మౌర్య, చరిష్మా
మౌర్య, చరిష్మా శ్రీకర్, వెంకట్‌రాజ్, అవంతిక ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఆర్ యు మ్యారీడ్?’. అళహరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. జయసూర్య స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్కాపురం శివకుమార్, అరిమండ విజయ శారదారెడ్డి, బి.శ్రీధర్, జె.భగవాన్, జేవీ ఆర్, సాయివెంకట్ తదితర ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు.
పాటల విడుదల అనంతరం అతిథులు మాట్లాడుతూ – ‘‘పాటలు, ట్రైలర్ చూస్తుంటే సినిమా అళహరి అభిరుచికి అద్దం పట్టేలా ఉంది. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ‘‘నీకు పెళ్లయిందా? అని ఎవరు ఎవర్ని అడిగారన్నది సస్పెన్స్. లవ్, ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు అళహరి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రోహిత్–సుమిత్.
Comments
Please login to add a commentAdd a comment