నటిస్తున్న నన్ను చూసి దర్శకుడు వంశీ నాకు మహేశ్‌బాబుతో కలిసి నటించే అవకాశం ఇచ్చారు’’ అని రైతు పాత్ర చేసిన గురుస్వామి అన్నారు. నటులు శ్రీనివాసరెడ్డి, కమల్ కామరాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీ మణి, వీఎఫ్ఎక్స్ నిపుణుడు యుగంధర్ మాట్లాడారు. -
ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు
‘‘చిత్రలహరి’ సినిమాతో తేజుకి మంచి సక్సెస్ రావడం చాలా సంతోషంగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఫెయిల్యూర్ తన దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘చిత్రలహరి’. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. హైదారాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సినిమాలో తేజుని చూసినప్పుడు పర్సనల్‌గా కూడా నాకు తేజునే గుర్తుకొచ్చాడు. సింపుల్ క్యారెక్టర్స్‌ను హీరోలకు అడాప్ట్ చేస్తూ కిశోర్ సినిమాలు చేస్తుంటారు. తన స్టామినాకు తగ్గ సక్సెస్ ఇంకా రాలేదనే భావిస్తున్నారు. ఇండస్ట్రీకి రాగానే మూడు బ్లాక్‌బస్టర్స్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ చిన్న స్పీడ్ బ్రేకర్ దాటి మళ్లీ సక్సెస్‌బాట పట్టింది. సునీల్ తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. ‘‘కలెక్షన్స్ బాగా వచ్చాయి. సినిమా సక్సెస్ అంటున్నారు. కానీ సినిమా ప్రజలకు బాగా రీచ్ కావడమే నా దృష్టిలో సక్సెస్. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. కిశోర్ నా స్నేహితుడే. పోసానిగారు లవ్లీ పర్సన్. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలో మా అమ్మను చూసుకున్నాను’’ అన్నారు సాయిధరమ్‌తేజ్. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. హీరో సాయి, దర్శకుడు కిశోర్, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కిశోర్. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు సునీల్. ‘‘ఇప్పటివరకు 35 స్ఫూర్తి పాటలు రాశాను. ఈ సినిమా కోసం కూడా అలాంటి పాట రాశాను. ఈ విజయోత్సవ సభలో అందర్నీ చూడటం సంతోషంగా ఉంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. -
రెగ్యులర్ మూవీ కాదు!
శ్రీనివాస్ సాయి, ప్రియాంకా జైన్ జంటగా నాదెళ్ల సతీష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినరాసోదర వీరకుమార’. లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మా సినిమా సెకండాఫ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న విధానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఇంకా సక్సెస్ కావడానికి ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు.‘‘ఇది రెగ్యులర్ మూవీ కాదు’ అని సినిమాను చూసిన వారందరూ బాగుందని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. యూత్ సపోర్ట్ చేయాలి’’ అన్నారు సతీష్ చంద్ర. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు లక్ష్మణ్. ‘‘ఇండస్ట్రీ కొత్తవారిని ఎలా ప్రోత్సహిస్తుందో ప్రేక్షకులు కూడా అలాగే మా చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు ప్రియాంక. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, రాజేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలాంటి సినిమా అవసరమా అన్నారు..
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తాగుబోతు రమేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంతోశ్ పి జయకుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్‌తో తయారైన ఈ చిత్రం 2 రోజుల్లోనే దాదాపు 2.5 కోట్ల రూపాయలను రాబట్టడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడిగా హ్యాపీగా ఉంది. సపోర్ట్ చేసిన యూనిట్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇలాంటి సినిమాలు అవసరమా? అన్నారు. సినిమా చూడకుండానే చాలా రకాలుగా మాట్లాడారు. అలాంటి వారందరికీ మా సినిమా మంచి సమాధానం చెప్పింది. మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. బి, సిలలో ఆడే సినిమా ఇది అన్నారు. అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి థ్యాంక్స్. ఆనందంతో మాటలు రావడం లేదు. ష్యూర్ షాట్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ముందే చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు. హీరోయిన్ నిక్కి తంబోలి చిత్రవిజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
చిన్న చిత్రాన్ని ఆదరిస్తున్నారు
ప్రసాద్ రెడ్డి, రేణుక జంటగా కళా రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ నిమిషం’. వెంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకంపై బండారు హరితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో కళా రాజేష్ మాట్లాడుతూ– ‘‘ఆడపిల్లలను రక్షించండి– సంరక్షించండి’ అనే ప్రధాన పాయింట్ చుట్టూ తెరకెక్కించిన చిత్రమిది. 44మంది నూతన నటీనటులతో, కొత్త సాంకేతిక నిపుణులతో నిర్మించిన మా చిన్న బడ్జెట్ చిత్రాన్ని ఆదరించి, ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమా తీయడం వెనక ఉన్న మా ఉద్దేశం ప్రేక్షకాదరణతో సఫలమైంది’’ అన్నారు ప్రసాద్‌రెడ్డి. ‘‘లెక్చరర్స్ అయిన మేము నిర్మించిన ఈ చిత్రాన్ని సెన్సార్ అధికారుల నుంచి ఎందరో పెద్దలు ఆశీర్వదించినందుకు థ్యాంక్స్. మా సినిమాని ప్రోత్సహించిన డైరెక్టర్ జి.నాగేశ్వర రెడ్డి, నటి జయసుధ, ఎమ్మెల్యే రోజా, హీరో శ్రీకాంత్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కె నజీర్. రేణుక, కో డైరెక్టర్ రాయుడు పాల్గొన్నారు. -
మా కష్టమంతా మర్చిపోయాం
‘‘ఆంధ్రా ప్రజలకు పెరుగన్నం, ఆవకాయతో తినడం ఇష్టం. తెలంగాణ వాళ్లకు ధమ్ బిర్యానీ తింటే సంతృప్తి. ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’ చూస్తే అలాంటి సంతోషమే ప్రేక్షకులకు దక్కుతుంది’’ అని మహంకాళి శ్రీనివాస్ అన్నారు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళి శ్రీనివాస్ నిర్మాత. కవి గోరటి వెంకన్న కీలక పాత్ర పోషించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. తొలి చిత్రానికే విజయం దక్కడం నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చింది’’ అన్నారు. ‘‘ఫస్ట్ షో చూస్తుంటే సినిమాకు పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. సినిమా బావుంటే నటీనటులు కొత్తా పాతా అని ఉండదని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’’ అన్నారు నాగసాయి. ‘‘ఎలాంటి అశ్లీలత, హింస మా చిత్రంలో లేదు. నేను రాసిన పాటలను అందరూ ఆనందించారు. తాజాగా నేను నటించిన ఈ చిత్రాన్ని కూడా ఆనందిస్తున్నారు’’ అని గోరటి వెంకన్న అన్నారు. ఈ వేడుకలో శ్రీనాథ్, శాన్వీ, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, మౌన శ్రీ మల్లిక్ పాల్గొన్నారు. -
ఈ సక్సెస్ మా నాన్నగారికి అంకితం
‘‘షూటింగ్‌కు అందరికంటే ముందు వచ్చే ప్రొడక్షన్ యూనిట్, ఆలస్యంగా వెళ్లే లైట్మేన్లు, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే డ్రైవర్స్. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ కష్టం ఈ సినిమాలో ఉంది. సినిమా బావుంటుందని అందరం నమ్మి పని చేశాం’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘118’. కల్యాణ్‌రామ్ హీరోయిన్గా, షాలినీ పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. మార్చి 1న రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసి, సినిమాలో పని చేసిన అందరికీ షీల్డ్‌లను బహూకరించారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసి నన్ను రుణపడిపోయేలా చేశారు. నివేదా ఈ సినిమాకు సెకండ్ హీరో. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. గుహన్‌గారి నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కాంప్లిమెంట్ తారక్ ఇచ్చాడు. తనకు థ్యాంక్స్. జయాపజయాలు పెక్కన పెట్టి ప్రతి సినిమాకు ‘ఆల్ ది బెస్ట్ నాన్న’ అని నాన్నగారు (హరికృష్ణ) చెబుతుండేవారు. ఈ విజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా 23 ఏళ్లు పూర్తి చేశాను. అందులో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. వాటిలో ఈ సినిమా కూడా ఉంటుంది. మంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ కావాలనుకుంటున్న కలను ఆయన నిజం చేశారు. 118 నిర్మాత మహేశ్ బాగా ప్రమోట్ చేశారు. సక్సెస్‌తో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టింది’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నం అని అందరూ అభినందిస్తున్నారు. పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. ‘‘కథ వినగానే సినిమాలో భాగం అవ్వాలనుకున్నాను. కాన్సెప్ట్ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. -
హీరోకి వచ్చిన కలలన్నీ నాకొచ్చినవే
‘‘దర్శకుడిగా నా ప్రయాణం ఓ కలతో మొదలైంది. ఆ కలతో తీసిన ‘118’ సినిమా విజయం సాధించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్. కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా గుహన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ మహేశ్ కోనేరు నిర్మించిన ‘118’ ఇటీవల విడుదలైంది. మంచి టాక్‌తో విజయవంతంగా సాగుతోందన్నారు గుహన్. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘118’లో హీరోకి వచ్చిన కలలు నాకొచ్చినవే. నాకు ఒక పెద్ద రూమ్‌లో ఒక్కడినే ఉండాలంటే చాలా భయం. కానీ కెమెరామేన్‌గా అనేక ప్రదేశాలు తిరుగుతుంటాను కాబట్టి తప్పదు. ఓ సినిమా కోసం నేను ఓ హోటల్ రూమ్‌లో బస చేశాను. రాత్రి నిద్రపోయిన తర్వాత భయంకరమైన కల వచ్చింది. అది నిజంగా జరిగినట్లే అనిపించింది. మర్నాడు ఒంట్లో ఓపిక లేనట్లు నీరసంగా లొకేషన్‌కి వెళ్లాను. డాన్స్‌మాస్టర్ ప్రేమ్‌రక్షిత్ ‘ఏంటి సార్ నీరసంగా ఉన్నారు’ అనడిగితే, ‘కల వచ్చింది’ అని చెప్పాను. కొన్ని కలలు అలానే ఉంటాయి అనుకున్నాం. ఆ కల గురించి ఆ తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాను. ఓ రెండేళ్ల తర్వాత అదే హోటల్లో అదే రూమ్‌లో ఉండాల్సి వచ్చింది. మళ్లీ అదే కలకు కంటిన్యూషన్గా కల రావడంతో ఆశ్చర్యపోయాను. ఓసారి అనుకోకుండా కల్యాణ్‌రామ్‌ను కలిసినపుడు ‘ఓ లైన్ ఉంది వింటారా’ అని అడిగితే ‘సరే’ అన్నారు. రెండు గంటలపాటు కథను నెరేట్ చేశాను. ‘మీరు కెమెరామేన్ అయ్యుండి కథని ఇంత బాగా నెరేట్ చేశారు, మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారాయన. వారం రోజుల్లో సినిమా స్టార్ట్ అయ్యింది. అంతా ఓ కలలా జరిగిపోయింది. ప్రస్తుతం మేం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలామంది నిర్మాతలు వేరే భాషలో ఈ సినిమా చేయొచ్చు కదా అంటున్నారు. నేను ఇదే కథను ఏ భాషలో కావాలన్నా ఎన్నిసార్లు చేయమన్నా ఆనందంగా చేస్తాను. చేసిన సినిమానే కదా, మళ్లీ ఏం చేస్తాంలే అనుకోను. ఒకవేళ హిందీలో కాని, తమిళ్లో కాని రీమేక్ చేసే అవకాశం వస్తే తెలుగులో నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా ఇంకా బాగా చేస్తాను. నేను దర్శకత్వం వహించే సినిమాలకు నేనే కెమెరామెన్‌గా పనిచేస్తే దర్శకునిగా నాకేం కావాలో అలా చేసుకోగలుగుతాను. నాలోని డైరెక్టర్‌కి, కెమెరామెన్‌కి క్లాష్ ఉండదు. మంచి అవుట్‌పుట్ ఇస్తాను. ప్రస్తుతం తమిళ్లో కెమెరామెన్‌గా చరణ్ దర్శకత్వంలో ఓ సినిమాకు పనిచేస్తున్నా. తెలుగులో దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను’’ అన్నారు. -
అదే మా సక్సెస్
‘‘అక్కడొకడుంటాడు’ చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్లు సాధారణంగా ఉన్నా మౌత్ టాక్‌తో ఆదివారం నుంచి కలెక్షన్లు బాగా పెరిగాయి. ‘భారతీయుడు, అపరిచితుడు’ చిత్రాల కోవలో మా సినిమాలో అండర్ కరెంట్‌గా డ్రంకన్ డ్రైవ్ పైన సందేశం ఉంటుంది. ఇది పూర్తి కమర్షియల్ చిత్రం. నిర్మాత సి.కల్యాణ్‌గారి వల్లే మాకు మంచి థియేటర్లు లభించాయి’’ అని శివ కంఠంనేని అన్నారు. రామ్ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘కొత్తదనానికి పట్టం కడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిది. చివరి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తోంది. మేము అనుకున్నట్టు ప్రేక్షకులకు చేరువయ్యాం’’ అన్నారు. ‘‘సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను కూర్చోబెడుతోంది. అదే మా సక్సెస్’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక, డిస్ట్రిబ్యూటర్ దాసరి శ్రీనివాస్, చిత్ర నిర్వాహకులు ఘంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నువ్వు ఊర మాస్ అంటే హ్యాపీగా అనిపించింది
‘‘వందకోట్ల సినిమాలను చేసే సత్తా అన్ని ఇండస్ట్రీలకు ఉంటుంది. ప్రేక్షకులు పెరిగారు. కన్నడ ఇండస్ట్రీ చిన్నదంటే నాకు కోపం వస్తుంది. బాధగా ఉంటుంది. సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాతలను నేను అడగను. పార్కింగ్ క్రౌడ్‌ని మాత్రమే చూస్తాను. నా సినిమా చూసి ఆడియన్స్ హ్యాపీ అంటే అదే నా విజయంగా ఫీల్ అవుతాను’’ అన్నారు నటుడు యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదలైంది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో అనువదించి, విడుదల చేశారు. గురువారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో యశ్ మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్‌గారు అభిమానులు దేవుళ్లు అనేవారు. ఆ విషయం నాకు మళ్లీ గుర్తొచ్చింది. నేను ఎవరికీ తెలీదు. నా సినిమాను చూసి నాకు వెల్కమ్ చెప్పిన తెలుగు ప్రేక్షకులు దేవుళ్లు. పదేళ్ల క్రితం నా వర్క్‌ని చూసి కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు తెలుగువారు సపోర్ట్ చేశారు. తెలుగు కాంప్లిమెంట్స్ స్పెషల్‌గా ఉంటాయి. ఒకచోట ‘అన్నా నువ్వు ఊర మాస్’ అన్నారు. ఆనందంగా అనిపించింది. నిర్మాత విజయ్ కిరంగదూర్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సెట్లోకి వచ్చిన మూడో రోజే సినిమాను రెండు పార్టులుగా తీయాలనుకున్నాం. ఇలాంటి ఒక సినిమాకు మంచి పొజిషన్ దొరక్కపోతే ఆడియన్స్‌కు రీచ్ అవ్వదు. ఆ పనిని బాగా చేసిన సాయికొర్రపాటి అన్నకు ధన్యవాదాలు. రాజమౌళిగారు ఉన్న స్థాయికి మా సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మా సినిమా గురించి మంచిగా మాట్లాడినప్పుడు భయపడ్డాను. ఆ అంచనాలను అందుకుంటానా? అని. సినిమాపై నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కేజీ రామారావుగారు గైడ్ చేస్తూనే కంట్రోల్ చేశారు. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిదే కాదు. టీమ్ అందరిదీ. తెలుగు హీరోల సినిమాలు చూసి నేను మరింత బాగా తెలుగు నేర్చుకుంటాను. కేజీఎఫ్ రెండో పార్ట్ మరింత బాగా రావడానికి కష్టపడతాను’’ అన్నారు. ‘‘కేజీఎఫ్’ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు. కర్ణాటక గోల్డెన్ హిట్. సక్సెస్ సాధించిన ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు హ్యాపీ’’ అన్నారు రచయిత రామజోగయ్యశాస్త్రి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కేజీ రామారావు. రచయిత హనుమాన్, కెమెరామెన్ భువన్ గౌడ మాట్లాడారు. నిర్మాత సాయి కొర్రపాటి పాల్గొన్నారు. -
పెట్టిన పెట్టుబడి వస్తే హిట్టే
సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకునిగా పరిచయం అయ్యారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ఫుల్ కలెక్షన్లను సాధిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సుమంత్ మాట్లాడుతూ– ‘‘నేను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఈ రోజుల్లో సక్సెస్ అంటే మూడు రకాలుగా డివైడ్ చెయ్యొచ్చు. మొదటిది విపరీతంగా కలెక్షన్లు సాధించి దుమ్ము దులపటం. రెండోది విమర్శకుల ప్రశంసలతో పాటు పేరు, అవార్డులు రావడం. ఇక మూడోది నిర్మాత పెట్టిన డబ్బు ఆయనకి తిరిగి రావటం. ఈ కాలంలో అలా జరగటం చాలా అరుదు. పది శాతం సినిమాలు మాత్రమే పెట్టిన పెట్టుబడిని సాధిస్తున్నాయి. ఇందులో మా సినిమా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ’’ అన్నారు. సంతోశ్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను, నా కథను, కథనాన్ని నమ్మిన భీరం సుధాకర్‌గారికి థ్యాంక్స్. నా ఫేవరెట్ హీరో సుమంత్. ఆయనతో నా మొదటి సినిమా చేసి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.’’ అన్నారు. భీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెడుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన సుమంత్ గారితో పాటుయూనిట్కు కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, ‘జోష్’ రవి పాల్గొన్నారు. -
ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది!
‘‘దిల్’ రాజు మా కుటుంబ సభ్యుడు. కథని నమ్ముకుని ప్రయాణం చేసే అతి తక్కువ మంది నిర్మాతల్లో రాజుగారు ఒకరు. అలాంటి నిర్మాత ఎంచుకున్న దర్శకుడు త్రినాథరావు. రామ్ స్వచ్ఛత ఉన్న మనిషి. తన సినిమాలు సరదాగా ఉంటాయి. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో రామ్‌తో సెటిల్డ్‌గా చేయించారు త్రినాథరావు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు హర్షిత్ నా వద్ద పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నేను తీసిన ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే’ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఓ డైరెక్టర్‌గా ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది.ఈ మధ్య కాలంలో ప్రకాశ్‌రాజ్‌గారితో చాలా ఎక్కువ రోజులు పనిచేసిన యూనిట్ మాదే. మా సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ దసరాకి ప్రేక్షకులు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు హ్యాపీ. చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. త్రినాథ్రావుగారు చాలా ఎంటర్టైనింగ్ డైరెక్టర్’’ అన్నారు రామ్. ‘‘డైరెక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా, రైటర్‌గా 34 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నా. త్రినాథరావుని చూస్తే.. ఏ కోశానా డైరెక్టర్ లుక్‌లో కనపడడు. కానీ, సినిమాను కంఫర్ట్‌బుల్‌గా తీస్తాడు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ఈ సమావేశంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, రచయితలు సాయికృష్ణ, ప్రసన్న కుమార్, నిర్మాత హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అది మా అదృష్టం
‘‘మూడు పువ్వులు ఆరు కాయలు’ సినిమా మూడు సార్లు ఆగిపోయింది. ఆరు మంది నిర్మాతలు మారారు. చివరకు మా ఫ్రెండ్ వబ్బిన వెంకట్రావు నిర్మాతగా ఈ సినిమా పూర్తి చేశాం’’ అని డైరెక్టర్ రామస్వామి అన్నారు. ‘‘అర్ధనారి’ ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో వెంకట్రావు నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో రామస్వామి మాట్లాడుతూ– ‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురువారం విడుదలైంది. మా సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రానికి మేం పోటీ కాదు. మాకు ఎన్టీఆర్ గారంటే గౌరవం, త్రివిక్రమ్‌గారంటే ఇష్టం. వాళ్ల సినిమా మధ్య మా చిత్రం విడుదల చేయడం మా అదృష్టం. ఆ సినిమాకు వచ్చిన ఓవర్ ఫ్లోతో మా హాల్ నిండినా చాలనుకున్నాం’’ అన్నారు. డా.మల్లె శ్రీనివాసరావు, భరత్ బండారు, వబ్బిన వెంకట్రావు, సంగీత దర్శకుడు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. -
సినిమా తీయడం ఈజీ..రిలీజ్ కష్టం
‘‘మా బ్యానర్లో విడుదల చేసిన ‘భలేమంచి చౌకబేరమ్’ చిన్న సినిమా అయినా ప్రేక్షకాదరణ బాగుంది. కథ బాగుండటం వల్లే సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు ఇంకా పెరిగి, మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అని చిత్ర సమర్పకులు కె.కె. రాధామోహన్ అన్నారు. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ కీలక పాత్రల్లో మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’. ఆరోళ్ల సతీష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం తేలిక.. కానీ, విడుదల కష్టం. మౌత్ టాక్‌తో రీచ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా టార్గెట్‌ని రీచ్ అయ్యాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మురళీకృష్ణ. ‘‘టిక్కెట్టుకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం ఇచ్చే చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’’ అన్నారు నవీద్. ‘‘సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం ఆటకు మా సినిమా ఓపెనింగ్స్ చూసి నిరుత్సాహపడ్డాం. అదేరోజు సాయంత్రానికి థియేటర్లు ఫుల్ అయ్యాయి’’ అన్నారు నూకరాజు. ‘‘టఫ్ సిచ్యువేషన్లో కాన్ఫిడెన్స్‌తో మా సినిమా విడుదల చేశాం. టాక్ బావుంది’’ అన్నారు సతీష్. యామినీ భాస్కర్, నటులు రాజా రవీంద్ర, ముస్తఫా, ఉద్ధవ్, పూర్ణాచారి పాల్గొన్నారు. -
నమ్మకం నిజమైంది
ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో చిత్రనిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కొన్నాను. మీరు (ప్రేక్షకులు) ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు, నా నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బావుందని మన దేశం నుండే కాదు, యూకే నుండి కూడా మంచి టాక్ వచ్చిందని చెప్తున్నారు. సినిమాని వేరే ప్లేసెస్‌లో కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను మళ్లీ మళ్లీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ బాగా వచ్చాయి. మౌత్ టాకే మా సినిమాకి మెయిన్ పబ్లిసిటీ’’ అన్నారు. -
ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కర్ని హెచ్చరిస్తున్నా: చిరంజీవి
‘‘ఈ ఫంక్షన్లో పాలు పంచుకోవడం నా బాధ్యత. ఆ సంతృప్తి కోసమే ‘గీత గోవిందం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌కి వచ్చా. ఓ సినిమా బాగుందంటే అది చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెట్ సినిమానా అని ఆలోచించరు. కంటెంట్ బాగుంటే మీ (ప్రేక్షకులు) దృష్టిలో అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే’’ అని చిరంజీవి అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘రెండేళ్లుగా చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషం, ఉత్సాహం, ప్రోత్సాహంతో ముందుకెళుతోందన్నది వాస్తవం. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, అభిమానానికి మేం ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. ఏం సినిమా తీస్తున్నారని అరవింద్‌గారిని నేను అడిగినప్పుడు ‘గీత గోవిందం’ చేస్తున్నాను. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్ అగ్రెసివ్ పాత్ర చేశాడు.. ‘గీత గోవిందం’ సినిమాలో చాలా సాఫ్ట్. ఈ పాత్రని ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న డౌట్ వచ్చినప్పుడు ‘విజేత’ గుర్తొచ్చింది. ‘ఖైదీ, అడవిదొంగ, చట్టంతో పోరాటం, చట్టానికి కళ్లు లేవు’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా నేను దూసుకెళుతున్న టైమ్‌లో.. ‘విజేత’ ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఈ పాత్రలో నన్ను ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న మీమాంస నాకు, అరవింద్‌గారికి ఉండేది. ఆ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసి, ఆల్ క్లాస్ హీరో అనిపించింది. ‘గీత గోవిందం’ సినిమా కూడా విజయ్‌ని ఆల్ క్లాస్ హీరో అనిపించింది. విజయ్‌కి ఇది ల్యాండ్ మార్క్ ఫిల్మ్. నీకు చాలా భవిష్యత్ ఉంది. ఈ సినిమాతో నీకు స్టార్ స్టేటస్ వచ్చింది. 1978 నుంచి నేను 30 సినిమాలు చేసినా సరే ‘ఖైదీ’ సినిమా నాకు స్టార్ హీరో స్టేటస్ ఇచ్చింది. ఇండస్ట్రీలోని టాప్‌స్టార్స్‌లో విజయ్ ఒక్కడు అయినందుకు స్వాగతిస్తున్నా. మన ఇండస్ట్రీకి దక్కిన మరో అరుదైన స్టార్ విజయ్ దేవరకొండ’’ అన్నారు. ఇదేం న్యాయం పైరసీ గురించి చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గీత గోవిందం’ సినిమా కంటెంట్ దాదాపు గంటన్నర్ర లీకైపోయింది.. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు అరవింద్. ఆయనకు ఊరట కలిగించేందుకు నేను ఓ మాట చెప్పా. పవన్ కల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ కంటెంట్ లీకైనా సక్సెస్‌కి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. ‘గీత గోవిందం’ సినిమా కూడా ‘అత్తారింటికి దారేది’ అంత హిట్ అవుతుందని సెంటిమెంట్‌గా అనుకోమని చెప్పా. ఇన్ని కోట్లు వెచ్చించి ఓ సినిమా తీసిన తర్వాత ఆ కంటెంట్‌ని కుర్రతనంగానో, వేరే దురుద్దేశాలు ఉండో దాన్ని చోరీ చేసి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం ఏం న్యాయం? సినిమా పరిశ్రమ కొన్ని వేలమందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న మాతృసంస్థ.. తల్లిలాంటిది. ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్ దాన్ని దొంగలించి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడమంటే ఎంత ద్రోహం చేస్తున్నారంటే.. తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని తెలుసుకోవాలి. ఈరోజు వారంతా జైలులో ఊసలు లెక్కపెడుతున్నారు. ఈ దుస్థితి కావాలా మీకు? మీ తల్లితండ్రులకు బాధ కలిగించాలా? ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కర్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. కింది స్థాయి టెక్నీషియన్స్ ఎవరైనా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే అది మీ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని గుర్తుంచుకోండి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ లాస్ట్ రీల్ రీ–రికార్డింగ్ టైమ్‌లో కంటెంట్ లీకు అయిందని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇంతటి విజయ పతాకం ఎగురవేస్తుంటే మేం చూసి ఆనందిస్తున్నాం. పరశురామ్ గ్రేట్ రైటర్. చిరుకి, విజయ్‌కి కొన్ని కామన్ పోలికలు ఉన్నాయి. విజయ్.. ఈ సినిమాతో నువ్వు స్టార్ అయ్యావు’’ అన్నారు. చిత్ర నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం బన్నీనే (అల్లు అర్జున్). అరవింద్ గారికి రెండు సక్సెస్ సీక్రెట్స్ ఉన్నాయి. సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా బాగా రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?.. ఇదే ఆయన మొదటి సక్సెస్ ఫార్ములా. రెండో సక్సెస్ ఫార్ములా ఏంటంటే.. డైరెక్టర్ అనుకున్నట్లు సినిమా వచ్చేవరకూ, ఆయనకు సంతృప్తి ఇచ్చే వరకూ తీయిస్తూనే ఉంటారు’’ అన్నారు. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి, నాకు పునర్జన్మను ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చిరంజీవి సార్.. మీరు మా సినిమా చూసి నాతో మాట్లాడిన మాటలు నాకు భగవద్గీత లాంటివి. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లేని విజయ్ హీరోగా ఎదుగుతూ పైకొస్తుంటే ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి హ్యాట్సాఫ్’’ అన్నారు. ‘‘ఇక్కడ మనం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. కేరళ పరిస్థితి బాగోలేదని మొన్నే చిరంజీవిగారు, చరణ్, బన్నీ చేయూతనిచ్చారు. అరవింద్‌గారి అనుమతితో మా బ్యానర్ నుంచి ఓ పది లక్షలు ఇవ్వనున్నామని ఇక్కడ ప్రకటిస్తున్నా. ‘అర్జున్‌రెడ్డి’తో కాదు ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరో స్థాయికి వెళ్లాడు విజయ్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్ వెనకాల అరవింద్‌గారు, పరశురామ్‌గారు, ‘బన్నీ’వాసుగారు ఉన్నారు. జస్ట్ నేను యాక్టర్లా నా జాబ్ చేశానంతే’’ అన్నారు విజయ్ దేవరకొండ. సీనియర్ నటి అన్నపూర్ణ, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, శానం నాగఅశోక్‌కుమార్, డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, కెమెరామేన్ మణికందన్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ పేరు పెట్టినప్పుడే నమ్మకం వచ్చేసింది
‘‘ప్రేక్షకులకు దగ్గర కావడానికి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బావుంటుందని అనుకున్నా. ‘చి..ల..సౌ’ కథ వినగానే నాకు మరో కొత్త మెట్టు అవుతుందనిపించింది. నా నమ్మకం నిజమైంది. కరెక్ట్ సినిమా చేశావని చాలామంది అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని హీరో సుశాంత్ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల..సౌ’. అక్కినేని నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సుశాంత్ మాట్లాడుతూ– ‘‘చి..ల..సౌ’ చిత్రానికి నాకు అభినందనలు వచ్చాయంటే ఆ క్రెడిట్ రాహుల్‌కే దక్కుతుంది. బయటి బ్యానర్లో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సిరుని సినీ క్రియేషన్స్ వారికి థ్యాంక్స్. సమంత, చైతన్యకు సినిమా నచ్చడం, సినిమాలో భాగమవుతానని చైతన్య చెప్పడం హ్యాపీగా అనిపించింది. నిర్మాతగా నాగార్జునగారి పేరు కూడా పెట్టినప్పుడే సినిమాపై నమ్మకం వచ్చేసింది’’ అన్నారు. ‘‘ప్రీమియర్ షో నుంచి సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. టాక్ వచ్చినంతగా ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదేమో అనిపించేది. ఈ సినిమా స్లోగా ఎక్కుతుందని నాగార్జునగారు అన్నారు. ఆయన అన్నట్లుగానే ఫస్ట్ డేతో పోల్చితే తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువయ్యాయి’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘సినిమా చేసేటప్పుడు రిస్క్ చేస్తున్నానని చాలామంది అన్నారు. కానీ ‘చి..ల..సౌ’ రిలీజ్ తర్వాత ఫోన్ చేసి అభినందిస్తున్నారు. సుశాంత్‌కు ఒక వే క్రియేట్ అయింది’’ అన్నారు నిర్మాత జస్వంత్. -
నేను క్రియేటర్‌ని కాదు
‘‘గూఢచారి’ టీమ్ అంతా న్యూ జనరేషన్ యాక్టర్స్, టెక్నీషియన్స్. మీరంతా తెలుగు సినిమా భవిష్యత్తు. మీతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. లేకుంటే నేను వెనకబడిపోతాను’’ అని నాగార్జున అన్నారు. అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి నాగార్జున మాట్లాడుతూ– ‘‘గూఢచారి’ బడ్జెట్ తెలుసుకుని ఎలా సాధ్యమైందని ఆలోచించా. ఇప్పటి వరకు మేం చేస్తున్న సినిమాలు చూసి మేం అంత సోంబేరులా? బద్ధకస్తులమా? సినిమా తీయడం మాకు తెలియదా? అనిపించింది. ఈ చిత్రం చూశాక నాకు తెలియని లొకేషన్స్ అన్నపూర్ణలో ఉన్నాయా? అనిపించింది. సిగ్గేసింది. నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) ఉండుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. నాకు ఇలాంటి సినిమా చేసే అవకాశం రాలేదు. నేను క్రియేటర్‌ని కాను. అందుకనే డైరెక్టర్స్, రైటర్స్పైన ఆధారపడతాను. ఓ స్పై మూవీ తెలుగులో ఎలా ఆడుతుంది? మణిరత్నం ‘బాంబే’ సినిమా కంటే ఏం చేస్తారు? అనిపించింది. ఈ సంవత్సరం ‘రంగస్థలం, మహానటి’ తర్వాత ‘గూఢచారి’ మాత్రమే ఆడింది. అలాగని ఇతర సినిమాలను తక్కువ చేయడం లేదు. సుప్రియను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. తను రా ఆఫీసర్ రోల్‌కి చక్కగా సూట్ అయింది. 1989లో ‘శివ’ వచ్చినప్పుడు దర్శకులకు, నిర్మాతలకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందో.. ‘గూఢచారి’ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ కావాలి. ‘గూఢచారి 2’కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణం నా నిర్మాతలే.మా కలను, మా సినిమాను ప్రపంచానికి చూపించిన అనిల్‌గారికి థ్యాంక్స్. నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇచ్చిన శశికి థ్యాంక్స్. మా సినిమాని సపోర్ట్ చేసినవారికి కృతజ్ఞతలు’’ అన్నారు అడివి శేష్. నిర్మాతలు అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, కెమెరామేన్ షానీల్ డియో, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, నటీమణులు సుప్రియ, మధుశాలిని పాల్గొన్నారు. -
ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాం
‘‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికి సర్వత్రా వస్తున్న ప్రశంసలు చూసి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాం. ప్రతి ఒక్కరూ బాగా చేశారు. మొదటి నుంచీ నాకు సినిమాపై నమ్మకం ఉంది. మౌత్ పబ్లిసిటీతో మెల్లగా ప్రేక్షకులకు చేరువవుతుంది అనుకున్నాను. అయితే అందరూ అంతకన్నా గొప్పగా ఆదరిస్తున్నారు’’ అని నటుడు రావు రమేశ్ అన్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా రావు రమేశ్, ‘సింధూర పువ్వు’ రాంకీ ముఖ్య పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘తొమ్మిదేళ్ల క్రితం నేను పరిశ్రమకి వచ్చాను. మా ఊరి నుంచి కూడా ఎవరూ పరిశ్రమకి రాలేదు. నాతో పాటు, మా అమ్మానాన్నలు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. కోట్లు కుమ్మరించినా కొనుక్కోలేని చాలా విషయాలను నేను మిస్ చేసుకున్నాను. అయినా ఇవాళ ఈ సినిమా విజయం వాటన్నిటినీ మరపిస్తోంది’’ అన్నారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో 175, ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లలో మా సినిమా విడుదల చేశాం. తొలిరోజే రూ. 2 కోట్ల గ్రాస్ వచ్చింది’’ అన్నారు అశోక్ రెడ్డి. ‘‘ధైర్యం చేసి చాలా బోల్డ్‌గా చేశా. అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘ఈ విజయాన్ని ముందే ఊహించాం. సినిమా పెద్ద హిట్ అయినందుకు హ్యాపీ’’ అన్నారు కార్తికేయ. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, నేపథ్య సంగీత దర్శకుడు స్మరణ్, కెమెరామేన్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
ఫిదా అయ్యారు
గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ‘‘గ్రాండ్ సక్సెస్ సాధించి రెండో వారంలోకి అడుగు పెట్టింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారి కెరీర్లో 25వ చిత్రం ‘పంతం’ మాబ్యానర్లో నిర్మించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఆయనకి ఎంత ముఖ్యమో నాకు అవగాహన ఉండటంతో మేకింగ్‌లో రాజీ పడలేదు. మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. చక్రవర్తి కొత్తవాడైనా క్లారిటీతో అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలోని గ్రాండ్‌నెస్ ఆడియన్స్‌ని మెప్పించింది. కోర్టు సన్నివేశంలో గోపీచంద్‌గారు ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘పంతం’ గోపీచంద్‌గారి కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అన్ని ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్‌తో రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఇంతటి సక్సెస్‌కి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, తిరుగులేని విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. -
నా కెరీర్లో పంతం బెస్ట్
‘‘పంతం’ వంటి మంచి సినిమా చేశానని అందరూ అభినందిస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు అభినందనలు అని చాలా మంది ఫోన్ చేశారు’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఎ కాస్’ అన్నది ఉప శీర్షిక. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చక్రి చెప్పింది చెప్పినట్లుగా ఈ సినిమా తెరకెక్కించారు. నా కెరీర్లో ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. రాధామోహన్‌గారు మంచి అవుట్‌పుట్ రావాలని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మరిన్ని సందేశాత్మక చిత్రాలు వస్తాయి’’ అన్నారు. ‘‘కథ వినగానే గోపీచంద్‌గారైతే సరిపోతారని ఆయనకు కథ చెప్పాం. ఆయన కోసమే ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించాం. చక్రి కొత్తవాడైనా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా తెరకెక్కించారు. మా బ్యానర్ విలువను పెంచే చిత్రమిది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి’’ అన్నారు కె.కె.రాధామోహన్. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. గోపీచంద్‌గారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అన్నారు మెహరీన్. ‘‘కొత్తవాడినైన నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాధామోహన్‌గారికి థాంక్స్. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కె.చక్రవర్తి. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, పాటల రచయిత భాస్కరభట్ల, రైటర్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు డబ్బులు వచ్చాయి
‘‘పది కోట్ల బడ్జెట్‌తో చేయాల్సిన ‘శంభో శంకర’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే రూపొందించాం. పది రూపాయలకు ఒక రూపాయి మాత్రమే తీసుకున్నా, సినిమా బాగా రావాలని నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు వారు పెట్టిన డబ్బులు వచ్చాయి’’ అని నిర్మాత సురేశ్ కొండేటి అన్నారు. ‘షకలక’ శంకర్, కారుణ్య జంటగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ – ‘‘మా సినిమా పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అని కచ్చితంగా చెప్పగలను. నేను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి శివాజీరాజాగారితో కలిసి తిరిగాను. ఆయన మంచితనాన్ని, సేవలను స్ఫూర్తిగా తీసుకుని నా వంతు సహకారాన్ని అందించాలనుకుంటున్నా. ‘శంభో శంకర’ ద్వారా వచ్చిన కొంత అమౌంట్లో పది వేలు చొప్పున పది మంది నిరుపేదలకు అందించాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం శంకర్, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ ప్రాజెక్టుపై నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ సినిమా హిట్‌తో ఆ భయం పోయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు డైరెక్టర్ శ్రీధర్. ‘‘మా సినిమా హిట్ అవడంతో మాకంటే ఎక్కువగా ప్రేక్షకులు హ్యాపీగా ఉన్నారు. థియేటర్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మా కష్టం ఫలించింది. ఇకపై కూడా ఇదే విధంగా నిజాయితీగా, నమ్మకంగా సినిమాలు చేస్తా’’ అన్నారు ‘షకలక’ శంకర్. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా, కథానాయిక కారుణ్య, నటులు ఏడిద శ్రీరామ్, ప్రభు, నాగినీడు పాల్గొన్నారు. -
నా పన్నెండేళ్ల కల తీరింది
