malkapuram Sivakumar
-
అదే సస్పెన్స్
మౌర్య, చరిష్మా శ్రీకర్, వెంకట్రాజ్, అవంతిక ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఆర్ యు మ్యారీడ్?’. అళహరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. జయసూర్య స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్కాపురం శివకుమార్, అరిమండ విజయ శారదారెడ్డి, బి.శ్రీధర్, జె.భగవాన్, జేవీ ఆర్, సాయివెంకట్ తదితర ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. పాటల విడుదల అనంతరం అతిథులు మాట్లాడుతూ – ‘‘పాటలు, ట్రైలర్ చూస్తుంటే సినిమా అళహరి అభిరుచికి అద్దం పట్టేలా ఉంది. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ‘‘నీకు పెళ్లయిందా? అని ఎవరు ఎవర్ని అడిగారన్నది సస్పెన్స్. లవ్, ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు అళహరి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రోహిత్–సుమిత్. -
నిధి కోసం అన్వేషణ
ప్రభుదేవా, హన్సిక జంటగా సీనియర్ నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గులేబకావళి’. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అదేపేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఏప్రిల్ 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో కథ కొనసాగుతుంది. పూర్తి ఎంటర్టైన్మెంట్గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. తమిళ ప్రేక్షకులు ఆదరించినట్టే తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్ కుమార్. -
కొత్త విషయాలు నేర్చుకున్నా
‘‘ఒక కాన్సెప్ట్‌తో సినిమా చేశాం. ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే హ్యాపీ. లేకపోతే నా ఐడియాలజీని పరిశీలించుకుని, తప్పులను దిద్దుకుని మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే ఈరోజు సినిమా రిలీజ్ అవుతున్నా నాకు ఆత్రుత, భయం లేవు. ఈ చిత్రం విడుదల ఆలస్యం అయినందుకు బాధగా లేదు. ‘ఏ మంత్రం వేశావె’ సినిమా జర్నీలో కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీధర్ మర్రి. విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ సమర్పణలో రూపొందిన ‘ఏ మంత్రం వేశావె’ సినిమా ఈ రోజు విడుదల కానుంది. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో మనం టెక్నాలజీని కంట్రోల్ చేస్తున్నామా? లేక టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేస్తుందా? అనే పాయింట్‌పై రూపొందించిన చిత్రమిది. గేమ్‌కు ఎడికై్ట ఉన్న క్యారెక్టర్లో హీరో విజయ్ కనిపిస్తారు. అలాంటి వ్యక్తి నార్మల్ లైఫ్‌లోకి ఎలా వచ్చాడన్నదే కథాంశం. ‘పెళ్లి చూపులు’ సినిమాకు ముందే ఈ కథను విజయ్ దేవరకొండకు చెప్పాను. సినిమాపై నమ్మకంతో శివకుమార్‌గారు వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు’’ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ చిత్రంలో అమృతగా నటించిన చిన్నారి గుర్తుందా? ఆ పాప అసలు పేరు కీర్తన. నటుడు పార్తీబన్, నటి సీత కూతురు. కీర్తనకి ఇప్పుడు పాతికేళ్ల వయసు. ఎడిటర్ శ్రీకర ప్రసాద్ తనయుడు, దర్శకుడు అక్షయ్‌ని కీర్తన గురువారం పెళ్లాడింది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. -
మాది ఢిల్లీ. నాకు సినిమా బ్యాక్‌డ్రాప్ లేదు
‘‘వెండి తెరపై నన్ను నేను చూసుకోవాలనుకున్నాను. ఆడిషన్స్ అప్పుడు పెద్ద కష్టపడలేదు కూడా. ఫస్ట్ టైమ్‌కే సెలెక్ట్ అయిపోయాను’’ అన్నారు శివానీ సింగ్. విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. ఈ సినిమా మార్చి 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శివానీ సింగ్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► మాది ఢిల్లీ. నాకు సినిమా బ్యాక్‌డ్రాప్ లేదు. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగస్తులే. మోడలింగ్ మీద ఇష్టం అంటే, గ్రాడ్యువేషన్ పూర్తి చేసి వెళ్లమన్నారు. డిగ్రీ పూర్తి చేశాక చాలా బ్రాండ్స్‌కు మోడల్‌గా చేశాను. రియాలిటీ షోలు కూడా చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ► ‘ఏ మంత్రం వేశావె’లో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైనా ఫేస్ చేసే అమ్మాయిగా కనిపిస్తా. నా క్యారెక్టర్‌కి అందరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను. ఈ సినిమా నాకెంత హెల్ప్ అవుతుంది అనేది నేను చెప్పలేను. కానీ మంచి సినిమాలో యాక్ట్ చేశానని మాత్రం చెప్పగలను. ► సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. విజయ్‌తో వర్క్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. రియల్ లైఫ్‌లో సోషల్ మీడియాను అవసరం మేరకే వాడాలి. వాటికి బానిసకాకుడదు. నేను సోషల్ మీడియా అవసరం ఉన్నంతవరకే వాడతాను. ► నాకు తెలుగు రాదు. కానీ టీమ్ అందరూ చాలా హెల్ప్ చేశారు. డైలాగ్స్ హిందీలో రాసుకొని ఇంగ్లీష్‌లోకి మార్చుకొని అర్థం చేసుకునేదాన్ని. డైరెక్టర్ శ్రీధర్‌గారు ప్రతీ డైలాగ్ వివరించేవారు. ► మహేశ్‌బాబు, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్‌లంటే బాగా ఇష్టం. మహేశ్‌తో సినిమా చేయాలనుంది. ► ఇవాళ ఉమన్స్ డే. ఈ సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే.. అన్ని రంగాల్లో మహిళలపై అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిని ఎదిరించే ధైర్యం మహిళల్లో రావాలి. అందరూ సమానమే అనే భావన రావాలి. -
ఆ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి
విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా శ్రీధర్ మర్రి దర్శకత్వంలో గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సుర„Š ఎంటర్టైన్మెంట్స్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత శివ కుమార్ మాట్లాడుతూ–‘‘ రొమాంటింక్ థ్రిల్లర్ చిత్రమిది. అల్రెడీ చిత్ర ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ చిత్రమిది. రిలీజ్ చేసే అవకాశం మాకు దక్కింది. కథను నమ్మి సినిమా తీసుకున్నాం. సినిమాలో గేమ్‌కు ఎడికై్ట ఫ్యామిలీనే మర్చిపోయే స్టేజ్‌లో హీరో ఉంటాడు. అప్పుడు అతను మారడానికి ఎవరు హెల్ప్ చేశారు? ఎలా చేశారు? అన్న అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండకు ఈ సినిమా ప్లస్ అవుతుందనుకుంటున్నాను. తమిళ్లో హిట్ సాధించిన ‘గులేబకావళి’ చిత్రాన్ని తెలుగులో త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈఏడాది మా బ్యానర్లో త్రీ మూవీస్ రానున్నాయి. కుమార్, రవిచందర్, కన్నడ డైరెక్టర్ రఘురాజ్ డైరెక్ట్ చేయనున్నారు. ‘సూర్య వర్సెస్ సూర్య’ మంచి సంతృప్తినిచ్చిన చిత్రం. హిందీలో రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. థియేటర్స్ క్లోజ్ విషయంపై స్పందిస్తూ– ‘‘ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు,నిర్మాతలు చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయి. ఈ నెల 9 నుంచి సినిమాల ప్రదర్శన ఉండొచ్చు. జాయింట్ యాక్షన్ కమిటీ తుది వివరాలను వెల్లడిస్తుంది’’ అన్నారు శివకుమార్. -
ప్రేక్షకులను మాయ చేస్తుంది – శివకుమార్
విజయ్ దేవరకొండ, శివాని సింగ్ జంటగా మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీధర్ మర్రి మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం యూత్ అంతా సోషల్ మీడియా, కంప్యూటర్ గేమింగ్‌కు అడిక్ట్ అయిపోయారు. అలా బానిస కావడం వల్ల సమాజంతో సంబంధాలు తెంచుకుంటున్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరం. అలా గేమింగ్‌కు అడిక్ట్ అయిన హీరోకు ఓ కొత్త ప్రపంచం, సొసైటీ, హ్యుమానిటీ ఎలా ఉంటుందో చూపిస్తుంది హీరోయిన్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసేలా ఉంటుంది. శివకుమార్ గారు ఈ సినిమాలో పార్టనర్ అవడంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నా’’ అని అన్నారు. చిత్రసమర్పకులు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘నవంబర్‌లో ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది. శ్రీధర్‌గారు అనుభవం ఉన్న డైరెక్టర్లా హ్యాండిల్ చేశారు. యూత్ ఎక్స్పెక్ట్ చేసే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలతో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ క్రేజ్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలోనూ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులను మాయ చేస్తుందీ చిత్రం’’ అని అన్నారు. బంద్ కాదు నిరసన డిజిటల్ సర్విస్ ప్రొవైడర్స్ వ్యవస్థపై చేస్తున్న బంద్ కాదు.. నిరసన ఇది. శాటిలైట్ సిస్టమ్ ద్వారా సర్వర్లు ఏర్పాటు చేసుకొని థియేటర్స్‌లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి కంటెంట్ రిలీజ్ చేస్తే బావుంటుంది. అతి తక్కువ ధరలో అయిపోతుందని చెప్పి, కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రీ అని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నారు. కానీ ఇంకా మమ్మల్ని దోచుకుంటూనే ఉన్నారు. ఈ డిజిటల్ ప్రొవైడర్స్‌కు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దొంగలు కూడా తోడై చిన్న నిర్మాతల రక్తాన్ని తాగుతున్నారు. డిజిటల్ వ్యవస్థకు చిన్న సినిమాలు ఆడినా ఆడకపోయినా డబ్బులు కట్టాలి. ఈ సమస్య కోసం సౌత్ నిర్మాతలు అందరూ ఏకం కావడం సంతోషం’’ అన్నారు మల్కాపురం శివకుమార్. -
కథ బాగుంటే విజయమే
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త జనరేషన్ అవసరం. పూరి జగన్నాథ్, గుణశేఖర్‌లాంటి వాళ్లు విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చినవారే. ‘ప్రేమాంజలి’ చిత్రదర్శకుడు వరుణ్‌ది కూడా నర్సీపట్నం కావడం విశేషం. టీజర్ చూస్తే మెసేజ్ ఉన్న సినిమాలా ఉంది. హిట్ అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సుజయ్, శ్వేతానీల్ జంటగా వరుణ్ దొర దర్శకత్వంలో మహాలక్ష్మి సమర్పణలో ఆర్.వి. నారాయణ రావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమాంజలి’. గోవర్ధన్ సంగీతం అందించారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ బిగ్ సీడీ, దర్శకుడు సాగర్ పాటల సీడీ, తమ్మారెడ్డి టీజర్ రిలీజ్ చేశారు. ‘‘చిన్న సినిమాలు రావడం వల్లే ఇండస్ట్రీలో కొత్త కథలు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్ ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు మల్కాపురం శివకుమార్. ‘‘ఎటువంటి అవగాహన లేని చిన్న పిల్లలు ప్రేమలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని పేపర్స్‌లో, టీవీల్లో వచ్చే వార్తలు నన్ను ప్రభావితం చేశాయి. అలాంటివాళ్లకు మెసేజ్ ఇవ్వాలని ఈ సినిమా తీశా’’ అన్నారు వరుణ్ దొర. సహ నిర్మాత కె.వి. ప్రసాద్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజ్ నజీర్. -
అంతా భయం.. భయం!
కారు దానంతటదే స్టార్ట్ అయిపోతుంది. మార్చకుండానే గేర్లు మారిపోతాయి. ఆన్ చేయకుండానే సిగ్నల్ లైట్స్ వెలుగుతాయి. ఓ మనిషి కంగారుపడటానికి ఇంతకు మించి ఏం కావాలి? ఇంతకీ ఇదంతా చేసేది ఎవరు? అంటే.. ‘ఆత్మ’. ఆ ఆత్మ కారులోనే ఉంటుందా? బయట ఉంటుందా? హీరోయిన్‌కు, ఆత్మపగకు ఉన్న లింక్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలసుకోవాలంటే ఈ నెల 31 న విడుదలవుతున్న ‘డోర’ చిత్రం చూడాలంటు న్నారు దర్శకుడు దాస్ రామసామి. తెలుగు, తమిళ భాషల్లో నయనతార టైటిల్ రోల్లో రూపొందిన ఈ చిత్రాన్ని సుర„ ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మాల్కాపురం శివకుమర్ తెలుగులో విడుదల చేయ నున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ– ‘‘ కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా నిర్మించాం. స్క్రీన్‌ప్లే చిత్రానికి హైలెట్. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. -
చిత్రాంగద కోసం హార్డ్ వర్క్ చేశా
‘‘గీతాంజలి’’ చిత్రం తర్వాత నేను చేసిన∙లేడీ ఓరియంటెడ్ మూవీ ‘చిత్రాంగద’. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన సినిమా. ఈ చిత్రం కోసం చాలా హార్డ్‌వర్క్ చేశా’’ అని అంజలి అన్నారు. ఆమె టైటిల్ రోల్లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ నేడు విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథ ఇది. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలుంటాయి’’ అన్నారు. ‘‘గీతాంజలి’ కంటే అంజలి ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘చిత్రాంగద’. సినిమాపై నమ్మకంతో డిస్టిబ్య్రూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేసేందుకు ముందుకొచ్చారు’’ అన్నారు మల్కాపురం శివకుమార్.