మల్కాపురం శివకుమార్
విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా శ్రీధర్ మర్రి దర్శకత్వంలో గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సుర„Š ఎంటర్‌టైన్‌మెంట్స్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత శివ కుమార్ మాట్లాడుతూ–‘‘ రొమాంటింక్ థ్రిల్లర్ చిత్రమిది. అల్రెడీ చిత్ర ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ చిత్రమిది.
రిలీజ్ చేసే అవకాశం మాకు దక్కింది. కథను నమ్మి సినిమా తీసుకున్నాం. సినిమాలో గేమ్‌కు ఎడికై్ట ఫ్యామిలీనే మర్చిపోయే స్టేజ్‌లో హీరో ఉంటాడు. అప్పుడు అతను మారడానికి ఎవరు హెల్ప్ చేశారు? ఎలా చేశారు? అన్న అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండకు ఈ సినిమా ప్లస్ అవుతుందనుకుంటున్నాను. తమిళ్‌లో హిట్ సాధించిన ‘గులేబకావళి’ చిత్రాన్ని తెలుగులో త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం.
ఈఏడాది మా బ్యానర్‌లో త్రీ మూవీస్ రానున్నాయి. కుమార్, రవిచందర్, కన్నడ డైరెక్టర్ రఘురాజ్ డైరెక్ట్ చేయనున్నారు. ‘సూర్య వర్సెస్ సూర్య’ మంచి సంతృప్తినిచ్చిన చిత్రం. హిందీలో రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. థియేటర్స్ క్లోజ్ విషయంపై స్పందిస్తూ– ‘‘ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు,నిర్మాతలు చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయి. ఈ నెల 9 నుంచి సినిమాల ప్రదర్శన ఉండొచ్చు. జాయింట్ యాక్షన్ కమిటీ తుది వివరాలను వెల్లడిస్తుంది’’ అన్నారు శివకుమార్.
Comments
Please login to add a commentAdd a comment