హలో... పాటలొచ్చాయ్‌ | Hello Guru Prema Kosame Audio songs release | Sakshi
Sakshi News home page

హలో... పాటలొచ్చాయ్‌

Published Tue, Oct 9 2018 4:29 AM | Last Updated on Tue, Oct 9 2018 4:30 AM

Hello Guru Prema Kosame Audio songs release - Sakshi

అనుపమా పరమేశ్వరన్, రామ్‌

రామ్‌ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్‌’ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్‌ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలోని పాటల్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది.

టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రామ్, అనుపమ, ప్రణీతల కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంది. మా బ్యానర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికీ సంగీతం అందించారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 10న థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అక్టోబర్‌ 13న వైజాగ్‌లో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తున్నాం. దసరా సందర్భంగా ఈ నెల 18న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ కె.చక్రవర్తి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement