Mahanati
-
HBD ‘మహానటి’ : చీరకే వన్నె తెచ్చే దసరా బ్యూటీ (ఫోటోలు)
-
హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది కీర్తి సురేష్ (ఫోటోలు)
-
స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!
ప్రతి మనిషికి జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఇక్కడ ఏదీ నిరంతరం కాదు జయాపజయాలు అంతే. అదేవిధంగా విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం సహజమే. ఇక నటి కీర్తిసురేష్ విషయానికొస్తే చాలా తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకున్నారు. అదేసమయంలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సీనియర్ నటి మేనక నిర్మాత సురేష్ వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన కీర్తిసురేష్ తమిళంలో ఇదు ఎన్న మాయం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. (ఇది చదవండి: చిట్టి ఓటీటీ ఎంట్రీ.. అలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో) ఆ తర్వాత ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిరాశపరిచినా నటిగా కీర్తిసురేష్ మాత్రం మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఆ తర్వాత రజిని మురుగన్ చిత్రాలతో విజయాలను అందుకున్న ఈమె తెలుగులో మహానటి చిత్రంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అదేవిధంగా ఆరంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి పీక్ సమయంలో మరింత స్లిమ్‌గా తయారవడానికి కసరత్తులు చేశారు. ఫలితంగా చాలా దారుణమైన విమర్శలకు గురయ్యారు. కీర్తిసురేష్ ముఖంలో గతంలో ఉన్న గ్లామర్ పోయిందని, ఇక ఈమె చాప్టర్ క్లోజ్ అని దారుణమైన కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు. అయితే అలాంటి సమయంలోనూ అదేముఖంతో తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తెలుగులో ఆ సమయంలో ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో ఆడలేదన్నది వాస్తవం. ఆ తర్వాత మళ్లీ సరికొత్త అందాలను సంతరించుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు వరుసగా సక్సెస్‌లను అందుకుంటున్నారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన నటించిన దసరా మంచి విజయాన్ని సాధించగా, తాజాగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన మామన్నన్ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక త్వరలో తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా నటించిన బోళాశంకర్ ఆగస్టు 11వ తేదీ రావడానికి ముస్తాబవుతోంది. తమిళంలో జయంరవితో సైరన్, హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం రఘుతాత చిత్రాలు చేతిలో ఉన్నాయి. (ఇది చదవండి: నటికి ఘోర అవమానం.. ఏకంగా ఆ బాడీ పార్ట్స్‌పైనే కామెంట్స్!) -
కీర్తిసురేష్ పెళ్లి చేసుకునేది ఇతడినేనా? ట్వీట్‌తో క్లారిటీ వచ్చేసింది
హీరో,హీరోయిన్ల సినిమా సంగతులతో పాటు వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే కుతూహాలం ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా హీరోయిన్ కీర్తిసురేష్ పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ బిజినెస్ మ్యాన్‌తో కీర్తిసురేష్ లవ్‌లో ఉందని, త్వరలోనే వీరి వివాహం జరగనుందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. రీసెంట్గా కీర్తి ఓ అబ్బాయి ఫోటో షేర్ చేయడంతో ఇతడే మహానటికి కాబోయే వరుడు అంటూ ఒక్కసారిగా కథనాలు వెలువడ్డాయి. దీనికి తోడు కీర్తి షేర్ చేసిన ఫోటోల్లో ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ దుస్తులు వేసుకోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. దీంతో కీర్తిసురేష్ పెళ్లిపై ఫిల్మీదునియాలో రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై కీర్తి స్వయంగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి తీసుకొచ్చారా?నా జీవితంలోని నిజమైన మిస్టరీ మ్యాన్‌ను తప్పకుండా సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. అప్పటిదాకా చిల్‌గా ఉండండి' అంటూ పేర్కొంది. దీంతో రీసెంట్గా కీర్తి షేర్ చేసిన ఆ అబ్బాయి బాయ్‌ఫ్రెండ్ కాదని తేలిపోయింది. అయితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అనడంతో కీర్తి లైఫ్‌లో మిస్టరీ మ్యాన్ ఉన్నడన్నది మాత్రం స్పష్టమైంది. ఆయన ఎవరన్నది త్వరలోనే తెలియనుంది. Hahaha!! Didn’t have to pull my dear friend, this time! I will reveal the actual mystery man whenever I have to 😉 Take a chill pill until then! PS : Not once got it right 😄 https://t.co/wimFf7hrtU — Keerthy Suresh (@KeerthyOfficial) May 22, 2023 -
అసలు కీర్తీ సురేశ్‌కు ఏమైంది.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
మహానటి కీర్తి సురేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సావిత్రి బయోపిక్ మహానటి మూవీతో ఆ పేరే బ్రాండ్‌గా మారిపోయింది. ఇటీవల నేచురల్ స్టార్ నానితో జంటగా నటించిన దసరా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ మూవీ భోళాశంకర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ఆయన టైం వేస్ట్ చేశారు.. డైరెక్టర్‌పై నాగచైతన్య కామెంట్స్ వైరల్) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న కీర్తి తాజాగా చేసిన పోస్ట్ వైరలవుతోంది. మొహామంతా గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇంతకీ కీర్తీ సురేశ్‌కు ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం. అయితే గతేడాది కీర్తీ సురేశ్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'సాని కాయిదం'. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6, 2022న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా కీర్తి సురేశ్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. షూటింగ్లో పడిన కష్టాలను వివరిస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. అయితే కీర్తి సురేశ్ డేడికేషన్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం మహానటికే ఇలా చేయడం సాధ్యమవుతుందంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్.. అయినా ఒక్క సినిమా సక్సెస్ కాలేదు.. మళ్లీ అదే కథ!) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
బ్రేకప్ చేదుగా ఉంటుంది.. కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్స్
మహానటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తాజాగా దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నానికి జోడీగా నటించింది. ఈనెల 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీబిజీగా పాల్గొంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ప్రేమ, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. బ్రేకప్ చేదుగా ఉంటుందా? మందు చేదుగా ఉంటుందా అని కీర్తిని ప్రశ్నించగా.. ఏమాత్రం ఆలోచించకుండా బ్రేకప్ చేదుగా ఉంటుందని తెలిపింది. అయితే అలాంటి బ్రేకప్ మీ లైఫ్‌లో జరిగిందా అని అడిగితే మాత్రం నవ్వుతూ లేదని చెప్పి తప్పించుకుంది. ఇది విని పక్కనే ఉన్న నాని మహానటి అంటూ కీర్తిని ఆటపట్టించాడు. ప్రస్తుతం కీర్తి చేసిన ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఆ టైంలో నాపై ట్రోల్స్ చేశారు.. అయినా గర్వంగా ఉంది: కీర్తి సురేశ్
సినీ అభిమానుల గుండెల్లో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేశ్. ప్రస్తుతం నానితో కలిసి దసరా సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. అలాగే మూవీ ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీ అయిపోయారు కీర్తి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహానటి చిత్రాన్ని అంగీకరించినందుకు తనపై చాలా ట్రోల్స్ వచ్చాయని గుర్తు చేశారు. అయితే ఆ సినిమా పూర్తయ్యాకే ఈ విషయం తనకు తెలిసిందన్నారు. తనపై వచ్చిన విమర్శలను పక్కన పెడితే సావిత్రమ్మ పాత్రలో నటించినందుకు చాలా గర్వంగా ఉందన్నారామె. కీర్తి సురేశ్ మాట్లాడుతూ..' మహానటిలో నటించేందుకు మొదట విముఖత వ్యక్తం చేశా.సావిత్రమ్మ పాత్రలో నటించేందుకు చాలా భయమేసింది. కానీ.. దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను ప్రోత్సహించారు. నువ్వు చేయగలవు అనే ధైర్యనిచ్చారాయన. ఆయనకే అంత నమ్మకం ఉంటే.. నేను ఎందుకు భయపడాలి అనుకున్నా. అలానే మహానటి ప్రాజెక్ట్ పూర్తి చేశా. ఆ పాత్రలో నటిస్తున్నందుకు కొంతమంది నన్ను ట్రోల్ చేశారు. ఆ విషయం నాకు తెలియదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు దీనిపై ప్రశ్న ఎదురైంది. అప్పుడు తెలిసింది నాపై ట్రోల్స్ వచ్చాయని. సోషల్‌మీడియాలో నెగెటివిటీపై పెద్దగా ఆసక్తి చూపను. అందుకే నాపై ట్రోల్స్, విమర్శలు రావు. సావిత్రమ్మకు బయోపిక్‌లో నటించడం భయంగా అనిపించింది. ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా ఆ పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. నాని, కీర్తి సురేశ్ జంటగా దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి వెన్నెల అనే గ్రామీణ యువతి పాత్రలో నటించారు. ఈ మువీ మార్చి 30న ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు
మహానటి సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నటనకే నటనను నేర్పిన సహజ నటి. పాత్రలకే ప్రాణం పోసిన మహానటి ఆమె. అందుకే తరాలు మారినా ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. చలన చిత్ర రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్గా కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూశారు. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? తన జీవితం ఎందుకు అలా అయ్యిందనేది ఇప్పటికీ ఆశ్యర్యంగానే ఉంటుంది. ఇక మహానటి సినిమా తర్వాత సావిత్రి గురించిన పలు ఆసక్తికర విషయాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరీ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహానటి మూవీ తర్వాత ఇంట్లో చాలా గొడవలు అయ్యాయంటూ షాకింగ్ విషయం చెప్పారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ.. మహానటి చిత్రం తర్వాత నాన్నపై చాలా విమర్శలు వచ్చాయి. నాన్న వల్లే అమ్మ జీవితం ఇలా అయ్యిందని అందరు తిడుతూ కామెంట్స్ చేశారు. అవి చూసి అక్కవాళ్లు(జెమిని గణేషన్ మొదటి భార్య పిల్లలు) ‘నీ వల్లే నాన్న పేరు చెడింది’ అని నన్ను తిట్టారు. నాతో మాట్లాడటం కూడా మానేశారు’ అని చెప్పారు. అయితే ఇప్పుడు అంతా సర్దుకుందని, మూడేళ్ల తర్వాత కలిశామని ఆమె పేర్కొన్నారు. రీసెంట్గా ఓ ఫంక్షన్లో అందరం కలిశామని, అప్పుడు నన్ను హగ్ చేసుకుని ‘ఎలా ఉన్నావు’ అని అక్కవాళ్లు పలకరించారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ గొడవలపై బాలీవుడ్ నటి, జెమిని గణేషన్ మూడో భార్య కూతురు రేఖ సైతం ఫోన్ చేశారట . చదవండి: మహేశ్ సినిమాకు హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నా: రాజమౌళి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయోపిక్‌లో ఉన్నది ఉన్నట్లు చూపించడం సాధ్యం కాదని, ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు కొంచెం మాసాల యాడ్ చేస్తారని రేఖ అక్క అన్నారని చెప్పారు. ఇవేవి పట్టించుకోవద్దని, కొద్ది రోజులకు వాళ్లకే అర్థం అవుతుందిలే అని రేఖ అక్క ఫోన్లో ఓదార్చారని విజయ చాముండిశ్వరి చెప్పుకొచ్చారు. కాగా సావిత్రి, జెమిని గణేషన్‌కు రెండో భార్య అనే విషయం తెలిసిందే. సావిత్రిని పెళ్లి చేసుకునే సమయానికి అప్పటికే జెమిని గణేషన్‌కు పెళ్లయి, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆయన మొదటి భార్య, పిల్లలతో సావిత్రికి సత్సంబంధాలు ఉండేవి. అందరు ఒక్క కుటుంబంలా ఉండేవారని మహానటిలో చూపించిన సంగతి తెలిసిందే. -
నెక్ట్స్ మహానటి ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో 5 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ జరిగిన ఈ టాక్ షోకు లేటెస్ట్ ఎపిసోడ్‌కు ఇద్దరు అగ్ర నిర్మాతలు అతిథులు వచ్చి సందడి చేశారు. దివంగత నటులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు(సీనియర్ ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా అన్‌స్టాబుల్ స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ షో స్పెషల్ గెస్ట్లుగా టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు.. దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత జనరేషన్లో హీరోయిన్లలో మహానటి ఎవరంటూ బాలయ్య.. అల్లు అరవింద్, సురేశ్ బాబులను ప్రశ్నించాడు. దీనికి వీరద్దరు ఇచ్చిన సమాధానం ఆసక్తిని సంతరించుకుంది. అనుకొకుండానే ఇద్దరు నిర్మాతల ఒకే హీరోయిన్ పేరు చెప్పడం విశేషం. నెక్ట్స్ మహానటి ఎవరని అడగ్గానే వీరిద్దరు పలకపై సమంత పేరు రాశారు. సురేశ్ బాబు సమంత అనే సమాధానం చెప్పగానే అల్లు అరవింద్ కూడా తాను అదే పేరు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో మహానటి అవగలిగితే సమంత అనే సురేశ్ బాబు తన అభిప్రాయం చెప్పారు. దీంతో ఈ వీడియోను సమంత ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వైరల్ చేస్తున్నారు. సమంత ఫ్యాన్‌క్లబ్ ట్విటర్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి చెరగని ముద్ర వేసుకున్నారు. తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం ఓ చరిత్రగా నిలిచింది. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేశారు ఆమె. ఆమె తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటన పరంగా, వ్యక్తిత్వం పరంగా సౌందర్య ఇండస్ట్రీలో, అభిమానుల్లో మంచి ఆదరణ పొందారు. సావిత్రి తర్వాత సావిత్రి అనేలా సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో సమంతను మహానటిగా ఇద్దరు అగ్ర నిర్మాతలు పేర్కొనడంతో ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Coming from both legendary producers of the industry at the same time ❤️ #Mahanati #Samantha 😍🤩 its all your dedication and hardwork angel 🙇 @Samanthaprabhu2 You earned it 💪 and you deserve it 🫶 #SamanthaRuthPrabhu pic.twitter.com/J6otq5o9pf — Samantha Fans (@SamanthaPrabuFC) December 3, 2022 -
పెళ్ళికి సిద్ధమైన కీర్తి సురేష్..!
-
సీనియర్ ఎన్టీఆర్‌గా తారక్‌ను అందుకే తీసుకోలేదు: అశ్వినీదత్
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. అంతేకాకుండా జాతీయ అవార్డును సైతం అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించగా, అక్కినేని నాగేశ్వర రావు పాత్రను ఆయన మనవడు, యంగ్ హీరో నాగ చైతన్య పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. కానీ నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను మాత్రం ఎవరూ చేయలేదు. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ రోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సింది. పలు కారణాల వల్ల అలా కుదరలేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తాజాగా తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మహానటి చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను తారక్‌తో చేయిద్దామని అనుకున్నాం. కానీ ఈలోగా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించారు. దీంతో మా సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమో అని అనిపించింది. ఒకవేళ తారక్ చేసినా బాగుండదేమో అని కూడా అనిపించింది. నాగ్ అశ్విన్‌తో చెబితే అసలు ఆయన పాత్ర లేకుండానే తీస్తా అని చెప్పి తెరకెక్కించాడు. ఆయన పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చేప్పారు. మిగతా అంతా మేనేజ్ చేశాం'' అని వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! -
అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కింది. అయితే ఈ ప్రాజెక్ట్ కీర్తి సురేష్‌కి ముందు వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న ఆయన మహానటి ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాకు కీర్తికి ముందు ఓ మలయాళ నటిని అనుకున్నాం. కానీ కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉంటే నేను చేయను అంటూ కండిషన్స్ పెట్టింది. దీంతో ఆమెను తీసుకోవడానికి వీల్లేదు అని నేనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు చెప్పాను. కట్ చేస్తే కీర్తి సురేష్ చేతుల్లోకి ఈ సినిమా వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ పేరు చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.అయితే మహానటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మలయాళ హీరోయిన్ నిత్యామీనన్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సావిత్రి పాత్రలో ఆమె ఫోటోలు కూడా కొన్ని బయటికొచ్చాయి. ఏది ఏమైనా నిత్యామీనన్ ఓ మంచి సినిమాను దూరం చేసుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి
తన అందం, అభినయంతో హీరోయిన్ కీర్తి సూరేశ్ ఎంతో ప్రేక్షకాదరణను పొందింది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఇందులో కీర్తి తన నటనతో సావిత్రని మైమరపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించడం విశేషం. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనేక వివాదాల మధ్య విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లో ఎంతవరకు చేరుతుందో లేదో తెలియని ఎన్నో సందేహాల మధ్య థియేటర్లోకి వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది. అయితే దర్శకుడు నాగ్ ఆశ్విన్ 2016 నుంచి ఈ సినిమాను తీయాలని ప్లాన్ చేశాడట. సావిత్రకి పాత్ర సరిపోయే నటి కోసం వేతుకుతుండగా.. నేను లోకల్ సినిమా చేస్తున్న సమయంలో కీర్తి సురేష్‌ని మేకర్స్ సంప్రదించారట. అయితే ఈ మూవీకి ఒకే చెప్పిన కీర్తి.. ఆ తర్వాత సావిత్రి పాత్రకు న్యాయం చేయగలుతుందో లేనని చాలా భయపడినట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహానటి మూవీ కోసం తనకు లుక్ టెస్ట్ చేయగా అచ్చం సావిత్రిని తలపించిందంటు ప్రశంసలు రావడంతో కీర్తి ఊపిరి పీల్చుకుందట. నాడు లంగా ఓణీలో ఉన్న తన ఫస్ట్ లుక్ టెస్ట్ ఫొటోను తాజాగా కీర్తి షేర్ చేస్తూ మురిసిపోయింది. దీనికి ‘హహ.. లుక్ టెస్ట్ చేసిన మొదటి రోజు.. ఈ ఫోటో వెనకాల ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటు తన ఇన్‌స్టా స్టోరిలో అభిమానులతో పంచుకుంది. -
మే9 : తెలుగు ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్..ఎందుకంటే..
మే9..టాలీవుడ్లో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన రోజు ఇది. హీరో, హీరోయిన్లకు స్టార్ స్టేటస్‌తో పాటు దర్శక, నిర్మాతలక కాసుల వర్షం కురిపించిన రోజు. అందుకే క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం ఎప్పటికీ లక్కీ డేనే. ఎందుకంటే మే9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈరోఉ (మే9)న విడుదలయినవే. మరి ఆ హిట్ చిత్రాలేంటో చూసేద్దామా? జగదేకవీరుడు అతిలోకసుందరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1990 మే9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, శ్రేదేవిలకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ రిలీజ్‌కు కొన్ని వారాల ముందే రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేశాయట. అయినా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా సంగీతం సంగీత ప్రియులను ఆకర్షించి సినిమా విజయంలో భాగమైంది. గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. 1991లో విడుదలైన ఈ చిత్రం ముప్పైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. ఈ చిత్రంలోని మెగాస్టార్ నటన, స్టైల్, డ్యాన్స్ యూత్‌ను కట్టిపడేశాయి. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లవుతుంది. అయిన ఇందులో చేయి చూడు ఎంత రఫ్ ఉందో.. రఫాడిస్తా అనే పవర్ ఫల్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ప్రేమించుకుందాం రా వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడంతో సెంటిమెంట్‌గా ఆమెను వద్దనుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ అయిన సంగతి తెలిసిందే లవ్ స్టోరీస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. సంతోషం నాగార్జున, శ్రియ, గ్రేసీసింగ్, ప్రభుదేవా నటించిన ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాయగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. నాగార్జున కెరియర్లోనే బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిందీ ఈ చిత్రం. మహానటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు గాను నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినీ పాండేలు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియా దత్, స్వప్న దత్‌లు ఈ మూవీని నిర్మించారు. మహర్షి మహేష్‌బాబు హీరోగా మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. -
మహానటి ఫేమ్ కీర్తీ సురేష్ లేటెస్ట్ పిక్స్..
-
సవాల్‌కి రెడీ
సరికొత్త సవాళ్లను స్వీకరిస్తేనే మనలోని ప్రతిభ బయటపడుతుంది అంటున్నారు సమంత. ఇటీవల ఓ సందర్భంలో ‘‘నటిగా నాకు ఎలాంటి భయాలు లేవు.. ఎంతటి క్లిష్టమైన పాత్ర అయినా సరే చేయాలనుకుంటాను’’ అన్నారామె. ‘మహానటి, రంగస్థలం, ఓ బేబీ’ తదితర చిత్రాల్లో చాలెంజింగ్ రోల్స్ చేశారు సమంత. తాజాగా మరో చాలెంజింగ్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘మయూరి, గేమ్ ఓవర్’ చిత్రాలను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంలో బధిర యువతిగా నటించనున్నారట సమంత. సైకలాజికల్, హారర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ‘మహానటి’లో నత్తి ఉన్న అమ్మాయిగా నటించారు సమంత. ఆ పాత్రను అద్భుతంగా చేశారు. ఇప్పుడు మూగ, చెవిటి అమ్మాయిగా నటించడానికి తగిన కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
మే 9 వెరీ స్పెషల్ డే ఎందుకంటే?
ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన తేదీలు జనాల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతాయి. అలా సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని తేదీ మే9. ఈ తేదీకి ఘనమైన సినీ చరిత్రే ఉంది. ఈ తేదీ కోసం అభిమానులే కాదు దర్శకనిర్మాతలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. అసలు ఎందుకు మే 9 వెరీ స్పెషల్? అనేది చూద్దాం. సినీ పంచాంగం ప్రకారం ఈ తేదీన విడుదలైన దాదాపు అన్ని సినిమాలు సూపర్‌డూపర్ హిట్ అవుతాయి. అయ్యాయి కూడా. అవేంటో ఓ లుక్కేద్దాం.. జగదేకవీరుడు అతిలోకసుందరి, మరో చరిత్ర, భారతీయుడు, ప్రేమించుకుందాం రా, మహానటి, మహర్షి వంటి చిత్రాలు మే9న విడుదలయ్యాయి. ఈ చిత్రాలు ఏ రేంజ్లో విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి టాలీవుడ్ చరిత్రలోనే ఓ అద్భుతం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వచ్చి నేటికి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే చూడకుండా ఎవరూ ఉండలేరు. ‘ప్రేమించుకుందాం రా’తో వెంకటేష్ తన నటనతో ప్రతీ ఒక్క ప్రేమికుడి మనసు గెలుచుకున్నాడు. విజయం అందుకున్నాడు. మహానటి సావిత్రి జీవితమే ఓ చరిత్ర. అలాంటి ఆమె జీవితకథను బయోపిక్‌గా రూపొందించి ‘మహానటి’గా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో పరకాయప్రవేశం చేశారు. క్లాసిక్ వండర్‌గా వచ్చిన ఈ చిత్రం ఎన్నో సెన్సేషన్ రికార్డులను నమోదు చేసింది. ఈ తరం సినీ అభిమానులకు సావిత్రి గురించి తెలిపిన మహా చిత్రం ‘మహానటి’. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, వంశీపైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన కమర్షియల్ చిత్రం ‘మహర్షి’. పాటలు ఓ వండర్‌ను క్రియేట్ చేస్తే.. సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. మహేశ్ కెరీర్లో మర్చిపోలేని మైలురాయిగా ‘మహర్షి’ నిలిచింది. ఈ చిత్రాలన్నీ మే 9న విడుదల కావడం విశేషం. ఇక ప్రేమించుకుందాం రా మినహా మిగతా మూడు చిత్రాలు వైజయంతీ మూవీస్ పతాకంపైనే విడుదల కావడం మరో విశేషం. అంతేకాకుండా ఈ రోజు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, హీరో రానా తమ్ముడు అభిరామ్లది ఈరోజు బర్త్‌డే. దీంతో వారి అభిమానులు, సహచర నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో బర్త్‌డే శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ తేదీన మరిన్ని చిత్రాలు, విశేషాలు వచ్చి చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: 104 డిగ్రీల జ్వరంతో ధినక్ తా ధినక్ రో... ‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్?
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే వరుడిని చూసినట్లు భోగట్టా. ఒక ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడిని కీర్తి సురేష్ పెళ్లాడబోతుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో వీరి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రముఖ పాత్రికేయుడు, నటుడు ఫూల్‌వాన్ రంగనాథన్ ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇంతకీ కీర్తిని పెళ్లాడబోయే ఆ వ్యాపారవేత్త ఎవరు? వివాహం ఎప్పుడు ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కీర్తి సురేష్ కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. మరోవైపు తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు కుకునూర్ నగేశ్ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్డ్రాఫ్ సినిమాలో ప్రస్తుతం కీర్తి సురేశ్ నటిస్తున్నారు. 'గుడ్ లక్ సఖి' అనే పేరును వస్తున్న ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్ పాత్రలో కనిపించనున్నారు. -
ఇదంతా చూసి ఆమె ఆశీర్వదిస్తారు: కీర్తి సురేశ్
ఇది తన కల కాదు. లక్ష్య సాధనకు మార్గం అంటోంది నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ చాలా తక్కువ వ్యవధిలోనే నటిగా అతి తక్కువ సమయంలోనే చాలా సాధించేసిందని చెప్పవచ్చు. కారణం తను నటించిన మహానటి చిత్రమే. ఈ చిత్రంలో కీర్తీసురేశ్ మహానటి సావిత్రి పాత్రలో నటించిందనడం కంటే జీవించిందని చెప్పడం కరెక్ట్. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరనే చెప్పాలి. అయినా అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా తనలోని నటనకు సాన పెట్టి సావిత్రి పాత్రకు కీర్తీసురేశ్ జీవం పోసింది. ఫలితం అభినందనల పరంపరతోపాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు కీర్తీసురేశ్ ముంగిట వాలింది. ఇటీవలే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా జాతీయ ఉత్తమ నటి అవార్డును స్వీకరించిన కీర్తీసురేశ్ ఆ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందులో పేర్కొంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ ఆనందానుదభూతి వ్యక్తం చేయలేనిది.అయినా ప్రయత్నిస్తాను. ఈ అవార్డు నా కల కాదు లక్ష్య సాధనకు పయనం. నా ఈ పయనంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.ఈ అవార్డును నన్ను ఈ స్థాయికి చేరేలా తయారు పరిచిన నా తల్లికి సమర్పిస్తున్నాను. అదే విధంగా మహానటి చిత్రంలో నటించడానికి ప్రోద్బలం ఇచ్చిన అంకుల్ గోవింద్‌కు, అంతకంటే ఆ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన చిత్రానికి మెదడు లాంటి దర్శకుడు నాగ్‌అశ్విన్‌కు ధన్యవాదాలు. మహానటి చిత్రానికి సమస్తం ఆయనే. అదే విధంగా ఇందంతా చూస్తున్న మహానటి సావిత్రి నన్ను ఆశీర్వదిస్తారు అని కీర్తీసురేశ్ పేర్కొంది. కాగా తాజాగా ఈ చిన్నది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే మరో లక్కీచాన్స్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఆయన శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో నటి కుష్భూ, మీనాలతో పాటు కీర్తీసురేశ్ కూడా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లిన నటి కీర్తీసురేశ్‌కు అందమైన స్వాగతం లభించింది. చిత్ర యూనిట్ జాతీయ అవార్డును అందుకున్న కీర్తీసురేశ్ కోసం పండగ వాతావరణంలో కేక్ కట్ చేసి అభినంధించారు. నటుడు రజనీకాంత్, దర్శకుడు శివ చిత్ర యూనిట్ కీర్తీసురేశ్‌కు కేక్ తినిపించి అభినందించారు. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: సినిమాల్లో హింసకు తావివ్వొద్దు -
అది నాకు తెలుసు!
సినిమా: మహానటిలో సావిత్రిగా జీవించిన నటి కీర్తీసురేశ్. అలాంటి మరో చిత్రం ఆమె కెరీర్లో వస్తుందని చెప్పలేం. ఆ చిత్రం తమిళంలోనూ నడిగైయార్ తిలగం పేరుతో విడుదలై సక్సెస్ అయ్యింది. అంతకు ముందు కూడా ఇక్కడ స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు చేసింది. అంతే కాదు గత ఏడాది ఈ బ్యూటీ చేసిన 8 చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. ఇటీవల కీర్తీసురేశ్ ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు. అందుకు కారణం ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా చేయకపోవడమే. త్వరలో దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ నిర్మించనున్న చిత్రంలో నటించనుంది. కాగా మాతృభాష మలయాళంలో మరక్కయార్ అనే చిత్రం, తెలుగులో మిస్ ఇండియా, హిందీలో మెయ్‌టన్ ఇలా మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. మెయ్‌టన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంటర్ అవుతోంది. అందుకోసం చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది. ఇక తెలుగులో నటిస్తున్న మిస్ ఇండియా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుంది. త్వరలో నటించనున్న తమిళ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రమే. చాలా గ్యాప్ తరువాత నటి కీర్తీసురేశ్ మీడియా ముందుకొచ్చింది. ఇటీవల ఒక మీడియాతో తన భావాలను పంచుకుంది. అవేంటో చూద్దామా.. తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తనకు ఉంటుంది. అలాగని అనవసరంగా మనకు తెలిసినవన్నీ బయటకు చెప్పాలనుకోవడం నాకు నచ్చదు. ఇక పనిలేకుండా ఖాళీగా కూర్చోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. సినిమా రంగంలో అవకాశాలు వరించడం గొప్ప విషయమే. అందుకే విరామం లేకుండా ఏదో ఒక పనిచేస్తుండాలి. అలాగని వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవడం నాకిష్టం ఉండదు. సినిమా రంగంలోనే పుట్టి పెరిగిన అమ్మాయిని. మా అమ్మానాన్నల ఒడిలో కూర్చుని సినిమాలు చూస్తూ ఎదిగాను. నటన విషయంలోనూ, కథలను ఎంపిక చేసుకునే విషయంలోనూ పరిపక్వత కలిగిన నటిని. అయితే నాకంతా తెలుసన్న గర్వం మాత్రం లేదు. ఎక్కడ ఎలా నడుచుకోవాలో అక్కడ అలా నడుచుకుంటాను. సినిమా విషయంలో తుది నిర్ణయం దర్శకుడిదే. వారి భావాలకనుగుణంగా మేము పయనిస్తే చాలు అంతా బాగానే జరుగుతుంది అని కీర్తీసురేశ్ పేర్కొంది. -
మన ఫ్యాషన్ మెచ్చెన్ నేషన్
తెలుగు తెరపై సావిత్రి కట్టూబొట్టూ.. ఆహార్యమూ అన్నీ అప్పట్లో యువతులకు, మహిళలందరికీ అనుసరణీయాలే. ఆ దిగ్గజ నటిని మరోసారి తెరపై పరిచయం చేసిన ‘మహానటి’ సినిమాలో ఆ పాత్రకు తగిన జీవం పోశారు నగరానికి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్లు గౌరంగ్‌షా, అర్చనారావులు. ఇటీవల ప్రకటించిన సినీ జాతీయ అవార్డుల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌కి కూడా పురస్కారం లభించడంతో సిటీ ఫ్యాషన్ రంగానికి ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సిటీ ఫ్యాషన్ రంగానికి ఈ ఘనత దక్కడం ఇదే తొలిసారి. గౌరంగ్ షాతో పాటు నగరానికే చెందిన అర్చనారావు, కోల్‌కతా స్టైలిస్ట్ ఇంద్రాక్షి పట్నాయక్‌లు ఈ కీర్తిని సాధించడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో :టాక్ ఆఫ్ ది సినీ కంట్రీ అనిపించుకున్న దేవదాస్, పద్మావతి వంటి బాలీవుడ్ సినిమాల్లో తారల వస్త్రధారణ తీర్చిదిద్దిన డిజైనర్లు కొంతకాలం పాటు వార్తల్లో వ్యక్తులుగా నిలిచేవారు. అలాంటి ఘనత ఇప్పటిదాకా నగరానికి చెందిన ఏ డిజైనర్‌కూ దక్కలేదు. భారీ చిత్రాలకు కాస్ట్యూమ్స్ ఇచ్చిన దాఖలాలతో పాటు సదరు చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న సందర్భాలూ అరుదే. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన డిజైనర్ గౌరంగ్ షా.. మరో ఇద్దరితో కలిసి మహానటి సినిమాకు అందించిన కాస్ట్యూమ్స్‌కు ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో చోటు దక్కడం విశేషం. దీని ద్వారా మన డిజైన్లు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారారు. జామ్దానీని ఉపయోగించి వైవిధ్యభరితమైన ఫ్యాబ్రిక్స్, టెక్చర్స్ల మేళవింపు దుస్తులు ముఖ్యంగా చీరల సృష్టికి చిరునామాగా నిలిచే ఈ డిజైనర్.. వింటేజ్ ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తెరలేపారు. షర్మిలా ఠాగూర్లతో పాటు మరెంతో మందికి డిజైన్ చేసిన ఇదే గౌరంగ్ తొలి సినీ రంగప్రవేశం కావడం విశేషం. చేనేతలకు దక్కిన గౌరవం ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలకు డిజైన్లు అందించినా, ఒక కాస్ట్యూమ్ డిజైనర్‌గా పూర్తి సినిమాకు పనిచేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్‌అశ్విన్‌లు మాకు అవకాశం ఇవ్వడం, తొలిసారిగా పూర్తి స్థాయిలో మా సృజనాత్మకతను వెండితెరపై ఆవిష్కరించగలగడం.. అది కూడా సావిత్రి వంటి మహానటి బయోపిక్కు డిజైన్ వర్క్ చేయడం.. దీనికి జాతీయ అవార్డు లభించడం.. అన్నీ అద్భుతాలే. ఇది అనూహ్యమైన అనుభూతి. – గౌరంగ్ షా,ఫ్యాషన్ డిజైనర్ ఏడాదిన్నర కృషి ఫలితం.. అలనాటి సావిత్రి దుస్తులన్నీ సింప్లిసిటీకి, హుందాకు ప్రతీకలుగా అనిపిస్తాయి. అందుకే ఆమె లుక్ గురించి పరిశోధనలో భాగంగా సినీ పరిశ్రమ పెద్దలతో కూడా సంప్రదించారు గౌరంగ్. అలనాటి టెక్స్టైల్స్ పునఃసృష్టి కోసం తరచూ మ్యూజియంలను కూడా ఆయన బృందం సందర్శించింది. నాటి టెక్స్టైల్, డిజైన్, టెక్చర్, కలర్లలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం నేత కళాకారులకు మార్గదర్శకత్వం వహించింది. ఆర్నెళ్లకుపైగా రీసెర్చ్, ఏడాదిపైగా వీవింగ్‌కు, టెక్చరింగ్, కలరింగ్లకు కేటాయించాల్సి వచ్చింది. నటి సావిత్రి నిజజీవిత ఆహార్యాన్ని తెరపై మెరిపించేందుకు తీవ్రంగా శ్రమించాం అంటున్న గౌరంగ్.. కనీసం 100కిపైగా చేనేత కళాకారులు నిర్విరామంగా ఈ చిత్రంలోని కాస్ట్యూమ్స్ కోసం పని చేశారన్నారు. మొత్తంగా ఏడాదిన్నర సమయం వెచ్చించామన్నారు. దేశంలోని కాంచీపురం, బెనారస్ తదితర ప్రాంతాల నుంచి భారీ పట్టు ఫ్యాబ్రిక్స్‌ను సేకరించి కోట, మంగళగిరి, బ్లాక్ ప్రింట్స్‌లతో లూమ్స్‌లో అదనపు సొబగులు అద్దారు. శ్రద్ధగా.. భక్తిగా.. నాటి మహిళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆనాటి రంగులతో వీటిని బ్యాలెన్స్ చేశారు. చిన్నతనం నుంచి చివరి దశ దాకా ఆమె జీవన ప్రయాణంలోని ప్రతి సందర్భాన్నీ దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణను తీర్చిదిద్దారు. ఎదిగే వయసులోని సావిత్రి కోసం మంగళగిరి, కోటా ప్రింట్స్‌ను స్వర్ణయుగంలాంటి సినీ దశ కోసం హెవీ బ్రొకేడ్స్, సిల్క్స్, ఆర్గంజా, చేతితో నేసిన శాటిన్స్, షిఫాన్స్లను వినియోగించారు. అలాగే చరమాంకానికి తగ్గట్టూ ఏర్చికూర్చారు. ‘సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం నన్ను శాటిన్స్ను అందించమన్నారు. ఆమె లుక్స్ పూర్తిగా స్వచ్ఛమైన చేనేతలతోనే ఉండాలని కోరుకున్నాను. భారీ కాంజీవరమ్ లెహంగా, బ్లౌజ్, ఆర్గంజా దుపట్టాతో ఉండే ‘మాయాబజార్’లోని సావిత్రి లుక్ కోసం 3 నెలలు పట్టింది’ అని చెప్పారు గౌరంగ్ షా. జీవితంలో మరిచిపోను.. జాతీయ అవార్డు గెలుపొందడం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఎంతో రిసెర్చ్ చేసి, ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశాం. దర్శకుడు నాగ్అశ్విన్ నాపై ఉంచిన నమ్మకం నన్ను మరింతగా ఆ చిత్రంతో మమేకమయ్యేలా చేసింది. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలతో పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. మన సృజన వెండితెర మీద ప్రత్యక్షం అవడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. మహానటికి పనిచేసిన రోజుల్ని జీవితంలో మర్చిపోలేను. – అర్చనారావు, డిజైనర్ -
అభినేత్రికి అభినందనలు
‘మహానటి’కి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఆనందంలో ఉన్నారు కీర్తీ సురేశ్. అందాల అభినేత్రి సావిత్రి పాత్రలో కీర్తి అద్భుతంగా ఒదిగిపోయారని ప్రత్యేకంగా చెప్పొచ్చు. అందుకే ఈ తరం అభినేత్రి అని ఆమెను చాలామంది కీర్తిస్తున్నారు. అందరి అభినందనలతో ఉత్సాహంగా ఉన్నారు కీర్తి. ఇటీవల చిరంజీవి కూడా తన అభినందనలతో పాటు కీర్తీ సురేశ్‌కు ఆశీస్సులు అందించారు. సైమా అవార్డ్స్ ఫంక్షన్‌కి అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. సావిత్రిలా డ్రెస్ చేసుకుని కీర్తీ సురేశ్ ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అక్కడ చిరంజీవి అభినందనలు అందుకుంటున్న సమయంలో క్లిక్‌మన్న ఫోటో ఆకట్టుకునే విధంగా ఉంది. ‘సైరా’కు వాయిస్ ఓవర్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఆగస్ట్ 20న రిలీజ్ కానుంది. ఈ టీజర్‌కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘‘టీజర్‌కు వాయిస్ ఓవర్ అందించినందుకు థ్యాంక్యూ కల్యాణ్ బాబాయ్’’ అని రామ్‌చరణ్ పేర్కొన్నారు. -
ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న
సినిమా: అదే చివరి చిత్రం అని ఖచ్చితంగా చెప్పేసింది నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ ఇప్పుడు అభినందనల సాగరంలో మునిగితేలుతోంది. కారణం మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం) చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డు వరించడమే. మహానటి సావిత్రినే వచ్చి పూనినట్లు ఆ చిత్రంలో జీవించి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. దానికి బోనస్‌గా ఇప్పుడు జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్న కీర్తీసురేశ్ త్వరలో తమిళంలోనూ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ మహానటి చిత్రంలో నటనకు గానూ జాతీయ అవార్డు లభించడం సంతోషంగా ఉందని పేర్కొంది. మరోసారి బయోపిక్ చిత్రాల్లో నటించేది లేదని చెప్పింది. సావిత్రి బయోపిక్‌నే తాను నటించిన తొలి, చివరి చిత్రం అవుతుందని అంది. ఆ మహానటి పాత్రలో నటించాక మరొకరి జీవిత చరిత్రలో నటించడం ఉత్తమమనిపించుకోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహానటి చిత్ర షూటింగ్ పూర్తి కాగానే ఏదో మనసును వదిలి వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగిందని చెప్పింది. గుండె పగిలేలా ఏడ్చేశానని అంది. ఆ చిత్ర షూటింగ్ స్పాట్లో యూనిట్ అంతా అంత మానసికంగా కలిసిపోయామంది. తాను హాలీవుడ్ నటుడు టామ్క్రూస్కు వీరాభిమానినని చెప్పింది. హిందీలో షారూఖ్‌ఖాన్, దీపికాపదుకోనే, అలియాభట్ చాలా ఇష్టం అని పేర్కొంది. కోలీవుడ్‌లో నయనతార డ్రెస్ సెన్స్, నటి సిమ్రాన్ డాన్స్ నచ్చుతాయని చెప్పింది. ఆ మధ్య ఒక షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు అభిమాని ఇచ్చిన పార్శల్‌ని తెరిచిచూడగా తన ఫొటోలతో కూడి న అందమైన ఆల్బమ్, అందులో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ ఒక లేఖ ఉందని తెలిపింది. తనకు కళాశాల జీవితంలో తనకు ఎవరూ ప్రేమలేఖలు ఇవ్వలేదని, ఆ యువకుడు రాసిందే తొలి ప్రేమ లేఖ అని చెప్పింది. దీంతో ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్నట్లు కీర్తీసురేశ్ చెప్పింది. తాను ఎవరి ప్రేమలోనూ పడలేదని చెప్పిందీ భామ. నమ్మితే నమ్మండి లేకపోతే మానేయండి. ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటోంది ఈ బ్యూటీ. -
వదిలేది లేదు
66వ జాతీయ అవార్డుల విషయంలో కోలీవుడ్ అసంతృప్తిగా ఉన్నా, ఇతర దక్షిణాది ఇండస్ట్రీలు హ్యాపీ అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి చిత్రంలో నటనకు గానూ కీర్తీసురేశ్‌కు ఉత్తమ నటి అవార్డు వరించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అతి పిన్న వయసులోనే సావిత్రి అంత గొప్ప నటి పాత్రలో ఎంతో పరిణితి నటనను ప్రదర్శించిన కీర్తీసురేశ్‌ను అందరూ ప్రసశించారు. అయితే నటి కీర్తీసురేశ్ మాత్రం జాతీయ అవార్డును ఊహించలేదని పేర్కొంది. అనుకోనిది అందుకోవడంలోనే మజా ఉంటుంది. ఆ ఆనందాన్నే కీర్తీసురేశ్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఒక మలయాళ నటి తెలుగులో నటించిన చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకోవడం అరుదైన విషయమే. కాగా ఈ అమ్మడు కోలీవుడ్‌లో నటించి చాలా కాలమే అయ్యింది. ఇంతకు ముందు తమిళంలో విజయ్, విశాల్, విక్రమ్ వంటి ప్రముఖ హీరోలతో వరుసగా నటించిన కీర్తీసురేశ్ ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా చేయడం లేదు. ఇప్పుడామే టాలీవుడ్, బాలీవుడ్‌లపై దృష్టి సారిస్తోంది. బాలీవుడ్లో దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం కోసం చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా మారిపోయింది. ఇక తెలుగులోనూ ఒక లేడీ ఓరియేంటేడ్ కథా చిత్రంలో నటిస్తోంది. అలాంటిది తొలి హిట్‌ను అందించడంతో పాటు స్టార్ హీరోయిన్ అంతస్తును అందించిన కోలీవుడ్‌కు దూరం అవుతారా? అంటూ ఒక అభిమాని కీర్తీసురేశ్‌ను ప్రశ్నించాడు. ఇందుకు బదులిచ్చిన ఈ ఉత్తమ నటి, తాను కోలీవుడ్‌కు దూరం అయ్యే సమస్యే లేదని, త్వరలోనే తమిళ చిత్రంలో నటించనున్నట్లు చెప్పింది. ఈ అమ్మడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఇదీ హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రంగానే ఉంటుందట. కమర్శియల్ చిత్రాల్లో బబ్లీగర్ల్ పాత్రల్లో నటించాల్సిన వయసులో కీర్తీసురేశ్ బరువైన పాత్రల్లో చిత్రాలను పూర్తిగా తన భుజాన మోయడానికి ప్రయత్నించడం సాధారణ విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు. -
పేరు చెడగొట్టకూడదనుకున్నాను
నేషనల్ లెవల్లో గుర్తింపు రావడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ‘మహానటి’కి మూడు అవార్డులు వచ్చాయి. నేషనల్ లెవల్లో గట్టి పోటీ ఇచ్చిన కీర్తీ సురేశ్ అవార్డు సాధించడం సంతోషంగా ఉంది. సావిత్రిగారి టైమ్‌లో ఆమెకు నేషనల్ అవార్డు రాలేదు. కానీ అవార్డ్‌కు తగినంత పెర్ఫార్మెన్స్లు చాలా ఇచ్చారు. ఆమె మీద తీసిన సినిమాతో నేషనల్ అవార్డు తీసుకురాగలిగాం. ఇది ఊహించలేదు. కానీ మంచి ప్రశంసలు, అభినందనలు వస్తాయని చాలా మంది చెప్పారు. సినిమా రిలీజ్ అయి కూడా చాలా రోజులైంది. మర్చిపోయాను కూడా. సినిమాలో చాలెంజ్‌లు, కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాతో మాకు బాధ్యత ఎక్కువ ఉండేది. సావిత్రి అమ్మ మీద సినిమా తీస్తున్నాం. అవకాశాన్ని వృథా చేసుకోకూడదు అని కష్టపడ్డాం. సావిత్రిగారికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లు మా సినిమా చూస్తే సంతృప్తి చెందాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. బాక్సాఫీస్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదు. రిలీజ్ అయిన తర్వాత ‘న్యాయం చేశారు, చెడగొట్టలేదు’ అంటే చాలు అనుకున్నాను. ఆమె లైఫ్ అంతా షూటింగ్ గ్యాప్‌లో జరిగిందే కదా. సమస్య అయినా ప్రేమ అయినా షూటింగ్స్ మధ్యలోనే జరిగాయి. సినిమా కూడా అలానే తీశాను. మనకు చాలా కథలున్నాయి. వాళ్లందరి గురించి కూడా సినిమాలు తీయాలి. తీసేవాళ్లు మాత్రం చాలా నిజాయితీగా వెతికి, నిజాయితీగా తీయాలి. నెక్ట్స్ కొత్త కథలు చెప్పాలనుంది. ప్రస్తుతం ఓ కథను రాస్తున్నాను. తొందర తొందరగా సినిమా తీసేయాలని లేదు. ఇప్పుడు చేయబోతున్న సినిమా మాత్రం నా గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. -
‘మహానటి’.. కీర్తి సురేష్
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్ ధర్ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది. చిన్నూ.. అవార్డ్ వచ్చిందని అరిచాను – రాహుల్ రవీంద్రన్ (‘చిలసౌ’ దర్శకుడు) పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్లో ఇలాంటి అవార్డ్ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, రెండో సినిమా రిలీజ్ కావడం, డెబ్యూ డైరెక్టర్‌గా ‘సాక్షి’ నాకు అవార్డ్ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‘మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్ భార్య చిన్మయి)కి ఫోన్ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవార్డ్ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్‌కి అందరికీ థ్యాంక్స్. క్రెడిట్ ముగ్గురికి దక్కుతుంది – ప్రశాంత్ వర్మ, (’అ!’ దర్శకుడు) చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్ సినిమాకే అవార్డ్స్ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్ సినిమాలా? డిఫరెంట్ సినిమాలా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. నేషనల్ అవార్డ్స్‌కు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్ అవార్డ్ వచ్చిందంటూ కాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్‌గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్ థ్యాంక్స్. మేకప్ చీఫ్ రంజిత్‌తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్ వెళ్లాలనుకుంటున్నాను. అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్ (‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్‌కు మంచి స్కోప్ దొరికింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా చేశాను. సుకుమార్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మా బాధ్యత పెరిగింది – నాని మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్‌కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే. మరాఠీలో మెరిసిన తెలుగు తేజం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకర్ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం. కేజీఎఫ్‌కు డబుల్ ధమాకా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్ చాప్టర్2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పాటకు తొలి అవార్డు ‘పద్మావత్’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్ ఫిల్డ్‌లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్‌లు చేశారు. బ్యాన్ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్‌గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్ మూమెంట్ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. బుల్బుల్ పాడగలదు! అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్ తన మొదటి సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో ఆ డ్రీమ్‌ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్‌స్టార్‌గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్బుల్ కెన్ సింగ్’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్బుల్. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా? ‘బుల్ బుల్..’ లో ఓ దృశ్యం 66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబీఎఫ్సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్సీ వద్ద సర్టిఫికేట్ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్‌లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది. – ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్ -
ఈ అవార్డు మా అమ్మకు అంకితం
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్, నాగ్ అశ్విన్‌తో ‘సాక్షి’ స్పెషల్ టాక్. ► హార్టీ కంగ్రాట్స్. 1990లో ‘కర్తవ్యం’ సినిమాకి విజయశాంతి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 28 ఏళ్ల తర్వాత తెలుగు నుంచి ఉత్తమ కథానాయిక అవార్డు గెలుచుకున్న నటి మీరే... కీర్తీ సురేశ్: చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ అవార్డును మా అమ్మకు అంకితం చేస్తున్నాను. అమ్మ (మలయాళ నటి మేనక) నటించిన ఓ మలయాళం సినిమా నేషనల్ అవార్డుకి నామినేట్ అయింది. కానీ అవార్డు రాలేదు. అలా అమ్మ కల నెరవేరలేదు. అప్పుడే తనకోసం ఓ అవార్డు తీసుకురావాలని అనుకున్నాను. ‘నీ కోసం జాతీయ అవార్డు తీసుకొస్తాను’ అని అమ్మతో కూడా చెప్పాను. ఇప్పుడు అది నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లవుతోంది. ఇంత త్వరగా జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. అమ్మ కల మాత్రమే కాదు.. ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవాలనే నా కల నెరవేరినట్టుంది. ఇది కేవలం మొదలే.. నా జర్నీ ఇంకా చాలా ఉంది (నవ్వుతూ). ► ఈ సందర్భంగా సావిత్రిగారి గురించి రెండు మాటలు... సావిత్రిగారి ఆశీస్సులు, సపోర్ట్ లేకపోతే ఇంత దూరం కచ్చితంగా వచ్చేవాళ్లం కాదు. సావిత్రి అమ్మ, ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి అమ్మకు చాలా చాలా థ్యాంక్స్. సినిమా చేస్తున్నప్పుడు వచ్చిన అడ్డంకులన్నీ సావిత్రమ్మ ఆశీస్సులతోనే ఎదుర్కొన్నాం. ఆవిడ ఎప్పుడూ మమ్మల్ని గైడ్ చేస్తూనే వచ్చారని నా ఫీలింగ్ ► ‘మాయాబజార్’లోని ‘అహ నా పెళ్లంట’ ఎపిసోడ్లో బాగా చేశారు. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ సినిమాలో ఆ పాట అందరికి ఫేవరెట్ కూడా. ఆ సన్నివేశానికి 40– 50 టేకులు తీసుకున్నాను. షూట్ చేసే మూడు రోజుల ముందే ప్రిపరేషప్ మొదలుపెట్టాను. టేక్ చేసిన ప్రతిసారీ పర్ఫెక్ట్గా రావాలనుకునే చేశాను. ఫైనల్లీ చేయగలిగాను. చాలా బాగా చేశావని అందరూ అభినందించారు. అయితే ఇప్పుడు చూసుకుంటే నాకు చిన్నచిన్న తప్పులు కనిపిస్తాయి (నవ్వుతూ). ► ఇంత బాధ్యత ఉన్న పాత్ర చేస్తున్నాం అని నిద్రలేని రాత్రులు ఏమైనా? ‘మహానటి’ కోసం చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. పాత్రలోనుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉండేది. ఎమోషనల్ సీన్స్ చేసినా ఏం చేసినా షూటింగ్ పూర్తయిన తర్వాత చాలా కష్టంగా ఉండేది. రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను. నిద్రలేకపోతే ఆ ఎఫెక్ట్ మర్నాడు షూటింగ్ మీద పడుతుందని భయం. సావిత్ర అమ్మ పాత్ర నా మీద చాలా ప్రభావం చూపించింది. ► కాస్ట్యూమ్స్‌కి కూడా అవార్డ్ వచ్చింది. అలనాటి సావిత్రిగారు వేసుకున్న కాస్ట్యూమ్స్ పోలినవి ఈనాటి కీర్తి వేసుకున్నప్పుడు ఏమనిపించింది? కాస్ట్యూమ్ డిజైనర్లు్ల కూడా చాలా కష్టపడ్డారు. ఆవిడ ఫిట్టింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫిట్టింగ్ దొరకడం లేదు కూడా. ఆ ఫిట్టింగ్ ఉంటే తప్ప షాట్‌కి రాను అని చెప్పేదాన్ని. ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేనంత ‘టైట్ బ్లౌజులు’ వేసుకునేవారు. కష్టం అనిపించినప్పటికీ నేనూ అదే ఫిటింగ్నే ప్రిఫర్ చేశాను. ఇక లావుగా కనపడాల్సిన సీన్స్‌లో ప్రొస్థెటిక్ మేకప్ కూడా ఉపయోగించాం. సమ్మర్లో చిత్రీకరించాం. ప్రొస్థెటిక్ మేకప్‌కి నాలుగు గంటలు పట్టేది. ► ఈ సినిమాలో మిమ్మల్ని సావిత్రి పాత్రకు ప్రకటించినప్పుడు కొందరు ‘మిస్ ఫిట్’ అన్నారు. విమర్శలు కూడా వచ్చాయి..? సావిత్రిగారు మహానటి. ఆమె పాత్రకు న్యాయం చేయగలను అనే నమ్మకంతోనే ఒప్పుకున్నారు. అయితే ముందు క్రిటిసిజమ్ వచ్చిందని నాకు తెలియదు. తర్వాత చాలామంది చెప్పారు. అలాగే సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు తెలిసింది. అప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది. పోస్టర్, టీజర్ వచ్చినప్పుడు అందరికీ నమ్మకం కలిగింది. అందరూ అభినందించారు. మంచి రెస్పాన్స్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ► ‘మహానటి’ సినిమా గుర్తుగా ఏదైనా మీతో దాచుకున్నారా? ఈ సినిమాకు నా మనసులో స్పెషల్ ప్లేస్ ఉంది. ‘మహానటి’ చివరి రోజు చిత్రీకరణలో నేను ధరించిన చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్. అదే నా దగ్గరున్న మెమొరీ. పేరు చెడగొట్టకూడదనుకున్నాను – నాగ్ అశ్విన్ ‘మహానటి’ దర్శకుడు నేషనల్ లెవల్లో గుర్తింపు రావడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ‘మహానటి’కి మూడు అవార్డులు వచ్చాయి. నేషనల్ లెవల్లో గట్టి పోటీ ఇచ్చిన కీర్తీ సురేశ్ అవార్డు సాధించడం సంతోషంగా ఉంది. సావిత్రిగారి టైమ్‌లో ఆమెకు నేషనల్ అవార్డు రాలేదు. కానీ అవార్డ్‌కు తగినంత పెర్ఫార్మెన్స్లు చాలా ఇచ్చారు. ఆమె మీద తీసిన సినిమాతో నేషనల్ అవార్డు తీసుకురాగలిగాం. ఇది ఊహించలేదు. కానీ మంచి ప్రశంసలు, అభినందనలు వస్తాయని చాలా మంది చెప్పారు. సినిమా రిలీజ్ అయి కూడా చాలా రోజులైంది. మర్చిపోయాను కూడా. సినిమాలో చాలెంజ్‌లు, కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాతో మాకు బాధ్యత ఎక్కువ ఉండేది. సావిత్రి అమ్మ మీద సినిమా తీస్తున్నాం. అవకాశాన్ని వృథా చేసుకోకూడదు అని కష్టపడ్డాం. సావిత్రిగారికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లు మా సినిమా చూస్తే సంతృప్తి చెందాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. బాక్సాఫీస్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదు. రిలీజ్ అయిన తర్వాత ‘న్యాయం చేశారు, చెడగొట్టలేదు’ అంటే చాలు అనుకున్నాను. ఆమె లైఫ్ అంతా షూటింగ్ గ్యాప్‌లో జరిగిందే కదా. సమస్య అయినా ప్రేమ అయినా షూటింగ్స్ మధ్యలోనే జరిగాయి. సినిమా కూడా అలానే తీశాను. మనకు చాలా కథలున్నాయి. వాళ్లందరి గురించి కూడా సినిమాలు తీయాలి. తీసేవాళ్లు మాత్రం చాలా నిజాయితీగా వెతికి, నిజాయితీగా తీయాలి. నెక్ట్స్ కొత్త కథలు చెప్పాలనుంది. ప్రస్తుతం ఓ కథను రాస్తున్నాను. తొందర తొందరగా సినిమా తీసేయాలని లేదు. ఇప్పుడు చేయబోతున్న సినిమా మాత్రం నా గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. -
అవార్డు విన్నర్లకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు పలు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. ఈ నేపథ్యంలో పురస్కారాలకు ఎంపికైన తెలుగు సినిమా నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని సీఎం ఆకాక్షించారు. (చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట) -
మెగాస్టార్ చెప్పినట్టే జరిగింది!
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా, ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. (చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట) ఇక నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `రంగస్థలం` బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి అవార్డుకు ఎంపికైంది. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే నుంచి చిలసౌ కు, ఉత్తమ మేకప్, విభాగంలో, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అ..!` చిత్రానికి అవార్డులు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. `మహానటి`, `రంగస్థలం` చిత్రాలకు జాతీయ అవార్డలు వస్తాయని ఆయన రిలీజ్ కు ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే. మహానటి రిలీజ్ అనంతరం చిరంజీవి యూనిట్ సభ్యులను ఇంటికి పిలిపించి ఘనంగా సన్మానించిన సంగతి విదితమే. ఆయన చెప్పినట్టు ఆయా చిత్రాలకు అవార్డులు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన `రంగస్థలం`కు జాతీయ అవార్డు రావడం. అలాగే ఇతర భాషల నుంచి అవార్డులకు ఎంపికైన వారందరికీ మెగాస్టార్ అభినందనలు తెలిపారు. -
‘మహానటి’కి జాతీయ అవార్డులు
న్యూఢిల్లీ: సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమాకు జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు. ఉతమ నటుడు అవార్డును ఆయుష్మాన్ ఖురానా, నిక్కీ కౌశల్‌లకు సంయుక్తంగా ప్రకటించారు. సాంకేతిక విభాగాల్లో ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ పురస్కారాలు లభించాయి. హిందీలో ఉత్తమ చిత్రంగా అంధాధున్ ఎంపికైంది. పద్మావత్ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు. జాతీయ పురస్కారాలు ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (మహానటి) ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(ఉడి) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: మహానటి బెస్ట్ మేకప్, విజువల్ ఎఫెక్ట్: అ! ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చి.ల.సౌ ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం ఉత్తమ తమిళ చిత్రం: బారమ్ ఉత్తమ కన్నడ సినిమా: నాతిచరామి ఉత్తమ యాక్షన్ సినిమా: కేజీఎఫ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: ఉత్తరాఖండ్ జాతీయ ఉత్తమ హిందీ సినిమా: అంధాధున్ ప్రజాదరణ పొందిన సినిమా: బదాయిహో (హిందీ) ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్మాన్ (హిందీ) ఉత్తమ సహాయనటి: సురేఖ సిక్రీ(బదాయిహో) ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్కిరే (చంబక్) ఉత్తమ గాయకుడు: అరిజిత్ సింగ్(పద్మావత్) ఉత్తమ గాయని: బిందు మాలిని (నాతిచరామి) ఉత్తమ సాహిత్యం: నాతిచరామి (కన్నడ) బెస్ట్ ఎడిటింగ్: నాతిచరామి (కన్నడ) బెస్ట్ డైలాగ్స్: తరీఖ్ బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: ఉడి (హిందీ) ఉత్తమ బాల నటులు: పీవీ రోహిత్ (కన్నడ), సందీప్ సింగ్(పంజాబీ), తల్హా అర్షాద్(ఉర్దూ), శ్రీనివాస్ పొకాలే(మరాఠి) ఉత్తమ బాలల చిత్రం: సర్కారీ హిరియా ప్రాథమిక శాల, కాశరగోడు(కన్నడ) ఉత్తమ సినీ విమర్శకులు: బ్లాసే జానీ(మలయాళం), అనంత్ విజయ్(హిందీ) -
జాన్వీకపూర్‌తో దోస్తీ..
సినిమా: చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాందించుకున్న నటి కీర్తీసురేశ్. మాలీవుడ్‌లో రంగప్రవేశం చేసినా, కోలీవుడ్, టాలీవుడ్లోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. తమిళంలో తొలి చిత్రం ఇదు ఎన్న మాయం చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోయినా, ఆ తరువాత రజనీమురుగన్, రెమో చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. దీంతో విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకున్న కీర్తీసురేశ్ తన తల్లి కోరికను తీర్చేసింది. ఆమె తల్లి మేనక చాలా కాలం క్రితం రజనీకాంత్‌కు జంటగా నెట్రికన్ను చిత్రంలో నటించింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయింది. అలా తన తల్లి సాధించలేనిది కీర్తీసురేశ్ సాధించిందనే చెప్పాలి. ఇక తెలుగులో నేను శైలజా వంటి కొన్ని హిట్ చిత్రాల్లో నటించినా మహానటి చిత్రం నటిగా కీర్తీసురేశ్ స్థాయిని ఒక్క సారిగా పెంచేసింది. ఇలా తమిళం, తెలుగు స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా తెరమరుగైపోయింది. కారణం బాలీవుడ్ మోహమే నంటున్నారు సినీ వర్గాలు. హిందీలో నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం కోసం కసరత్తులు చేసి చాలా స్లిమ్‌గా తయారైంది. ఇంకా చెప్పాలంటే మేకప్ లేకుండా ఇది కీర్తీనా అని ఆశ్చర్యపడేంతగా సన్నపడింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల ఒక తెలుగు చిత్రాన్ని తిరష్కరించిందనే ప్రచారం జోరందకుంది. కారణం కథా పాత్ర నచ్చలేదని సాకు చెబుతున్నా, హిందీలో నిలదొక్కుకోవాలన్న ఆశతోనే కీర్తీసురేశ్ దక్షిణాది చిత్రాలపై ఆసక్తి కనబరచడం లేదంటున్నారు సినీ వర్గాలు. అంతే కాదు శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌తో బాగా దోస్తీ కుదిరిందట. ఎక్కువగా ముంబైలోనే మకాం పెడుతుందనే ప్రచారం జరుగుతోంది. తమిళంలో అసలు ఈ బ్యూటీ పేరే వినిపించడం లేదు. ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేదు. హిందీ చిత్రం పూర్తి అయ్యే వరకూ దక్షిణాది వైపు దృష్టి సారించే అవకాశం ఉండదనుకుంటా. అక్కడ అటూ ఇటూ అయితే ఆ తరువాత ఇక్కడ కీర్తీసురేశ్‌ను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాల్సిన విషయమే. -
కాలంతో ముందుకు వెళ్తుంటా!
‘మహానటి’ సినిమాలో అద్భుతంగా నటించి నటిగా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు కథానాయిక కీర్తీ సురేష్. ‘మీరు ఎలాంటి పాత్రలను ఇష్టపడతారు. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నను కీర్తి ముందు ఉంచితే.. ‘‘నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. ప్రేక్షకుల మెప్పు పొందాలి. ఏదో ఒక జానర్‌కే పరిమితం కావడం నాకు ఇష్టం లేదు. ‘క్వీన్’ సినిమాలో కంగనా రనౌత్, ‘మరియాన్’లో పార్వతి చేసిన పాత్రలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి పాత్రలే నాకు రావాలని కోరుకోను. నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చిన పాత్రలకు ఓకే చెబుతుంటాను. నిజానికి నేను భవిష్యత్ గురించి పెద్దగా ఆలోచించను. కాలంతో ముందుకు వెళ్తుంటా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్ కోసం స్పెయిన్‌లో ఉన్నారు ఈ బ్యూటీ. అలాగే నగేష్ కుకునూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్లో అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కనున్న ఓ స్పోర్ట్స్ బయోపిక్కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. -
అక్కడ తగ్గాల్సిందే!
నటి కీర్తీసురేశ్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలో నటిగా ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి అన్నది తెలిసిందే. సాధారణంగా మొదట్లో కమర్శియల్ చిత్రాల్లో చాలా లైట్ పాత్రల్లో నటించాలని చాలా మంది కోరుకుంటారు. అదే విధంగా వర్ధమాన నటీమణులను నమ్మి ఏ దర్శక నిర్మాత బరువైన పాత్రలను ఆఫర్ చేయడానికి సాహసించరు. అయితే లక్కీగా కీర్తీకి అలాంటి పాత్ర మహానటి చిత్రం రూపంలో వరించింది. ఈ సినిమాలో నాటి మేటి నటి సావిత్రిగా నటించడానికి కొందరు పరిహసించారు కూడా. అయినా దర్శకుడి సూచనలతో కీర్తీసురేశ్ తన పనిని సమర్థవంతంగా చేసింది. ఇవాళ సావిత్రి పాత్ర అంటే కీర్తీసురేశ్‌నే చేయాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారు. అయితే అంతకుముందు కూడా రజనీమురుగన్, రెమో వంటి కమర్శియల్ చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు. కాగా మహానటి చిత్రం తరువాత కీర్తీసురేశ్ స్థాయి పూర్తిగా మారిపోయారు. దానికి తగ్గట్టుగానే ఈ బ్యూటీ కథలను ఎంచుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక చాలా మంది హీరోయిన్లు మొదట్లో ఆచితూచి అడుగులు వేసి ఆ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలు చేస్తారు. అలాంటిది కీర్తీసురేశ్‌కు మొదట్లోనే అలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ కథ చిత్రాల అవకాశాలు తలుపు తట్టడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో కథానాయకి సెంట్రిక్ పాత్రలో నటిస్తున్నారు. దీనికి నరేంద్రనాథ్ దర్శకుడు. దీనితో పాటు మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. లక్కీగా తొలి హిందీ చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో కథానాయికల్ని బొద్దుగా ఉంటే అంగీకరించరు. అందుకే దక్షిణాదిలో పాపులర్ అయిన కథానాయికలు బాలీవుడ్కెళితే స్లిమ్ కావలసిందే. నటి తమన్నా, కాజల్‌అగర్వాల్, ఇలియానా వంటి వారు బాలీవుడ్లో అవకాశం వస్తే ముందుగా చేసే పని బరువు తగ్గడం. ఎంతగా అంటే జీరోసైజ్ అంటారే అంతగా. నటి తాప్సీ కూడా బరువు బాగా తగ్గడం వల్లే బాలీవుడ్లో పాగా వేయగలిగింది. ఇప్పుడు నటి కీర్తీసురేశ్ అందుకు కసరత్తులు చేయక తప్పలేదు. నిజానికి కీర్తీది ఏమంత భారీ కాయం కాదు. అయినా ఇంకా బరువు తగ్గాల్సిన పరిస్థితి. అక్కడి వారి అభిరుచి అంతే. అందుకనుగణంగా కీర్తీ మారిపోయారు. -
మీరు లేకుంటే ఇది జరిగేది కాదు!
ధన్యవాదాలమ్మా. నీవు లేకుంటే ఇది జరిగేది కాదు అని నటి కీర్తీసురేశ్ ఉద్వేగంగా స్పందించారు. నటిగా మొదట్లోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఇలా ఇండియన్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న కీర్తీసురేశ్‌ను నటిగా స్థాయిని పెంచిన చిత్రం మహానటి. తమిళంలో నడిగైయార్ తిలగం పేరుతో విడుదలైన ఈ చిత్రంలో దివంగత ప్రఖ్యాత నటీమణి సావిత్రిగా ఒదిగిపోయారు. మరోసారి సావిత్రిని ప్రేక్షకుల కళ్ల ముందుంచిందని కూడా అనవచ్చు. భవిష్యత్‌లో కూడా అలాంటి ఒక గొప్ప అవకాశం కీర్తీసురేశ్‌కు వస్తుందా అన్నది సందేహమే. నటుడు దుల్కర్ సల్మాన్, నటి సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వర్ధమాన టాలీవుడ్ దర్శకుడు నాగ్అశ్విన్ అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. మహానటి చిత్రం నటి కీర్తీసురేశ్లో చాలా పరిణితిని తీసుకొచ్చిందన్నది వాస్తవం. ఈ చిత్రం తరువాత ఈ బ్యూటీ చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన సినీ జీవితాన్ని మార్చేసిన మహానటి చిత్రాన్ని కీర్తీసురేశ్ గుర్తు పెట్టుకోకపోతే చాలా పెద్ద తప్పే అవుతుంది. ఆ తప్పును కీర్తీ చేయలేదు. మహానటి చిత్రం విడుదలై గురువారం (9వ తేదీ)కి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్ ఒక ట్వీట్ చేశారు. అందులో మీ గురించి మాట్లాడడానికి నాకు మాటలు దొరకడం లేదు. నన్ను ఈ చిత్రంలోకి తీసుకొచ్చి చేర్చినందుకు, ఆ పయనంలో కూడా ఉన్నందుకు, మీ అభిమానాన్ని, ఆశీస్సులను నాకు అందించినందుకు ధన్యవాదాలు. మీరు లేకుంటే ఇది జరిగేది కాదు ధన్యవాదాలు సావిత్రమ్మా. నాగ్ అశ్విన్ గురించి చెప్పాలంటే ఆ అద్భుతమైన చిత్రం వెనుక ఉన్న బ్రెయిన్ ఆయన. నా ఆత్మవిశ్వాసానికి వెనుక ఉన్న మనిషి.. నన్ను ఎక్కువగా నమ్మిన వ్యక్తి. ఇంత కంటే నేను మీమ్మల్ని ఏం కోరగలను నాగ్? స్వప్నదత్, ప్రియాంకదత్ ఇంతకంటే శక్తిని మీరు పొందలేరు. ఈ చిత్రానికి రెండు మూల స్తంభాల్లా నిలిచి అన్నింటిని ఎదురొడ్డి నిలిచారు. ఆ పోరాటానికి మొత్తంగా ఫలితం దక్కింది. డేనీ మీరు సినిమాలో చరిత్ర సృష్టించారు. మిక్కీ జే మేయర్ మహానటి పాటలకంటే ఆమెకు మీరు ఇచ్చే కానుక ఏముంటుంది? అని నటి కీర్తీసురేశ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
విజయ రహస్యాన్ని బయటపెట్టి కీర్తీ సురేష్
ఎవరికైనా కెరీర్లో కొన్ని చిత్రాలు మైలురాయిగా నిలిచిపోతాయి. అలా కీర్తీసురేశ్ ఎన్ని కమర్శియల్ చిత్రాల్లో నటించినా మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం) ఆమె సినీ జీవితంలో మరపురాని మధురమైన చిత్రంగా నిలిచిపోతుంది. కీర్తీ నటన గురించి ఎవరు మాట్లాడినా మహానటి చిత్ర ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ చిత్రం తరువాత కొన్ని కమర్శియల్ చిత్రాల్లో కీర్తి నటించినా ప్రస్తుతం తన నట జీవితం నిదానంగానే నడుస్తోంది. మలయాళం, తెలుగు భాషల్లో ఒక్కో చిత్రం మాత్రమే చేస్తోంది. ఇక తమిళంలో సర్కార్ చిత్రం తరువాత మరో చిత్రం ఈ బ్యూటీ చేతిలో లేదు. ఇదే విషయాన్ని కీర్తీసురేశ్ ముందుంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ఇది సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతీ చిత్రానికి ఎదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. షూటింగ్ సెట్లో 100 మందిని మనం గురువులుగా చూడవచ్చునని అంది. వారు చేసే పనిలో నైపుణ్యం, లైట్‌మెన్ నుంచి దర్శకుడి వరకూ వృత్తిపై చూపే శ్రద్ధ, అంకితభావం తనను చాలా ఆకట్టుకుంటుందని చెప్పింది. ఇక నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటి వారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికం అవుతుందని అంది. నడిగైయార్ (మహానటి) చిత్రం తరువాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తానిప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యం ఇదేనని కీర్తీసురేశ్ చెప్పుకొచ్చింది. -
‘మహానటి’ బాలీవుడ్ ఎంట్రీ
సౌత్ లో సక్సెస్ అయిన తారలు బాలీవుడ్ వైపు చూడటం సాధరణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ లిస్ట్‌లో సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్కువ. తాజాగా మరో హీరోయిన్ ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్లో స్టార్ హీరోల సరసన వరుసన సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. మహానటి సినిమా తరువాత కీర్తి ఇమేజ్ తారాస్థాయికి చేరింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్, అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కీర్తి బాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా కన్ఫామ్ అయ్యింది. మరిసౌత్ లో సత్తా చాటిన మహానటి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి. -
ఎన్టీఆర్ బయోపిక్కు వెన్నుపోటు
సాక్షి, హైదరాబాద్ : కథానాయకుడు బోల్తా కొట్టడంతో... మహానాయకుడుపై మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే.. అందరి ఊహాగానాలకు భిన్నంగా సాగిన ఈ సినిమా అభిమానులను ఆశ్చర్యంలో ముంచింది. బయోపిక్ అంటే కత్తిమీద సాము లాంటిది. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. కొందరికి రుచించకపోవచ్చు. కొన్ని వాస్తవాలను దాచిపెట్టినా... అసలు ఏమాత్రం పొంతనలేని, జరగని సంఘటనలు జరిగినట్టు చూపించడమే కాకుండా ఈ సినిమాలో కథకు మూలమైన నాయకుడి పాత్రను తగ్గించి మరోపాత్రకు ప్రాధాన్యత కల్పించడంతో అసలు బయోపిక్ అర్థాన్నే మార్చడం గమనార్హం. బాలీవుడ్లో వచ్చిన ‘సంజు’ గమనిస్తే అందులో సంజయ్ దత్ కావాలని ఎలాంటి తప్పు చేయలేదనీ, పరిస్థితులే అతన్ని అలా మార్చేశాయనీ, తప్పంతా మీడియాదేనని, సంజు మంచి బాలుడు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సంజు పాత్రలో రణ్‌బీర్ అద్భుత నటనకు ప్రశంసలైతే వచ్చాయి. కానీ, సినిమా కథ, కథనాలపై ఘాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తెలుగులో బయోపిక్ ట్రెండ్ రావడానికి కారణం మహానటి. అలనాటి మహానటి సావిత్రి జీవితం గురించి, ఆమె చివరి రోజుల్లో మద్యానికి బానిసవ్వడం, ఆమె మరణానికి దారితీసిన కారణాలు అందరికీ తెలిసిందే. అయితే ‘మహానటి’లో సావిత్రిలోని మంచి గురించి, చెడు గురించి చెప్పారు కాబట్టే.. ఆ చిత్రాన్ని ఆదరించి పట్టం కట్టారు. అయితే ఆమెలోని చెడును కూడా ప్రేక్షకులు ఒప్పుకునేట్టు చేసి.. ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే చేస్తారులే.. అని ప్రేక్షకుల చేతే అనిపించేలా చేయగలగడం దర్శకుడి గొప్పదనం. అందుకే మహానటి అంతటి విజయాన్ని సొంతంచేసుకుని.. ఆ మహానటికి నిజమైన నివాళిగా ‘మహానటి’ చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా కథను ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పడమే కాకుండా ఆ పాత్రను వేస్తున్న నటీనటులు అందులో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రను నమ్ముతారు. పాత్రతో పాటే లీనమవుతారు. ఇలా మహానటికి అన్నీ కుదరడంతో తెలుగు తెరపై బయోపిక్‌లకు మార్గదర్శకంగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్‌ది స్వర్ణ యుగమని అందరికీ తెలిసిందే. తిరుగులేని కథానాయకుడిగా ప్రజల్లో దేవుడిగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనాలు సృష్టించారు. అయితే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు ఎదురైన అనుభవాలు, లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం.. చంద్రబాబు వెన్నుపోటు పొడవడం, చివరగా ఆయన మరణం... ఇదంతా వెండితెరపైన చూపిస్తే ఎన్టీఆర్ బయోపిక్ సక్సెస్ అయ్యేదేమో. అలా కాకుండా వారు మెచ్చిన వాటిని ఎంపిక చేసుకుని నచ్చినట్టుగా తెరకెక్కిస్తే సహజంగానే ప్రేక్షకుల ఆదరణ లభించదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన యాత్ర సినిమా కూడా ప్రేక్షకులను కదిలించిందంటే.. కథ, కథనంలో ఉన్నఆ పట్టు.. ఆ పాత్రను అంతగా పోషించిన కథానాయకుడు పాత్రలో జీవించారు. సినిమాలో భావోద్వేగాలు పండటంతోనే సినిమా అందరిని ఆకట్టుకుంది. సినిమా పక్క దారి పట్టకుండా వారు ఏం చెప్పదలుచుకున్నారో అదే చెప్పారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌గా చెప్పుకుంటున్న కథానాయకుడు, మహానాయకుడులో అవి లోపించాయి. కథను తమకు నచ్చినట్టుగా మార్చడంతో అసలు విషయాలను కావాలనే దాచిపెట్టినట్టు ప్రేక్షకుల ముందు ఇట్టే తేలిపోయింది. తెరపై ఎన్టీఆర్ పాత్రను పండించడం పక్కన పెడితే, ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కోవలసివచ్చింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానాయకుడు పూర్తిగా గాడి తప్పడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇది ఎన్టీఆర్ గురించి తీసిన సినిమా? లేక చంద్రబాబును పైకెత్తడానికి తీసిన సినిమా? అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడుదల చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో అత్యంత దుర్భరమైన వెన్నుపోటు ఘటనను చూపించకపోవడం కావాలనే పక్కన పెట్టినా... విలన్ పాత్రలో ఉండాల్సిన వ్యక్తిని హీరో పాత్రలో చూపించడం ప్రేక్షకులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిన వెన్నుపోటు ఘటనలో ముద్దాయిని చూపించకపోయినప్పటికీ ఎన్టీఆర్, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ ఒక మునిగిపోతున్న నావగా చిత్రీకరించడమే కాకుండా ఆ నావను ఒడ్డుకుచేర్చి కాపాడిన మహోన్నత వ్యక్తిగా బాబును చిత్రీకరించారు. ఈ వక్రీకరణలు మింగుడుపడని అభిమానులు సోషల్‌మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుడికి బాబు మహానాయకుడా..లేక ఎన్టీఆర్ మహానాయకుడా అన్న సందేహం వస్తుంది. కథను కథనాన్ని గమనిస్తే బాబుకోసం ఈబయోపిక్ ను బలిపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో సహజంగానే అందరి దృష్టి ఇప్పుడు వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై పడింది. సినిమాను ప్రకటించినప్పటి నుంచి సాధారణ ప్రేక్షకుడు సైతం.. వర్మ తీస్తున్న సినిమాపైనే ఆసక్తి చూపించాడన్న సంగతి తెలిసిందే. మహానాయకుడు ఎక్కడ ముగిసిందో.. ఎన్టీఆర్ జీవితంలో అసలు కథ ఎప్పుడు మొదలైందో.. అక్కడి నుంచే వర్మ తన సినిమాను ప్రారంభించడమే అందరి దృష్టిలో పడటానికి కారణం. మహానాయకుడులో ఆకాశానికెత్తేసిన చంద్రబాబు.. అసలు రంగు వర్మ తీసిన సినిమాల్లో బయటపడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చలోక్తులు విసురుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ అంటూ హడావిడి సృష్టించిన బాలయ్య.. తన బావకు ఏదో మేలు చేద్దామని చేసిన ప్రయత్నం వృథా అయిందని ఆయన అభిమానులే పెదవి విరుస్తున్నారు. చదవండి : ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ రివ్యూ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ -
ఆ చిత్రంలో భయపడుతూనే నటించాను..
సినిమా: భయంతో భలే మేలు అంటోంది నటి కీర్తీసురేశ్. ప్రారంభ దశలోనే బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న కేరళ కుట్టి ఈ బ్యూటీ. చిన్నతనం నుంచే నటి నవ్వాలన్న ఆశను పెంచుకుంటూ వచ్చిన కీర్తీసురేశ్ తన కుటుంబసభ్యులు వద్దన్నా, ఎలాగో వారిని ఒప్పించి నటిగా రంగప్రవేశం చేసిన ఈ భామ అనతికాలంలోనే కథానాయకిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అలా ఆరంభ దశలో ఏ నటి సాహసించని మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం (మహానటి) చిత్రంలో సావిత్రిగా నటించి ఆ పాత్రకు తనకుంటే గొప్పగా ఎవరూ చేయలేరన్నట్లు ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో కమర్శియల్ చిత్రాల కథానాయకిగానూ తనదైన ముద్ర వేసుకున్న కీర్తీసురేశ్ కోలీవుడ్‌లో వరుసగా సామీస్క్వేర్, సండైకోళి–2, సర్కార్ అంటూ వరుసగా స్టార్స్ చిత్రాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్లో నటిస్తోంది. అదేవిధంగా మాతృభాషలోనూ నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన సినీ అనుభవాలను మీడియాతో పంచుకుంది. అవేంటో ఒక లుక్కేద్దాం. సినిమాను ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. అయితే నటీనటులకు సినిమానే జీవితం. ఒక్కో పాత్రను ఒక జీవితంలా అనుభవించినట్లు నటిస్తున్నాం. దర్శకులు చెప్పిన కథలు విన్న తరువాత అందులోని కథా పాత్రకు న్యాయం చేయగలమా? లేమా? అన్నది పదిసార్లు ఆలోచిస్తాం. ఆ పాత్రలు ప్రేక్షకులకు నచ్చుతాయా? అన్న కోణంలోనూ ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలతోనే అందరు నటీనటులు కథలను ఎంచుకుని నటిస్తున్నారు. ఇతరుల కంటే నాకు అలాంటి ప్రశ్నలు కాస్త ఎక్కువే. అలా ప్రశ్నించి నటించడం వల్ల నాకు మంచే జరుగుతోంది. ఒక్కో చిత్రంలో నటించే ముందు లక్ష ప్రశ్నలు, భయాలు కలిగినా అన్నింటికీ దర్శకుల వద్ద జవాబులుంటాయి. అయినా ఒక్కో చిత్రంలో నటించేటప్పుడు నాకు భయమేస్తుంది. ఆ భయంతోనూ నాకు మేలే జరుగుతోంది. భయం కారణంగా కథా పాత్రలపై మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది. సినిమా పయనం ఒక సస్పెన్స్ కథ మాదిరి ఉండాలి. మహానటి చిత్రంలో నటించేటప్పుడు భయపడుతూనే నటించాను. అయితే ఆ చిత్ర విజయంతో అనుభవించిన సంతోషాన్ని మాటల్లో చెప్పనలవికాదు అని లక్కీ బ్యూటీ కీర్తీసురేశ్ చెప్పింది. -
మహానటి తర్వాత...
‘మహానటి’ తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమాలేవీ సైన్ చేయలేదు కీర్తీ సురేశ్. తాజాగా కొత్త దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల మూడో వారం నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. ఇందులో కీర్తీ సురేశ్ లీడ్ రోల్లో కనిపిస్తారు. ఆమెతో పాటు మరో మూడు ముఖ్యమైన పాత్రలు ఉంటా యట. ‘మహా నటి’కి కెమెరామేన్‌గా వర్క్ చేసిన డ్యానీ ఈ సినిమాకి కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తీ అంగీకరించిన సినిమా ఇదే కావడం, ఆ సినిమా తర్వాత డ్యానీ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని మహేశ్ యస్.కోనేరు నిర్మిస్తున్నారు. కల్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. -
గుర్తింపు తమిళసినిమాతోనే!
సినిమా: నటిగా నాకు గుర్తింపునిచ్చింది తమిళసినిమానేనని నటి కీర్తీసురేశ్ పేర్కొంది. మహానటి చిత్రంతో అన్ని వర్గాల వారి మనసుల్లోనూ చోటు సంపాదించుకుని ప్రశంసల జల్లుల్లో పులకరించిన ఈ బ్యూటీ కమర్శియల్ చిత్రాల్లోనూ మంచి పేరే తెచ్చుకుంటోంది. కేరళకు చెందిన కీర్తీసురేశ్ది సినీ కుటుంబం అన్న విషయం తెలిసిందే. మాతృభాషలో నటనకు శ్రీకారం చుట్టిన ఈ భామ ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లోనూ తనదైనముద్రవేసుకుంటోంది. ఇటీవల కోలీవుడ్‌లో సర్కార్, సామి స్క్వేర్, సండైకోళీ–2 చిత్రాల్లో వరుసగా నటించిన కీర్తీసురేశ్‌కు ప్రస్తుతం ఇక్కడ ఒక్క చిత్రం కూడా చేతిలో లేదు. విశ్రాంతి లేకుండా నటించిన తాను కొంత విరామం కోరుకుంటున్నానని చెప్పింది. అయితే మలయాళంలో ఒక చిత్రం, తెలుగులో మరొక చిత్రం చేస్తూ ఖాళీ అంటూ లేకుండానే నటిస్తోంది. మధ్య, మధ్యలో వాణిజ్య ప్రకటనల్లో, కొత్త దుకాణాలకు రిబ్బన్ కటింగ్‌లకు వెళుతూ ఆ విధంగానూ ఆదాయాన్ని గడించేస్తోంది. అలా ఇటీవల తమిళనాడులో సందడి చేసిన కీర్తీసురేశ్ మీడియా ముందుకు వచ్చింది. ఆ ముచ్చట్లేంటో చూద్దామా? నేను నటిగా మలయాళంలో పరిచయం అయినా గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం తమిళసినిమానే. నిజం చెప్పాలంటే చదువుకునే రోజుల్లో నాకు నటనపై ఆసక్తిలేదు. మోడలింగ్ రంగంలోకి వెళ్లాను. అయితే దేవుడి అనుగ్రహంతో సినిమా నటిగా మారాను. మలయాళంలో ఒక చిత్రం చేయగానే కోలీవుడ్‌లో అవకాశం విచ్చింది. నటిగా శ్రమించే ఈ స్థాయికి చేరుకున్నాను. తమిళసినిమా గురించి చెప్పాలంటే కొత్త కొత్త దర్శకులు పరిచయం అవుతూ వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులూ చాలా తెలివిగా ఉన్నారు. మంచి చిత్రాలను కచ్చితంగా ఆదరిస్తున్నారు. నేను సాధ్యం అయినంత వరకూ మంచి కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. ఇందుకోసం తీవ్రంగా కృషిచేస్తున్నాను. కోలీవుడ్‌లో విజయ్ లాంటి స్టార్స్‌తో నటించాను. అజిత్‌తోనూ నటించాలన్న ఆశ ఉంది. అలాంటి అవకాశం వస్తే జారవిడుచుకోను. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేదు. అందుకు చాలా సమయం ఉంది. అదేవిధంగా రాజకీయాల గురించి అడుగుతున్నారు. వాటిపై కొంచెం కూడా ఆశ లేదు. నటిగానే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అని కీర్తీసురేశ్ పేర్కొంది. -
అలా మొదలైంది
అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’ సినిమాలో టైటిల్ రోల్ పోషించి, ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు కథానాయిక కీర్తీసురేశ్. ప్రస్తుతం సౌత్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న కీర్తీని ‘హీరోయిన్గా తన తొలి అవకాశం గురించి ఇటీవల ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఆ విషయం గురించి కీర్తి మాట్లాడుతూ – ‘‘నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ముందు నా స్టడీస్ కంప్లీట్ చేయాలనుకున్నాను. ఇంటర్ తర్వాత నాకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయ్యా. నాలుగేళ్లు చదవాలి. ఓ ప్రోగ్రామ్ కోసం కోర్స్ థర్డ్ ఇయర్లో లండన్ వెళ్లాను. ఆ టైమ్‌లో దర్శకుడు ప్రియదర్శన్ ఫోన్ చేశారు. త్వరగా వచ్చేయ్ సినిమా షూటింగ్ మొదలుపెడతాం అనగానే ఆశ్చర్యపోయాను. కానీ నాకు స్టడీస్ కంప్లీట్ చేయాలని ఉంది. ఆ టైమ్‌లో ఏం చేయాలో పాలుపోలేదు. ఈలోపు ప్రియదర్శన్ గారు నాకు యాక్టింగ్‌పై ఆసక్తి లేదు అనుకున్నట్లున్నారు. లక్కీగా నా ఫైనల్ ఇయర్లో ఓ ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం కొంత టైమ్ దొరికింది. ఆ టైమ్‌లోనే నా తొలి మూవీ ‘గీతాంజలి’తో పాటు రెండో సినిమా ‘రింగ్ మాస్టర్’ సినిమాల షూటింగ్‌ను మేనేజ్ చేయడంతో పాటుగా కష్టపడి అనుకున్న టైమ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి గ్రాడ్యుయేట్ అయ్యా. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్‌ని అని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు (సురేశ్‌కుమార్) ప్రియదర్శన్గారితో తొలి సినిమాను నిర్మించారు. నా తొలి సినిమా ప్రియదర్శన్‌గారి దర్శకత్వంలో రూపొందడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
మహానటికి సినీ సావిత్రి ధన్యవాదాలు
దివంగత మహానటి సావిత్రి కీర్తిని, ఆమె నటనను వర్ణించడానికి తెలుగు పదాలు చాలావనడం అతిశయోక్తి కాదేమో. ఆమె పేరు సినీ జగతిలో అజరామరం. ఇక ఇటీవల ఆమెలా మహానటి చిత్రంలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్ ఎంతగానో పేరు తెచ్చుకుంది. మహానటి కీర్తీసురేశ్ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. అందుకు కారణం మహానటి సావిత్రినే అవుతారు.అది గుర్తించిన కీర్తిసురేశ్ సావిత్రి జయంతిని పురస్కరించుకుని ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఒక లేఖను రాసి తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఎప్పుడూ గుర్తుంచుకునే మీ కోసం ఇది రాస్తున్నాను. మీరే మమ్మల్ని ఎంచుకున్నారు. మమ్మల్ని ప్రేమతోనూ, ఆశీర్వాదాలను అందించారు. మేమిక్కడ నిలబడడానికి, వ్యతిరేకతను అధిగమించడానికి, ఎల్లలు దాటడానికి, అన్నివిధాలా శక్తిని మీరే ఇచ్చారు. మేము పొందుతున్న అన్నిటికీ అర్హులమని భావించేలా చేశారు. మిమ్మల్ని నేను కూడా సంతోషపడేలా చేశానని భావిస్తున్నాను. మహానటి చిత్రంతో మిమ్మల్ని మళ్లీ ఈ లోకానికి తీసుకొచ్చి మీకు మేము న్యాయం చేశాం అని నమ్ముతున్నాను. మాకు చేతనైంది మేము చేశాం. అయితే మిమ్మల్ని మరిపించడం ఎవరి తరంకాదు. మీరు మా జీవితాలను మార్చేశారు. ధన్యవాదాలు సావిత్రి అమ్మా’ అని కీర్తీసురేశ్ ట్వీట్ చేశారు. -
అలాంటి పాత్రల్లో నటించను : కీర్తి సురేష్
కీర్తిసురేశ్ ఈమె పేరులోనే కీర్తి ఉందనుకుంటే ఇప్పుడు తన ప్రతిభతోనూ ఆ పేరును సార్ధకం చేసుకుంటోంది. నిజం చెప్పాలంటే ఆమె తల్లి మేనక సాధించలేని కలలను ఈ అమ్మడు నెరవేర్చుతోందని చెప్పవచ్చు. మేనక రజనీకాంత్‌కు జంటగా నెట్రకన్ చిత్రంలో నటించినా, ఆ తరువాత తమిళంలో పెద్దగా పేరు తెచ్చే చిత్రాల్లో నటించలేదు. మలయాళీ చిత్ర నిర్మాత సురేశ్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అలా ఆమె వారసురాలిగా పరిచయమైన కీర్తీసురేశ్ నటించిన తొలి చిత్రం ఇదు ఎన్న మాయం నిరాశపడడంతో ఈ అమ్మడికి నటిగా పెద్దగా భవిష్యత్తు ఉండదేమో అనే టాక్ అప్పట్లో వినిపించింది. అలాంటిది రజనీమురుగన్, రెమో వంటి చిత్రాలు వరుసగా విజయం సాధించడం, మహానటి చిత్రంలో సావిత్రిని మరిపించడం వంటివి కీర్తీసురేశ్ స్థాయిని పెంచేశాయి. అంతే స్టార్ హీరోలు విజయ్, విశాల్, విక్రమ్ వంటి వారితో నటించేసి స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది. మరో విషయం ఏమిటంటే కమర్శియల్ చిత్రాల్లో నటించాలంటే అందాలు ఆరబోయాలనే ట్రెండ్‌ను బ్రేక్ చేసిన నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నింటిలోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే తెచ్చుకుంది. ఇకపై కూడా ఇలానే నటిస్తానంటోంది. ప్రస్తుతం కొత్త చిత్రాల ఎంపికలో బిజీగా ఉన్న కీర్తీసురేశ్ ఆమెను వెతుకుంటూ వస్తున్న గ్లామర్ పాత్రలను సున్నితంగానే తిరస్కరిస్తోందట. దీని గురించి ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ గ్లామర్ పాత్రల్లో నటించి చాలా సంపాందించుకోవచ్చునని, అయితే అలాంటి పాత్రల్లో నటించడం తనకు సమ్మతం కాదని చెప్పింది. మహానటి చిత్రంలో నటించనట్లుగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. చాలా డబ్బు సంపాదించాలనే కంటే కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న బలమైన పాత్రల్లో నటించి ఆత్మ సంతృప్తి పొందాలన్నదే తన ఆశ అని పేర్కొంది. ఈ బ్యూటీ త్వరలో బాహుబలి ఫేమ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. -
అలాంటి చిత్రాల్లో నటించడం చాలా అవసరం
తమిళసినిమా: అలాంటి చిత్రాల్లో నటించడం హీరోయిన్లకు చాలా అవసరం అంటోంది నటి కీర్తీసురేశ్. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న నటి ఈ బ్యూటీ. నాన్న మలయాళం, అమ్మ తమిళం కావడంతో తాను ఆడా ఉంటా.. ఈడా ఉంటానంటూ మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో నటిస్తున్న కీర్తీసురేశ్‌ను కోలీవుడ్ ఎక్కువగా ఓన్ చేసుకుందని చెప్పవచ్చు. ఇక్కడ విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్, శివకార్తీకేయన్, విక్రమ్‌ప్రభు అంటూ వరుసగా స్టార్ హీరోలతో నటించేసింది. విశేషం ఏమిటంటే విక్రమ్, విశాల్‌లతో సీక్వెల్ చిత్రాల్లో కీర్తీ నటించడం. ఇక విజయ్‌తో నటించిన సర్కార్ ఇటీవల పలు వివాదాల మధ్య తెరపైకి వచ్చి వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్‌తో చిన్న భేటీ. ప్ర: సర్కార్, సండైకోళి చిత్రాల్లో నటి వరలక్ష్మీతో కలిసి నటించడం గురించి? జ: ఆ రెండు చిత్రాల్లో వరలక్ష్మి, నేను నటించినా, ఏ చిత్రంలోనూ మేమిద్దరం కలిసి నటించే సన్నివేశాలు లేవు. అయితే మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగో సమస్యలు లేవు. మంచి స్నేహమే ఉంది. ప్ర: మహానటి చిత్రం మాదిరి మరో బయోపిక్‌లో నటించే అవకాశం ఉందా? జ: లేదు లేదు. సావిత్రి జీవిత చరిత్ర చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని, పరిపక్వతను, సంతోషాన్ని కలిగించింది. మరోసారి అలా నేను నటించగలనా? అన్నది సందేహమే. అంతగా ఆ చిత్రం వచ్చింది. అది ఒక మ్యాజిక్. అదే విధంగా తరచూ అలాంటి పాత్రల్లో నటించడం కూడా సరి కాదు. భారీ కమర్షియల్ చిత్రాల్లోనూ నటించడం హీరోయిన్లకు చాలా అవసరం. ప్ర: జయలలిత పాత్రలో నటించే అవకాశం వస్తే నటిస్తారా? జ: ప్రస్తుతానికి ఎవరి బయోపిక్‌లోనూ నటించాలనుకోవడం లేదు. సావిత్రి పాత్రలో నటించడమే చాలా సంతృప్తి కలిగించింది. ప్ర: నటనకు గ్యాప్ ఇస్తున్నారటగా? జ: అవును. నటిగా పరిచయం అయినప్పటి నుంచే తీరిక లేకుండా చాలా బిజీగా నటిస్తున్నాను. అందుకే కొన్ని నెలలు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 20కి పైగా కథలు విన్నాను. త్వరలోనే నూతనోత్తేజంతో నటించడానికి సిద్ధం అవుతా. ప్ర: మహానటి చిత్రం తరువాత పారితోషికం పెంచినట్లు జరుగుతున్న ప్రచారం గురించి? జ: అసలు కొత్తగా చిత్రాలే అంగీకరించలేదు. పారితోషికం పెంచానన్న ప్రచారంలో అర్ధం లేదు. ప్ర: ఏ నటుడితో నటించాలని కోరుకుంటున్నారు? జ: కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విశాల్, విక్రమ్ వంటి ప్రముఖ హీరోలతో నటించాను. నటుడు అజిత్‌తో నటించాలని ఆశగా ఉంది. ప్ర: తొడరి లాంటి చిత్రాల అపజయం బాధించిందా? జ: లేదు. నిజం చెప్పాలంటే జయాపజయాలను నేను ఒకేలా చూస్తాను. అన్నీ నచ్చి చేసిన చిత్రాలే. అలాంటి చిత్రాల నుంచి చాలా నేర్చుకుంటాను. -
మహానటికి అరుదైన గౌరవం
లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పనోరమాలో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానటి సినిమా తెరకెక్కింది. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అంచనాలకు మించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో గోవాలో జరగనున్న 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)ఉత్సవాలలో ప్రదర్శనకు మహానటి సినిమా ఎంపికైంది. హిందీ, తమిళ, మలయాళం, తుళు ఇలా భారతీయ భాషల నుంచి 22 నాన్ ఫీచర్ చిత్రాలకు ఈ చిత్రోత్సవాలలో ప్రదర్శనకు చోటు దక్కింది. తెలుగు నుంచి ఆ గౌరవం మహానటికి మాత్రమే దక్కింది. -
మీ మేనత్త శ్రీలక్ష్మి సిఫార్సు చేయలేదా?
సినిమా: మహానటి లాంటి చిత్రాలు ఎప్పుడో పదేళ్లకొక్కసారి వస్తాయని నటి ఐశ్వర్యారాజేశ్ అన్నా రు. ఆరణాల అచ్చతెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీ తమిళసినిమాలో మంచి నటిగా రాణిస్తున్నా రు. నటనకు అవకాశం ఉంటే చాలు అది పెద్దదా? చిన్నదా? అన్న ఆలోచన లేకుండా నటించడానికి సి ద్ధం అంటున్న ఐశ్వర్యారాజేశ్ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలా కాక్కాముట్టై చి త్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో చెక్క సివంద వానం(తెలుగులో నవాబ్) నటించే అరుదైన అవకాశాన్ని కూ డా దక్కించుకున్న ఐశ్వర్యారాజేశ్ ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్ర సక్సెస్ అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను ఈ బ్యూటీ సాక్షితో పంచుకున్నారు. ఆ ముచ్చట్లేమిటో చూసేద్దామా! ప్ర: మణిరత్నం దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి? జ:చాలా ఆనందంగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతి నటీ కలలు కంటుంది. అలాంటి అవకాశం ఇంత త్వరలో వస్తుందని నేను ఊహించలేదు. ప్ర: సెక్క సివంద వానం చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది? జ:నిజం చెప్పాలంటే కాట్రువెలియిడై(తలుగులో చెలియా) చిత్రం నిర్మాణం సమయంలో మణిరత్నం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. అయితే అది నటి అధితిరావు పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి అని తెలిసింది. అయినా నా వాయిస్ ఆమెకు సెట్ కాలేదు. మరోసారి అలాంటి ఫోన్‌నే వచ్చింది. ఈ సెక్క సివంద వానం చిత్రం ప్రారంభం సమయంలోనూ మణిరత్నం కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో అదీ అలాంటిదేదో అయ్యి ఉంటుందిలే అనుకున్నాను. అయితే చిత్రంలో నటించాలని చెప్పినప్పుడు నిజమేనా? అని నమ్మలేకపోయాను. నిజం కావడంతో కల నిజమైందని సంతోష పడ్డాను. నేను ఇంతకు ముందు చాలా చిత్రాల్లో నటించినా, యాక్టింగ్ అంటే ఎలా ఉంటుందన్నది మణిరత్నం నుంచి నేర్చుకున్నాను.ఆయనలో మ్యాజిక్ ఉంది. ఈ చిత్రం నాకోక పాఠం. ప్ర: సెక్క సివంద వానం చిత్రంలో మీ పాత్ర గురించి? జ:ఇందులో నేను సిలోన్ అమ్మాయిగా నటించాను. ప్ర: ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది.మీకు అలాంటి చిత్రంలో నటించాలన్న కోరిక ఉందా? జ: నిజం చెప్పాలంటే బయోపిక్ కథా చిత్రాలు ఎప్పుడో గానీ రూపొందవు. మహానటి చిత్రంలో కీర్తీసురేశ్ చాలా బాగా నటించారు. అయితే అలాంటి పాత్రలు అరుదుగానే లభిస్తుంటాయి. అలాంటి కథా చిత్రం అమిరితే కచ్చితంగా నటిస్లాను. నా కేరీర్లో ఒక మరపురాని చిత్రంగా కనా చిత్రం నిలిచిపోతుంది. ప్ర: తెలుగు అమ్మాయి అయ్యి ఉండి తెలుగు చిత్రాల్లో నటించడం లేదే? జ:నిజం చెప్పాలంటే తెలుగులో నటించాలని నాకూ ఉంది. అయితే అక్కడ సరైన అవకాశాలు రాలేదు. కొన్ని వచ్చినా మంచి కథా పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. అయితే అలాంటి అవకాశం ఒకటి ఇప్పుడు వచ్చింది. త్వరలోనే ఒక భారీ చిత్రంలో నటించనున్నాను. ఆ వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ప్ర: మీ మేనత్త శ్రీలక్ష్మి తెలుగులో ప్రముఖ నటి. ఆమె సిఫార్సు చేయలేదా? జ: అత్త శ్రీలక్ష్మి కొన్నాళ్లు హైదరా బాద్, కొన్నాళ్లు చెన్నైలో నివశిస్తుంటారు. చెన్నైకి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తారు. అయితే ఎందుకనో సిఫార్సు చేయమని నేనూ అడగలేదు. ఆమె చేయలేదు. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ:ధనుష్‌కు జంటగా నటించిన వడచెన్నై త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అదే విధంగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా ధ్రువనక్షత్రంలో పాలు మరి కొన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్ర: తెలుగులో ఏ హీరోతో నటిం చాలని కోరుకుంటున్నారు? జ: తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇలా చాలా మంది నచ్చిన హీరోలు ఉన్నారు. ముఖ్యంగా ప్రభాష్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే వదులుకోను. -
కీర్తి ఖాతాలో మరో క్రేజీ మూవీ
నటుడు శశికుమార్‌తో లక్కీ కథానాయకి కీర్తీసురేశ్ జత కట్టనుందన్నది తాజా సమాచారం. కీర్తీసురేశ్ కోలీవుడ్‌కు పరిచయమైన చిత్రం ఇది ఎన్న మాయం చిత్రం పర్వాలేదనిపించుకున్నా, మలి చిత్రం నుంచే ఈ బ్యూటీ విజయ పరంపర ప్రారంభమైంది. అది ఇటీవల నటించిన మహానటి వరకూ కొనసాగింది. అంతే కాదు మహానటి చిత్రానికి ముందు ఆ తరువాత అన్నంతగా కీర్తీసురేశ్ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో రెండు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో విక్రమ్‌కు జంటగా నటించిన సామి స్క్వేర్ చిత్రం ఈ వారమే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇక విశాల్‌తో రొమాన్స్ చేసిన సండైకోళి–2 వచ్చే నెల విడుదల కానుంది. ఆ తరువాత విజయ్ సరసన నటించిన సర్కార్ దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఈ మూడు చిత్రాలపైనా భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా కీర్తీసురేశ్ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆమె నటుడు శశికుమార్‌తో జతకట్టడానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇంతకు ముందు శశికుమార్ కథానాయకుడిగా సుందరపాండియన్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎస్ఆర్.ప్రభాకరన్ తాజాగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో ఉదయనిధిస్టాలిన్ హీరోగా ఇదు కధిరవేలన్ కాదల్, విక్రమ్‌ప్రభు హీరోగా క్షత్రియన్ చిత్రాలను చేశారు. అవిఆశించిన విజయాలను అందించకపోవడంతో ఈ దర్శకుడు మళ్లీ తన తొలి చిత్ర హీరో వద్దకే వచ్చారు. ఈ చిత్రానికి కొంబు వచ్చ సింగం అనే టైటిల్‌ను నిర్ణయించారు. బిగ్‌బాస్ ఆరవ్, సూరి, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించనున్న ఇందులో కథానాయకి పాత్రకు నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. నటుడు శశికుమార్‌కు ఇటీవల సరైన హిట్ పడలేదు. కీర్తీసురేశ్ లక్కుతోనైనా ఈ చిత్రం సక్సెస్ అవుతుందని ఆశిద్దాం. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న కొంబు వచ్చ సింగం చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, పొల్లాచ్చి ప్రాంతాల్లో చిత్రీకరించుకోనుందట. -
చాన్సు ఇస్తే కన్నడలోనూ నటిస్తా
జయనగర: జయనగరలో మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ సందడి చేశారు. ఏవీఆర్ జ్యువెలర్స్‌ను శాఖ ను ఆదివారం జయనగర నాలుగోబ్లాక్‌లోని డికెన్సన్రోడ్డులో ఆమె ప్రారంభించారు. మహారాజుల కాలంనాటి ఆకర్షణీయమైన ఆభరణాలతో పాటు విభిన్న డిజైన్ల నగలు ఉన్నాయని అన్నారు. దక్షిణాదిలో కొన్ని భాషల సినిమాల్లో తాను నటించలేదని, అవకాశం వస్తే నటించడానికి సిద్ధమని ఆమె తెలిపారు. తనను చూడాలని ఇక్కడకు పెద్దసంఖ్యలో విచ్చేసిన అభిమానులను చూస్తే ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఇక్కడ తన అభిమానులు కన్నడభాషలో నటించాలని, త్వరలోనే మంచి అవకాశం లభించాలని కోరుతున్నారని చెప్పారు. -
యూనిట్ అందరికీ బంగారు నాణేలను కానుకగా..
తమిళసినిమా: సహ నటీనటులకు, సాంకేతిక వర్గానికి షూటింగ్ పూర్తి కాగానే బంగారు డాలర్లను కానుకగా అందించే సంప్రదాయానికి ఆనాటి మహానటి సావిత్రి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఎవరూ అలాంటి సంప్రదాయాన్ని పెద్దగా పాటించలేదు. అలాంటిది ఆ మహానటి పాత్రలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్ ఆమె గుణగణాలను పుణికిపుచ్చుకున్నారా?అన్నంతగా మహానటి చిత్ర షూటింగ్ పూర్తి కాగానే యూనిట్ అందరికీ బంగారు నాణేలను కానుకగా అందించారు. అదే సంప్రదాయాన్ని తన తాజా చిత్రం సండైకోళి–2 చిత్ర షూటింగ్ ముగింపు రోజునా కీర్తీసురేశ్ కొనసాగించారు. ఆ ఆనందం నుంచి బయట పడకుండానే తాజాగా అదే చిత్ర కథానాయకుడు, నిర్మాత విశాల్, దర్శకుడు లింగుస్వామి యూనిట్ సభ్యులు 150 మందికి విడివిడిగా బంగారు నాణేలను కానుకగా అందించి సంతోషంలో ముంచెత్తారు. ఈ దర్శక నిర్మాతలకు నటి కీర్తీశురేశ్ స్ఫూర్తి అనిపించారేమో. విశాల్ హీరోగా నటిస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సండైకోళి–2. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా విశాల్, దర్శకుడు లింగుస్వామి చిత్ర యూనిట్ సభ్యులకు బంగారు నాణేలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కేరళా రాష్ట్ర వరద బాధితుల సహాయార్థం ఆ రాష్ట్ర ముఖ్యమంతి సహాయనిధికి రూ.2లక్షల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న సండైకోళి–2 చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర సింగిల్ ట్రాక్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రం తమిళం, తెలుగు భాషల్లో అక్టోబరు 18న విడుదలకు ముస్తాబవుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
గోల్డెన్ బయోపిక్స్ ఇవి వస్తే బాగుండు!
భారతీయ సినిమాకు ఆద్యుడైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 1913లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించాడు. హరిశ్చంద్రుడు నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ సినిమా తీయడానికి దాదా సాహెబ్ ఫాల్కే కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ను తీయడం వెనుక పడిన కష్టాన్ని, తపనని, జీవితాన్ని ఆధారం చేసుకొని మరాఠీలో ‘హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ’ అనే సినిమా తీశారు 2010లో. మనకు సినిమా ఇచ్చిన మహనీయునికి సినిమా ద్వారా ప్రకటించగలిగిన నివాళి అది. కాని తెలుగులో అలాంటి నివాళి మరో ఎనిమిదేళ్లు గడిస్తే తప్ప రాలేదు. సావిత్రి పై తెరకెక్కించిన ‘మహానటి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తొలి బయోపిక్. అయితే సావిత్రి గురించి మాత్రమే బయోపిక్ తీస్తే సరిపోతుందా? నిజానికి మన ఇండస్ట్రీ ఎందరి బయోపిక్లకో బాకీ పడి ఉంది. అవన్నీ నిజరూపు దాలిస్తే తెలుగు ప్రేక్షకులకు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు. బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఎందరి బయోపిక్‌లు ఇంకా తీయవలసి ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ల జీవితం వెండితెర మీద ఎందుకు ఆసక్తికరమో కూడా పరిశీలిద్దాం. చిత్తూరు నాగయ్య ఒకరి జీవితం ఎప్పుడు ఆసక్తిగా ఉంటుందంటే ఆ జీవితంలో నాటకీయ పరిణామాలున్నప్పుడు. చిత్తూరు నాగయ్య తెలుగువారికి సంబంధించి చాలా పెద్ద సింగింగ్ స్టార్. ఇంకా చెప్పాలంటే సింగింగ్ స్టార్ల తరానికి ఆయన ఆఖరు ప్రతినిధి. ఆయన చూసిన స్టార్డమ్ అంతకు ముందు ఎవరూ చూడలేదు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన గీతాలను, సంగీతాన్ని తెలుగువారికి ఇచ్చారు. ఇక ఆయన దానధర్మాల గురించి చాలా కథలే ఉన్నాయి. అంత ఐశ్వర్యం చూసి ఆ తర్వాత దెబ్బ తినడం, కార్లు బంగళాలు పోగొట్టుకోవడం, తన తర్వాత వచ్చిన వారు స్టార్డమ్కు చేరుకున్నా కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో హుందాతనంతో గొప్ప గొప్ప పాత్రల్లో నటించడం ఇవన్నీ ఒక మంచి బయోపిక్కు విలువైన సరంజామా అవుతుంది. నాగయ్య బయోపిక్ వల్ల తొలినాటి తెలుగు సినిమా చరిత్ర కూడా చెప్పినట్టవుతుంది. కె.వి.రెడ్డి తెలుగు దర్శకులలో ఎవరి గురించైనా మొదటి బయోపిక్ తీయదలిస్తే కె.వి.రెడ్డే అందరి ఎంపిక అవుతారనేది వాస్తవం. జనాకర్షక సినిమా ఫార్ములాను కనిపెట్టి సూపర్‌డూపర్ హిట్స్ తీసిన కె.వి.రెడ్డి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ చిత్రాలతో మలుపు తిప్పారు. రాయలసీమ నుంచి వచ్చి మద్రాసులో స్థిరపడి నాగిరెడ్డి, చక్రపాణి వంటి ఉద్దండులతో కలిసి పని చేస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన కె.వి.రెడ్డి బయోపిక్ చాలా విలువైనది అవుతుంది. అసలు ఆయన ‘మాయాబజార్’ ఎలా తీసి ఉంటాడు అన్న ఒక్క అంశాన్ని తీసుకొని కూడా ఒక బయోపిక్ తీస్తే ఎంతో బాగుంటుందని అభిమానులు అనుకుంటే అందులో కాదనేమాట ఏమైనా ఉంటుందా? అదే జరిగితే పింగళి నాగేంద్రరావు, మార్కస్బాట్లే, ఆర్ట్ డైరెక్టర్ గోఖలే... వీళ్లను కూడా తెర మీద చూడొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్.టి.ఆర్ బయోపిక్ తయారవు తున్న సందర్భంగా నాగార్జునను అక్కినేని బయోపిక్ గురించి ప్రశ్నించినప్పుడు ‘అంత డ్రమెటిక్ సంఘటనలు ఏమున్నాయని నాన్నగారి జీవితంలో బయోపిక్ తీయడానికి’ అన్నారు. నిజానికి అక్కినేని జీవితంలో ఉన్న డ్రమెటిక్ సంఘటనలు మరొకరి జీవితంలో లేవు. ఆయనకు చదువు లేదు. నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి పోషించి బాడీ లాంగ్వేజ్ ప్రభావితం అయి ఉంది. మద్రాసు చేరుకున్నాక ముందు జానపద హీరోగా మారి ఆ తర్వాత సోషల్ హీరోగా స్థిరపడడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. గొంతు విషయంలో, పర్సనాలిటీ విషయంలో ఉన్న పరిమితులను జయించడానికి మరెంతో స్ట్రగుల్ చేశాడాయన. మరోవైపు గొప్ప కంఠం, పర్సనాలిటీ ఉన్న ఎన్.టి.ఆర్తో సరిసాటిగా నిలవడానికి, ఆత్మవిశ్వాసంతో పోరాడటానికి ఆయన చేసిన కఠోర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హైదరాబాద్‌కు వలస రావడం, స్టూ్టడియో కట్టడం, కెరీర్ పీక్‌లో ఉండగా మసూచి రావడం, గుండె ఆపరేషన్ వల్ల కెరీర్‌కే దూరమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడటం, వీటన్నింటిని జయించి పెద్ద హీరోగా కొనసాగగలగడం... ఇవన్నీ బయోపిక్ తీయడానికి ఎంతో సరిపోతాయి. జమున దక్షిణాది వారికి యమున తెలుసు. కానీ ఉత్తరాది పేరు జమునతో పాపులర్ అయిన అచ్చ తెలుగు స్టార్ జమున. తెలుగువారి తొలి లాంగ్ స్టాండింగ్ గ్లామర్స్టార్గా ఈమెను చెప్పుకోవచ్చు. భానుమతి, సావిత్రి, బి.సరోజ, రాజశ్రీ వంటి బొద్దు హీరోయిన్ల నడుమ సన్నగా, లావణ్యంగా ఉంటూ గ్లామర్‌ను మెయిన్‌టెయిన్ చేశారామె. పురాణాల్లో సత్యభామ కన్నా సినిమాల్లోని ఈ సత్యభామే తెలుగువారికి ఎంతో ప్రియం అంటే జమున ఆ పాత్రను ఎంత గొప్పగా పోషించారో తెలుస్తుంది. సత్యభామ తీరుకు తగినట్టుగానే జమునలో కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండు. కొన్ని స్పర్థల వల్ల ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ వంటి సూపర్స్టార్లు తమ సినిమాల నుంచి ఆమెను దూరంగా పెట్టినప్పుడు చెదరకుండా, కంగారుపడి రాజీ కుదుర్చుకోకుండా స్థిరంగా నిలబడి పోరాడిన వనిత ఆమె. ఆ సమయంలో హిందీలో కూడా నటించి అక్కడా పేరు గడించారు. హరనాథ్‌ను తెలుగువారి ఆల్టర్నేట్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో జమున పాత్ర ఎంతో ఉంది. రాజకీయాలలో కూడా సక్సెస్ అయిన జమున జీవితం ఒక మంచి బయోపిక్. రాజబాబు చార్లిచాప్లిన్ కథకు రాజబాబు కథకు అట్టే తేడా లేదు. ఒక కమెడియన్‌గా రాజబాబు సాధించినంత క్రేజ్ ఎవరూ సాధించలేదు. రాజబాబు పోస్టర్ మీద ఉంటే ఆ సినిమాలు ఆడేవి. రాజబాబు సినిమాలో ఉంటే డిస్ట్రిబ్యూషన్ చాలా సులువైపోయేది. మద్రాసులో అవకాశాలు రాక ముందు రాజబాబు ట్యూషన్లు చెప్పారు. పస్తులు పడుకున్నారు. తాను గొప్ప స్టార్ అయ్యాక ఖరీదైన కారు కొన్నాక ఏ పేవ్మెంట్ మీద పడుకున్నారో ఆ పేవ్మెంట్ దగ్గరకు వెళ్లి నిలుచునేవాడాయన. పేదల అవస్థలు అనుభవించినవాడు కనుక పేదలకు విపరీతమైన దాన ధర్మాలు చేసేవాడు. ఆయన ఉంటే తమను చూడరు అని పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్లో రాజబాబును పెట్టుకోవడానికి జంకేవారు. రాజబాబు కమెడియన్‌గా ఎంత దుడుకు హాస్యం చేసినా నిజ జీవితంలో తాత్వికుడు. హాస్యనటుడైన కిశోర్ కుమార్ గంభీరమైన సినిమాలు తీసినట్టే తెలుగులో రాజబాబు ‘మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి గంభీరమైన సినిమాలు తీశారు. మద్యపానం ఆయనను 48 ఏళ్ల వయసుకే మృత్యువును చేరువ చేసింది. రాజబాబు బయోపిక్ తీయడం అంటే పరోక్షంగా రమాప్రభ బయోపిక్ తీయడమే. ఒక గొప్ప హాస్యజంటను వెండితెర మీద నిక్షిప్తం చేయవచ్చు ఈ సినిమా తీస్తే. సూర్యకాంతం ఒక గయ్యాళి ప్రేక్షకులకు ఇంత అభిమానమైన వ్యక్తిగా మారగలదా? ఒక గయ్యాళి పేరును భావి తరాలలో ఎవరికీ పెట్టలేని స్థాయిలో ఆమె ముద్ర వేయగలిగిందా? ఒక నటి పేరే ఒక స్వభావం పేరుగా మారడం వెనుక ఆ నటి చేసిన ప్రయాణం ఏమిటి? సూర్యకాంతం కథ చెప్పుకోవడం అంటే తెలుగు సినిమాలో స్త్రీ సహాయక పాత్రల చరిత్ర చెప్పుకోవడమే. నాటి సినిమాలలోనే కాదు నేటి సీరియల్స్‌లో కూడా కథ నడవడానికి సూర్యకాంతం పాత్రే కీలకం అని గ్రహిస్తే ఆమె ఎన్ని సినిమాలను ప్రభావితం చేసి ఉంటుందో ఊహించవచ్చు. తెర జీవితానికి నిజ జీవితానికి పోలిక లేని ఈ నటి బయోపిక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పడంలో సంశయం లేదు. సూర్యకాంతం బయోపిక్ తీయడం అంటే రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభంల బయోపిక్‌ను పరోక్షంగా తీయడమే. ఈమె సినిమా తీయడం కష్టం కాకపోవచ్చు. కానీ ఈమె పాత్రను పోషించే నటిని వెతికి తేవడం మాత్రం కష్టం. ఎందుకంటే సూర్యకాంతం లాంటి సూర్యకాంతం మళ్లీ పుట్టలేదు కనుక. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బాలూ బయోపిక్ అంటే తెలుగు సినిమా సంగీత ప్రయాణాన్ని వెండితెర మీద చూడటమే. ఘంటసాల వంటి లెజండ్ మార్కెట్లో ఉన్నప్పుడు గాయకుడిగా నిలదొక్కుకోవడానికి బాలూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, కఠోర శ్రమతో ప్రయత్నించారు. సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఆయనను దగ్గరకు తీయడం, వారిద్దరి మధ్య అనుబంధం ఈ బయోపిక్‌లో ఒక ఎమోషనల్ పార్ట్ అవుతుంది. బాలూ పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అదీ ఆసక్తికరమైన మలుపు అవుతుంది కథలో. సూపర్ స్టార్ కృష్ణతో స్పర్థ ఒక ముఖ్య ఘట్టం. రామకృష్ణ విజృంభిస్తున్న రోజుల్లో ఏ.ఎన్.ఆర్కు పాడటానికి ఆయన ధోరణిని అనుకరించి హిట్ కొట్టడం, నెమ్మదిగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి ఆయన ప్రతిభ పరివ్యాప్తం కావడం ఎన్ని గంటల సినిమాకైనా ముడిసరుకే. బాలూ బయోపిక్‌లో తప్పనిసరిగా కనిపించే ఇతర పాత్రలు పి.సుశీల, ఎస్.జానకి, సంగీత దర్శకుడు చక్రవర్తి. బాలూ క్లోజ్‌ఫ్రెండ్, ఆయనకు సుదీర్ఘంగా సెక్రటరీగా పనిచేసిన విఠల్ కూడా ఒక ముఖ్య పాత్రధారి. బాలూకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కనుక ఆయన సినిమా అన్ని భాషలలో హిట్టయ్యే అవకాశం ఉంటుంది. వీరు మాత్రమే కాదు... ఎస్.వి.రంగారావు, ఘంటసాల, కత్తి వీరుడు కాంతారావు, బాపు–రమణ, సాలూరు రాజేశ్వరరావు, వాణిశ్రీ, హరనాథ్, దాసరి నారాయణరావు... వీరందరి బయోపిక్‌లు తీయదగ్గవే. కానీ బయోపిక్‌లు తీయడం కత్తిమీద సాము. గతంలో మణిరత్నం వంటి దర్శకులు కూడా ఎం.జి.ఆర్, కరుణానిధిలపై తీసిన బయోపిక్ ‘ఇద్దరు’ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. హిందీలో అజారుద్దీన్ పై తీసిన బయోపిక్ సఫలం కాలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కాంట్రవర్సీలు, ఎత్తి చూపదగ్గ అంశాలు ఉంటాయి. వాటిని కూడా ఒప్పించి బయోపిక్‌లు తీయగలిగితే కథలు లేని ఈ కాలాన వీటికి మించిన కథలు ఉండవు. -
మహానటి ఓ కథేనా?!
మహానటి సినిమా చూశారా? అయితే టైటిల్స్ గమనించారా? చూస్తే.. గమనిస్తే.. గార్లపాటి పల్లవి పేరు కనిపించిందా? ఇప్పుడు అదో సినిమా అయింది! సావిత్రి మీద అభిమానంతో ఆమె గురించి అక్కడ చదివి.. ఇక్కడ చదివి.. వాళ్లను వాకబు చేసి.. వీళ్లను వాకబు చేసి ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పుస్తకం రాశారు! సావిత్రి వాస్తవంగా ఓ మహానటి. అయితే.. మహానటి వాస్తవంగా సావిత్రి కాదు.. అని సోషల్ మీడియా వాల్స్ మీద ఈ మధ్య పోస్టర్లు వెలిసినప్పుడు.. మహానటి నిజంగానే ఓ కథేనా? లేక దాంట్లో వాస్తవాలున్నాయా అని తెలుసుకోవడానికి పల్లవిని పలకరించింది... సాక్షి. ‘మహానటి’.. సావిత్రిని ఈ తరానికి పరిచయం చేసిన సినిమా. అయితే అంతకుముందే ఆమె బయోగ్రఫీ వచ్చింది ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పేరుతో. ఆ పుస్తకాన్ని రాసింది సావిత్రి కుటుంబీకురాలో.. ఆమె సన్నిహితురాలో.. లేదా ఇంకే సినిమా పర్సనాలిటీనో కాదు. రచయిత అంతకన్నా కాదు. ఓ సాధారణ గృహిణి. గార్లపాటి పల్లవి. సావిత్రి పుస్తకంతోనే ఆమె రచయిత్రిగా మారారు. మహానటి సావిత్రి సినిమాకు ఓ సోర్స్‌గా కూడా మారారు. అయినా ‘‘ఆ సినిమా తెలుగువారి మహానటి కాదు.. మద్రాస్వారి మహానటి’’ అంటారు ఆమె. అన్ని వివరాలు పల్లవి మాటల్లోనే విందాం.‘‘నాకోసం నేను రాసుకున్న పుస్తకం సావిత్రి. ఆమె సినిమాలు పెద్దగా చూసిందీ లేదు. ఎందుకంటే నాకు ఊహ తెలిసేటప్పటికే సావిత్రి క్యారెక్టర్ రోల్స్‌కి వచ్చేశారు. ఆవిడంటే మా నాన్నగారికి చాలా ఇష్టమని మా అమ్మ చెప్తుండేది. అలా ఆవిడ నా మైండ్‌లో అచ్చయిపోయారు. నేను ట్వల్త్క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లోకి వీసీఆర్ వచ్చింది. అందులో మేం చూసిన మొదటి సినిమా ‘‘కన్యాశుల్కం’’. మధురవాణిగా సావిత్రిని ఎవరైనా మరిచిపోగలరా? ఆ తర్వాత 1990ల్లో మళ్లీ సావిత్రిగారి సినిమా చూశా. ఐ ఫాలెన్ ఇన్ లవ్ విత్ హర్. ఆ లవ్వే ఆమె బయోగ్రఫీ రాసేలా చేసింది. 2004లో అనుకుంటా ఘంటసాల గారి మీద రాసిన పుస్తకం చూపిస్తూ మాకు తెలిసినొకాయన..‘‘ దీని కోసం 6 లక్షలు ఖర్చయింది’’ అన్నారు. ‘నేనైతే సావిత్రి కోసం ఎన్ని లక్షలయినా ఖర్చుపెట్టేస్తా’ అన్నాను ఆసువుగా. అప్పటికి నాకు పెళ్లయి ముగ్గురు పిల్లలు. పాప ప్రణతి యూకేజీలో ఉంది. ఇద్దరు మగపిల్లలు ట్విన్స్ ఆకాశ్, పృథ్వీ. ఎల్కేజీలో ఉన్నారు. నేనూ ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా. ఆ పరీక్ష అయిపోయిన వెంటనే ఆ వ్యక్తికి కాల్ చేశా ‘‘అంకుల్ విల్ గో ఫర్ బుక్’’ అని. అప్పటిదాకా నేను క్లాసిక్స్ అనదగ్గవి 20 వరకూ చదివుంటా. కానీ ఎప్పుడూ రాయలేదు. డైరెక్ట్‌గా మహానటి సావిత్రే. ముందు భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్) గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన సావిత్రి ఫొటోస్ కొన్ని ఇచ్చారు, ఆ తర్వాత చెన్నైకి వెళ్లాను. ఫిల్మ్ న్యూస్ ఆనంద్‌ను కలిశాను. సంజయ్కిశోర్ను కలిశాను. దశాదిశ లేకుండానే.. నేను మామూలు హౌస్‌వైఫ్‌ని. సినిమాలతో కానీ, సినిమా వాళ్లతో కానీ మా ఫ్యామిలీకి ఎలాంటి స్నేహం లేదు. సావిత్రిగారిమీదున్న ప్రేమ, పుస్తకం రాయాలి అన్న సంకల్పమే తప్ప ఎవరిని కలవాలి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నవేమీ తెలియవు. గుమ్మడి గారిని కలిశాను. ఆయన రాసిన ‘తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు’ పుస్తకం తీసుకున్నాను. భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్)ను కలిస్తే ఆయన కొన్ని ఫొటోస్ ఇచ్చారు. సంజయ్ కిశోర్‌ను, జమున గారిని, కాంతారావుగారిని, చెన్నైలో ఫిల్మ్‌న్యూస్ ఆనంద్‌ను కలిశాను. అప్పుడే జమునగారి కూతురి పెళ్లి ఉండడంతో ఆమె తర్వాత కలవమని చెప్పారు. కానీ వెళ్లలేకపోయాను. కాంతారావు గారేమో బ్యాడ్ హెల్త్ కండిషన్లో ఉండి ఏమీ చెప్పలేక పోయారు. ఆతర్వాత విజయ చాముండేశ్వరి గారినీ కలిశాను. నా పిల్లలు చిన్నవాళ్లవడంతో అవుట్స్టేషన్స్కు వెళ్లడం కుదర్లేదు. సావిత్రిగారి మీది ఆర్టికల్స్, ఆమె ఇంటర్వ్యూ బాగా ఉపయోగపడ్డాయి. వనితాజ్యోతిలోని పసుపులేటి రామారావుగారు రాసిన ఆర్టికల్.. ఇంకా అలాంటివి చాలా. పుస్తకం రాయడం మొదలుపెట్టాక, ఇంకా చెప్పాలంటే పూర్తయ్యాక ఒక్కొక్కరూ తెలియడం మొదలుపెట్టారు. సావిత్రిగారి అక్క భర్త మా ఇంటి దగ్గరే ఉంటారని తెలిసింది. నాకు దొరికిన సోర్స్‌ని బట్టి రాస్తూ వచ్చాను. అలాగని గ్రౌండ్ వర్క్ చేయలేదని చెప్పను. విజయవాడ, సత్యనారాయణపురంలో సావిత్రిగారు వాళ్లున్న వీధికి వెళ్లా. ఆ తరం వాళ్లను కలిసి మాట్లాడా. అలాగే ఆవిడ స్కూల్ కట్టించిన ఊరికీ వెళ్లా. వేటపాలెం లైబ్రరీనీ కాంటాక్ట్ చేశా. సావిత్రిగారు లక్స్ యాడ్‌కు మోడలింగ్ చేశారన్న సంగతి ఆ లైబ్రరీతోనే తెలిసింది. పుస్తకంలో చాముండి పాత్ర పుస్తకం రాసేటప్పుడు అప్పటికప్పుడు నాకు తట్టిన పాత్ర అది. సావిత్రికి ఫ్రెండ్‌గా పెట్టాను. ఆమె జీవితంలో వెన్నంటి ఉండే పాత్ర. సినిమాలు తీయకు, దానాలు చేయకు, జెమినీని నమ్మకు అంటూ సావిత్రికి అడుగడుగునా మంచిచెడులు చెప్తుంటుంది. అయితే ఈ పాత్ర మాత్రమే కల్పితం. కానీ ఆ మిగిలినవన్నీ సావిత్రిగారి జీవితం లో జరిగినవే. మరెందుకు ఆ కల్పిత పాత్ర? అంటే చెప్పలేను. చాముండి వల్లే నా పుస్తకం అంతా ఫిక్టీషియస్ అనుకున్నారు. సూజెన్ హెవర్డ్ ఉత్తరం కూడా అంతే. సావిత్రి లైఫ్ గురించే ఎక్కువ చెప్పాను. నటిగా ఆమెను ఎక్కడా డిస్క్రైబ్ చేయలేదు. ఆ ఉత్తరం ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆమె నటనను వర్ణించాలనుకున్నాను. ఈ ఉత్తరం నా కల్పితమని నా పుస్తకం ముందుమాటలో గుమ్మడిగారు స్పష్టం చేశారు కూడా. అంతెందుకు గుమ్మడిగారి పుస్తకంలో.. సావిత్రిగారు బెంగళూరు హోటల్లో బస చేసినప్పుడు (తనతో స్నేహంగా ఉన్న) ఒక నటిని పిలిపించుకొని ఎప్పుడో ఆమెకు ఇచ్చిన తన నగను ఇవ్వమని సావిత్రి అడిగినట్టు, దానికి ఆ నటి తన దగ్గర ఆ నగలేదని చెప్పినట్టు, డబ్బు అవసరంలో ఉన్న సావిత్రిగారు ఆ మాట విని షాకైనట్టు అలా కోమాలోకి వెళ్లినట్టూ రాశారు. ‘‘ఇది నిజమేనా అండీ.. ’’ అని నేను గుమ్మడిగారిని అడిగా. ఆయన నిజమని చెప్పలేదు.. అబద్ధమనీ నిర్ధారించలేదు. మౌనంగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉన్న సోర్సెస్ కూడా నిజాలను తేల్చలేదని తెలియజేయడానికే. స్టార్ట్‌చేసిన యేడాదికల్లా పుస్తకం రెడీ అయింది. మా నాన్నగారికి శాంతాబయోటిక్ వరప్రసాద్‌రెడ్డిగారు మంచి ఫ్రెండ్. ఆయనకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాను. ఇప్పటి వరకు పన్నెండు వేల కాపీలను ప్రింట్ చేశాం. ప్రతి యేడాది రెండు వేల కాపీలను ప్రింట్ చేస్తూనే ఉన్నాం. ఈ పుస్తకంలో నేనెంత లీనమయ్యానంటే మా పిల్లలు ‘‘అమ్మా సావిత్రమ్మ మాకు అమ్మమ్మ అవుతుంది కదా’ అని అడిగేంతగా! రెండో పుస్తకం.. ఎమ్మెస్గారి మీద ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు అంటే నాకు శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతమే. అంతకుమించి ఆమె పాడినవి ఏవీ నేను వినలేదు. ఆమెను చూడలేదు. ఆమె పాడిన భజగోవిందంలోని పునరపి జననం.. పునరపి మరణం అనే వాక్యాలు కలిగించిన కుతూహలం టీజేఎస్ జార్జ్ .. ఎమ్మెస్ మీద రాసిన పుస్తకాన్ని పరిచయం చేసింది. అది చదివాక ఆమె బయోగ్రఫీ తెలుగులో రాస్తే బాగుంటుందనిపించింది. సావిత్రి బయోగ్రఫీ ఇచ్చిన ఎక్స్‌పీరియెన్స్‌తో ఈ పుస్తకానికి రీసెర్చ్ మొదలుపెట్టా. దాదాపు ఎనిమిదేళ్లు సాగింది. సావిత్రి పుస్తకం ఇష్టమైతే.. ఎమ్మెస్ మీద పుస్తకం ఓ యజ్ఞం. జార్జ్ మొదలు, ఎమ్మెస్గారి వదిన, ఎమ్మెస్ గారి మనవడు, మునిమనవరాలు, సదాశివం (ఎమ్మెస్ భర్త) కాంటెంపరరీస్ అయిన ఖాసా సుబ్బారావు గారి కూతురు, వీఏకే రంగారావు, స్వామినాథన్ ఇలా చాలామందిని కలిశాను. చెన్నై, కోయంబత్తూరు, మధురై, రాజుపాళెం వంటి చోట్లకూ వెళ్లా. ఆమె మీద వచ్చిన ఎన్నో పుస్తకాలను, ఆర్టికల్స్‌నూ ఔపోసన పట్టా. ఆమె మీద తీసిన ‘ఫరెవర్ లెజెండ్’ డాక్యుమెంటరీ చూశా. ఆడియోస్ విన్నా. అన్నీ హెల్ప్ అయ్యాయి. ఈ ప్రయాణం స్టార్ట్చేసేనాటికి నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఈ పుస్తక రచనలో చాలా సాయపడ్డారు. ఫొటోలు తీయడం దగ్గర్నుంచి ఇంటర్వ్యూలను రికార్డ్చేయడం వరకు ఒకరకంగా నాకు అసిస్టెంట్స్‌గా ఉన్నారని చెప్పొచ్చు. మా నాన్నా అంతే తోడుగా ఉన్నారు. ఇలా మా ఇంట్లో వాళ్లంతా ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేశారే తప్ప ఎందుకు ఈ ప్రయాస అంటూ నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఈ రీసెర్చ్ నాకు చాలా విషయాలను నేర్పింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారికి సంబంధించి ఒక క్లూ ఇచ్చింది మాత్రం ఆమె వదినగారే. ఎమ్మెస్ భర్త సదాశివం..ఆమెను పెళ్లిచేసుకున్నాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారట. ఈ విషయం తెలిసి సుబ్బులక్ష్మిగారు తన అన్నతో చెప్పి ఏడ్చారని చెప్పింది వాళ్ల వదిన. కానీ సుబ్బులక్ష్మి మనవడు చెప్పేదానికంటే కూడా ‘‘మీరు జార్జ్ లాగా రాయొద్దు’’ అని ఆంక్షలే ఎక్కువ పెట్టాడు. కానీ నేను జార్జ్ కన్నా నాలుగు నిజాలు ఎక్కువే రాశాను. జార్జ్ తన పుస్తకంలో ప్రశ్నార్థకాలు పెట్టిన వాస్తవాల దగ్గర నా పుస్తకంలో నేను ఫుల్స్టాప్ పెట్టా. ఎమ్మెస్ వాళ్లమ్మ చనిపోతే ఆమె వెళ్లలేదని ఎమ్మెస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి చెప్పాడు. నేనూ అదే రాశాను. పుస్తకం అచ్చుకి రెడీ అయిన టైమ్‌లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మీద ‘ది హిందూ’లో ఓ వ్యాసం వచ్చింది. అందులో ఆమె వాళ్లమ్మ చనిపోయినప్పుడు వెళ్లింది అని రాశారు. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి కాంటాక్ట్ నంబర్ పట్టుకొని క్రాస్ చెక్ చేసుకున్నా. నిజమే అని తేలింది. దాంతో నేను రాసింది మళ్లీ మార్చాల్సి వచ్చింది. అలాంటి ఎన్నో సంఘటనలు మళ్లీ మళ్లీ క్రాస్ చెక్ చేసుకుంటూ పోయా. ‘సుస్వరాల లక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి’గా పుస్తకాన్ని అచ్చువేశా. వరప్రసాద్‌రెడ్డి గారి తల్లిదండ్రులైన శాంతమ్మగారు, వెంకటరమణారెడ్డి గారికి ఆ పుస్తకాన్ని అంకితమిచ్చా. రిలీజ్ అయిన రోజే రెండు వందల కాపీలు అమ్ముడుపోయాయి. వితిన్ సిక్స్ మంత్స్ సెకండ్ ప్రింట్కు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెస్ ఎక్స్‌పీరియెన్స్‌తో సావిత్రి పుస్తకం మళ్లీ రాయాలనుంది. ఈ పుస్తకం నాకు సావిత్రి అభిమాని శిల్పను మంచి ఫ్రెండ్‌గా చేస్తే, తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ వచన రచన పురస్కారాన్ని అందించింది. విమర్శలను పట్టించుకుంటూనే నా పని నేను చేసుకుంటా. ఏ పనికైనా ప్రత్యేకంగా ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. అప్పటికప్పుడు బలంగా ఏదనిపిస్తే అది చేస్తా’’ అంటూ ముగించారు గార్లపాటి పల్లవి. పల్లవి.. కుటుంబం పల్లవి స్వస్థలం గుంటూరు జిల్లా, బోడిపాలెం. ఆమె తండ్రి రావిపాటి నాగేశ్వరరావు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తల్లి శాంతి. నిజానికి పల్లవి తెలుగు చదివింది మూడో తరగతి వరకే. ఎందుకంటే తర్వాత ఆమె విద్యాభ్యాసమంతా సెంట్రల్ స్కూల్స్‌లోనే సాగింది. ఎనిమిదో తరగతి వరకు గుంటూరులోనే. తండ్రి ఉద్యోగరీత్యా తర్వాత నుంచి అంతా హైదరాబాదే. కేంద్రీయ విద్యాలయాల్లో స్పోర్ట్స్‌కి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అందువల్ల పల్లవి కూడా టేబుల్ టెన్నిస్ ఆడేవారు. స్కూల్స్ నేషనల్స్ వరకూ వెళ్లారు. ఎమ్మే హిస్టరీ చేశారు. సివిల్స్‌కూ ప్రిపేర్ అయ్యారు. ఆమె భర్త గార్లపాటి మధుసూదన్‌రావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. కూతురు ప్రణతి. ఇంజనీరింగ్ చదువుతోంది. మగపిల్లలు ఆకాశ్, పృథ్వీ ట్విన్స్. ఇంటర్లో ఉన్నారు. – సరస్వతి రమ -
ఆ సన్నివేశాల్లో అలా నటించలేను!
తమిళసినిమా: నడిగైయార్ తిలగం (మహానటి) చిత్రానికి ముందు ఆ తరువాత అన్న విధంగా మారింది నటి కీర్తీసురేశ్ రేంజ్. అంతకు ముందు ఈ బ్యూటీకి విజయాలు లేక కాదు. అయితే నడిగైయార్ తిలగం చిత్ర విజయం కీర్తీసురేశ్ కెరీర్లో ఒక మకుటంగా నిలిచిపోతుందన్నది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కీర్తీ స్టార్ హీరోయిన్ అంతస్తుకు చేరుకుంది. ఇప్పుడామె విజయ్‌తో సర్కార్, విశాల్‌కు జంటగా సండైకోళి–2, విక్రమ్‌కు సరసన సామి సీక్వెల్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడు కమర్శియల్ అంశాలతో కూడిన భారీ చిత్రాలే కావడం, అన్నీ చిత్ర నిర్మాణాలు చివరి దశకు చేరుకోవడం విశేషం. కాగా తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో మరోసారి సావిత్రిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరును సంపాదించుకున్న కీర్తీసురేశ్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ చిత్రపరిశ్రమలో తనకుంటే రూపవతులు, అభినయవతులు చాలా మంది ఉన్నారని అంది. అయినా తనకు మంచి కథా పాత్రలు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. అదృష్టంపై తనకు అపార నమ్మకం ఉందని, అదే సమయంలో ప్రతిభ చాలా అవసరం అవుతుందని పేర్కొంది. సావిత్రి కథా పాత్రలో నటించిన తరువాత తనకు మంచి కథా పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. అదే విధంగా కథా పాత్రలనే ఎంచుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపింది. కథలు విన్నప్పుడే అందులో నటించవచ్చు అని మనసు చెబితే ఆ చిత్రాలను అంగీకరిస్తున్నట్లు చెప్పింది. తనకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని అంది. అలాంటి సన్నివేశాలతో కూడిన కొన్ని అవకాశాలు తనకు వచ్చాయని, తాను ముద్దు సన్నివేశాల్లో నటించనని తెగేసి చెప్పడంతో ఆ అవకాశాలు పోయాయని చెప్పింది. తనకు సౌకర్యంగా లేని కథా పాత్రల్లో ఎప్పటికీ నటించనని తెలిపింది. కొన్ని సన్నివేశాలు కథకు అవసరమైనా కూడా తాను నటించనని, ముఖ్యంగా తనకు సిగ్గు ఎక్కువని, అందుకే ముద్దు సన్నివేశాల్లో సహజంగా నటించడం తనకు రాదని కీర్తీసురేశ్ పేర్కొంది. -
‘మహానటి’కి మరో గౌరవం..!
సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్లో జరుగునున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో మూడు ప్రధాన విభాగాల్లో మహానటి పోటి పడనుంది. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటి కేటగిరిలో కీర్తీ సురేష్ బాలీవుడ్ స్టార్స్ రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్, విద్యాబాలన్‌లతో.. సహాయ నటి కేటగిరిలో సమంత.. రిచా చడ్డా, ఫ్రిదా పింటో, మెహర్ విజ్‌లతో పోటి పడుతున్నారు. ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో తెలుగు సినిమా రంగస్థలంతో పాటు ప్యాడ్‌మ్యాన్, హిచ్కీ, సంజు, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి భారీ చిత్రాలతో మహానటి పోడిపడనుంది. -
శింబుతో ఓకేనా?
తమిళసినిమా: సంచలన నటుడు శింబు, క్రేజీ నటి కీర్తీసురేశ్. ఈ కొత్త కాంబినేషన్లో చిత్రం వస్తే ఎలా ఉంటుంది. సింపుల్ సూపర్‌గా ఉంటుంది కదూ.. అయితే అలాంటి సంచలన కాంబినేషన్లో చిత్రం వచ్చే అవకాశం ఉందా అనేగా మీ ప్రశ్న. ఉండే అవకాశం లేకపోలేదు. శింబు, కీర్తీసురేశ్ జంటగా చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతాన్నాయన్నది తాజా సమాచారం. నటుడు శింబు చిన్న గ్యాప్ తరువాత చిత్రాల విషయంలో స్పీడ్ పెంచాడు. మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం చిత్రాన్ని పూర్తి చేసిని శింబు తాజాగా వరుసగా మూడు నాలుగు చిత్రాల్లో నటించడానికి సంతకాలు చేసినట్లు సమాచారం. వాటిలో ఒకటి దర్శకుడు వెంకట్‌ప్రభు చిత్రం. దీన్ని సురేశ్ కామాక్షి భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నటి కీర్తీసురేశ్‌ను నాయకిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. మహానటి చిత్రం తరువాత ఈ బ్యూటీ క్రేజే వేరు. తెలుగు, తమిళం భాషల్లో పలు అవకాశాలు కీర్తీసురేశ్ తలుపు తడుతున్నాయట. అయితే ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా అంగీకరించలేదని కీర్తీనే ఇటీవల స్వయంగా చెప్పింది. ప్రస్తుతం తన విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్‌తో సండైక్కోళి 2, విక్రమ్ సరసన సామి స్క్వేర్ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ తరువాతే కొత్త చిత్రాలను అంగీకరించనున్నట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో శింబుతో జతకట్టే అవకా«శం వచ్చిందన్న ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. మరి శింబుతో తను ఓకే అంటుందా అన్నది వేచి చూడాలి. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్, పీసీ.శ్రీరామ్‌లను సంగీతం, ఛాయాగ్రహణం బాధ్యతలకు ఎంపిక చేసే పనిలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది. ఇంతకీ ఈ చిత్ర టైటిల్ ఏమిటన్నది చెప్పలేదు కదూ! అదిరడి. టైటిల్ అదిరింది కదూ! ఈ చిత్రానికి సంబంధించిన అధికార పూర్వక పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఫ్యాషన్ మాయ. .మారింది మామ..
తెరపై మెరవాలంటే ఆహార్యం అదిరిపోవాలి. సినిమాకో గెటప్‌లో ప్రేక్షకులను అలరించాలి. శోభన్‌బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎస్వీఆర్, కృష్ణ... ఇలా ఎందరికో విభిన్న లుక్లిచ్చి, తెరపై క్లిక్‌మనిపించిన ఘనత కృష్ణానగర్కే దక్కింది. రింగురింగుల జుట్టుతో శోభన్‌బాబును, గుబురు జుట్టుతో ఎన్టీఆర్‌ను అద్భుతంగా చూపించిన ప్రతిభ ఇక్కడి ఆర్టిస్టులకే సొంతమైంది. ఆనాటిసినిమాల నుంచి నేటి బాహుబలి వరకు హీరోహీరోయిన్లగెటప్లకు సంబంధించి అన్నీ కృష్ణానగర్నే అందించింది.అయితే పరిస్థితులు మారాయి. పద్ధతులు మారాయి.ఫ్యాషన్ మారింది. కట్టుబొట్టులో ఎన్నో మార్పులు వచ్చాయి.కానీ పని మాత్రం ఇక్కడి నుంచే కొనసాగడం విశేషం. బంజారాహిల్స్: తెరపై కథానాయకులు, కథానాయికల వేషధారణ ఎంతో ముఖ్యం. తలకట్టుతో పాటు డ్రెస్సింగ్ ఇందులో కీలకం. ఒకప్పుడు విగ్గుల నుంచి మొదలు వేషధారణలకు అనుగుణంగా రూపొందించే దుస్తుల డిజైన్లన్నీ కృష్ణానగర్‌లోనే రూపుదిద్దుకునేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, ఎస్వీఆర్, కాంతారావు.. ఇలా ఎంతోమంది కథానాయకులకు కావాల్సిన విగ్గులను ఇక్కడి వారే తయారు చేసి అందించేవారు. ఒకప్పుడు విగ్గులను పెట్టడం చాలా కష్టంగా ఉండేది. పాతికేళ్ల కిందట విగ్గులను నట్ల సాయంతో అమర్చేవారు. దీంతో ధరించే వారికి కొంత భారంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నట్ల స్థానంలో క్లిప్పులు వచ్చాయని చెప్పారు కృష్ణానగర్‌లోని శ్రీసాయి విగ్స్ నిర్వాహకులు ఎ.సుబ్బారావు. ఒకప్పుడు విగ్గు తయారు చేయడం చాలా కష్టంగా ఉండేదని, చెన్నై నుంచి జుట్టు దిగుమతి చేసుకొని రూపొందించే వాళ్లమని పేర్కొన్నారు. ఎన్నెన్నో మార్పులు... అప్పట్లో విగ్గులను కేవలం జుట్టుతోనే రూపొందించేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో సింథటిక్, హ్యూమన్ హెయిర్ విగ్స్, ఆర్గానిక్ విగ్స్... ఇలా ఎన్నో రకాలు వచ్చాయి. వీటికి అవసరమైన కలరింగ్‌తో కూడిన విగ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఇప్పుడు కృష్ణానగర్‌లోనే తయారు చేసి ఇండస్ట్రీ అవసరాలు తీరుస్తున్నారు. కానీ డిజిటల్ మార్పుల నేపథ్యంలో హెయిర్ డిజైన్లు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హెయిర్ స్టైలిస్ట్‌లను నియమించుకుంటున్నారు. వారి పాత్రకు అనుగుణంగా తమ తలకట్టును తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్‌లు ఇక్కడికి వచ్చేస్తున్నారు. నయా డిజైన్స్ ఆగయా... సినిమాల్లోని వివిధ వేషధారణలకు కావాల్సిన దుస్తులను కృష్ణానగర్‌లో అద్దెకిస్తారు. డాక్టర్, పోలీస్ ఆఫీసర్, లాయర్... ఇలా ఏ పాత్రకైనా నిమిషాల్లో దుస్తులను సరఫరా చేస్తారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమైన దుస్తులు ఇక్కడి నుంచే అందిస్తున్నా... వాటి రూపురేఖలు మారుతున్నాయి. నవతరం డిజైనర్లు సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఇక్కడి స్టైలిస్టులతోనే నూతన డిజైన్స్‌కు అనుగుణంగా దుస్తులను తీర్చిదిద్దుతున్నారు. డ్రెస్సుల డిజైనింగ్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని కృష్ణానగర్‌కు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ ఖాదర్ పేర్కొన్నారు. ప్రస్తుత హీరోహీరోయిన్లు తమకు కావాల్సిన డ్రెస్సులను డిజైనర్లతో డిజైన్ చేయించుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడంతా నెట్లోనే... ఒకప్పుడు స్థానిక హైయిర్ స్టైలిస్టులపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. ‘మహానటి’ సినిమాలో కీర్తిసురేష్ కోసం 180 డిజైన్లను పరిశీలించాం. గతంలో సొంతంగా ఆలోచించి డిజైన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడంతా ఇంటర్నెట్లోనే పరిశీలిస్తున్నాం. గ్రాఫిక్స్‌లోనే హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో ముందే చూపిస్తున్నాం. – రజబ్ అలీ, హెయిర్ స్టైలిస్ట్ డిజైన్ వారిది.. తయారీ మాది సినీ ఇండస్ట్రీతో దాదాపు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఎంతోమంది నటీనటులకు డ్రెస్సులను డిజైన్ చేశాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్తగా డిజైనర్లు వచ్చారు. వారి రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా మేము దుస్తులను తయారు చేస్తున్నాం. గతంలో అయితే మా అభిరుచి మేరకు మేమే రూపొందించేవాళ్లం. – ఖాదర్, కాస్ట్యూమ్ డిజైనర్ ట్రెండ్స్‌కు అనుగుణంగా... విగ్గుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు విగ్గు కావాలంటే నలుపుదో, తెలుపుదో ఇచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా విగ్గుల రంగులు, స్టైల్స్ మారాయి. ఆయా మార్పులకు అనుగుణంగా తయారు చేసిస్తున్నాం. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి కావాల్సిన సింథటిక్ జుట్టును తీసుకొస్తున్నాం. – సుబ్బారావు, శ్రీసాయి విగ్స్ గిరాకీ తగ్గింది... నేను 20ఏళ్లుగా కృష్ణానగర్‌లో షాపు ఏర్పాటు చేసుకొని సినిమా వేషాలకు కాస్ట్యూమ్స్ అద్దెకిస్తున్నాను. అప్పట్లో నా దగ్గరే పాత్రలకు తగిన విధంగా డ్రెస్సులు ఉండేవి. వాటినే అద్దెకు తీసుకొనేవారు. అయితే దశాబ్ద కాలంగా హీరోహీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు సొంతంగా కాస్ట్యూమ్ డిజైనర్లను నియమించుకుంటుండడంతో మాకు గిరాకీ తగ్గింది. – సంగప్ప, కాస్ట్యూమ్స్ విక్రేత -
ముద్దు సన్నివేశాల్లో నో చెప్పకూడదన్నారు
తమిళసినిమా: ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్లో నటి కీర్తీసురేశ్ పేరే నానుతోందని చెప్పవచ్చు. మహానటి చిత్రం తరువాత ఈ సుందరి రేంజే మారిపోయింది. మహానటి సావిత్రినే వెండితెరపై మరపించిన కీర్తీసురేశ్ ఆ తరువాత తెలుగులో ఒక్క చిత్రం కూడా అంగీకరించలేదు. అయితే అందుకు కారణాన్ని కూడా కీర్తి వివరించింది. తమిళంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్‌తో సండైకోళి–2, విక్రమ్ సరసన సామి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో మరోసారి సావిత్రిగా జీవించే అవకాశం ఈ బ్యూటీనే వరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కీర్తీసురేశ్ ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో పక్కింటి అమ్మాయిగానే కనిపించింది. ఎలాంటి లిప్ లాక్ సన్నివేశాల్లోనూ, గ్లామరస్ పాత్రల్లోనూ నటించలేదు. దీంతో చుంభన దృశ్యాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు ఈ అమ్మడు బదులిస్తూ, తాను నటించడానికి సిద్ధం అయినప్పుడే కమర్శియల్ చిత్రాల హీరోయిన్లకు గ్లామర్ విషయంలో ఎల్లలు ఉండకూడదూ, ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి తయారుగా ఉండాలి, ముద్దు సన్నివేశాల్లోనూ నటించాల్సి ఉంటే నో అని చెప్పకూడదు అని చెప్పారంది. అయితే ఇంత వరకూ తాను నటించిన ఏ చిత్రంలోనూ అలాంటి సన్నివేశాలు చోటు చేసుకోలేదని చెప్పింది. తాను నటించిన చిత్రాల దర్శకులెవరూ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించమని బలవంతపెట్టలేదని చెప్పింది. ఈ విషయంలో తాను లక్కీనేనని పేర్కొంది. నిజానికి తకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది. కారణం తనకు కాస్త సిగ్గు ఎక్కువేనని అంది. ప్రేమ సన్నివేశాల్లో నటించడానికే బిడియ పడతానని చెప్పింది. తాను గ్లామరస్‌గా నటించడానికి నిరాకరించడం వల్లే మహానటి చిత్రం తరువాత అ వకాశాలు తగ్గాయనే ప్రచారంలో నిజం లేదని, తమిళంలో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నానని కీర్తీసురేశ్ పేర్కొంది. -
తారల విషాదగాథలే... తెరపై అద్భుత కావ్యాలా?
చిత్ర సీమలో వెలిగిన తారలెందరో. నేలకు రాలిన తారలు మరెందరో. కొందరి తారల గాథలు సినిమా కథలా విషాదంతో ముగిశాయి. జీవితంలో ఓడిపోయినా.. వారి జీవితాన్ని కథగా మలిస్తే... అవి వెండితెరపై అద్భుతాలను సృష్టించాయి. అవే డర్టీపిక్చర్, మహానటి. సిల్క్ స్మిత. అప్పట్లో ఓ క్రేజీ స్టార్. ఈమె చూపుల్లోనే ఏదో మత్తు ఉన్నట్లు కుర్రకారుకు మతి పోగొట్టేసింది. కేవలం ఈమె నర్తించిన పాటల కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు ఉండేవారు. సినిమాలో ఈమె చేసిన ప్రత్యేక గీతం తరువాత థియేటర్లో ఎవరూ ఉండేవారు కాదట. అంతలా ఆమె పాపులార్టీని సొంతం చేసుకుంది. ఒకానొక దశలో ఈమె స్టార్ హీరోలు, హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉండేది. తెరపై మాత్రమే అశ్లీల పాత్రలు చేసే ఈమె.. వ్యక్తిగతంగా ఎన్నో నిగూఢ దానధర్మాలు చేసేవారట. సిల్క్‌స్మిత ఎంతో మంచి వారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలాంటి సిల్క్‌స్మిత కథను ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక సినీ తారల జీవిత చరిత్రను తెరకెక్కించిన వాటిలో చెప్పుకోదగ్గ సినిమా మహానటి. తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో మహానటిగా గుర్తింపు పొందిని సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అంతటి నటికి నివాళిగా పేర్కొన్నారు సినీ అభిమానులు. సినీ జీవితాన్ని ప్రారంభించడం, అందులోని ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితం, చివరి దశ అన్నింటిని మనసుకి హత్తుకునేలా చిత్రీకరించారు. మహానటి సావిత్రిని గుర్తుంచుకున్నంత కాలం ఈ ‘మహానటి’ సినిమాను కూడా గుర్తుంచుకుంటారు. బాలీవుడ్‌కు పెద్దన్న సంజయ్ దత్. ఎన్నో వివాదాలు, ఇంకెన్నో ఎఫైర్స్, దుర్భరమైన జైలు జీవితం గడిపిన సంజయ్ దత్ జీవితాన్ని తెరకెక్కించారు రాజ్ కుమార్ హిరాణీ. తన ప్రతి సినిమాలో సమాజానికి ఏదో ఒకరకమైన సందేశాన్ని ఇచ్చే దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. మున్నాభాయ్ సిరీస్, పీకే, త్రీ ఇడియట్స్ ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేశారు హిరాణీ. తాజాగా తన ఆప్త మిత్రుడైన సంజయ్ దత్ ప్రస్థానాన్ని సంజు పేరుతో వెండితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటనకు బీ టౌన్ మొత్తం ఆశ్చర్యపోతోంది. ట్రైలర్లో సంజయ్‌ను మరిపించేలా యాక్ట్ చేసిన రణ్‌బీర్ కపూర్ పూర్తి నటనను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అంతేగాక సంజయ్‌దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడ ఈ సినిమా ప్రస్థావించబోతోంది. సంజయ్‌కు ఎంతమంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందన్న విషయం, డ్రగ్స్‌కు బానిసైన పరిస్థితుల గురించి, ముంబై పేలుళ్ల గురించి కూడా ఈ సినిమాలో టచ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు కావల్సినంత ట్విస్ట్‌లు, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్న సంజయ్ దత్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన ఎటువంటి ఆంక్షలు పెట్టకపోవడం ఆశ్చర్యకరం. పైన మాట్లాడుకున్న రెండు సినిమాలు వారి మరణానంతరం కథలను వెండితెరపై ఆవిష్కరించారు. కానీ జూన్ 29న రానున్న సంజు మాత్రం అందుకు విరుద్దంగా వస్తోంది. ఈ సినిమా సంజయ్ దత్‌కు ఎలాంటి ఇమేజ్ను తెచ్చిపెడుతుందో చూడాలి మరి. -
పూరీతో జన్మజన్మల బంధం..
రెడీ, స్టార్ట్.. కెమెరా, యాక్షన్.. అంటూ క్షణం తీరిక లేకుండా 1500 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశారు. రంగుల ప్రపంచంలో వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. చిత్రసీమలో దాదాపు మూడు తరాల హీరోల సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆ రంగుల ప్రపంచానికి దాదాపుగా దూరమయ్యారు. ఇప్పుడు ఆధ్మాత్మికం వైపు తన పయనాన్ని ప్రారంభించారు. మరో జన్మంటూ ఉంటే.. రమాప్రభగానే పుట్టాలని ఉందని, ఈ మదనపల్లె ముద్దుబిడ్డ సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మదనపల్లె సిటీ : వెండితెర సహాయ నటిగా.. దశాబ్దాల పాటు.. తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సీనియర్ నటి రమాప్రభ ప్రస్తుతం సాయిసేవలో తరిస్తున్నట్లు తెలిపారు. గతంలో హైదరాబాదు జూబ్లిహిల్స్‌లో ఉన్న ఆమె గత ఏడాది నుంచి స్వస్థలమైన మదనపల్లెలోనే ఉంటున్నట్లు చెప్పారు. తన సినీరంగ అనుభవాలు ఆమె మాటల్లోనే.. వెండితెరతో ఆరు దశాబ్దాల అనుబంధం.. జిల్లాలోని వాల్మీకిపురం మాఊరు. నాన్న గంగిశెట్టి. సాధారణ కుటుంబం. మా అమ్మ,నాన్నకు మేం 13 మంది సంతానం. 1947 మే 5న నేను జన్మించాను. ఊటీలో ఉంటున్న మా మేనమామ కృష్ణరావు ముఖర్జీకి పిల్లలు లేనందున నన్ను దత్తత తీసుకున్నారు. ఊటిలోనే నా బాల్యం గడిచింది. అనంతరం ఆయన తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నారు. నేను కూడా ఆయనతో పాటే చెన్నై వెళ్లాను. ఓ సందర్భంలో దర్శకులు ప్రత్యగాత్మ నన్ను, నా టాలెంట్‌ను చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. దీంతో 1963లో చిలకాగోరింక సినిమాలో నాకు మొదటి అవకాశాన్ని కల్పించారు. అలా ప్రారంభమైన నా సినీప్రస్థానం 55 సంవత్సరాల పాటు ఏకధాటిగా కొనసాగింది. దాదాపు 1500 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లలో నటించాను. సినీరంగంలో వెండితెరపై, వెనుక అనేక ఎత్తుపల్లాలు చూశాను. దాదాపు మూడు తరాల హీరో, హీరోయిన్లతో నటించాను. తరువాత సినీరంగంలో కొద్దిరోజుల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మాఅన్నయ్య, ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం. రణం, పండుగ తదితర సినిమాల్లో బామ్మ పాత్రలు పోషించాను. అప్పటి పరిస్థితుల బట్టి జూబ్లీహిల్స్‌లో ప్లాటు కొన్నా. హైదరాబాదు మన ఊరు కాదు కదా.. షూటింగ్‌కు వెళ్లిన ఊరు. ఎందుకో రావాలనిపించి స్వస్థలం మదనపల్లెకు వచ్చేశా. నాపేరుతో అంటూ ఏమీ లేవు. నాకు ఎక్కడ ప్లాట్లు లేవు. ఇప్పుడు నా మçనసు ఆ«ధ్యాత్మికం వైపు మరలింది. దీంతో రంగుల ప్రపంచాన్ని వదిలేసి సొంత జిల్లాకు వచ్చేశాను. మదనపల్లె రూరల్ మండలం గంగన్నగారిపల్లెలో మాపెద్ద తమ్ముడి ఇంటిలో ఉంటున్నాను. మదనపల్లె పట్టణంలోచిన్న తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. పూరీతో జన్మజన్మల బంధం సినీరంగం నుంచి దాదాపు పూర్తిగా సంబంధాలు వదిలేశాక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ నన్ను ఆదుకున్నారు. పూరిబాబుతో నాకు జన్మజన్మల బంధం. ప్రస్తుతం నాకు చివరి స్టేజి, సినిమాలు లేవు. ఎక్కడో మదనపల్లెలో ఉన్నా. అయినప్పటికీ నాకు డబ్బులు పంపించాలన్న తపన ఆయనలో ఉంది. గోపీచంద్ నటించే ఆరు అడుగుల బుల్లెట్ సినిమా షూటింగ్లో అనుకోకుండా పూరిబాబును కలసిననప్పుడు నా సెల్ నంబర్ , పుట్టిన తేదీ అడిగారు. అప్పటి నుంచి ప్రతి నెలా 5వ తేదీలోపు నెలకు రూ.20 వేలు పంపుతున్నారు. జయలలిత మంచి స్నేహితురాలు.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాకు మంచి స్నేహితురాలు. షూటింగ్లో ఇద్దరు కలిసి మెలసి ఉండేవాళ్లం. నేను అప్పట్లో నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. జయలలిత ఎప్పుడూ నా గురించి అందరినీ అడిగేవారు. బయటకు వెళ్లాలంటే ఫోన్లో ‘ఎన్నా.. వరిలియా’ (ఏం రాలేదా..) అని అడిగేవారు. సీఎం అయ్యాక ఫోన్ చేస్తే మరో మహిళ (శశికళ) ఫోన్ ఎత్తి ఎవరు..? అనేవారు. నాకు కొంచెం అలగుడు ఎక్కవ. అది అహంకారమో ఈగోనో.. తెలియదు. ఈ కారణంగానే మా ఇద్దరి మధ్యదూరం పెరిగింది. ఏఎన్ఆర్ మరణం జీర్ణించుకోలేను.. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మృతి ఇప్పటికీ జీర్ణించుకోలేను. ఆయన మృతి చెంది న విషయాన్ని.. వాణిశ్రీ ఫోన్ చేసి చెప్పారు. నేను అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. కొందరు నన్ను రావద్దని అవమానించారు. నా మనసును అకారణంగా గాయపరిచారు. ఎస్వీ రంగారావు మా డాడీ.. ఎస్వీ రంగారావును నేను డాడీ అని అనేదాన్ని. రాజబాబు నేనూ కలిసి దాదాపు 300 సినిమాల్లో నటించాం. ఒకానొక దశలో మేమిద్దం కలిసి నటించిన సినిమాలు వరుసగా ఉండేవి. రాజబాబును రేయ్.. అని అప్యాయంగా పిలిచేదాన్ని. రాజబాబు మృతితో నేను బాగా దిగలుపడ్డాను. సూర్యకాంతం అంటే గౌరవం, చాలా మంచి ఆవిడ. మహానటితో మంచి సంబంధాలు.. సావిత్రమ్మతో నాకు మంచి సంబంధాలు ఉన్నా యి. షూటింగ్ విరామంలో డ్రైవర్లు, పనివాళ్ల ఇళ్లకు వెళ్లేవాళ్లం. మహానటి సినిమా చూడలేదు. చాలా మంది ఫోన్ చేశారు. ఆ సినిమాలో.. మ్యూజిక్, పాటలు ఏంటండి..? మహానటి అన్న పేరు పెట్టిన తరువాత ఆమెతో అనుబంధం ఉన్నవారిని సంప్రదించకుండా సినిమా తీశారు. మాహానటి సినిమా కేవలం బిజినెస్. ఇక సావిత్రమ్మ మహామొండి. చాలా దగ్గరగా ప్రేమించే వాళ్లును కూడా పో.. అనేది. అందుకే చాలా మంది ఆమెకు దూరమయ్యా రు. పేద సినీ కళాకారులను ఆదుకునేందుకు అప్పటి ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్ న్యూజెర్సీలో గంధంమాలను వేలం వేశారు. దాన్ని కొనుగోలు చేసేందుకు సావిత్రమ్మ మైలాపూర్‌లో ఓ ఇళ్లును రాసిచ్చేశారు. ఇది ఆమె దాతృత్వానికి నిదర్శనం. కృష్ణ నిజజీవితంలోనూ సూపర్‌స్టారే.. సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరపైనే కాదు నిజజీవితంలోనూ సూపర్‌స్టారే. ఆయన వ్యక్తిత్వం ఉన్నతమైంది. ఆ రోజుల్లో రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు చాలా పెద్ద మనసుతో స్పందించే వారు. తన వంతు సహాయాన్ని బాధితులకు ప్రభుత్వం ద్వారా అందించేవారు. ఇంతమంది గొప్పవారితో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. మనో జన్మంటూ ఉంటే.. రమాప్రభగానే పట్టాలని, ప్రేక్షకులను అలరించాలని ఉంది. సాయిబాబా ఇష్టం.. నాకు షిరిడీ సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఆయన భక్తురాలిని. ఇంటి ఆవరణలోనే బాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నా. రోజూ ప్రత్యేక పూజలు చేయడం అలవాటుగా మార్చుకున్నా. అందులోనే నాకు మనశ్శాంతి లభిస్తోంది. ఇంటిలో మాపెద్ద తమ్ముడు, పి ల్లలు అందరూ ఉంటారు. నేను వారితోకలిసినా నాకంటూ ఓ ప్రత్యేకమైన పెంట్ హౌస్ నిర్మించుకుని ఒంటరిగానే ఉంటున్నా ను. ఇందులోనే నాకు మానసిక ప్రశాంతత. సమయం ఉన్నప్పుడు కుట్లు, అల్లికలు చేస్తా. పెయింగ్ అంటే ఇష్టం. ఎక్కిరాల భరద్వాజ నా ఆధ్యాత్మిక గురువు. ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నా. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు షిర్డీకి వెళ్తాను. -
వెయిటింగ్లో దర్శక నిర్మాతలు..
తమిళ సినిమా: యువ నటి కీర్తీసురేశ్ గురించి ఇప్పుడు చర్చ చాలానే జరుగుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్ తిలగం చిత్రంలో కీర్తీసురేశ్ నటనను ప్రశంసించని వారుండరంటే అతిశయోక్తి కాదు. నడిగైయార్ తిలగం చిత్రం తరువాత కీర్తికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఆమె యమ బిజీ అయిపోతుంది లాంటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వేరే రకంగా ప్రచారం జరుగుతోంది. అదేంటంటే కీర్తీసురేశ్ కొత్త చిత్రాలను ఒప్పుకోవడం లేదు. పారితోషికం పెంచేసింది లాంటి వదంతులు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటికి కీర్తీ ఎలా బదులిచ్చిందో చూద్దాం. నడిగైయార్ తిలగం చిత్రాన్ని ఒప్పుకోవడానికి ముందే నేను తమిళంలో విజయ్, విక్రమ్, విశాల్ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించడానికి అంగీకరించాను. అయితే నడిగైయార్ తిలగం చిత్రంలో నేను టైటిల్ పాత్రలో నటించడంతో ఆ చిత్రానికి అధిక కాల్షీట్స్ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నాకోసం ఆ మూడు చిత్రాల వారు చాలా సహకరించారు. విజయ్‌తో నటిస్తున్న సర్కార్ చిత్రం కోసం కాల్షీట్స్ కేటాయించినా, నడిగైయార్ తిలగం చిత్రం పూర్తి చేయాల్సి ఉండటంతో సర్కార్ చిత్ర యూనిట్ నా కోసం చాలా రోజులు వెయిట్ చేశారు. దీంతో ఆ చిత్రం పూర్తయిన తరువాత సర్కార్ చిత్రం షూటింగ్‌కు సిద్ధం అయ్యాను. ఆ తరువాత విశాల్‌తో నటిస్తున్న సండైకోళి–2, విక్రమ్‌తో నటిస్తున్న సామి స్క్వేర్ చిత్రాలు వరుసగా పూర్తి చేసిన తరువాత కొత్త చిత్రాలను అంగీకరించాలన్న నిర్ణయం తీసుకున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం కథ చెప్పడానికి వస్తున్న దర్శక నిర్మాతలను వెయిటింగ్లో పెడుతున్నాను. చేతిలో ఉన్న మూడు చిత్రాలు పూర్తి చేసిన తరువాత కొత్త చిత్రాలపై దృష్టి సారిస్తాను. ఇక పారితోషికం గురించి జరుగుతున్న ప్రచారం గురించి పట్టించుకోను. నా స్థాయికి తగ్గ పారితోషికాన్ని నిర్మాతలే ఇస్తున్నారు అని బదులిచ్చారు కీర్తి. -
డబుల్ సెలబ్రేషన్స్
ఆదివారం హాలీడే తీసుకోకుండా వర్క్ చేస్తున్నారు విశాల్, కీర్తీ సురేశ్. ప్రస్తుతం వీరిద్దరు ‘సండై కోళి 2’ (‘పందెం కోడి 2’)లో యాక్ట్ చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘పందెం కోడి’కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తు్తన్నారు. దర్శకుడు ప్యాకప్ చెప్పగానే ఇంటికి వెళ్లిపోకుండా సెట్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు విశాల్, కీర్తీ. ఎవరిదైనా బర్త్‌డేనా? అంటే.. కాదు. ఇవి సక్సెస్ సెలబ్రేషన్స్. ‘అభిమన్యుడు’తో విశాల్, ‘మహానటి’తో కీర్తీ సురేశ్ సూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేశారు. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు ఇటు తెలుగు అటు తమిళంలోనూ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ‘సండై కోళి 2’ దసరాకు రిలీజ్ కానుంది. -
షూటింగ్లో మహానటి, అభిమన్యుడు సెలబ్రేషన్స్
-
పందెం కోడి2 షూటింగ్లో సెలబ్రేషన్స్!
మహానటి సినిమాతో తిరుగులేని కీర్తిని సంపాదించారు కీర్తి సురేష్. తమిళ నాట నడిగైయార్ తిలగం పేరుతో విడుదలై అక్కడ కూడా విజయవంతమైంది. కీర్తి ప్రస్తుతం విజయ్, విక్రమ్, విశాల్ లాంటి అగ్ర కథనాయకులతో నటిస్తున్నారు. తెలుగులో ఇంకా ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేదు. కీర్తి సురేష్ విజయ్‌తో సర్కార్, విక్రమ్‌తో సామీ స్క్వేర్, విశాల్‌తో పందెం కోడి2 సినిమాలు చేస్తున్నారు. విశాల్ ఇరుంబుదురై (తెలుగులో అభిమన్యుడు) తో మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే పందెంకోడి సినిమాకు సీక్వెల్‌గా పందెంకోడి 2 తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ షూటింగ్లో కీర్తి సురేష్, విశాల్ పాల్గొన్నారు. చిత్ర యూనిట్ మహానటి, అభిమన్యుడు సినిమాలు విజయవంతం కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. విశాల్ ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ట్విటర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. Double Blockbusters Celebrations at Sandaikozhi 2 shoot - #Irumbuthirai & #NadigayarThilagam@Samanthaprabhu2 @KeerthyOfficial @akarjunofficial @thisisysr @dirlingusamy @Psmithran @george_dop @AntonyLRuben @dhilipaction @thinkmusicindia @LycaProductions pic.twitter.com/8ugjlGASNT — Vishal (@VishalKOfficial) June 24, 2018 -
'మహానటి’.. ఆ నలుగురు
బంజారాహిల్స్ : తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అద్భుతావిష్కరణ. ‘మహానటి’కిమహోన్నత ‘రూప’కల్పన. కీర్తి సురేష్‌లో సావిత్రిని పరకాయ ప్రవేశం చేసినట్లు తీర్చిదిద్దిన వైనం. ఆ నలుగురు సాంకేతిక నైపుణ్యానికితార్కాణం. ప్రేక్షకులను రంజింపజేసి.. మహానటి చిత్ర విజయంలో తమదైన పాత్ర పోషించారు వారు. కీర్తి సురేష్‌కు సావిత్రి పోలికలు, లుక్‌ను తీసుకురావడానికి నలుగురు సాంకేతిక నిపుణులు తెర వెనుక చేసిన కృషి అంతా ఇంతా కాదు. సావిత్రి నటించిన సినిమాలను ఒకటికి పదిసార్లు చూశారు. ఆమె హావభావాలు, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ ఒంటబట్టించుకున్నారు. కీర్తి సురేష్‌ను తెరపై జీవింపజేశారు. సావిత్రి రూపురేఖలను అచ్చుగుద్దినట్లు తీర్చిదిద్దడానికి కాస్ట్యూమర్ బొడ్డు శివరామకృష్ణ, హెయిర్‌స్టైలిస్ట్ రజబ్ అలీ, కాస్ట్యూమ్ స్పెషలిస్ట్ ఇంద్రాక్షి, మేకప్ మెన్ మూవేంద్రన్ కృషి అపురూపమైనది. వీరంతా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. మహానటి సినిమాకు ఎలా కష్టపడింది, ఆ సినిమా ఏ మేరకు పేరుతీసుకొచ్చిందనే విషయాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు. 190 హెయిర్ స్టైల్స్ మార్చాం నాది ముంబై. ఐదేళ్లుగా హెయిర్ స్టైలిస్ట్‌గా సినిమాల్లో పనిచేస్తున్నాను. అనుకోని వరంలా మహానటి సినిమాకు పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించడానికి సుమారు 20 సినిమాలు నెల రోజుల పాటు చూడాల్సివచ్చింది. మూగ మనసులు సినిమాను ఆరు రోజులు ఏకధాటిగా చూశా. అందులో సావిత్రి హెయిర్ స్టైల్‌ను అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌కు తీసుకొచ్చాను. ఒకే విగ్గును 190 హెయిర్ స్టైల్స్‌గా మార్చాం. సావిత్రి ఒక్కో సినిమాలో ఒక్కో హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకునేవారు. ఆమెది పొడవాటి జుట్టు. కీర్తి సురేష్‌ది తక్కువ జుట్టు. దీంతో విగ్గుతోనే సావిత్రిని తెరపై సృష్టించాల్సి వచ్చింది. ఇంకో వైపు సావిత్రి జుట్టు బాగా ఉంటే కీర్తి సురేష్‌ది సిల్కీ హెయిర్. దీంతో సావిత్రి జుట్టు తీసుకురావడానికి హెయిర్‌స్టైల్స్‌ను రకరకాలుగా మార్చాల్సి వచ్చింది. నా కెరీర్లోనే ఇదో అద్భుత అవకాశం. – రజబ్ అలీ, హెయిర్ స్టైలిస్ట్ 120 రోజుల కృషి ఫలితం ఇది.. మహానటి సినిమాకు 120 రోజుల పాటు పనిచేశా. పాత సినిమాలను ఔపోసన పట్టాను. ముఖ్యంగా నర్తనశాల, గుండమ్మకథ సినిమాలను పది రోజుల పాటు రేయింబవళ్లూ చూశాను. సావిత్రి హావభావాలు, ఆమె డ్రెస్సింగ్, ఆమె నడక, ఆమె కళ్లు ఎగరేసే తీరు ఇవన్నీ పరిశీలించాను. ఇంకో వైపు సావిత్రి చీర ఎలా కట్టుకుంటుంది, ఎలా నడుస్తుంది అన్నది ఈ సినిమాకు ఇంపార్టెంట్. ఇంకోవైపు సావిత్రి ఐనెక్ బ్లౌజ్‌లు వేసుకునేది. ఇప్పుడవి లేవు. ఆ తరహా బ్లౌజ్‌లను కుట్టించి సావిత్రి లుక్‌ను తెచ్చేందుకు చాలా కష్టపడ్డాను. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రి లాంటి మహానటిని తెరమీద కీర్తి సురేష్‌లో తీర్చదిద్దడానికి కృషి చేయడం సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి సావిత్రిని తెరపై చూపించాలంటే ఎంత కష్టమో తెలిసింది. – బొడ్డు శివరామకృష్ణ, కాస్ట్యూమర్ చీరకట్టుతోనే సావిత్రి అందం సావిత్రి అందమంతా చీరకట్టులోనే ఉండేది. సంప్రదాయ తెలుగు యువతిని చూడాలంటే సావిత్రిని చూడాల్సిందే. కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించాలంటే అప్పటి ఆమె కట్టు, బొట్టు బాగా ఆకళింపు చేసుకున్నా. ఇంకేముంది తగిన కాస్ట్యూమ్‌ను తగిన రీతిలో తీర్చిదిద్దాం. ఇందు కోసం రెండు నెలల పాటు కష్టపడ్డాం. సావిత్రి నడిచే విధానం, ఆమె చీరకట్టు గమనించడానికి చాలా రోజులు పట్టింది. అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌ను తెరపై చూపించాలంటే కాస్ట్యూమ్‌కు ఉన్న ప్రాధాన్యం గమనించాను. ఈ సినిమా ఇంత హిట్ కావడం నా జీవితంలోనే మరిచిపోలేనిది. ఇలాంటి సినిమాకు పనిచేయడం గర్వంగా ఉంది. – ఇంద్రాక్షి, స్టైలిస్ట్ ఆమె కళ్లతోనే భావాలు పలికించేవారు మహానటి సావిత్రి సినిమాను కీర్తి సురేష్‌తో తియ్యడం అందులో నేను మేకప్ మెన్‌గా ఉండటం అదృష్టమనే చెప్పాలి. సావిత్రి నటించిన 15 సినిమాలు రేయింబవళ్లూ చూసి ఆమె మేకప్‌ను గమనించాను. కీర్తి సురేష్‌కు ఎలా మేకప్ వేస్తే సావిత్రి లుక్ వస్తుందో అంచనాకు వచ్చాను. బ్లాక్ అండ్ వైట్ సీన్స్, కలర్ సీన్స్‌లో కీర్తి సురేష్ ఎలా ఉంటుంది, ఆ మేరకు మేకప్ ఎలా వేయాలి అన్నదానిపైనే దృష్టి సారించాను. సావిత్రి కళ్లు బాగుంటాయి. అవే కళ్లను కీర్తి సురేష్‌కు తీసుకురావాలంటే 20 రకాల వేరియేషన్స్‌ను తీసుకొచ్చాం. ముఖ్యంగా ఐబ్రోతోనే కీర్తి సురేష్‌కు సావిత్రి లుక్ అక్షరాలా ఒంటబట్టింది. సినిమా ఇంతగా హిట్ అవుతుందని మాకు షూటింగ్ సమయంలోనే తెలిసింది. ఎందుకంటే ఆ సినిమాకు పడుతున్న కష్టం దగ్గరుండి గమనించాను. – మూవేంద్రన్, మేకప్‌మెన్ -
మహానటి హీరో ‘అతడే’
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు దుల్కర్ సల్మాన్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. దుల్కర్ నటించిన తొలి తెలుగు సినిమా మాత్రం మహానటే. తొలి సినిమాతోనే నటిగా దుల్కర్ కు మంచి గుర్తింపు రావటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో గతంలో నటించిన మలయాళ చిత్రాలను తెలుగులో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. హేయ్ పిల్లాగాడా, 100 డేస్ ఆఫ్ లవ్ సినిమాతో టాలీవుడ్లో సందడిచేసిన దుల్కర్ త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సోలో సినిమాను తెలుగులో ‘అతడే’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్ నాలుగు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకుడు. ఇటీవల ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాను జూన్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నంబర్‌ఒన్ స్థానానికి..
తమిళసినిమా: ఏ రంగంలోనైనా ఎవరైనా కోరుకునేది నంబర్‌ఒన్ స్థానాన్నే. ఇందులో మార్చు ఉండదు. సినిమా రంగం దీనికి అతీతం కాదు. అయితే ఈ రంగంలోని వారి గోల్ అదే అయినా పైకి మాత్రం నంబర్‌ఒన్ ఆశ లేదని, అది నిరంతరం కాదని, ప్రతి శుక్రవారం ఆ స్థానం మారుతుంతుందని అంటుంటారు. ముఖ్యంగా ఈ మాటలను కథానాయికల నుంచి వింటుంటాం. అయితే దేనికైనా విజయాలే కొలమానం కాబట్టి, దాన్ని బట్టే ఇక్కడ స్థానాలు నిర్ణయించబడతాయన్నది నిజం. కాగా ప్రస్తుతం కోలీవుడ్‌లో నంబర్‌వన్ కథానాయకి స్థానంలో నయనతార, టాలీవుడ్లో అనుష్క పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరు నటించిన చిత్రాలు సక్సెస్ అవుతున్నా, నటిస్తున్న చిత్రాల విడుదల్లో జాప్యం జరుగుతోంది. చేతిలో పలుచిత్రాలు ఉన్నా, అరమ్ చిత్రం తరువాత నయనతార నటించిన మరో చిత్రం తెరపైకి రాలేదు. అదే విధంగా నటి అనుష్క భాగమతి చిత్రం మరో చిత్రాన్ని అంగీకరించిన దాఖలాలు లేవు. ఇంతకు ముందు చెప్పినట్లు విజయాలే కొలమానం కాబట్టి 2018లో నంబర్‌వన్ స్థానాన్ని సమంత ఆక్రమించుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం రంగస్థలం, ద్విభాషా చిత్రం మహానటి, తమిళ చిత్రం ఇరుంబుతిరై చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. ఇలా ఒకే ఏడాది వరుసగా విజయాలను అందుకున్న నటి సమంతనే అని చెప్పాలి. అంతే కాదు ఇరుంబుతిరై తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదంమై వసూళ్లను సాధిస్తోంది. ఈ విజయంలోనూ సమంత భాగం పంచుకున్నారు. తాజాగా సమంత తమిళంలో మరో 3 చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో విజయ్‌సేతుపతితో సూపర్ డీలక్స్, శివకార్తికేయన్‌కు జంటగా సీమరాజా, ద్విభాషా చిత్రం యూ టర్న్. ఈ మూడు చిత్రాలపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. అదేవిధంగా ఇవి కూడా ఈ ఏడాదే తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. వీటి రిజల్ట్ కూడా పాజిటివ్‌గా వస్తే కచ్చితంగా నంబర్‌వన్ స్థానం సమంతదే అవుతుంది. ఇరుంబుతిరై చిత్ర సక్సెస్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సూపర్ డీలక్స్ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. -
ఒక నటుడిని గుడ్డిగా ప్రేమించాను..
తమిళసినిమా: సెలబ్రిటీల వ్యాఖ్యలకు, చర్యలకు మీడియా అధిక ప్రాముఖ్యత ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదీ సమంత లాంటి అందాల భామ, అగ్ర కథానాయకి గురించిన సంగతులైతే సామాజిక మాధ్యమాలు పట్టించుకోకుండా ఉంటాయా, ఇక నిజాలను నిర్భయంగా వెల్లడించడానికి ఎప్పుడూ సందేహించని నటి సమంత యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం తన నట ప్రయాణం కొనసాగుతుందని ముందుగానే వెల్లడించిన ఈ క్రేజీ నటి అదే విధంగా నటిస్తున్నారు. అంతే కాదు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు కూడా. సాధారణంగా పెళ్లి అయిన తరువాత హీరోయిన్లు తమ గత ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడరు. సమంత అందుకు విరుద్ధం అనే చెప్పాలి. ఇటీవల ఒక భేటీలో తన గత ప్రేమ గురించి ప్రస్తావించారు. ఆమె ఏమన్నారో చూద్దాం. మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం) చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర కథ నా జీవితంలో జరిగినట్లే భావించాను. అంటే నేనూ ఒక నటుడిని గుడ్డిగా ప్రేమించాను. ఆ తరువాత అతని నుంచి విడిపోయాను. అలా కాకుంటే నా జీవితం కూడా సావిత్రి జీవితంలా అయ్యేది. నా టైమ్ బాగుండడంతో నాగచైతన్యను కలిశాను అని సమంత పేర్కొన్నట్లు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇలాంటి విషయాలు చెప్పడానికి నిజంగా చాలా ధైర్యం కావాలి. అది సమంతలో కట్టలు కట్టలుగా ఉందని అర్థం అవ్వడం లేదూ! ఈ సంచలన నటి తాజాగా యూటర్న్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రం అన్నది గమనార్హం. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం సమంత కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళుతుందో చూడాలి. -
గెస్ట్‌గా మహానటి
అవును.. సమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమాలో ‘మహానటి’ గెస్ట్‌గా రావడానికి ఒప్పుకున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రంలో మంచి స్థాయిలో కీర్తీ సురేష్ నటించి, ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే.. తమిళంలో శివ కార్తీకేయన్ హీరోగా పొన్రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సీమరాజా’. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్ గెస్ట్‌గా నటించనున్నారు. ‘‘సీమరాజా’లో నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు కీర్తీ. హీరోయిన్గా కీర్తీ సురేష్ నటించిన ‘మహానటి’ సినిమాలో జర్నలిస్ట్ మధురవాణి క్యారెక్టర్లో సమంత నటించారు. ఇప్పుడు సమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమాలో కీర్తీ గెస్ట్ రోల్ చేయడం విశేషం. అన్నట్లు.. ఇది గెస్ట్ రోల్ అయినప్పటికీ సినిమాకి కీలకం కావడంతో కీర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. -
సావిత్రికి ‘చిత్రకళా’ నివాళి
విజయనగర్‌కాలనీ: మహానటి సావిత్రికి లలిత కళల విద్యార్థులు వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. మాసబ్‌ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ప్రాంగణంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో గురువారం క్రియేటివ్ మల్టీ మీడియా కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్ చిత్రకళా విభాగం విద్యార్థులు ఏర్పాటు చేసిన దివంగత నటి సావిత్రి చిత్ర కళాఖండాలను ‘మహానటి’ డైరెక్టర్ నాగఅశ్విన్, నిర్మాత ప్రియాంకదత్‌లు ప్రారంభించారు. సావిత్రి పెన్సిల్ స్కెచ్‌లు, పెయింటింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నాగఅశ్విన్, ప్రియాంకదత్‌లు నిర్మాత మాట్లాడుతూ.. మహానటి చిత్రానికి తాము ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన మహానటి సావిత్రి చిత్రాలు విద్యార్థుల ప్రతిభకు దర్పణం పడుతున్నాయన్నారు. ఈ చిత్రాలు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ‘మా’ అసోసియేషన్‌కు అందజేయనున్నట్లు క్రియేటివ్ మల్టీ మీడియా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ బి.రాజశేఖర్ తెలిపారు. ప్రదర్శనలో జూన్ 2 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిత్రాలను తిలకించవచ్చని సమన్వయకర్త వెంకట్ చౌదరి తెలిపారు. కార్యక్రమంలో ఫైనార్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎన్.వికాస్, పెయింటింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రీతి సంయుక్తలతో పాటు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘మహానటి’ మరో డిలీటెడ్ వీడియో హల్చల్
సాక్షి, హైదరాబాద్: లెజెండరీ నటి హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ అప్రతిహతంగా దూసుకపోతోంది. అటు విమర్శకుల ప్రశంసలతోపాటు ఇటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన కీర్తి సురేష్ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడితో పాటు ఇతర సిబ్బందిపై కూడా ప్రశంసంల వర్షం కురుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే డిలిటెడ్ సన్నివేశాల వీడియోలు ఆకట్టుకుంటున్న తీరు మరో ఎత్తు. మహానటి సినిమా ఎంత సంచలన విజయాన్నిసృష్టిస్తోందో..అంతకంటే ఎక్కువగా డిలీటెడ్ సీన్లు, వీడియోలు యూట్యూబ్‌లో హల్ చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రప్రసాద్, హీరోయిన్ కీర్తి సురేష్‌పై చిత్రీకరించిన ఒక ఆసక్తికర సన్నివేశం నెట్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన డిలీటెడ్ వీడియోలు, సన్నివేశాలు ఇప్పటికే పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చాలా పాటలను, సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసివేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా ఎంజాయ్ చేయండి! -
‘మహానటి’ మరో డిలిటెడ్ వీడియో విడుదల
-
రకుల్‌పై సల్మాన్ ఫ్యాన్స్ ఫైర్
సాక్షి, ముంబయి : మహానటి సినిమాకు ప్రేక్షకుల నుంచే కాక విమర్శకులు, సెలబ్రిటీల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాను మహానటి మూవీని చూశానని అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండల నటన అసామాన్యంగా ఉందంటూ వారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్‌ను రకుల్ ప్రస్తావించకపోవడం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. మహానటిలో కీలక పాత్రల్లో ఒకటైన జెమినీ గణేషన్ పాత్రలో మెప్పించిన దుల్కర్ సల్మాన్‌ను రకుల్ తన ట్వీట్లో విస్మరించడం దుల్కర్ అభిమానులకు రుచించలేదు. తమ అభిమాన నటుడిని ప్రస్తావించకపోవడంతో రకుల్‌ను ట్రోల్ చేస్తూ వారు ట్వీట్లు చేశారు. కాగా, మహానటి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. -
ఓవర్సిస్లో దూసుకెళ్తోన్న ‘మహానటి’
అలనాటి అందాలనటి సావిత్రికి ఘన నివాళిగా నిలిచింది ‘మహానటి’. నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్, సావిత్రి పాత్రకు ప్రాణం పోశారు. సినిమా విడుదలైనప్పటి నుంచి వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఓవర్సిస్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుతం మహానటి ఓవర్సిస్లో 2.5 డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహానటి సినిమాకు కాలం కూడా కలసి వస్తోంది. ఈ వారం విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ రాకపోవడం కూడా మహానటికి కలిసి వచ్చే అంశం. ఈ సినిమా లాంగ్‌రన్‌లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందంటున్నారు విశ్లేషకులు. Savitramma continues to rule the box office! Thank you for 2.5 Million 😊 #Mahanati Thank You Everyone.@SwapnaCinema @KeerthyOfficial @dulQuer @Samanthaprabhu2 @TheDeverakonda @nagashwin7 @adityamusic @NirvanaCinemas @dancinemaniac pic.twitter.com/nnc2uqGBsq — Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 29, 2018 -
పురట్చి తలైవిగా నటించడానికి రెడీ
తమిళసినిమా: ఇప్పుడు బయోపిక్ చిత్రాల కాలం నడుస్తోందని చెప్పవచ్చు. ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకులు విశేష ఆదరణను అందించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఆ మధ్య క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోని జీవిత చరిత్రలో వచ్చిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా మహానటి సావిత్రి బయోపిక్కు తమిళం, తెలుగు భాషలో సూపర్‌రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా సావిత్రి పాత్రలో నటించిన యువ నటి కీర్తీసురేశ్‌కు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ప్రస్తుతం సంచలన హిందీ నటుడు సంజయ్‌దత్ బయోపిక్, ఎంజీఆర్ జీవిత చరిత్ర వంటివి నిర్మాణంలో ఉన్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. జయలలిత పాత్రలో నటి కీర్తీసురేశ్ నటించనుందనే ప్రచారం హల్చల్ చేసింది. అయితే తాను జయలలిత పాత్రలో నటించడం లేదని, అంతే కాదు ఇకపై ఎవరి బయోపిక్‌లలోనూ నటించనని కీర్తీసురేశ్ ఒక భేటీలో స్పష్టం చేసింది. దీంతో సావిత్రి పాత్రలో ఈ బ్యూటీకి లభిస్తున్న అభినందనలు చూసి కొందరు ఇతన నటీమణులు అలాంటి బయోపిక్ చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నారు. అలాంటి వారిలో రీమా కళింగళ్ ఒకరు. తమిళంలో భరత్‌కు జంటగా యువన్ యువతి చిత్రం ద్వారా పరిచయమైన ఈ కేరళా భామ, మాతృభాషలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. ఆ మధ్య పెళ్లి చేసుకున్న రీమా కళింగళ్ తరువాత కూడా నటనను కొనసాగిస్తోంది. కీర్తీసురేశ్ మాదిరి ప్రశంసలు పొందడానికి ఎవరి బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను తమిళనాడు పురట్చి తలైవి జయలలిత బయోఫిక్‌లో నటించాలని ఆశ పడుతున్నట్లు చెప్పింది. అదే విధంగా 18వ శతాబ్దంలో విప్లవ వీరనారిగా వాసికెక్కిన నంగేలి జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తే ఆమె పాత్రలో తాను నటిస్తానని రీమా కళంగళ్ చెప్పింది. -
చిన్నప్పటి ‘సావిత్రి’ నా మనుమరాలే..
తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తున్నంతకాలం తానూ గుర్తుంటానని ‘మహానటి’లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ అన్నారు. ‘మహానటి’ సినిమా విజయవంతమైన సందర్భంగా చేపట్టిన కృతజ్ఞతా పర్యటనలో భాగంగా చిత్రం యూనిట్ ఆదివారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. నటకిరీటి రాజేంద్రప్రసాద్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు థియేటర్లోప్రేక్షకుల్ని కలుసుకున్నారు. ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తున్నంతకాలం తానూ గుర్తుంటానని ‘మహానటి’లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ అన్నారు. ‘మహానటి’ విజయవంతమైన సందర్భంగా చిత్రం యూనిట్ కృతజ్ఞతా పర్యటన చేపట్టింది. ఆదివారం స్థానిక జేఎన్‌రోడ్‌లోని ఎంఆర్ఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ దర్శకుడు నాగ్అశ్విన్ ఆలోచనల నుంచే ఈ సినిమా వచ్చిందన్నారు. చిత్రనిర్మాణంలో ప్రియాంకదత్, స్వప్నదత్ ఎంతో సహకరించారన్నారు. టెక్నీషియన్లు అద్భుతంగా పనిచేశారని, సమంత, దుల్కర్, విజయ్ దేవరకొండతో పాటు సహనటులు ఎంతో ప్రతిభ కనబరిచారని అన్నారు. ముఖ్యం గా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియేల్ అ ద్భుతమైన ప్రతిభను కనబరిచారన్నారు. మహానటిలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ స్వంత తండ్రిలా ప్రోత్సహించారని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. సావిత్రి పాత్ర ను ఇచ్చిన నాగ్ అశ్విన్, నిర్మాతలతో పాటు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మహానటి’పై తెలుగువారి ప్రేమేవిజయానికి మూలం దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ తెలుగువారికి సావిత్రిపై ఉన్న ప్రేమే మహానటిని పెద్ద విజయవంతం చేసిందన్నారు. ఈసినిమా రూపకల్పనలో ఏదో శక్తి ముందుండి నడిపించిందని నమ్ముతున్నానన్నారు. సావిత్రి స్టార్ పవర్ ఎంతో 40 ఏళ్ళ తర్వాత కూడా మహానటి సినిమా రుజువు చేస్తోందన్నారు. మహానటి సావిత్రి జీవితం ఒక విజయవంతమైన సినిమాతో ముగిసి ఉంటే బాగుంటుందన్న కోరికతోనే ఈ సినిమా రూపొందించానన్నారు. 40 సంవత్సరాల జీవితకథను మూడు గంటల్లో చూపించేందుకు స్క్రీన్‌ప్లే రాయడమే చాలా కష్టంగా అనిపించిందని, అయితే కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు అందించారని అన్నారు. కేవీ చౌదరి పాత్ర గుర్తుండి పోతుంది.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘ఆ నలుగురు’ సినిమాలో రఘురామ్ పాత్రను ప్రేక్షకులు ఎంతగా గుర్తుంచుకున్నారో, మహానటిలో కేవీ చౌదరి పాత్రకూడా అంతగా గుర్తుండి పోతుందన్నారు. సావిత్రితో విభేదించి దూరమైన తరువాత ఆమెకు ఆరోగ్యం బాగోలేని సమయంలో కలుసుకున్న సీన్ అద్భుతంగా పండిందన్నారు. మహానటి సావిత్రి మళ్ళీపుట్టిందా అన్నంతగా కీర్తి సురేష్ ఆమె పాత్రలో ఆకట్టుకుందన్నారు. సావిత్రి పాత్రలో జీవించేందుకు ఆమె ఎంతగానో కష్టపడిందని ప్రశంసించారు. దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు నిజాయితీతో కష్టపడి పనిచేసిన మహానటి తెలుగుసినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. ‘బయోపిక్ ఎవరు చూస్తారులే’ అని అంతా పెదవి విరిచినా నాగ్అశ్విన్ ప్రతిభాపాటవాలతో మహానటిని ఒక క్లాసిక్‌గా నిలబెట్టారన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డేనియల్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని అన్నారు. స్వామి థియేటర్లో మహానటి యూనిట్ కృతజ్ఞతాపర్యటనలో భాగంగా ‘మహానటి’ యూనిట్ రాజమహేంద్రవరం స్వామి థియేటర్లో మ్యాట్నీషోలో ప్రేక్షకులను కలుసుకుంది. కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాదత్, స్వప్నదత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియేల్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘అమ్మాడీ’ కీర్తిసురేష్ మహానటిలోని సినిమాడైలాగులతో సందడి చేసింది. థియేటర్ యజమాని లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి ‘సావిత్రి’ నా మనుమరాలే.. ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించింది తన మనుమరాలేనని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆ పాప తన కూతురి కుమార్తె అన్నారు. నిర్మాత స్వప్నదత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డేనియల్, సినీ డిస్ట్రిబ్యూటర్ నెక్కంటి రామ్మోహరావు, థియేటర్ల యజ మానులు, మేనేజర్లు, డిస్ట్రిబ్యూటర్ పాల్గొన్నారు. -
‘మహానటి’ సావిత్రికి నిజమైన నివాళి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’చిత్రం అద్భుతంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా సావిత్రికి నిజమైన నివాళి అర్పించినట్లైందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖకు చెందిన ప్రత్యేక థియేటర్లో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, నిర్మాత అశ్వనీదత్ ఇతర ప్రముఖులతో కలిసి మహానటి చిత్రాన్ని వీక్షించారు. సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేసి సావిత్రి గొప్పతనాన్ని నేటి తరానికి అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంక దత్, సావిత్రి కీర్తిని తెలియజేసేలా సహజసిద్ధంగా నటించిన నటి కీర్తి సురేశ్‌ను వెంకయ్య అభినందించారు. మాయాబజార్లో సావిత్రి నటన ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. -
అచ్చం సావిత్రిలా హావభావాలు
మహానటి చిత్రం నుంచి తొలగించిన మరో సన్నివేశాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏఎన్నార్, సావిత్రి, జమున నటించిన దొంగరాముడు(1955) చిత్రంలోని రావోయి మా ఇంటికి.. మావోయ్.. మాటున్నది మంచి మాటున్నది... పాట వీడియోను రిలీజ్ చేశారు. సావిత్రి.. ఆర్.నాగేశ్వర రావులపై చిత్రీకరించిన పాట ఇది. కీర్తి సురేష్ అచ్చు సావిత్రిలానే హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటికి నాగ్ అశ్విన్ దర్శకుడు. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మహానటి: రావోయి మా ఇంటికి...
-
ముఖ్యమంత్రిని కలిసిన ‘మహానటి’ టీం
సాక్షి, అమరావతి : సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం మహానటి. సినిమా రిలీజై మూడు వారాలు గడుస్తూ ఇప్పటి హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. తాజాగా మహానటి చిత్రయూనిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ కార్యక్రమంలో మహానటి సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరిని పేరు పేరునా ప్రశంసించిన చంద్రబాబు, పార్టీ నాయకులను మహానటి సినిమా చూడాలని కోరారు. అవసరమైతే సినిమాకు పన్ను రాయితీ కూడా కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించిన కీర్తి సురేష్, దర్శకుడు నాగ అశ్విన్, నిర్మాతలు ప్రియాంకా, స్వప్నా దత్, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, కళావెంకట్రావు, కాలవ శ్రీనివాస్, మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమార్, ఎమ్మెల్యేలు రాజేంద్ర ప్రసాద్, వల్లభనేని వంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్ తరుపున నిర్మాతలు రాజధాని నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు ప్రకటించారు. -
మహానటి తీసినందుకు గర్వంగా ఉంది
‘‘మహానటి’ సినిమాను జనాలు వచ్చి చూస్తారని ఆశించాం. నేను ఏదైతే అనుకున్నానో ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్‌గా నాకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. వెనక ఉండి మా సినిమాను నడిపించిన అందరికీ థ్యాంక్స్’’ అని నాగ్ అశ్విన్ అన్నారు. కీర్తీ సురేశ్ లీడ్ రోల్లో నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. స్వప్న దత్ మాట్లాడుతూ– ‘‘మహానటి’ సినిమా మూడో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకుల ప్రేమ చూస్తే ఇంకా మంచి సినిమాలు తీయాలనే ఆలోచన వస్తోంది. రాజేంద్రప్రసాద్, నాగచైతన్య.. ఇలా ప్రతి ఒక్కరూ మా సినిమా చేసినందుకు ధన్యవాదాలు’’ అన్నారు.‘‘మహానటి’ సినిమా మా బాధ్యత పెంచింది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంక దత్.‘‘సావిత్రిగారి లైఫ్ చూసి నేను షాక్ అయ్యాను. ‘మహానటి’ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి’’ అన్నారు నటుడు విజయ్ దేవరకొండ. ‘‘నాగి, స్వప్న, ప్రియాంక నాకు అందించిన సహకారం మరువలేనిది. నటీనటులు, టెక్నీషియన్స్ కష్టం వల్లే సినిమా విజయం సాధించింది. ఈ సక్సెస్ నేను మర్చిపోలేను’’ అన్నారు కీర్తీ సురేశ్. రచయిత బుర్రా సాయిమాధవ్ పాల్గొన్నారు. -
మహానటి : మిస్సమ్మ సీన్
-
మిస్సమ్మ సీన్‌ను ఎందుకు తీసేశారు?
మహానటి చిత్ర విజయాన్ని టాలీవుడ్ మొత్తం ఆస్వాదిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నాగ్ అశ్విన్ మరియు నిర్మాతల సాహసాన్ని అభినందిస్తున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటికి తొలి రోజు నుంచే మంచి ఆదరణ లభిస్తోంది. ఇక చిత్ర నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను మేకర్లు ఒక్కోక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. తాజాగా తమిళ మిస్సమ్మ సినిమాలోని వారాయో వెన్నిలావే (రావోయి చందమామ) సాంగ్ సీన్‌ను విడుదల చేశారు. జెమినీ గణేషన్-సావిత్రి రోల్స్‌లో దుల్కర్-కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన సీన్ ఆకట్టుకునేలా ఉంది. అయితే బాగున్న ఈ సీన్‌ను ఎందుకు తీసేశారని? సినిమాలో ఉంచాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా సాధించటంతోపాటు ఓవర్సీస్లోనూ మహానటి ప్రభంజనం కొనసాగిస్తోంది. సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న, ప్రియాంక దత్‌లు సంయుక్తంగా నిర్మించారు. -
సావిత్రి స్వీయ తప్పిదాలే...
సాక్షి, చెన్నై: దిగ్గజ నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ఇటు తెలుగులో, ‘నడిగయర్ తిలకం’ పేరుతో అటు తమిళ్లో సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమౌతోంది. అయితే సావిత్రి ఎదుగుదల.. పతనాన్ని కూలంకశంగా చూపించిన ఈ చిత్రంపై పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. తన తండ్రిని చిత్రంలో తప్పుడుగా చూపించారంటూ కమల సెల్వరాజ్(జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె) మహానటిపై పెదవి విరిచారు. (పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చెయ్యండి). ఇప్పుడు ఈ చిత్రంపై జెమినీ గణేషన్ సన్నిహితుడు, సీనియర్ నటుడు రాజేష్ కూడా స్పందించారు. సావిత్రి జీవితం అలా అయిపోవటానికి ఆమె స్వీయ తప్పిదాలే కారణమని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జెమినీ గణేషన్‌కు వివాహం అయిన సంగతి సావిత్రికి తెలుసు. అయినా ఆమె ఆయన్ని ప్రేమించింది. పెళ్లయిన వ్యక్తిని ప్రేమించడం నైతికత కాదన్నది ఆమెకు తెలీదా?. పైగా జెమినీ లైప్ స్టైల్, విలువలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. కానీ, అవేవీ పట్టించుకోకుండా సావిత్రి తప్పటడుగు వేసింది. ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు జెమినీ గణేషన్‌కు వివాహం చేసుకోవటమే’ అని రాజేష్ వ్యాఖ్యానించారు. ఇక సావిత్రి కూడా పలువురితో సంబంధాలు నడిపారంటూ కమల సెల్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై రాజేష్ స్పందించారు. (విబేధాలు కోరుకోవట్లేదు) ‘సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడలేను. కానీ, ఎంజీఆర్‌తో ఆమె నటించపోవటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విషయం మాత్రం తెలుసు’ అని పేర్కొన్నారు. సావిత్రి తాగుడు అలవాటు గురించి ప్రస్తావిస్తూ... ‘ ఉదాహరణకు సమాజంలో హోదా ఉన్న ఓ వ్యక్తి నన్ను తాగమని బలవంతపెడితే నేను తప్పకుండా తాగుతాను. మోడ్రన్ కల్చర్‌లో అదో భాగం. జెమినీ గణేషన్ కూడా సావిత్రిని అలానే ప్రొత్సహించారు. కానీ, ఆమె తాగుడుకు బానిసై పోయారు. అది కూడా ముమ్మాటికీ సావిత్రి తప్పే’ అని రాజేష్ పేర్కొన్నారు. సీనియర్ నటుడు రాజేష్ -
‘మహానటి’ శాటిలైట్ హక్కులపై రూమర్స్
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది ప్రధానంగా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు ఫలానా సినిమాలు ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్లో ఆడాయి... అని లెక్కేసుకునేవారు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్, వంద, రెండు వందల కోట్ల క్లబ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. దీనిలో భాగంగానే సినిమా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎంత పలుకుతున్నాయో కూడా ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యాయి. ఫలానా సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఎంతకు అమ్మారు... ఏ ఛానల్‌కు అమ్మారు లాంటి విషయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం మహానటికి సంబంధించిన ఈ విషయాలే హల్చల్ చేస్తున్నాయి. మహానటి విడుదలైనప్పటి నుంచి విజయవంతంగా దూసుకెళ్తోంది. కలెక్షన్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఓవర్సిస్లో కూడా ఈ సినిమా బాగానే రన్ అవుతోంది. అయితే మహానటి శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 18కోట్లకు అమ్మాలని నిర్మాతలు అనుకుంటున్నారని సమాచారం. అయితే సినిమాకు పెరుగుతున్న ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ఛానెళ్లు ఈ రైట్స్‌కు పోటీపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే టాప్ రేటింగ్ రావడం ఖాయమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
మహానటిలా సమంత..!
మహానటి సినిమాలో సావిత్రి పరిచయ సన్నివేశానికి అద్భుతమైన స్పందన వచ్చింది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా గ్లిజరిన్ లేకుండానే సావిత్రి ఒక కంటి నుంచి కన్నీరు కార్చినట్టుగా తెరకెక్కించిన ఈ సన్నివేశానికి థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. అయితే ఇలాంటి సంఘటనే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యు టర్న్’ సినిమా సెట్లో జరిగింది. ఈ విషయాన్ని నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు యాక్షన్ చెప్పగానే ఎలాంటి గ్లిజరిన్ లేకుండానే సమంత కన్నీళ్లు కార్చేసిందట. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన రాహుల్ ట్విటర్లో తన అనుభవాన్ని వివరించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన యు టర్న్ సినిమా తెలుగులో సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు వర్షన్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. Our director just has to call action and this girl @Samanthaprabhu2 can sob her heart out on cue... and how! No glycerin nothing. Sammo... cut! 😄😄🙌🏽🙌🏽 #UTurn — Rahul Ravindran (@23_rahulr) 23 May 2018 -
మధురవాణి మేకింగ్ వీడియో
-
మధురవాణి పాత్ర కోసం సమంత..!
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఈ సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి కథను నడిపించే కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత నటించారు. 80నాటి జర్నలిస్ట్‌గా మధురవాణి పాత్రలో సమంత నటించి తీరుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ పాత్ర కోసం ఆమె చేసిన హోం వర్క్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ మధురవాణి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. షూటింగ్ ప్రారంభానికి ముందు సమంత చేసిన లుక్ టెస్ట్‌తో పాటు షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ను కూడా ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. -
సోదరి అభ్యంతరాలపై స్పందించిన సావిత్రి కూతురు
‘మహానటి’ విషయంలో జెమిని గణేశన్ కూతురు డాక్టర్ కమల సెల్వరాజ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రిని తక్కువ చేసి చూపించారని, ఇంకా ‘మహానటి’ టీంపై ఆమె పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి స్పందించారు. ‘‘నా దృక్కోణంలో.. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కోణంలో ‘మహానటి’ సినిమా చూశా. నా సోదరి కమల మరో కోణంలో సినిమా చూశారు. ఆమె స్వతహాగా తమిళురాలు. ‘మహానటి’ని ఒక తెలుగు డబ్బింగ్ సినిమాలాగే చూసిందామె. మా అమ్మను నాన్న అమితంగా ప్రేమించిన మాట వాస్తవం. నాకు కమల అక్కకు మధ్య ఈ సినిమా వల్ల విభేదాలు రావాలని నేను కోరుకోవట్లేదు’’ అని చాముండేశ్వరి అన్నారు. ఆ కుటుంబాన్ని దూరం చేసుకోలేను.. తన తల్లి సావిత్రికి తండ్రే మద్యం అలవాటు చేశాడన్నది నిజం కాదని.. సినీ పరిశ్రమలో మద్యం తాగడం మామూలు విషయమని.. అలా తన తల్లికి కూడా అలవాటై ఉండొచ్చని.. ఐతే సినిమాలో తన తండ్రి తాగినపుడే తల్లి కూడా మద్యం తాగినట్లు చూపిస్తారని.. అలాగే ఆమె అలా తాగడం అదే తొలిసారని కూడా చెప్పలేదనే విషయాన్ని చాముండేశ్వరి గుర్తు చేశారు. తన తండ్రి నుంచి తనకు దక్కిన అతి పెద్ద ఆస్తి తన పెద్దమ్మ కుటుంబమే అని.. తన అక్కలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేనన్నారు.. సినిమాలో అలిమేలుగా చూపించిన తన పెద్దమ్మ (బాబ్జీమా) తమకెంతగానో అండగా నిలిచిందని.. తన తండ్రి కుటుంబం మీద తనకు అపారమైన గౌరవం ఉందని.. అది కూడా తన కుటుంబమే అని చాముండేశ్వరి పేర్కొన్నారు. -
కమల సెల్వరాజ్ వ్యాక్యలకుపై స్పందించిన సావిత్రి కూతురు
-
‘ఆ మూవీ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు’
సాక్షి, హైదరాబాద్ : మహానటి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు ఆయన పరిచమయ్యారు. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమా ఓ మోస్తరుగా ఆడినా దర్శకుడిగా అశ్విన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండో సినిమాగా బయోపిక్‌ను ఎంచుకోవడం.. అందులోనూ మహానటి సావిత్రి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలనుకోవడం.. అనుకున్న దానికంటే అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆయనపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సావిత్రి బయోపిక్ తీయాలనుకోవడం ఒక సాహసమైతే.. ఒకే సినిమాతో దిగ్గజాలను తెరపైన ఆవిష్కరించానుకోవడం మరో సాహసం. జెమినీ గణేషన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, కేవీ రెడ్డి, చక్రపాణి, ఎల్వీప్రసాద్ ఇలా అలనాటి మేటి సినీ వర్గాన్ని తెరపైన చూపించాలంటే వారి అభినయాన్ని, ఆహార్యాన్ని స్ఫురణకు తెచ్చే నేటి నటులను తెరపైకి తేవాలి. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది మేటి తారలకు తగ్గట్టుగా వారి పాత్రలలో నేటి తారలను చూపించి ఔరా అనిపించారు అశ్విన్. సినిమాతో మ్యాజిక్ చేసి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఎవడే సుబ్రమణ్యం తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదని, ఏదైనా చేస్తే అది భవిష్యత్తును ముందుకు నడిపేదిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి నటిగా సావిత్రి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె గురించిన విషయాలు తెలుసుకోవడానికి రెండేళ్లు కష్టపడ్డాను. ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది. రెండో సినిమాగా బయోపిక్ తీయడం అలా జరిగిపోయింది. రానున్న రోజుల్లో ప్రయోగాలు చేస్తానో లేదో తెలియదు. కొన్ని విజయాలు, అపజయాల తర్వాత జీవితం ఎలా మారుతుందో. ఇప్పుడు తీసినంత నిజాయితీగా తర్వాతి రోజుల్లో తీస్తానో లేదో. మహానటి విజయం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. సావిత్రి గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదివాను, సావిత్రితో కలిసి నటించిన వారు ఆమె గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలలోని విషయాలను కూడా తెలుసుకున్నాను. ముఖ్యంగా ఆమె కూతురితో సినిమాకు అవసరమైన అన్ని విషయాలపై చర్చించాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిజాయితీతో పూర్తి చేశారు. కీర్తి సురేష్ నటన సినిమా విజయానికి ఓ ముఖ్య భూమిక పోషించింది. శేఖర్ కమ్ముల వద్ద పని చేసినపుడు పాత్రల విషయంలో ఎక్కువ ఆసక్తి చూపేవాడిని. మొదట సావిత్రి పాత్రకోసం చాలా మందిని అనుకున్నప్పటికి చివరగా కీర్తి సురేష్‌ను ఎంచుకున్నాం. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా తొడరిలో కీర్తి సురేష్ నటన నచ్చడంతో ఆమె ఈ పాత్రకు న్యాయం చేస్తుందని నమ్మాను. మహానటి సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్, సమంతా అక్కినేని, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, బానుప్రియ, ఇతరులతో కలిసి పనిచేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. వారి షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయడమే ఇబ్బందిగా మారేదని, కేవలం సావిత్రి బయోపిక్ అన్న ఒక్క కారణంతో సినిమా పాత్ర నిడివి తక్కువైనా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కోసం కష్టపడిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి సినిమా చేసిన నిర్మాతలు ప్రియాదత్, స్వప్నదత్‌ల వల్లే మహానటి విజయం సాధ్యపడింది. మహానటి సినిమాతో తన బాధ్యత మరింత పెరింగిందంటూ’ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. -
జెమినీ గణేశన్ కుమార్తెల కలయిక
చెన్నై : నటుడు జెమినీ గణేశన్ కుమార్తెలు అందరూ కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను వాస్తవాలకు భిన్నంగా చూపించారని ఆయన కుమార్తెల్లో ఒకరైన కమలా సెల్వరాజ్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తన తండ్రిపై ఓ డాక్యుమెంటరీని నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు. కాగా జెమినీ గణేశన్‌కు అలిమేలు, పుష్పవల్లి, సావిత్రి, జూలియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. జెమినీ గణేశన్‌కు ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇక డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవితి స్వామినాధన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నారాయణి గణేశన్ మొదటి భార్య అలిమేలు కుమార్తెలు. ఇక బాలీవుడ్ నటి రేఖ, రాధా సయ్యద్ ...పుష్పవల్లి కుమార్తెలు కాగా వీరిలో మూడో భార్య సావిత్రి. ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీష్. వీరంతా ఒక్క తల్లి బిడ్డలు కాకపోయినా అందరూ అక్కాచెల్లెళ్లుగా ప్రేమాభిమానాలు కురిపించుకుంటారు. ప్రతి ఏడాది ఒక వేడుకలా అందరూ కలుసుకుంటారు. అలాంటి ఒక కలయిక శుక్రవారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. ఒకే వేదికపై జెమినీ గణేశన్ ఏడుగురు కుమార్తెలు కలిసి ఉన్న చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ప్రేమ వివాహం చేసుకుంటాను..
తమిళ సినిమా: నడిగైయార్ తిలగం తెలుగులో మహానటి చిత్రం అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణను పొందుతోంది. ఇందుకు చాలా కారణాలు, చిత్రం వెనుక ప్రతిభావంతులు పలువురు ఉన్నా, ప్రధాన కారణం నటి కీర్తీసురేశ్ అనడం అతిశయోక్తి కాదు. ఈ యువ నటి ఆ మహానటిగా ఒదిగిపోయారన్నది నిజం. అయితే ఈమె ఆ పాత్రలో నటన వెనుక శ్రమ, పట్టుదల, అవమాన భారం, ఎగతాళి, వేదన, కంటతడి, కసి, కృషి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటిఅన్ని టినీ అధిగమించి ఇవాళ సాధించాలన్న విజయ గర్వంతో పరిహాసం చేసిన వారి నోటితోనే శభాష్ అనిపించుకుంటున్నారు. అలాంటి కీర్తీసురేశ్ మనసులోని భావాలను చూద్దాం. దక్షిణాది సినీచరిత్రలో మహత్తరమైన సాధనను చేసిన నటి సావిత్రి. ఆమె పాత్రలో నటించే అవకాశం యువ నటినైన నాకు వచ్చిందన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సినిమాలో నేను సాధించాలనుకున్న లక్ష్యం ఇది. అంత తొందరగా దరి చేరుతుందని ఊహించలేదు అని మెరిసే కళ్లతో అన్న కీర్తీసురేశ్‌ను మీరీ సావిత్రి పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ వెలువడగానే చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారన్న ప్రశ్నకు బదులిస్తూ, అవన్నీ నాకు తెలుసు. నేను చాలా చిన్న అమ్మాయిని. అంత వెయిట్ అయిన పాత్రను తట్టుకోగలనా? అన్న అనుమానం రావడం సహజమే. అయితే అలాంటి వారందరికీ నడిగైయార్ తిలగం చిత్రం బదులిస్తుందని భావించాను. అయినా విమర్శలు నాకు కొత్తేమీ కాదు. తొడరి చిత్రంలో నటించినప్పుడే చాలా మంది ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. నా నవ్వు గురించి కొందరు తప్పు తప్పుగా విమర్శలు చేస్తున్నారు. ఏదో చెడాలోచనలతో అలాంటి కామెంట్ చేసేవారికి నేనుందుకు బదులివ్వాలి. ఇకపోతే మీరడిగిన ప్రశ్నకే వస్తే, సావిత్రి పాత్రలో నటించే అవకాశం రావడంతో అమ్మ చాలా సంతోషించారు. లెజెండ్ అయిన సావిత్రి పాత్రలో నటించే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పారు. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా పట్టించుకోవద్దు.నువ్వు దైర్యంగా నటించు అని నాకు బూస్ట్ ఇచ్చారు. అయితే బయట వాళ్లెవ్వరూ నన్ను పోత్సహించలేదు. పైగా ఇది సావిత్రికి పట్టిన గతి అంటూ ఎగతాళి చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు చేశారు. అప్పుడు నేను అప్సెట్ అయ్యాను. ఇంటిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాను. అప్పుడే నాలో కసి పెరిగింది. సావిత్రి పాత్రలో జీవించి తీరుతానని శపథం చేశాను. అందుకు తగ్గట్టుగా శ్రమించాను. అది ఇప్పుడు నెరవేరిందదని భావిస్తున్నాను. మహనటి సావిత్రి పాత్రను అవలీలగా నటించేశారు. ఇప్పుడు ఎలా ఫీల్అవుతున్నారన్న ప్రశ్నకు కథానాయికలు సినిమాల్లో సాధించడం ఎంత కష్టం అన్నది తెలుసుకున్నాను. సినీ తారల మరో ముఖం ప్రజలకు తెలియదు. అలాంటిది ఈ చిత్రంలో నటించిన తరువాత చాలా విషయాలను నేను తెలుసుకున్నాను. సావిత్రి సొంతంగా సినిమాలను నిర్మించారు, దర్శకత్వం చేశారు. ఆమె పాత్రలో నటించిన మీరు దర్శకత్వం, చిత్ర నిర్మాణం చేపడతారా, ప్రేమ వివాహం చేసుకుంటారాఅన్న ప్రశ్నకు అమ్మ మేనక, బామ్మ సరోజ నటీమణులే, అక్క పార్వతి కూడా సినిమా రంగంలోనే ఉంది. నాన్న నిర్మాత. అలా మాది సినిమా కుటుంబం. అయితే నేను మాత్రం ఎప్పటికీ నిర్మాతగా మారను. దర్శకత్వం అంటారా? అందకు అర్హత గానీ, ప్రతిభ గానీ నాకున్నాయని భావించడం లేదు. ఇకపోతే ప్రేమ వివాహం గురించి చెప్పాలంటే నేను ఇప్పుడే నటిగా ఎదుగుతున్నాను. కాబట్టి పెళ్లి ప్రస్తావన అనవసరం. ఇంకా చెప్పాలంటే మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. భవిష్యత్‌లో నాకు ఎవరిపైన అయినా ప్రేమ కలిగితే ఆ విషయాన్ని అమ్మానాన్నలకు ధైర్యంగా చెబుతాను. వారు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం చేసుకుంటాను. -
‘మహానటి’కి కౌంటర్
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహానటి సినిమాతో ఈ ట్రెండ్ దక్షిణాదిలోనూ ఊపందుకుంది. తాజాగా మరో బయోపిక్ తెరమీదకు రానుంది. అయితే ఆ బయోపిక్ మహానటి కి కౌంటర్‌గా తెరకెక్కుతుండటం విశేషం. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కూతురు డాక్టర్ కమల ఆరోపిస్తున్నారు. తన తండ్రి అవకాశాలు రాక సావిత్రి వేదించినట్టుగా తాగుబోతుగా చూపించారని అది నిజం కాదని ఆమో వాదిస్తున్నారు. అంతేకాదు త్వరలో జెమినీ గణేషన్ కథతో ఓ డాక్యుమెంటరినీ రూపొందిస్తున్నట్టుగా కమల వెల్లడించారు. మహానటి వివాదం తెర మీదకు వచ్చిన తరువాత జర్నలిస్ట్ అనుపమా సుబ్రమణియంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటిలో కేవలం ఒక వైపు నుంచి మాత్రమే చూపించారని అందుకే తన తండ్రి అసలు ఎలాంటి వారో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టుగా తెలిపారు. గంటా నలబై నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరబాద్‌లోనూ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని వెల్లడించారు. -
అమ్మాడీ
ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రా... ఇక పెద్ద సినిమాల్లో చిలిపి పాత్రలు రావా... ఓ లవ్వు.. ఓ కెవ్వు.. ఓ స్టెప్పు లాంటి కమర్షియల్ క్యారెక్టర్లు దొరక్కపోతే లైఫ్ వెలవెలలాడిపోదూ? బ్రాండ్ దశ దిశలా రీ–సౌండ్ కొట్టినా క్రేజ్ కిల్ అయిపోతే కెరియర్ డల్ అయిపోదూ? అని అడిగితే... ‘‘నన్ను మరపించే పాత్రలు రావాలి. మిమ్మల్ని మురిపించే నటన నాది కావాలి’’ అంటున్నారు కీర్తీ సురేష్. ఒక ‘మహానటి’ పాత్ర చేసినందుకు మీ ఫీలింగ్? ఇది చాలా పెద్ద రెస్పాన్సిబులిటీ. ఒక లెజెండ్ పాత్ర పోషించాను. ‘మహానటి’ కోసం ఫస్ట్ టైమ్ నన్ను నాగీ (నాగ్ అశ్విన్), స్వప్నా, ప్రియాంకా దత్‌లు అప్రోచ్ అవ్వగానే నో చెప్పాను. ముందు కథ వినండన్నారు. సావిత్రమ్మ జర్నీ వినగానే ఇంకా భయమేసింది. నేను చేసింది జస్ట్ 10–15 సినిమాలే. సావిత్రిగారి పాత్ర పోషించగలనా? అని ఆలోచించా. ఆవిడ లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కెరీర్ డౌన్‌ఫాల్ సీన్స్ అప్పుడు ఆడియన్స్‌కు నా నటన నచ్చుతుందా? నేను కరెక్ట్‌గా కన్వే చేయగలనా? అని సంకోచించాను. ‘ఆమె కథ అందరికీ తెలిసిందే. మనం కొత్తగా ఏ మార్పులూ చేయడం లేదు’ అని నాగీ కన్విన్స్ చేశాడు. ఎక్కడో భయం ఉన్నా మళ్లీ ఇలాంటి చాన్స్ రాదని ధైర్యం చేసి ఒప్పుకున్నా. ‘మహానటి’లో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్? ‘మాయాబజార్’ సీక్వెన్స్ మెంటల్లీ చాలా స్ట్రెస్ అనిపించింది. ఆ సీక్వెన్స్ చేయడానికి చాలా భయపడ్డాను. ఎందుకంటే ‘మాయాబజార్’ గురించి ఎవరు మాట్లాడినా అందులో సావిత్రిగారి నటన అద్భుతం అనేవారు. టైమింగ్, చేతులు కదపడం, ముఖ కవళికలు, హెయిర్ స్టైల్ అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకున్నాను. ఆ సీక్వెన్స్ చిత్రీకరణకు మూడు రోజులు పట్టింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకు కూడా 20 నుంచి 30 టేక్స్ తీసుకున్నాం. ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకులు ఆ సీక్వెన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారని విని, పడ్డ కష్టం మొత్తం మరచిపోయాను. ఈ మధ్య నేనెక్కువగా వాడిన పదం ‘థ్యాంక్యూ సో మచ్’. అన్ని కాంప్లిమెంట్స్ అందుకున్నాను. ఆల్రెడీ చాలామంది నేను నెక్ట్స్ ఏం సినిమాలు చేస్తున్నానో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఉన్నారు. సో.. నేనింకా కేర్‌ఫుల్‌గా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలి. సావిత్రి’గా కీర్తీ సురేశ్ సెట్ అవుతుందా అని కొన్ని నెగటివ్ కామెంట్స్ మీకూ వినపడే ఉంటాయి. అప్పుడేమైనా ఫీల్ అయ్యారా? నా మీద నాకే డౌట్‌గా ఉండేది. వేరేవాళ్లు డౌట్ పడటంలో తప్పేముంది? ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు పాజిటివ్, నెగటివ్ రెండూ ఉంటాయి. అందుకే దాని గురించి ఎప్పుడూ వర్రీ అవ్వలేదు. భయం ఎక్కడ మొదలైందంటే చుట్టూ ఉండేవాళ్లు ‘అబ్బ.. సావిత్రిగారి క్యారెక్టర్ చేస్తున్నారా.. సూపర్ చాన్స్ వచ్చింది’ అని అంటుంటే చిన్న హార్ట్ ఎటాక్ లాగా అనిపించింది. ఒకేసారి టెన్త్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసినంత టెన్షన్ అనిపించింది. ఎక్కడికి వెళ్లినా సరే ‘నువ్వు సరిగ్గా చేస్తావో లేదో తెలీదు కానీ నువ్వు మాత్రం బ్లెస్డ్’ అనేవారు. సావిత్రి గారి గురించి ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి? షూటింగ్ సమయంలో ఆమెకు సంబంధించిన ట్రాజెడీ సీన్స్‌లో నటిస్తున్నప్పుడు ఈ నేమ్, ఫేమ్ దేనికోసం? అనిపించేది. సావిత్రిగారు నటిగా, వ్యక్తిగా చాలా ఇన్స్పిరేషనల్ ఉమన్. ‘నీ వల్ల కాదు’ అంటే, ‘ఎందుకు కాదు’ అని చాలెంజింగ్‌గా తీసుకుని నటించేవారు. మంచి వ్యక్తి. ఆమెలో సహాయగుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉండి ఇవ్వడం వేరు. తన దగ్గర లేనప్పుడు కూడా ఆమె ఇచ్చారు. చాలా గొప్ప మనిషి. ఒక హీరోయిన్ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఆ హీరోయిన్ను ఆ జానర్‌కు స్టిక్ చేసేస్తారు. అది మీకు తెలిసే ఉంటుంది? నేను వర్రీ అవ్వడంలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కమర్షియల్ సినిమాలకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నవారంతా సీనియర్ ఆర్టిస్ట్స్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ సినిమా చేశాను. ఇప్పటి నుంచి ఓన్లీ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయడం నా ఏజ్‌కు చాలా ఎర్లీ అవుతుంది. నేనంత మెచ్యూర్డ్ కూడా కాదని అనుకుంటున్నాను. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తర్వాత చేస్తాను. ‘మహానటి’ సినిమా ఆఫర్ లైఫ్‌టైమ్‌లో ఒక్కసారి వస్తుంది. అందుకే ఎర్లీగా అయినా చేసేశాను. జనరల్‌గా నేను రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను. జనరల్‌గా హీరోయిన్స్ డైరీని అమ్మ లేదా నాన్న లేదా బ్రదర్స్ మేనేజ్ చేస్తుంటారు. మీకు? నా మూవీ డేట్స్ అన్నీ అమ్మగారు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరూ నాతో సెట్స్‌కి రారు. అంతా నేనే చూసుకుంటున్నాను. ‘మీరు నన్ను చూసుకోనవసరం లేదు. నన్ను నేను చూసుకోగలను’ అని చెప్పాను. అది యారోగెన్స్ కాదు. అమ్మానాన్నలను ఒత్తిడి నుంచి తప్పించడం కోసం. పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు ఆ మాత్రం చేయాలని నా ఫీలింగ్. మా అమ్మ నా గురించి ఎక్కడా చెప్పి ఉండరు. నాతో కూడా నా గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. బట్.. నా అంతట నేనే అన్నీ హ్యాండిల్ చేసుకుంటున్నానని మా అమ్మగారు నా గురించి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారని గ్రహించగలను. ‘దే ఆర్ ప్రౌడ్ పేరెంట్స్’ అని పిల్లలు తమ పేరెంట్స్ గురించి అందరూ అనుకునేలా చేస్తే చాలు. కన్నవాళ్ల రుణం తీర్చుకున్నట్లే. మీకు ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ ఎంట్రీ ఈజీ అయ్యింది.. మా అమ్మా నాన్న ఫస్ట్ స్టార్ట్ ఇచ్చారంతే. నా ఫస్ట్ మూవీ డాడీ వాళ్ల ఫ్రెండ్ ప్రియదర్శన్ (దర్శకుడు)గారి వల్ల వచ్చింది. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎంట్రీ ఈజీ అయింది కానీ ప్రూవ్ చేసుకోకపోతే ఎగ్జిట్ కూడా అంతే ఈజీ. ఫస్ట్ చాన్స్ తర్వాత అన్ని అవకాశాలూ నా సొంతంగా తెచ్చుకున్నవే. నా హార్డ్ వర్క్‌తో తెచ్చుకుంటున్నవే. కమర్షియల్ సినిమాల్లో కూడా మీరు ట్రెడిషనల్‌గానే కనిపిస్తారు కదా? అది నా చాయిస్. అదే నా కప్ ఆఫ్ టీ. నేను చాలా ట్రెడిషనల్ పర్సన్. నా మనస్తత్వానికి తగ్గట్టుగా నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఆ విషయంలో ఐ యామ్ హ్యాపీ. కొంచెం మోడ్రన్‌గా కనిపించగలనేమో కానీ గ్లామరస్ పాత్రలు చేయలేను. సౌందర్య.. ఆ తర్వాత స్నేహ.. ఆ తర్వాత హోమ్లీ క్యారెక్టర్స్ అంటే కీర్తీ సురేశ్ అని అంటున్నారు. ఈ మాట వింటే మీకేమనిపిస్తోంది? సౌందర్యగారు అద్భుతమైన నటి. స్నేహగారు చక్కని ట్రెడిషనల్ రోల్స్ చేశారు. వాళ్ల కేటగిరీలో నన్ను ఉంచితే ఆనందంగానే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించటం అనేది బెస్ట్ థింగ్ అని నేననుకుంటున్నాను. ఆ కేటగిరీవాళ్ల మనసులకు దగ్గర కాగలగడం ఓ ఆశీర్వాదం. ‘ట్రెడిషనల్ క్యారెక్టర్ చేయడం నా చాయిస్’ అన్నారు. ఆ డెసిషన్కి కారణం ఏంటి? నా ఫ్యామిలీ అలాంటిది. మా అమ్మ (మలయాళ నటి మేనక) గారే నాకు రోల్ మోడల్. ఆమె చేసినవి ట్రెడిషనల్ పాత్రలే. తన సినిమాలు చూస్తూ పెరిగాను. తనని ఫాలో అయ్యాను. ఒకవేళ అమ్మ ట్రెడిషనల్ రోల్స్ కాకుండా డిఫరెంట్ రూట్లో వెళ్లి ఉంటే.. నా రూట్ కూడా అదే అయ్యుండేదేమో. ట్రెడిషనల్ యాక్టర్స్‌కు కెరీర్ స్పాన్ ఎక్కువగా ఉంటుందనుకుంటున్నారా? అది ఆ ఆర్టిస్ట్ మీద డిపెండ్ అయ్యుంటుంది. వాళ్లని వాళ్లు ఎలా క్యారీ చేస్తారు అన్న విషయం మీద డిపెండ్ అయ్యుంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది అడిగిన మేజర్ క్వశ్చన్ ఇది. లెంగ్తీ కెరీర్ ఉండదని నన్ను నేను మార్చుకోలేను కదా? అని చెప్పాను. నేను మోడ్రన్ డ్రెస్‌లు వేసుకుంటాను. ట్రావెలింగ్ అప్పుడు జీన్స్, టీ షర్ట్ వేసుకుంటాను. సినిమాల్లోనూ అంతే. దానికి మించి టూ మచ్‌గా ఉండే డ్రెస్సులు వేసుకోలేను. నేను గ్లామరస్ రోల్స్ చేయను. అవి నాకు సూట్ అవ్వవు కూడా. ఆడియన్స్ కూడా నన్ను అలా చూడటానికి ఇష్టపడరు. నేను ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు.. ఒకవేళ మనం చూజ్ చేసుకున్న దారిలో సర్వైవ్ కాలేకపోతే ఏంటి? అని ప్రశ్నించుకున్నాను. కాలేకపోయినా మనల్ని మనం మార్చుకోకూడదు అనుకున్నా. ‘దిస్ ఈజ్ వాట్ ఐయామ్’. స్టోరీ డిమాండ్ చేసిందని స్విమ్ సూట్ వేసుకున్న హీరోయిన్స్ ఉన్నారు. స్టోరీకి వేల్యూ ఇచ్చే మీరు డిమాండ్‌ని బట్టి మనసు మార్చుకోవాల్సి వస్తే? నెవ్వర్. నేను అస్సలు మారను. నా స్టైల్‌ను మార్చుకోలేను. నాకలాంటి ఆఫర్స్ కూడా రావడంలేదు. నేను ఎలాంటి సినిమాలు చేస్తానో అందరికీ తెలుసు. డైరెక్టర్స్ కూడా నేను గ్లామరస్ రోల్స్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయరు. తమిళ సినిమాలు స్టార్ట్ చేసిన కొత్తలో స్టోరీ నెరేట్ చేసిన వెంటనే ‘నేను ఎక్స్పోజ్ చేయలేను’ అని చెప్పేదాన్ని. రీసెంట్గా ఓ దర్శకుడు తన కొత్త సినిమాకు అడిగినప్పుడు ‘సార్.. నేను ఎక్స్పోజ్ చేయలేను...’ అన్నాను. ‘కీర్తీ.. నువ్వేంటో మాకు తెలుసు. ట్రెడిషనల్ రోల్ కాబట్టే నిన్ను అప్రోచ్ అయ్యాను. నువ్వు ప్రతిసారీ ఇలా చెప్పనవసరం లేదు’ అని అన్నారాయన. ఆ టైమ్‌లో అనిపించింది. ‘నేనో మార్క్ వేసుకోగలిగాను’ అని. మనది హీరో డ్రివెన్ ఇండస్ట్రీ. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే మూవీ క్యారీ చేయగలరని అనుకున్నారా? లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే పెద్ద బాధ్యత. పైగా సావిత్రమ్మలాంటి మహానటి జీవితం మీద సినిమా అంటే ఆ బాధ్యత డబుల్. అందుకే చాలా జాగ్రత్తగా చేశాను. మన సినిమాలు హీరో డ్రివెన్ అయినప్పటికీ స్టోరీ, స్క్రీన్‌ప్లే బావుంటే ఉమెన్ కూడా సినిమాను ఈజీగా క్యారీ చేయగలరు. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో ముఖ్యంగా కావల్సింది బెస్ట్ స్క్రీన్‌ప్లే, స్టోరీ టెల్లింగ్‌లో కొత్తదనం. సినిమా థియేటర్స్ వైపు ఆడియన్స్‌ను పుల్ చేసే ఎలిమెంట్స్ ఉండాలి. అది ఆ సినిమా జానర్ అవ్వొచ్చు, స్టోరీ అవ్వొచ్చు. ఈ సినిమాలో నేను మెయిన్ రోల్ అయినప్పటికీ గ్రేట్ క్యాస్టింగ్ సపోర్టింగ్‌గా ఉంది. సమంత, దుల్కర్, విజయ్, మోహన్‌బాబుగారు ఉన్నారు. నా బాధ్యత అంతా సావిత్రిగారిలా చేయడమే. ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ ఫ్యాన్స్‌ని నా నటన నొప్పించకూడదనుకున్నా. ఆ విషయంలో సక్సెస్ అయ్యాను. మీ అమ్మగారు 120 సినిమాలు వరకూ చేశారు. ఆమె అన్ని సినిమాలతో కూడా అచీవ్ చేయని హైట్స్ మీరు 20 సినిమాలకే చేశారేమో? మా అమ్మగారు తెలుగువాళ్లకి తెలియకపోవచ్చు కానీ మలయాళంలో చాలా ఫేమస్. అక్కడ ఆమె చాలా అచీవ్ చేశారు. తమిళ సినిమాలు తక్కువే అయినా మంచివే చేశారు. నేను మలయాళంలో కంటే తమిళం, తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. అందుకని అమ్మకన్నా నేను పాపులర్ అయినట్లు మీకు అనిపిస్తుందేమో. అయినా కాలం మారింది. ఇప్పుడు తక్కువ టైమ్‌లో ఫేమస్ కాగలుగుతున్నాం. మలయాళంలో అమ్మ సక్సెస్ఫుల్. వ్యక్తిగా కూడా ఆమె సక్సెస్. పెళ్లి జరగక ముందు అమ్మ కెరీర్ పీక్‌లో ఉండేది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అమ్మ ఇండస్ట్రీకి వచ్చి, సక్సెస్ అయ్యారు. పెళ్లి జరిగాక (మలయాళ నిర్మాత జి. సురేష్‌కుమార్‌తో) పర్సనల్ లైఫ్ కోసం యాక్టింగ్ మానేశారు. ‘ఐ యామ్ హ్యాపీ’ అనేవారు. ఆర్టిస్ట్‌గా, పర్సన్‌గా మా అమ్మగారే నా రోల్ మోడల్. ఒకవేళ యాక్టర్ అవ్వకపోయి ఉంటే? కాస్ట్యూమ్ డిజైనర్. సమంత లాంటి హీరోయిన్స్‌కు డ్రెస్‌లు డిజైన్ చేస్తూ ఉండేదాన్ని. (నవ్వుతూ). మీ ఫీచర్స్ బాగుంటాయి. నటిగా మంచి ఫ్యూచరూ ఉంది. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? అమ్మా, నాన్న.. ఇద్దరికీ. మరి దేవుడికి? అమ్మా నాన్నే దేవుళ్లు కదండీ. దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను. మనసులో ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను. ముఖ్యంగా నా సినిమాల రిలీజ్ టైమ్స్‌లో ఎక్కువగా (నవ్వుతూ). నేను షిరిడీ సాయిబాబా భక్తురాలిని. ఫస్ట్ సినిమా కంప్లీట్ అయ్యాక షిరిడీ వెళ్లి బాబాకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. వాళ్లు నాకెంతో స్పెషల్. ‘మహానటి’తో ఆడియన్స్‌కు మీరూ స్పెషలే.. (నవ్వేస్తూ) వినడానికి చాలా హ్యాపీగా ఉంది. – డి.జి. భవాని -
‘మహానటి’ ఖాతాలో మరో రికార్డ్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. తొలి షో నుంచే సూపర్ హిట్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓవర్ సీస్లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటిపై వసూళ్ల వర్షం కురుస్తోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి ఓవర్ సీస్లో ఇప్పటి వరకు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
సావిత్రి గొప్పే.. మా నాన్న కాదా?
పిల్లలకు తండ్రంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆ తండ్రి గొప్ప స్టార్ అయితే ఆ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది.‘మహానటి’ సినిమా సావిత్రిని వర్తమానంలోకి తెచ్చింది.అలాగే జెమినీ గణేశన్‌ను కూడా. జెమినీ మీద తెలుగు సమాజంలో ఉన్న అపోహలను ‘మహానటి’ సినిమా దూరం చేసిందని అనుకునేవారు ఇప్పుడు ఉన్నారు. కానీ జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె కమలా సెల్వరాజ్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు.ఆమె తరఫు వాదన ఏమిటో విందాం. ► ‘మహానటి’ సినిమా విషయంలో మీ స్పందనలు తెలుస్తున్నాయి. ఆ సినిమా గురించి మీ అభ్యం తరం ఏమిటి? మా నాన్నగారు సావిత్రమ్మను చూసి అసూయ పడినట్లుగా చూపించారు. మా నాన్నగారు పెద్ద స్టార్. శివాజీ గణేశన్, ఎం.జి.ఆర్‌లతో పాటు మా నాన్న కూడా స్టార్డమ్ చూశారు. అలాంటి వ్యక్తి సావిత్రమ్మను చూసి అసూయ పడాల్సిన అవసరం ఉందంటారా? అలాగే సావిత్రమ్మ ఆకర్షణలో మా నాన్నగారు ఆమె వెంట తిరిగినట్లు చూపించారు. సావిత్రిగారు మా నాన్న వెంట తిరిగి ఉండొచ్చు కదా. అలాగే ఆమె మద్యానికి ఎలా బానిసయ్యారో ఎవరూ చెప్పలేరు. అందులో మా నాన్న ప్రమేయం ఉన్నట్టు చూపడం సరికాదు. ► ‘మహానటి’ సినిమా చూసి జెమినీ గణేశన్ మీద అపోహలు తొలిగాయని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. అంటే మీ నాన్నను పాజిటివ్‌గా చూపించినట్టే కదా? నిజంగానే మా నాన్నగారు మంచి వ్యక్తే. అన్నేసి లవ్ సీన్స్ తీయడం ఎందుకు? సావిత్రిగారు గొప్ప స్టార్ అని ఎలివేట్ చేశారు. మా నాన్నగారు కూడా పెద్ద స్టార్. అది ఎలివేట్ చేసినట్లు అనిపించలేదు. ఆయనేదో అవకాశాలు తగ్గిపోయి బాధపడినట్లు చూపించారు. అది నిజం కాదు. సావిత్రమ్మను ఆయన మోసం చేయాలని ఏనాడూ అనుకోలేదు. ‘నా భార్య’ అని సమాజానికి చెప్పారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు పెళ్లి చేసుకునేవారు కాదు. పైగా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాల గురించి సినిమా తీస్తున్నప్పుడు ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాలి. సావిత్రమ్మ తరఫున వాళ్ల పిల్లలతో మాట్లాడినట్లే నాన్నగారి తరఫున మాతో మాట్లాడి ఉండాలి. అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పేదాన్ని. అసలైన నిజాలతో సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. ► సినిమా విషయంలో మీ ఒపీనియన్ మీది.. సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారి ఒపీనియన్ ఆమెది.. ఈ సినిమా మీలో మనస్పర్థలు రావడానికి కారణం అవుతుందా? అస్సలు కాదు. మేమంతా చాలా బాగుంటాం. సినిమా విషయంలో ఎవరి ఒపీనియన్ వాళ్లకు ఉంటుంది. అది మా పర్సనల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించదు. మేమంతా ఎప్పటిలానే బాగుంటాం. ► సావిత్రిగారితో మీకున్న మెమొరీస్ గుర్తు చేసు కుంటారా? సావిత్రి గారిది చాలా లవింగ్, కైండ్ నేచర్. చాలా ఆప్యాయత చూపించేవారు మా మీద. ఎవరికైనా మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు నా మొదటి అమ్మాయి, రెండో అమ్మాయి అని మమ్మల్ని పరిచయం చేశాకే వాళ్ల పిల్లల్ని (విజయ చాముండేశ్వరి, సతీష్‌ను) పరిచయం చేసేవారు. నేను మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో సావిత్రిగారు విజిట్ చేసేవారు. నాకు హెయిర్ కట్ చేసేవారు. కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ ట్రావెల్‌ని ఎంజాయ్ చేశాం. ఆవిడ నైస్ పర్సన్. ► సావిత్రమ్మగారితో మీ అమ్మ అలమేలుగారి ఈక్వేషన్ గురించి? ఇంట్లో హింసిస్తున్నారంటూ అర్ధరాత్రి సావిత్రిగారు ఏడ్చుకుంటూ మా ఇంటికొస్తే మా అమ్మగారు ఇంట్లోకి రానిచ్చారు. ఏనాడూ ఒక్క మాట అన్నది లేదు. సావిత్రిగారు కూడా మా అమ్మగారంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. మా అమ్మకి మేం నలుగురు కూతుళ్లం. పుష్పవల్లి అమ్మకు ఇద్దరు కూతుళ్లు. సావిత్రమ్మకు ఒక కూతురు, కొడుకు. పిల్లలందరం బాగుండేవాళ్లం. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మ, సావిత్రమ్మగారు.. మమ్మల్నందర్నీ సమానంగా చూసేవారు. ► ‘మా నాన్నగారు డిగ్నిఫైడ్ పర్సన్’ అని ఇంతకు ముందు మీరన్నారు. మరి కట్టుకున్న భార్య ఉండగా వేరే అమ్మాయిలతో ఆయన ఎఫైర్స్ గురించి మీరేమంటారు? మా నాన్నగారు కావాలని ఎవరి చుట్టూ తిరగలేదు. ఆయన చాలా హ్యాండ్సమ్ మ్యాన్. బాగా చదువుకున్నారు. స్టార్ హీరో. ఆయన చుట్టూనే అమ్మాయిలు తిరిగేవారు. నాన్నను ప్రేమించినవాళ్లంతా సింగిల్ ఉమన్. పుష్పవల్లిగారు, సావిత్రిగారు.. ఇద్దరూ పెళ్లి కానివాళ్లే. ప్లస్ మా నాన్నగారు తనకు పెళ్లయిన విషయాన్ని ఎవరి దగ్గరా దాచి పెట్టలేదు. పుష్పవల్లి అమ్మను నాన్న పెళ్లి చేసుకోలేదు. ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. వాళ్లకు ఐడెంటిటీ ఇవ్వడం కోసం తన పిల్లలే అని యాక్సెప్ట్ చేశారు. అంతేకానీ మా నాన్నగారు మ్యారీడ్ ఉమెన్ లైఫ్‌లోకి ఎంటరై, వాళ్ల కాపురాలను నాశనం చేయలేదు. ► సావిత్రమ్మగారిని పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మగారు పడిన బాధ మీకు తెలుసా? అప్పుడు మేం చిన్నపిల్లలం. ఏం జరుగుతుందో తెలియని వయసు. అయితే బాగా ఏడ్చేదని మాత్రం తెలుసు. మా ఇంటి పక్కన విజ్జీయమ్మ అని ఉండేవారు. ఆవిడ దగ్గర చెప్పుకుని బాధపడేవారు. అయితే పిల్లల దగ్గర తన బాధను చెప్పుకోలేదు. ► స్కూల్లో మీ ఇంటి విషయాల గురించి మీ స్నేహితులు అడిగేవారా? అలా జరుగుతుందని అమ్మకు తెలుసు కాబట్టి, ఎవరేం అడిగినా ‘మాకు తెలియదు’ అని చెప్పమన్నారు. ‘మీ నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకున్నారట?’ అని ఎవరైనా అడిగితే అమ్మ చెప్పమన్నట్లే ‘మాకు తెలియదు’ అనేవాళ్లం. ► విజయ చాముండేశ్వరిగారు మీ అమ్మగారి గురించి కానీ మీ గురించి కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. తన తండ్రి గురించి కూడా తప్పుగా చెప్పలేదు... అవును. నేనూ ఎవర్నీ విమర్శించడంలేదు. విజ్జీ నన్ను సొంత అక్కలానే అనుకుంటుంది. నేను నా సొంత చెల్లెలిలానే అనుకుంటాను. మాలో మాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. సావిత్రమ్మగారు మమ్మల్ని బాగా చూసినట్లే మా అమ్మగారు కూడా విజ్జీని, తన తమ్ముడు సతీష్‌ని బాగా చూసేవారు. మా అక్క రేవతి పెళ్లప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. అమ్మ నాలుగు గోడల మధ్య పెరిగిన వ్యక్తి. అంత మంది మధ్యలోకి రావడానికి ఆవిడ ఇబ్బందిపడ్డారు. అప్పుడు సావిత్రమ్మే అన్నీ చూసుకున్నారు. చాలామంది రేవతక్క సావిత్రమ్మ కూతురు అనుకున్నారు. ► సావిత్రమ్మగారు చనిపోకముందే విజయ చాముండేశ్వరిగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత సతీష్ మీ ఇంట్లో ఉండేవారట? సావిత్రమ్మగారు చనిపోయాక ‘విజ్జీ అక్కతో ఉంటావా? నాతో పాటు ఉంటావా?’ అని నాన్నగారు సతీష్‌ని అడిగితే.. ‘మీతో ఉంటాను నాన్నా’ అన్నాడు. దాంతో నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారు సతీష్‌ని తన సొంత కొడుకులానే చూసుకున్నారు. మేం కూడా మా తమ్ముడనే అనుకున్నాం. సతీష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాన్నగారు ఏమీ అనలేదు. సతీష్‌కి కొడుకు పుడితే పుట్టు వెంట్రుకలు తీయించడానికి నేనే పళని గుడికి తీసుకెళ్లాను. మేమంతా అంత బాగుంటాం. ► మరి.. ముంబైలో సెటిలైన నటి రేఖ (పుష్పవల్లి కూతురు)గారితో మీరంతా టచ్‌లోనే ఉన్నారా? మేమంతా నెలకోసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. వీలు చేసుకుని ఆర్నెల్లకోసారి కలుస్తాం. ► సావిత్రిగారి ఆస్తుల్ని జెమినీగారు తీసుకున్నారని రూమర్ ఉండేది.. అది నిజం కాదు. నాన్నగారి ఆస్తిని ఆవిడ, ఆవిడ ఆస్తులను నాన్నగారు తీసుకోలేదు. అసలు మా నాన్నగారు తన పేరు మీద ఆస్తులు కొనేవారు కాదు. మా అమ్మ పేరు మీదనో, నానమ్మ పేరు మీదనో కొనేవారు. ► సావిత్రిగారు కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చేరే నాటికి ఆవిడకు ఆస్తులు లేవని చాలామంది చెప్పుకుంటారు... ఆవిణ్ణి చాలామంది మోసం చేశారు. నాన్నగారు చెప్పాలని ప్రయత్నిస్తే చాన్స్ ఇవ్వలేదు. ఆయన్ను దగ్గరికి రానివ్వలేదు. బంధువులు కొందరు, ఇంట్లో పని చేసినవాళ్లు కొందరు ఎవరి చేతికి చిక్కినవి వాళ్లు తీసుకెళ్లిపోయారు. ఆవిడ ఆస్పత్రిలో చేరాక మా నాన్నగారు చూసుకోలేదని చాలామంది అంటారు. అది నిజం కాదు. మొత్తం హాస్పిటల్ ఖర్చంతా ఆయనే కట్టారు. ► సావిత్రిగారి అంత్యక్రియలు మీ ఇంట్లోనే జరిగాయి కదా? అవును. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మగారు దగ్గరుండి చేశారు. భర్త బతికి ఉండగా చనిపోయిన స్త్రీ చివరి యాత్ర ఎలా జరుగుతుందో అలా సంప్రదాయానుసారం మా అమ్మ దగ్గరుండి చేయించారు. ► ఫైనల్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ నటన, జెమినీగారిలా దుల్కర్ నటన మీకు నచ్చాయా? కీర్తీ సురేశ్ అచ్చంగా సావిత్రమ్మల్లా మౌల్డ్ అయ్యారు. దుల్కర్ బాగా యాక్ట్ చేశారు. అయితే నాన్నగారు అందగాడు. కళ్లతోనే చెప్పాలనుకున్న విషయాలను కన్వే చేసేవారు. ఆయనలాంటి అందగాడు, నటుడు రారు. ఆయనకు రీప్లేస్మెంట్ లేదు. ► సావిత్రిగారి జీవితం నాశనం కావడానికి ఆవిడే కారణం అంటారా? నా ఒపీనియన్ అదే. ఆమె కొంచెం యారోగెంట్‌గా ఉండేవారు. అలాగని మంచి మనిషి కాదని కాదు. అందరికీ సహాయం చేసేవారు. కానీ మొండి మనిషి. నాన్నతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలన్నీ చక్కగా చూసుకునేవారు. ఆయనకు దూరమయ్యాక చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను మోసం చేయడం మొదలుపెట్టారు. మోసపోవద్దని చెప్పడానికి వెళ్లిన నాన్నను నానా మాటలు అన్నారు. ఆవిడ జీవితం అలా కావడానికి ఆమే కారణం. ► మీ అక్కాచెల్లెళ్ల గురించి చెబుతారా? మా నాన్నగారు ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మమ్మల్ని బాగా చదివించారు. మేం నలుగురుం బాగా స్థిరపడ్డాం. మా అక్క రేవతి పెద్ద డాక్టర్, నేను కూడా డాక్టర్. చెల్లెలు జయలక్ష్మీ డాక్టర్, చిన్న చెల్లెలు నారాయణి మంచి జర్నలిస్ట్. మా అందరికీ చాలా మంచి పేరుంది. కమలా సెల్వరాజ్, అలమేలు, జెమినీ గణేశన్, రేవతి (పైన) నారాయణి, జయలక్ష్మి నానమ్మ, నాన్న, అమ్మ అలమేలు, ఒళ్లో జయలక్ష్మి (పై వరస) నారాయణి, రేవతిలతో కమల – ఇంటర్వ్యూ: డి.జి. భవాని – కర్టెసీ: సంజయ్, చెన్నై -
మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్
-
రామ్ చరణ్ మల్టీ స్టారర్.. ఫేక్ న్యూస్
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రామ్ చరణ్ అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్‌తో కలిసి చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు కే చక్రవర్తి కథ అందిస్తుండగా కే యస్ రవిచంద్ర దర్శకత్వం వహిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై దుల్కర్ సల్మాన్ సన్నిహితులు స్పందించారు. దుల్కర్ ఏ మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించలేదని తెలిపారు. ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ కర్వాన్ పనుల్లో బిజీగా ఉన్న దుల్కర్, తరువాత ఇప్పటికే అంగీకరించిన మలయాళ చిత్రాలు పూర్తి చేయనున్నారు. -
మరో బయోపిక్కు సన్నాహాలు?
తమిళసినిమా: చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం నడుస్తోందనిపిస్తోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చిత్రంగా తెరకెక్కి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. సావిత్రి పాత్రలో నటించిన కీర్తీసురేశ్ ప్రశంసల జడివానలో తడిసి ముద్దవుతోంది. అదేవిధంగా సిల్క్‌స్మిత జీవిత చరిత్ర బాలీవుడ్లో ది దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఆందులో సిల్క్ పాత్రలో నటించిన విద్యాబాలన్ జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం సావిత్రి పాత్రలో నటించిన కీర్తీసురేశ్‌కు పలు అవార్డులు వరించడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. ఇదిలాఉండగా తమిళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎంజీఆర్ బయోగ్రఫీ ఇప్పుడు నిర్మాణంలో ఉంది. అదేవిధంగా జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా నటి సౌందర్య జీవితం వెండితెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. తెలుగు, తమిళం, కన్నడంభాషల్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య. ముఖ్యంగా కోలీవుడ్‌లో కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్స్‌తో నటించారు. టాలీవుడ్లో అందరు ప్రముఖ కథానాయకులతోనూ నటించారు. మంచి ఫామ్‌లో ఉండగానే సౌందర్య హెలి కాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు నిర్మాత రాజ్ కందుకూరి సన్నాహాలు చేస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ చిత్రంలో సౌందర్యగా మారే లక్కీఛాన్స్ ఏ నటికి దక్కుతుందో..! -
మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్
తమిళసినిమా: నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) ఇటీవలే తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు సావిత్రి పాత్రలో నటించిన నటి కీర్తీసురేశ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి కూడా చిత్రం బాగుందని ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి భర్త జెమినీగణేశన్ కూతురు, ప్రముఖ వైద్యురాలు కమలాసెల్వరాజ్ ఆ చిత్ర యూనిట్‌పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆమె బుధవారం ఒక వెబ్సైట్ విలేకరితో మాట్లాడుతూ నడిగైయిన్‌తిలగం చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ తీవ్రంగా ఆరోపించారు. తన తండ్రికి కళంకం ఆపాదించేలా చిత్రంలో చూపించారని అన్నారు. తన తండ్రి బిజీ నటుడన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అలాంటిది ఆయన అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు చూపించడమేంటని ప్రశ్నించారు. తొలిప్రేమ సావిత్రిపైనేనా? నాన్నకు తొలిసారిగా ప్రేమ కలిగింది సావిత్రి పైనే అనేలా చిత్రీకరించారని, అయితే అంతకు ముందు తన తల్లిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నారని అన్నారు. అంటే తన తల్లిపై ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించారు. నాన్నే సావిత్రికి మద్యం అలవాటు చేశారా? అదే విధంగా తన తండ్రే సావిత్రికి మద్యం సేవించడం అలవాటు చేసిన తాగుబోతుగా చిత్రంలో చూపించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురైయ్యానన్నారు. ఈ చిత్రంలో నాన్నను ప్రేక్షకులు అంగీకరించని నటుడిగా చిత్రీకరించారని, అలాంటప్పుడు ఆయనకు ప్రేక్షకులు కాదల్‌మన్నన్ ( ప్రేమరాజు) అనే పట్టం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సావిత్రి ప్రాప్తం చిత్రం చేయడానికి సిద్ధం అయినప్పుడు అంత పెద్ద నటి ఈ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని తన తండ్రి వద్దని చెప్పారన్నారు. ఎందరో ప్రముఖ నటులతో నటించిన సావిత్రికి ఆ నటులు సహాయం చేసి కాపాడవచ్చుగా అని అన్నారు. కానీ తన తండ్రే సావిత్రిని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకున్నారు నాన్న గురించి చెప్పాలంటే తనను ప్రేమించిన వారినే ఆయన పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన వారినెవరిని ఆయన చెడగొట్టలేదని అన్నారు. కుక్కను ఉసిగొల్పి గెంటేశారు ప్రాప్తం చిత్ర నిర్మాణం చేయాలన్న పంతంతో ఉన్న సావిత్రి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని చెప్పడానికి నాన్నతో కలసి తానూ ఆమె ఇంటికి వెళితే తమపై కుక్కను వదిలి గెంటేశారని, తాము కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి గోడ దూకి పారిపోవలసి వచ్చిందన్నారు. ఆ సంఘటన తరువాత నాన్న మళ్లీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని కమలా సెల్వరాజ్ చెప్పారు. -
‘మహానటి’డిలీటెడ్ వీడియో వైరల్
-
‘మహానటి’ డిలీటెడ్ సీన్.. వైరల్
అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కి విజయం సాధించిన మూవీ మహానటి. ఇటీవల విడుదలైన ‘మహానటి’లో నటనకుగానూ కీర్తి సురేష్‌కు నటిగా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది ‘మహానటి’. అయితే డిలీటెడ్ సీన్ అని క్యాప్షన్‌తో ఓ వీడియో క్లిప్ పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియదర్శిని పేటిక ముందు కీర్తి సురేష్ మాట్లాడిన క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటివి నిజంగా ఉంటే బాగుండు.. వేరే షూటింగ్లో ఉన్న మా ఆయనతో ఎంచక్కా మాట్లాడుకోవచ్చునంటూ కీర్తి చెప్పడం వీడియోలో వీక్షించవచ్చు. విదేశాల్లోనూ మహానటి మూవీ మంచి వసూళ్లు సాధిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా బ్యానర్లపై సీనియర్ నిర్మాత అశ్వనిదత్, ఆయన కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకదత్‌లు ఈ సినిమాను నిర్మించారు. -
జయలలిత బయోపిక్‌పై కీర్తి క్లారిటీ
మహానటి సినిమాతో ఘనవిజయం అందుకున్న కీర్తి సురేష్ నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయిన తీరు సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో మరో ప్రతిష్టాత్మక బయోపిక్‌లో కీర్తి సురేష్‌ను తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. మహానటి సక్సెస్ తరువాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో కీర్తి సురేష్ నటించనుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఈ విషయంపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. జయలలిత బయోపిక్కు సంబంధించి ఇంతవరకు తనను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. -
ముగ్గురు మనుషులు.. రెండు శవాలు
‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ హీరోగా నటించిన ‘ఒకే కన్మణి’ చిత్రం తెలుగులో ‘ఓకే బంగారం’ టైటిల్‌తో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో ‘కర్వాణ్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, మైథిలా పాల్కర్ ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమాను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా కొత్త పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు డిఫరెంట్ వ్యక్తుల లైఫ్ జర్నీతో ఈ సినిమా సాగనుందని బీటౌన్ టాక్. రెండు డెడ్‌బాడీస్ చుట్టూ ఈ ముగ్గురి కథ తిరుగుతుందట. అది ఎలా అనేది ఆగస్టులో వెండితెరపై చూడాల్సిందే. -
రాజమౌళి మల్టీస్టారర్ సినిమాలో కీర్తి?
సాక్షి, సినిమా: నటి కీర్తిసురేశ్ దేశం గర్వించదగిన మహానటి సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో నటించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగుతోంది. మహానటి సావిత్రి పాత్రలో అంతగా ఒదిగిపోయి నటించిందనే అభినందనల జల్లులో తడిసి ముద్దయిపోతున్న కీర్తిసురేశ్ గురించి ప్రస్తుతం చాలా విషయాలు ప్రచారం అవుతున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర తెరకెక్కనుందని, అందులో జయలలితగా కీర్తిసురేశ్ నటించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అదేవిధంగా సావిత్రి పాత్రలో కీర్తి నటనను ప్రశంసించిన ప్రముఖుల్లో దర్శకుడు రాజమౌళి ఒకరు. ఆయన తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ కథానాయకులుగా భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక కథానాయకిగా కీర్తిసురేశ్ నటించనున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే మహానటి సినిమా విజయవంతం కావడంతో కీర్తి మంగళవారం తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చాలా కాలంగా స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నానని, అయితే షూటింగ్స్ బిజీతో కుదరలేదని చెప్పింది. అదేవిధంగా తాను జయలలిత పాత్రలో నటించనున్నట్లు ప్రాచారం జరుగుతోందని, అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జయలలిత పాత్రనే కాదు ఏ ఇతర బయోపిక్‌లోనూ నటించడం లేదని పేర్కొన్నారు. అయితే రాజమౌళి చిత్రంలో నటించే విషయం గురించి ఎలాంటి అభిప్రాయాన్ని కీర్తి వ్యక్తం చేయలేదు. -
అతన్ని చూస్తే ఈర్ష్యగా ఉంది: రాజమౌళి
‘మహానటి’.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఈ సినిమా విడుదలైన రోజునుంచే మంచి వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ దూసుకుపోతుంది. ‘మహానటి’ ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక విందును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విందుకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో పాటు మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్న దత్, ప్రియాంక దత్, కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి హాజరైన జక్కన్న నాగ్ అశ్విన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్ అశ్విన్‌ను చూస్తే తనకు చాలా ఈర్ష్యగా ఉందన్నారు. నాగ్ అశ్విన్ చాలా గొప్ప దర్శకుడని, ‘మహానటి’ని తెరకెక్కించిన విధానం చూస్తే ఎవరైన ఆ విషయాన్ని ఒప్పుకుంటారని అన్నారు. ఈ చిత్రంలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకుంటూ, తాను నాగ్ అశ్విన్ అంత ఈజ్‌తో అలాంటి సన్నివేశాలను తీయలేనని నిజాయితీ ఒప్పుకున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ‘మహానటి’ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. -
‘మహానటి’కి అల్లువారి పార్టీ
మహానటి సినిమాకు వసూళ్లతో పాటు ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. సినిమా విడుదల అయిన రోజు నుంచీ సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. సినీ విమర్శకులు సైతం ‘మహానటి’ని సావిత్రికి నివాళిగా అభివర్ణించారు. మహానటి ఇంత గొప్ప విజయం సాధించడానికి దర్శక,నిర్మాతలు పడిన కష్టం తెరమీద కనబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్‌లను మీడియా సమక్షంలో సత్కరించారు. తాజాగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ మహానటి బృందానికి ప్రత్యేక విందు పార్టీని ఇచ్చారు. నిన్న (ఆదివారం) సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణిలు కూడా హాజరయ్యారు. స్వప్నదత్, ప్రియాంక దత్, నాగ్ అశ్విన్‌లను అల్లు అర్జున్, అరవింద్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది. మే 9న రిలీజైన మహానటి అమెరికాలో మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి విజయవంతంగా దూసుకెళ్తోంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ మహానటి
-
మహా విజయం
-
ఓవర్సీస్లో ‘మహానటి’కి బ్రహ్మరథం
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి చిత్రం ఓవర్ సీస్లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే అమెరికాలో మిలియన్ డాలర్ (ఆరు కోట్ల రూపాయల) మార్క్‌ను దాటిన మహానటి సినిమా ఇతర ప్రాంతాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది. మహానటి ఓవర్ సీస్ కలెక్షన్ల వివరాలు ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1,25,900 డాలర్లు (64.03 లక్షల రూపాయలు), యూకేలో 28,373 పౌండ్లు (25.90 లక్షల రూపాయలు), న్యూజీలాండ్‌లో 9,899 డాలర్లు ( 4.65 లక్షల రూపాయల) వసూళ్లు సాధించినట్టుగా వెల్లడించారు. కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా బ్యానర్లపై సీనియర్ నిర్మాత అశ్వనిదత్, ఆయన కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకదత్‌లు ఈ సినిమాను నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాను అన్ని చోట్లా సూపర్ హిట్ రావటంతో వసూళ్ల పరంగా కూడా మహానటి చిత్రం సత్తా చాటుతోంది. -
‘మహానటి’కి బన్నీ పార్టీ..!
మహానటి టీంపై ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్‌కు అభినందలు తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మహానటి దర్శక నిర్మాతలు ఇంటికి పిలుపించుకొని మరి అభినందించారు. ఇప్పుడు మహానటి టీం కోసం అల్లు అర్జున్ ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ పార్టీకి చిత్రయూనిట్‌తో పాటు పలువురు యువ దర్శకులు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్ సీస్లో ఇప్పటికే మిలియన్ మార్క్‌ను దాటిన మహానటి మరిన్ని రికార్డుల దిశగడా దూసుకుపోతోంది. -
కీర్తీకి కమల్ ప్రశంసలు
తమిళసినిమా : నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సావిత్రి పాత్రలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందించిన చిత్రం నడిగైయార్ తిలగం. దుల్కర్సల్మాన్, సమంత, అర్జున్‌రెడ్డి ఫేమ్ విజయ్‌దేవరకొండ, శాలిని పాండే, నాగ్‌చైతన్య, రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం శక్రవారం తెరపైకి వచ్చింది. సావిత్రి ప్రారంభ దశను మహానటిగా వెలిగిన దశను, వ్యక్తిగత అంశాలను సమతుల్యంగా ఏ ముఖ్య విషయాన్ని మిస్ కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత దృశ్యకావ్యంగా చిత్రాన్ని మలిచారు. చిత్ర షూటింగ్ దశలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్నా? అంటూ ఆక్షేపణ చేసిన వారు ఇప్పుడు ఆహా ఏం అభినయం అంటూ ప్రశంసిస్తున్నారు. విశ్వనటుడు కమలహాసన్ కూడా నటి కీర్తీసురేశ్‌ను శుక్రవారం ప్రత్యేకంగా తన ఇంటికి పిలిపించి మరీ అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నటి కీర్తీసురేశ్ తన ట్విట్టర్లో పేర్కొంటూ కమలహాసన్ ప్రశంసలు లభించడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా పేర్కొన్నారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అన్నారు. ఇలా కీర్తీసురేశ్‌ను అభినందించిన వారిలో సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రముఖులెందరో ఉన్నారు. ఇంతకు ముందు కీర్తీపై వ్యంగాస్త్రాలు సంధించిన నెటిజన్లు ఇప్పుడు ఆమె నటనను కీర్తిస్తుండడం విశేషం. చిత్రం నిర్మాణంలో ఉండగా సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్ నటించడానికి సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీనియర్ నటి జమున వంటి వారి వ్యాఖ్యలకు కీర్తీసురేశ్ చిత్రం చూడకుండా విమర్శించడమా అంటూ గట్టిగానే బదులిచ్చారు. అప్పుడే ఆమెలోని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. అలా కీర్తీసురేశ్ గెలిచారు. మహానటి సావిత్రి మాదిరిగానే ఆమె జీవిత చరిత్ర వెండితెరపై చిరస్మరణీయమైంది. -
విజయ్ ఆంటోనీ
-
అమ్మ మళ్లీ పుట్టింది
పునరపి జననం. పునరపి మరణం. జీవితం ఒక చక్రం. మన చేతిలో గీతల్లాగే కాలచక్రంలోనూ గీతలుంటాయి. వేగంగా తిరుగుతున్న చక్రం మధ్యలో మసక కనపడుతుంది. చక్రం ఆగినప్పుడే ఆ గీతలు కనపడతాయి. సావిత్రి జీవితం చక్రంలా తిరిగినన్ని రోజులు మసకే కనిపించింది. అది ఆగినప్పుడే ఆ గీతల కొలతలు మొదలయ్యాయి. ‘మహానటి’ సినిమా.. లేని గీతలు చెరిపేసి, మిగతా గీతలను రాయి మీద గీసింది. మహానటి ఒక మహా నిజం చెప్పింది. సావిత్రి మళ్లీ పుట్టింది... అంటోంది విజయ చాముండేశ్వరి. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సుమారుగా 30కోట్లతో నిర్మించిన ఈ సినిమా బిజినెస్ బాగుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సినిమా శాటిలైట్ రైట్స్ సుమారు 20 కోట్లపైగా పలుకుతున్నాయని సమాచారం. ఇక సినిమా టోటల్ షేర్ 75కోట్లకు చేరుకుటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘మహానటి’ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా..సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరీతో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ... సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది ? నాకు టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లి వచ్చినట్టుగా అనిపించింది. అమ్మతో పాటు మళ్లీ కొన్నాళ్లు జీవించినట్టుగా అనిపించింది. తల్లిని పిల్లలు అలా తెర మీద చూసుకునే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి? చాలా హ్యాపీగా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే ఇచ్చిన మాట తప్పకుండా ఒక సెలబ్రేషన్‌లా చూపిస్తాం సావిత్రిగారిని అన్న మాటను టీమ్ నిలబెట్టుకున్నారు. నిజంగానే సెలబ్రేషన్‌లా ఉంది సినిమా. ఉదయమే అశ్వనీదత్‌గారు ఫోన్ చేసి రెండు రోజుల నుంచి ఇంట్లో పెళ్లిలా ఉందమ్మా రెస్పాన్స్ చూస్తుంటే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ వల్ల అమ్మ మళ్లీ పుటింది అని అంటే.. లేదమ్మా అమ్మ వచ్చి మా పిల్లలందరితో సినిమా చేయించుకుంది అన్నారు దత్‌గారు. ఎక్కడా తప్పులు ఉన్నట్టుగా అనిపించలేదా? అస్సలు ఎక్కాడా అనిపించలేదు. వాస్తవాన్ని చూపించటం కూడా చాలా క్లాస్‌గా చూపించారు. అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో ఎవరెవరివో పేర్లు బయటకు చెప్పడం మాకు ఇష్టం లేదు. అందుకే జనరల్‌గా ఎవరో వచ్చి నగలు తీసుకు వెళ్లినట్టు ఎవరో ఆస్తిని సైన్ చేసుకున్నట్టు చూపించారు. కానీ పేర్లు ప్రస్థావించలేదు. ఆ నగల మూట సంఘటన మీకు గుర్తుందా? అది నాకు కళ్లకు కట్టినట్టుగా గుర్తు. స్కూల్ నుంచి వచ్చాను. బెడ్ మీద మూటలు ఉన్నాయి. ఎగ్జాజిరేషన్ అనుకుంటారు. బెడ్ మీద చాకలి మూట వేసినట్టుగా అన్ని నగలు మూట కట్టుకొని భుజాన వేసుకొని తీసుకొని వెళ్లిపోయేవారు. ఇన్కమ్ టాక్స్ వాళ్లు కూడా తీసుకొని వెళ్లారు కదా. అలా తీసుకువెళ్లి పోయినా మళ్లీ అమ్మ నగలు చేయించుకుంది. అయితే అన్ని కష్టాల్లో కూడా ఎవరైనా సహాయం కావాల్సి వస్తే చేసేది. అమ్మ చేతిలో ఏదీ ఆగదు. అన్నీ ఇచ్చేయటమే. పట్టు చీర అమ్మి మరీ ఇతరులకు డబ్బులు సహాయం చేశారా? పట్టు చీరలు , అవార్డ్స్ అమ్మారు. ఏదీ ఎగ్జాజిరేట్ చేయలేదు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఈ రెండు లక్షలు నేను సతీష్ (మీ తమ్ముడు) కోసం దాచాను. ఇవి మాత్రం ఎవ్వరికీ ఇవ్వను’ అని. సో ఫైనల్‌గా అమ్మ వెళ్లిపోయేటప్పటికి మిగిలింది ఆ రెండు లక్షలేనా? నంబర్‌గా సరిగ్గా చెప్పలేను. అమ్మ చెప్పింది క్యాష్ మాత్రమే. అమ్మ పోయేటప్పటికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు చైన్నై హబీబుల్లా రోడ్లో ఒక ఇల్లు. కొడైకెనాల్లో ఒక ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా ఏమీ లేకుండా పోయింది అని అంటే నేను ఒప్పుకోను. తమ్ముడికి నాకు వచ్చింది పంచుకున్నాము. ఆ తర్వాత తమ్ముడు ‘నేనిక్కడ ఉండను అక్కా వెళ్లిపోతాను’ అన్నాడు. తన వాటా అమ్మేసి యూఎస్ వెళ్లిపోయాడు. మీరు ఇప్పుడు హబీబుల్లా రోడ్లోనే ఉంటున్నారా? అక్కడే ఉండేవాళ్లం. రెండు సంవత్సరాల క్రితమే ఆ ఇల్లు అమ్మేసి ఎగ్మూర్‌కి వచ్చేశాం. అక్కడ ఉండటం కష్టంగా ఉంది. అక్కడ ఉంటే అమ్మ గురించే మనసు లాగుతుంది. సెంటిమెంట్‌గా అక్కడే ఉండాలి అని అంతకాలం ఉన్నాను. అక్కడి నుంచి ఎగ్మూర్‌లో మంచి అపార్ట్మెంట్కి వచ్చాం. చెప్పుకోవల్సిన అవసరం ఉంది. 2,650 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్. నయనతార, దర్శకుడు అట్లీ ఉండే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. అమ్మ ఏమీ లేకుండా పోయింది అనుకుంటున్నారు. మమ్మల్ని చూసైనా మీరు ఆ అభిప్రాయం మార్చుకోవాలి. చేతిలో క్యాష్ లేకపోవడంతో అవస్థ పడ్డారు అమ్మ. ఆస్తుల నుంచి క్యాష్ చేసుకోవడం అమ్మకు తెలియలేదు. సినిమా స్టార్టింగ్‌లో హాస్పిటల్లో సావిత్రి గారిని బయట కింద పడిలోబెట్టినట్టు చూపించారు. అదీ నిజమేనా? నిజమే. హాస్పిటల్‌కి వెళ్ళగానే స్ట్రెచర్ మీద పడుకోబెడతారు కదా. మన కోసం రూమ్స్ అన్నీ ఖాళీగా ఉండవు కదా. సినిమాలో స్క్రీన్‌ప్లే కోసం అలా బయట కింద పడుకోబెట్టారు. రూమ్ కోసం ఎదురు చూసే ఆ సమయంలో జరిగిన సంఘటన అది. అది కర్ణాటక అయ్యేసరికి వాళ్లు గుర్తించటానికి కొంచెం సమయం పట్టింది. వేరే అమ్మాయితో జెమినీ కనిపించగానే సావిత్రిగారు హర్ట్ అయ్యి జెమినీని దూరంపెట్టేసినట్టు సినిమాలో చూపించారు. నిజంగానే దూరంపెట్టారా? రానివ్వలేదు. అసలు రానిచ్చేవారు కాదు అమ్మ. నాన్న కొన్నిసార్లు గోడ దూకి కూడా వచ్చేవాళ్లు. షూట్ చేశారు కానీ లిమిటెడ్ టైమ్ కాబట్టి ఎడిటింగ్‌లో తీసేశారు. అమ్మ చుట్టు ఉండే బంధువులు నాన్నను రానివ్వలేదు. కొన్ని విషయాలు అమ్మ దగ్గర దాచేశారు కూడా. జెమినీగారు గోడ దూకి రావటానికి ప్రయత్నించారన్న విషయాన్ని కూడా తెలియకుండా చేశారా? ఆయన కూతురని చెప్పడం కాదు కానీ అందరూ కలిసి నాన్నను విలన్ చేశారు. ఆయన క్యారెక్టర్ కరెక్ట్‌గా చూపించారు సినిమాలో. నాన్నగారు అమ్మని చాలా ప్రేమించారు. తర్వాత ఆయన కూడా తాగటం మొదలెట్టారు. నాన్నగారి దగ్గరకు మీరు వెళ్లేవారా? మేం వెళ్లటం రావడం బాగానే జరిగాయి. ఆ విషయంలో ఏ అబ్జక్షన్ పెట్టలేదు. ఆవిడ కలవ లేదని కాని మమల్ని బాగానే వెళ్లనిచ్చేవారు. నాన్న పండగలకు మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కుడా వెళ్లేవాళ్లం. అద్దె ఇంట్లోకి వెళ్లిపోయారు. అదంతా గుర్తుందా? అన్నానగర్‌కి మారిపోయాం. అంతా గుర్తుంది. నాకు పెళ్లి అయిపోయి నేను దూరంగా ఉన్నాను. మళ్లీ చైన్నైకి వచ్చాను కానీ అమ్మ తను ఒక్కత్తే ఉండాలి ఎవ్వరితో సంబంధం వద్దూ అన్నట్టుగా ఉండిపోయింది. కీర్తీ యాక్టింగ్ ఎలా అనిపించింది తను యాక్ట్ చేసిందా? అమ్మలాగా జీవించిందా? అనిపించింది. అమ్మ ఎలా అయితే పసిపిల్లగా ఉన్నప్పుడు నా వల్ల కాదంటారా అనే సీన్స్‌లో నీవల్ల ఏమవుతుంది అని అంటే సినిమాల్లో చేసి చూపించింది. సినిమాలో మీకు ఎక్కువగా నచ్చిన సన్నివేశాలు ఏమిటి? అమ్మ ఎర్లీ ఏజ్ సీన్స్ అన్నీ బాగా నచ్చాయి. మ్యూజిక్, డైలాగ్స్ చాలా నచ్చాయి. విజయ చాముండేశ్వరి, కీర్తిసురేశ్ 2017 డిసెంబర్లో ‘సాక్షి’కి విజయ చాముండేశ్వరి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుండి కొన్ని ప్రధానాంశాలు మీ కోసం మీ అమ్మగారి చివరి రోజుల్లో మీ నాన్నగారు (నటుడు జెమినీ గణేశన్) పట్టించుకోలేదని, ఆస్పత్రిలో అనామకురాలిలా ఆమె ఉండేవారని అంటుంటారు... అమ్మ దగ్గరే ఉండేవారు నాన్న. స్పెషలిస్ట్ అనదగ్గ ఏ డాక్టర్నీ ఆయన వదిలిపెట్టలేదు. నేను, నా తమ్ముడు ఆస్పత్రికి వెళ్లి చూస్తుండేవాళ్లం. నిజానికి అమ్మను విదేశాలు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకున్నాం. నాన్న డాక్టర్స్‌తో మాట్లాడితే, ‘అసలు ప్రయాణం చేసే పరిస్థితి లేదు’ అన్నారు. అందుకని ఆగాం. ఇది తెలియనివాళ్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదని, సరైన చికిత్స చేయించలేదని, విదేశాలు తీసుకెళ్లలేదని అంటుంటారు. సావిత్రిగారు కోమాలో ఉన్నప్పుడు మీరు టీనేజ్‌లో ఉండి ఉంటారేమో? నాకప్పుడు 16 ఏళ్లు. అప్పటికి నా పెళ్లయింది. ఒక బాబు కూడా పుట్టాడు. ఈ వయసులో ఇంటికి పరిమితం కాకూడదని నాన్న చదివించారు. సరిగ్గా ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్‌లో అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పుడు బాబ్జీ పెద్దమ్మ (జెమినీ పెద్ద భార్య) ‘నువ్వు ఎగ్జామ్స్ గురించి పట్టించుకో. అమ్మని నాన్న చూసుకుంటారులే’ అని, నన్ను దగ్గరుండి తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాయించింది. ఎగ్జామ్, ఎగ్జామ్‌కి మధ్య గ్యాప్ వస్తుంది కదా.. అప్పుడు వెళ్లి అమ్మను చూసేదాన్ని. కళ్లు తెరచి అలా చూస్తుండేది. ఒక్కోసారి మాత్రం నా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకునేది. పిల్లలంటే ఇష్టం కాబట్టి, అప్పుడు చలనం వచ్చేదేమో. డాక్టర్లు ఆమెతో కంటిన్యూస్‌గా మాట్లాడమనే వాళ్లు. మేం ఏదేదో చెబుతుండేవాళ్లం. మరి.. అమ్మకు అవి అర్థమయ్యాయో లేదో తెలియదు. 19 నెలలు కోమాలో ఉండిపోయింది. అందులోంచి బయటకు రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. బాబ్జీ పెద్దమ్మ అంటే సావిత్రిగారి అక్కా? కాదు. మా నాన్నగారి పెద్ద భార్య. నాన్నగారి ఇంకో భార్య పుష్పవల్లి. ఆమె కూతురు రేఖ. ఇంకో కూతురు రాధ. నేను ఇంతకుముందు చెప్పిన పెద్దమ్మ అసలు పేరు అలమేలు. నాన్నగారు ‘బాబ్జీ’ అని పిలిచేవారు. మేం కూడా బాబ్జీ పెద్దమ్మా అనేవాళ్లం. ఆవిడకు నలుగురు కూతుళ్లు. అమ్మ, పెద్దమ్మ బాగుండేవాళ్లు. ఎక్కువ రోజులు హాలిడేస్ ఉంటే మేం కొడైకెనాల్ వెళ్లేవాళ్లం. అక్కడ అమ్మకో ఇల్లు. బాబ్జీ పెద్దమ్మకో ఇల్లు ఉండేది. పిల్లలమంతా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరుగుతూ ఆడుకునేవాళ్లం. పుష్పవల్లిగారు కూడా మీ బాబ్జీ పెద్దమ్మలా మీతో బాగుండేవారా? నాన్న అప్పుడప్పుడూ ఆవిడ ఇంటికి తీసుకు వెళ్లేవారు. ఆమె బాగానే మాట్లాడేది కానీ, బాబ్జీ పెద్దమ్మ అంత క్లోజ్ కాదు. అయితే అమ్మ, పుష్పవల్లి ఆంటీ బాగానే ఉండేవారు. మరి.. ఆవిడ పిల్లలు రేఖ, రాధతో మీ అనుబంధం? పిల్లలం బాగానే ఉండేవాళ్లం. రేఖ ముంబైలో ఉండేది. తన మూతి విరుపు, నవ్వు అమ్మలా ఉంటాయని పుష్పవల్లి ఆంటీ అంటుండేది. ‘నా కడుపున పుట్టింది. చేష్టలన్నీ నీవే’ అని రేఖ గురించి ఆంటీ అంటే అమ్మ నవ్వేది. చిన్నప్పుడు రేఖ, రాధతో మాకు క్లోజ్‌నెస్ పెద్దగా లేదు. పెద్దయ్యాక మాత్రం క్లోజ్ అయ్యాం. రేఖ అయితే ‘నాకు బిడ్డలు లేరు. యు ఆర్ మై బేబీ’ అని నన్ను అంటుంటుంది. నా తమ్ముడు (సతీష్) కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. రాధ కూడా అక్కడే ఉంటోంది. వాళ్లిద్దరి మధ్య రాకపోకలు ఉన్నాయి. ఎంత లేదన్నా ఒక్క తల్లి కడుపున పుట్టలేదు కాబట్టి, మీ అందరి మధ్యా చిన్నపాటి మిస్ అండర్స్టాండింగ్స్ అప్పుడప్పుడూ అయినా రావడం కామనే కదా? చిన్నప్పుడు లేవు కానీ, కొంచెం పెద్దయ్యాక పొరపొచ్చాలు వచ్చిన మాట వాస్తవమే. ఇటు యంగ్ అటు ఓల్డ్ కాని ఏజ్ ఒకటుంటుంది కదా. అప్పుడు చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయి. మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల కెరీర్ గురించి, బాగోగుల గురించీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మాకు పిల్లల భవిష్యత్తు ప్రధానంగా అనిపించింది. మా మధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా మాయమయ్యాయి. మా మధ్య రాకపోకలు బాగానే ఉంటున్నాయి. అమ్మానాన్న మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పిల్లలందరూ ఎలా ఉండేవాళ్లు? వాళ్లిద్దరికీ పడలేదని మాకు తెలియదు. ఎందుకంటే మా దగ్గర వాళ్లేమీ చెప్పలేదు. దాంతో మేమంతా బాగానే ఉండేవాళ్లం. ఒకవేళ తెలిసి ఉంటే ఆ మిస్ అండర్‌స్టాండింగ్స్‌ని పోగొట్టడానికి ఏదైనా చేసేదాన్నని మీకు అనిపిస్తోందా? ఆ ఫీలింగ్ ఉంది. అయితే అప్పుడు నాది టీనేజ్. ఇప్పుడు పదిహేను పదహారేళ్ల పిల్లలకు ఉన్నంత మెచ్యూర్టీ అప్పట్లో ఉండేది కాదు. పైగా అమ్మ పెంపకంలో మాకు కష్టాలు తెలియలేదు. లైఫ్ హ్యాపీగా గడిచిపోయేది. జెమినీగారి మొదటి, రెండో భార్య పిల్లలను కూడా మీతో పాటే సమానంగా చూసేవారా మీ అమ్మగారు? ఒకర్ని ఎక్కువగా మరొకర్ని తక్కువగా చూడటం అమ్మకు తెలియదు. మా బాబ్జీ పెద్దమ్మ కొంచెం స్ట్రిక్ట్. అందుకని పెద్దమ్మ పిల్లలు అమ్మ దగ్గర ఫ్రీగా ఉండేవాళ్లు. అమ్మ దగ్గరికొచ్చి జడలు వేయించుకునేవాళ్లు. జడలు వేసేంత తీరిక సావిత్రిగారికి ఉండేదా? ఈ విషయంలో అమ్మను మెచ్చుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు. ఏదైనా మనం ప్లాన్ చేసేదాన్ని బట్టే ఉంటుందని అమ్మ లైఫ్ చూసి తెలుసుకున్నాను. తనో స్టార్ అనే ఫీలింగ్ అమ్మకు ఉండేది కాదు. అందరి అమ్మలు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో మా అమ్మ కూడా అలానే చూసుకుంది. జెమినీ గణేశన్‌గారు సావిత్రిగారి ఆస్తి కొల్లగొట్టారనే సందేహం కొంతమందిలో అలానే ఉండిపోయింది... అది నిజం కాదు. అమ్మ ఆ ఇంటి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. మేం కూడా ఆ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండేవాళ్లం. అక్కణ్ణుంచి మేం ఏదీ ఆశించలేదు. అమ్మ ఆస్తుల్లో వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. అక్కణ్ణుంచి మేం ఏమీ తెచ్చుకోలేదు. అమ్మని నాన్న మోసం చేయలేదు కానీ, కొందరు బంధువులు మాత్రం చేశారు. మరి.. చివరి రోజుల్లో సావిత్రిగారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారనే అభిప్రాయం ఎందుకు బలపడింది.. సావిత్రిగారి అంతిమ క్రియలు ఎవరింట్లో జరిగాయి? కొందరి ఊహలకు అంతు ఉండదు. అమ్మ ఎన్నో సినిమాలు చేసింది. ఆవిడకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి? నాన్న ఆవిణ్ణి దయనీయ స్థితిలో వదిలేయలేదు. చివరి కార్యక్రమాలన్నీ నాన్న ఇంటి (చెన్నై, నుంగంబాక్కమ్) లోనే జరిగాయి. బాబ్జీ పెద్దమ్మ, పుష్పవల్లి పెద్దమ్మ దగ్గరుండి జరిపించారు. మీరు కూడా మీ అమ్మగారిలా అందంగా ఉంటారు కదా.. మరి ఆవిడలా హీరోయిన్ కావాలనుకోలేదా? అమ్మ స్టార్ కావడంతో చిన్నప్పుడు మాకంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అమ్మతో కలసి ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టేసేవారు. సినిమాకెళ్లినా, హోటల్‌కెళ్లినా... ఎక్కడికెళ్లినా ప్రైవసీ ఉండేది కాదు. దాంతో చాలా మిస్సయినట్లుగా అనిపించేది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్లాలనుకోలేదు. అమ్మకి కూడా ఆ ఫీలింగ్ లేదు. నాది పాత పద్ధతి అనిపించవచ్చేమో కానీ, ఇంటి పట్టున ఉండి భర్త–పిల్లలను బాగా చూసుకుంటే చాలు వేరే ఏ వ్యాపకం అవసరంలేదనుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్లను తప్పుబట్టడంలేదు. నా ఫీలింగ్ చెప్పానంతే. పిల్లలు పెరిగే టైమ్‌కి తల్లిదండ్రుల అవసరం చాలా ఉంటుంది. ఉదయం ఉరుకుల పరుగులతో బయటికెళ్లి, సాయంత్రం పిల్లలతో గడిపే తీరిక లేకపోతే ఏం లాభం? అమ్మా నాన్నల పరంగా మేం మిస్సయిన విషయం ఒకటుంది. స్కూల్లో ‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’ అంటే వచ్చే వాళ్లు కాదు. ఫోన్లో టీచర్స్‌తో మాట్లాడినా.. మిగతా పిల్లల్లా మన అమ్మానాన్న రాలేదే? అనే ఫీలింగ్ ఉండేది. మీ అమ్మగారు అమాయకత్వం నిండిన పాత్రలు కొన్ని చేశారు.. నిజంగా కూడా అలానే ఉండేవారని మా ఫీలింగ్? ఎగ్జాట్లీ. అమ్మ చాలా ఇన్నోసెంట్. తలుపు తట్టి ఎవరేం అడిగినా కాదనేది కాదు. మా పిల్లలకు బాగాలేదనో.. మా ఆవిడకు బాగాలేదనో.. ఇలా రకరకాల కారణాలు చెప్పి, డబ్బులు తీసుకెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఫేస్ డల్‌గా పెట్టుకుంటే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా హెల్ప్ చేసేది. -
చిరును డైరెక్ట్ చేయనున్న నాగ్ అశ్విన్?
-
మెగాస్టార్‌తో నాగ్ అశ్విన్ సినిమా...?
మహానటి మూవీతో అభిరుచి గల డైరెక్టర్ అని నిరూపించుకున్నారు నాగ్ అశ్విన్. తీసింది రెండు సినిమాలే అయినా... రెండూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మహానటి సినిమా విడుదలైనప్పటి నుంచి నాగ్ అశ్విన్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా కోసం నాగ్ పడిన కష్టం తెరపైన కనపడుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు మహానటి దర్శక నిర్మాతలను సత్కారించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అశ్వనీదత్ మాట్లాడుతూ... గత రెండు మూడేళ్లుగా చిరంజీవి గారికి ఎన్నో కథలు వినిపిస్తున్నాము, కానీ కుదరట్లేదు. మా కాంబినేషన్లో ఒక పెద్ద సినిమా ఉంటుంది. నాగ్ అశ్విన్ కూడా ఒక లైన్ అనుకున్నారని.. సినిమా పేరు భైరవ అని... టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో సినిమా ఉండొచ్చని అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. నాకూ పాతాళ భైరవి లాంటి సినిమా, జానపద నేపథ్యంలో, మాయలు మంత్రాలు లాంటి సినిమా చేయాలని ఉందంటూ తెలిపారు. వైజయంతీ మూవీస్, చిరంజీవి, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ సినిమా మాత్రం ఉంటుందని తెలిసిపోయింది. అయితే అది ఇప్పట్లో మాత్రం కుదిరేలా లేదు. చిరంజీవి ప్రస్తుతం సైరాతో బిజీగా ఉన్నారు. తరువాత బోయపాటి శీను, త్రివిక్రమ్, కొరటాల శివతో సినిమాలు ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నంటిలో ఏది పట్టాలెక్కుతుందో చూడాలి. -
‘మహానటి’పై మెగాస్టార్ ప్రశంసల జల్లు
-
’సిని’మా కథ
-
‘మహానటి’ యూనిట్‌కు మెగాస్టార్ అభినందనలు
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. గత బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిత్రయూనిట్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి.. దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిత్రం ఘనవిజయం సాధించినందుకు గానూ శుభాకాంక్షలు తెలియజేసిన చిరు.. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నా దత్‌లకు శాలువాలు కప్పి సత్కరించారు. శుక్రవారం తమిళనాట నడిగయ్యార్ తిలగం పేరుతో రిలీజ్ అయిన మహానటికి అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ రావటం విశేషం. -
సావిత్రి బయోపిక్ మహద్భాగ్యం
తిరుపతి కల్చరల్: దక్షిణ భారత సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి బయోపిక్‌పై చిత్రం తీయడం మహద్భాగ్యమని వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి తిరుపతి ప్రతాప్ థియేటర్లో ఆయన మహానటి చిత్రాన్ని తిలకించారు. ఆయనకు టీటీడీ ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పుష్పగుచ్ఛంతో ఘనంగా స్వాగతం పలికారు. అశ్వనీదత్ మాట్లాడుతూ తాను నిర్మించిన మొదటి చిత్రం ఎదురులేని మనిషి నుంచి నేటి మహానటి వరకు చిత్రాలను ప్రదర్శించి.. తనకు విజ యాలు అందిస్తున్న తిరుపతి గ్రూప్ థియేటర్స్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో పూర్వ నటీ నటులను, నిర్మాతలను తలుచుకునే అవకాశం లభించిందని తెలి పారు. టెక్నీషియన్స్ అందించిన సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం తాను నిర్మాతగా నాగార్జున, నానితో నిర్మిస్తున్న చిత్రం 40 శాతం పూర్తి కావచ్చిందని తెలిపారు. జూన్ 9 నుంచి మహేష్‌బాబు చిత్రం ప్రారంభమవుతుందని చెప్పారు. తర్వాత తమిళ, హిందీ దర్శకులతో కొత్త ప్రాజెక్టులు చేయనున్నట్లు వెల్ల డిం చారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ థియేటర్స్ మేనేజర్ సిద్ధారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సావిత్రి గారే బహుశా అలా చేయించారేమో..
తొలితరం హీరోయిన్ సావిత్రి అద్భుత పాత్రలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు, ప్రేక్షకులు చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద ‘మహానటి’ మంచిగా రాణిస్తోందని ప్రముఖలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేరిపోయారు. ఈ చిత్రంపై తన ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. అంతేకాక చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘మహానటి ఓ అనుభవం. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. అలనాటి నటి సావిత్రి గారికి ఈ చిత్రం రూపంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఘన నివాళి ఇచ్చారు.’ ‘ఈ చిత్రానికి జీవం పోసినందుకు ప్రియాంక, స్వప్న, దత్ గారికి థ్యాంక్స్. ఈ ‘మహానటి’లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, చిత్రం యూనిట్ చాలా కష్టపడి అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ మ్యూజిక్ సమకూర్చారు. ‘మహానటి’ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అని జూనియర్ ఎన్టీఆర్ వరుస ట్వీట్లు చేశారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతుంది. -
ఎంత బాగుందంటే.. ఎంత బాగుందో చెప్పలేనంత!
‘మహానటి’ విడుదలైనప్పటి నుంచి సినీ ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. విమర్శకులు సైతం ఈ సినిమాలో లోపాలు చూపెట్టలోకపోతున్నారు. రివ్యూలు కూడా ‘మహానటి’ సినిమాను సావిత్రికి ఘన నివాళిగా పేర్కొన్నాయి. ఇదొక క్లాసిక్ సినిమా, మహానటి సావిత్రి సినీ చరిత్రలో ఎలా నిలిచిఉంటుందో.. ఈ ‘మహానటి’ కూడా సినీ చరిత్రలో నిలిచి ఉంటుందని సినీ అభిమానులు అంటున్నారు. తాజాగా మహానటిపై నాని స్పందిస్తూ.. ఎంత బాగుంది అంటే.. ఎంత బాగుందో చెప్పలేనంత అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘కీర్తి సురేశ్ తప్ప మరెవ్వరూ సావిత్రి గారి పాత్రను ఇంత బాగా పోషించలేరు. నాగి (డైరెక్టర్ నాగ్ అశ్విన్) ని చూస్తే గర్వంగా ఉంది. స్వప్నా, ప్రియాంక, దుల్కర్, సామ్, విజయ్, డాని, మిక్కిజే అందరికీ ధన్యవాదాలు’అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. #Mahanati Entha bagundhantey ... Entha bagundho cheppalenantha.@KeerthyOfficial only person who can play this role better than you is Savithri gaaru :)#Nagi super proud of you Swapna,Priyanka,Dulquer,sam,vijay, Dani,MickeyJ and to the entire team .. Thank you 🤗 — Nani (@NameisNani) 11 May 2018 -
తండ్రిగా గర్వంగా.. కొడుకుగా ఈర్ష్యగా ఉంది : నాగ్
కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా పేజ్ లో ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘ఈ రోజు నేను తండ్రిగా గర్వపుడుతున్నా.. కొడుకుగా ఈర్ష్య పడుతున్నా.. నేను ఎప్పుడు నా తండ్రి లెజండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించలేదు. కానీ ఈ రోజు నాగచైతన్య ఆ పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది’ అంటూ మహానటి సినిమాలోని నాగచైతన్య లుక్‌ను రిలీజ్ చేశారు నాగార్జున. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగా యువ నటుడు నాగచైతన్య కనిపించారు. సినిమాలోని నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన వీడియోకు యంగ్ హీరో నాని వాయిస్ ఓవర్ అందించారు. Am today a proud father and a jealous son. I never played my father legendary #ANR Garu. But, I am overwhelmed and very happy to present to you all, Chay as ANR in #Mahanati #ANRliveson 👉 https://t.co/v1FdzRajcp pic.twitter.com/yCWJYDLmb8 — Nagarjuna Akkineni (@iamnagarjuna) 10 May 2018 -
సుకుమార్ (కొన్ని క్షణాల అశ్విన్)
మహానటి సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో పాటు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దర్శకుడు సుకుమార్ తనదైన స్టైల్లో మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ ‘ప్రియ’మైన అశ్విన్, మహానటి సినిమా చూసి బయటకి వచ్చి, నీతో మాట్లాడదామని నీ నంబరుకి ట్రై చేస్తున్నాను... ఈ లోగా ఒక ఆవిడ వచ్చి ‘నువ్వు డైరెక్టరా బాబు’ అని అడిగింది. అవునన్నాను... అంతే నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ‘ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మని’ అంటూ.. నాకళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను. మనసారా... ఆవిడ నన్ను దీవించి వెళ్లిపోయింది. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.’ అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ లెటర్‌ను పోస్ట్ చేశారు సుకుమార్. అంతేకాదు గమనిక అంటూ ‘ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు కాదని తెలియకపోతే బావుండు’ అంటూ తనదైన స్టైల్లో నాగ్ అశ్విన్‌ను ప్రశంసించారు. కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో నటించిన మహానటి సినిమాను వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంకాదత్ నిర్మించారు. జెమినీ గణేషన్‌గా దుల్కర్ సల్మాన్, ఇతర కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు నటించారు. సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి టాక్ రావటంతో వసూళ్లు పరంగా కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.. #mahanati A post shared by Sukumar B (@aryasukku) on May 10, 2018 at 1:27am PDT -
వారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలి : మోహన్‌బాబు
మహానటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ముందుకు రావడమే కాదు... ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లింది. సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. చిత్రబృంధానికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. చూసిన ప్రతి ఒక్కరూ... ‘మహానటి’ అద్వితీయ చిత్రమని అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా ఓ క్లాసిక్‌లా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ‘మహానటి’ నటీనటులందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రిమిది. ఈ సినిమా తీసిన నిర్మాతల నమ్మకం నిజమైంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని మరొకసారి రుజువైంది. ఈ చిత్రంపై మోహన్‌బాబు స్పందిస్తూ... ‘అశ్వనిదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక సావిత్రి జీవితచరిత్రను సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిచ్చి శభాష్ అనిపించుకునేలా చేశారు. ది క్రెడిట్ గోస్ టూ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలనీ, ఆయురారోగ్యాలతో ఉండాలని ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని ఆ బిడ్డలను ఆశ్వీరాదిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అశ్వినిదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక 'సావిత్రి' గారి జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిఛ్చి 'శభాష్' అనిపించుకునేలా చేసారు. #Mahanati (1/2) — Mohan Babu M (@themohanbabu) May 9, 2018 ది క్రెడిట్ గోస్ టూ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్.ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికీ నిండు నూరేళ్ళు ప్రసాదించాలనీ... అయుఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయ్యాలని ఆ బిడ్డలనిద్దరిని ఆశీర్వదిస్తున్నాను. #Mahanati (2/2) — Mohan Babu M (@themohanbabu) May 9, 2018 -
‘అర్జున్ రెడ్డి సీక్వెల్ ఉంటుంది’
హైదరాబాద్ : బర్త్‌డే బాయ్ విజయ్ దేవరకొండ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మండే ఎండల్లో చల్లని ఐస్‌క్రీమ్స్ పంచేందుకు ట్రక్కులు ఏర్పాటు చేసి వినూత్నంగా తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా మారిన విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థతో ముచ్చటించారు. నాలుగేళ్ల క్రితం సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగానని.. అయితే ప్రస్తుతం తనకు ప్రత్యేకంగా ఆఫీసు, వ్యవహారాలు చూసుకునేందుకు టీమ్ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ తర్వాత ఇల్లు కొనుక్కున్నానని.. ఈ సినిమా తన కెరీర్లో అత్యంత ముఖ్యమైందని తెలిపారు. అర్జున్ రెడ్డి సీక్వెల్ గురించి ప్రస్తావించగా.. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సినిమాలో పెళ్లి చేసుకుని, ఆనందంగా ఉన్న 40 ఏళ్ల వ్యక్తిగా అర్జున్ రెడ్డిని చూపించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అర్జున్ రెడ్డికి ఓ కూతురు ఉండాలని, ఆమె ప్రేమలో పడితే అప్పుడు అతడి భావోద్వేగాలు ఏవిధంగా ఉంటాయో సీక్వెల్లో చూపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలన్నీ కార్యరూపం దాలిస్తే కచ్చితంగా అర్జున్ రెడ్డి సీక్వెల్ ఉంటుందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ అడగ్గానే.. మహానటిలో నటించడానికి ఒప్పుకున్నానని.. ఈ సినిమాలో తనది చిన్న పాత్రే అయినా తనకెంతో ప్రత్యేకమని విజయ్ తెలిపారు. ప్రస్తుతం విజయ్ చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. విజయ్ తాజా సినిమా ‘టాక్సీవాలా’ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అమ్మ ఎదిగిన తీరును బాగా చూపించారు
-
‘మహానటి’కి అభినందనల వెల్లువ
సాక్షి, సినిమా: దేశం గర్వించదగిన మహానటి సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అద్భుతంగా నిజంగానే మహాద్భుతంగా ఉందటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్, జెమినీ గణేషన్‌గా దుల్కర్ సాల్మన్ జీవించారని అభినందనలు కురుస్తున్నాయి. (చూడండి: ‘మహానటి’ మూవీ రివ్యూ) 28 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..: మహానటి విడుదల సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావ్ ఒకింత భావోద్వేగపూరిత కామెంట్లు చేశారు. ‘‘సరిగ్గా 28 ఏళ్ల కిందట ఇదే వైజయంతీ మూవీస్ బ్యానర్లో నేను తీసిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ ఇదే రోజు(మే 9న) విడుదలైంది. మళ్లీ ఇప్పుడు ‘మహానటి’ లాంటి గొప్ప సినిమా వచ్చింది. సావిత్రి జీవితచరిత్రను సినిమాగా మలిచిన వైజయంతి మూవీస్‌కి అభినందనలు’’అని పేర్కొన్నారు. ఫ్యాన్ అయిపోయా: జక్కన్న ‘‘ఏదో అనుకరిస్తున్నట్లు కాకుండా పాత్రల్లో అద్భుతంగా జీవించారు. కీర్తి సురేశ్.. సావిత్రిని మళ్లీ మనముందుకు సజీవంగా తీసుకొచ్చారు. ఇక దుల్కర్ సాల్మన్.. ఫెంటాస్టిక్! నేను అతనికి ఫ్యాన్ అయిపోయా. స్వప్నదత్, నాగ అశ్విన్‌లకు అభినందనలు’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. సావిత్రి ఆత్మే చేయించుకుంది: విజయవాడలో ‘మహానటి’ సినిమా చూసిన అనంతరం నిర్మాత అశ్వినీ దత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘18 నెలల కష్టానికి ఫలితం దక్కింది. బహుశా సావిత్రిగారి ఆత్మే దగ్గరుండిమరీ ఈ సినిమాను చేయించుకుంది. నా 44 ఏళ్ల సినీ జీవితంలో అత్యంత సంతృప్తి ఇచ్చిన సినిమా ఇదే. ఓవర్సీస్లో ప్రభంజనం సృష్టించడం ఖాయం. సినిమాలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. సావిత్రి కూతురి వ్యాఖ్య: మహానటి సావిత్రి కూతురు చాముండేశ్వరి సైతం తొలిరోజే ‘మహానటి’ని చూసి తన భావాలను పంచుకున్నారు.‘‘అమ్మ చిన్నతనం నుండి అగ్రకథానాయికగా ఎదిగిన తీరును సినిమాలో చూడటం ఆనందంగా ఉంది. అమ్మే నాలో ఉండి తన కథని ఇలా చిత్ర రూపంలో చేయించుకుంది. కీర్తి సురేష్ చక్కగా ఒదిగిపోయారు. దుల్కర్ సాల్మన్ అచ్చు మా నాన్నను అనుకరిస్తూ నటించారు. మహానటిపై ప్రముఖుల ట్వీట్స్... . @KeerthyOfficial’s potrayal of Savitri garu is one of the finest performances I've ever seen. It is not just imitating. She brought the legendry actress back to life. @dulQuer is absolutely fantastic. I am his fan now. — rajamouli ss (@ssrajamouli) 9 May 2018 Hearing the most wonderful things about #Mahanati ! Overwhelmed and grateful ! Thank you @nagashwin7 Swapna Priyanka and Ashwini Dutt garu for putting their faith in me. Lots of love to @KeerthyOfficial @Samanthaprabhu2 @TheDeverakonda Rajendra Prasad garu & the entire cast ! — dulquer salmaan (@dulQuer) 9 May 2018 28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం... చాలా పెద్ద సినిమా తీసాము అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు... ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు... మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 మా దత్తు గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికి మర్చిపోలేదు. అదే రోజు న నేడు మహానటి విడుదలయింది. ఆరోజున జగదేక వీరుడు అతిలోకసుందరి నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి. 🙏🏻🙏🏻🙏🏻 — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమా వైజయంతి మూవీస్ కి ధన్యవాదాలు . @KeerthyOfficial పాత్ర లో జీవించింది. శివాజీ గణేశన్ గా @dulQuer నటన అద్భుతం. నాగ అశ్విన్ మరియు చిత్ర యూనిట్ కి నా అభినందనలు. 😊 — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 #Mahanathi classic ,emotional inspirational bio epic of savithri Amma @KeerthyOfficial brought back the legendary actress hats off espl Mayabazar dance @Samanthaprabhu2 Thambi u rocked , congrats to whole team & Spl Thx to @VyjayanthiFilms for this unforgettable classic ... pic.twitter.com/2xvylpqufy — atlee (@Atlee_dir) 9 May 2018 I am very proud to have played a small part in this CLASSIC ❤️ Thankyou @nagashwin7 for Madhuravani .. #Mahanati @KeerthyOfficial you were just Outstanding !! Much love to my producers @VyjayanthiFilms and @TheDeverakonda @dulQuer . #TeamMahanati — Samantha Akkineni (@Samanthaprabhu2) 9 May 2018 -
‘మహానటి’ మూవీ రివ్యూ
టైటిల్ : మహానటి జానర్ : బయోపిక్ తారాగణం : కీర్తీ సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్ సంగీతం : మిక్కీ జే మేయర్ దర్శకత్వం : నాగ్ అశ్విన్ నిర్మాత : అశ్వనీదత్, ప్రియాంక దత్, స్వప్నాదత్ హీరోయిన్‌కు సూపర్ స్టార్ స్టేటస్ అందించిన తొలితరం హీరోయిన్ సావిత్రి. ఎన్నో అద్భుత పాత్రలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న సావిత్రి, నిజ జీవితం కూడా సినిమా కథలాగే సాగింది. అత్యున్నత శిఖరాలను చూసిన ఆ మహానటి, చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.(సాక్షి రివ్యూస్) ఆ మహానటి జీవితం పై ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ఏది నిజం..? ఏది అబద్ధం..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కించిన సినిమా మహానటి. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంది..? అలనాటి అందాల నటిని ఈ తరానికి పరిచయం చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా..? కథ ; మహానటి పూర్తిగా సావిత్రి కథ. ఆమె జీవితంపై ఎంతో పరిశోదన చేసి ఈ కథను తయారు చేశారు. సినీ అభిమానులకు సావిత్రి తెర మీదకు వచ్చిన దగ్గరనుంచే తెలుసు కానీ ఆమె గతాన్ని కూడా ఈ సినిమాతో పరిచయం చేశారు. నిశంకర సావిత్రి (కీర్తి సురేష్).. తనకు ఆర్నేళ్లు ఉన్నప్పుడే తండ్రి చనిపోవటంతో పెదనాన్న కే వెంకట రామయ్య చౌదరి(రాజేంద్ర ప్రసాద్) సంరక్షణలో పెరుగుతుంది. (సాక్షి రివ్యూస్)చిన్నతనం నుంచి ఈ పని నీ వల్ల కాదు అంటే ఎలాగైనా పట్టు పట్టి ఆ పని చేసి చూపించటం సావిత్రికి అలవాటు. అందుకే తనకు రాదు అన్న నాట్యం దూరం నుంచి చూసి నేర్చుకుంటుంది. సావిత్రి లోని ప్రతిభను గుర్తించి నాటకాలు వేసేందుకు అరుణోదయ నాట్యమండలిలో బాలనటిగా అవకాశం ఇస్తారు. నాటకాలకు ఆదరణ తగ్గిపోవటంతో సావిత్రిని సినిమాల్లో నటింప చేయాలని నిర్ణయించుకుంటాడు ఆమె పెదనాన్న. ఆ ప్రయత్నాల్లో భాగంగా 14 ఏళ్ల వయసులో సావిత్రి చెన్నై చేరుకుంటారు. తమిళ్ రాకపోవటంతో అక్కడ ఇబ్బంది పడుతుంటే.. జెమినీ గణేషణ్ (దుల్కర్ సల్మాన్).. సావిత్రి అందం చూసి ఎప్పటికైన పెద్ద నటి అవుతుందని చెప్పి ఆ ఫోటోలు తీసి పత్రికల వారికి ఇస్తారు. అలా పత్రికల్లో వచ్చిన సావిత్రి ఫోటోలు చూసిన ఎల్వి ప్రసాద్ తన సినిమాలో నాగేశ్వరరావు సరసన హీరోయిన్గా తొలి అవకాశం ఇస్తారు. కానీ ఆ అవకాశం సావిత్రి చేజారిపోతుంది. తరువాత అదే ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కి పెళ్లి చేసి చూడు సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు సావిత్రి. అలా వెండితెర మీదకు అడుగుపెట్టిన సావిత్రి ఎలా మహానటిగా ఎదిగారు. జెమినీ గణేషణ్ ఆమె జీవితంలోకి ఎలా ప్రవేశించారు. పెళ్లి తరువాత సావిత్రి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. కోట్ల ఆస్తులు సంపాదించిన సావిత్రి చివరకు అన్ని పోగొట్టుకోవడానికి కారణమేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమాకు ప్రధాన బలం కీర్తీ సురేష్. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ పరకాయ ప్రవేశం చేసిందా అన్నంతగా జీవించారు. 14 ఏళ్ల వయస్సులో సావిత్రిలోని అల్లరి, చిలిపి తనం. నటిగా ఎదుగుతున్న సమయంలో తనలో హుందాతనం. ప్రేమ, కరుణ, భయం, కోపం ఇలా ప్రతీ రసాన్ని అద్భుతంగా పలికించారు.(సాక్షి రివ్యూస్) తెర మీద సావిత్రినే చూస్తున్నామ అన్నంతగా మెప్పించారు కీర్తి సురేష్. సావిత్రి భర్త జెమినీ గణేష్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయారు. తొలినాళ్లలో సావిత్రికి సాయం చేసే ప్రేమికుడిగా తరువాత తనను దాటి సావిత్రి ఎదిగిపోతుందన్న ఈర్ష్యతో కోపం పెంచుకున్న వ్యక్తిగా రెండు వేరియేషన్స్ ను చాలా బాగా చూపించారు. సావిత్రి కథను నడిపించే కీలక పాత్రలో సమంత ఆకట్టుకున్నారు. జర్నలిస్ట్ మధురవాణిగా సావిత్రి జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించే పాత్రలో సమంత జీవించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌లో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది. విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్‌గా మెప్పించారు. కథలో పెద్దగా కీలకమైన పాత్ర కాకపోయినా.. సమంత, విజయ్‌ల మధ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.(సాక్షి రివ్యూస్) ఇతర పాత్రల్లో హేమాహేమీల్లాంటి నటులు కనిపించారు. అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య, కేవీ చౌదరిగా రాజేంద్ర ప్రసాద్, ఎస్వీఆర్‌గా మోహన్ బాబు, చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్, కేవీరెడ్డిగా క్రిష్, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్ భాస్కర్, ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్ ఇలా ప్రతీఒక్కరు అలనాటి మహానుభావులను తెర మీద చూపించేందుకు తమవంతు సాయం చేశారు. విశ్లేషణ ; మహానటి సావిత్రి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలన్న నిర్ణయమే సాహసం. అలాంటి ప్రయత్నాన్ని ఏ మాత్రం వివాదాస్పదం కాకుండా అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రతీ ఫ్రేమ్‌లో సావిత్రి కథను ఈ తరానికి పరిచయం చేయాలన్న తపన స్పష్టంగా కనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఓ క్లాసిక్‌లా సినిమాను రూపొందించారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడుకి సావిత్రి కాలంలోకి వెళ్లి ఆమె జీవితాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలిగించారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు చిత్రయూనిట్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. అయితే తెర మీద సావిత్రి అందరికి తెలుసు కనుక ఎక్కువగా తెర వెనుక సావిత్రి జీవితాన్నే సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. సాయి మాధవ్ బుర్రా రాసిన సంభాషణలు మనసును తాకుతాయి. డానీ సినిమాటోగ్రఫి ప్రేక్షకుడిని 60 నాటి కాలంలోకి తీసుకెళుతుంది. ముఖ్యంగా అప్పటి సినిమాల్లోని సన్నివేశాలను మరోసారి తెర మీద ఆవిష్కరించిన తీరు అద్భుతం. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం. ప్రతీ పాట కథలో భాగంగా వస్తూ ప్రేక్షకుణ్ని మరింతగా కథలో లీనమయ్యేలా చేస్తుంది. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ప్రతీ ఒక్క టెక్నిషియన్ ఎంత మనసు పెట్టి చేశారో సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మహానటి జీవితాన్ని నేటి తరానికి పరిచయం చేసేందుకు నిర్మాతలు చేసిన ప్రయత్నం అభినందనీయం. మహానటి ఈ తరంలో తెరకెక్కిన క్లాసిక్. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘అర్జున్‌రెడ్డి’ బర్త్‌డే.. వినూత్న ఆలోచన!
సాక్షి, హైదరాబాద్: ఇండస్ట్రీలో తనకంటూ గాడ్ ఫాదర్స్ లేకున్నా స్వయంకృషితో రాణిస్తోన్న నటుడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’తో సక్సెస్ అందుకున్న హీరో విజయ్.. ఆపై ‘అర్జున్‌రెడ్డి’తో మరోసారి నిరూపించుకున్నాడు. ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఆలోచించే నటుడు విజయ్ పుట్టినరోజు నేడు(మే 9). అయితే తన బర్త్‌డే సందర్భంగా బర్త్‌డే ట్రక్‌లను ఏర్పాటు చేశాడు ‘అర్జున్‌రెడ్డి’. హైదరాబాద్ నగరవాసులకు ఐస్‌క్రీమ్స్ అందిస్తూ బర్త్‌డే పార్టీ చేసుకుంటున్నాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశాడు విజయ్. ఈ నటుడు చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘ వేసవి ఎండల్లోనూ కొన్ని రోజులు షూటింగ్ చేశాక నాకు ఈ ఆలోచన వచ్చింది. మూడు ఐస్‌క్రీమ్ ట్రక్కులను తీసుకున్నా. ట్రక్కులు హైదరాబాద్ సిటీలో తిరుగుతూ ట్రాఫిక్ పోలీసులు, చిరువ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిస్తాయి. మీకు ఎక్కడైనా నా బర్త్‌డే ట్రక్ కనిపిస్తే ఏం సిగ్గుపడకుండా ఐస్‌క్రీమ్ తీసుకోండి. హాయిగా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను నాకు షేర్ చేయండి. మీకు ముఖాల్లో ఆనందాన్ని చూస్తే నేను హ్యాపీగా ఫీలవుతానంటూ’ హీరో విజయ్ తన ట్వీట్లలో రాసుకొచ్చారు. A few days of shooting in the Sun made me think of this. What if I got 3 ice cream trucks to drive around the city and give out free ice cream to everyone going about their day in the heat. The traffic cops, the street vendors, students, employees. pic.twitter.com/tisrb8Ot6m — Vijay Deverakonda (@TheDeverakonda) 9 May 2018 So say Hi to the #TheDeverakondaBirthdayTruck I am throwing the city a party, these trucks will be travelling through most of #Hyderabad. We will be giving away IceCream to as many as possible nd If you spot them, don't be shy just go and take some IceCream:) smile and enjoy it. — Vijay Deverakonda (@TheDeverakonda) 9 May 2018 -
దుల్కర్ వల్ల తప్పించుకున్నా: విజయ్ దేవరకొండ
‘‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నపుడు స్వప్న ఫోన్ చేసి ‘మహానటి’ చిత్రం గురించి చెప్పింది. వివరాలు అడక్కుండా ఒప్పేసుకున్నా. ఎందుకంటే.. స్వప్న, నాగీ (నాగ్ అశ్విన్) ఇద్దరూ నాకు ఫ్రెండ్స్’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్ర కోసం మొదట దుల్కర్‌ని అడిగితే డేట్స్ కుదరలేదు. అందుకే నాగీ నన్ను చేయమన్నాడు. నాకేమో ఆ పాత్ర చేయగలనా? అనే భయం ఉండేది. ఎలాగైనా చేసేయాలి అనుకున్నా. మళ్లీ దుల్కర్ ఒప్పుకోవడంతో నేను తప్పించుకున్నా. ఫైనల్లీ విజయ్ ఆంటోనీ పాత్రకు ఫిక్సయ్యాను. ఈ చిత్రంలో సమంతలాంటి స్టార్‌తో నటించడం సరదాగా అనిపించింది. ఆమె చాలా హుషారుగా, ఎప్పుడూ జోక్స్ వేస్తూ ఉంటారు. తెలుగు, తమిళ సినిమాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి తమిళంలో నటించినా వర్కవుట్ అవుతుంది. కానీ, హిందీ అలా కాదు. పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే హిందీవైపు దృష్టి పెట్టడంలేదు. ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తర్వాత కథలు ఎంచుకోవడంలో యాటిట్యూడ్ కొంత మార్చాను. ఒక టాక్సీ డ్రైవర్‌ను తీసుకెళ్లి రకరకాల పరిస్థితుల్లో పడేస్తే అతని కథ ఎలా ఉంటుందన్నదే ‘టాక్సీవాలా’ కథ. ‘నోటా’ సినిమాలో కొంచెం యాంగ్రీగా కనిపిస్తాను. ఇదొక ఫిక్షనల్ స్టోరీ. చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు. -
మరో సంచలన బయోపిక్‌లో..?
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లో అచ్చు సావిత్రిలాగే కలిపించారు కీర్తి. దీంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మహానటి తరువాత మరో క్రేజ్ బయోపిక్‌లో కీర్తీ సురేష్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మహానటిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న కీర్తీ సురేష్‌ను పురుచ్చితలైవి జయలలిత పాత్రలో చూపించేందుకు తమిళ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినీరంగంలోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన జయలలిత జీవితకథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు రాలేదు. తాజాగా మరోసారి జయలలిత బయోపిక్ వార్తలు తెర మీదకు వచ్చాయి. కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు కీర్తీ కూడా జయలలిత పాత్రలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కీర్తీ సురేష్ నుంచిగాని, దర్శక నిర్మాతల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
‘మహానటి’లో ప్రకాష్ రాజ్ పాత్ర...?
‘మహానటి’ని చూడ్డానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. నిన్నటి వరకు సినిమాలో ఎవరు ఏ పాత్రలు చేశారో ప్రోమోల ద్వారా విడుదలచేశారు. నాని వాయిస్ఓవర్ ద్వారా పరిచయం చేసే ఆ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ప్రకాశ్‌రాజ్ పోషించిన పాత్రకు సంబంధించిన లుక్‌ను ప్రోమో ద్వారా విడుదల చేశారు. ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆలూరి చక్రపాణి తెలుగు చిత్రసీమకు సుపరిచితులు. మిస్సమ్మ, గుండమ్మ కథ సినిమాలతో సావిత్రి అభినయాన్ని మనకు చూపించారు ఆయన. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించిన ‘మహానటి’ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్, స్వప్నాదత్లు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. -
భరత్, సూర్యలను మించిన ‘మహానటి’
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్, సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమా రేపు (మే 9న) విడుదలవుతోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిడివి ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా మూడు గంటల నిడివితో మహానటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన మహేష్ బాబు భరత్ అనే నేను 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కన్నా మహానటి నిడివి ఎక్కువగా ఉండనుంది. 2 గంటల 56 నిమిషాల నిడివితో మహానటి విడుదలకు రెడీ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలం మాత్రం మహానటి కన్నా ఎక్కువ నిడివితో 2 గంటల 59 నిమిషాల రన్‌టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల విషయంలో సినిమా లెంగ్త్‌పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మరి మహానటి అలాంటి కామెంట్స్ లేకుండా అలరిస్తుందేమో చూడాలి. -
మహానటిపై క్యూరియాసిటీని పెంచేస్తోంది
-
మహిళా శక్తి.. సమంత
మహానటి సినిమాలో ఎక్కువ శాతం మహిళలే పనిచేశారు. నిర్మాతలు మహిళలే. లీడ్ క్యారక్టర్ కూడా మహిళే. ఈ సినిమా కోసం ఎక్కువ మంది మహిళలే పనిచేశారని ఆడియో వేడుకల్లో కింగ్ నాగ్ కూడా పేర్కొన్నారు. ఒక సినిమా మొదలు కావాలంటే మొదటగా కావాల్సింది నిర్మాతలే. నిర్మాతలు ధైర్యం చేస్తేనే గొప్ప సినిమాలు వస్తాయి. మహానటి సినిమా నిర్మాతలు ప్రియాంక, స్వప్నలు ధైర్యం చేసి ఈ సినిమా బాధ్యతను తీసుకున్నారు. తెరపై ఆ మహానటి సాధించిన విజయాల్ని మళ్లీ అదే తెరపై ఆవిష్కరించేందుకు ఈ మహిళమణులు పూనుకున్నారు. అందుకే ‘మహానటి’ రూపు దాల్చింది. అలనాటి మహానటి సావిత్రిని గుర్తుకు తెచ్చేలా నటించడం మామూలు విషయం కాదు. కీర్తి సురేశ్ మాత్రం సావిత్రి పాత్రకోసమే పుట్టిందేమో అన్నట్టుగా జీవించేసినట్టుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు అచ్చం సావిత్రిని గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. తెర వెనుక ఇంకా ఎందరో మహిళామణుల కష్టం దాగి ఉంది. ఈ సినిమా విడుదలై సంచలనాలు సృష్టిస్తుందని, అప్పుడు ఈ క్రెడిట్ అంతా సినిమాకు పనిచేసిన మహిళలదే అవుతుందని అందుకే మహిళా శక్తి అని సమంత ట్వీట్ చేసి ఉంటుంది. కీర్తి సురేశ్, సమంత, షాలినీ, దుల్కర్ సల్మాన, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, క్రిష్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘మహానటి’మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Girl power 💪💪#Mahanatipromotions #Mahanation9th @VyjayanthiFilms @KeerthyOfficial pic.twitter.com/Dp9HPhMHcT — Samantha Akkineni (@Samanthaprabhu2) May 6, 2018 -
ఘటోత్కచుడు
పౌరాణికాలు, కమర్షియల్ చిత్రాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు ఎస్వీ రంగారావు. ‘మాయాబజార్’లో ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు..’ అంటూ ‘ఘటోత్కచుడు’ పాత్రను ఆయన పోషించిన తీరుని ఎవ్వరం మర్చిపోలేం. ఇప్పుడు సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో మాయాబజార్ సినిమాలోని ‘ఘటోత్కచుడు’ క్యారెక్టర్‌ను చూపించనున్నారు. ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు యాక్ట్ చేశారు. ఘటోత్కచుడిగా మోహన్‌బాబు లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభించింది. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించిన ‘మహానటి’ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. -
మహానటి కీర్తి సురేష్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
మహానటి: అచ్చం ఎస్వీరంగారావులా మోహన్‌బాబు
-
‘మహానటి’లో మోహన్‌బాబును చూశారా?
అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.. నాగ్ అశ్విన్ దర్శకుడిగా వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా క్రిష్ కనిపించనున్నారంటూ ప్రకటించిన చిత్ర బృందం శనివారం నాని చేతుల మీదుగా వీడియోలను విడుదల చేసింది. కాగా ఇవాళ ఎస్వీ రంగారావు పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని పంచుకుంది. ఇందులో మోహన్‌బాబు అచ్చం ఎస్వీరంగారావులా కనిపించి, ఆకట్టుకున్నారు. ‘పౌరాణికమైనా, సాంఘీకమైనా.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు మన ఎస్వీ రంగారావు. ‘వివాహ భోజనంబు’ అంటే ‘వింతైన వంటకంబు’ అని అనని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీ రంగారావుదే. అలాంటి మహానటుడిని మాయ శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందారు మన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో మనముందుకు రాబోతోంది ఎవరు అనుకుంటున్నారా? అవును.. మీ గెస్ కరెక్ట్.. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్‌బాబు గారికే అది సాధ్యం’ అంటూ నాని ఆ పాత్రను వీడియోలో పరిచయం చేశారు. -
‘మహానటి’లో సావిత్రి కూతురు ఎవరో తెలుసా?
సావిత్రి చిన్ననాటి పాత్రలో రాజేంద్రప్రసాద్ మనవరాలు నిశంకర నటిస్తుండగా, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పాత్రను పాప్ సింగర్ స్మిత కూతురు శివి చేస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలను స్మిత సోషల్‌మీడియాలో పోస్ట్ చేసారు. తల్లి సావిత్రి( కీర్తి సురేశ్) , తండ్రి జెమినీ గణేషన్( దుల్కర్ సల్మాన్)తో ఉన్న ఫోటోలను స్మిత షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. సావిత్రి పాత్రకు సంబంధించిన కీర్తి సురేశ్ ఫోటోలను రిలీజ్ చేస్తూ... సినిమాపై అంచనాలను పెంచేస్తోంది చిత్రయూనిట్. కీర్తి సురేశ్, దుల్కర్సల్మాన్, సమంత, విజయ దేవరకొండ, షాలినీ పాండే, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిక్కి జే మేయర్ స్వరాలు సమకూర్చగా... నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. One more with mom & dad 😊 @Shivisayz @KeerthyOfficial @dulQuer #NagAshwin #Mahanati @SwapnaCinema pic.twitter.com/YlhqrrHpIl — Smita (@smitapop) May 6, 2018 Finally sharing a picture, I guess I can now😊 a moment from the shoot of #Mahanati @Shivisayz with father @dulQuer #Gemini pic.twitter.com/eISKjTBA7w — Smita (@smitapop) May 4, 2018 -
కొత్త పోస్టర్ : శశిరేఖగా కీర్తీ సురేష్
ప్రమోషన్స్‌లో ‘మహానటి’ స్టైలే వేరు. సినీ ప్రేక్షకులు రోజూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది చిత్రయూనిట్. రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ... మహానటి సావిత్రిని గుర్తుచేస్తున్నారు. తాజాగా రిలీజ్చేసిన పోస్టర్ కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టర్ ఏ సన్నివేశానికి సంబంధించిందో కూడా ఇట్టే తెలిసిపోతోంది. మాయాబజార్ సినిమాలో ప్రియదర్శని సీన్ గుర్తండే ఉంటుంది. శశిరేఖ పాత్రలో ఉండే సావిత్రి ప్రియదర్శినిలో చూస్తే అభిమన్యుడి పాత్రలో ఉండే ఏఎన్నార్ కనిపించే సన్నివేశం. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అదే. అయితే మహానటిలో కీర్తి సురేశ్‌కు నాగ చైతన్య కనిపిస్తాడు. దుల్కర్ సల్మాన్, జెమినీ గణేస్ పాత్రలో నటించిన ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండలు ముఖ్యపాత్రలో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా స్వప్నా సినిమా, వైజయంతీ మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. మిక్కి జే మేయర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #MahanatiOnMay9th 😊 pic.twitter.com/C62D38ahG6 — Keerthy Suresh (@KeerthyOfficial) May 5, 2018 -
మహానటి : కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్‌ల ప్రోమోలు విడుదల
-
‘మహానటి’లో కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్..!
టాలీవుడ్ తెలుగు ప్రేక్షకుల దాహాన్ని ఈ వేసవిలో తీరుస్తోంది. వరుసగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్ ప్రేక్షకుల మనసులను గెల్చుకుంటున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్యలు స్టార్ హీరోల సినిమాలే అయినప్పటికీ నటనా పరంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కమర్షియల్ హంగులను కూడా జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలు బాక్స్‌ఫీస్ రికార్డులను పరుగులు పెట్టిస్తున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు మరొక సినిమాపై ఉంది. ఆ చిత్రమే ‘మహానటి’. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తరాలకు చాలా దగ్గరైన నటి సావిత్రి. ఒక హీరోయిన్ ఇంత మందికి దగ్గరవ్వడం, అభిమానాన్ని సంపాదించడం, ఇంతటి ఉన్నత స్థానాన్ని అందుకోవటం ఒక్క సావిత్రికే చెల్లింది. ఇంకా సినిమాపై అంచనాలను పెంచేట్టుగా రోజుకో పోస్టర్‌ను, ఒక్కో పాత్రధారునికి సంబంధించిన లుక్స్‌ను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సావిత్రి జీవితం ఎంతో మంది దిగ్గజాలతో ముడిపడి ఉంటుంది. ఎల్వీ ప్రసాద్, ఎస్వీ రంగారావు, కేవీ రెడ్డి, ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా మహామహుల గురించి కూడా ప్రస్థావించాల్సి ఉంటుంది. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు, ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నటించిన విషయం తెలిసిందే. తాజాగా కేవీరెడ్డి, ఎల్వీ ప్రసాద్ పాత్రలకు సంబంధించిన ప్రోమో వీడియోలను మహానటి చిత్ర బృంధం విడుదల చేసింది. నాని వాయిస్ఓవర్ ఇస్తూ రిలీజ్చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంట్లోనే ఉండి షూటింగ్ తీసేసి, ప్రపంచంలో ఏ మూలో తీశామని ప్రేక్షకులను నమ్మించవచ్చు. గ్రాఫిక్స్ , విజువల్ఎఫెక్ట్స్ అంటూ సినిమా రూపురేఖలనే మార్చేశాయి. మరి ఇవేవి లేని ఆ కాలంలోనే మాయాబజార్ అంటూ సినిమా తీసి నిజంగానే మాయ చేసేశాడు కేవీ రెడ్డి. తెలుగు సినిమా గురించి చెప్పుకునే ప్రతి సందర్భంలో మాయాబజార్ గురించి చెప్పుకోవాల్సిందే. మాయాబజార్‌ను తీసిన విధానం, కథనం, పాండవులే లేని మహాభారతాన్ని ఒక్క మాయాబజార్లో చూడగలం. అది కేవీ రెడ్డికే సాధ్యమైంది. అంతటి మేధావి కేవీ రెడ్డి పాత్రను ఈ తరంలో ఎవరు ఉన్నారు అన్న ప్రశ్నకు.. సమాధానం మహానటి డైరెక్టర్ నాగ్అశ్విన్ ఇచ్చేశాడు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం సినిమాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ .. కేవీ రెడ్డి పాత్రలో అలరించనున్నారు. ఇప్పుడు రిలీజైన ప్రోమోలో క్రిష్ అచ్చం కేవీ రెడ్డిలానే ఉన్నాడు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన మహానుభావుడు ఎల్వీ ప్రసాద్. మొదటి తరం హీరో, కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు ఇలా అన్నింట్లో తన సత్తా చాటుకున్నారు ఎల్వీ ప్రసాద్. ఎన్టీఆర్, సావిత్రిని వెండితెరకు పరిచయం చేశారు. మిస్సమ్మగా సావిత్రిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అలాంటి మహానుభావుడి పాత్రను ఈ తరం యువ కథానాయకుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పోషించారు. నాని వాయిస్ఓవర్ ఇస్తూ విడుదల చేసిన రెండు ప్రోమోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. -
నా ప్రియ సావిత్రి
నా అంటే నాగ్ అశ్విన్ ప్రియ అంటే ప్రియాంకా దత్ సావిత్రి అంటే కీర్తీ.. అందుకే ఈ ఇంటర్వ్యూని ‘నా ప్రియ సావిత్రి’ అని మీకు పరిచయం చేయాలనిపించింది. ఇవాళ్టి జనరేషన్‌కి ఇలాంటి సినిమా ఏంటి? అని ఇండస్ట్రీలో ఎందరో అనుకున్నారు. కానీ ఈ యంగ్ డైరెక్టర్ విజన్... ఈ యంగ్ ప్రొడ్యూసర్స్ సాహసం... అప్పటి సావిత్రి మరిపించినట్లే ఇప్పటి కీర్తీ మైమరిపిస్తుందేమో చూడాలి. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు ‘మహానటి’ సావిత్రిగారి బయోపిక్ తీయటం కొంచెం ఎర్లీ ఏమో? నాగీ (నాగ్ అశ్విన్): ‘ఎవడే సుబ్రమణ్యం’ తీశాక ఆ సనిమా చాలా ఎర్లీగా తీశానేమో అనిపించింది (నవ్వుతూ). జనరల్‌గా చాలా సినిమాలు తీసి తీసి విరక్తి పుట్టి అలాంటి సినిమా తీస్తారు. కానీ నేను మాత్రం ఇప్పుడే తీయాలనుకున్నాను. సావిత్రిగారి బయోపిక్ తీయడానికి ఇదే రైట్ టైమ్ అని నాకనిపించింది. అంటే.. ఏజ్ పెరిగాక, దర్శకుడిగా ఇంకా అనుభవం సాధించాక ‘మహానటి’ లాంటి సినిమా చేయాలనేది కొందరి ఒపీనియన్.. నాగీ: నా ఒపీనియన్ ఏంటంటే.. ఇంకో రెండు మూడు సినిమాలు తీశాక ఫ్లాప్ లేదా హిట్ వచ్చిందనుకోండి.. ఎంత బ్యాలెన్డ్స్‌గా ఉందామనుకున్నా మైండ్ హిట్ వైపు అట్రాక్ట్ అవ్వొచ్చు లేదా ఫ్లాప్‌కి కుంగిపోవచ్చు. దానికి తోడు ‘ఇలాంటి సినిమా ఇప్పుడెందుకు’ అనేవాళ్లు ఎక్కువైపోతారు. పదేళ్ల తర్వాత ఇన్‌సెక్యూర్టీ రావొచ్చు. కమర్షియల్ అవుతానేమో. అప్పుడు లెక్కలు వేసుకోవడం మొదలవుతుంది. ఆ లెక్కలే ముఖ్యమై నేను అనుకున్నది తీయలేనేమో. అందుకే ఈ సినిమా తీయడానికి ఇదే బెస్ట్ టైమ్. ఈ సినిమా నిర్మించింది మీ హజ్బెండ్ నాగీ మీద ఉన్న ప్రేమతోనా? సావిత్రిగారి మీద అభిమానంతోనా? ప్రియాంకా: సావిత్రిగారి మీద ఉన్న ప్రేమతోనే. ‘ఎవడే సుబ్రమణ్యం’ జరుగుతున్నప్పుడే ‘సావిత్రిగారి బయోపిక్ చేయాలనే ఐడియా ఉంది’ అన్నాడు నాగీ. నాకు, స్వప్నాకీ (ప్రియాంక అక్క స్వప్నా దత్) సింక్ అవ్వడానికి రెండు రోజులు పట్టింది. ‘ఎవడే..’ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ‘నిజంగానే సినిమా తీయాలనుకుంటున్నావా’ అని నాగీని అడిగాం. అవునని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. మా అందరికీ కూడా సావిత్రిగారంటే ఇష్టం. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని వెంటనే మేమూ ఒప్పేసుకున్నాం. సావిత్రిగారి లైఫ్ హిస్టరీ తీయాలని ఎందుకు అనుకున్నారు? నాగీ: నా తరం మాత్రమే కాదు.. నా తర్వాత నా చెల్లెలు వయసున్న వాళ్లు ఈ మహానటిని మర్చిపోకూడదని తీశాను. చిన్నప్పుడు అమ్మమ్మతో కలసి సావిత్రిగారి సినిమాలు చూశాను. ఆ తర్వాత ఆమె జీవితం గురించి తెలుసుకున్నాను. నటిగా, వ్యక్తిగా ఆమె లైఫ్ యంగర్ జనరేషన్‌కి ఆదర్శం అవుతుంది. ఆవిడ ఎరాను యంగర్ జనరేషన్ కోసం పొందుపరచటానికి ఈ సినిమా తీశాను. సినిమా బాగుంటే కాంప్లిమెంట్స్.. లేకపోతే క్రిటిసిజమ్... నాగీ: ఇంకా అంత దూరం ఆలోచించలేదు. ప్రస్తుతం ప్రింట్స్ డెలివరీతో బిజీగా ఉన్నాం. అయితే ఒక మహా వ్యక్తి లైఫ్ హిస్టరీ కాబట్టి ఆషామాషీగా తీయలేదు. రిసెర్చ్ చేశాం. సావిత్రిగారి పాత్రకి కీర్తీ సురేశ్ యాప్ట్ అని ఆమె యాక్ట్ చేసిన మూవీస్ చూసి ఫిక్సయ్యారా? ఫొటోలు చూశా? నాగీ: తమిళ సినిమా ‘తొడరి’ (తెలుగులో ‘రైల్’)లో కీర్తీ సురేశ్ చేసిన సాంగ్ చూశా. అంతకుముందు ఆమె చేసిన సినిమాలు చూశాను కానీ, ఈ సినిమాలో మాత్రం యంగ్ సావిత్రిగారు విలేజ్ లుక్‌లో ఎలా ఉంటారో అలా అనిపించింది. కళ్లలో అమాయకత్వం, తుంటరితనం కనిపించాయి. అయితే అందర్నీ ఒప్పించటానికి చాలా టైమ్ పట్టింది (నవ్వుతూ). ఇంత పెద్ద సినిమా తీస్తున్నావు. ఆల్మోస్ట్ కొత్త హీరోయిన్ని తీసుకుంటానంటున్నావు, మార్కెట్ గురించి ఆలోచించావా? అన్నారు. అయినా నేను కీర్తీకే ఫిక్సయ్యాను. కీర్తీ సురేశ్ పేరు చెప్పగానే మీకేమనిపించింది? ప్రియాంకా: అర్థం కాలేదు. తను అప్పటికి జస్ట్ వన్ మూవీ ఓల్డ్. మేం తన తమిళ సినిమాలు ఏమీ చూడలేదు. అప్పటికి ‘నేను శైలజా’ ఒక్కటే రిలీజ్ అయింది. నాకు, స్వప్నాకి చాలా టైమ్ పట్టింది సింక్ చేసుకోవడానికి. నాగీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. నాగీ: ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు చాయిస్ కూడా లేకుండా పోయింది. వేరే ఎవర్నీ ఊహించలేకపోయాను. 16 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్ ప్లే చేసే యాక్టర్స్ ఎవ్వరూ లేరు. అన్ని ఏజ్ గ్రూప్స్‌కి కీర్తీ సెట్ అవుతుందనిపించింది. ముందు లుక్స్ పరంగా మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత యాక్టింగ్ వైజ్‌గా బెస్ట్ అనిపించాలి. కీర్తీ బెస్ట్ అనుకున్నాను. ఇంట్లో మీ అమ్మా, నాన్నగారు, మీ సిస్టర్... అందరూ డాక్టర్స్. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎందుకనిపించింది? నాగీ: చిన్నప్పుడు ఇంగ్లీష్ కాంపోజిషన్లో మనంఅనుకున్నది సృష్టించి రాసుకోవచ్చు. కొత్తగా క్రియేట్ చేయగలుగుతాం కాబట్టి అది నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. పెద్దయ్యాక జర్నలిజం అనుకున్నా. తర్వాత అడ్వరై్టజింగ్ అనుకున్నా. ఫైనల్‌గా నా థాట్ సినిమాపై మళ్లింది. బేసిక్‌గా క్రియేషన్ అంటే ఇష్టం ఉండటంతో సినిమాకి అట్రాక్ట్ అయ్యాను. శేఖర్ కమ్ముల గారి లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి వర్క్ చేశా. చిన్న ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని కమర్షియల్ యాడ్స్ తీశాను. ‘ఎవడే సుబ్రమణ్యం’తో డైరెక్టర్‌గా మారాను. సావిత్రి గారి నడక, మూతి విరుపు చూడచక్కగా ఉంటాయి. ఆమెలా నటించడానికి కీర్తీ హోమ్‌వర్క్ చేశారా? నాగీ: కీర్తీ ఎక్కువగా హోమ్ వర్క్ చేసే హీరోయిన్లా కనిపించదు. కష్టపడి లైన్స్ గుర్తుపెట్టుకొని కెమెరా ముందు అప్పజెప్పే టైప్ హీరోయిన్ కాదు. సీన్ చెబితే చాలు. కెమెరా ముందు ఆ క్యారెక్టర్లానే మారిపోతుంది. కీర్తీ బ్లెస్డ్ యాక్టర్. సావిత్రిగారి భర్త జెమినీ గణేశన్‌గారి మొదటి భార్యకు పుట్టిన రేఖ (సౌత్, నార్త్‌లో ఫేమస్ యాక్ట్రెస్) గారి పాత్ర సినిమాలో ఉందా? నాగీ: లేదు. లైఫ్ స్టోరీ మొత్తం చెప్పాలని ఉన్నా టైమ్ లిమిట్ ఉంటుంది కదా. ఆమె జీవితంలో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పెట్టాలనిపించి, చాలా రాశాను. ఫైనల్ స్క్రిప్ట్ చూస్తే.. ఇదంతా తీస్తే ఎడిటింగ్ లెవెల్లో కష్టమైపోతుందని స్క్రిప్ట్ లెవల్లోనే ఎడిట్ చేసుకున్నాను. సావిత్రిగారి లైఫ్‌లోని బ్యాడ్ ఫేజ్ కూడా చూపించారా? నాగీ: మన జనరేషన్ అంతా ఆమె గురించి సెలబ్రేట్ చేసుకోవాలనే ఈ సినిమా తీశాను. అలా అని ఏదీ స్కిప్ చేయలేదు. డౌన్ ఫాల్ అనేవి ఆమె లైఫ్‌లో భాగమే కదా. అవి కూడా చూపించాం. సినిమా తీసినప్పుడు అన్నీ చెప్పాలి. ఓన్లీ సక్సెస్ మాత్రమే చూపించడం కరెక్ట్ కాదు. అలా చేస్తే అసంపూర్ణంగా ఉంటుంది. ఏయన్నార్‌గా చేసిన నాగచైతన్య గురించి? నాగీ: చైతన్య రోల్ చిన్న సర్ప్రైజ్లా ఉంటుంది. అడగ్గానే ఒప్పుకున్నాడు. బాగా చేశాడు. సమంత, విజయ్ దేవరకొండ కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ ఈ సినిమాలోకి రావడం బెస్ట్ థింగ్. వాళ్లు మెయిన్ లీడ్ కాకపోయినా సరే చేశారు. నీకెన్ని సీన్స్ ఉన్నాయి? నాకెన్ని ఉన్నాయి? అని లెక్కలు వేసుకోలేదు. ఇలాంటి ఆర్టిస్టులు ఉంటే నెక్ట్స్ జనరేషన్‌కి బోలెడు కథలు చెప్పొచ్చు. నిర్మాతగా మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? ప్రియాంకా: ఎక్కువమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి డేట్స్ విషయంలోనే కొంచెం ఇబ్బంది అనిపించింది. ‘ఎంత అదృష్టం ఉండి ఉంటే ఇలాంటి సినిమా చేస్తున్నాం’ అనే ఫీల్ కలగని రోజు లేదు. అంతా సజావుగా జరిగింది. భర్త డైరెక్టర్.. భార్య ప్రొడ్యూసర్ అయితే ఆ ప్రాజెక్ట్ ఇలా సాఫీగానే సాగుతుందేమో కదా? ప్రియాంకా: అలా ఏమీ లేదండి. మేం గొడవ పడని రోజు లేదు. కొన్ని సార్లు అభిప్రాయాలు కలిసేవి కావు. తను ఒకటి చెబితే మేం ఒకటి. ఆ ఆర్గ్యుమెంట్ లేకపోతే మంచి అవుట్‌పుట్ రాదు. అసలు ఒకరి మీద ఒకరు అరుచుకోవచ్చని, గొడవపడొచ్చనే పెళ్లి చేసుకున్నాం (నవ్వుతూ). మీ లవ్ స్టోరీ గురించి. నాగీతో ఎప్పుడు లవ్‌లో పడ్డారు? ప్రియాంకా: ఎప్పటి నుంచో తను తెలుసు. ‘ఎవడే సుబ్రమణ్యం’కి బాగా ట్రావెల్ చేశాం. నాగీలో గుడ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ టైమ్‌లో మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తే, ఎవర్నో ఎందుకు? బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటే లైఫ్ కంఫర్టబుల్‌గా ఉంటుందనిపించింది. నాగీ: డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా ఇద్దరం కలసి చేసిన ట్రావెల్లో ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం. ప్రియాంక నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇదేదో ‘ఐ లవ్ యు’ అని చెప్పుకుని, టిపికల్ లవ్ మ్యారేజ్‌లా చేసుకున్నది కాదు. తనతో లైఫ్ కంఫర్ట్‌గా ఉంటుందనిపించి, చేసుకున్నా. గడ్డం, పొడువైన జుట్టుతో నాగీ చూడచక్కగానే ఉన్నా.. మీకెప్పుడైనా అనిపించిందా ఈ గెటప్ అంతా మార్చేయాలని? ప్రియాంకా: మా పెళ్లి అవ్వకముందు ఓసారి ట్రై చేశా. హెయిర్ షార్ట్‌గా కట్ చేసుకుని, గడ్డం తీశాడు. నువ్వేనా అన్నాను? ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ కొంచెం లాంగ్ హెయిర్, గడ్డం.. ఇదే మెయిన్టైన్ చేస్తున్నాడు. ఇదే బాగుంది. ఫస్ట్ ‘ఎవడే సుబ్రమణ్యం’, ఇప్పుడు ‘మహానటి’ తీశారు. మరి.. రెగ్యు లర్ ఫార్మాట్ సినిమాలు చేయాలని మీకు లేదా? నాగీ: ఒక సినిమా తీయాలంటే కథ రాయడానికి ఒక ఆరు నెలలు పడుతుంది. మళ్లీ కాస్టింగ్‌కి ఒక ఆరు నెలలు. సినిమా పూర్తయ్యేసరికి సంవత్సరం. మొత్తం రెండేళ్లు. మనం 60 ఏళ్లు బ్రతుకుతాం అనుకుంటే అందులో ప్రతి సినిమాకి రెండేళ్లు కేటాయించినప్పుడు.. స్టాండర్డ్ సినిమా అయినా ఏదైనా.. డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ రెండేళ్ల జీవితం వర్తీగా ఉండాలి. 100 మందిని కొట్టడం, ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలు మీరు ఎంజాయ్ చేస్తారా? నాగీ, ప్రియాంకా: యా.. పర్ఫెక్ట్గా చేసిన సినిమాలను కచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ‘రంగస్థలం’ వెల్ మేడ్ కమర్షియల్ మూవీ. అవునూ.. ‘ఎవడే సుబ్రమణ్యం’కి స్వప్నా, ప్రియాంకా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారట. ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో లిమిటేషన్స్ ఏమైనా పెట్టారా? నాగీ: ‘ఎవడే..’ లో–బడ్జెట్లో చేయాల్సిన సినిమా. అప్పటికి నాని కెరీర్ పెద్దగా హిట్లో లేదు. విజయ్ దేవరకొండ ఫేమస్ కాదు. నాకు ఫస్ట్ మూవీ. ఎవరికీ మార్కెట్ లేదు. పైగా స్టోరీయేమో వెరీ డిఫరెంట్. తెలుగులో చూస్తారా లేదా? అనే డౌట్ కూడా ఉంది. యాక్చువల్‌గా నేనే చేద్దామనుకున్నాను. అయితే స్వప్నా, ప్రియాంకా కథ విని, మేమే చేస్తామన్నారు. దాంతో ఓ మెయిన్ క్యారెక్టర్‌కి కృష్ణంరాజుగారిని తీసుకున్నాం. అలా డీసెంట్ మీడియమ్ బడ్జెట్ సినిమా అయింది. వాళ్లు ఖర్చు పెడుతుంటే నాకు భయం అనిపించేది. ఏదైనా తేడా జరిగితే బ్లేమ్ చేస్తారేమో అనుకున్నా (నవ్వుతూ). ‘మహానటి’కి అయితే నేను వద్దన్నా ఖర్చు పెట్టారు. ఫలానా సీన్‌కి 100 మంది ఆర్టిస్టులు కావాలంటే.. 150 మందిని తీసుకుందామనేవారు. చిన్న సీన్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. అలా అని నీళ్లలా ఖర్చు పెట్టాం అని చెప్పడం లేదు. ఫైనల్లీ... సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారు ఈ సినిమా చూశారా? ప్రియాంకా: చూశారు. సావిత్రిగారి అబ్బాయి సతీష్‌గారు కూడా చూశారు. చాలా బావుందని ఎమోషనల్ అయ్యారు. కాంట్రవర్శీ లేదని హ్యాపీ ఫీలయ్యారు. మా అమ్మగారిని నీలో చూసుకుంటాను అన్నారు అందరి మనసుల్లో మహానటిగా నిలిచిపోయిన సావిత్రిలాంటి అద్భుత నటి పాత్రను అంగీకరించడం అంటే ఎంతో ధైర్యం కావాలి. సావిత్రిగా చేయడానికి ముందు సంశయించినా కీర్తీ సురేశ్ ఆ తర్వాత ధైర్యంగా ఒప్పుకున్నారు. ‘మహానటి’ సినిమా గురించి తన మనోభావాలను ఇలా పంచుకున్నారు. ♦ నాగ్ అశ్విన్ ఫస్ట్ అప్రోచ్ అయి, ఐడియా చెప్పగానే భయం అనిపించింది. స్క్రిప్ట్ విన్నాక ఇంకా భయపడ్డాను. నా భయమేంటంటే సావిత్రిగారు లెజెండరీ యాక్ట్రెస్. సరిగ్గా చేయగలనా లేదా? కన్విన్స్ చేయ గలుగుతానా? లేదా.. ఇలా ఎన్నో డౌట్స్ ఉండేవి. ♦ లుక్ టెస్ట్ చేసేవరకూ అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. తన బొట్టు, వంకీల జుట్టు, కాస్ట్యూమ్స్.. ఇవన్నీ నా మీదకు వచ్చేసరికి నమ్మడం మొదలెట్టాను (నవ్వుతూ). నిజం చెప్పాలంటే అసలు నేను సావిత్రిగారిలా ఉంటానా? అనుకున్నాను. ట్రైలర్, ఫొటోలు చూసుకున్నాక నమ్మకం ఏర్పడింది. ♦ సావిత్రిగారిలో గొప్పతనం ‘సహాయ గుణం’. మన దగ్గర డబ్బుండి దానం చేయటం ఓకే. కానీ లేనప్పుడు కూడా సహాయం చేయాలని ఆరాటపడటం సావిత్రిగారి గొప్పతనం. ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్, విల్ పవర్ సూపర్. ‘మీరు చేయలేరు’ అని పొరపాటున ఆవిడ ముందు అంటే చేసి చూపించగల విల్‌పవర్ ఉన్న వ్యక్తి సావిత్రిగారు. ♦ ఫస్ట్ సావిత్రిగా కీర్తీ అనుకున్నప్పుడు చాలా మంది పెదవి విరిచారు. నాకేం తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే నాకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్లు అనుకోవడంలో తప్పులేదని వదిలేశాను. ♦ సావిత్రిగారి పాత్ర చేస్తున్నాను అని మా అమ్మ (నటి మేనక)గారికి చెప్పినప్పుడు సావిత్రి గారి బొట్టు, జాకెట్ స్లీవ్స్, తన ఎడమ చేతి వాటం గురించి చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు. నిజానికి అప్పట్లో బ్లౌజ్ ఫిటింగ్ చాలా టైట్‌గా ఉండేది. ఇప్పుడా ఫిటింగ్ అంటే కష్టం. షూటింగ్ పూర్తయి, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకున్నాక చూసుకుంటే, నా చేతులు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక గ్రీన్‌గా మారిపోయి ఉండేవి. ♦ ప్రొస్థటిక్ మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పట్టేది. ఒక్కసారి మేకప్ వేసుకున్నాక బాత్రూమ్కి వెళ్లటం, ఫుడ్ తినడం కష్టం. అప్పుడు ఓన్లీ లిక్విడ్ ఫుడ్స్ తీసుకునేదాన్ని. ♦ డబ్బింగ్ చెప్పడానికి 11 రోజులు పట్టింది. సావిత్రిగారు చాలా బాగా మాట్లాడేవారు. ఆమె డిక్షన్ మ్యాచ్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నాను. ♦ నా చిన్నప్పుడు మోహన్‌బాబు గారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయనతో నటించడం చాలా బాగా అనిపించింది. ఆ ఆటోగ్రాఫ్ చూపించగానే ‘ఏంటీ నేను ముసలివాడిని అయ్యానని గుర్తు చేస్తున్నావా?’ అన్నారు సరదాగా. ♦ సావిత్రిగారి కుమార్తె విజయ చాముండేశ్వరిగారు చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు. మా సినిమాలోని ‘మాయాబజార్’లో కొన్ని సీన్స్ చూపిస్తే, ‘సూపర్బ్’ అని చాలా సంతోషపడ్డారు. అప్పటినుంచి నన్ను ‘క్యూట్ లిటిల్ మామ్’ అంటున్నారు. ఎప్పుడైనా మా అమ్మగారు గుర్తొస్తే నీలో అమ్మగారిని చూసుకుంటాను, నువ్వు దగ్గర ఉంటే హగ్ చేసుకుంటాను అన్నారు. -
సావిత్రమ్మ
-
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహానటి’
లెజెండరీ నటి, తెలుగు వాళ్లు గర్వించదగ్గ నటి మహానటి సావిత్రి. అలాంటి నటిపై వస్తున్న సినిమా ‘మహానటి’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా... ఒక్క సన్నివేశం కూడా అభ్యంతర కరంగా లేవని సెన్సార్ వాళ్లు... క్లీన్ యూ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు ట్విటర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్, లుక్స్, మోషన్ పోస్టర్స్,సాంగ్స్ ప్రేక్షకులకు చేరువయ్యాయి. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్, జెమినీ గణేషన్‌గా దుల్కర్సల్మాన్ నటించిన విషయం తెలిసిందే. ఇతర కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చగా, వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. -
ఆయన పాత్రను పోషించడం ఈ జన్మలో జరగదు
-
తాతగారి పాత్ర చేయడం ఈ జన్మకు జరగని పని
‘‘ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నప్పుడు మనకు వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. అది నేచర్ ఇచ్చేస్తుంది. అలాగే ఆ మహానటి వేషం వేయటానికి కీర్తీని, ఇతర పాత్రలకు దుల్కర్, సమంత, విజయ్ వీళ్లందర్నీ తీసుకువచ్చింది. గొప్పవాళ్లు భౌతికంగా మనకి దూరం అవ్వచ్చు కానీ వాళ్ల సౌరభం మన చుట్టూనే ఉంటుంది. సావిత్రిగారే పట్టుబట్టి నా జీవితాన్ని కథగా మలిచి ఓ సినిమా తీయండి అని వీళ్లను ఎన్నుకున్నారు’’ అన్నారు ఎన్టీఆర్. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్ పోషించారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘చాలాసార్లు చాలా విషయాల్లో మనకు అంత అర్హత ఉందా? అనిపిస్తుంది. నాకు ఈ ఆడియో ఫంక్షన్లో సావిత్రిగారి∙హుందా గురించి మాట్లాడే అర్హత ఇప్పుడు కాదు.. బహుశా ఎన్ని జన్మలు ఎత్తినా రాదేమో. ట్రూ లేడీ సూపర్‌స్టార్ సావిత్రిగారు. ఆవిడ ఔన్నత్యం ముందు ఆమె పేరు కూడా ఎత్తటానికి సరిపోం మనం. ఆవిడ ఎలా పోయారు? అనేకంటే ఆవిడ ఎలా బ్రతికారు అని చూపించే చిత్రం ఇది. కొంతమంది జీవితం తెలుసుకోవటం అవసరం. కొందరు సాధించిన విజయాల్ని తెలుసుకొని స్ఫుర్తిగా తీసుకోవాలి. అలాంటి కథను తీసుకు వస్తున్నాడు దర్శకుడు నాగీ. ఈ సినిమా తీయటానికి నాగీకి ఎంత అనుభవం ఉంది అనేకంటే సావిత్రిగారి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి. ఈ చిత్రాన్ని తనొక దర్శకుడిగా కంటే అభిమానిగా తీశాడని అనుకుంటాను. తనకు అండగా ప్రియాంకా, స్వప్నా ఉన్నారు. స్వప్నా నా దగ్గరకు వచ్చి, ఈ సినిమాలో తాతగారి (నందమూరి తారక రామారావు) పాత్ర చేయమని అడిగింది. కానీ ఆయన పాత్రను పోషించడం ఈ జన్మలో జరగని పని. నాకు బేసిక్‌గా ఈ చిత్రంలో రామారావుగారి పాత్ర పోషించే దమ్ము లేదు. మనకు తెలిసిన కథలో, ఆ కథలోని వ్యక్తిలాగా నటించడం చాలా కష్టం. అది నటిస్తే జరగదు. జీవిస్తే జరుగుతుంది. కీర్తీ సురేశ్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ఈ నలుగురూ వాళ్ల వాళ్ల పాత్రల్లో జీవించారు. వైజయంతి మూవీస్ తాతగారి వల్ల మొదలైంది. స్వప్న సినిమాస్ నా ‘స్టూడెంట్ నెం.1’తో మొదలైంది. ఈరోజు ఇంత గొప్ప సినిమా తీస్తారని అనుకోలేదు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ మధ్య ఆడవాళ్ల మీద ఆకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ సినిమా చూశాక ఎందుకు మనం మగాళ్లుగా పుట్టాం అని అనుకుంటారు. ఒక స్త్రీ బలమేంటో... ఆడవాళ్లు తలుచుకుంటే ఏం సాధిస్తారో సావిత్రిగారు చూపించారు. ఇప్పటికైనా ఆడవాళ్లను గౌరవిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారు, నందమూరి తారక రామారావుగారు, సావిత్రిగారు.. ఈ ముగ్గురి పేర్లు తెలుగు సినిమాలో ఎప్పటికీ నిలిచిపోయే ఉంటాయి. వాళ్లు లేకుండా ‘మాయాబజార్’ సినిమా లేదు. నన్ను 8 నెలల వయసులో ఎత్తుకొని ‘వెలుగు నీడలు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం చేశారు సావిత్రిగారు. తన దగ్గరి నుంచే స్టార్డమ్ నాకు అంటుకొని ఉంటుంది. సావిత్రిగారిని చూసిన వెంటనే భయపడి నాన్నగారి వెనక్కో, అమ్మ కొంగు చాటుకో వెళ్లిపోయేవాణ్ణి. ఒక వ్యక్తి మీద బయోపిక్ తీయాలంటే వారికి ఓ అర్హత ఉండాలి. ఆ అర్హత సావిత్రి గారికి ఉంది. తెలుగు సూపర్‌స్టార్ మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్. అది కూడా ఒక లేడీ సూపర్ స్టార్. మనందరం గర్వపడాలి. అది తీసింది కూడా స్వప్నా, ప్రియాంకా. పాతికమంది అమ్మాయిలు సినిమా టీమ్‌లో ఉన్నారట. తెలుగు ఇండస్ట్రీలో స్త్రీలకు అంత గౌరవం ఇస్తాం. ఈ సినిమాలో భాగమవ్వనందుకు చాలా ఈర్ష్యగా ఉంది. నేను లేకపోయినా నా కొడుకు, కోడలున్నారు ఈ సినిమాలో. ట్రైలర్, టీజర్ చూస్తే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటి వరకూ మీరు ఎన్నో హిట్స్ ఇచ్చారు అశ్వనీదత్‌గారూ.. ఈ సినిమా మీకు రెస్పెక్ట్ తీసుకువస్తుంది’’ అన్నారు. ‘‘సావిత్రిగారి గురించి మాట్లాడే వయసు నాకు లేదు. కీర్తీ ఎంత కష్టపడిందో తెలుసు. ఇందులో పని చేసిన అందరితో నాకు అనుబంధం ఉంది. ఫస్ట్ టైమ్ అనిపిస్తోంది నా సినిమాలో నేను లేనే అని. ఇందులో నేనూ యాక్ట్ చేయాల్సింది. కుదర్లేదు. నాగీ సినిమాల్లో ఒక నిజాయితీ ఉంటుంది. ఇందులోనూ కనిపిస్తుంది’’ అన్నారు నాని. కీర్తీ సురేశ్ మాట్లాడుతూ– ‘‘నాని ద్వారా ఈ సినిమా గురించి విన్నాను. నాగీ, స్వప్నా నా దగ్గరకి వచ్చి, నువ్వు టైటిల్ రోల్ చేయాలన్నారు. నేను సావిత్రిగారి పాత్ర చేయడమేంటి? అనుకున్నాను. కానీ నాగీ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మనం సావిత్రిగారికి ఇచ్చే నివాళి అని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ నాగీ. సావిత్రిగారు ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో చేసినందుకు. రిస్క్తీసుకున్నాను. మొయిన్ హీరోయిన్ కాదు. కానీ కచ్చితంగా చెప్పాల్సిన కథలో భాగమవ్వాలని ఒప్పుకున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఒక సీన్ చేసినప్పుడు గ్లిజరిన్ వాడలేదు. ఆ సీన్ కోసమే డబ్బింగ్ చెప్పుకున్నాను. సావిత్రిగారి ప్రొఫెషన్లో నేనూ ఉన్నందుకు గర్వంగా ఉంది. వైజయంతి మూవీస్ తెలుగు సినిమా షైన్ అయ్యేలా చేస్తున్నారు. కీర్తీ ట్రాన్సఫర్మేషన్ చూసి షాక్ అయ్యాను’’ అన్నారు సమంత. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘ఇక్కడ మనం ఉన్నది సావిత్రిగారి కోసం. రెండేళ్లు అందరూ కష్టపడి పని చేసింది సావిత్రిగారి మీద ఉన్న గౌరవంతోనే. స్టోరీ లోపలకు వెళ్లే వరకూ మరో హిమాలయాలు ఎక్కొచ్చేమో అనిపించింది. ఆ అర్హత పెంచుకునేందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంవత్సరం ప్రీ–ప్రొడక్షన్ చేశాం. సావిత్రిగారు దొరక్క ముందే సమంత సినిమాలోకి వచ్చారు. అంత నమ్మారు మమ్మల్ని. షూటింగ్ చేస్తున్నప్పుడు సావిత్రిగారు మా పక్కనే ఉన్నట్లు ఫీల్ అయ్యాం. సావిత్రిగారు అనుకున్నారు కాబట్టే ఈ సినిమా చేయగలిగామేమో’’ అన్నారు. స్వప్నా దత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. సెన్సేషన్ కోసమా? ఎందుకు సావిత్రి అని? వర్కౌట్ అవుతుందా? అని. ‘ఎవడే సుబ్రమణ్యం’ చేసేప్పుడు సావిత్రిగారి జీవితకథ తీద్దామని నాగి అన్నాడు. నాగి మీద ఉన్న అతి నమ్మకం. దాని కంటే ముఖ్యంగా సావిత్రిగారి మీద ఉన్న నమ్మకం. సావిత్రిగారి కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యం ఇచ్చారు. 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాం. ఎత్తుపల్లాలు చూశాం. వైజయంతి బేనర్‌కి రెస్పెక్ట్ తీసుకువచ్చే సినిమా. మమ్మల్ని నమ్మింది సమంత. ఒక హీరోయిన్ కథను మోసుకెళ్లటం అనే డెసిషన్ గ్రేట్. కీర్తీ సురేశ్, నేను.. ఇద్దరం సరదాగా గొడవపడేవాళ్లం’’ అన్నారు. ‘‘వైజయంతి మూవీస్‌లో సినిమా చేయడం మంచి ఎక్స్పీరియన్స్. జెమినీగా నా నటన మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు దుల్కర్ సల్మాన్. ‘‘ఫస్ట్ సినిమాతో నాగి నన్ను హిమాలయాలకు తీసుకువెళ్లాడు. మళ్లీ 80లోకి తీసుకువెళ్లాడు. ఇందులో చిన్న పాత్ర చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. -
మహేష్ తరువాత ‘మహానటి’ కోసం..!
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్, సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా చిత్రయూనిట్ ఆడియో రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రోజు(మంగళవారం) జరగనున్న ఆడియో వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. వైజయంతి మూవీస్ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎన్టీఆర్ మహానటి ఆడియో రిలీజ్‌కు హాజరయ్యేందుకు అంగీకరించారు. మిక్కి జే మేయర్ సంగీతమందించిన ఈ సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
‘ఆ పాత్ర దక్కటం నా అదృష్టం’
తమిళసినిమా: సావిత్రి పాత్రలో నటించాలా వద్దా అని ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తాయని నటి కీర్తీసురేశ్ పేర్కొన్నారు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నాగ్అశ్విన్ దర్శకుడు. తమిళంలో నడిగైయార్ తిలగం, తెలుగులో మహానటి పేరుతో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటించగా జెమినీగణేశన్‌గా మలయాళ నటుడు దుల్కర్సల్మాన్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ క్రేజీ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకుల సమావేశంలో పాల్గొన్న నటి కీర్తీసురేశ్ మాట్లాడుతూ సావిత్రి పాత్రలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం చాలా మంచి చిత్రాలు చేస్తున్నా, అలాంటి సమయంలో మహానటి సావిత్రి జీవిత చరిత్రలో ఎలా నటించేది? ఆమె జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం. అలాంటి పాత్రలో నటించడం సాధ్యమా లాంటి పలు సందేహాల మధ్య దర్శకుడు నాగ్అశ్విన్, నిర్మాతల నమ్మకమే ఈ చిత్రంలో తనను నటించేలా చేసింది. తొడరి తెచ్చిన అవకాశం తాను నటించిన తొడరి చిత్రం ఏదో ఒక రకంగా తనకు మంచి చేస్తుందని భావించాను. తొడరి చిత్రం చూసే దర్శకుడు నాగ్అశ్విన్ సావిత్రి జీవిత చరిత్రలో నటింపజేయాలని భావించినట్లు చెప్పడంతో తొడరి చిత్రంపై తన నమ్మకం నిజమైందన్నారు. యూనిట్ సమష్టి కృషితోనే.. నగిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్ర యూనిట్ సమష్టి కృషి, శ్రమకు చిహ్నం అన్నారు. సావిత్రి లాంటి గొప్ప నటిగా నటించడానికి తాను ఆమె నటించిన పలు చిత్రాలు చూశానని, నిజజీవితంలో సావిత్రి గురించి ఆమె కూతురు చాముండేశ్వరిని అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న గీతరచయిత మదన్‌కార్గీ మాట్లాడుతూ కీర్తీసురేశ్, సావిత్రిగా నటించనున్నారన్న వార్త వెలువడగానే సావిత్రి పాత్రకు పట్టిన గతి అని పలువురు విమర్శించారన్నారు. తానీ చిత్రంలోని పలు సన్నివేశాలను చూశానని కీర్తీసురేశ్, సావిత్రిగా మారిపోయారని అన్నారు. ప్రతి సన్నివేశంలోనూ కీర్తీసురేశ్ సావిత్రిలా పరకాయప్రవేశం చేశారని తెలిపారు. నటి సావిత్రి గురించి తెలియని ఈ తరం ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. సావిత్రి బాల్యం నుంచి, చివరి జీవితం వరకూ ఆవిష్కరించే చిత్రంగా నడిగైయార్ తిలగం ఉంటుందన్నారు. చిత్ర సమర్పకుడు సీ.అశ్వినీదత్ మాట్లాడుతూ తాను ఎన్టీ.రామారావు, చిరంజీవి వంటి ప్రముఖ నటులతో 43 చిత్రాలు నిర్మించానని అయితే ఈ మహానటి సావిత్రి జీవిత చరిత్రతో నిర్మించిన చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.