హీరోహీరోయిన్ల ముద్దు వీడియో హల్చల్ | Actors of 'Arjun reddy' kissing practice video goes viral | Sakshi
Sakshi News home page

హీరోహీరోయిన్ల ముద్దు వీడియో హల్చల్

Published Wed, Jun 8 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

హీరోహీరోయిన్ల ముద్దు వీడియో హల్చల్

హీరోహీరోయిన్ల ముద్దు వీడియో హల్చల్

హైదరాబాద్: పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యాలంటే కొందరు నటీనటులకు ప్రాక్టీస్ తప్పనిసరి. 'బాహుబలి'కి సంబంధించి అలాంటి కత్తులు తిప్పే, కండలు కరిగించే వీడియోలు చాలా చూశాం. ప్రభాస్, రాణాలు ఫైట్లు ప్రాక్టీస్ చేస్తే.. ఇప్పుడీ కుర్ర హీరో హీరోయిన్లు ముద్దును ప్రాక్టీస్ చేశారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే ఆ ముద్దు వీడియోను లక్షల మంది చూశారు.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విలక్షణ పాత్ర పోశించిన విజయ్ దేవరకొండ తాజాగా హీరోయిన్ షాలినితో కలిసి నటిస్తోన్న సినిమా 'అర్జున్ రెడ్డి'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోన్న అర్జున్ రెడ్డిలో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. సీన్ బాగా పండటం కోసం ముద్దు మరింత గాఢంగా, అందంగా ఎలా పెట్టుకోవాలో దర్శకుడు సందీప్ సూచనలు ఇస్తుండగా.. హీరోహీరోయిన్లు విజయ్, శాలినిలు తమ పెదవులకు పనిచెప్పారు. కాగా, 'సినిమా ప్రమోషన్ కోసం ఇదో పబ్లిసిటీ స్టంట్' అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement