తమిళ సినిమా: నడిగైయార్ తిలగం తెలుగులో మహానటి చిత్రం అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణను పొందుతోంది. ఇందుకు చాలా కారణాలు, చిత్రం వెనుక ప్రతిభావంతులు పలువురు ఉన్నా, ప్రధాన కారణం నటి కీర్తీసురేశ్ అనడం అతిశయోక్తి కాదు. ఈ యువ నటి ఆ మహానటిగా ఒదిగిపోయారన్నది నిజం. అయితే ఈమె ఆ పాత్రలో నటన వెనుక శ్రమ, పట్టుదల, అవమాన భారం, ఎగతాళి, వేదన, కంటతడి, కసి, కృషి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటిఅన్ని టినీ అధిగమించి ఇవాళ సాధించాలన్న విజయ గర్వంతో పరిహాసం చేసిన వారి నోటితోనే శభాష్ అనిపించుకుంటున్నారు. అలాంటి కీర్తీసురేశ్ మనసులోని భావాలను చూద్దాం. దక్షిణాది సినీచరిత్రలో మహత్తరమైన సాధనను చేసిన నటి సావిత్రి. ఆమె పాత్రలో నటించే అవకాశం యువ నటినైన నాకు వచ్చిందన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సినిమాలో నేను సాధించాలనుకున్న లక్ష్యం ఇది. అంత తొందరగా దరి చేరుతుందని ఊహించలేదు అని మెరిసే కళ్లతో అన్న కీర్తీసురేశ్‌ను మీరీ సావిత్రి పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ వెలువడగానే చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారన్న ప్రశ్నకు బదులిస్తూ, అవన్నీ నాకు తెలుసు.
నేను చాలా చిన్న అమ్మాయిని. అంత వెయిట్ అయిన పాత్రను తట్టుకోగలనా? అన్న అనుమానం రావడం సహజమే. అయితే అలాంటి వారందరికీ నడిగైయార్ తిలగం చిత్రం బదులిస్తుందని భావించాను. అయినా విమర్శలు నాకు కొత్తేమీ కాదు. తొడరి చిత్రంలో నటించినప్పుడే చాలా మంది ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. నా నవ్వు గురించి కొందరు తప్పు తప్పుగా విమర్శలు చేస్తున్నారు. ఏదో చెడాలోచనలతో అలాంటి కామెంట్ చేసేవారికి నేనుందుకు బదులివ్వాలి. ఇకపోతే మీరడిగిన ప్రశ్నకే వస్తే, సావిత్రి పాత్రలో నటించే అవకాశం రావడంతో అమ్మ చాలా సంతోషించారు. లెజెండ్ అయిన సావిత్రి పాత్రలో నటించే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పారు. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా పట్టించుకోవద్దు.నువ్వు దైర్యంగా నటించు అని నాకు బూస్ట్ ఇచ్చారు. అయితే బయట వాళ్లెవ్వరూ నన్ను పోత్సహించలేదు. పైగా ఇది సావిత్రికి పట్టిన గతి అంటూ ఎగతాళి చేశారు.
సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు చేశారు. అప్పుడు నేను అప్‌సెట్ అయ్యాను. ఇంటిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాను. అప్పుడే నాలో కసి పెరిగింది. సావిత్రి పాత్రలో జీవించి తీరుతానని శపథం చేశాను. అందుకు తగ్గట్టుగా శ్రమించాను. అది ఇప్పుడు నెరవేరిందదని భావిస్తున్నాను. మహనటి సావిత్రి పాత్రను అవలీలగా నటించేశారు. ఇప్పుడు ఎలా ఫీల్‌అవుతున్నారన్న ప్రశ్నకు కథానాయికలు సినిమాల్లో సాధించడం ఎంత కష్టం అన్నది తెలుసుకున్నాను. సినీ తారల మరో ముఖం ప్రజలకు తెలియదు. అలాంటిది ఈ చిత్రంలో నటించిన తరువాత చాలా విషయాలను నేను తెలుసుకున్నాను. సావిత్రి సొంతంగా సినిమాలను నిర్మించారు, దర్శకత్వం చేశారు.
ఆమె పాత్రలో నటించిన మీరు దర్శకత్వం, చిత్ర నిర్మాణం చేపడతారా, ప్రేమ వివాహం చేసుకుంటారాఅన్న ప్రశ్నకు అమ్మ మేనక, బామ్మ సరోజ నటీమణులే, అక్క పార్వతి కూడా సినిమా రంగంలోనే ఉంది. నాన్న నిర్మాత. అలా మాది సినిమా కుటుంబం. అయితే నేను మాత్రం ఎప్పటికీ నిర్మాతగా మారను. దర్శకత్వం అంటారా? అందకు అర్హత గానీ, ప్రతిభ గానీ నాకున్నాయని భావించడం లేదు. ఇకపోతే ప్రేమ వివాహం గురించి చెప్పాలంటే నేను ఇప్పుడే నటిగా ఎదుగుతున్నాను. కాబట్టి పెళ్లి ప్రస్తావన అనవసరం. ఇంకా చెప్పాలంటే మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. భవిష్యత్‌లో నాకు ఎవరిపైన అయినా ప్రేమ కలిగితే ఆ విషయాన్ని అమ్మానాన్నలకు ధైర్యంగా చెబుతాను. వారు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం చేసుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment