పెట్టిన పెట్టుబడి వస్తే హిట్టే | Subrahmanyapuram success meet | Sakshi
Sakshi News home page

పెట్టిన పెట్టుబడి వస్తే హిట్టే

Published Sat, Dec 15 2018 2:30 AM | Last Updated on Sat, Dec 15 2018 2:30 AM

Subrahmanyapuram success meet - Sakshi

మల్కాపురం శివకుమార్, బీరం సుధాకర్‌రెడ్డి, సుమంత్, సంతోష్, ‘జోష్‌’ రవి

సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుధాకర్‌ ఇంపెక్స్‌ ఐపీఎల్‌ పతాకంపై భీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ద్వారా సంతోష్‌ జాగర్లపూడి దర్శకునిగా పరిచయం అయ్యారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ఫుల్‌ కలెక్షన్లను సాధిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో హీరో సుమంత్‌ మాట్లాడుతూ– ‘‘నేను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఈ రోజుల్లో సక్సెస్‌ అంటే మూడు రకాలుగా డివైడ్‌ చెయ్యొచ్చు. మొదటిది విపరీతంగా కలెక్షన్లు సాధించి దుమ్ము దులపటం. రెండోది విమర్శకుల ప్రశంసలతో పాటు పేరు, అవార్డులు రావడం. ఇక మూడోది నిర్మాత పెట్టిన డబ్బు ఆయనకి తిరిగి రావటం.

ఈ కాలంలో అలా జరగటం చాలా అరుదు. పది శాతం సినిమాలు మాత్రమే పెట్టిన పెట్టుబడిని సాధిస్తున్నాయి. ఇందులో మా సినిమా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ’’ అన్నారు. సంతోశ్‌ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను, నా కథను, కథనాన్ని నమ్మిన భీరం సుధాకర్‌గారికి థ్యాంక్స్‌. నా ఫేవరెట్‌ హీరో సుమంత్‌. ఆయనతో నా మొదటి సినిమా చేసి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.’’ అన్నారు. భీరం సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెడుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన సుమంత్‌ గారితో పాటుయూనిట్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, ‘జోష్‌’ రవి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement