Savitri
-
తెలుగు తెరపై చెరిగిపోని జ్ఞాపకం మహానటి 'సావిత్రి' (ఫోటోలు)
-
Missamma Movie: ఆ హీరోయిన్‌పై నిర్మాత ఆగ్రహం.. సావిత్రికి అవకాశం
1955 జనవరి 12న విడుదలైన ‘మిస్సమ్మ’ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్. చక్రపాణి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘మిస్సమ్మ’ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. హీరోయిన్ సావిత్రికి జమున చెల్లిగా నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘మిస్సమ్మ’. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులూ ఉండవు. చక్కని హాస్యం, భావోద్వేగాలు, గిల్లికజ్జాలతో సాగుతుంది. సాలూరి రాజేశ్వరరావు అందించిన మ్యూజిక్ ఓ మ్యాజిక్.భానుమతి ప్లేస్‌లో సావిత్రి ‘మిస్సమ్మ’లో ఎస్వీ రంగారావు, సావిత్రి నటన... ఎన్టీఆర్, ఏఎన్నార్లను డామినేట్ చేసేలా ఉంటుంది. సావిత్రి హీరోయిన్గా ఎదుగుతున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా ఆమె కెరీర్‌కి చాలా ప్లస్ అయ్యింది. తన ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో ఆత్మవిశ్వాసం కలిగిన స్ట్రాంగ్ లేడీ రోల్ సావిత్రిది. అలాగే ముక్కోపి. ఈ పాత్రకు భానుమతి కరెక్ట్ అని తొలుత దర్శక–నిర్మాతలు భావించారు. అప్పటికే ఆమె పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్లయింది. ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్ బస్టర్లో నటించారు. నిజ జీవితంలో భానుమతి వ్యక్తిత్వం... ‘మిస్సమ్మ’లో మేరీ పాత్రలా ఉంటుంది. భానుమతితో ‘మిస్సమ్మ’ షూటింగ్ కొంత మేర జరిగింది కూడా. అయితే ఓ రోజు ఆమె షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చారట. దీంతో నిర్మాత చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం షూటింగ్ అయితే మధ్యాహ్నం రావడమేంటి క్షమాపణలు చెప్పాలన్నారట. అయితే... ఆలస్యమవుతుందని మేనేజర్‌తో కబురు పంపానని... కాబట్టి క్షమాపణలు చెప్పేది లేదన్నారట భానుమతి. దీంతో చక్రపాణి ఆమెను సినిమా నుంచి తొలిగించి అప్పటివరకు షూట్ చేసిన రీల్స్‌ను తగలబెట్టేశారట. అలా ‘మిస్సమ్మ’లో మెయిన్ హీరోయిన్గా చేస్తున్న భానుమతి స్థానంలోకి సావిత్రి వచ్చారు. లేదంటే హీరోయిన్ చెల్లెలుగా చేసిన జమున పాత్ర చేయాల్సి వచ్చేది. బెంగాలీ నవల మన్మొయీ గర్ల్స్ స్కూల్ అనే హాస్య రచన ఆధారంగా నిర్మాత చక్రపాణి ‘మిస్సమ్మ’ తెలుగు కథను సమకూర్చారు. సినిమా చిత్రీకరణంతా మద్రాసు చుట్టు పక్కలే జరిగింది. ‘మిస్సమ్మ’ను తమిళంలో మిస్సియమ్మగా ఏక కాలంలో చిత్రీకరించారు. ఇందులో జెమినీ గణేశన్, సావిత్రి నటించారు. తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ కూడా కమర్షియల్‌గా బంపర్ హిట్టయ్యాయి. 1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాను హిందీలోనూ తీసింది. హిందీలో మేరి పాత్రను మీనాకుమారి పోషించగా ‘మిస్ మేరి’గా నిర్మించారు. ఇది ఎల్వీ ప్రసాద్‌కి బాలీవుడ్లో దర్శకుడిగా తొలి చిత్రం.– ఇంటూరు హరికృష్ణ -
మట్టింట్లో బంగారు పంటలు
సావిత్రి విజయవంతమైన రైతు. ఆమెది మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, గంగాపూర్ గ్రామం. ఆమెకున్నది ము΄్పావు ఎకరా మాత్రమే. అందులోనే ఏడాదికి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని చూస్తోందామె. భర్త ఆరోగ్యం దెబ్బతినడంతో అతడికి వైద్యం చేయించడానికి ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి పొలంలో అడుగు పెట్టింది సావిత్రి. ‘మొదట్లో నా పొలంలో జొన్న, గోధుమ పండించేదాన్ని. ఆర్ట్ ఆఫ్ లివింగ్స్ నేచురల్ ఫార్మింగ్ అనే స్వచ్ఛంద సంస్థ వాళ్లు మా ఊరికి వచ్చి నాచురల్ ఫార్మింగ్ గురించి చెప్పి 350 జామ మొక్కలిచ్చారు. నిజానికి వాటి పెంపకం కోసం పెద్దగా శ్రమించాల్సిందేమీ లేదు. పాదులు చేసి తగినంత నీరు పెడితే చాలు. ఇక అంతర పంటలుగా వేరు శనగ, వంకాయ వంటి కూరగాయలు పండిస్తున్నాను. మా అమ్మాయి పన్నెండవ తరగతి వరకు చదివి సొంతంగా టైలరింగ్ షాపు నడుపుకుంటోంది. ఉద్యోగం వెతుక్కోవడానికి ముంబయికెళ్లిన మా అబ్బాయి కూడా చిన్న ఉద్యోగాల అవసరం లేదని మా ఊరికి తిరిగి వచ్చేశాడు. మా కుటుంబం స్వయంసమృద్ధి సాధించిందనడానికి నిదర్శనం ఇంకేం కావాలి’ అంటోంది సావిత్రి. ఆమె సక్సెస్‌తో ఆమె కొడుకు ఉద్యోగం వదిలి పొలం బాట పడితే తెలుగురాష్ట్రాల్లో ఓ లెక్చరర్ సునంద మూడేళ్ల కిందట నేచురల్ ఫార్మింగ్‌లో అడుగుపెట్టి ఇప్పుడు పాతిక ఎకరాలు సాగుచేస్తోంది.పాఠాల నుంచి పంటలకు...కడప జిల్లా రామాపురానికి చెందిన యువతి సునంద. ఆమె ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో లెక్చరర్‌గా మూడేళ్లు పని చేసింది. తర్వాత పెళ్లి చేసుకుని భర్త ఉద్యోగ రీత్యా ముంబయి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు. లయోలా కాలేజ్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ తన అభిరుచిని సంతృప్తి పరుచుకోవడం ముఖ్యమనే అభి్రపాయానికి వచ్చింది. అప్పటికే నైట్‌షిఫ్ట్‌లు, వర్క్ ప్రెషర్‌తో భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. నేచురల్ ఫుడ్తోనే అతడి ఆరోగ్యానికి స్వస్థత చేకూరింది. అదే సమయంలో భర్త స్నేహితుని హఠాన్మరణం ఆమెను ఆలోచింప చేసింది. మంచి ఆహారం లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం అనుకుంది.ఇక ఉద్యోగమా, వ్యవసాయమా అనే ఊగిసలాట నుంచి బయటపడి అత్తగారి ఊరు ఆదిలాబాద్, కౌటాల మండలంలోని విజయనగరం బాట పట్టింది. ఎనిమిది ఎకరాలతో భార్యాభర్తలిద్దరూ సేంద్రియ సేద్యం మొదలు పెట్టారు. అప్పటి వరకు సుభాష్ పాలేకర్, సీవీఆర్ వ్యవసాయ పద్ధతులను చదివి ఆకళింపు చేసుకున్న జ్ఞానమే ఆమెది. మామగారి సూచనలతో మొక్క నాటడం నుంచి ప్రతి పనినీ నేర్చుకుంది.సేంద్రియ సేద్యం చేసే రైతు నిలదొక్కుకోవాలంటే మార్కెటింగ్ ప్రధాన సమస్య అని గుర్తించింది. కొనుగోలు దారులకు అందుబాటులో ఉండడమూ అవసరమే అని గుర్తించింది. ఇప్పుడు శంషాబాద్ దగ్గర షాబాద్ మండలం పెదవేడు గ్రామంలో పాతిక ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తోంది. దళారీ దోపిడీ బారిన పడకుండా సొంతంగా మార్కెటింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. – వాకా మంజులారెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
సెలబ్రిటీనే ఇలా చేస్తే ఎలా?.. మీకు రూల్స్ వర్తించవా?
సోషల్ మీడియా వచ్చాక రీల్స్ చేయడం ఓ పిచ్చి అలవాటుగా మారిపోయింది. ఎక్కడపడితే రీల్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మెట్రో, బస్సులు, రైళ్లు, రోడ్లను కూడా వదలడం లేదు. కొందరైతే రీల్స్ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రీల్స్ చేస్తున్నారు.అలాంటి లిస్ట్‌లో మన సెలబ్రిటీ, యాంకర్ సావిత్రి కూడా చేరిపోయింది. హైదరాబాద్‌లో ఓఆర్ఆర్పై రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తప్ప మనుషులకు నడవడానికి అవకాశం లేదు. ఓఆర్ఆర్పై దాదాపు 120 స్పీడుతో వాహనాలు వెళ్తుంటాయి. అప్పడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.మరి నిబంధనలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో రీల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆమెను చూసి.. మరికొందరు రీల్స్ చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి వారిని ఓఆర్ఆర్పై రీల్స్ చేయకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లేదంటే రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్ను రీల్స్‌కు అడ్డాగా మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆమెపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
ఎవరీ సావిత్రి ఠాకూర్? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ జూన్ 09న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మోదీ కొత్త ప్రభుత్వంలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు పొందడం అంటే ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. చెప్పాలంటే దేశం అంతటని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గిరిజన నాయకురాలు సావిత్ర ఠాకూర్‌కి దక్కింది. ఇంతకీ ఎవరీమె..? ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కిందంటే..నరేంద్ర మోదీ జూన్ 09న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తోపాటు 72 మంత్రలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్ అనే గిరిజన నాయకురాలు చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్ వేదిక జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఠాకూర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మధ్యప్రదేశ్‌లో దీదీ ఠాకూర్‌గా పేరుగాంచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె గులాబీ రంగు చీర తోపాటు సంప్రదాయ గంచాను ధరించి వచ్చారు.ఆమె ఎవరంటే..దీదీ ఠాకూర్‌గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్‌కి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కాగా, భర్త రైతు. పురుషాధిక ప్రపంచంలో అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆమె సామాజికి కార్యకర్తలా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్, ధార్ వంటి ప్రాంతాల్లోని గిరిజన మహిళలు, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి రుణలు సేకరించడంలో తన వంతుగా సహాయసహకారాలు అందించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం జరిగింది. అలా ఆమె జిల్లా పంచాయతీ మెంబర్‌గా ఎన్నికై.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. ఆమె షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) రిజర్వడ్ సీటుపై ధార్ నుంచి పోటీ చేసి బీజేపీకి మహళా గిరిజన నాయకురాలయ్యింది. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పార్టీ పదవులను నిర్వహించింది. తదనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్ష మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాధేశ్యామ్‌పై విజయం సాధించారు. గతంలో ఠాకూర్ బీజేపీలో జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఉన్నారు. 2013లో ఆమె కృషి ఉపాజ్ మండి ధమ్నోద్ డైరెక్టర్‌గా, ఆదివాసీ మహిళా వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పలు ఉన్నత పదవులును అలంకరించారు. గిరిజన నాయకురాలిగా ఆమె ప్రజలకు చేసిన సేవలకు గానూ బీజేపీ ఇలా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చి మరీ గౌరవించింది. కాగా, కేంద్ర మంత్రి మండలిలోని కొత్త మంత్రులు..కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితరులు. అయితే వారిలో సీతారామన్, దేవిలకు క్యాబినేట్లో చోటు దక్కగా, మిగిలిన వారు సహాయ మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18వ లోక్‌సభలో కొత్తమంత్రి మండలిలో కేబినేట్ పాత్రలో ఇద్దరు తోసహా ఏడుగురు మహిళలు చేరారు. అయితే గతంలో జూన్ 05న రద్దయిన మంత్రిమండలిలో మాత్రం దాదాపు 10 మంది దాక మహిళా మంత్రులు ఉండటం విశేషం. Savitri Thakur takes Oath of Office and Secrecy as Union Minister of State during the #SwearingInCeremony #OathCeremony #ShapathGrahan pic.twitter.com/E9NKSqQPET— PIB India (@PIB_India) June 9, 2024 (చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!) -
సావిత్రిగారిని చూడగానే నోట మాట రాలేదు: చిరంజీవి
‘‘మహానటి సావిత్రిగారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో నా జన్మ సార్థకం అయిందని భావిస్తున్నాను’’ అన్నారు హీరో చిరంజీవి. దివంగత నటి సావిత్రిపై సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లోనే సావిత్రిగారితో నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించింది. రాజమండ్రిలోని పంచవటి హోటల్లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకెళ్లారు. ఆమెను చూడగానే నోట మాట రాలేదు. ‘నీ పేరేంటి బాబు’ అని అడిగారామె. చిరంజీవి అన్నాను. ‘శుభం బాగుంది’ అన్నారు. మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ షూటింగ్ క్యాన్సిల్ అయింది. నేను సరదాగా డ్యాన్స్ చేస్తూ జారిపడ్డాను. అయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్ చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు సావిత్రిగారు ‘భవిష్యత్‌లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పిన మాట నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది. ‘ప్రేమ తరంగాలు’లో సావిత్రిగారి కొడుకుగా నటించాను. ఆ తర్వాత ఆమెతో నటించే, ఆమెను చూసే చాన్స్ రాలేదు. కేవలం కళ్లతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరెవరూ లేరు’’ అన్నారు. ఈ వేడుకలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్ కుమార్, నటీనటులు జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. -
వినోదం.. సందేశం
కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం విలేకర్ల సమావేశంలో సంగీత దర్శకురాలు ఎమ్ఎమ్ శ్రీలేఖ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సోషల్ మీడియాలో మంచిని పెంపొందిస్తే సమాజానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని ఈ సినిమాలో చూపిస్తాం. అలాగే 75 శాతం వినోదం కూడా ఉంటుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్. అచ్యుత రావుతో పాటు చిత్ర సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. -
అందుకే సావిత్రి చనిపోయిన చూడటానికి వెళ్ళలేదు..!
-
మాస్ స్టెప్స్‌తో..
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పోకిరీ జులాయిలు...’ అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. కంచర్ల ఉపేంద్ర, వంద మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇరవై మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా ఈ మాస్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఊటీలో చిత్రీకరించే మరో పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘హీరో కావాలన్న మా అబ్బాయి ఆసక్తిని గమనించి, ఐదు చిత్రాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు. ఈ చిత్రానికి సంగీతం: రాము అద్దంకి. -
సావిత్రి ఆ పని చేసినందుకు మానసికంగా కృంగిపోయింది
-
అప్పట్లో సావిత్రి అంటే పిచ్చి ఇష్టం నాకు..!
-
‘ఉపేంద్ర గాడి అడ్డా’తో యువతకి సందేశం
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో ‘ఉపేంద్ర గాడి అడ్డా’ సినిమా సోమవారం ఆరంభమైంది. కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సీన్‌కి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ ఇచ్చారు. ఆర్యన్ సుభాన్ ఎస్కే మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం వరుణ్ సందేశ్‌తో ‘కానిస్టేబుల్’ చిత్రం చేస్తున్నాను. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ నేటి ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటూనే యువతకు సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా అబ్బాయి ఉపేంద్రతో తొమ్మిది చిత్రాలు తీయాలనుకున్నాం. ఇప్పటికే నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ ఐదో సినిమా’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు. -
సావిత్రి తో షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చి భార్యతో SVR ఏం చెప్పేవారంటే..
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - సావిత్రి
-
వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్
సినిమా డైరెక్టర్ అనగానే మన మదిలో మెదిలేది మేల్ పోస్టరే. హాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్, టాలీవుడ్ కావచ్చు. కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మగవాడే అన్న అభిప్రాయం అంద రిలో బలంగా పడిపోయింది. తొలి నుంచి పూర్తి స్థాయిలో మేల్ డామినేషన్ ఉండటమే అందు కు కారణం కావచ్చు. కానీ…అప్పుడు….ఇప్పుడు… మహిళా దర్శకులు స్టార్ కెమెరా, యాక్ష న్ అంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆ సౌండ్ వినిపిస్తూ వచ్చింది. ఇకపై టాలీవుడ్లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా ? హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఆదుర్తి సుబ్బారావు. ఇలా మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే....రాజమోళి, పూరి జగన్నాధ్, త్రివ్రికమ్, సుకుమార్ ఇలా పూర్తి చేయచ్చు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అంతా బానే ఉంది కానీ… మహానుభావురాళ్ల మాటేంటి ? తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే. అస్సలు లేదు అనడానికి వీల్లేదు. అయితే… ఇప్పుడు పెరుగుతోంది. సక్సెస్ మంత్ర జపిస్తూ తెలుగు సినిమాని సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజంట్ చేయడానికి ఆమె రెడీ అయింది. సినిమా. రంగుల ప్రపంచం. మరో లోకం. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కళకళలాడే చోటు. అలాంటి సినిమాని లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. డైరెక్టర్ ఆలోచనలకు తగట్టుగానే ఒక కథ సినిమాగా మారుతుంది. అంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో… సరికొత్త సినిమాలకి యాక్షన్ చెప్పేస్తున్నారు. (చదవండి: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం) సూర్య చేత ఆకాశమే హద్దు అనిపించింది మహిళా దర్శకురాలే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దు రా సినిమా… న్యూ థాట్స్‌తో వస్తున్న ఉమెన్ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పకనే చెబుతుంది. త్వరలోనే సూర్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది సుధా. సూర్యతో చేయబోయే సినిమా ఓ బయోపిక్ అని ఆ మధ్య తమిళ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం బయట పెట్టలేదు. (చదవండి: హీరోయినే..హీరో) వైజాగ్‌లో పుట్టి, పెరిగిన సుధ కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేశారు. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేశారు. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె తీసిన చిత్రం అటు హిందీ, ఇటు తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. హిందీ, తమిళంలో మాధవన్ హీరోగా చేస్తే…తెలుగులో గురు పేరుతో తీసిన చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ ప్లే చేశారు. సమంత హిట్స్ లిస్ట్‌పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే సినిమా ఓ బేబీ. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్లు సాధించిందీ చిత్రం. ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి. సౌత్ కొరియా చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ ఈ చిత్రం. అయితే…కథా వస్తువు ఆ చిత్రం నుంచి తీసు కున్నా…సినిమా అంతటా నందిని రెడ్డి మార్క్ ఫీల్, కామెడీ కనిపిస్తూనే ఉంటాయి. లిటిల్ సోల్జర్స్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నందిని రెడ్డి…ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్‌లో చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పనిచేశారు. దర్శకు రాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించారు నందిని రెడ్డి. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి…ఆ తర్వాత ఓ…బేబీ అంటూ ప్రేక్షకులకు మరో మంచి మూవీని అందించారు. నందిని రెడ్డి నుంచి సుధా కొంగర దాకా ఫీమేల్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కొత్త కళని సంతరించుకుం టోంది కదా. కరోనా ముప్పు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ జోష్ మరింత పెరిగింది. అయి తే….తెలుగు చిత్ర పరిశ్రమకి మహిళా దర్శకులు కొత్తేం కాదు. గతంలోనూ ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆ మాటకొస్తే…గిన్నీస్ బుక్‌లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆయా పాత్రల్లో జీవించిన కథానాయికలు… మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది విజయ నిర్మల గురించే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాష లోనూ ఇన్ని సినిమాలను ఏ లేడీ డైరెక్టర్ తీయలేదు. అందుకే…ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించారు. 1971లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు విజయనిర్మల. అదే మీనా. ఫస్ట్ మూవీనే భారీ విజ యం సాధించింది. భానుమతి. నటి, నిర్మాత, గాయని మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. సొంత నిర్మాణ సంస్థలో చండీరాణి చిత్రాన్ని తీశారు భానుమతి. 1953 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్స్‌గా నటించారు. అటు నిర్మాతగా, ఇటు దర్శకురాలిగా, మరోవైపు కథానాయికగా…ఈ చిత్రంలో చాలా బాధ్యతలు పంచుకున్నారు భానువతి. అంతే కాదు. సినిమాలో ఆరు పాటలు కూడా ఆమె పాడారు. అన్నట్టు చిత్రానికి కథ అందించింది కూడా భానుమతే. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాణం వైపు చూస్తారు. కానీ…మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు. విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్ష కులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత చిత్రా లకు దర్శకత్వం వహించారు. సావిత్రి, విజయనిర్మల తర్వాత సక్సెస్ మూవీస్‌తో అందరినీ ఆకట్టుకున్న మరో దర్శకురాలు బి.జయ. జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జయ…సూపర్ హిట్ అనే సినీ వార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మొత్తం 7 సినిమాలను డైరెక్ట్ చేశారు. -
తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్/ మద్దూరు: మావోయిస్టు పార్టీ కీలక నేత, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు రావుల సావిత్రి అలియాస్ మాధవి హెడెమె (46) డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తొలితరం పీపుల్స్‌వార్ నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసి 2019లో గుండెపోటుతో చనిపోయిన రావుల రామన్న అలి యాస్ శ్రీనివాస్ భార్య సావిత్రి. ఆమె లొంగిపోయిన విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. రావుల రామన్న 1992లో మావోయిస్టు పార్టీ (పీపుల్స్‌వార్)లో చేరిన సావిత్రిని 1994లో వివాహం చేసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసినందుకు సావిత్రికి తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును అందించారు. తెలంగాణలో లొంగిపోయిన సావిత్రికి రూ. 5 లక్షల చెక్‌ను అందజేయనున్నట్లు చెప్పారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు ‘మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మావోయిజానికి ఆదరణ తగ్గింది. మావోయిస్టులు బలవంతపెట్టి కొంతమందిని దళంలో చేర్చుకుంటున్నారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు. నేను ఎవరికి తెలియకుండా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయానని సావిత్రి చెప్పారు’అని డీజీపీ వివరించారు. పోలీసులపై జరిగిన తొమ్మిది దాడుల్లో సావిత్రి పాల్గొన్నారని, ఛత్తీస్‌గఢ్‌లో ఆమెపై రూ. 10లక్షల రివార్డు ఉందని తెలిపారు. కేంద్ర కమిటీలో 13 మంది తెలుగోళ్లే.. ‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 20 మందిలో 13 మంది తెలుగువాళ్లే. అందులో తెలంగాణ వాళ్లు 11 మంది కాగా, ఇద్దరు ఏపీకి చెందినవారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వాళ్లు తెలంగాణలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉంది. వారు ఎప్పుడు తెలంగాణలోకి వచ్చినా.. వెంటనే పట్టుకుంటాం. లొంగిపోయే వారికి పునరావాసం కల్పిస్తాం. 135 మంది తెలంగాణకు చెందిన వాళ్లు బస్తర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. మహిళా నాయకుల్లో గణపతి భార్య సుజాతక్క, కోటేశ్వర్ రావు భార్యతోపాటు మరో మహిళ మావోయిస్టు రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నారు’అని డీజీపీ వివరించారు. కాగా, పోలీసులకు లొంగిపోయినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా సావిత్రిని కుటుంబంలోకి ఆహ్వానిస్తామని రామన్న పెద్దన్నయ్య రావుల చంద్రయ్య పేర్కొన్నారు. -
అందుకే సావిత్రిపై కృష్ణకుమారికి కోపం..చనిపోయినా వెళ్లలేదు!
తెలుగు చిత్ర పరిశ్రమలో ముగ్ధ మనోహర రూపంతో, ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, హీరోయిన్ కృష్ణకుమారి. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నటించి మెప్పించింది. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో ఆమె జతకట్టింది. 16ఏళ్ల వయసప్పుడే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణకుమారి నటించిన తొలి చిత్రం నవరత్నాలు. ఆ సినిమా విడుదల కాకముందే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమా మొదలుకొని “బంగారు పాప” వరకూ వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో కృష్ణకుమారిని “ఫ్లాపుల హీరోయిన్” అంటూ కొందరు ప్రచారం చేశారు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణకుమారి.. కావాలనే వేరే హీరోయిన్స్ కోసం అబద్దాలు ఆడి కొందరు ప్రొడ్యూసర్స్ తనను సినిమాల్లో తప్పించారని పేర్కొంది. ఇక అప్పట్లోనే ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'లక్షాధికారి' అనే సినిమాలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అలనాటి తార సావిత్రి గురించి చెబుతూ ఆమె ఏమన్నారంటే.. 'సావిత్రి జీవితం చివరిరోజుల్లో అలా అయ్యేసరికి చాలా కోపం వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఆవిడ. ఆమె ఇంటిలిజెన్స్ ఏమైంది? పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు ఉన్నాయని అలా దిగజారిపోకూడదు కదా? అందుకే ఆమె చనిపోతే చూడటానికి కూడా వెళ్లలేదు' అంటూ గతంలో ఆమె మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా అనారోగ్యంతో ఆమె 2018, జనవరి 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
మహానటి సావిత్రి.. చదువులమ్మ..
ఒంటి నిండా నగలు ధరించిన ఒక మహిళ ప్రధానమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలిసిన అనంతరం వీరజవాన్ల సంక్షేమ నిధికి ఏదైనా ఇద్దామని పర్సు వంక చూశారు. పర్సులో పెద్దమొత్తం నగదు ఉన్నా.. వారి త్యాగాలకు ఇవి సరిపోవనిపించింది. వెంటనే తన ఒంటిమీద నగలన్నింటిని వలిచి ఇచ్చేసి, ఇంటికి వచ్చేశారు. ఆమే మహానటి సావిత్రి.. నటనలో మేటిగా మహోన్నత శిఖరం అధిరోహించగా.. దాతృత్వంలోనూ తన సాటి ఎవరూరారని నిరూపించారు సావిత్రి. మహానటిగా దేశవ్యాప్తంగా పేరుప్రాఖ్యాతలు సంపాదించిన సావిత్రి రేపల్లె మండలంలో పాఠశాల ప్రారంభించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. రేపల్లె: మల్లెలు, వర్షమంటే మక్కువ.. ఎడమచేతివాటం.. క్రికెట్, చదరంగం ఆటలంటే మహాప్రీతి.. మాటల్లో చమత్కారం.. ఇతరులను అనుకరించటంలోనే దిట్ట.. ఇన్ని ఉన్నా దానధర్మాలు చేయటంలో ఆమెకు సాటిలేరు.. సాయం చేయటలో ఎముకలేని చెయ్యి అనటానికి నిదర్శనం. ఆమె మరెవరో కాదు వెండి తెర సామ్రాజ్ఞి, నడిగర్ తిలగమ్ మహానటి సావిత్రి. తీరంతో సావిత్రమ్మకున్న అనుబంధం... అమ్మ సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మలది గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని వడ్డివారిపాలెం గ్రామమే. దీంతో గ్రామంపై మమకారం పెంచుకున్న సావిత్రి తన పెద్దమ్మ దుర్గమ్మ కోరికతో పాఠశాల స్థాపించటం, గ్రామాన్ని పలుమార్లు పర్యటించడం ఆ గ్రామంపై ఆమెకున్న మమకారాన్ని తెలుపుతోంది. సావిత్రిని సావిత్రమ్మగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటే ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయేదని ఇక్కడి ప్రజలు అంటుంటారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సావిత్రి విగ్రహం గ్రామంలో పాఠశాల ఏర్పాటు కుగ్రామమైన వడ్డివారిపాలెంలో మహానటి సావిత్రి గ్రామీణులైన పేద విద్యార్థులకు విద్యను అందించాలని వారి అభ్యున్నతికై సంకల్పించుకుని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. పాఠశాల స్థాపించిన సమయంలో గ్రామస్తులే కాకుండా పాఠశాల ప్రారంభోత్సవానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఆ రోజుల్లోనే వేల సంఖ్యలో రావటం విశేషం. ప్రస్తుతం శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. విద్య, క్రీడ, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పలువురిని మన్ననలు పొందుతోంది. గత పదకొండు సంవత్సరాలుగా నూరుశాతం ఫలితాలు, పలు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందటం, పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటం విశేషం. వడ్డివారిపాలెంలోమహానటి సావిత్రి కట్టించిన పాఠశాల సావిత్రమ్మకు తోడుగా... పాఠశాలకు అండగా... పాఠశాల స్థాపన నాటి నుంచి సావిత్రమ్మ సంకల్పానికి గ్రామప్రజలు తోడుగా నిలిచారు. సావిత్రి స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలను నిర్మాణం చేసి ఆలనా పాలనా చూసేవారు. కొంత మంది గ్రామస్తులు వడ్డి మాధవరావు, వడ్డి పెద్ద వెంకటేశ్వరరావు, వడ్డి నరసింహారావు, వడ్డి సుబ్బారావు, కొల్లాల బసవయ్య, కోట నాగేశ్వరరావు, కొట్టి దేవేంద్రరావు, వడ్డి చినవెంకటేశ్వరరావులతో పాటు మరికొందరు పాఠశాల ఆలనా పాలనకై తమ పొలాన్ని పాఠశాలకు అందజేసి దీనిపై వచ్చే ఆదాయాన్ని పాఠశాలకు అవసరమైన వ్యయాలను భరించేవారు. దీంతో పాఠశాలకు కొంత వరకు వ్యయభారాలకు తగ్గాయి. తరు వాత ప్రభుత్వం పా ఠశాలను గుర్తించింది. అయితే ఒక సందర్భంగా ప్రభుత్వ గ్రాంటు రాకపోవటంతో ఆరు నెలలపాటు ఉపాధ్యాయులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సావిత్రి రూ.1,04,000లు అందజేసి పాఠశాలకు అండగా నిలిచారు. ఈ మొత్తం ప్రస్తుత విలువ ప్రకారం కోటి రూపాయల పైమాటే. సావిత్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కించిన మహానటి చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్ అశ్విన్‌లు సైతం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందజేశారు. ‘నాడు–నేడు’తో మరింత అభివృద్ధి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా వడ్డీవారిపాలెం సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నపాఠశాల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. నాడు–నేడులో భాగంగా రూ.42లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేశారు. నిధులతో తరగతి గదుల మరమ్మతులు, విద్యుద్ధీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు తదితర పనులు నిర్వహించగా వీటిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు. -
కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ, ఇంటి విశేషాలేంటో ఆమె మాటల్లో..
Bigg Boss Telugu 4 Fame Gangavva Shares Home Tour Moments: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఇటీవల కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయిన గంగవ్వ తన మాటలతో ఎంతో ప్రేక్షకుల ఆదరణను పొందింది. అనంతరం బిగ్ బాస్ 4వ సీజన్లో అడుగు పెట్టి.. యావత్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. చదవండి: మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్ వీడియోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జునతో తన చిరకాల స్వప్నం గురించి పంచుకున్న ఆమె నాగార్జున, స్టార్ మా సాయంతో సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. ఇటవల గృహప్రవేశం కూడా చేసిన గంగవ్వ ఈ క్రమంలో తన కొత్త ఇంటి గురించి, అందులోని గదుల ప్రత్యేకత గురించి వివరిస్తూ యూట్యూబ్ చానల్లో విడియో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్‌కు తండ్రి నుంచి విముక్తి ఈ సందర్భంగా గంగవ్వ తనకు ఇళ్లు కట్టిస్తానాని మాట ఇచ్చిన హీరో నాగార్జున్, బిగ్‌బాస్ టీం, స్టార్ మాకు ధన్యావాదాలు తెలిపింది. అలాగే గృహ ప్రవేశానికి కలగూర గంప టీంతో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అఖిల్ తన తల్లితో వచ్చాడని, అలాగే సావిత్రి కూడా వచ్చినట్లు చెప్పింది. అనంతంర కొత్త బిజీ కారణంగా రాలేకపోయారు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గంగవ్వ కొత్త ఇంటిని చూపిస్తూ మురిపోయింది. మరి తన ఇళ్లు ఎలా ఉంది, గంగవ్వ పంచుకున్న విశేషాలను మనం కూడా చూద్దాం రండి! చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం -
కలలు కల్లలు.. ఉద్యోగంలో చేరిన గంటల్లోనే...
నందిగామ: ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలి తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన వేముల మారుతీరావుకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన కాల్వ సావిత్రి (33)తో వివాహమైంది. వారు పరిటాలలోనే నివాసముంటున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో అసిస్టెంట్ లైన్ ఉమెన్‌గా సావిత్రికి ఉద్యోగం వచ్చింది. దీంతో భార్యాభర్తలిరువురు ఆనందంగా ద్విచక్ర వాహనంపై 14న బయలుదేరి వెళ్లి ఉద్యోగంలో చేరారు. అదే రోజు పరిటాలకు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున నందిగామ పట్టణ శివారుల్లో 65వ నంబరు జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. సావిత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలపాలైన మారుతీరావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి) -
హీరోయిన్గా... సావిత్రి ఆఖరి చిత్రం
‘ఆడపిల్లకు చదువెందుకు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా?’ ఇది పాత తరంలో తరచూ వినిపించిన మాట. కానీ, స్త్రీని చదివిస్తే, ఆ చదువు ఆమెకే కాదు... మొత్తం ఇంటికే వెలుగవుతుంది. విద్యావంతురాలైన స్త్రీమూర్తి సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆ సంగతిని 50 ఏళ్ళ క్రితమే తెరపై చెప్పిన చిత్రం ‘నిండు దంపతులు’. నేటి సుప్రసిద్ధ దర్శకుడు కె. విశ్వనాథ్ నిర్దేశకత్వంలో ఎన్టీఆర్, సావిత్రితో, బెజవాడ లక్ష్మీటాకీస్ ఓనర్లలో ఒక రైన మిద్దె జగన్నాథరావు యస్వీయస్ ఫిలిమ్స్‌పై తీసిన కుటుంబ కథాచిత్రమిది. వాణిజ్య జయాప జయాల కన్నా తెరపై చర్చించిన కీలక సామాజిక అంశం రీత్యా, సావిత్రి హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రంగా ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకత ఉంది. యాభై ఏళ్ళ క్రితం 1971 ఫిబ్రవరి 4న ఆ ఘట్టానికి తెర తీసిన ‘నిండు...’ జ్ఞాపకాలివి. కొన్ని కథలు, కాంబినేషన్లు విశేషం. ఆడవాళ్ళకు చదువెందుకనుకొనే రోజుల్లో స్త్రీ విద్య చుట్టూ తిరిగే ఓ కథను తెరపై చెప్పగలమా? మాస్ హీరో ఎన్టీఆర్, సంసారపక్షమైన సినిమాల దిగ్దర్శకుడు కె. విశ్వనాథ్ – ఈ ఇద్దరి కాంబినేషన్ ఊహించగలమా? కానీ, వారిద్దరి కలయికలో ఏకంగా 4 సినిమాలు వచ్చాయి. అందులో ‘నిండు దంపతులు’ ఆడవారి చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని వెండితెరపై చెప్పింది. అప్పట్లోనే... ఆడవారి చదువు కథగా... కిళ్ళీకొట్టు నడుపుతున్నా, స్త్రీకి చదువు కావాలనుకొనే సంస్కారం ఉన్న హీరో (ఎన్టీఆర్)... ఎంత చదువుకున్నా పెళ్ళయ్యాక ఆడది ఆ ఇంటి పరువు కాపాడే కోడలనే లాయర్ హీరోయిన్ (సావిత్రి)... స్త్రీకి ఆర్థికస్వేచ్ఛ ఉండాలంటూ బి.ఏ చదువుకే గొప్పలు పోయే హీరో మేనకోడలు (లక్ష్మి)... కాపురం చేయాల్సిన ఆడదానికి చదువెం దుకనుకొనే హీరోయిన్ చెల్లె లైన టీ కొట్టు సుబ్బులు (విజయనిర్మల) – ఈ 4 పాత్రల మధ్య కథ ‘నిండు దంపతులు’. హీరో, ఏ దిక్కూ లేని మేనత్త కూతురు వాణి (లక్ష్మి)ని బి.ఏ దాకా చదివిస్తాడు. ఆమెను పెళ్ళాడాలనుకుంటాడు. కానీ ఆమె ఓ పెద్దింటి అబ్బాయిని (చంద్రమోహన్)ని పెళ్ళి చేసుకుంటుంది. లా చదివిన హీరోయిన్, చదువు లేని హీరోను పెళ్ళాడాల్సి వస్తుంది. వాణి చిక్కుల్లో పడినప్పుడు హీరోయిన్ సావిత్రి నల్లకోటు వేసుకొని, కోర్టులో వాదించి ఆమె జీవితాన్ని చక్కదిద్దుతుంది. నాయికగా సావిత్రి ఆఖరి సినిమా! ‘మహానటి’ చిత్రం ద్వారా ఈ తరానికీ సుపరిచితమైన శిఖరాగ్ర స్థాయి సినీ నాయిక సావిత్రి. ఆమె తన కెరీర్లో కథానాయికగా చేసిన చివరి చిత్రంగానూ ‘నిండు దంపతులు’ గుర్తుంటుంది. ఆ సినిమా తర్వాత మరణించే వరకు ఆ మహానటి చేసిన పాత్రలన్నీ తల్లి, వదిన లాంటి సహాయ పాత్రలే! 1966లో షూటింగ్ మొదలైన ఏయన్నార్ ‘ప్రాణమిత్రులు’లో ఏయన్నార్ సరసన సావిత్రి హీరోయిన్. తర్వాత మళ్ళీ ఏయన్నార్ సరసన నాయిక పాత్ర పోషించే అవకాశం సావిత్రికి రాలేదు. అయితే, ఆ తర్వాత ‘నిండు దంపతులు’ దాకా అయిదేళ్ళ పాటు ఎన్టీఆర్ పక్క ఆమె నాయికగా చేశారు. ఎన్టీఆర్ ‘పల్లెటూరు’ (1952)తో హీరోయిన్గా మొదలైన సావిత్రి, కథానాయికగా ఆఖరి చిత్రంలో కూడా ఆయన సరసనే నటించడం యాదృచ్ఛికం. అలా 1952 నుంచి 1971దాకా 20 క్యాలెండర్ ఇయర్స్ పాటు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ తెరపై వెలిగింది. కాంగ్రెస్ కార్యక్రమాల... బెజవాడ లక్ష్మీటాకీస్ బెజవాడలోని పేరున్న పాతకాలపు థియేటర్లలో ‘శ్రీలక్ష్మీటాకీస్’ ఒకటి. తెలుగు సినీ రాజధాని బెజ వాడలో మారుతీ,దుర్గాకళామందిరం తర్వాత వచ్చిన 3వ సినిమా హాలు ఇది. 1939లో మొదలైన ఆ హాలు గౌడ కులస్థులైన మిద్దె రామకృష్ణారావు, జగన్నాథరావు సోదరులది. అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ వాదులు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కార్యక్రమాలు ఈ సినిమా హాలులో జరిగేవి. రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువున్న రామకృష్ణారావు స్వాతంత్య్రం వచ్చాకా కాంగ్రెస్‌లో తిరిగారు. (నిర్మాత జగన్నాథరావు, 1977 చివర్లో రామకృష్ణారావు పోయాక, ఆ హాలు 1992లో చేతులు మారింది. ఇప్పటి స్వర్ణ ప్యాలెస్‌గా 1995లో ముత్తవరపు వెంకటేశ్వరరావు చేత రూపుమార్చుకుంది. రామకృష్ణారావు 3వ కుమారుడు మురళీకృష్ణ మాత్రం 1996 నుంచి కృష్ణాజిల్లా చీమలపాడులో ‘శ్రీలక్ష్మీ టాకీస్’ పేరుతో ఓ థియేటర్ నడుపుతున్నారు. అదే బెజవాడ పాత లక్ష్మీటాకీస్కు మిగిలిన కొత్త తీపిగుర్తు). దర్శకుడే దైవమన్న ఎన్టీఆర్! ‘నిండు దంపతులు’ సమయానికి హీరోయిన్గా సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్న రోజులు. అప్పటికే జమున, కాంచన, వాణిశ్రీ లాంటి వారున్నా, నిర్మాత జగన్నాథరావు తమ సొంత ఊరు బెజవాడ తార అనే అభిమానంతో అభినేత్రి సావిత్రినే నాయిక లాయర్ పాత్రకు తీసుకుందామన్నారు. వైవాహిక జీవితంలోని చీకాకులతో అప్పటికే ఆమె సతమతమవుతున్నారు. ఆమె వ్యక్తిగత అలవాట్లు వృత్తి జీవితపు క్రమశిక్షణపై ప్రభావం చూపడం మొదలుపెట్టిన సమయమది. ‘‘ఒకప్పుడు పెద్ద పెద్ద డైలాగులే అలవోకగా చెప్పిన మహానటి సావిత్రికి దురదృష్టవశాత్తూ షూటింగులో డైలాగులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ‘పెద్ద డైరెక్టర్ చెబుతున్నారమ్మా... వినాలి’ అంటూ సావిత్రికి ఎన్టీఆర్ మెత్తగా చెప్పాల్సి వచ్చింది. సినిమా రూపకల్పనలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లకు స్టార్లు ఇవ్వాల్సిన సహకారం గురించి సావిత్రికి ఆయన చెప్పడం నాకిప్పటికీ గుర్తు’’ అని విశ్వనాథ్ అన్నారు. సినీ నిర్మాణంలో తండ్రికి వారసులుగా... బ్లాక్ అండ్ వైట్ ‘నిండు దంపతులు’ అప్పట్లో 35 ప్రింట్లతో విడుదలైంది. పాజిటివ్ రివ్యూలొచ్చినా, అప్పుడప్పుడే తెలుగులో మొదలవుతున్న కలర్సిన్మాల హవాలో కమర్షియల్‌గా ఈ సినిమా వెనుకబడింది. 50 రోజులే ఆడింది. రెండేళ్ళకే జగన్నాథరావు కన్ను మూశారు. ఆపైన ఆయన నలుగురు కుమారులు (చంద్రకుమార్, విజయకుమార్, జీవన్ కుమార్, వెంకట రమణ కుమార్) తండ్రి బాటలో సాగారు. దాసరితో ‘జీవితమే ఒక నాటకం’ (’77), విజయ నిర్మల డైరెక్షన్లో హీరో కృష్ణతో ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’, ‘శంఖుతీర్థం’ (’79), సోదర సంస్థ పి.వి.ఎస్. (పద్మావతీ వెంకటేశ్వర స్వామి) ఫిలిమ్స్ బ్యానర్ పై కొమ్మినేని శేషగిరిరావుతో ‘కొంటె కోడళ్ళు’ (’83), రేలంగి నరసింహారావు సారథ్యంలో ‘కొంటె కాపురం’ (’86), ‘కాబోయే అల్లుడు’ (’87) తీశారు. మలయాళంలో, కన్నడంలో రెండేసి సినిమాలూ నిర్మించారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల రీత్యా యస్.వి.యస్ సంస్థ చిత్ర నిర్మాణం నుంచి విరమించుకుంది. అయితే ఇప్పటికీ సినీ ప్రియులకు ఆ సంస్థ, అది తీసిన సినిమాలు చెదరని జ్ఞాపకాలే! నాలుగు సినిమాల... ఆ కాంబినేషన్ దర్శకుడు కె. విశ్వనాథ్, ఎన్టీఆర్ ఎన్టీఆర్, కె. విశ్వనాథ్‌ల కాంబినేషన్ ఓ విచిత్రం. ‘అన్నపూర్ణా’ సంస్థలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తితో కలసి పనిచేసిన విశ్వనాథ్ నిజానికి అక్కినేనికి సన్నిహితులు. దర్శకుడిగా విశ్వనాథ్ తొలి చిత్రం కూడా ఏయన్నార్ హీరోగా అన్నపూర్ణా వారు తీసిన ‘ఆత్మగౌరవం’ (1966). తర్వాత దాదాపు పాతికేళ్ళకు ఆయన మళ్ళీ ఏయన్నార్‌తో చేసింది ‘సూత్రధారులు’ (1989). కారణాలు ఏమైనా, ఆ రెండే తప్ప ఏయన్నార్‌తో విశ్వనాథ్ మరే సినిమా చేయలేదు. కానీ, ఏయన్నార్‌కు ప్రత్యర్థి అయిన మరో టాప్ హీరో ఎన్టీఆర్‌తో కె. విశ్వనాథ్ ఏకంగా 4 సినిమాలు చేయడం విచిత్రం. గమ్మత్తేమిటంటే, ఆ కాంబినేషన్‌ను కుదిర్చినదీ, మొత్తం నాలుగింటిలో మూడు సినిమాలను నిర్మించిందీ ఒక్కరే – యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు. ‘‘గుంటూరులో ఒకే కాలేజీలో చదివే రోజుల నుంచి ఎన్టీఆర్ గారితో నాకు పరిచయం ఉంది. నా సౌండ్ రికార్డిస్ట్ రోజుల నుంచి స్నేహం ఉంది. దర్శ కుడిగా నన్ను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్ళింది బెజ వాడ లక్ష్మీ టాకీస్ ఓనర్లయిన యస్.వి.యస్. ఫిలిమ్స్ వారే’’ అన్నారు విశ్వనాథ్. అప్పటి నుంచి ఆ సంస్థలో, విశ్వ నాథ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో ‘కలిసొచ్చిన అదృష్టం’ (1968 ఆగస్టు 10), ‘నిండు హృదయాలు’ (1969 ఆగస్టు 15), ‘నిండు దంపతులు’ (1971 ఫిబ్రవరి 4) వచ్చాయి. నిర్మాత– యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు (1919 – 1973) శత జయంతి కూడా ఆ మధ్యనే జరిగింది. ఇవాళ్టికీ ఆయన పేరు చెప్పగానే ఆ రోజుల్లోని వారందరికీ బెజ వాడ ‘శ్రీలక్ష్మీ టాకీస్’ ఓనర్లలో ఒకరిగానే సుపరిచితులు. ఆ సినిమాలన్నీ... ఆయనతోనే! ఎన్టీఆర్‌తో నిర్మాత మిద్దె జగన్నాథరావు స్వాతంత్య్రం వచ్చాక... సినీప్రదర్శన నుంచి సినీ నిర్మాణం వైపు కూడా మిద్దె సోదరులు విస్తరించారు. హీరో ఎన్టీఆర్‌ది బెజవాడ దగ్గరి నిమ్మకూరు కావడంతో, ఆ పరిచయం, అనుబంధంతో నిర్మాతలుగా మారారు. తొలిప్రయత్నంగా జలరుహా ప్రొడక్షన్స్ పతాకంపై ఆ అన్నదమ్ములు కలసి తీసిన చిత్రం ‘రాజనందిని’ (1958). మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలో, వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఆ జానపద చిత్రంలో హీరో ఎన్టీఆరే. ఆ తరువాత దాదాపు పదేళ్ళకు తమ్ముడు మిద్దె జగన్నాథరావు సొంతంగా యస్.వి.యస్. ఫిలిమ్స్ స్థాపించి, ఆ బ్యానర్ లో విడిగా సినిమాలు నిర్మించారు. జగన్నాథరావు తమ ఆరాధ్యదైవం పేరు మీద ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఫిలిమ్స్ అంటూ సంస్థను పెట్టాలనుకున్నారు. ఎన్టీఆర్ తన ఆఫీసులో కాగితాల ప్యాడ్ మీద గుండ్రటి చేతిరాతతో, అందంగా ఆ బ్యానర్ పేరును తెలుగులో రాసిచ్చారు. అలా ‘యస్.వి.యస్’ ఫిలిమ్స్ ఎన్టీఆర్ చేతుల్లో ప్రాణం పోసుకుంది. విశేషం ఏమిటంటే, నిర్మాత జగన్నాథరావు 54వ ఏట ఆకస్మికంగా మరణించే వరకు ఆ బ్యానర్ లో కేవలం ఎన్టీఆర్ హీరోగానే సినిమాలు తీశారు. అలా ఆ బ్యానర్లో 5 సినిమాలు (ఎస్.డి.లాల్ దర్శకత్వంలోని ‘నిండు మనసులు’, విశ్వనాథ్ తీసిన మూడు సినిమాలు, డి.యోగానంద్ దర్శకత్వంలోని ‘డబ్బుకు లోకం దాసోహం’) వచ్చాయి. ‘డబ్బుకు లోకం దాసోహం’ రిలీజు టైములో లావాదేవీలు చూసుకోవడానికి కీలకమైన హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు నిర్మాత జగన్నాథరావు. ఎప్పుడూ అలవాటైన లక్డీకాపూల్ ద్వారకా హోటల్ రూమ్ నెంబర్ 101లోనే బస చేశారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్ళినా లాభం లేక, 1973 జనవరి 22న కన్నుమూశారు. అలా యస్.వి.యస్. ఫిలిమ్స్ – ఎన్టీఆర్‌ల కాంబినే షన్‌కు ఊహించని బ్రేక్ పడింది. చిరంజీవి సినిమాకు మూలం! చదువుకూ సంస్కారానికీ సంబంధం లేదనీ, సంస్కారానికి చదువు తోడైతే శోభిస్తుందనీ, స్త్రీకి చదువొస్తే సంసారం నిండుగా ఉంటుం దనీ హీరో, హీరోయిన్ పాత్రల ద్వారా చెబు తుంది– ‘నిండు దంపతులు’. సముద్రాల జూనియర్ డైలాగ్స్ పలు సామాజిక సమస్యలను చర్చిస్తాయి. చదువు లేని హీరో, మేనత్త కూతుర్ని చదివించి పెళ్ళి చేసుకోవాలనుకొని, నిరాశ పడే భాగం చూస్తే తర్వాతెప్పటికో వచ్చిన కె. విశ్వనాథ్ ‘స్వయంకృషి’ (1987) గుర్తుకొస్తు్తంది. ఇక్కడి ఎన్టీఆర్, లక్ష్మి – అక్కడి చిరంజీవి, అతను చదివించే సుమలత పాత్రలు అయ్యాయనిపిస్తుంది. ‘‘స్త్రీ విద్య ప్రధానాంశంగా ‘నిండు దంపతులు’ కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నా. అప్పటికి అది రివల్యూషనరీ థాట్. కానీ, సినిమా అనుకున్నంత ఆడలేదు. అందుకని హీరో, తన మనసుకు దగ్గరైన అమ్మాయిని చదివించడం అనే అంశం ‘స్వయంకృషి’లో మళ్ళీ వాడాం. అయితే, ‘స్వయంకృషి’ కథ, ట్రీట్మెంట్ పూర్తిగా వేరు’’ అని విశ్వనాథ్ ‘సాక్షి’కి వివరించారు. హీరో పాత్రకు కిళ్ళీ కొట్టు స్ఫూర్తి... ‘నిండు దంపతులు’లో ఎన్టీఆర్ వేసిన కిళ్ళీకొట్టు రాములు పాత్రకు ఓ నిజజీవిత పాత్ర ఓ రకంగా స్ఫూర్తి. అప్పట్లో బెజవాడలో శ్రీలక్ష్మీ టాకీస్ ఎదురు సందులో ‘రాములు కిళ్ళీ షాపు’ చాలా ఫేమస్. అక్కడ రాములు కట్టే రకరకాల, రుచికరమైన కిళ్ళీల కోసం అప్పట్లో జనం క్యూలు కట్టేవారు. ‘‘సినిమాలో హీరో పాత్ర కూడా రకరకాల కిళ్ళీలు కడుతుంది. షూటింగ్లో కిళ్ళీ తయారీ దృశ్యాల కోసం బెజవాడలోని ఆ షాపు నుంచి ప్రత్యేకంగా కిళ్ళీ కట్టే వ్యక్తిని తెప్పించాం’’ అని నిర్మాత జగన్నాథరావు పెద్దబ్బాయి చంద్రకుమార్ (చిన్ని) తెలిపారు. అరుదైన రికార్డ్ ఆ జంట సొంతం! ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్లో తెరపై బహుముఖ పార్శా్వలు కనిపిస్తాయి. ప్రేయసీ ప్రియులు (కార్తవరాయని కథ, ఇంటిగుట్టు వగైరా) మొదలు భార్యాభర్తలుగా (గుండమ్మ కథ), అన్యోన్య దంపతులుగా (విచిత్ర కుటుంబం), అన్నా చెల్లెళ్ళుగా (రక్త సంబంధం), బాబాయి – కూతురుగా (మాయాబజార్), వదిన – మరుదులుగా (కోడలు దిద్దిన కాపురం), అక్కా తమ్ముళ్ళుగా (వరకట్నం), ప్రతినాయిక – నాయకులుగా (చంద్రహారం), కథను నడిపించే వేశ్య– యాంటీ హీరోగా (కన్యాశుల్కం), కథ ప్రకారం తల్లీ కొడుకులుగా (సర్కస్ రాముడు) ... ఇలా ఒకదానికొకటి పూర్తి విభిన్నమైన బంధాలను వారిద్దరి జంట వెండి తెరపై అవలీలగా ఒప్పించింది. జనాన్నీ మెప్పించింది. ఒక టాప్ హీరో, టాప్ హీరోయిన్ కలసి జంటగా ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం సినిమా చరిత్రలో మరెక్కడా కనపడని విషయం. - రెంటాల జయదేవ -
తారలు తరించిన కూడలి
సినీతారలు దర్శనమిచ్చినప్పుడు అభిమానులు ఎలా తరించి పోతారో.. నవరాత్రులకు రాజమండ్రి దేవీచౌక్‌లోని అమ్మవారిని దర్శించుకున్నప్పుడు సినీతారలు అలా తరించిపోయేవారట! అంతటి వైభవం ఉన్న ఆ వేడుకలకు ఇప్పటికీ స్థాయి,‘తార’స్థాయీ తగ్గలేదు. దసరా నవరాత్రులు వస్తున్నాయంటే రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న దేవీచౌక్ మిలమిలలాడే నక్షత్ర కాంతులతో తళతళలాడుతుంటుంది. భక్తులు ధరించే ఎర్రని వస్త్రాలతో ఆ ఆరుబయలు ప్రాంగణమంతా అరుణవర్ణ శోభితం అవుతుంది. నుదుటన ధరించిన కుంకుమ ప్రతి భక్తుని ముఖాన సూర్యుడు ఉదయించిన భావనను కలిగిస్తుంది. తొమ్మిది రోజుల పాటు సాగే అమ్మవారి ఉత్సవాలకు రాజమహేంద్రవరం మణిద్వీపంలా భాసిస్తుంది. ఎనభై ఐదేళ్ల వైభవం! కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాలకు, కలకత్తా కాళీమాత ఆరాధనలకు దీటుగా నిలుస్తుంది గోదావరీ తీరాన దేవీచౌక్ వేడుక. ఈ నాలుగు రోడ్ల కూడలిలో చిన్న దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారిని దసరా ఉత్సవాల సమయంలో వేలమంది దర్శించుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 నుంచి (నేటి నుంచి) దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.గోదావరి సాంస్కృతిక వైభవానికి, కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరం ఖ్యాతికి ఈ వేడుకలు ఆనవాలుగా నిలుస్తాయి. తెల్లవారే వరకు పౌరాణిక నాటకాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. నాడు మూడు లాంతర్ల సెంటర్ ఏళ్ల క్రితం దేవీచౌక్‌ను మూడు లాంతర్ల సెంటరు అని పిలిచేవారు. కరెంటు లేని రోజుల్లో వీధి దీపాలుగా ఈ సెంటరులో గుత్తిగా ఉండే మూడు లాంతర్లలో కిరోసిన్ పోసి దీపాలు వెలిగించేవారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని అలా పిలిచేవారు. ఆ రోజుల్లో మొట్టమొదటగా దసరా ఉత్సవాలను 200 రూపాయలతో ప్రారంభించారు. 1934లో రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల మల్లికార్జునరావు, మునెయ్య సోదరులు ఉత్సవాల రూపురేఖలను మార్చి వేశారు. ఎలక్ట్రిక్ లైట్లు వచ్చాయి. 1963లో కలకత్తా నుంచి పాలరాతితో రూపొందిన బాలాత్రిపురసుందరి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి మూడు లాంతర్ల జంక్షన్ దేవీచౌక్‌గా మారిపోయింది. దసరా తొమ్మిది రోజులూ ఇక్కడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా కుంకుమపూజలు జరుగుతాయి. ఆ తరువాత ప్రారంభమయ్యే పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాల ప్రదర్శనలతో తెల్లవారిపోతుంది. ఒక దశలో మూడు వేదికలను ఏర్పాటు చేసి, ఒక వేదికపై నాటకాలు, రెండో వేదికపై హరికథలు, బుర్రకథలు, మరో వేదిక మీద భోగంమేళం సాగేవని ఆ తరానికి చెందిన పెద్దలు ఎంతో సంతోషంగా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం ఒకే వేదికపై నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. – వారణాసి సుబ్రహ్మణ్యం, సాక్షి రాజమహేంద్రవరం కల్చరల్ ఫొటోలు : గరగ ప్రసాద్ ఒక్క ఛాన్స్ వస్తే చాలు రాజమండ్రి దేవీ చౌక్‌లో జరిగే దసరా ఉత్సవాలలో కనీసం ఒక్కసారైనా వేషం వేయగలిగితే చాలునని పెద్ద పెద్ద కళాకారులే ఉవ్విళ్లూరేవారు. సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, ఎస్వీ రంగారావు, గుమ్మడి, జి.వరలక్ష్మి, గిరిజ వంటి ఎందరో నటులను ఈ వేదిక మీద సత్కరించారు. దినారాయణరావు–అంజలీదేవి, రాజసులోచన–సి.ఎస్.రావు, సావిత్రి–జెమినీగణేశ్లను కూడా ఇక్కడ సత్కరించారు. 1969 దసరా ఉత్సవాలలో నాటి మేటినటి రాజసులోచన దేవీచౌక్ వేదికపై నాట్యం చేస్తూ పడిపోవడంతో ఆమె కాలి ఎముక విరిగింది. ఆరోగ్యం కుదుటపడ్డాక, ఆమె తిరిగి ఇక్కడకు వచ్చి, మళ్లీ నాట్యం చేశారు. దేవీచౌక్ ఉత్సవాలను కళాకారులు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవారో ఈ సంఘటన చెబుతుంది. నేటి అర్ధరాత్రి శ్రీకారం ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి 12.06 గంటలకు వేదికపై అమ్మవారిని ప్రతిష్ఠించడంతో 86వ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం జరుగుతుంది. గత వైభవ దీప్తులకు పరంపరగా ఈ ఉత్సవాలు గోదావరి చరిత్రలో నిలిచిపోనున్నాయి. -
ఈ రెండు కోరికలు తక్క!
బీయే సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణంరాజు...నటించిన ఒక పౌరాణిక సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... భార్య చేతుల్లో ఉన్నాడు భర్త. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.‘‘నేను ఉండగా నీకే గండం రానివ్వను’’ భర్తకు ధైర్యం చెబుతుంది సావిత్రి.ఇంతలో దిక్కులు పిక్కటిల్లేలా నవ్వు.‘‘ఎవరునువ్వు?’’ రెట్టించి అడిగింది ఆమె.‘‘మృత్యువును’’ అని సమాధానం వచ్చింది.‘‘మృత్యువా? ధర్మరాజా అభివందనం. నీ దివ్యసందర్శనం ప్రసాదించు’’ అని వేడుకుంది సావిత్రి.అదిగో ఆయన దివ్యమంగళరూపం!‘‘ధన్యోస్మి ప్రభూ! ధర్మప్రభూ నీ కర్తవ్య నిర్వాహణకు వచ్చావా?’’ అని అడిగింది సావిత్రి.‘‘అవును తల్లీ’’ అన్నాడు యమధర్మరాజు.‘‘నా పతిప్రాణాలు తీసుకొనిపోక తప్పదా?’’ అని అడిగింది దీనంగా.‘‘తప్పదమ్మా. కాని నవ్వు మహాప్రతివతవు’’ అన్నాడు ఆయన చల్లగా! నీ ఒడిలో ఉన్నంత వరకు నీ పతి ప్రాణాలను తీసుకోలేను. అతనిని భూశయనం చేయించు’’ అన్నాడు యమధర్మరాజు.ఈమాటతో ఆమెలో ఒకింత ఆగ్రహం తొంగి చూసింది...‘‘ధర్మపాలన నీకే కాదు నాకూ ఉన్నది. పతిప్రాణాలను మృత్యువుకు అర్పించుట సతికి ధర్మమా?’’ అని ఆవేశంగా అడిగింది.‘‘ఇందులో మీరు అర్పించినది ఏమియును లేదు. నీ భర్త ఆయుఃకాలం తీరింది. మృత్యువు ఆవశ్యం. అనివార్యం!’’ గట్టిగా అన్నాడు ధర్మరాజు.‘‘అనివార్యమైనప్పుడు నేను భూశయనం చేయించవలసిన అవసరంఏమిటి?’’ అన్నది ఆమె.‘‘నన్ను పరీక్షిస్తున్నావా?’’ గొంతు పెద్దది చేశాడు యమధర్మరాజు.‘‘నా సతీధర్మాన్ని పాటిస్తున్నాను’’ అన్నది ఆమె.‘‘దాహం...దాహం...’’ అంటున్నాడు ఆమె భర్త.‘‘తెస్తాను ప్రభూ’’ అంటూ నీళ్ల కోసం వెళ్లింది సావిత్రి.ఇదే అదునుగా అతడిలోని ప్రాణజ్యోతిని మృత్యుదండంతో లాగాడు యముడు.సావిత్రి వచ్చే సరికి భర్త చనిపోయి ఉన్నాడు. ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.ప్రభూ! నన్ను విడిచి వెళ్లిపోయావా? నా పసుపు కుంకుమలను తుడిచి వెళ్లిపోయావా? నా తపస్సు వృథా చేసి వెళ్లిపోయావా? మీరు కట్టిన మాంగల్యాన్ని తెంచివేసి వెళ్లిపోయావా?....యమధర్మరాజు అక్కడినుంచి మాయమయ్యాడు. అతడిని అనుసరిస్తూ ఆకాశమార్గంలోకి వెళ్లింది సావిత్రి.‘ఈ శూన్యం కంటే శూన్యమా నీ హృదయం?నా ధైన్యం కన్నా ఘనమా నీ ధర్మం?’ అని యమధర్మరాజుని ప్రశ్నించింది.‘‘తండ్రీ! నీ బిడ్డ వంటి దానను. నాతో పంతమా. వద్దు తండ్రీ వద్దు! నన్ను కరుణించు. నా పతిని నాకు ప్రసాదించు’’ అని వేడుకుంది.‘‘సావిత్రీ...ఎంత చెప్పినను నీ మొండిపట్టుదల విడువలేకున్నావు. దేవర్షి నిన్ను నాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధురాలిని చేసి పంపినట్టున్నాడు. ఆ ధైర్యంతోనే నన్ను అనుసరిస్తున్నావు. ఏమైనా నీ కోరిక నెరవేరదు. మరలిపో’’ అని మాయమయ్యాడు యమధర్మరాజు. ‘‘ధర్మరాజా! నువ్వు అదృశ్యం కాగలవు కాని అసాధ్యుడవు మాత్రం కాదు. అమృత హృదయుడవు. దయాధర్మ గుణశీలుడవు. నిన్ను నేను విడవను’’ అంటూ యముడిని అనుసరించింది సావిత్రి. ‘‘నిష్ఠుర కాల నియమ నిష్ఠా గరిష్ఠ. ప్రకృతి ధర్మ పరిరక్షణా దక్ష...సకల జీవరాశీ జీవనదాత...అనంత తేజోరాశీభూత....నమోవాకములు...నమోవాకములు’’ అని ప్రార్థించాడు యమదర్మరాజు.‘‘కుమరా, ఏమిటి విశేషం?’’ అడిగాడు సూర్యుడు.‘‘విశేషం కాదు తండ్రీ వైపరీత్యం! మృత్యువును జయించి మృతుడైన తన భర్తను బతికించుకోవాలనే సంకల్పంతో అతిలోకశక్తిని సాధించి ఒక సామాన్య మానవాంగన సావిత్రి నన్ను వెంటాడి వచ్చుచున్నది. చండప్రచండ మార్తాండ రూపం ధరించి మీరే ఆమె గమనమును అవరోధించవలెను. ధర్మమును కాపాడవలెను’’ అని వేడుకున్నాడు యముడు.‘‘కుమరా! కాలచక్ర క్రమబద్ధుడనైన నాకు అది కర్తవ్యం’’ అని అభయమిచ్చాడు సూర్యభగవానుడు.‘‘ఉజ్వల ఉగ్రరూపాయ దినకర! శుభకర! ధన్మోస్మి’’ అని ఆ భగవానుడిని ప్రార్థిస్తూనే ‘‘ధర్మరాజా! ఆగు ఆగు’’ అంటూ యముడి వెంట వెళ్లింది సావిత్రి.తన వెనకనే వస్తున్న సావిత్రిని చూసి....‘‘ఏమి ఈ సాహసము! సావిత్రి...ఇది రెక్కలకు అందని రిక్కల కూటమి. కోటి సూర్యప్రభాతమైన ఈ ప్రదేశమునకునీవు రాలేవు. ఆ నక్షత్ర కాంతిని భరించే శక్తి మర్త్యులకు లేదు. వెళ్లు...వెనుతిరిగి వెళ్లు’’ ఆదేశించాడు యముడు.‘‘దేవా! నీ దివ్యతేజస్సును వీక్షించిన నా కనులకు ఈ చుక్కలు ఒక లెక్కా!’’ అన్నది సావిత్రి. అంతేకాదు...‘‘నక్షత్రమండలాన్ని అధిష్టించిన తేజోమూర్తులారా, గ్రహములారా, పతి ప్రాణాల కోసం పయనించి వచ్చిన నన్ను అడ్డగించకండి. నా ఆర్తి బాపండి. నాపై జాలి చూపరా, నా సంకల్పబలం వమ్ము కావల్సిందేనా’’ అన్నది.ఆ సమయంలోనే అరుంధతి ప్రత్యక్షమై...‘‘సావిత్రి! సత్యసంకల్పానికి ఎప్పుడూ విఘాతం కలగదమ్మా. తల్లీ! ఏకాగ్రతను మించిన తపస్సు, ఆత్మశక్తిని మించిన శక్తి లేదమ్మా’’ అని ధైర్యం చెప్పింది.‘‘తేజోమూర్తులారా! ఖగోళాల్లారా! క్షణకాలం పాటు మీ పరిభ్రమణ ఆపండి. సావిత్రికి దారి ఇవ్వండి’’ అని సావిత్రికి ఆటంకం లేకుండా చేసింది. ‘‘ఏది ఏమైననూ కోరరాని కోరికలే కోరుతున్నావు. నీ భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వడం ఎంత అసంభవమో, నీ ప్రాణములు తీసుకుపోవుట అంతే అసంభవం. ఈ రెండు కోరికలు తక్క... మరేమన్నా కోరుకో ఇస్తాను’’ అన్నాడు యమధర్మరాజు.‘‘సతికి పతి కన్నా విలువైనది ఏమున్నది?’’ అన్నది ఆమె.‘‘అయితే మీ అత్తమామలకు దృష్టి ఇస్తా...’’ ‘‘మీ అత్తమామలు కోల్పోయిన రాజ్యసంపదలను తిరిగి ఇస్తా....’’ ఇలా వరాల చిట్టా విప్పుతున్నాడు యమధర్మరాజు.సావిత్రి మాత్రం ఈ వరాలను కాదంది.భర్త ప్రాణాలు మాత్రమే కావాలంది.‘‘ఇవ్వదలచినవి కాదంటావు– ఇవ్వకూడనిది కావాలంటావు. ఏమి నీ మూర్ఖత్వం’’ అని విసుక్కున్నాడు యమధర్మరాజు.‘‘సమవర్తి! ధర్మమార్గాన్ని నమ్ముకున్న నాకు ధర్మమే దారి చూపుతుంది’’ అన్నది సావిత్రి.ఆ మాటల్లో తాను గెలుస్తాననే నమ్మకం ప్రతిధ్వనిస్తుంది. -
ప్రేమ మీటర్
వెండి తెర ప్రేమను వెలిగించిన పాటలు మేము కొన్ని అనుకున్నాం... మీకు ఇంకేవేవో గుర్తుకురావచ్చు... హ్యాపీ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) డ్రామా లేని ప్రేమ పండిన దాఖలాలు లేవు. అడ్డంకులు, అవరోధాలు లేకుండా సాఫీగా ఉన్న ప్రేమ గొప్ప ప్రేమగా జ్ఞాపకాల్లో నిలువలేదు. ప్రేమ పొందేది కాదు. సాధించుకునేది. గెలుచుకునేది.నిలబెట్టుకునేది. అందులో పడ్డవాళ్లను చెడ్డవాళ్లని లోకం అనుకున్నా లెక్క చేయరు. పగవాళ్లని దూరం పెట్టినా పట్టించుకోరు. అబ్బాయి అమ్మాయి కోసం ఎదురు చూస్తుంది. అమ్మాయి కోసం అబ్బాయి కోట గోడల్ని అయినా లతలు పట్టుకొని పాకి సాహసంగా లోపలికి లంఘిస్తాడు. రాకుమారి స్వయంవరం ప్రకటించి వచ్చిన వందమందిలో ఒకరిని ఎంచుకుంటే ఏం చోద్యం ఉంది? అదే తోటలో పని చేసే ఒక కూలివాణ్ణి కోరుకుంటే అసలైన కథ ఉంది. ‘పాతాళ భైరవి’లో రాకుమారి అలా ఒక తోట రాముణ్ణి ప్రేమించి తెలుగునాట వెండి తెర మీద ప్రేమకు గట్టిగా తెర తీసింది. ‘నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది’ అని ఆమె చందురుణ్ణి చూసి పాడుతుంటే ఆ పదం విని తోటలో రాముడు ‘కలవరమాయే మదిలో నా మదిలో’ అని అరచేతిని ఛాతీకి రుద్దుకుంటాడు. ఆ కలవరం తీర్చుకోవడానికి అతడు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడడు. మాంత్రికుడి వలలో పడటానికి సందేహించడు. ‘ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు’ అని ప్రేక్షకులు జాలి పడేలా చేసుకోగలిగాడు. ఏమైనా ఈ ప్రేమ సుఖాంతమైంది. ఆ పాతాళభైరవి తల్లి వల్ల పది కాలాలు నిలిచింది. అయితే ప్రేమలో ఉన్నట్టుగా ప్రేమికులకు తెలియకపోవడం కూడా ఒక తియ్యటి విషయమే. ‘మిస్సమ్మ’లో టీచరమ్మ సావిత్రి, పంతులు ఎన్.టి.ఆర్ ఒకే ఇంట్లో భార్యభర్తలుగా దొంగనాటకం ఆడుతూ కాపురం పెడతారు. నిజానికి వారు దొంగ భార్యభర్తలే కాని నిజం ప్రేమికులు. ఆ సంగతి వారికి తెలియదు. అర్థం చేసుకోరు. ఒకరికొకరు చెప్పుకోరు. ప్రేమంతా లోపల ఉంటుంది. కయ్యాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఇది వింత ప్రేమ. అందుకే ‘రావోయి చందమామ... మా వింతగాథ వినుమా’ అని వారు పాడుకుంటే ఇలాంటి వింత ప్రేమలో పడటానికి ప్రేక్షకులు కూడా రెడీ అయ్యారు.అయితే ప్రేమ అంటేనే ప్రమాదం. ప్రేమ అంటేనే శోకం. ప్రేమ అంటేనే వేదన. ప్రేమ అంటే మరణం అని ‘దేవదాసు’ చెప్పింది. చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డ పారు జీవితంలో దక్కకపోతే ఏ దేవదాసైనా దేవదాసే అవుతాడు. అటువంటి సమయంలో ఆ ప్రేమికుడికి తాత్త్వికత వస్తుంది. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటాడు. ‘జగమే మాయ బతుకే మాయ’ అని భౌతిక జీవితాన్ని ఈసడిస్తాడు. ‘ఓ... దేవదా’ అని ఆమె పాడితే ‘ఓ.. పార్వతి’ అని ఇతడు పాడిన రోజులు మాత్రమే అతడికి వాస్తవం. అవి తప్పిపోయిన మిగలిన అన్ని రోజులూ మత్తే. అందులో చిత్తే. ఆఖరుకు మరణం మాత్రమే అతడి ప్రేమను మరిపించగలిగింది. ఆ ప్రేమను ఇప్పటికీ ప్రేక్షకులు ఇష్టంగా నిందగా ఇష్టపడుతూనే ఉన్నారు.అయితే ప్రేమ అంటే ఏమిటి? శరీరమా, మనసా, ఆ రెంటి మీద ఆధిపత్యమా? ఏమిటి ప్రేమంటే? దానికీ తెలుగు సినిమా జవాబు చెప్పింది.‘డాక్టర్ చక్రవర్తి’లో శ్రీశ్రీ కలం ఆ ప్రశ్నకు ఇలా బదులు పలికింది. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరునించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ’... నిజమే కదా. ‘చీకటి మూసిన ఏకాంతంలో తోడుగా నిలవడమే కదా’ ప్రేమంటే. ఇప్పుడు ప్రేమకు యువతీ యువకులు సిద్ధంగా ఉన్నారు. పడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. కాని వారికి రాయబారి కావాలి. ప్రేమ వ్యక్తం చేసే మార్గం కావాలి. ‘ప్రేమలేఖ’ ఆ కార్యాన్ని నెరవేర్చింది. ఎన్ని వేల, లక్షల ప్రేమ లేఖలు లోకాన ఒకరి నుంచి మరొకరికి అంది ఉంటాయో. ఇక్కడ చూడండి. టక్ చేసుకున్న హరనాథ్. రెండు జడలు వేసుకున్న జమున. వాళ్లకు తోడు నిలవడానికి గొంతు సవరించుకున్న పి.బి.శ్రీనివాస్, సుశీల. ‘అందాల ఓ చిలుకా... అందుకో నా లేఖ... నా మదిలోని కలలన్నీ... ఇక చేరాలి నీ దాకా’... ఇలా కాగితం మీద రాసుకున్న ప్రేమలేఖలు ఉంటాయి. రాయడం రాక, రాయలేక పూలతో చెట్లతో నివేదించుకున్న ప్రేమ లేఖలు కూడా ఉంటాయి. ‘మూగ మనసులు’ సినిమాలో ఆ పాట గుర్తుందా?... ‘ముద్దుబంతి పూవులో మూగకళ్ల ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలియులే’. ప్రేమలో పడ్డవాళ్లు ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అని కూడా ఈ పాట చెప్పింది. సఫలమైతే ఒకలాగా. విఫలమైతే ఒకలాగా. ఇది కొంచెం నయం. ఎదురుగా ఉన్న మనిషితో ఏదో వంక పెట్టి మనసులో మాట చెప్పొచ్చు. అసలు కళ్లెదుటే లేని మనిషైతే? ‘మల్లీశ్వరి’లో ఆ బావామరదళ్ల కష్టం వర్ణనాతీతం. అతడు ఎక్కడో ఉన్నాడు. ఆమె మరెక్కడో ఉంది. ఉత్తరాలు అందవు. మాటలు వినపడవు. ఇక సందేశం అందించాల్సిన భారం మేఘం తీసుకుంది. ‘ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా అందాల ఓ మేఘమాల’ అని వారు పాడుకుంటే ఆ విరహానికి అది కూడా బరువెక్కి వర్షించింది. కాలం మారింది. బండ్లు పోయి మోటారు బండ్లు వచ్చాయి. పంచెలు పోయి ప్యాంట్లు వచ్చాయి. మొలతాళ్లు పోయి బెల్ట్‌లు వచ్చాయి. కాలేజీ చదువులు చదివే వారి సంఖ్య పెరిగింది. లవ్‌కు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా ఎందుకు అనగలిగే తెగింపు వచ్చింది. తెలుగైతే ఏమిటి తమిళం అయితే ఏమిటి అన్నారు. ఇటువైపు తెలుగింట్లో అమ్మాయి అటువైపు తమిళింట్లో అబ్బాయి ప్రేమించుకున్నారు.వాళ్ల ప్రేమకు రోడ్లు చాల్లేదు. బీచ్‌లు చాల్లేదు. గుడి మెట్లు చాల్లేదు. ఆఖరుకు స్ట్రక్ అయిన లిఫ్ట్‌లో కూడా ప్రేమించుకున్నారు ‘కలసి ఉంటే కలదు సుఖమూ కలిసి వచ్చిన అదృష్టమూ’ అని చిందులేశారు.‘మరోచరిత్ర’ ప్రేమ పాటల్లో కూడా చరిత్ర సృష్టించింది. అమ్మాయిలు అంతటితో ఆగలేదు. చాలా బారికేడ్లను బ్రేక్ చేశారు. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా’ అని ప్రియుడి సమక్షంలో పాడి పెద్దవాళ్ల గుండెలను బేజారెత్తించారు. ‘వయసు పిలిచింది’ సినిమాకు బదులు పలికినవాళ్లు బహుమంది. ప్రేమకు పెరిగిన ఈ గిరాకీని సీనియర్ హీరోలు గమనించారు. ప్రేమను ప్రేమించడంలో మేమేమీ తక్కువ తినలేదు అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ ‘నేనొక ప్రేమ పిపాసిని’ అని పాడి ఇప్పటికీ ఆ పాటను హిట్ చేస్తూనే ఉన్నారు. అక్కినేని ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అంటూ షర్ట్ మీద జర్కిన్ వేసి స్టెప్స్‌తో మోతెక్కించారు. శోభన్‌బాబు ‘ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం’ అని నది ఒడ్డున సుజాతను రెండు చేతులతో పైకెత్తుకున్నారు. ఎన్.టి.ఆర్ ‘రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ’ అని నల్లడ్రస్సులో ఆవేశంగా పాడి చెట్టు కొమ్మను పట్టుకుని ఊపి పారేశారు. కాని నిజంగానే తరం మారింది.కాలేజీ వయసు కంటే ఇంకా తక్కువ వయసులోనే ప్రేమించేసుకునే పిల్లలు వచ్చారు. ‘ముద్దమందారం’ సినిమాలో ప్రదీప్–పూర్ణిమ కలిసి ఆ రోజులలోనే పారిపోయారు. పెళ్లి చేసుకున్నారు.‘అలివేణి ఆణిముత్యమా’... ఒకరి సమక్షంలో ఒకరు లాలిత్యంతో పాడుకున్నారు. ‘నాలుగు స్తంభాలాట’లో నరేశ్–పూర్ణిమ ‘చినుకులా రాలి నదులుగా పారి వరదలై పోయి కడలిలా పొంగు నీ ప్రేమ నా ప్రేమ’ అని పాడుకుంటే వయసుకు, శరీరానికీ ఆవల ఉన్న ఆరాధనను కొత్తతరం అందిపుచ్చుకుందన్న నమ్మకం కుదిరింది. నాగార్జున వెంకటేశ్ జనరేషన్ వచ్చింది. మృత్యువు ప్రేమను నిరోధించలేదని చెప్పింది. నాగార్జున ‘గీతాంజలి’ ఒక ఊటీ నీటి ఆవిరిలాంటి సినిమా. ‘నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము’ అని ఆ సినిమా చెప్పింది. హీరో చచ్చిపోతాడని తెలిసినా హీరోయిన్ చనిపోతుందని తెలిసినా ప్రేమ బతికే ఉంటుందన్న నమ్మకంతో ఈ సినిమా చూసి హాలు నుంచి బయటకు వస్తాడు ప్రేక్షకుడు.వెంకటేశ్ ‘ప్రేమ’ ఇళయరాజా సాయంతో ఒక మంచి ప్రేమ డ్యూయెట్‌ను ఇచ్చింది. ‘ఈనాడే ఏదో అయ్యింది. ఏనాడూ నాలో జరగనిది’... కాని చివరిలో హీరోయిన్ చనిపోతుంది. ఇంతమంచి ప్రేమను చంపేస్తారా అని ప్రేక్షకులకు కోపం వస్తే బతికించినట్టు చూపాల్సి వచ్చింది. అదీ ప్రేమ ఎఫెక్ట్.అయితే ప్రేమ దెబ్బ మెగాస్టార్ కూడా తినకతప్పలేదు. కాకపోతే ఆయన ‘పెంటమ్మ’తో ప్రేమలో పడాల్సి వచ్చింది.‘రుద్రవీణ’లో ఆయన తొలి చూపులోనే ప్రేమించిన అమ్మాయి శోభన తమాషాకు తన పేరు పెంటమ్మ అని చెబుతుంది. పేరేదైనా ప్రేమ ప్రేమే అని తన మనసు ఆమె పాదాల దగ్గర పెడతాడు. తన హృదయంలో ‘లలిత ప్రియ కమలం విరిసినది’ అని చెబుతాడు. కాని ఊరి మేలు కోసం ఆ ప్రేమనే త్యాగం చేస్తాడు. ఆ సమయంలోనే ప్రేమ సఫలం కావడానికి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి వచ్చిన యువకుడిగా రాజేంద్రప్రసాద్ ‘ముత్యమంత ముద్దు’లో కనిపిస్తారు. సీతతో ఆయన పాడిన ‘ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది’ పాట పెద్ద హిట్. సంగీతం కన్నడ దేశం నుంచి హంసలేఖ మోసుకొచ్చారు. ఈ సందర్భంలో ‘సాగర సంగమం’లో కమలహాసన్, జయప్రదల మధ్య చిగురించిన మూగప్రేమను చెప్పకుండా ఉండలేము. ఇద్దరూ మాట్లాడుకోకుండా ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి’ అని పాడుకుంటూ ఉంటే ఆ నిశ్శబ్దప్రేమను ప్రేక్షకులు చెవి వొగ్గి విన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు కథలు అటూ ఇటూ నడిచాయి. జనం ప్రేమను మర్చిపోయారు అనుకుంటూ ఉండగా కరుణాకర్ వచ్చి ‘తొలి ప్రేమ’తో పెద్ద హిట్ కొట్టాడు. ప్రేమ సత్యమైనదే అయితే గెలిచే తీరుతుందని చెప్పాడు. ‘నీ మనసే... సే.. సే.. సే’... అని పవన్ కల్యాణ్ పాడిన పాట పెద్ద హిట్. ఆ తర్వాత దర్శకుడు తేజా వచ్చి ప్రేమే ‘చిత్రం’ అన్నాడు. అబ్బాయి అమ్మాయి ‘నువ్వు–నేను’గా ఉండాలన్నాడు. అలాంటి వాళ్లే జీవితంలో ‘జయం’ సాధిస్తారనన్నాడు. ఈ సినిమాలతో తెలుగునాట మళ్లీ ప్రేమ దుమారం వచ్చింది. ‘నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను’, ‘అందమైన మనసులో అంత అలజడెందుకో ఎందుకో ఎందుకో’ పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ మూడ్‌ను ‘మనసంతా నువ్వే’ పీక్కు తీసుకెళ్లింది. ‘చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా’ పాట అడ్రస్ సరిగా లేని కుర్రాళ్లని కూడా ప్రేమలో పడేలా చేసింది.తరుణ్ కూడా తన పాత్ర తాను పోషించాడు. ‘నువ్వంటే నాకిష్టం నాకన్నా నువ్విష్టం’ అని ఇష్టాన్ని స్పష్టం చేశాడు. అయితే ఫ్యాక్షన్ సినిమాలో కూడా చిరుగాలి వంటి ప్రేమ పూస్తుందని ‘ఒక్కడు’లో మహేష్‌బాబు డాబా మీద పాడి నిరూపించాడు. ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ పాట ప్రేక్షకుల యదను గిల్లింది. ప్రభాస్ నేను తక్కువ తినలేదని నిండా ‘వర్షం’లో మునిగి ‘మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం...’ అంటూ త్రిషకు దగ్గరయ్యాడు.అల్లు అర్జున్ ఈ ప్రేమకు కొత్త డైమన్షన్ తెచ్చాడు. ఎస్ చెప్పొద్దు నో చెప్పొద్దు ‘ఫీల్ మై లవ్’ అన్నాడు. ఈ భావన కూడా బాగుందే అని ప్రేక్షకులు అనుకున్నారు. ఆ తర్వాత ‘కొత్త బంగారులోకం’ వచ్చింది. ‘నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా’ పాటను ఇచ్చింది. ‘ఏమాయ చేశావే’ వచ్చింది. ‘ఈ హృదయం...’ అని రెహమాన్ ట్యూన్‌ను తెచ్చింది. అంతవరకూ మౌనంగా ఉన్న ఇళయరాజా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా కోసం తిరిగి హార్మోనియం అందుకున్నారు. ‘ఇలా ఇలా ఇలా హాయి నీదే సుమా’ పాట ఎంతో హిట్ చేశారు. అప్పుడు దర్శకుడు హను రాఘవపూడి ‘అందాల రాక్షసి’ తీశాడు. లావణ్య త్రిపాఠి వెంట నవీన్‌చంద్ర పడి ‘వెన్నంటే ఉంటున్నా కడదాక వస్తున్నా’... అంటూ చేసే అల్లరిని మణిరత్నం స్టయిల్లో చూపించాడు. ప్రేమ యాత్ర కొనసాగింది. రామ్ ‘నేను శైలజా’ చేశాడు. ఎన్నాళ్లు గడిచినా ప్రేమ అనేది ‘క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్’ అని చెప్పాడు. శర్వానంద్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చేశాడు. ‘ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై’ పాట నిత్యా మీనన్ ప్రెజెన్స్‌లో రంగులు పులుముకుంది. ప్రేమకు తిరుగులేదు అనడానికి నిన్న మొన్నటి సినిమాలు నిన్న మొన్న వచ్చిన హీరోలు కూడా సాక్ష్యం పలికారు.‘అర్జున్ రెడ్డి’ పెద్ద హిట్. ‘ఆర్ ఎక్స్ హండ్రెడ్’ ఇంకా పెద్ద హిట్. ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్. ‘ఊపిరాగుతున్నదే ఉన్నపాటున ఇలా’ ‘అర్జున్ రెడ్డి’లో, ‘పిల్లా రా నువ్వు కనపడవా’ పాట ‘ఆర్ ఎక్స్ 100’లో, ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట ‘గీత గోవిందం’లో ఇటీవలి ఆకర్షణలుగా నిలిచాయి.ప్రేమ– పాట ఒక జోడి.ప్రేమ– ప్రేక్షకుడు కూడా ఒక జోడి.ప్రేమ– ప్రపంచం ఒక జోడి.ప్రపంచం ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది.ప్రేమ ఉన్నంత కాలం మంచి పాట కూడా ఉంటుంది.మంచి మంచి పాటలు అందించిన ఆయా గేయకర్తలకు, సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు, నిర్మాత దర్శకులకు, నటీ నటులకు వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు.తమిళనటుడు కార్తిక్ తెలుగులో రెండు అందమైన ప్రేమకథల్లో నటించాడు. ఒకటి సీతాకోక చిలుక, రెండు అభినందన. రెంటికీ ఇళయరాజానే సంగీతం. రెంటిలోని ప్రేమపాటలన్నీ చాలా హిట్ అయ్యాయి. ‘మాటే మంత్రమూ’, ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె’ పాటలు సీతాకోక చిలుకలో. ‘ఎదుటానీవే... యదలోనా నీవే’, ‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’ పాటలు అభినందనలో ప్రేమికులను కట్టిపడేశాయి. కథనం: కె -
అనసూయను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..
‘క్లాసిక్‌ను ఎప్పటికి టచ్ చేయకూడదు.. మాస్టర్ పీస్‌ని చెడగొట్టకూడదు’ ఇది సిని ప్రపంచంలో మొదటి నియమం. ఫెయిల్యూర్ అవుతుందనే భయం కన్నా ఫీల్ చెడితే జనాల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొవడం అంత ఇజీ కాదు. ఇంతకు ముందంటే మన సినిమాల గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల తమకు నచ్చని వాటి గురించి మొహం మీదే చెప్పేస్తున్నారు అభిమానులు. నచ్చితే పొగడటం.. లేదంటే ట్రోల్ చేయడం వెంటవెంటనే జరిగిపోతుంది. ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికే కాక మహానటి సావిత్రి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ. ఓ పక్క టీవీ షోలు.. అడపదడపా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోన్న అనసూయ తాజగా ప్రకటనల రంగంలోకి కూడా ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ వస్త్రాల కంపెనీ యాడ్‌లో నటించిన అనసూయపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాడ్ కోసం సదరు కంపెనీ ఎవర్ గ్రీన్ హిట్ ‘మాయాబజార్’ సినిమాలోని ‘ఆహా నా పెళ్లంట’ పాటను ఎంచుకున్నారు. ఈ పాటలో అనసూయ ఏకంగా మహానటి సావిత్రిని ఇమిటేట్ చేస్తూ నటించారు. దాంతో నెటిజన్లు అనసూయనే కాక సదరు మాల్ యాజమాన్యాన్ని కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘మీరు సావిత్రి గారిని అవమానించారు’.. ‘అనసూయ.. సావిత్రి గారితో నీకు పోలికా’.. ‘దయ చేసి సావిత్రమ్మని ఇలాంటి పనులకు ఉపయోగించుకోకండి’.. అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ యాడ్‌లో ఘటోత్కచుడి పాత్రలో యస్వీఆర్‌ను ఇమిటేట్ చేస్తూ ప్రముఖ గాయకుడు మనో నటించారు. View this post on Instagram Something which I’ve been super anxious about but also feel super lucky to be the one to do.. #Savitramma #Mahanati 🙏🏻🙇🏻♀️!! The attempt itself is an acheivement for me!! Thank you @chandanabros @YamunaKishore garu for considering me🙏🏻🙏🏻 I will cherish this work forever🥰🙏🏻 A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on Dec 2, 2018 at 9:51pm PST -
మహానటిగా నిత్య మీనన్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందన్న ప్రశంసలు దక్కాయి. అయితే ముందుగా ఈ పాత్ర నిత్యమీనన్ దగ్గరకే వెళ్లిందట. కానీ అనివార్య కారణాల వల్ల నిత్య మహానటి సినిమాలో నటించలేకపోయింది. అయితే తాజాగా సావిత్రి పాత్ర మరోసారి నిత్యను వెతుక్కుంటూ వచ్చిందట. నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా యన్.టి.ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రకు నిత్యమీనన్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మాయబజార్, మిస్సమ్మ, రక్తసంబంధం లాంటి అద్భుత చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను యన్.టి.ఆర్‌లో చూపిస్తున్నారు. ఈ సీన్స్‌లో సావిత్రిగా నిత్య మీనన్ కనిపించనుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. నిత్య మీనన్, సావిత్రి పాత్రలో కనిపించటం కన్ఫమ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
మిస్సమ్మ మంచి టీచర్ గోవిందం మంచి మాస్టర్
మేకప్ లేని గురువులు బడిలో ఉంటారు.మేకప్ ఉన్న గురువులు సినిమాల్లో ఉంటారు.కాని వారి పాఠాల్లో తేడా ఉండదు.వారి ఆదర్శాల్లో తేడా ఉండదు.వారు చూపించే మంచి మార్గంలో తేడా ఉండదు.దైవం కంటే ముందు మనిషి గురువునే తెలుసుకుంటాడు.తల్లిదండ్రుల చేయి తర్వాత గురువు చేయే పట్టుకుంటాడు.మంచి చెప్పాలనుకున్న సినిమాల్లో మంచి గురువు ఎప్పుడూ హిట్టే కొట్టాడు. నూటికి నూరు మార్కులు సాధించాడు. బేడ్ టీచర్స్ వల్ల కొంతమందికి గుడ్ జరుగుతూ ఉంటుంది. ‘మిస్సమ్మ’ సినిమాలో ఆ జమిందారువారి స్కూల్లో అల్లు రామలింగయ్య సరిగ్గా పాఠాలు చెప్పి ఉంటే సావిత్రి అవసరం ఉండేదే కాదు. అతను అస్తమానం పిల్లల చేత ఆయుర్వేదం మందులు నూరిస్తూ, లేహ్యాలకు సాయం పట్టిస్తూ, గుళికలను చుట్టిస్తూ చేయము అని మొరాయిస్తే బెత్తం తిరగేస్తూ నానా బాధలు పెడుతున్నాడనే జమిందారైన ఎస్వీ రంగారావు కొత్త టీచరు కోసం మేనల్లుడైన అక్కినేని చేత పేపరు ప్రకటన ఇప్పిస్తాడు. దానివల్ల మిస్సమ్మగా సావిత్రి ఆమె భర్త ఎమ్.టి.రావుగా ఎన్.టి.ఆర్ ఆ ఊరికి వచ్చి మెల్లగా ఆ ఇంటికి అయినవాళ్లమని గ్రహించి కథను సుఖాంతం చేస్తారు. పనిలో పనిగా పనివాడు దేవయ్య అను రేలంగి కూడా బాగుపడ్డాడనుకోండి. తెలుగు సినిమాల్లో పాపులర్ స్థాయిలో హీరో హీరోయిన్లు టీచర్లు అయ్యింది ‘మిస్సమ్మ’తోనే కావచ్చు. ఆ తర్వాత కాలక్రమంలో టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు తెలుగు సినిమాల్లో టీచర్ల గౌరవం పెంచారు. టీచరు హోదాకు తమ స్టార్‌డమ్‌ను కూడా ఇచ్చారు. బడి పంతులు ఎన్.టి.ఆర్ వంటి స్టార్ ‘బడి పంతులు’గా చేయడం ఏమిటి అని ఆ రోజుల్లో మొదట అందరూ వింత పడ్డారు. ఆవేశం కలిగిన హీరో నలుగురినీ చితకబాదే వీరుడు బెత్తం కూడా పట్టకుండా మెత్తగా పాఠాలు చెప్తూ ఎలా మెప్పించగలడు అని కుతూహలం చూపారు. కాని టీచర్ అంటే ఇలా ఉంటాడు అని ఎన్.టి.ఆర్ బడిపంతులులో నిరూపించారు. విద్యార్థులకు ఆయనంటే ఎంత ఇష్టమంటే ఆ రోజులలోనే వారు స్వయం సేవ చేసి కాలిపోయిన ఇంటి స్థానంలో ఆయనకు ఇల్లు కట్టి ఇస్తారు సినిమాలో. ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయుడే విద్యార్థులకు నిజమైన ఆదర్శం. క్లాస్‌రూమ్‌లో ఆదర్శం వెల్లివిరిస్తే సంఘంలో ఆదర్శం వెల్లి విరుస్తుంది. భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు... అని అందరూ పాడుకోగలిగింది అప్పుడే. కోడెనాగు క్లాసులో అల్లరి చేస్తే టీచర్ దండిస్తాడు. క్లాసు బయట అల్లరి చేస్తే ఏం చేస్తాడు? ‘కోడెనాగు’ సినిమాలో గురువుగా వేసిన ఆచార్య ఆత్రేయ శిష్యుడైన శోభన్‌బాబు కోసం ఎన్నెన్ని అవస్థలు పడతాడో ఎన్నెన్ని తాపత్రయాలు అనుభవిస్తాడో చెప్పలేము. కోడెనాగును చూస్తే జనం పూజలు చేయవచ్చు. కాని దానిని వీధుల్లో ఇళ్లలో తిరగనివ్వరు. ముక్కుసూటిగా వెళ్లే శోభన్‌బాబులాంటి వ్యక్తులకు సంఘంలో చోటు లేదు. అలాంటి వాడికి బాసటగా ఈ సినిమాలోని ఆత్రేయ వంటి గురువు కావలసిందే. ఈ సినిమా క్లయిమాక్స్ ఆ రోజుల్లో ఊహకు అందనిది. శిష్యుడి కోసం గురువు ప్రాణాలు వదులుతాడు. ఆ గురువును వెతుక్కుంటూ శిష్యుడు కూడా తన ప్రియురాలితో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ గురుశిష్యుల అనుబంధం అమరం. విశ్వరూపం సినిమాల్లో టీచర్ ఇప్పుడు లెక్చరర్ అయ్యాడు. యువ స్టూడెంట్స్‌కు దారి చూపే మార్గదర్శి అయ్యాడు. దేశంలో డెబ్బయ్యవ దశకం వచ్చినప్పుడు ఫ్యాషన్ కొంచెం శృతి మించింది. విద్యార్థులలో అల్లరి, నిర్బాధ్యత పెరిగాయి. క్లాసులు ఎగ్గొట్టడం, వ్యసనాలకు పాల్పడటం, లెక్చరర్లను ఎదిరించడం... ఈ ధోరణిలో ఉన్న వారిని ఒక దారికి తేవడానికి ‘విశ్వరూపం’ సినిమా ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఇందులో లెక్చరర్‌గా వేసిన ఎన్.టి.ఆర్‌ను విద్యార్థులు మొదట ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఎంతగా అభిమానిస్తారంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతున్న ఆయన తన ట్రాన్స్ఫర్ లెటర్ చించి పారేసి మరీ ఆ కాలేజ్‌లో ఉండిపోతాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ చే ప్రభావితులైన స్టూడెంట్స్ ఏకంగా డ్యామ్ కట్టేంత స్థాయిలో ఏకం అవుతారు. విద్యార్థుల శక్తి సంఘ పురోగతికి ఉపయోగించవచ్చని చెప్పిన బెస్ట్ టీచర్ సినిమా ఇది. శంకర శాస్త్రి పాఠాలు చెప్తేనే గురువా... సంగీత పాఠాలు చెప్తే గురువు కాదా? శంకరాభరణంలో శంకరశాస్త్రికి మించిన గురువు లేడు. ఆ గురువుకు శిష్యుడిగా చేరాలంటే తులసికి చాలా శుశ్రూష చేయాల్సి వస్తుంది. వినయం చూపించి మెప్పించాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ శిష్యుడిని స్వీకరించాక ‘బ్రోచేవారెవరురా’ అంటూ కీర్తనలేం ఖర్మ ఆ శిష్యుడు నిజంగా యోగ్యుడయ్యాడని తెలిసిన క్షణాన ఆ శంకరశాస్త్రి స్వయంగా తన ముంగాలి మీద ఉన్న గండపెండేరాన్ని తీసి మరీ శిష్యుడికి తొడుగుతాడు. ఏ కళ అయినా గురు ముఖతానే నేర్చుకోవాలి అప్పుడే అబ్బుతుంది రాణిస్తుంది అని చెప్పిన సినిమా ఇది. గురువు నుంచి కళను మాత్రమే కాదు విలువలను అలవర్చుకోవాలి అని రాగం తానం పల్లవులను మన మదిలో కదలాడిస్తూ మరీ చెబుతుంది. ప్రతిఘటన బెత్తం పట్టే టీచరు అవసరమైతే గొడ్డలి పట్టుకోదా? జవాబు పత్రంలో అప్పు ఆన్సర్ రాస్తే సున్నా మార్కులు వేయక తప్పదు. మరి సంఘంలో తప్పు పని చేస్తే ఏం చేయాలి? ‘ప్రతిఘటన’ రౌడీయిజం చేస్తున్న చరణ్‌రాజ్ తాను సంస్కరించాల్సిన మొదటి బ్యాడ్ స్టూడెంట్ అని లెక్చరర్ పాత్ర వేసిన విజయశాంతి గ్రహిస్తుంది. అతణ్ణి ఎదిరిస్తుంది. నిలువరిస్తుంది. ఎంత ప్రయత్నించినా పనికి రాకపోగా ఇతర స్టూడెంట్లకు హానికరంగా మారినవాణ్ణి డిబార్ చేయక తప్పదు. విజయశాంతి కూడా అదే పని చేస్తుంది. చరణ్‌రాజ్‌ను డిబార్ చేస్తుంది. సంఘం నుంచి చేస్తుంది. జీవం నుంచి చేస్తుంది. జీవితం నుంచి చేస్తుంది. అతడి మెడ మీద ఆమె తిప్పిన గొడ్డలే ఒక లెక్చరర్ ఇప్పటి వరకూ సినిమాలలో ఎత్తిన అతి ఉత్తమ బెత్తం అని చెప్పక తప్పదు. ముగ్గురు స్టార్లూ మూడు సినిమాలు హీరో ఎస్.ఐ అంటే ఉత్సాహపడే హీరోలు– హీరో టీచర్ అంటే వేయడానికి అంగీకరించకపోవచ్చు. తెలుగులో పెద్ద హీరోలు చాలామంది గురుస్థానంలో నిలబడ్డానికి ముందుకు వచ్చారు. వెంకటేశ్ ‘సుందరకాండ’లో, చిరంజీవి ‘మాస్టర్’లో, బాలకృష్ణ ‘సింహా’లో చేతిలో టెక్స్›్టబుక్స్ పట్టుకుని బ్లాక్‌బోర్డు మీద లెసన్స్ రాశారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం వంటి నటులు హాస్యం పుట్టించే లెక్చరర్ పాత్రలు వేస్తున్నప్పుడు ప్రేమికులు తమ ప్రేమను అర్థం చేసుకుని ఎదిగేలా చేయగలిగే మంచి లెక్చరర్ పాత్రలో రావు రమేశ్ ‘కొత్త బంగారులోకం’ సినిమాలో కనిపిస్తాడు. ఓనమాలు ఊరికి నడిబొడ్డు ఎలాగో ఊరిలోని టీచర్ అలాగా. టీచర్ ఊరు విడిస్తే ఏమవుతుంది? ఊరే దారి తప్పుతుంది. ఎవరు ఎంత ఎదిగినా ఎన్ని దూర తీరాలకు చేరినా జన్మభూమికి వస్తూ పోతుండాలని ఊరి మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలని అందుకు ఆ ఊరి టీచరు మూలాధారం కావాలని చెప్పిన సినిమా ‘ఓనమాలు’. ఇందులో టీచర్‌గా రాజేంద్రప్రసాద్ ఊరి నుంచి చదువుకుని వెళ్లిన విద్యార్థులు తిరిగి ఊరికి రావాల్సిన అవసరాన్ని క్లయిమాక్స్‌లో చెబుతాడు. సంవత్సరానికి ఒక రోజు ‘మాతృభూమి దినోత్సవం’ పేరుతో ప్రతి ఒక్కరూ సొంత ఊరికి రావాలని కోరుతాడు. ఇంగ్లిష్ చదువులు పరాయి సంస్కృతిలో పడి మూలాలు మరిచిపోయినవారి చేత ఓనమాలు దిద్దించిన సినిమా ఇది. గీత గోవిందం నాటి సినిమాలలోనే కాదు నేటి సినిమాలలో కూడా నాటి హీరోలే కాదు నేటి హీరోలు కూడా గురు పరంపరను గురువు సంస్కారాన్ని గురువు ఔన్నత్యాన్ని నిలబెడుతున్నారు. ‘గీత గోవిందం’ సినిమాలో లెక్చరర్ అయిన విజయ్ దేవరకొండ కూడా తన శిష్యురాలిని దారిలో పెడతాడు. డబ్బునో లేదా అందాన్నో ఎర వేస్తే గురువును దారికి తెచ్చుకోవచ్చు అనుకున్న ఒక విద్యార్థినిని చీవాట్లు పెట్టి ఎప్పటికీ ఆమెకు తానొక వెల్విషర్గా ఉంటానని చెబుతాడు. ఆ అమ్మాయికే కాదు మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది అలాంటి గురువు తోడుగా నిలుస్తాడనుకుంటే.సినిమా శక్తిమంతమైన మీడియా. మార్గదర్శిగా నిలిచే పాత్రలను అది ఆ స్థాయిలో చూపించినప్పుడే వాటి ప్రభావం సినిమాలోనూ సంఘంలోనూ గొప్పగా ఉంటుంది. గురుబ్రహ్మ గురుర్వివిష్ణుః అంటూ దైవం కంటే ముందు గురువును నిలబెట్టారు. తల్లిదండ్రుల తర్వాత ఏ మనిషైనా రుణపడేది గురువుకే.అలాంటి గురువుకి నమస్కారం.సినిమా గురువుకు దండాలు. – కె -
తియ్యటి కబురు
1960లో విడుదలైన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రానికి ఆత్రేయ రచయిత. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్.వరలక్ష్మి, శాంతకుమారి నటించిన ఈ మూడు గంటల సినిమాకు పి.పుల్లయ్య దర్శకుడు. ప్రేక్షకులు దేవుడిలా దండం పెట్టేంత ఇమేజ్ ఎన్టీఆర్‌కు ఇచ్చింది ఈ చిత్రం. అందులో ఒక చోట ‘కబురు’ అనే మాట వస్తుంది. ఖబర్ అనే ఉర్దూ మాట నుంచి ఈ కబురు అనే మాట పుట్టింది. ఈ ‘పొరపాటు’కు ఆత్రేయ నొచ్చుకున్నారు. ‘అయ్యో, పౌరాణిక చిత్రంలో కబురు అనే మాట వాడానే’ అని తన అసమర్థతకు విలపించారు. ఇదే సంగతిని ఓసారి గీత రచయిత, కథకుడు అయిన మల్లాది రామకృష్ణశాస్త్రితో చెప్పుకుని బాధపడ్డారు. ‘వేంకటేశ్వరుడు బీబీ నాంచారిని పెళ్లాడాడు కదా, అంటే ఆ కాలంలో ఉరుదూ ఉన్నట్టే, అప్పుడు కబురు అనే మాట తప్పు ఎలా అవుతుంది?’ అని సాంత్వన వచనాలు పలికారు రామకృష్ణశాస్త్రి. అప్పుడుగానీ ఆత్రేయ మనసు కుదుటపడలేదు. -
మహానటి ఓ కథేనా?!
మహానటి సినిమా చూశారా? అయితే టైటిల్స్ గమనించారా? చూస్తే.. గమనిస్తే.. గార్లపాటి పల్లవి పేరు కనిపించిందా? ఇప్పుడు అదో సినిమా అయింది! సావిత్రి మీద అభిమానంతో ఆమె గురించి అక్కడ చదివి.. ఇక్కడ చదివి.. వాళ్లను వాకబు చేసి.. వీళ్లను వాకబు చేసి ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పుస్తకం రాశారు! సావిత్రి వాస్తవంగా ఓ మహానటి. అయితే.. మహానటి వాస్తవంగా సావిత్రి కాదు.. అని సోషల్ మీడియా వాల్స్ మీద ఈ మధ్య పోస్టర్లు వెలిసినప్పుడు.. మహానటి నిజంగానే ఓ కథేనా? లేక దాంట్లో వాస్తవాలున్నాయా అని తెలుసుకోవడానికి పల్లవిని పలకరించింది... సాక్షి. ‘మహానటి’.. సావిత్రిని ఈ తరానికి పరిచయం చేసిన సినిమా. అయితే అంతకుముందే ఆమె బయోగ్రఫీ వచ్చింది ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పేరుతో. ఆ పుస్తకాన్ని రాసింది సావిత్రి కుటుంబీకురాలో.. ఆమె సన్నిహితురాలో.. లేదా ఇంకే సినిమా పర్సనాలిటీనో కాదు. రచయిత అంతకన్నా కాదు. ఓ సాధారణ గృహిణి. గార్లపాటి పల్లవి. సావిత్రి పుస్తకంతోనే ఆమె రచయిత్రిగా మారారు. మహానటి సావిత్రి సినిమాకు ఓ సోర్స్‌గా కూడా మారారు. అయినా ‘‘ఆ సినిమా తెలుగువారి మహానటి కాదు.. మద్రాస్వారి మహానటి’’ అంటారు ఆమె. అన్ని వివరాలు పల్లవి మాటల్లోనే విందాం.‘‘నాకోసం నేను రాసుకున్న పుస్తకం సావిత్రి. ఆమె సినిమాలు పెద్దగా చూసిందీ లేదు. ఎందుకంటే నాకు ఊహ తెలిసేటప్పటికే సావిత్రి క్యారెక్టర్ రోల్స్‌కి వచ్చేశారు. ఆవిడంటే మా నాన్నగారికి చాలా ఇష్టమని మా అమ్మ చెప్తుండేది. అలా ఆవిడ నా మైండ్‌లో అచ్చయిపోయారు. నేను ట్వల్త్క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లోకి వీసీఆర్ వచ్చింది. అందులో మేం చూసిన మొదటి సినిమా ‘‘కన్యాశుల్కం’’. మధురవాణిగా సావిత్రిని ఎవరైనా మరిచిపోగలరా? ఆ తర్వాత 1990ల్లో మళ్లీ సావిత్రిగారి సినిమా చూశా. ఐ ఫాలెన్ ఇన్ లవ్ విత్ హర్. ఆ లవ్వే ఆమె బయోగ్రఫీ రాసేలా చేసింది. 2004లో అనుకుంటా ఘంటసాల గారి మీద రాసిన పుస్తకం చూపిస్తూ మాకు తెలిసినొకాయన..‘‘ దీని కోసం 6 లక్షలు ఖర్చయింది’’ అన్నారు. ‘నేనైతే సావిత్రి కోసం ఎన్ని లక్షలయినా ఖర్చుపెట్టేస్తా’ అన్నాను ఆసువుగా. అప్పటికి నాకు పెళ్లయి ముగ్గురు పిల్లలు. పాప ప్రణతి యూకేజీలో ఉంది. ఇద్దరు మగపిల్లలు ట్విన్స్ ఆకాశ్, పృథ్వీ. ఎల్కేజీలో ఉన్నారు. నేనూ ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా. ఆ పరీక్ష అయిపోయిన వెంటనే ఆ వ్యక్తికి కాల్ చేశా ‘‘అంకుల్ విల్ గో ఫర్ బుక్’’ అని. అప్పటిదాకా నేను క్లాసిక్స్ అనదగ్గవి 20 వరకూ చదివుంటా. కానీ ఎప్పుడూ రాయలేదు. డైరెక్ట్‌గా మహానటి సావిత్రే. ముందు భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్) గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన సావిత్రి ఫొటోస్ కొన్ని ఇచ్చారు, ఆ తర్వాత చెన్నైకి వెళ్లాను. ఫిల్మ్ న్యూస్ ఆనంద్‌ను కలిశాను. సంజయ్కిశోర్ను కలిశాను. దశాదిశ లేకుండానే.. నేను మామూలు హౌస్‌వైఫ్‌ని. సినిమాలతో కానీ, సినిమా వాళ్లతో కానీ మా ఫ్యామిలీకి ఎలాంటి స్నేహం లేదు. సావిత్రిగారిమీదున్న ప్రేమ, పుస్తకం రాయాలి అన్న సంకల్పమే తప్ప ఎవరిని కలవాలి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నవేమీ తెలియవు. గుమ్మడి గారిని కలిశాను. ఆయన రాసిన ‘తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు’ పుస్తకం తీసుకున్నాను. భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్)ను కలిస్తే ఆయన కొన్ని ఫొటోస్ ఇచ్చారు. సంజయ్ కిశోర్‌ను, జమున గారిని, కాంతారావుగారిని, చెన్నైలో ఫిల్మ్‌న్యూస్ ఆనంద్‌ను కలిశాను. అప్పుడే జమునగారి కూతురి పెళ్లి ఉండడంతో ఆమె తర్వాత కలవమని చెప్పారు. కానీ వెళ్లలేకపోయాను. కాంతారావు గారేమో బ్యాడ్ హెల్త్ కండిషన్లో ఉండి ఏమీ చెప్పలేక పోయారు. ఆతర్వాత విజయ చాముండేశ్వరి గారినీ కలిశాను. నా పిల్లలు చిన్నవాళ్లవడంతో అవుట్స్టేషన్స్కు వెళ్లడం కుదర్లేదు. సావిత్రిగారి మీది ఆర్టికల్స్, ఆమె ఇంటర్వ్యూ బాగా ఉపయోగపడ్డాయి. వనితాజ్యోతిలోని పసుపులేటి రామారావుగారు రాసిన ఆర్టికల్.. ఇంకా అలాంటివి చాలా. పుస్తకం రాయడం మొదలుపెట్టాక, ఇంకా చెప్పాలంటే పూర్తయ్యాక ఒక్కొక్కరూ తెలియడం మొదలుపెట్టారు. సావిత్రిగారి అక్క భర్త మా ఇంటి దగ్గరే ఉంటారని తెలిసింది. నాకు దొరికిన సోర్స్‌ని బట్టి రాస్తూ వచ్చాను. అలాగని గ్రౌండ్ వర్క్ చేయలేదని చెప్పను. విజయవాడ, సత్యనారాయణపురంలో సావిత్రిగారు వాళ్లున్న వీధికి వెళ్లా. ఆ తరం వాళ్లను కలిసి మాట్లాడా. అలాగే ఆవిడ స్కూల్ కట్టించిన ఊరికీ వెళ్లా. వేటపాలెం లైబ్రరీనీ కాంటాక్ట్ చేశా. సావిత్రిగారు లక్స్ యాడ్‌కు మోడలింగ్ చేశారన్న సంగతి ఆ లైబ్రరీతోనే తెలిసింది. పుస్తకంలో చాముండి పాత్ర పుస్తకం రాసేటప్పుడు అప్పటికప్పుడు నాకు తట్టిన పాత్ర అది. సావిత్రికి ఫ్రెండ్‌గా పెట్టాను. ఆమె జీవితంలో వెన్నంటి ఉండే పాత్ర. సినిమాలు తీయకు, దానాలు చేయకు, జెమినీని నమ్మకు అంటూ సావిత్రికి అడుగడుగునా మంచిచెడులు చెప్తుంటుంది. అయితే ఈ పాత్ర మాత్రమే కల్పితం. కానీ ఆ మిగిలినవన్నీ సావిత్రిగారి జీవితం లో జరిగినవే. మరెందుకు ఆ కల్పిత పాత్ర? అంటే చెప్పలేను. చాముండి వల్లే నా పుస్తకం అంతా ఫిక్టీషియస్ అనుకున్నారు. సూజెన్ హెవర్డ్ ఉత్తరం కూడా అంతే. సావిత్రి లైఫ్ గురించే ఎక్కువ చెప్పాను. నటిగా ఆమెను ఎక్కడా డిస్క్రైబ్ చేయలేదు. ఆ ఉత్తరం ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆమె నటనను వర్ణించాలనుకున్నాను. ఈ ఉత్తరం నా కల్పితమని నా పుస్తకం ముందుమాటలో గుమ్మడిగారు స్పష్టం చేశారు కూడా. అంతెందుకు గుమ్మడిగారి పుస్తకంలో.. సావిత్రిగారు బెంగళూరు హోటల్లో బస చేసినప్పుడు (తనతో స్నేహంగా ఉన్న) ఒక నటిని పిలిపించుకొని ఎప్పుడో ఆమెకు ఇచ్చిన తన నగను ఇవ్వమని సావిత్రి అడిగినట్టు, దానికి ఆ నటి తన దగ్గర ఆ నగలేదని చెప్పినట్టు, డబ్బు అవసరంలో ఉన్న సావిత్రిగారు ఆ మాట విని షాకైనట్టు అలా కోమాలోకి వెళ్లినట్టూ రాశారు. ‘‘ఇది నిజమేనా అండీ.. ’’ అని నేను గుమ్మడిగారిని అడిగా. ఆయన నిజమని చెప్పలేదు.. అబద్ధమనీ నిర్ధారించలేదు. మౌనంగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉన్న సోర్సెస్ కూడా నిజాలను తేల్చలేదని తెలియజేయడానికే. స్టార్ట్‌చేసిన యేడాదికల్లా పుస్తకం రెడీ అయింది. మా నాన్నగారికి శాంతాబయోటిక్ వరప్రసాద్‌రెడ్డిగారు మంచి ఫ్రెండ్. ఆయనకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాను. ఇప్పటి వరకు పన్నెండు వేల కాపీలను ప్రింట్ చేశాం. ప్రతి యేడాది రెండు వేల కాపీలను ప్రింట్ చేస్తూనే ఉన్నాం. ఈ పుస్తకంలో నేనెంత లీనమయ్యానంటే మా పిల్లలు ‘‘అమ్మా సావిత్రమ్మ మాకు అమ్మమ్మ అవుతుంది కదా’ అని అడిగేంతగా! రెండో పుస్తకం.. ఎమ్మెస్గారి మీద ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు అంటే నాకు శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతమే. అంతకుమించి ఆమె పాడినవి ఏవీ నేను వినలేదు. ఆమెను చూడలేదు. ఆమె పాడిన భజగోవిందంలోని పునరపి జననం.. పునరపి మరణం అనే వాక్యాలు కలిగించిన కుతూహలం టీజేఎస్ జార్జ్ .. ఎమ్మెస్ మీద రాసిన పుస్తకాన్ని పరిచయం చేసింది. అది చదివాక ఆమె బయోగ్రఫీ తెలుగులో రాస్తే బాగుంటుందనిపించింది. సావిత్రి బయోగ్రఫీ ఇచ్చిన ఎక్స్‌పీరియెన్స్‌తో ఈ పుస్తకానికి రీసెర్చ్ మొదలుపెట్టా. దాదాపు ఎనిమిదేళ్లు సాగింది. సావిత్రి పుస్తకం ఇష్టమైతే.. ఎమ్మెస్ మీద పుస్తకం ఓ యజ్ఞం. జార్జ్ మొదలు, ఎమ్మెస్గారి వదిన, ఎమ్మెస్ గారి మనవడు, మునిమనవరాలు, సదాశివం (ఎమ్మెస్ భర్త) కాంటెంపరరీస్ అయిన ఖాసా సుబ్బారావు గారి కూతురు, వీఏకే రంగారావు, స్వామినాథన్ ఇలా చాలామందిని కలిశాను. చెన్నై, కోయంబత్తూరు, మధురై, రాజుపాళెం వంటి చోట్లకూ వెళ్లా. ఆమె మీద వచ్చిన ఎన్నో పుస్తకాలను, ఆర్టికల్స్‌నూ ఔపోసన పట్టా. ఆమె మీద తీసిన ‘ఫరెవర్ లెజెండ్’ డాక్యుమెంటరీ చూశా. ఆడియోస్ విన్నా. అన్నీ హెల్ప్ అయ్యాయి. ఈ ప్రయాణం స్టార్ట్చేసేనాటికి నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఈ పుస్తక రచనలో చాలా సాయపడ్డారు. ఫొటోలు తీయడం దగ్గర్నుంచి ఇంటర్వ్యూలను రికార్డ్చేయడం వరకు ఒకరకంగా నాకు అసిస్టెంట్స్‌గా ఉన్నారని చెప్పొచ్చు. మా నాన్నా అంతే తోడుగా ఉన్నారు. ఇలా మా ఇంట్లో వాళ్లంతా ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేశారే తప్ప ఎందుకు ఈ ప్రయాస అంటూ నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఈ రీసెర్చ్ నాకు చాలా విషయాలను నేర్పింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారికి సంబంధించి ఒక క్లూ ఇచ్చింది మాత్రం ఆమె వదినగారే. ఎమ్మెస్ భర్త సదాశివం..ఆమెను పెళ్లిచేసుకున్నాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారట. ఈ విషయం తెలిసి సుబ్బులక్ష్మిగారు తన అన్నతో చెప్పి ఏడ్చారని చెప్పింది వాళ్ల వదిన. కానీ సుబ్బులక్ష్మి మనవడు చెప్పేదానికంటే కూడా ‘‘మీరు జార్జ్ లాగా రాయొద్దు’’ అని ఆంక్షలే ఎక్కువ పెట్టాడు. కానీ నేను జార్జ్ కన్నా నాలుగు నిజాలు ఎక్కువే రాశాను. జార్జ్ తన పుస్తకంలో ప్రశ్నార్థకాలు పెట్టిన వాస్తవాల దగ్గర నా పుస్తకంలో నేను ఫుల్స్టాప్ పెట్టా. ఎమ్మెస్ వాళ్లమ్మ చనిపోతే ఆమె వెళ్లలేదని ఎమ్మెస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి చెప్పాడు. నేనూ అదే రాశాను. పుస్తకం అచ్చుకి రెడీ అయిన టైమ్‌లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మీద ‘ది హిందూ’లో ఓ వ్యాసం వచ్చింది. అందులో ఆమె వాళ్లమ్మ చనిపోయినప్పుడు వెళ్లింది అని రాశారు. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి కాంటాక్ట్ నంబర్ పట్టుకొని క్రాస్ చెక్ చేసుకున్నా. నిజమే అని తేలింది. దాంతో నేను రాసింది మళ్లీ మార్చాల్సి వచ్చింది. అలాంటి ఎన్నో సంఘటనలు మళ్లీ మళ్లీ క్రాస్ చెక్ చేసుకుంటూ పోయా. ‘సుస్వరాల లక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి’గా పుస్తకాన్ని అచ్చువేశా. వరప్రసాద్‌రెడ్డి గారి తల్లిదండ్రులైన శాంతమ్మగారు, వెంకటరమణారెడ్డి గారికి ఆ పుస్తకాన్ని అంకితమిచ్చా. రిలీజ్ అయిన రోజే రెండు వందల కాపీలు అమ్ముడుపోయాయి. వితిన్ సిక్స్ మంత్స్ సెకండ్ ప్రింట్కు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెస్ ఎక్స్‌పీరియెన్స్‌తో సావిత్రి పుస్తకం మళ్లీ రాయాలనుంది. ఈ పుస్తకం నాకు సావిత్రి అభిమాని శిల్పను మంచి ఫ్రెండ్‌గా చేస్తే, తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ వచన రచన పురస్కారాన్ని అందించింది. విమర్శలను పట్టించుకుంటూనే నా పని నేను చేసుకుంటా. ఏ పనికైనా ప్రత్యేకంగా ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. అప్పటికప్పుడు బలంగా ఏదనిపిస్తే అది చేస్తా’’ అంటూ ముగించారు గార్లపాటి పల్లవి. పల్లవి.. కుటుంబం పల్లవి స్వస్థలం గుంటూరు జిల్లా, బోడిపాలెం. ఆమె తండ్రి రావిపాటి నాగేశ్వరరావు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తల్లి శాంతి. నిజానికి పల్లవి తెలుగు చదివింది మూడో తరగతి వరకే. ఎందుకంటే తర్వాత ఆమె విద్యాభ్యాసమంతా సెంట్రల్ స్కూల్స్‌లోనే సాగింది. ఎనిమిదో తరగతి వరకు గుంటూరులోనే. తండ్రి ఉద్యోగరీత్యా తర్వాత నుంచి అంతా హైదరాబాదే. కేంద్రీయ విద్యాలయాల్లో స్పోర్ట్స్‌కి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అందువల్ల పల్లవి కూడా టేబుల్ టెన్నిస్ ఆడేవారు. స్కూల్స్ నేషనల్స్ వరకూ వెళ్లారు. ఎమ్మే హిస్టరీ చేశారు. సివిల్స్‌కూ ప్రిపేర్ అయ్యారు. ఆమె భర్త గార్లపాటి మధుసూదన్‌రావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. కూతురు ప్రణతి. ఇంజనీరింగ్ చదువుతోంది. మగపిల్లలు ఆకాశ్, పృథ్వీ ట్విన్స్. ఇంటర్లో ఉన్నారు. – సరస్వతి రమ -
కన్నులలో దాచుకొంటి నిన్నే నా స్వామి
‘ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామా’ అని పాడుకున్నారు వారిద్దరూ.‘ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని ఆవిడను చూసి అనురాగం పెంచుకున్నారాయన.‘మరుమల్లెలలో మావయ్యా... మంచి మాట సెలవీవయ్యా’ అని ఆయన మాటనే శిరోధార్యం చేసుకున్నారు ఆవిడ.‘హాయిగా ఆలుమగలై కాలం గడపాలి’ అని జీవించారు ఇరువురూ.‘ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా’ అని వీడ్కోలు తీసుకున్నారు ఆయన.‘కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ’ అని ఆయన జ్ఞాపకాలలో జీవిస్తున్నారు ఆవిడ. పల్లవి చరణాల వలే ఘంటసాల, ఆయన శ్రీమతి సావిత్రి ముప్పై ఏళ్ల పాటు వైవాహిక జీవితం గడిపారు. పల్లవిని విడిచి చరణం వెళ్లిపోయి నలభై ఏళ్లు దాటిపోయింది.అయినప్పటికీ ఆ పాట ఆమె మనసులో అనుక్షణం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ జ్ఞాపకం పదేపదే సాక్షాత్కారం అవుతూనే ఉంది. సావిత్రి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారు. తెలుగువారికి ఎంతో ఆత్మీయుడైన గాయకుడి గురించి సాక్షితో తన జ్ఞాపకాలు పంచుకున్నారు. ఘంటసాలను మావయ్య అని పిలిచేవారట! సావిత్రి: మాది కృష్ణాజిల్లా రేపల్లె తాలూకా పెదపులిపర్రు గ్రామం. ఘంటసాల మాస్టారు నాకు వేలువిడిచిన మేనత్త కొడుకు. మా ఇంట్లో నేను మూడో పిల్లను. ఘంటసాల మాస్టారు కూడా వాళ్లింట్లో మూడో సంతానమే. మావి ఉమ్మడి కుటుంబాలు. ఇరుగుపొరుగు అంతా చుట్టాలే. మా అమ్మ, మా అత్తగారిని అమ్మ అని పిలిచేది. నేను అమ్మమ్మ అనేదాన్ని. అందువల్ల ఘంటసాల మాస్టారు వరసకు బావ అయినా, ‘మావయ్య’ అని పిలిచేదాన్ని. ఘంటసాల జీవితం మలుపు తిరిగింది విజయనగరం లోనే కదా! ఘంటసాల గారిని విజయనగరం పంపించి సంగీతం నేర్పించాలని మా మామగారి కోరిక. కాని దురదృష్టవశాత్తు ఘంటసాలకు పది సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రిగారు గతించారు. వాళ్లు కాని, మేము కాని ధనవంతులం కాదు. డబ్బులు ఇచ్చి బయటకు పంపి సంగీతం చెప్పించే స్థోమత లేదు. తండ్రి మరణం తరవాత ఆయన కోర్కె ¯ð రవేర్చాలనే సంకల్పంతో, మాస్టారు తన పన్నెండో ఏట ఇంటి నుంచి పారిపోయి విజయనగరం చేరుకుని, ఐదేళ్లపాటు సంగీతం కోర్సు పూర్తి చేసి, తిరిగి వచ్చారు. మోపిదేవి, కళ్లేపల్లి వంటి చుట్టుపక్కల గ్రామాలలో నాటకాలు వేసేవారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని 18 నెలలు జైలులో గడపడంతో, వీడికి పెళ్లి చేస్తేనే గాని నిలకడగా ఉండడు అనుకున్నారు మాస్టారి తల్లి. బంధువులందరినీ పిల్లను ఇవ్వమని అడిగారు. అందరూ తిరస్కరించారు. చివరికి మా ఇంటికి వచ్చి, మా నాన్నతో.. ‘రత్తయ్యా, మీ సావిత్రిని మావాడికి ఇవ్వచ్చు కదా’ అని అడిగారు. ‘మా పిల్ల ఇంకా చిన్నది. అప్పుడే పెళ్లేంటి’ అన్నారు నాన్న. ‘ఇప్పుడు మాట ఇస్తే, వచ్చే సంవత్సరం వివాహం చేద్దాం’ అన్నారు ఆవిడ. మా నాన్న ‘దేవుడిని ప్రశ్న అడిగి చెప్తాను’ అన్నారట. ఆయన దేవుడిని ఏం అడిగారో, భగవంతుడు ఏం సమాధానం చెప్పాడో తెలియదు కాని, మా వివాహం నిశ్చయం అయింది. నా పదకొండో ఏట1944 మార్చి స్వభాను నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ విదియనాడు మా వివాహం జరిగిపోయింది. పెళ్లినాటికి ఆయన వయస్సు 21 సంవత్సరాలు. ఘంటసాలను ప్రోత్సహించింది సముద్రాల గారే కదా... సముద్రాల రాఘవాచారిగారిది మా ఊరే. ఆయన మా ఇంటి పక్కనే ఉన్న లైబ్రరీకి వస్తుండేవారు. ఆయన ఘంటసాల మాస్టారితో పాడించుకుని, ‘నీ కంఠం ఇంత బావుంది, మద్రాసు వస్తే అవకాశాల కోసం ప్రయత్నిద్దాం’ అన్నారు. అలా ఘంటసాల గారిని మద్రాసు తీసుకువెళ్లి కొందరు పెద్దల దగ్గరకు వెళ్లమని ఉత్తరాలిచ్చి పంపారు సముద్రాల. అప్పట్లో బిఎన్ రెడ్డి గారు ‘స్వర్గసీమ’ సినిమా చేస్తున్నారు. అందులో మాస్టారితో పాట పాడించారు. ఆ తరవాత గూడవల్లి వారి ‘పల్నాటి యుద్ధం’, నాగయ్య గారి ‘త్యాగయ్య’, ఘంటసాల గారి బలరామయ్యగారి ‘బాలరాజు’... ఇలా మెల్లమెల్లగా అవకాశాలు వచ్చాయి. కాపురానికి ఎప్పుడు వచ్చారు? మాస్టారికి మద్రాసులో ఇల్లు దొరకడం కష్టమైంది. బ్రహ్మచారులకు, అందునా సినిమా వారికి ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. అందువల్ల మాకు కబురు చేసి ‘నీ పెళ్లాన్ని తీసుకువెళ్లు’ అని ఉత్తరం రాయించు, ఆ ఉత్తరం చూపిస్తే ఇల్లు దొరుకుతుందని చెప్పడంతో, మా అమ్మమ్మ మా బాబాయి చేత ఉత్తరం రాయించారు. 1947 సెప్టెంబరులో మా బంధువులు నన్ను కాపురానికి మద్రాసు పంపారు. ఆ ఇంటి మామ్మగారికి నేనంటే పంచ ప్రాణాలు. ఎప్పుడైనా మాస్టారు రికార్డింగ్ నుంచి రావడం ఆలస్యమైతే∙నన్ను ఆవిడ దగ్గర పడుకోబెట్టుకునేవారు. మాస్టారు వచ్చాక, ‘ఇవాళ ఇక్కడ నిద్రపోతుందిలే’ అని చెప్పేవారు. మాస్టారికి పాటల అవకాశాలు పెరిగాయి. ఇంట్లో పాటలు స్వరపరచుకోవడం కోసం తబలాలు, హార్మోనియం వాయిస్తుండేవారు. మామ్మగారు ఆ శబ్దాలకు చికాకు పడ్డారు. ‘ఈ గోల ఏంటి, ఇల్లు ఖాళీ చేసేయండి’ అన్నారు. వాళ్లకు నేను వెళ్లడం ఇష్టం లేదు. కాని మాస్టారు శబ్దం చేయడం నచ్చలేదు. అలా ఆ ఇంటి నుంచి మరో ఇంటికి మకాం మార్చాం. మీ ఆటపాటల గురించి... అది పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో మొత్తం 30 మంది ఉండేవారు. ఇంటి నిండా పిల్లలు. మాస్టారు రికార్డింగులకి వెళ్లగానే నేను ఇరుగుపొరుగు ఆడపిల్లలతో ఆడుకునేదాన్ని. పొరపాటున ఆయన కంటబడితే, ‘ఎవరైనా, ఘంటసాల గారి భార్య ఆడుకుంటోంది అంటుంటే ఎలా ఉంటుందో చెప్పు’ అనేవారు. ఒకరోజు ‘గుణసుందరి కథ’ చిత్రంలో రికార్డింగుకి వెళ్లి చాలా ఆలస్యంగా వచ్చారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండవలసి రావడంతో బిగ్గరగా ఏడ్చేశాను. ఇలా అద్దె ఇళ్లలో నాలుగేళ్లు గడిచిపోయాయి. మాస్టారి ప్రాక్టీసు వల్ల ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో, ‘మనం ఇల్లు కొనుక్కుందాం’ అని చెప్పేదాన్ని. మరి కొన్నారా? నన్ను కాపురానికి పంపుతూ మా నాన్న ‘వచ్చిన ఆదాయంలో రేపటి కోసం కొంత, ధర్మకార్యాలకు కొంత, దైవకార్యానికి కొంత డబ్బు దాచాలి’ అని చెప్పారు. నేను మద్రాసు వచ్చిన దగ్గర్నుంచి ఆయన డబ్బులన్నీ నా చేతికే ఇచ్చేవారు. నేను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, మూడు సంవత్సరాలలో 12 వేల రూపాయలు దాచాను. ఆ డబ్బుతోనే ఇల్లు కొందామన్నాను. పదివేల రూపాయలలో ఒక ఇల్లు చూశాం. అది బాగా చిన్నది కావడంతో వద్దనుకున్నాం. అప్పుడు మాస్టారు, ‘ఇంటి విషయం నాకు వదిలై, నేను చూస్తాను’ అన్నారు. ఇలా అన్న కొద్దిరోజులకే ఉస్మాన్ రోడ్లో 40 వేలకు ఇల్లు కొన్నానని చెప్పారు. 30 వేల రూపాయలు అప్పు అంటే నాకు భయం వేసింది. కాని చాలా తొందరగానే అప్పు తీరిపోయింది. ఆ ఇల్లే మాస్టారికి కలిసొచ్చిందేమో కదా! 1950 జూన్ 20న గృహప్రవేశమయ్యాక అన్నీ కలిసొచ్చాయి. విజయా నాగిరెడ్డిగారు కాంపౌండ్ వాల్ కట్టించారు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో భానుమతి గారి భర్త రామకృష్ణ మా కోసం కారు బుక్ చేశారు. అదే సంవత్సరం డిసెంబరు 15వ తేదీ బాబు పుట్టాడు. అప్పటి జ్ఞాపకాలు చెప్పండి పెద్ద అబ్బాయి పుట్టిన పదోరోజుకి 100 రూపాయలు పెట్టి రోజ్‌వుడ్‌తో తయారు చేసిన ఉయ్యాల తెచ్చారు మాస్టారు. అబ్బాయి బారసాల నాడు తన ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నవారినందరినీ పిలిచి వేడుక చేశారు. అప్పటికి విజయా కంపెనీలో పని చేస్తున్నాం కనుక ఆ పేరు వచ్చేలా బాబుకి ‘విజయకుమార్’ అని పేరుపెట్టుకున్నాం. ఆ రోజు ఆయన కొన్న ఉయ్యాలను ఈ రోజు మా మునిమనవరాలికి కూడా వాడుతున్నాం. పెద్దబాబు పుట్టిన ఏడేళ్లకు మా చిన్నబాబు రత్నకుమార్ పుట్టాడు. పెద్ద అమ్మాయి పుట్టిన నాలుగు రోజులకి మాస్టారు ‘కాళిదాసు’ చిత్రంలో శ్యామలా దండకం పాడారు. అందువల్ల ఆమెకు ‘శ్యామల అని పేరు పెట్టాం. రెండో అమ్మాయికి – రకరకాల పేర్లు రాసి చీటీలు తీశాం. ఎక్కువ మంది తీసిన చీటీలో ‘సుగుణ’ పేరు ఉండటంతో సుగుణ అని పేరుపెట్టాం. మూడో అమ్మాయి పుట్టే నాటికి ఆంధ్రప్రభ వారపత్రికలో ‘శాంతినికేతన్’ అనే సీరియల్ వచ్చేది. అందుకని శాంతి అని పేరు పెట్టాం. మాస్టారు ఇంటి విషయాలు పట్టించుకునేవారా? ఆయనకు ఇంటి విషయాలు పట్టించుకోనవసరం లేకుండా అన్నీ నేనే చూసేదాన్ని. ఆయన బయటకు వెళ్లేటప్పుడు అన్నీ నాకు వివరాలన్నీ చెప్పేవారు. ఆయన కోసం ఎవరైనా ఫోన్ చేస్తే, వాళ్లకి తప్పుడు వివరాలు చెప్పకూడదనేది ఆయన ఉద్దేశం. మాస్టారు మంచి పాట పాడిన రోజున ఇంటికి వస్తూనే పాట వినిపించేవారు. బట్టలు మార్చుకోమని చెబుతున్నా వినిపించుకునేవారు కాదు. నన్ను ఆప్యాయంగా ‘రాజీ’ అని పిలిచేవారు. ఎందుకు అలా పిలుస్తారు అని ఎన్నడూ నేను అడగలేదు. ఆయన పాటల్లో మీకు ఏవి ఇష్టం? ఆయన పాడిన పాటలన్నీ నాకు ఇష్టమే. ఒక గంపెడు మల్లెపూలు తీసుకువచ్చి, ఇందులో ఏ పువ్వు ఇష్టం అంటే ఏం చెప్తాను. అన్నీ మల్లెలే, అన్నీ ఇష్టమే. మాస్టారు ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని ‘నను పాలింపగ నడచీ వచ్చితివా’ పాట పాడి వచ్చాక అందులోని ‘ఖైదీ’ పదాన్ని ఎన్నిరకాలుగా ప్రయోగించారో వివరించారు. ‘జయభేరి’ చిత్రంలో ‘మది శారదాదేవి మందిరమే’ పాట పాడుతుంటే ఆ పాటలో గురుస్థానంలో ఉన్న నాగయ్యగారిని చూస్తుంటే, తన గురువులు పట్రాయని సీతారామశాస్త్రిగారిని చూస్తున్నట్లు భావించేవారినని చెప్పేవారు. మీ ఇంటికి ఎవరెవరు వచ్చేవారు? మా ఇంటికి సంగీత విద్వాంసులందరూ వస్తూండేవారు. ఎవరు వచ్చినా కనీసం వారం రోజులు మా ఇంట్లోనే ఉండేవారు. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడుగారు ఎనిమిది మందితో కలిసి మా ఇంట్లో పదిహేను రోజులు ఉన్నారు. అన్ని రోజులూ వారికి కావలసినవన్నీ అభిమానంగా వండేదాన్ని. బడే గులామ్ అలీ ఖాన్ కూడా తోటి విద్వాంసులతో మా ఇంటికి వచ్చినప్పుడు వారందరికీ చపాతీలు చేసి పెట్టాను. మాస్టారుతో గడిపిన మధురక్షణాలు ఎన్నని చెప్పగలను. ఇప్పుడు కూడా ఆయనతోనే గడపాలని ఉంది. ఆయన పనులన్నీ చూసిపెట్టాలని ఉంది. – సంభాషణ: వైజయంతి పురాణపండ పద్మశ్రీ సమ్మతమేనా! ఒకరోజున ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది... ‘మేం కేంద్ర ప్రభుత్వం తరఫున ఫోన్ చేస్తున్నాం, ఘంటసాల మాస్టారికి పద్మశ్రీ ఇవ్వాలనుకుంటున్నాం, సమ్మతమేనా!’ అని అడిగారు. అరగంటలో చేయండి, మాస్టారుని అడిగి చెబుతాను అన్నాను. మాస్టారు విజయా స్టూడియోకి రికార్డింగుకి వెళ్లారు. సాధారణంగా నేను స్టూడియోలకి ఫోన్ చేయను. కాని మళ్లీ అరగంటలో ఫోన్ చేసేటప్పటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మాస్టారికి ఫోన్ చేసి, ‘మీకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందచేయాలనుకుంటోంది, సమ్మతమేనా! అని అడుగుతున్నారు’ అన్నాను. ఆయన మౌనంగా నవ్వారు. ఆ మౌనాన్ని నేను అంగీకారంగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు ఆయన ఇంటికి వచ్చేసరికి ఇంటినిండా పూల బొకేలు వచ్చి చేరాయి. ఆయన మెడ నిండా దండలతో పెళ్లికొడుకులా వచ్చారు. భగవద్గీత రికార్డింగు భగవద్గీత రికార్డింగుకి మాస్టారితో స్టూడియోకి నేను కూడా వెళ్లాను. ఆ స్టూడియో చూసినవారంతా, ఇలాంటి స్టూడియోలోనా మాస్టారు ఇంత అద్భుతంగా పాడారు అనుకునేవారు. ఆయనతో ఎన్నడూ నేను రికార్డింగులకి వెళ్లలేదు. కాని ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆయన వెంట వెళ్లవలసి వచ్చింది. నన్ను చూస్తూనే, అక్కడి వారంతా, ‘అమ్మగారు వచ్చారు’ అంటూ సంబరపడ్డారు...’’ అంటూ కంట నీరు పెట్టుకున్నారు. భగవద్గీత పేరు చెబితే నాకు మాటలు రావు, ఇప్పుడు ఈ 87 ఏళ్ల వయసులో ఈ బాధను తట్టుకోలేను’ అంటూ కళ్లు తుడుచుకున్నారు సావిత్రి. మాస్టారు మచ్చలేని మనిషి. ఆయన కన్నుమూసినప్పుడు మిన్ను విరిగి నెత్తిమీద పడ్డట్లయింది. కుటుంబం మొత్తం కుంగిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా జీవితంలో ఒక అదృష్టం ఏంటంటే, మాస్టారు నాకు తెలియకుండా ఒక్క పని కూడా చేయలేదు. నాకు ఇన్కమ్ టాక్స్, వెల్త్ టాక్స్ వంటి బయటి వ్యవహారాలు తెలియవు. ఆయన లేకపోవడంతో ఆ పనులన్నీ ఆ భగవంతుడే నాకు నేర్పాడు. -
