Arjun reddy movie
-
పద్ధతిగా ఉండాలి.. విజయ్‌తో గొడవపై అనసూయ లేటెస్ట్ కామెంట్స్
యాంకర్ అనసూయ.. ఈ పేరు చెప్పగానే ఆమె అందంతో పాటు చిన్న చిన్న వివాదాలు కూడా గుర్తొస్తాయి. 'అర్జున్ రెడ్డి' రిలీజ్ టైంలో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, మూవీ కంటెంట్‌పై అనసూయ కొన్ని కామెంట్స్ చేసింది. అప్పటినుంచి విజయ్-అనసూయ పరోక్షంగా చిన్నపాటి గొడవ నడుస్తూ వచ్చింది. కొన్నిరోజుల క్రితమే దీనికి పుల్‌స్టాప్ అని చెప్పింది. తాజాగా మరోసారి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్)'నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. సినిమాలతో ఎలాగైతే మెసేజ్ ఇస్తారో నేను కూడా అలానే ఇవ్వాలని అప్పుడు రియాక్ట్ అయ్యాను. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు మితిమీరినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆ రోజు మీరెవరూ మాట్లాడకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. మీడియా ప్రశ్నించలేదు. మళ్లీ తప్పు ఎత్తి చూపినందుకు నన్నే అన్నారు. ఎవరిపైనా నాకు ద్వేషం లేదు' అని అనసూయ క్లారిటీ ఇచ్చేసింది.అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ 'సింబా'. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఇందులోనే ఓ సీన్లో భాగంగా విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని చెప్పగానే అనసూయ పాత్ర సిగ్గుపడుతుంది. ఈ సీన్ చూసిన తర్వాత మీడియా.. విజయ్ దేవరకొండతో గొడవపై ప్రశ్నించింది. అనసూయ కూడా ఇక దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదని చెబుతూ స్పష్టత ఇచ్చేసింది.(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ) -
కలెక్షన్స్‌లో బేబీ ఆల్‌టైమ్ రికార్డ్.. అర్జున్ రెడ్డి రికార్డు బ్రేక్
-
సూపర్ హిట్ సినిమాను వదులుకున్న బన్నీ?
టాలీవుడ్లో ఒక్కోసారి చాలామంది హీరోలు వారి వద్దకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. అందులో కంటెంట్ నచ్చకనో, కథలో కొన్ని సన్నివేశాలు సెట్ కావనే సందేహమో తెలియదు.. ఆ సినిమాలే భారీ హిట్స్ అవుతుంటాయి కూడా. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఒక్క కారణం వల్ల సూపర్ హిట్ సినిమాను వదులుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: సైతాన్ ట్రైలర్లో పచ్చిబూతులు, అసభ్య సన్నివేశాలు.. డైరెక్టర్ ఏమన్నాడంటే?) విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'అర్జున్ రెడ్డి' కథను ముందుగా బన్నీకి చెప్పాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి. కథ రాసుకునే సమయంలోనే బన్నీని ఫిక్స్ చేసుకున్నాడట. అయితే, ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అంతే కాకుండా కచ్చితంగా లిప్ కిస్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టాడట. దీంతో వెంటనే అల్లు అర్జున్ పదేపదే కిస్ చేయటం వల్ల తన ఇమేజ్ ఎక్కడ డామేజ్ అయిపోతుందో అని ఈ సినిమాకు నో చెప్పేశాడని సమాచారం. తర్వాత శర్వానంద్ దగ్గరికి సందీప్ రెడ్డి వెళ్తే.. అదే కారణంతో రిజక్ట్ చేశాడట. చివరిగా విజయ్ దేవరకొండ ఓకే చెప్పడం ఆ తర్వాత భారీ హిట్ కొట్టడమే కాకుండా తనకు ఆ సినిమా విపరీతమైన ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. (ఇదీ చదవండి: ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి) -
అర్జున్ రెడ్డి ఆఫర్ వదులుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశా: హీరోయిన్
తమిళసినిమా: సంచలన నటిగా ముద్ర వేసుకున్న పార్వతి నాయర్ బహుభాష నటిగా రాణిస్తున్నారు. తమిళంలో ఉత్తమ విలన్, మాలై నేరత్తు మైకం, ఎంకిట్ట మోదాదే, నిమిర్ తదితర చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏ రంగానికి చెందిన వారికైనా అదృష్టం చాలా ముఖ్యమని చెప్పింది. అయితే అది జీవితంలో ఒకసారి మాత్రమే తలుపు తడుతుందని, వెంటనే దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. తాను మాత్రం దానిని మిస్ చేసుకున్నానని చెప్పింది. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డిలో కథానాయకిగా తాను నటించాల్సి ఉందని, అయితే అందులో లిప్‌లాక్ సన్నివేశాలు, రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో తాను నిరాకరించినట్లు పేర్కొంది. చదవండి: ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది: రాహుల్ ఎమోషనల్ నిజానికి ఆ అవకాశాన్ని వదులుకోకూడదని చిత్రం చూసిన తరువాత చాలా బాధపడ్డానని చెప్పింది. వాస్తవానికి అర్జున్‌రెడ్డి ఒక అందమైన చిత్రమని తెలిపింది. ఆ చిత్రాన్ని నిరాకరించి పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే జీవితంలో తనకు కలిగిన మరో అద్భుత అవకాశం ఉత్తమవిలన్ కమలహాసన్‌తో కలిసి నటించానని పేర్కొంది. ఆ అనుభవాన్ని తాను జీవితాంతం మరిచిపోలేనని చెప్పింది. కమలహాసన్ సరసన నటించాను అన్న విషయాన్ని ఇప్పుడు తలచుకున్నా నమ్మసక్యంగా లేదని చెప్పింది. కాగా ఒకే తరహా కథా పాత్రలు మళ్లీ మళ్లీ చేయడం తనకు ఇష్టం ఉండదని పార్వతి నాయర్ పేర్కొంది. -
‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ రిపీట్?
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 2017లో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ కెరీర్ మరో లెవల్‌కి వెళ్లింది. సందీప్ అయితే ఏకంగా బాలీవుడ్‌కి వెళ్లి, ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కభీర్ సింగ్’ని తెరకెక్కించారు. ఇప్పుడు విజయ్, సందీప్ కలిసి మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ స్టోరీ లైన్‌ను కూడా రెడీ చేశారట సందీప్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ‘లైగర్’ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వాల్లో విజయ్ దేవరకొండ సినిమాలు చేయాల్సి ఉంది. ఇటు సందీప్ వంగా కూడా రణ్‌బీర్ కపూర్‌తో ‘యానీమల్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరూ తమ పాజెక్ట్స్ను కంప్లీట్ చేసిన తర్వాత వీరి కాంబినేషన్ సినిమా ఆరంభమవుతుందని భోగట్టా. చదవండి: నాగచైతన్య సాహసం.. ఆ పాత్రలో తొలిసారి తలైవా తయార్!.. ఫ్యాన్స్ ఖుషీ -
కొత్త సీన్లతో మళ్లీ అర్జున్ రెడ్డి!
అర్జున్ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలుగు సినిమా అది. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో విజయం కూడా సాధించింది. ప్రేమకథను ఇంత బోల్డుగా చూపించొచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇక అర్జున్ రెడ్డికి ఫిదా అయిన బాలీవుడ్.. సందీప్‌రెడ్డిని అక్కడికి తీసుకెళ్లింది. అక్కడ షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి కనక వర్షాన్ని కురిపించాడు. ఇక అర్జున్ రెడ్డి విడుదలై సరిగ్గా మూడేళ్లవుతుంది(ఆగస్ట్ 25 నాటికి). (చదవండి : ‘చిల్లింగ్ విత్ బాయ్స్’ అంటున్న విజయ్ దేవరకొండ) ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా 4.20 నిమిషాల నిడివితో ఉండేలా తెరకెక్కించామని, తప్పనిసరి పరిస్థితిల్లో కొన్ని కొన్ని సీన్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఫైనల్‌గా 3.45 నిమిషాల నిడివి గల సినిమాను రెడీ చేసుకున్నామని చెప్పారు. కానీ, కొన్ని కారణాల వల్ల చివరికి 3.06గంటల నిడివి ఉన్న సీనిమాను మాత్రమే విడుదల చేశామని చెప్పారు. 3.45గంటల నిడివితో విడుదల చేస్తే మరింత హిట్ సాధించేదని చెప్పుకొచ్చారు. కట్ చేసిన సీన్లతో మొత్తం 3.45 నిమిషాల నిడివి గల సినిమాను ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆగస్ట్ 25న విడుద చేయాలని ప్లాన్ చేసుకున్నామని సందీప్ రెడ్డి తెలిపారు. అందులో చాలా ఫన్నీ సీన్లు కూడా ఉన్నాయట. శివ, కమల్, విద్య, కీర్తి ఎలా క్లోజ్ అయ్యారు, అర్జున్ రెడ్డి స్కూల్ ప్రెండ్స్.. అతని బాల్యం, బుల్లెట్ బైక్ సంబంధించిన సీన్లు కొత్తగా విడుదల చేయబోయే సినిమాలో ఉంటాయట. అలాగే అర్జున్ రెడ్డి పెంచుకున్న కుక్కకు సంబంధించిన కామెడీ సీన్ కూడా ఉండబోతుదంట. మళ్లీ ఈ సినిమా ఏ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి మరి. -
రణ్వీర్ సింగ్‌కు జోడీగా ‘అర్జున్‌రెడ్డి’ భామ
ముంబై : తన తొలి సినిమా ‘అర్జున్‌రెడ్డి’తో బోల్‌్డ నటిగా పేరు తెచ్చుకున్న షాలినీ పాండే బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. వరుస హిట్లతో జోరుమీదున్న స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా నటించే అవకాశం ఆమెకు దక్కింది. రణ్వీర్ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ఫిల్మ్స్ షాలినీని కూడా హిందీ తెరకు పరిచయం చేయనుండటం విశేషం. ఈ విషయాన్ని యశ్‌రాజ్‌ఫిల్మ్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. దివ్యాంగ్ థక్కర్ దర్శకత్వంలో తాము నిర్మిస్తున్న జయేష్‌భాయ్ జోర్దార్ సినిమాలో షాలినీని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా విజయ్ దేవరకొండ- షాలినీ పాండే జంటగా తెరకెక్కిన అర్జున్‌రెడ్డి సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంచనాలతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమా హిందీలో కబీర్‌సింగ్‌గా రీమేక్ అయ్యింది. ఇక జయేష్ భాయ్ జోర్దార్ సినిమా విషయానికొస్తే.. మహిళలకు, పురుషులకు సమాన హక్కులు ఉండాలని భావించే ఓ మధ్యతరగతి వ్యక్తికి పితృస్వామ్య వ్యవస్థలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి రణ్వీర్ మాట్లాడుతూ... ‘ మనస్ఫూర్తిగా నవ్వాలంటే.. అందుకోసం ఒక్కోసారి నువ్వు చాలా నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ సినిమాలో జయేశ్ భాయ్ హీరోలా కనిపించడు. తనొక సాధారణ వ్యక్తి. సున్నిత మనస్కుడు. పితృస్వామ్య వ్యవస్థ సిద్ధాంతాలు, ఆచారాలకు వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులు ఉండాలని భావిస్తుంటాడు. నటుడిగా నాకు ఈ పాత్ర ఒక సవాల్’ అని చెప్పుకొచ్చాడు. #ShaliniPandey is @RanveerOfficial's heroine in YRF’s #JayeshbhaiJordaar! #ManeeshSharma |#DivyangThakkar | @JJ_TheFilm pic.twitter.com/9t3KHwVxnY — Yash Raj Films (@yrf) December 11, 2019 -
తగ్గని కబీర్ సింగ్ జోరు.. రికార్డు కలెక్షన్లు!
ముంబై: షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వీక్ డేస్‌లోనూ అద్భుతంగా వసూళ్లు రాబడుతూ.. సినీ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ఆరోరోజు బుధవారం రూ. 15.91 కోట్ల కలెక్షన్ రాబట్టింది. దీంతో ఆరో రోజుల్లో ఈ సినిమా మొత్తం కలెక్షన్లు రూ. 120.80 కోట్లకు చేరుకుంది. దేశమంతటా 3123 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం సింగిల్ స్క్రీన్లతోపాటు మల్టీప్లెక్స్‌ల్లోనూ దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్‌కు ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద క్రేజ్ తగ్గడంలేదు. కలెక్షన్ల జోరును చూస్తుంటే.. అలవోకగా ఈ సినిమా రెండువందల కోట్ల మార్క్‌ను దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది బడాబడా బాలీవుడ్ స్టార్ల సినిమాలు కూడా వీక్ డేస్‌లో పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. వందకోట్ల క్లబ్లో చేరడానికి బడా స్టార్లు కూడా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు తీసుకున్నారు. ఈ ఏడాది వచ్చిన సల్మాన్ భారత్ సినిమా నాలుగు రోజుల్లో వందకోట్ల క్లబ్లో చేరగా.. ఐదు రోజుల్లో ఈ మార్క్‌ను అందుకొని.. రెండో సినిమాగా కబీర్‌సింగ్ నిలిచింది. ఆ తర్వాత 7 రోజులకు అక్షయ్‌కుమార్ కేసరి, 8 రోజులకు రణ్‌బీర్ కపూర్ గల్లీబాయ్, 9 రోజులకు అజయ్ దేవ్గన్ టోటల్ ధమాల్ సినిమాలు వందకోట్ల క్లబ్బులో చేరాయి. -
దూకుడుగా కబీర్ సింగ్..5 రోజుల్లోనే 100 కోట్లు!
షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్‌తో తొలి వారాంతంలో రూ .70 కోట్ల కలెక్షన్ సాధించటమే కాకుండా తొలి ఐదు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించింది. కబీర్ సింగ్ సినిమా మొత్తం కలెక్షన్ మంగళవారం నాటికి 104.90 కోట్లకు చేరుకుంది. దేశమంతటా 3123 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్‌లలో సునామీలా దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్, ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నాల్గవ అతిపెద్ద హిందీ ఓపెనర్‌గా నిలిచింది. కబీర్ సింగ్ భారీ విజయం సాధించడంతో షాహిద్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కియారా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంటే ఇండియా టుడే సినీ విశ్లేషకురాలు అనన్య భట్టాచార్య మాత్రం ఈ చిత్రానికి 1.5స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ‘సినిమా నిడివి 154 నిమిషాలుండగా అందులో 120 నిమిషాలు కబీర్ తాగడం, కొకైన్ కొట్టడం, మార్ఫిన్ సూది వేసుకొవడం, ఇతరులను కొట్టడం, గర్ల్‌ఫ్రెండ్‌పై అరవడం మాత్రమే చేశాడు. మిగిలిన 34 నిమిషాలు అతనిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. చివరగా ఇది కేవలం సినిమా మాత్రమే, నిజ జీవితం కాదు’ అని సినిమా రివ్యూ ఇచ్చారు. -
‘రూటు మార్చిన అర్జున్ రెడ్డి పిల్ల’
చెన్నై : నటి శాలిని పాండే తన రూటు మార్చేసిందా? అవుననే బదులే కోలీవుడ్ నుంచి వస్తోంది. ఈ జైపూర్ బ్యూటీ నిజంగా లక్కీఅనే చెప్పాలి. థియేటర్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడి నట జీవితాన్ని అర్జున్‌రెడ్డి సినిమా ఒక్కసారిగా మార్చేసింది. ఆ చిత్రంతో వచ్చిన పాపులారిటీ కోలీవుడ్ ఎంట్రీకీ పనిచేసింది. ఇక్కడ 100% కాదల్ చిత్రంతో తమిళసినిమా పరిశ్రమకు పరిచయం అయినా.. ఆ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. అదే కాదు నడిగైయార్ తిలకం(మహానటి) చిత్రం మినహా ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కూడా కోలీవుడ్‌లో విడుదల కాలేదు. నడిగైయార్ తిలగం చిత్రంలో శాలినిపాండేది నిమిత్త మాత్రం పాత్రే. ప్రస్తుతం జీవాతో జత కట్టిన గొరిల్లా చిత్రంతో పాటు విజయ్‌ఆంటోనితో అగ్రిసిరగుగళ్, అనుష్కతో కలిసి సైలెన్స్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడు చిత్రాలే కోలీవుడ్‌లో నటిగా శాలినిపాండే స్థానాన్ని డిసైడ్ చేయాలి. వీటిలో జీవాతో రొమాన్స్ చేసిన గొరిల్లా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంపై శాలినిపాండే చాలా ఆశలు పెట్టుకుంది. ఇక ఆ చిత్రాలను నమ్ముకుంటూనే కొత్తగా అవకాశాల కోసం వేట మొదలెట్టిందని సమాచారం. ముఖ్యంగా ఈ అమ్మడు నటించింది తక్కువ చిత్రాలే అయినా హోమ్లీ ఇమేజ్ను సంపాదించుకుంది. ఇప్పుడు దాన్ని చెరిపేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టేసింది. అంతే కాదు వచ్చే ఏడాది కల్లా స్టార్ హీరోయిన్గా వెలిగిపోవాలని కలలు కంటోందట. ఆ కలలను సాకారం చేసుకోవడానికి గ్లామర్ ఒక్కటే మార్గం అని భావించిన శాలినిపాండే ఆ దిశగా అడుగులు మొదలెట్టేసింది. ఏకంగా ఈత దుస్తుల్లో ఫొటో షూట్ చేయించుకుంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెటిజన్ల విమర్శలతో పాటు పలువురి లైక్స్ పొందుతున్నాయి. అలా శాలినిపాండే వార్తల్లో నానుతోంది. రెండు హింది చిత్రాల్లోనూ నటిస్తున్న ఈ అమ్మడు అధిక దృష్టిని కోలీవుడ్‌పైనే సారిస్తోందట. ఎందుకంటే తెలుగులో ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుండడంతో తమిళ సినిమానే నమ్ముకుంటోందని టాక్. -
కబీర్ సింగ్ లీక్..
షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ మూవీ శుక్రవారం రిలీజైంది. రిలీజైన తొలిరోజే 20 కోట్లు సంపాదించి, షాహిద్ కపూర్ కెరీర్లోనే అతి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్ కపూర్ అద్భుతంగా నటించాడు. కానీ విడుదలయిన రెండో రోజే ఆన్లైన్లో లీకవడంతో ప్రోడ్యూసర్లు తలలు బాదుకుంటున్నారు. తమిళ్‌రాకర్స్ అనే వెబ్సైట్ ద్వారా ఈ మూవీ లీకైందని సమాచారం. కబీర్ సింగ్ తెలుగు హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ అన్ప విషయం తెలిసిందే. -
65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లు..
సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, అందుకు సంబంధించిన నామినేషన్ల కార్యక్రమం పూర్తి అయినట్లు సమాచారం. 65వ సౌత్ భారత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్లో జూన్16, 2018 జరగనుంది. వివిధ విభాగాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయినట్లు నిర్వాహకులు తెలిపారు. టాలీవుడ్‌కు సంబంధించిన నామినేషన్ల వివరాలు.. ఉత్తమ చిత్రం : అర్జున్ రెడ్డి, బాహుబలి 2, ఫిదా, గౌతమీపుత్ర శాతకర్ణి, ఘాజీ, శతమానం భవతి చిత్రాలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడు : చిరంజీవి - ఖైదీ నెంబర్ 150, జూనియర్ ఎన్టీఆర్ - జై లవకుశ, నందమూరి బాలకృష్ణ - గౌతమీపుత్ర శాతకర్ణి, ప్రభాస్ - బాహుబలి 2, వెంకటేష్ - గురు విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి లు ఉత్తమ నటుల క్యాటగిరీలో ఎంపికయ్యారు. ఉత్తమ నటి : అనుష్క - బాహుబలి2, నివేధా థామస్ - నిన్నుకొరి, రకుల్ ప్రీత్ సింగ్ - రారండోయ్ వేడుక చూద్దాం, రితికా సింగ్ - గురు, సాయి పల్లవి - ఫిదాలు ఉత్తమ నటి విభాగంలో ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడు క్రిష్ - గౌతమీపుత్ర శాతకర్ణి రాజమౌళి - బాహుబలి 2 సందీప్ వంగ - అర్జున్ రెడ్డి సంకల్ప్ రెడ్డి - ఘాజీ సతీష్ వేగేష్న - శతమానం భవతి శేఖర్ కమ్ముల - ఫిదా ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి - నిన్నుకోరి ప్రకాష్ రాజ్ - శతమానం భవతి రాణా - బాహుబలి2 ఎస్జే సూర్య - స్పైడర్ సత్యరాజ్ - బాహుబలి2 ఉత్తమ సహాయ నటి భూమిక - ఎంసీఏ కాథరీన్ థ్రెసా - నేనే రాజు నేనే మంత్రి జయసుధ - శతమానం భవతి రమ్యకృష్ణ - బాహుబలి 2 శరణ్య ప్రదీప్ - ఫిదా ఉత్తమ గీత రచయిత చైతన్య పింగాలి: ఊసుపోదు (ఫిదా) చంద్రబోస్ - నువ్వేలే నువ్వేలే (జయ జానకి నాయక) చంద్రబోస్ - రావణ (జై లవకుశ) ఎం ఎం కీరవాణి - దండాలయ్య (బాహుబలి2) రామజోగయ్య శాస్త్రి - శతమానం భవతి (శతమానం భవతి) శ్రేష్ఠ - మధురమే (అర్జున్ రెడ్డి) బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) అనురాగ్ కులకర్ణి - మెల్లగా తెల్లారిందోయ్ అర్మాన్ మాలిక్ - హలో హేమచంద్ర - ఊసుపోదు ఎల్వి రేవంత్ - తెలిసెనే నా నువ్వే సిద్ శ్రీరామ్ - అడిగా అడిగా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫీమేల్) గీతా మాధురి & మాన్షి - మహానుభావుడు మధుప్రియ - వచ్చిండే నేహా భాసిన్ - స్వింగ్ జరా సమీరా భరద్వాజ్ - మదురమే సోని, దీపు - హంసనావ -
‘అర్జున్ రెడ్డి సీక్వెల్ ఉంటుంది’
హైదరాబాద్ : బర్త్‌డే బాయ్ విజయ్ దేవరకొండ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మండే ఎండల్లో చల్లని ఐస్‌క్రీమ్స్ పంచేందుకు ట్రక్కులు ఏర్పాటు చేసి వినూత్నంగా తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా మారిన విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థతో ముచ్చటించారు. నాలుగేళ్ల క్రితం సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగానని.. అయితే ప్రస్తుతం తనకు ప్రత్యేకంగా ఆఫీసు, వ్యవహారాలు చూసుకునేందుకు టీమ్ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ తర్వాత ఇల్లు కొనుక్కున్నానని.. ఈ సినిమా తన కెరీర్లో అత్యంత ముఖ్యమైందని తెలిపారు. అర్జున్ రెడ్డి సీక్వెల్ గురించి ప్రస్తావించగా.. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సినిమాలో పెళ్లి చేసుకుని, ఆనందంగా ఉన్న 40 ఏళ్ల వ్యక్తిగా అర్జున్ రెడ్డిని చూపించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అర్జున్ రెడ్డికి ఓ కూతురు ఉండాలని, ఆమె ప్రేమలో పడితే అప్పుడు అతడి భావోద్వేగాలు ఏవిధంగా ఉంటాయో సీక్వెల్లో చూపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలన్నీ కార్యరూపం దాలిస్తే కచ్చితంగా అర్జున్ రెడ్డి సీక్వెల్ ఉంటుందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ అడగ్గానే.. మహానటిలో నటించడానికి ఒప్పుకున్నానని.. ఈ సినిమాలో తనది చిన్న పాత్రే అయినా తనకెంతో ప్రత్యేకమని విజయ్ తెలిపారు. ప్రస్తుతం విజయ్ చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. విజయ్ తాజా సినిమా ‘టాక్సీవాలా’ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అర్జున్ రెడ్డి’ గా షాహిద్ కపూర్
విజయ్ దేవరకొండను ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చిన సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ సినిమాగా తెరకెక్కి టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ రీమేక్‌లో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్జున్‌రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే హీరో పాత్ర కోసం పలువురు కథానాయకుల పేర్ల పరిశీలనలోకి తీసుకున్న సందీప్.. షాహిద్ కపూర్ మాత్రమే అర్జున్ రెడ్డి పాత్రకు న్యాయం చేయగలరని భావిస్తున్నారట. ఈ మేరకు షాహిద్ కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. జాతీయ వార్తా సంస్థ ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. అర్జున్‌రెడ్డి పాత్ర పోషించేందుకు షాహిద్ కపూర్ సుముఖంగా ఉన్నారట. హీరోయిన్, ఇతర పాత్రల ఎంపిక జరిగిన తర్వాత జులై నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. తన నటనతో అర్జున్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు పొందాడు విజయ్ దేవరకొండ. మరి ఈ పాత్రలో షాహిద్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
ఆ సినిమా క్రేజీ హీరోను చేసింది..
సాక్షి, చెన్నై: సినిమా పెద్ద మాయాబజార్. ఇది ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెడుతుందో ఊహించలేం. ఇక్కడ ప్రతిభ ముఖ్యమే అయినా, అదృష్టం చాలా చాలా ముఖ్యం. సినిమాలో సక్సెస్ కోసం కొందరు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. మరో కొందరు ఇట్టే అందలం ఎక్కేస్తారు. రెండవ కోవకు చెందిన హీరో విజయ్ దేవరకొండ. ఈ పేరును టాలీవుడ్లో ఈ మధ్య వింటున్నాం. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించినా, గత ఏడాది తెరపైకి వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ఈయనకు పెద్ద పేరు తెచ్చి పెట్టింది. ఇక ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’ సంచలన విజయం విజయ్ దేవరకొండను క్రేజీ హీరోను చేసేసింది. అంతే కాదు కోలీవుడ్‌ను ఆహ్వానించేలా చేసింది. విజయ్ ఇప్పుడు తమిళ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు అరివానంబి, ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు ఆనంద్ శంకర్ తాజాగా విజయ్ దేవరకొండను హీరోగా ఎంపిక చేసుకున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. ఈ చిత్రాన్ని సూర్య, కార్తీలతో పలు హిట్ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్ ఫిలింస్ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఆయన ఇటీవల ఒక ప్రకటనలో ఒకవైపు తాను, మరోవైపు దర్శకుడు ఆనంద్ శంకర్ ఫొటోలు ముద్రించి మధ్య ఒక షాడో ఉంచి అది ఎవరో గెస్ చేయగలరా? అని పాఠకుల మెదడుకి పని కల్పించి ఉత్సుకతను రేకెత్తించారు. ఈ చిత్ర కథ, కథనం సరికొత్తగా ఉంటుందని దర్శకుడు ఆనంద్ శంకర్ పేర్కొన్నారు. ఇక విజయ్ దేవరకొండ వస్తున్నా అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
అర్జున్ రెడ్డి చిత్రం దశ మార్చేసింది..!
ఒక సక్సెస్ హీరోయిన్ శాలిని పాండేను టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు పరిచయం చేసేసింది. అర్జున్‌రెడ్డి సినిమా ఆమె దశను మార్చేసింది. రంగస్థల నటి అయిన శాలిని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అక్కడ మహానటి సావిత్రి జీవిత్ర చరిత్రగా తెరకెక్కుతున్న మహానది చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాక తెలుగులో విజయాన్ని సాధించిన 100% లవ్ చిత్ర తమిళ రీమేక్‌లో తమన్నా పాత్రను చేసే లక్కీఛాన్స్‌ను కొట్టేసింది. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో స్థిరపడాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై శాలిని స్పందిస్తూ.. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటానని పేర్కొంది. తమిళంలో మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్న మాజ నిజమేనని ఆమె చెప్పింది. 100% కాదల్ చిత్రం పూర్తి అయిన తర్వాత జీవాతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందనే కోలీవుడ్ వర్గాల సమాచారం. -
తమిళ్ అర్జున్‌రెడ్డి విక్రమ్ వారసుడు
రెడీ... ‘అర్జున్‌రెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘చియాన్’ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ రెడీ. అది తమిళ ప్రేక్షకుల ముందుకు మాత్రమే! తెలుగులోకి ఎప్పుడు తీసుకొస్తారో మరి? విజయ్‌సాయి దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌తో ధృవ్ హీరోగా పరిచయం కానున్నట్టు స్వయంగా విక్రమ్ వెల్లడించారు. ‘రెడీ టు మేక్ ద లీప్. ధృవ్ టు బి అర్జున్‌రెడ్డి’ అని తనయుడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమ్ పోస్ట్ చేశారు. తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకూ విక్రమ్ సుపరిచితుడే. ఎప్పట్నుంచో ధృవ్ విక్రమ్ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నాయి. డిఫరెంట్ ఫిల్మ్స్‌లో నటించే విక్రమ్... తనయుడి ఎంట్రీకీ డిఫరెంట్ కథనే ఎంచుకోవడం విశేషం!! -
'అర్జున్ రెడ్డి'పై నిషేధం విధించండి
విజయవాడ పోలీసు సంయుక్త కమిషనర్‌కు వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు సాక్షి, విజయవాడ: 'అర్జున్ రెడ్డి' సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ: సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా వున్న అర్జున్ రెడ్డి సినిమాను తక్షణం నిషేదించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రమణకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా కారణంగా యువత పెడదోవ పట్టే ప్రమాదం వుందని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సినిమాల కారణంగా సామాజిక విలువలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'అర్జున్ రెడ్డి' సినిమాపై ఇప్పటికే పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ సినిమా ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించేదిగా ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్వయంగా సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ చిత్రం చాలా బాగుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడాన్ని ఆయన విమర్శించారు. -
హీరోహీరోయిన్ల ముద్దు వీడియో హల్చల్
హైదరాబాద్: పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యాలంటే కొందరు నటీనటులకు ప్రాక్టీస్ తప్పనిసరి. 'బాహుబలి'కి సంబంధించి అలాంటి కత్తులు తిప్పే, కండలు కరిగించే వీడియోలు చాలా చూశాం. ప్రభాస్, రాణాలు ఫైట్లు ప్రాక్టీస్ చేస్తే.. ఇప్పుడీ కుర్ర హీరో హీరోయిన్లు ముద్దును ప్రాక్టీస్ చేశారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే ఆ ముద్దు వీడియోను లక్షల మంది చూశారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విలక్షణ పాత్ర పోశించిన విజయ్ దేవరకొండ తాజాగా హీరోయిన్ షాలినితో కలిసి నటిస్తోన్న సినిమా 'అర్జున్ రెడ్డి'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోన్న అర్జున్ రెడ్డిలో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. సీన్ బాగా పండటం కోసం ముద్దు మరింత గాఢంగా, అందంగా ఎలా పెట్టుకోవాలో దర్శకుడు సందీప్ సూచనలు ఇస్తుండగా.. హీరోహీరోయిన్లు విజయ్, శాలినిలు తమ పెదవులకు పనిచెప్పారు. కాగా, 'సినిమా ప్రమోషన్ కోసం ఇదో పబ్లిసిటీ స్టంట్' అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.