songs release
-
బదల్తా కశ్మీర్
ఆర్టికల్ 370 ఎత్తివేతను సుప్రింకోర్ట్ సమర్థించింది. జమ్ము–కశ్మీర్లకు రాష్ట్రహోదా ఇచ్చి ఎన్నికలు నిర్వహించమంది. మరోవైపు అక్కడ యువగళాలు మారుతున్న కశ్మీర్‌ను గానం చేస్తున్నాయి. 14 ఏళ్ల ర్యాపర్ హుమైరా జా విడుదల చేసిన పాట ‘బదల్తా కశ్మీర్’ మార్పును ఆహ్వానిస్తూ కొత్త ఆశను రేపుతోంది. హుమైరా జా పాటను భారత ప్రభుత్వం ఇన్‌స్టాలో షేర్ చేసింది.‘నేను ఇలాగే ముందుకెళ్తాను’ అంటున్న హుమైరా పరిచయం. ‘బద్లా జొ కశ్మీర్... బద్లా హై సారా దౌర్’ అని పాడుతోంది హుమైరా జా. ‘కశ్మీర్ మారుతోంది... కశ్మీర్ ధోరణి మారుతోంది... అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది’ అంటూ ఆమె పాడిన పాట ఇప్పుడు కశ్మీర్వాసులనే కాదు, దేశాభిమానులను కూడా ఆకర్షిస్తోంది. హుమైరా ఈ పాటను ఎం.సి.రా అనే మరో ర్యాపర్ కలిసి పాడింది. కశ్మీర్లో తాజా అభివృద్ధి పరిణామాలను పాటలో మిళితం చేస్తూ వీరు విడుదల చేసిన ‘బదల్తా కశ్మీర్’ పాట కశ్మీర్ భవిష్యత్తు మీద ఆశను కలిగిస్తోంది. ‘మా నానమ్మ, తాతయ్యల కాలంలో కశ్మీర్ ఎలా ఉండేది... (ఆర్టికల్ 370 ఎత్తేశాక) ఇప్పుడు ఎలా ఉందనేది నేను వారి మాటల్లో విన్నాను. నా కళ్లారా చూశాను. ఇక్కడ జరిగిన జి 20 సమ్మిట్, శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడం, కొత్త టన్నెల్స్ ఏర్పాటు... ఇంతకుముందు చూడలేదు. మా ఊరు కంగన్ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాలంటే గతంలో గంటన్నర పట్టేది. ఇప్పుడు గండర్బల్ దగ్గర బ్రిడ్జి కట్టాక ముప్పై నిమిషాల్లో వెళ్లిపొంతున్నాము. ఇదంతా మారుతున్న కశ్మీరే’ అంటుంది హుమైరా జా.తొమ్మిదో తరగతి చదువుతున్న హుమైరా అలవోకగా ర్యాప్ సాంగ్స్ రాసి పాడుతుంది. హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ పదాలను టక్కున పట్టేట్టుగా వాడుతూ పాటలు రాసి పాడటం వల్ల గతంలోనే గుర్తింపు పొందినా ‘బదల్తా కశ్మీర్’ పాటతో ప్రపంచానికి తెలిసింది. ‘నేను రెండో క్లాస్‌లో ఉండగా యోయో హనీసింగ్ రాప్ ఆల్బమ్ విన్నాను. అది నాకు చాలా నచ్చింది. ఆ వయసులోనే అలా ర్యాప్ పాటలు ట్రై చేసేదాన్ని. అప్పుడే బజ్రంగి భాయ్‌జాన్ (2015) సినిమా షూటింగ్ మా ఏరియాలో జరిగితే అందులోని బాల నటి హర్షాలికి నేను బాడీ డబుల్ (డూప్)గా నటించాను. అలా నేను కూడా సినిమాల్లో నటించాలనుకున్నానుగానీ మా కశ్మీర్లో సినిమా పరిశ్రమ లేదు. అందుకని ర్యాపర్‌గా రాణించాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది హుమైరా. కశ్మీర్లో ప్రతి ఏటా జరిగే ‘ర్యాప్ బ్యాటిల్’ పొంటీల్లో పాల్గొని 2022, 2023 సంవత్సరాల్లో టైటిల్ గెలిచింది హుమైరా. ‘2022లో 15 మంది అబ్బాయిలు నాకు పొంటీగా వచ్చారు. నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. నేనే గెలిచాను’ అంటుంది హుమైరా. ‘కశ్మీర్లో అమ్మాయిలు స్పోర్ట్స్‌లో, కళల్లో, చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఆ విషయాన్ని నా పాటలో చెప్పాను’ అందామె. ఈ పాటలోనే మేల్ వాయిస్ ఇచ్చిన ఎం.సి.రా ‘ఇక్కడ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ అమ్మాయిలు తొడుక్కుంటున్నారు. బట్టల్ని బట్టి వారిని జడ్జ్ చేసే రోజులు పొంయాయి’ అనే లైన్లు పాడాడు. హుమైరా, ఎం.సి.రా కలిసి ‘మై కశ్మీరి... మేరా దేశ్ హై హిందూస్తాన్’ అని పాటను ముగిస్తారు. ఈ పాటలో హుమైరా ‘టెర్రరిస్టులకు ఇక్కడ చోటు లేదు. అనవసరంగా ఎవరి రక్తం పారడానికి వీల్లేదు’ అనే లైన్లు పాడింది. ‘నువ్వు చూపుతున్న అభివృద్ధి ఉత్తుత్తదే. అసలు వాస్తవం వేరే ఉంది అని కొందరంటున్నారుగా’ అని విలేకరులు ప్రశ్నిస్తే ‘అది వారి దృష్టికోణం. ఇది నా దృష్టికోణం’ అంటుంది హుమైరా.‘కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. నేను పట్టించుకోను. నేను ఇలాగే ముందుకెళతాను. నా వెనుక ఒక్కరు నిలబడినా చాలు’ అందామె.కశ్మీర్ వెనుక హుమైరా వెనుక ఇప్పుడు చాలామంది ఉన్నారు. కశ్మీర్ అభివృద్ధికి అందరూ ప్రయత్నిస్తే ‘నయా కశ్మీర్’ దగ్గరిలోనే సాధ్యమవుతుంది. -
నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) 'కావేరి గాలిలా' అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్ అందించగా.. సింగర్ నరేశ్ అయ్యర్ ఆలపించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా.. తమ నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. మే26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘రా రా హుజూర్ నాతో’.. అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనన్య నాగళ్ల, శరత్‌బాబు, వనితా శరత్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
'సార్' గా వస్తున్న ధనుష్.. లిరికల్ సాంగ్ రిలీజ్
తమిళ నటుడు ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'సార్'. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా.. ఈ చిత్రంలోని బంజారా అంటూ సాగే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా విడుదలైన 'బంజారా' లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులోని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి.తెలుగు, తమిళ భాషల్లో ఈసినిమాను 17 ఫిబ్రవరి, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ పాటు ప్రముఖ తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రాశారు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు. 'నేను సైతం', 'సారంగ దరియా'పాటలు రాసిన ఆయన మరో మధుర గీతాన్ని అందించారు. ఈ చిత్రంలో సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ ఈసినిమాకు సంగీతమందిస్తున్నారు. -
నీతో ఉంటే చాలు.. హత్తుకునేలా 'బింబిసార' గీతం
Neetho Unte Chalu Song Out From Bimbisara: 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే క్యాప్షన్ ద్వారా ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ చిత్రమని చెప్పకనే చెబుతున్నారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవల గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నీతో ఉంటే చాలు' అంటూ సాగే ఈ గీతం మనసుకు హత్తుకునేలా ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎంఎం కీరవాణి రాసిన ఈ పాటను మోహన్ భోగరాజు, శాండిల్య ఆలపించారు. కాగా ఈ మూవీలో సంయుక్త మీనన్, కేథరీన్ థ్రేసా హీరోయిన్లుగా నటించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన This melody #NeethoUnteChalu from #Bimbisara hits you different once you own it ❤️🔥 Tune into the Lyrical Video now 🔗 https://t.co/FxEIIAdgsp#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @saregamasouth pic.twitter.com/3X0fPdgZAX — NTR Arts (@NTRArtsOfficial) August 1, 2022 చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? -
వాలంటైన్స్ డే: 'టక్ జగదీష్' నుంచి లవ్ సాంగ్
