టాలీవుడ్‌లో ఒక్కోసారి చాలామంది హీరోలు వారి వద్దకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. అందులో కంటెంట్ నచ్చకనో, కథలో కొన్ని సన్నివేశాలు సెట్ కావనే సందేహమో తెలియదు.. ఆ సినిమాలే భారీ హిట్స్ అవుతుంటాయి కూడా. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఒక్క కారణం వల్ల సూపర్ హిట్ సినిమాను వదులుకున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: సైతాన్ ట్రైలర్‌లో పచ్చిబూతులు, అసభ్య సన్నివేశాలు.. డైరెక్టర్ ఏమన్నాడంటే?)
విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'అర్జున్ రెడ్డి' కథను ముందుగా బన్నీకి చెప్పాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి. కథ రాసుకునే సమయంలోనే బన్నీని ఫిక్స్ చేసుకున్నాడట. అయితే, ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అంతే కాకుండా కచ్చితంగా లిప్ కిస్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టాడట. దీంతో వెంటనే అల్లు అర్జున్ పదేపదే కిస్ చేయటం వల్ల తన ఇమేజ్ ఎక్కడ డామేజ్ అయిపోతుందో అని ఈ సినిమాకు నో చెప్పేశాడని సమాచారం. తర్వాత శర్వానంద్ దగ్గరికి సందీప్ రెడ్డి వెళ్తే.. అదే కారణంతో రిజక్ట్ చేశాడట. చివరిగా విజయ్ దేవరకొండ ఓకే చెప్పడం ఆ తర్వాత భారీ హిట్ కొట్టడమే కాకుండా తనకు ఆ సినిమా విపరీతమైన ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది.
(ఇదీ చదవండి: ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి)
Comments
Please login to add a commentAdd a comment