టైటిల్ : ఏ మంత్రం వేసావె
జానర్ : థ్రిల్లర్
తారాగణం : విజయ్ దేవరకొండ, శివాని సింగ్, శివన్నారాయణ, ఆశిష్ రాజ్
సంగీతం : అబ‍్బట్ సమత్
దర్శకత్వం : శ్రీధర్ మర్రి
నిర్మాత : గోలీసోడా ఫిలింస్ ప్రొడక్షన్
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ఏ మంత్రం వేసావె. పెళ్లిచూపులు కన్నా ముందే ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఇప్పటికి రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా, గేమింగ్ లాంటి వాటిలో పడి యువత ఎలా నష్టపోతుంది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కెరీర్‌కు మరింత బూస్ట్ ఇచ్చిందా..?
కథ :
నిఖిల్ (విజయ్ దేవరకొండ) గేమింగే ప్రపంచంగా బతికే కుర్రాడు. నెలల తరబడి తన రూమ్‌లో నుంచి బయటకు రాకుండా గేమ్స్ ఆడుతూ కాలం గడిపేస్తుంటాడు. తన ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేసి మరి ఆన్‌లైన్‌లో గేమ్స్ లో విజయం సాధిస్తుంటాడు. అలాంటి అబ్బాయిని ఓ అమ్మాయి రియల్ లైఫ్‌లో గేమ్ ఆడదామని ఛాలెంజ్ చేస్తుంది. (సాక్షి రివ్యూస్) రాగ్స్ (శివాని సింగ్) ఓ గేమింగ్ కంపెనీలో డిజైనర్‌గా పని చేస్తుంటుంది. అందరూ రక్తపాతం, పోరాటం లాంటి కాన్సెప్ట్ లతో గేమ్స్ తయారు చూస్తుంటే తాను మాత్రం అందుకు భిన్నంగా నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఓ గేమ్ కాన్పెప్ట్ తీసుకువస్తుంది, కానీ బాస్ తన గేమ్ కాన్సెప్ట్‌ను రిజెక్ట్ చేస్తాడు. దీంతో రాగ్స్ తన రియల్ లైఫ్ గేమ్‌తో ఎలాగైన గేమింగ్ కాంపిటేషన్‌లో అవార్డు సాధించాలని నిఖిల్ ను ట్రాప్ చేసి గేమ్ లోకి లాగుతుంది. రాగ్స్.. నిఖిల్ తో ఆడిన గేమ్ ఏంటి..? అసలు రాగ్స్ ట్రాప్‌లోకి నిఖిల్ ఎలా వచ్చాడు..? ఈ గేమ్ కారణంగా నిఖిల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? ఏం ఏం విజయాలు సాధించాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలోనే చేసిన సినిమా కావటంతో ఏ మంత్రం వేసావె సినిమాలో ఆకట్టుకునే స్థాయి పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు. అయితే ఇతర నటీనటులతో పోలిస్తే.. విజయ్ ఒక్కడే కాస్త మంచి నటన కనబరిచినట్టుగా అనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్‌గా పరిచయం అయిన శివాని సింగ్ పూర్తిగా నిరాశపరిచింది. లుక్స్ తో పరవాలేదనిపించినా.. నటన విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇతర పాత్రల్లో కనిపించిన నటీనటులు పెద్దగా గుర్తింపు ఉన్న వారు కాకపోవటంతో పాటు క్యారెక్టరైజేషన్స్, పాత్రధారుల నటన కూడా ఆకట్టుకునేలా లేదు.
విశ్లేషణ :
సోషల్ మీడియా, గేమింగ్ లాంటివి వ్యసనాలుగా మారి యువతను ఎలా ఇబ్బందులు పాలు చేస్తున్నాయన్న ఇంట్రస్టింగ్ కాన్పెప్ట్‌ను కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు, దాన్ని పూర్తి స్థాయి సినిమాగా తెరకెక్కించటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఒకటి.. రెండు ట్విస్ట్‌లు తప్ప సినిమాలో ఒక్క సీన్ కూడా ఆసక్తికరంగా తెరకెక్కించ లేకపోయాడు.(సాక్షి రివ్యూస్) చాలా సందర్భాల్లో షార్ట్ ఫిలింస్ కూడా ఇంత కంటే బాగుంటాయన్న భావన కలిగేలా సాగిందీ కథనం. అబ్బట్ సమట్ అందించిన నేపథ్య సంగీతం అక్కడక్కడ మెరిసినా పాటలు మాత్రం ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలూ అంతంత మాత్రమే.
ప్లస్ పాయింట్స్ :
విజయ్ దేవరకొండ ఇమేజ్
మైనస్ పాయింట్స్ :
కథా కథనం
నిర్మాణ విలువలు
నటీనటులు
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment