శివానీ సింగ్
‘‘వెండి తెరపై నన్ను నేను చూసుకోవాలనుకున్నాను. ఆడిషన్స్ అప్పుడు పెద్ద కష్టపడలేదు కూడా. ఫస్ట్ టైమ్‌కే సెలెక్ట్ అయిపోయాను’’ అన్నారు శివానీ సింగ్. విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏ మంత్రం వేశావె’. ఈ సినిమా మార్చి 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శివానీ సింగ్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు.
► మాది ఢిల్లీ. నాకు సినిమా బ్యాక్‌డ్రాప్ లేదు. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగస్తులే. మోడలింగ్ మీద ఇష్టం అంటే, గ్రాడ్యువేషన్ పూర్తి చేసి వెళ్లమన్నారు. డిగ్రీ పూర్తి చేశాక చాలా బ్రాండ్స్‌కు మోడల్‌గా చేశాను. రియాలిటీ షోలు కూడా చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను.
► ‘ఏ మంత్రం వేశావె’లో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైనా ఫేస్ చేసే అమ్మాయిగా కనిపిస్తా. నా క్యారెక్టర్‌కి అందరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను. ఈ సినిమా నాకెంత హెల్ప్ అవుతుంది అనేది నేను చెప్పలేను. కానీ మంచి సినిమాలో యాక్ట్ చేశానని మాత్రం చెప్పగలను.
► సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. విజయ్‌తో వర్క్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. రియల్ లైఫ్‌లో సోషల్ మీడియాను అవసరం మేరకే వాడాలి. వాటికి బానిసకాకుడదు. నేను సోషల్ మీడియా అవసరం ఉన్నంతవరకే వాడతాను.
► నాకు తెలుగు రాదు. కానీ టీమ్ అందరూ చాలా హెల్ప్ చేశారు. డైలాగ్స్ హిందీలో రాసుకొని ఇంగ్లీష్‌లోకి మార్చుకొని అర్థం చేసుకునేదాన్ని. డైరెక్టర్ శ్రీధర్‌గారు ప్రతీ డైలాగ్ వివరించేవారు.
► మహేశ్‌బాబు, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్‌లంటే బాగా ఇష్టం. మహేశ్‌తో సినిమా చేయాలనుంది.
► ఇవాళ ఉమన్స్ డే. ఈ సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే.. అన్ని రంగాల్లో మహిళలపై అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిని ఎదిరించే ధైర్యం మహిళల్లో రావాలి. అందరూ సమానమే అనే భావన రావాలి.
Comments
Please login to add a commentAdd a comment