శ్రీధర్, శివకుమార్
విజయ్ దేవరకొండ, శివాని సింగ్ జంటగా మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీధర్ మర్రి మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం యూత్ అంతా సోషల్ మీడియా, కంప్యూటర్ గేమింగ్‌కు అడిక్ట్ అయిపోయారు. అలా బానిస కావడం వల్ల సమాజంతో సంబంధాలు తెంచుకుంటున్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరం. అలా గేమింగ్‌కు అడిక్ట్ అయిన హీరోకు ఓ కొత్త ప్రపంచం, సొసైటీ, హ్యుమానిటీ ఎలా ఉంటుందో చూపిస్తుంది హీరోయిన్.
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసేలా ఉంటుంది. శివకుమార్ గారు ఈ సినిమాలో పార్టనర్ అవడంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నా’’ అని అన్నారు. చిత్రసమర్పకులు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘నవంబర్‌లో ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది. శ్రీధర్‌గారు అనుభవం ఉన్న డైరెక్టర్‌లా హ్యాండిల్ చేశారు. యూత్ ఎక్స్‌పెక్ట్ చేసే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలతో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ క్రేజ్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలోనూ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులను మాయ చేస్తుందీ చిత్రం’’ అని అన్నారు.
బంద్ కాదు నిరసన
డిజిటల్ సర్విస్ ప్రొవైడర్స్ వ్యవస్థపై చేస్తున్న బంద్ కాదు.. నిరసన ఇది. శాటిలైట్ సిస్టమ్ ద్వారా సర్వర్‌లు ఏర్పాటు చేసుకొని థియేటర్స్‌లో ప్రొజెక్టర్‌లు ఏర్పాటు చేసి కంటెంట్ రిలీజ్ చేస్తే బావుంటుంది. అతి తక్కువ ధరలో అయిపోతుందని చెప్పి, కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రీ అని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నారు. కానీ ఇంకా మమ్మల్ని దోచుకుంటూనే ఉన్నారు. ఈ డిజిటల్ ప్రొవైడర్స్‌కు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దొంగలు కూడా తోడై చిన్న నిర్మాతల రక్తాన్ని తాగుతున్నారు. డిజిటల్ వ్యవస్థకు చిన్న సినిమాలు ఆడినా ఆడకపోయినా డబ్బులు కట్టాలి. ఈ సమస్య కోసం సౌత్ నిర్మాతలు అందరూ ఏకం కావడం సంతోషం’’ అన్నారు మల్కాపురం శివకుమార్.
Comments
Please login to add a commentAdd a comment