ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది! | Allu Aravind Speech @ Hello Guru Prema Kosame Success meet | Sakshi
Sakshi News home page

అలాంటి నిర్మాతల్లో రాజు ఒకరు

Published Tue, Oct 23 2018 1:19 AM | Last Updated on Tue, Oct 23 2018 8:49 AM

Allu Aravind Speech @ Hello Guru Prema Kosame Success meet - Sakshi

త్రినాథరావు, అనుపమ, రామ్, ప్రణీత, అల్లు అరవింద్‌

‘‘దిల్‌’ రాజు మా కుటుంబ సభ్యుడు. కథని నమ్ముకుని ప్రయాణం చేసే అతి తక్కువ మంది నిర్మాతల్లో రాజుగారు ఒకరు. అలాంటి నిర్మాత ఎంచుకున్న దర్శకుడు త్రినాథరావు. రామ్‌ స్వచ్ఛత ఉన్న మనిషి. తన సినిమాలు సరదాగా ఉంటాయి. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో రామ్‌తో సెటిల్డ్‌గా చేయించారు త్రినాథరావు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు హర్షిత్‌ నా వద్ద పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్‌ ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు.

రామ్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్‌ నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నేను తీసిన ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే’ మూడు సినిమాలు హిట్‌ అయ్యాయి. ఓ డైరెక్టర్‌గా ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది.ఈ మధ్య కాలంలో ప్రకాశ్‌రాజ్‌గారితో చాలా ఎక్కువ రోజులు పనిచేసిన యూనిట్‌ మాదే.

మా సినిమాని సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈ దసరాకి ప్రేక్షకులు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు హ్యాపీ. చాలా మంది ఫోన్‌ చేసి అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. రాజుగారు ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. త్రినాథ్‌రావుగారు చాలా ఎంటర్‌టైనింగ్‌ డైరెక్టర్‌’’ అన్నారు రామ్‌. ‘‘డైరెక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా, రైటర్‌గా 34 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నా. త్రినాథరావుని చూస్తే.. ఏ కోశానా డైరెక్టర్‌ లుక్‌లో కనపడడు. కానీ, సినిమాను కంఫర్ట్‌బుల్‌గా తీస్తాడు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ఈ సమావేశంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, రచయితలు సాయికృష్ణ, ప్రసన్న కుమార్, నిర్మాత హర్షిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement