‘అర్జున్‌ రెడ్డి సీ​క్వెల్‌ ఉంటుంది’ | Vijay Deverakonda Buys House After Arjun Reddy Success | Sakshi
Sakshi News home page

‘అర్జున్‌ రెడ్డి సీ​క్వెల్‌ ఉంటుంది’

Published Wed, May 9 2018 5:34 PM | Last Updated on Wed, May 9 2018 7:39 PM

Vijay Deverakonda Buys House After Arjun Reddy Success - Sakshi

అర్జున్‌రెడ్డి చిత్రంలో విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌ : బర్త్‌డే బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. మండే ఎండల్లో చల్లని ఐస్‌క్రీమ్స్‌ పంచేందుకు ట్రక్కులు ఏర్పాటు చేసి వినూత్నంగా తన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అర్జున్‌ రెడ్డి సినిమాతో స్టార్‌గా మారిన విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థతో ముచ్చటించారు. నాలుగేళ్ల క్రితం సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగానని.. అయితే ప్రస్తుతం తనకు ప్రత్యేకంగా ఆఫీసు, వ్యవహారాలు చూసుకునేందుకు టీమ్‌ ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

అర్జున్‌ రెడ్డి సినిమా సక్సెస్‌ తర్వాత ఇల్లు కొనుక్కున్నానని.. ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైందని తెలిపారు. అర్జున్‌ రెడ్డి సీక్వెల్‌ గురించి ప్రస్తావించగా.. ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సినిమాలో పెళ్లి చేసుకుని, ఆనందంగా ఉన్న 40 ఏళ్ల వ్యక్తిగా అర్జున్‌ రెడ్డిని చూపించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అర్జున్‌ రెడ్డికి ఓ కూతురు ఉండాలని, ఆమె ప్రేమలో పడితే అప్పుడు అతడి భావోద్వేగాలు ఏవిధంగా ఉంటాయో సీక్వెల్‌లో చూపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఈ ఆలోచనలన్నీ కార్యరూపం దాలిస్తే కచ్చితంగా అర్జున్‌ రెడ్డి సీక్వెల్‌ ఉంటుందని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. నాగ్‌ అశ్విన్‌ అడగ్గానే.. మహానటిలో నటించడానికి ఒప్పుకున్నానని..  ఈ సినిమాలో తనది చిన్న పాత్రే అయినా తనకెంతో ప్రత్యేకమని విజయ్‌ తెలిపారు. ప్రస్తుతం విజయ్‌ చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. విజయ్‌ తాజా సినిమా ‘టా​క్సీవాలా’ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement