Ye Mantram Vesave
-
‘ఏ మంత్రం వేసావె’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏ మంత్రం వేసావె జానర్ : థ్రిల్లర్ తారాగణం : విజయ్ దేవరకొండ, శివాని సింగ్, శివన్నారాయణ, ఆశిష్ రాజ్ సంగీతం : అబ్బట్ సమత్ దర్శకత్వం : శ్రీధర్ మర్రి నిర్మాత : గోలీసోడా ఫిలింస్ ప్రొడక్షన్ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ఏ మంత్రం వేసావె. పెళ్లిచూపులు కన్నా ముందే ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఇప్పటికి రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా, గేమింగ్ లాంటి వాటిలో పడి యువత ఎలా నష్టపోతుంది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కెరీర్‌కు మరింత బూస్ట్ ఇచ్చిందా..? కథ : నిఖిల్ (విజయ్ దేవరకొండ) గేమింగే ప్రపంచంగా బతికే కుర్రాడు. నెలల తరబడి తన రూమ్‌లో నుంచి బయటకు రాకుండా గేమ్స్ ఆడుతూ కాలం గడిపేస్తుంటాడు. తన ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేసి మరి ఆన్లైన్లో గేమ్స్ లో విజయం సాధిస్తుంటాడు. అలాంటి అబ్బాయిని ఓ అమ్మాయి రియల్ లైఫ్‌లో గేమ్ ఆడదామని ఛాలెంజ్ చేస్తుంది. (సాక్షి రివ్యూస్) రాగ్స్ (శివాని సింగ్) ఓ గేమింగ్ కంపెనీలో డిజైనర్‌గా పని చేస్తుంటుంది. అందరూ రక్తపాతం, పోరాటం లాంటి కాన్సెప్ట్ లతో గేమ్స్ తయారు చూస్తుంటే తాను మాత్రం అందుకు భిన్నంగా నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఓ గేమ్ కాన్పెప్ట్ తీసుకువస్తుంది, కానీ బాస్ తన గేమ్ కాన్సెప్ట్‌ను రిజెక్ట్ చేస్తాడు. దీంతో రాగ్స్ తన రియల్ లైఫ్ గేమ్‌తో ఎలాగైన గేమింగ్ కాంపిటేషన్‌లో అవార్డు సాధించాలని నిఖిల్ ను ట్రాప్ చేసి గేమ్ లోకి లాగుతుంది. రాగ్స్.. నిఖిల్ తో ఆడిన గేమ్ ఏంటి..? అసలు రాగ్స్ ట్రాప్‌లోకి నిఖిల్ ఎలా వచ్చాడు..? ఈ గేమ్ కారణంగా నిఖిల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? ఏం ఏం విజయాలు సాధించాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలోనే చేసిన సినిమా కావటంతో ఏ మంత్రం వేసావె సినిమాలో ఆకట్టుకునే స్థాయి పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు. అయితే ఇతర నటీనటులతో పోలిస్తే.. విజయ్ ఒక్కడే కాస్త మంచి నటన కనబరిచినట్టుగా అనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్గా పరిచయం అయిన శివాని సింగ్ పూర్తిగా నిరాశపరిచింది. లుక్స్ తో పరవాలేదనిపించినా.. నటన విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇతర పాత్రల్లో కనిపించిన నటీనటులు పెద్దగా గుర్తింపు ఉన్న వారు కాకపోవటంతో పాటు క్యారెక్టరైజేషన్స్, పాత్రధారుల నటన కూడా ఆకట్టుకునేలా లేదు. విశ్లేషణ : సోషల్ మీడియా, గేమింగ్ లాంటివి వ్యసనాలుగా మారి యువతను ఎలా ఇబ్బందులు పాలు చేస్తున్నాయన్న ఇంట్రస్టింగ్ కాన్పెప్ట్‌ను కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు, దాన్ని పూర్తి స్థాయి సినిమాగా తెరకెక్కించటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఒకటి.. రెండు ట్విస్ట్‌లు తప్ప సినిమాలో ఒక్క సీన్ కూడా ఆసక్తికరంగా తెరకెక్కించ లేకపోయాడు.(సాక్షి రివ్యూస్) చాలా సందర్భాల్లో షార్ట్ ఫిలింస్ కూడా ఇంత కంటే బాగుంటాయన్న భావన కలిగేలా సాగిందీ కథనం. అబ్బట్ సమట్ అందించిన నేపథ్య సంగీతం అక్కడక్కడ మెరిసినా పాటలు మాత్రం ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలూ అంతంత మాత్రమే. ప్లస్ పాయింట్స్ : విజయ్ దేవరకొండ ఇమేజ్ మైనస్ పాయింట్స్ : కథా కథనం నిర్మాణ విలువలు నటీనటులు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
కొత్త విషయాలు నేర్చుకున్నా
‘‘ఒక కాన్సెప్ట్‌తో సినిమా చేశాం. ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే హ్యాపీ. లేకపోతే నా ఐడియాలజీని పరిశీలించుకుని, తప్పులను దిద్దుకుని మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే ఈరోజు సినిమా రిలీజ్ అవుతున్నా నాకు ఆత్రుత, భయం లేవు. ఈ చిత్రం విడుదల ఆలస్యం అయినందుకు బాధగా లేదు. ‘ఏ మంత్రం వేశావె’ సినిమా జర్నీలో కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీధర్ మర్రి. విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ సమర్పణలో రూపొందిన ‘ఏ మంత్రం వేశావె’ సినిమా ఈ రోజు విడుదల కానుంది. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో మనం టెక్నాలజీని కంట్రోల్ చేస్తున్నామా? లేక టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేస్తుందా? అనే పాయింట్‌పై రూపొందించిన చిత్రమిది. గేమ్‌కు ఎడికై్ట ఉన్న క్యారెక్టర్లో హీరో విజయ్ కనిపిస్తారు. అలాంటి వ్యక్తి నార్మల్ లైఫ్‌లోకి ఎలా వచ్చాడన్నదే కథాంశం. ‘పెళ్లి చూపులు’ సినిమాకు ముందే ఈ కథను విజయ్ దేవరకొండకు చెప్పాను. సినిమాపై నమ్మకంతో శివకుమార్‌గారు వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు’’ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ చిత్రంలో అమృతగా నటించిన చిన్నారి గుర్తుందా? ఆ పాప అసలు పేరు కీర్తన. నటుడు పార్తీబన్, నటి సీత కూతురు. కీర్తనకి ఇప్పుడు పాతికేళ్ల వయసు. ఎడిటర్ శ్రీకర ప్రసాద్ తనయుడు, దర్శకుడు అక్షయ్‌ని కీర్తన గురువారం పెళ్లాడింది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. -
మాది ఢిల్లీ. నాకు సినిమా బ్యాక్‌డ్రాప్ లేదు
‘‘వెండి తెరపై నన్ను నేను చూసుకోవాలనుకున్నాను. ఆడిషన్స్ అప్పుడు పెద్ద కష్టపడలేదు కూడా. ఫస్ట్ టైమ్‌కే సెలెక్ట్ అయిపోయాను’’ అన్నారు శివానీ సింగ్. విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. ఈ సినిమా మార్చి 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శివానీ సింగ్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► మాది ఢిల్లీ. నాకు సినిమా బ్యాక్‌డ్రాప్ లేదు. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగస్తులే. మోడలింగ్ మీద ఇష్టం అంటే, గ్రాడ్యువేషన్ పూర్తి చేసి వెళ్లమన్నారు. డిగ్రీ పూర్తి చేశాక చాలా బ్రాండ్స్‌కు మోడల్‌గా చేశాను. రియాలిటీ షోలు కూడా చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ► ‘ఏ మంత్రం వేశావె’లో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైనా ఫేస్ చేసే అమ్మాయిగా కనిపిస్తా. నా క్యారెక్టర్‌కి అందరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను. ఈ సినిమా నాకెంత హెల్ప్ అవుతుంది అనేది నేను చెప్పలేను. కానీ మంచి సినిమాలో యాక్ట్ చేశానని మాత్రం చెప్పగలను. ► సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. విజయ్‌తో వర్క్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. రియల్ లైఫ్‌లో సోషల్ మీడియాను అవసరం మేరకే వాడాలి. వాటికి బానిసకాకుడదు. నేను సోషల్ మీడియా అవసరం ఉన్నంతవరకే వాడతాను. ► నాకు తెలుగు రాదు. కానీ టీమ్ అందరూ చాలా హెల్ప్ చేశారు. డైలాగ్స్ హిందీలో రాసుకొని ఇంగ్లీష్‌లోకి మార్చుకొని అర్థం చేసుకునేదాన్ని. డైరెక్టర్ శ్రీధర్‌గారు ప్రతీ డైలాగ్ వివరించేవారు. ► మహేశ్‌బాబు, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్‌లంటే బాగా ఇష్టం. మహేశ్‌తో సినిమా చేయాలనుంది. ► ఇవాళ ఉమన్స్ డే. ఈ సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే.. అన్ని రంగాల్లో మహిళలపై అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిని ఎదిరించే ధైర్యం మహిళల్లో రావాలి. అందరూ సమానమే అనే భావన రావాలి. -
ఆ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి
విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా శ్రీధర్ మర్రి దర్శకత్వంలో గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సుర„Š ఎంటర్టైన్మెంట్స్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత శివ కుమార్ మాట్లాడుతూ–‘‘ రొమాంటింక్ థ్రిల్లర్ చిత్రమిది. అల్రెడీ చిత్ర ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ చిత్రమిది. రిలీజ్ చేసే అవకాశం మాకు దక్కింది. కథను నమ్మి సినిమా తీసుకున్నాం. సినిమాలో గేమ్‌కు ఎడికై్ట ఫ్యామిలీనే మర్చిపోయే స్టేజ్‌లో హీరో ఉంటాడు. అప్పుడు అతను మారడానికి ఎవరు హెల్ప్ చేశారు? ఎలా చేశారు? అన్న అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండకు ఈ సినిమా ప్లస్ అవుతుందనుకుంటున్నాను. తమిళ్లో హిట్ సాధించిన ‘గులేబకావళి’ చిత్రాన్ని తెలుగులో త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈఏడాది మా బ్యానర్లో త్రీ మూవీస్ రానున్నాయి. కుమార్, రవిచందర్, కన్నడ డైరెక్టర్ రఘురాజ్ డైరెక్ట్ చేయనున్నారు. ‘సూర్య వర్సెస్ సూర్య’ మంచి సంతృప్తినిచ్చిన చిత్రం. హిందీలో రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. థియేటర్స్ క్లోజ్ విషయంపై స్పందిస్తూ– ‘‘ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు,నిర్మాతలు చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయి. ఈ నెల 9 నుంచి సినిమాల ప్రదర్శన ఉండొచ్చు. జాయింట్ యాక్షన్ కమిటీ తుది వివరాలను వెల్లడిస్తుంది’’ అన్నారు శివకుమార్. -
ప్రేక్షకులను మాయ చేస్తుంది – శివకుమార్
విజయ్ దేవరకొండ, శివాని సింగ్ జంటగా మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీధర్ మర్రి మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం యూత్ అంతా సోషల్ మీడియా, కంప్యూటర్ గేమింగ్‌కు అడిక్ట్ అయిపోయారు. అలా బానిస కావడం వల్ల సమాజంతో సంబంధాలు తెంచుకుంటున్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరం. అలా గేమింగ్‌కు అడిక్ట్ అయిన హీరోకు ఓ కొత్త ప్రపంచం, సొసైటీ, హ్యుమానిటీ ఎలా ఉంటుందో చూపిస్తుంది హీరోయిన్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసేలా ఉంటుంది. శివకుమార్ గారు ఈ సినిమాలో పార్టనర్ అవడంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నా’’ అని అన్నారు. చిత్రసమర్పకులు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘నవంబర్‌లో ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది. శ్రీధర్‌గారు అనుభవం ఉన్న డైరెక్టర్లా హ్యాండిల్ చేశారు. యూత్ ఎక్స్పెక్ట్ చేసే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలతో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ క్రేజ్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలోనూ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులను మాయ చేస్తుందీ చిత్రం’’ అని అన్నారు. బంద్ కాదు నిరసన డిజిటల్ సర్విస్ ప్రొవైడర్స్ వ్యవస్థపై చేస్తున్న బంద్ కాదు.. నిరసన ఇది. శాటిలైట్ సిస్టమ్ ద్వారా సర్వర్లు ఏర్పాటు చేసుకొని థియేటర్స్‌లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి కంటెంట్ రిలీజ్ చేస్తే బావుంటుంది. అతి తక్కువ ధరలో అయిపోతుందని చెప్పి, కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రీ అని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నారు. కానీ ఇంకా మమ్మల్ని దోచుకుంటూనే ఉన్నారు. ఈ డిజిటల్ ప్రొవైడర్స్‌కు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దొంగలు కూడా తోడై చిన్న నిర్మాతల రక్తాన్ని తాగుతున్నారు. డిజిటల్ వ్యవస్థకు చిన్న సినిమాలు ఆడినా ఆడకపోయినా డబ్బులు కట్టాలి. ఈ సమస్య కోసం సౌత్ నిర్మాతలు అందరూ ఏకం కావడం సంతోషం’’ అన్నారు మల్కాపురం శివకుమార్. -
‘ఏ మంత్రం వేశావే’ మూవీ స్టిల్స్