‘‘అమ్మమ్మగారిల్లు’ సినిమా బాగుంది అనడానికి ప్రధాన కారణం నాగశౌర్య. ఆ తర్వాత సుధ, శివాజీరాజా పాత్రలు. సినిమాలో ‘లాక్ యువర్ ఏజ్’ అనే కాన్సెప్ట్ బాగా కలిసొచ్చింది. నా లాక్ ఏజ్ ఏంటంటే.. 2008 నుంచి 2018 వరకూ. ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు రావు రమేశ్. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సుందర్ సూర్య మాట్లాడుతూ– ‘‘ఇంత మంది సీనియర్ ఆర్టిస్టులతో ఎలా చేయాలని చాలా టెన్షన్ పడ్డా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల సినిమాలు చూస్తూ వచ్చాను. ఇప్పుడు వాళ్లనే నేను డైరెక్ట్ చేయడం వండర్ఫుల్ మూమెంట్. నేను తర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అన్నది తెలియదు. కానీ, నా పన్నెండేళ్ల కలని ‘అమ్మమ్మగారిల్లు’ తీర్చింది. ఇక ఇంటికి వెళ్లిపోయినా ఫర్వాలేదు. ఇదొక ఎమోషనల్ జర్నీ. ఈ ఏడాదిన్నర నా లాక్ ఏజ్’’ అన్నారు. ‘‘మా సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంత గ్రాండ్‌గా ఈవెంట్ చేసుకుంటున్నామంటే కారణం నా టీమ్’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్. ‘‘రాజేష్, కుమార్, సుందర్ చాలా మంచి వ్యక్తులు. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ల ముద్ర పడిపోవాలి. నా 45 ఏళ్ల పగ ఈ మధ్యనే తీరింది. అదే నా లాక్ ఏజ్’’ అన్నారు నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా. ఈ వేడుకలో నటీనటులు సుధ, హేమ, మధుమణి, రూపాలక్ష్మి, శక్తి, చందు తదితరులు పాల్గొన్నారు. -
‘నా పేరు సూర్య..’ చేసినందుకు గర్వపడుతున్నా
‘‘అందరికీ నమస్కారం. నా పేరు అల్లు అర్జున్. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్షన్ పేరు థ్యాంక్యూ ఇండియా. ఇక్కడ నేను ఫస్ట్ థ్యాంక్యూ చెప్పాల్సింది మా గెస్ట్ పవన్ కల్యాణ్‌గారికి. ఈ సినిమా గురించి ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటుంది. కానీ, నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది’’ అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ‘థ్యాంక్యూ ఇండియా మీట్’ (సక్సెస్ మీట్) నిర్వహించారు. హీరో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నాకు వచ్చిన ఓ బెస్ట్ కాంప్లిమెంట్ గురించి చెబుతాను. చాలామంది మహిళలు ఫోన్ చేసి.. ఈ సినిమా మాకు చాలా బాగుంది. మా పిల్లలు ఈ సినిమా చూశాక మిలటరీ యూనిఫాం కుట్టించుకోవాలనుకుంటున్నారు’’ అన్నారు. ఈ మూవీలో నా నటన చాలామందికి నచ్చింది. వండర్ఫుల్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు.నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఓ మంచి చిత్రం. ఇలాంటి మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పటానికి కల్యాణ్‌గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మంచి సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చిన బన్నీకి థ్యాంక్స్. నేనెప్పుడూ కథని నమ్ముతాను. ఆ కథకి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేశారు బన్నీగారు. దానికి సహకరించారు వక్కంతం వంశీగారు. ఈ సినిమాని తర్వాతి జెనరేషన్ కోసం తీశాం. ఈ చిత్రం చూసిన స్టూడెంట్స్‌లో ఓ మార్పు వస్తుందని కచ్చితంగా నమ్ముతా. ఈ వేసవిలో కుటుంబంతో కలిసి ఈ సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయండి. వండర్ఫుల్ జ్ఞాపకాలతో ఇంటికెళతారని గ్యారంటీగా చెప్పగలను. మా సినిమాని ఆదరించిన తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నా తొలి సినిమాకే ఇంత పెద్ద అవకాశం రావడం హ్యాపీ. మంచి కథను కూడా కమర్షియల్ సినిమాగా తీయొచ్చనే నా నమ్మకాన్ని నమ్మి నాతో ప్రయాణం చేసిన అర్జున్‌గారికి, ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమా ఇంత రిచ్‌గా రావడానికి కృషి చేసిన శ్రీధర్‌గారు, నాగబాబుగారు, ‘బన్నీ’వాసులకు థ్యాంక్స్. మంచి కంటెంట్‌తో ఉన్న ఈ సినిమాని గుండెల్లోకి తీసుకున్న తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శిరీషా శ్రీధర్, నాగబాబు, సహ నిర్మాత ‘బన్నీ’ వాసు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, దర్శకుడు మెహర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లోకి రాను
‘‘రాజకీయాలంటే ఆసక్తి లేదు. జీవితాంతం ప్రేక్షకులు, అభిమానుల కోసం నటిస్తూనే ఉంటాను’’ అని స్పష్టం చేశారు మహేశ్‌బాబు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటించిన చిత్రం‘భరత్ అనే నేను’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా రీసెంట్గా విడుదలైంది. శుక్రవారం విజయవాడ, తిరుపతిలో ‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ మీట్స్‌ను నిర్వహించింది చిత్రబృందం. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘రాజకీయాల్లోకి రాను. వందేళ్ల వయసు వచ్చే వరకు నటిస్తుంటాను. ‘ఒక్కడు, పోకిరి, దూకుడు’ విజయోత్సవాలు విజయవాడలో జరిగాయి. ‘భరత్ అనే నేను’ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను విజయవాడలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నాం. సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను’’అన్నారు. ఆ నెక్ట్స్ తిరుపతిలో మహేశ్ మాట్లాడుతూ– ‘‘నాన్నగారికి అందరి కన్నా పెద్ద అభిమానిని నేనే. సినిమాలో మంచి సీయంగా నటించాను. నిజ జీవితంలో బెస్ట్ ఫాదర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. శ్రీవారి ఆశీస్సులు ఉంటే సినిమాలన్నీ హిట్ అవుతాయి’’ అన్నారు. ‘‘విజయవాడలో తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ సినిమా హిట్ సాధిస్తే ప్రపంచమంతా హిట్ అవుతుంది. సినిమా బ్లాక్‌బస్టర్ మూవీగా టాక్ తెచ్చుకుంటే మహేశ్‌బాబును కొండకు తీసుకువస్తానని వెంకన్నకు మొక్కుకున్నాను. భవిష్యత్‌లో మంచి సినిమాతో మరోసారి తిరుపతిలో ఫ్యాన్స్ ముందు భారీ ఫంక్షన్ జరుపుకుందాం’’ అన్నారు కొరటాల శివ. విజయవాడ కార్యక్రమంలో సుధశ్రీ పిక్చర్స్ అధినేత మిక్కిలినేని సుధాకర్ పాల్గొన్నారు. తిరుపతి సక్సెస్‌మీట్‌లో మహేశ్‌బాబు, కొరటాల శివను నిర్మాత ఎన్వీ ప్రసాద్ సత్కరించారు -
మంచి టీమ్ కుదిరితేనే అది సాధ్యం – అనుష్క