వేలంటైన్స్ డే స్పెషల్‌గా ‘టక్ జగదీష్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లోని ప్రేమ పాటలను రిలీజ్ చేశారు. ఆ విశేషాలు... ఇంకోసారి ఇంకోసారి ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ అని తన ప్రేయసి గురించి పాడుకుంటున్నారు టక్ జగదీష్. ఈ పాట వెనుక కథేంటో సినిమా చూసి తెలుసుకోవాలి. నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ని విడుదల చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, కాలభైరవ ఆలపించారు. చైతన్య ప్రసాద్ రచించారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల. గుచ్చే గులాబీ ‘గుచ్చే గులాబీలా నా గుండెలోతునే తాకినదే..’ అంటూ తన ప్రేయసి కోసం పాడుతున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్. ఆయన హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలోని రెండో పాటను శనివారం విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతంలో అనంత్ శ్రీరామ్ రచించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమాను ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మించారు. మస్తీ చేస్కో ‘డబ్బే ఉంటే మస్తీ చేస్కో’ అంటు న్నారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘మోసగాళ్లు’. భారీ ఐటీ స్కామ్ ఆధారంగా హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కాజల్ అగర్వాల్, రుహీ సింగ్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రెండవ పాట ‘డబ్బే మనది కుమ్మేస్కో.. మస్తీ మస్తీ చేస్కో.. కాస్ట్లీ మందే వేసేస్కో...’ని శుక్రవారం రిలీజ్ చేశారు. సామ్ సీయస్ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించగా హేమచంద్ర ఆలపించారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. రూ. 51 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చి 19న, మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
5 సోమవారాలు 5 పాటలు
డిసెంబర్‌ను మ్యూజికల్ డిసెంబర్‌గా మార్చేయాలని ప్లాన్ చేసింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. మహేశ్‌బాబు, రష్మికా మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు. విజయ్‌శాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మా శక్తి మేరకు కష్టపడ్డాం. సినిమాలోని ప్రతీ పాట అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ్ర పసాద్. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. -
స్నేహితుడి కోసం...
పవన్, శైలజ జంటగా జి.మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరాదోస్త్’. వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై పి.వీరారెడ్డి నిర్మించారు. వి.సాయిరెడ్డి స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర పాటలను తెంగాణ వాటర్ బోర్డ్ చైర్మన్ వి.ప్రకాశ్, డిజిక్వెస్ట్ బసిరెడ్డి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు. జి.మురళి మాట్లాడుతూ– ‘‘డైనమిక్‌లాంటి అమ్మాయి ఒక బలహీనుణ్ని ప్రేమిస్తుంది. ఓ సందర్భంలో ఆ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకెళ్తాడు. ఆ బలహీనుడి మిత్రుడైన హీరో... ఆ రాక్షసుడ్ని సంహరించి ఆ అమ్మాయిని ఎలా రక్షించాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మేరాదోస్త్’. వీరారెడ్డిగారు ఇచ్చిన సహకారంతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మురళి చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాం. ‘మేరాదోస్త్’ అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు పి.వీరారెడ్డి. ‘‘సినిమా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. ఆరో తరగతి నుంచే సినిమాలు విపరీతంగా చూసేవాణ్ణి. అల్లాణి శ్రీధర్‌గారి వద్ద దర్శకత్వశాఖలో పని చేశాను. అనుకోనుకుండా రాజకీయాల్లోకి వెళ్లాను. ఆ తరుణంలోనే తెంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో సినిమాకు దూరమయ్యాను. ఎప్పటికైనా మంచి సినిమా తీయాలని ఉంది’’ అన్నారు వి.ప్రకాశ్. నిర్మాత సాయి వెంకట్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వి.సాయిరెడ్డి, కెమెరా: సుధీర్. -
వైవిధ్యంగా ఓ మనిషీ...
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధానపాత్రల్లో కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ మనిషీ నీవెవరు’. గాడ్ మినిస్ట్రీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై స్వర్ణకుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను నటులు కృష్ణ విడుదల చేశారు. అనంతరం మొదటి వీడియో సాంగ్‌ను నటులు తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ రిలీజ్ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘జీసస్ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇలాంటి చిత్రాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు అనూప్ రూబెన్స్. ‘‘ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిధ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా’’ అన్నారు సుమన్. ‘‘గోపాలకృష్ణగారికి నేను వేరే కథ చెప్పాను. కానీ ఆయన ఈ కథ చెప్పి సినిమా తీయించారు. శివప్రసాద్‌గారి సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తి చేసేవాణ్ణి కాను’’ అని కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు అన్నారు. సీనియర్ దర్శకులు సాగర్, నటి కవిత, రిజ్వాన్ కులషాన్, స్క్రీన్ ప్లే రచయిత గోపాలకృష్ణ దొండపాటి, కెమెరామేన్ సూర్యభగవాన్ మోటూరి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య భగవాన్ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవాని. -
హలో... పాటలొచ్చాయ్
రామ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలోని పాటల్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రామ్, అనుపమ, ప్రణీతల కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మా బ్యానర్లో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికీ సంగీతం అందించారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అక్టోబర్ 13న వైజాగ్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. దసరా సందర్భంగా ఈ నెల 18న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి. -
చరిత్ర వెంటాడుతోంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సాహో సార్వభౌమి’ పాటను విడుదల చేశారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సువర్ణసుందరి’ ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా సూర్య ఈ సినిమా తెరకెక్కించారు. నా సినీ కెరీర్లో ఇది ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. ఇందులోని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పాట ‘సాహో సార్వభౌమి’. మ్యూజికల్‌గా, విజువల్‌గా బాగా వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు లక్ష్మీ. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి. -
కథ చెప్పినప్పుడు భయపడ్డాం
ఆయుష్ రామ్, శ్రవణి, ‘ఛత్రపతి’ షఫీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విషపురం’. సందిరి శ్రీనివాస్ దర్శకత్వంలో పాతురి బుచ్చిరెడ్డి, పాతురి మాధవరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. శ్రీ వెంకట్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చిత్ర దర్శకుడు, నిర్మాతలు విడుదల చేశారు. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘సందిరి శ్రీనివాస్ చెప్పిన కథతో సినిమా చేయడానికి ముందు భయపడ్డాం. కానీ, ఆయన పట్టుదలతో మమ్మల్ని ఒప్పించి ఈ సినిమా పూర్తి చేశారు. ఇదే దర్శకుడితో మా బ్యానర్లో మరో చిత్రం నిర్మిస్తున్నాం. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి, మమ్మల్ని ముందుకు నడిపించాలి’’ అన్నారు. ‘‘జాంబీల మీద ఇంతవరకూ ఎవరూ సినిమా చేయలేదు. మేము కష్టపడి ఈ సినిమా చేయలేదు.. ఇష్టపడి చేసాం. ఒక కొత్త సినిమా చేశామన్న తృప్తితో ఉన్నాం. మా నిర్మాతలు ఫైనల్ ఔట్పుట్తో సంతోషంగా ఉన్నారు’’ అన్నారు సందిరి శ్రీనివాస్. కెమెరామెన్ కిషన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: రోహిత్ జిల్లా. -
సోకులెక్కువ
మల్లిఖార్జున్, కవిత మెహతా జంటగా అన్నం చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలేజ్ పోరగాళ్ళు’. ‘సదువు తక్కువ.. సోకులెక్కువ’ అన్నది ఉప శీర్షిక. మంత్ర ఆర్ట్స్‌పై కెమెరామెన్ శ్రీధర్ నేతృత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఎల్ఎం ప్రేమ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘మా చిత్రం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాం. సినిమా బాగా వచ్చింది. అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు అన్నం చంద్ర శేఖర్. -
బామ్మ మాటలా...
సీనియర్ నటి శ్రీలక్ష్మి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘వామ్మో బామ్మ’. కిరణ్, అశ్లేష జంటగా విజయ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సి.హెచ్. వెంకటేశ్వరరావు, జి. సంధ్యారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ని నిర్మాతలు సాయి వెంకట్, టి. రామసత్యనారాయణ విడుదల చేశారు. విజయ్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘కామెడీ హారర్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో శ్రీలక్ష్మిగారే హీరో. అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘వామ్మో బామ్మ’ సినిమా చాలా బాగుంది. శ్రీలక్ష్మిగారు అద్భుతంగా నటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు విడుదల చేయటం చాలా కష్టం. కానీ, ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గతంలో ‘బామ్మ మాట బంగారు బాట’ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘వామ్మో బామ్మ’ కూడా అంతటి విజయం సాధించాలి’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘కుటుంబ సభ్యులందరూ చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు శ్రీలక్ష్మి. ఈ చిత్రానికి సంగీతం: ఆదిత్య, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.రాజశేఖర్. -
అదే సస్పెన్స్
మౌర్య, చరిష్మా శ్రీకర్, వెంకట్రాజ్, అవంతిక ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఆర్ యు మ్యారీడ్?’. అళహరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. జయసూర్య స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్కాపురం శివకుమార్, అరిమండ విజయ శారదారెడ్డి, బి.శ్రీధర్, జె.భగవాన్, జేవీ ఆర్, సాయివెంకట్ తదితర ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. పాటల విడుదల అనంతరం అతిథులు మాట్లాడుతూ – ‘‘పాటలు, ట్రైలర్ చూస్తుంటే సినిమా అళహరి అభిరుచికి అద్దం పట్టేలా ఉంది. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ‘‘నీకు పెళ్లయిందా? అని ఎవరు ఎవర్ని అడిగారన్నది సస్పెన్స్. లవ్, ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు అళహరి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రోహిత్–సుమిత్. -
కుర్రాడు కొత్త
శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజా నాయుడు. ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కుర్రోడు’. లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్‌పై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మించారు. సాయి ఎలేందర్ స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేయగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ స్వీకరించారు. రాజా నాయుడు. ఎన్ మాట్లాడుతూ– ‘‘చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్మణ్‌గారు అండగా నిలబడి సినిమాను పూర్తి చేశారు. మా అమ్మాయి శ్రీప్రియను ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేస్తున్నా. శ్రీరామ్ చక్కగా నటించాడు’’ అన్నారు. ‘‘రాజా నాయుడుగారు సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం చక్కగా తీశారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పదిలం లచ్చన్న దొర. ‘‘మా నాన్నగారు థియేటర్ ఆపరేటర్. ఆయన వల్ల నాకు సినిమాలంటే ఆసక్తి కలిగింది. అదే ఉత్సాహంతో హీరోగా ఎదిగాను’’ అన్నారు శ్రీరామ్. ‘‘డైరెక్టర్ మా నాన్నగారు అయినా కూడా నన్ను ఆడిషన్‌లోనే ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు శ్రీప్రియ. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముదిరాజ్. -
మహేష్ సందడి మొదలవుతోంది
సాక్షి, సినిమా : గత రెండు చిత్రాలు తీవ్ర నిరాశ పరచటంతో భరత్ అనే నేనుతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న కసితో సూపర్ స్టార్ మహేష్ బాబు పని చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ కమర్షియల్ డ్రామా షూటింగ్ దాదాపు ఆఖరు దశకు చేరుకుంది. ఇక ఈ వైవిధ్యంగా సాగుతున్న ఈ చిత్రం ప్రమోషన్లకు మంచి ఆదరణ లభిస్తుండగా.. ఇప్పుడవి ఓ కొలిక్కి వచ్చాయి. భరత్ అనే నేను నుంచి తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్ర పాటలను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నారు. కైరా అద్వానీ మహేష్‌కు జోడీగా కనిపించబోతున్న భరత్ అనే నేను ఏప్రిల్ 20న విడుదల కాబోతున్న విషయం విదితమే. Launching our First Single from #BharatAneNenu, #TheSongOfBharatOn25th pic.twitter.com/jkz85k0gxX — #BharatAneNenu (@DVVEnts) 23 March 2018 -
నన్ను ఫస్ట్ హీరోగా చూసింది తెలుగు ఇండస్ట్రీనే! – సిద్ధార్థ్
‘‘గృహం’ తమిళ్ ట్రైలర్ చుశా. హాలీవుడ్ రేంజ్లో ఉందనిపించింది. తెలుగు ట్రైలర్‌ను 20 సెకన్లకు మించి చూడలేకపోయా. నా చుట్టూ అందరూ ఉన్నప్పుడు ఫుల్ ట్రైలర్‌ను చుద్దామనుకున్నా. అంతలా నన్ను భయపెట్టింది. సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు నాని. సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా మిలింద్‌రావ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గృహం’. ఎటాకి ఎంటరై్టన్మెంట్ ప్రొడక్షన్లో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సిద్ధార్థ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాని మాట్లాడుతూ– ‘‘జెన్యూన్ హర్రర్‌ను హర్రర్‌గా చూపించే సినిమా ‘గృహం’. హర్రర్ సినిమా చేస్తున్నప్పుడే, లొకేషన్లోనే సినిమా ఏంటో తెలిసిపోతుంది. థియేటర్లో ఎంజాయ్ చేయలేం. అందుకే నేను లైఫ్‌లో హర్రర్ సినిమా చేయను’’ అన్నారు. సిద్దార్థ్ మాట్లాడుతూ – ‘‘మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా నేను, మిలింద్ ఒకేసారి జాయిన్ అయ్యాం. మాకు తెలిసిన వారికి జరిగిన వాస్తవ సంఘటనకు కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ జోడించి, ఈ సినిమాను రూపొందించాం. గిరీష్, రెహమాన్ మంచి పాటలు అందించారు. సినిమా హిట్ అవుతుంది. తెలుగులో నా టైప్ ఆఫ్ సినిమాలు ఎవరు చేస్తున్నారా? అని చూస్తే.. నాని అని తెలిసింది. నానీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తెలుగులో సిద్ధార్థ్ కమ్‌బ్యాక్ అంటున్నారు. ఆ మాట నాకు నచ్చదు. చిన్న గ్యాప్ వచ్చింది. మళ్లీ నేను వస్తే ‘సిద్ధార్థ్ మావాడు’ అని చెప్పడానికి ఎక్కువ టైమ్ పట్టదు. నన్ను ఫస్ట్ హీరోగా చూసింది తెలుగు ఇండస్ట్రీనే’’ అన్నారు. ‘‘సిద్దార్థ్‌ది నాది 16 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ఇండియన్ హర్రర్ మూవీస్‌లో ‘గృహం’ మంచి సినిమాగా నిలుస్తుంది’’ అన్నారు మిలింద్. -
ఈ సినిమాతో రోహిత్ పెద్ద ధైర్యమే చేశాడు - బాలకృష్ణ
‘‘సావిత్రి అనే చక్కటి టైటిల్ పెట్టినందుకు ఆనందంగా ఉంది. నారా రోహిత్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమా తీసే వాళ్లకు కథ తెలుస్తుంది. కానీ, టైటిల్‌ను బట్టి ప్రేక్షకులు సినిమాకు వస్తారు. ఈ టైటిల్ థియేటర్‌కి రప్పించే విధంగా ఉంది’’అని హీరో బాలకృష్ణ అన్నారు. నారా రోహిత్, నందిత జంటగా పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై వీబీ రాజేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సావిత్రి’. శ్రవణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘నారా రోహిత్ ఈ సినిమాలో పాట పాడాడని తెలిసింది. నాకు పాటలు పాడటం ఇష్టమే కానీ, నాతో ఎవరూ పాడించడం లేదు. పాట పాడి, ఈ సినిమాతో రోహిత్ పెద్ద ధైర్యమే చేశాడు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా లేట్‌గా ప్రారంభమైనా మంచి నిర్మాత దొరకడంతో క్వాలిటీ ఔట్పుట్ వచ్చింది. ‘సోలో’ తర్వాత మళ్లీ అలాంటి సినిమా అవుతుంది’’ అని నారా రోహిత్ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎలాంటి వల్గారిటీ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నారా రోహిత్ ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ అవుతుంది’’ అని తెలిపారు. హీరో తారకరత్న, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నిర్మాత సాయి కొర్రపాటి, కథానాయికలు శ్రద్ధాదాస్, రష్మీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.