‘అరుంధతి, రుద్రమదేవి’ చిత్రాలకు అనుష్క ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేశారో ‘భాగమతి’కి కూడా అంతే కష్టపడ్డారు. అందుకు తనకు హ్యాట్సాఫ్. ఈ సినిమా పాయింట్‌ను నమ్మి అశోక్ ఇన్నేళ్లు ట్రావెల్ చేశాడు. తన నమ్మకం ఈరోజు నిజమైంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అనుష్క టైటిల్ రోల్లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘భాగమతి’ హిట్‌తో కొత్త కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. వంశీ, ప్రమోద్, విక్కీలను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది. నేను ఆరేళ్లలో ఐదు హిట్స్ కొట్టినట్లే, యు.వి. క్రియేషన్స్‌పై ఆరేళ్లలో ఐదు హిట్స్ సాధించారు’’ అన్నారు. ‘‘భాగమతి’ విడుదలైన రోజు నుంచి నేటి వరకు పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు బాగా చేస్తున్నావని చాలామంది అంటుంటారు. ఒక మంచి బ్యానర్, టీమ్ కుదిరినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అన్నారు అనుష్క. ‘‘ఇది సక్సెస్‌మీట్ కాదు.. సక్సెస్ఫుల్ ప్రయాణం. 2012లో స్టార్ట్ చేసిన జర్నీ ఇది. అçప్పటి నిర్ణయం సరైనదని ఈరోజు రుజువైంది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా అనుష్క, నిర్మాతలకే చెందుతుంది’’ అన్నారు అశోక్. ఈ కార్యక్రమంలో వంశీ, ప్రమోద్, విక్కీ, రవీందర్, తమన్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆ నమ్మకంతోనే సినిమా తీశాం: రవికిరణ్
సప్తగిరి, కశిష్ వోహ్రా జంటగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. గురువారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘రైతులు బతకాలి, అందరికీ న్యాయం దక్కాలన్న కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయం అందించారు. సాయికుమార్, శివప్రసాద్‌లకు దీటుగా సప్తగిరి నటించాడు. మా చరణ్ ఈ సినిమాతో దర్శకునిగా సక్సెస్ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సప్తగిరిలో మంచి ఎనర్జీ ఉంది. మా శిష్యుడు చరణ్ ఈ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వర రావు. ‘‘పరుచూరి బ్రదర్స్గారే ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం. నాకు దర్శకుడు చరణ్ గొప్ప సినిమా ఇచ్చారు. ఇది ఆయన విజయం. ఇంత మంచి సినిమాను నాతో చేయించిన నిర్మాత రవికిరణ్‌కి థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ కావడంతో పెద్ద డైరెక్టర్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి’’ అన్నారు హీరో సప్తగిరి. ‘‘ కంటెంట్‌ని నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమా తీశాం. రైతులు, లాయర్లు ఎంతోమంది సినిమా చూసి అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు నేచురల్‌గా నటించారు. మంచి సినిమా నిర్మించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు రవికిరణ్. ‘‘మాస్ హీరోలో ఉండే క్వాలిటీస్ అన్నీ సప్తగిరిలో ఉన్నాయి. పరుచూరి బ్రదర్స్ మంచి డైలాగ్స్ రాశారు. సినిమా బాగుందని అందరూ అభినందిస్తుంటే పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నాను. సాయికుమార్, శివప్రసాద్, సప్తగిరి బాగా నటించారు’’ అన్నారు చరణ్ లక్కాకుల. -
తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు – కార్తీ
‘‘తెలుగు ప్రేక్షకులకు నేను ‘ఆవారా’ కార్తీ, ‘ఊపిరి’ శ్రీనుగా గుర్తుండి పోయా. కానీ, ఈ ‘ఖాకి’ నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. నా గత చిత్రాలతో పోల్చితే తెలుగులో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన చిత్రమిది. ఈ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖాకి’. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘వినోద్‌గారి స్క్రీన్‌ప్లేను అందరూ అభినందిస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ చూసి ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఈ సినిమాతో చాలా మందిలో పోలీసులపై మంచి అభిప్రాయం ఏర్పడింది. నా భార్య కూడా పోలీసులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారంటూ కితాబిచ్చింది. మా సినిమాను పోలీస్ డిపార్ట్మెంట్కి అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళంలో ‘ఖాకి’ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు రకుల్. ‘‘నిర్మాతలుగా మా తొలి చిత్రమిది. సినిమా రెండోవారంలోకి ఎంటర్ అయినా పాజిటివ్ టాక్ ఉంది. కలెక్షన్స్ బాగున్నాయి’’ అన్నారు సుభాష్ గుప్తా. సహ నిర్మాత శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. -
పెళ్లిళ్లు, శుభకార్యాలున్నా... ప్రేక్షకులు థియేటర్లకొచ్చారు!
‘‘ఈ నాలుగు రోజుల్లో బోల్డన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నాయి. అయినా... ప్రేక్షకులు సినిమాను చక్కగా ఆదరిస్తున్నారు. 80 శాతం థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మెంటల్ మదిలో’ శుక్రవారం విడుదలైంది. డి. సురేశ్‌బాబు సమర్పకులుగా వ్యవహరించిన ఈ సినిమా సక్సెస్ మీట్ శనివారం జరిగింది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ కాపీ రాగానే సురేశ్‌బాబుగారు 10రోజులు స్పెషల్ షోలు వేయమని చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్‌కి థ్రిల్లయ్యా. ఆ పది రోజులూ ఐసీయులో పేషెంట్ ఎలా ఉన్నాడని ఆరా తీసినట్టు... టెన్షన్ పడేవాణ్ణి. ప్రేక్షకులు సినిమాను ఆదరించడంతో హ్యాపీగా ఉంది. వివేక్ లాంటి దర్శకులు ఎక్కువమంది ఉన్నా... రాజ్ కందుకూరి వంటి నిర్మాత ఒక్కరే ఉన్నారు. ఇటువంటి సినిమాలను ఆదరిస్తే... ఎక్కువమంది రాజ్ కందుకూరిలు ఇండస్ట్రీకి వస్తారు’’ అన్నారు. ‘‘సినిమా విడుదలకు ముందు సురేశ్‌బాబుగారు అందించిన సహకారం మరువలేనిది. శ్రీవిష్ణు, శివాజీరాజా (హీరో తండ్రి పాత్ర) ఇద్దరూ మా సినిమాలో హీరోలే. శ్రీవిష్ణు కోసం అతిథి పాత్రలో నటించిన నారా రోహిత్‌గారికి థ్యాంక్స్. మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘రోజా రమణిగారు ‘ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమా చూసి, ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుకి కాల్ చేయడం ఇదే తొలిసారి’ అన్నారు. అంతకంటే గొప్ప అభినందన ఏముంటుంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ కార్యక్రమంలో దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి, నటి అనితా చౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి తదితరులు పాల్గొన్నారు.