నా లక్ష్యం అదే: కీర్తీసురేశ్
సాక్షి, సినిమా: ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని సాధించుకోవడానికి కృషి, పట్టుదల చాలా అవసరం. అలా కీర్తీసురేశ్ నటనే లక్ష్యంగా సినీ రంగప్రవేశం చేసింది. నటించడానికి ఇంట్లో అంగీకరించకపోయినా, వారిని ఒప్పించి ఇప్పుడు మెప్పు పొందుతోంది. తొలి చిత్రం నిరాశ పరిచినా దాన్ని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన ఈ యువ నటి రెండో చిత్రం నుంచే విజయ పరంపరను కొనసాగిస్తోంది. అయితే మహానటి సావిత్రి జీవిత చరిత్రలో ఆమె పాత్రను పోషించి అద్భుత అభినయంతో సావిత్రిని కళ్ల ముందించిందనే చెప్పాలి. విమర్శకులను సైతం మెప్పించిన కీర్తీసురేశ్‌కు మరోసారి సావిత్రి పాత్రలో నటించే అవకాశం తలుపు తట్టిందంటే ఆమె నటిగా ఎంత పరిణితి చెందిందో, ఎంత అంకిత భావంతో నటించిదో అర్థం చేసుకోవచ్చు. అవును తెలుగులో ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో సావిత్రి పాత్రకు ఆ చిత్ర దర్శకుడు క్రిష్ కీర్తీసురేశ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా కీర్తీసురేశ్‌కు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ బ్యూటీ స్టార్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతోంది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడిందట ఈ అమ్మడు. అర్థం కాలా? అదేనండీ కీర్తీ తన పారితోషికాన్ని పెంచేసిందట. సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. అయితే ఇదంతా వదంతులు మాత్రమేనని కీర్తీసురేశ్ కొట్టి పారేస్తోంది. మరి ఈ బ్యూటీ మాటేమిటో చూద్దామా! నేను డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ రంగంలోకి రాలేదు. మంచి కథా చిత్రాల్లో నటించి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నదే ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం. దాని వైపే నా పయనం సాగుతోంది. శ్రమకు తగ్గ పారితోషికం, అది చిన్న మొత్తం అయినా సంతృప్తిగా లభిస్తే చాలు అంటోంది. -
ముద్దు సన్నివేశాల్లో నో చెప్పకూడదన్నారు
తమిళసినిమా: ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్లో నటి కీర్తీసురేశ్ పేరే నానుతోందని చెప్పవచ్చు. మహానటి చిత్రం తరువాత ఈ సుందరి రేంజే మారిపోయింది. మహానటి సావిత్రినే వెండితెరపై మరపించిన కీర్తీసురేశ్ ఆ తరువాత తెలుగులో ఒక్క చిత్రం కూడా అంగీకరించలేదు. అయితే అందుకు కారణాన్ని కూడా కీర్తి వివరించింది. తమిళంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్‌తో సండైకోళి–2, విక్రమ్ సరసన సామి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో మరోసారి సావిత్రిగా జీవించే అవకాశం ఈ బ్యూటీనే వరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కీర్తీసురేశ్ ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో పక్కింటి అమ్మాయిగానే కనిపించింది. ఎలాంటి లిప్ లాక్ సన్నివేశాల్లోనూ, గ్లామరస్ పాత్రల్లోనూ నటించలేదు. దీంతో చుంభన దృశ్యాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు ఈ అమ్మడు బదులిస్తూ, తాను నటించడానికి సిద్ధం అయినప్పుడే కమర్శియల్ చిత్రాల హీరోయిన్లకు గ్లామర్ విషయంలో ఎల్లలు ఉండకూడదూ, ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి తయారుగా ఉండాలి, ముద్దు సన్నివేశాల్లోనూ నటించాల్సి ఉంటే నో అని చెప్పకూడదు అని చెప్పారంది. అయితే ఇంత వరకూ తాను నటించిన ఏ చిత్రంలోనూ అలాంటి సన్నివేశాలు చోటు చేసుకోలేదని చెప్పింది. తాను నటించిన చిత్రాల దర్శకులెవరూ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించమని బలవంతపెట్టలేదని చెప్పింది. ఈ విషయంలో తాను లక్కీనేనని పేర్కొంది. నిజానికి తకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది. కారణం తనకు కాస్త సిగ్గు ఎక్కువేనని అంది. ప్రేమ సన్నివేశాల్లో నటించడానికే బిడియ పడతానని చెప్పింది. తాను గ్లామరస్‌గా నటించడానికి నిరాకరించడం వల్లే మహానటి చిత్రం తరువాత అ వకాశాలు తగ్గాయనే ప్రచారంలో నిజం లేదని, తమిళంలో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నానని కీర్తీసురేశ్ పేర్కొంది. -
పూరీతో జన్మజన్మల బంధం..
రెడీ, స్టార్ట్.. కెమెరా, యాక్షన్.. అంటూ క్షణం తీరిక లేకుండా 1500 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశారు. రంగుల ప్రపంచంలో వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. చిత్రసీమలో దాదాపు మూడు తరాల హీరోల సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆ రంగుల ప్రపంచానికి దాదాపుగా దూరమయ్యారు. ఇప్పుడు ఆధ్మాత్మికం వైపు తన పయనాన్ని ప్రారంభించారు. మరో జన్మంటూ ఉంటే.. రమాప్రభగానే పుట్టాలని ఉందని, ఈ మదనపల్లె ముద్దుబిడ్డ సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మదనపల్లె సిటీ : వెండితెర సహాయ నటిగా.. దశాబ్దాల పాటు.. తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సీనియర్ నటి రమాప్రభ ప్రస్తుతం సాయిసేవలో తరిస్తున్నట్లు తెలిపారు. గతంలో హైదరాబాదు జూబ్లిహిల్స్‌లో ఉన్న ఆమె గత ఏడాది నుంచి స్వస్థలమైన మదనపల్లెలోనే ఉంటున్నట్లు చెప్పారు. తన సినీరంగ అనుభవాలు ఆమె మాటల్లోనే.. వెండితెరతో ఆరు దశాబ్దాల అనుబంధం.. జిల్లాలోని వాల్మీకిపురం మాఊరు. నాన్న గంగిశెట్టి. సాధారణ కుటుంబం. మా అమ్మ,నాన్నకు మేం 13 మంది సంతానం. 1947 మే 5న నేను జన్మించాను. ఊటీలో ఉంటున్న మా మేనమామ కృష్ణరావు ముఖర్జీకి పిల్లలు లేనందున నన్ను దత్తత తీసుకున్నారు. ఊటిలోనే నా బాల్యం గడిచింది. అనంతరం ఆయన తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నారు. నేను కూడా ఆయనతో పాటే చెన్నై వెళ్లాను. ఓ సందర్భంలో దర్శకులు ప్రత్యగాత్మ నన్ను, నా టాలెంట్‌ను చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. దీంతో 1963లో చిలకాగోరింక సినిమాలో నాకు మొదటి అవకాశాన్ని కల్పించారు. అలా ప్రారంభమైన నా సినీప్రస్థానం 55 సంవత్సరాల పాటు ఏకధాటిగా కొనసాగింది. దాదాపు 1500 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లలో నటించాను. సినీరంగంలో వెండితెరపై, వెనుక అనేక ఎత్తుపల్లాలు చూశాను. దాదాపు మూడు తరాల హీరో, హీరోయిన్లతో నటించాను. తరువాత సినీరంగంలో కొద్దిరోజుల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మాఅన్నయ్య, ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం. రణం, పండుగ తదితర సినిమాల్లో బామ్మ పాత్రలు పోషించాను. అప్పటి పరిస్థితుల బట్టి జూబ్లీహిల్స్‌లో ప్లాటు కొన్నా. హైదరాబాదు మన ఊరు కాదు కదా.. షూటింగ్‌కు వెళ్లిన ఊరు. ఎందుకో రావాలనిపించి స్వస్థలం మదనపల్లెకు వచ్చేశా. నాపేరుతో అంటూ ఏమీ లేవు. నాకు ఎక్కడ ప్లాట్లు లేవు. ఇప్పుడు నా మçనసు ఆ«ధ్యాత్మికం వైపు మరలింది. దీంతో రంగుల ప్రపంచాన్ని వదిలేసి సొంత జిల్లాకు వచ్చేశాను. మదనపల్లె రూరల్ మండలం గంగన్నగారిపల్లెలో మాపెద్ద తమ్ముడి ఇంటిలో ఉంటున్నాను. మదనపల్లె పట్టణంలోచిన్న తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. పూరీతో జన్మజన్మల బంధం సినీరంగం నుంచి దాదాపు పూర్తిగా సంబంధాలు వదిలేశాక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ నన్ను ఆదుకున్నారు. పూరిబాబుతో నాకు జన్మజన్మల బంధం. ప్రస్తుతం నాకు చివరి స్టేజి, సినిమాలు లేవు. ఎక్కడో మదనపల్లెలో ఉన్నా. అయినప్పటికీ నాకు డబ్బులు పంపించాలన్న తపన ఆయనలో ఉంది. గోపీచంద్ నటించే ఆరు అడుగుల బుల్లెట్ సినిమా షూటింగ్లో అనుకోకుండా పూరిబాబును కలసిననప్పుడు నా సెల్ నంబర్ , పుట్టిన తేదీ అడిగారు. అప్పటి నుంచి ప్రతి నెలా 5వ తేదీలోపు నెలకు రూ.20 వేలు పంపుతున్నారు. జయలలిత మంచి స్నేహితురాలు.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాకు మంచి స్నేహితురాలు. షూటింగ్లో ఇద్దరు కలిసి మెలసి ఉండేవాళ్లం. నేను అప్పట్లో నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. జయలలిత ఎప్పుడూ నా గురించి అందరినీ అడిగేవారు. బయటకు వెళ్లాలంటే ఫోన్లో ‘ఎన్నా.. వరిలియా’ (ఏం రాలేదా..) అని అడిగేవారు. సీఎం అయ్యాక ఫోన్ చేస్తే మరో మహిళ (శశికళ) ఫోన్ ఎత్తి ఎవరు..? అనేవారు. నాకు కొంచెం అలగుడు ఎక్కవ. అది అహంకారమో ఈగోనో.. తెలియదు. ఈ కారణంగానే మా ఇద్దరి మధ్యదూరం పెరిగింది. ఏఎన్ఆర్ మరణం జీర్ణించుకోలేను.. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మృతి ఇప్పటికీ జీర్ణించుకోలేను. ఆయన మృతి చెంది న విషయాన్ని.. వాణిశ్రీ ఫోన్ చేసి చెప్పారు. నేను అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. కొందరు నన్ను రావద్దని అవమానించారు. నా మనసును అకారణంగా గాయపరిచారు. ఎస్వీ రంగారావు మా డాడీ.. ఎస్వీ రంగారావును నేను డాడీ అని అనేదాన్ని. రాజబాబు నేనూ కలిసి దాదాపు 300 సినిమాల్లో నటించాం. ఒకానొక దశలో మేమిద్దం కలిసి నటించిన సినిమాలు వరుసగా ఉండేవి. రాజబాబును రేయ్.. అని అప్యాయంగా పిలిచేదాన్ని. రాజబాబు మృతితో నేను బాగా దిగలుపడ్డాను. సూర్యకాంతం అంటే గౌరవం, చాలా మంచి ఆవిడ. మహానటితో మంచి సంబంధాలు.. సావిత్రమ్మతో నాకు మంచి సంబంధాలు ఉన్నా యి. షూటింగ్ విరామంలో డ్రైవర్లు, పనివాళ్ల ఇళ్లకు వెళ్లేవాళ్లం. మహానటి సినిమా చూడలేదు. చాలా మంది ఫోన్ చేశారు. ఆ సినిమాలో.. మ్యూజిక్, పాటలు ఏంటండి..? మహానటి అన్న పేరు పెట్టిన తరువాత ఆమెతో అనుబంధం ఉన్నవారిని సంప్రదించకుండా సినిమా తీశారు. మాహానటి సినిమా కేవలం బిజినెస్. ఇక సావిత్రమ్మ మహామొండి. చాలా దగ్గరగా ప్రేమించే వాళ్లును కూడా పో.. అనేది. అందుకే చాలా మంది ఆమెకు దూరమయ్యా రు. పేద సినీ కళాకారులను ఆదుకునేందుకు అప్పటి ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్ న్యూజెర్సీలో గంధంమాలను వేలం వేశారు. దాన్ని కొనుగోలు చేసేందుకు సావిత్రమ్మ మైలాపూర్‌లో ఓ ఇళ్లును రాసిచ్చేశారు. ఇది ఆమె దాతృత్వానికి నిదర్శనం. కృష్ణ నిజజీవితంలోనూ సూపర్‌స్టారే.. సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరపైనే కాదు నిజజీవితంలోనూ సూపర్‌స్టారే. ఆయన వ్యక్తిత్వం ఉన్నతమైంది. ఆ రోజుల్లో రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు చాలా పెద్ద మనసుతో స్పందించే వారు. తన వంతు సహాయాన్ని బాధితులకు ప్రభుత్వం ద్వారా అందించేవారు. ఇంతమంది గొప్పవారితో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. మనో జన్మంటూ ఉంటే.. రమాప్రభగానే పట్టాలని, ప్రేక్షకులను అలరించాలని ఉంది. సాయిబాబా ఇష్టం.. నాకు షిరిడీ సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఆయన భక్తురాలిని. ఇంటి ఆవరణలోనే బాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నా. రోజూ ప్రత్యేక పూజలు చేయడం అలవాటుగా మార్చుకున్నా. అందులోనే నాకు మనశ్శాంతి లభిస్తోంది. ఇంటిలో మాపెద్ద తమ్ముడు, పి ల్లలు అందరూ ఉంటారు. నేను వారితోకలిసినా నాకంటూ ఓ ప్రత్యేకమైన పెంట్ హౌస్ నిర్మించుకుని ఒంటరిగానే ఉంటున్నా ను. ఇందులోనే నాకు మానసిక ప్రశాంతత. సమయం ఉన్నప్పుడు కుట్లు, అల్లికలు చేస్తా. పెయింగ్ అంటే ఇష్టం. ఎక్కిరాల భరద్వాజ నా ఆధ్యాత్మిక గురువు. ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నా. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు షిర్డీకి వెళ్తాను. -
వెయిటింగ్లో దర్శక నిర్మాతలు..
తమిళ సినిమా: యువ నటి కీర్తీసురేశ్ గురించి ఇప్పుడు చర్చ చాలానే జరుగుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్ తిలగం చిత్రంలో కీర్తీసురేశ్ నటనను ప్రశంసించని వారుండరంటే అతిశయోక్తి కాదు. నడిగైయార్ తిలగం చిత్రం తరువాత కీర్తికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఆమె యమ బిజీ అయిపోతుంది లాంటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వేరే రకంగా ప్రచారం జరుగుతోంది. అదేంటంటే కీర్తీసురేశ్ కొత్త చిత్రాలను ఒప్పుకోవడం లేదు. పారితోషికం పెంచేసింది లాంటి వదంతులు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటికి కీర్తీ ఎలా బదులిచ్చిందో చూద్దాం. నడిగైయార్ తిలగం చిత్రాన్ని ఒప్పుకోవడానికి ముందే నేను తమిళంలో విజయ్, విక్రమ్, విశాల్ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించడానికి అంగీకరించాను. అయితే నడిగైయార్ తిలగం చిత్రంలో నేను టైటిల్ పాత్రలో నటించడంతో ఆ చిత్రానికి అధిక కాల్షీట్స్ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నాకోసం ఆ మూడు చిత్రాల వారు చాలా సహకరించారు. విజయ్‌తో నటిస్తున్న సర్కార్ చిత్రం కోసం కాల్షీట్స్ కేటాయించినా, నడిగైయార్ తిలగం చిత్రం పూర్తి చేయాల్సి ఉండటంతో సర్కార్ చిత్ర యూనిట్ నా కోసం చాలా రోజులు వెయిట్ చేశారు. దీంతో ఆ చిత్రం పూర్తయిన తరువాత సర్కార్ చిత్రం షూటింగ్‌కు సిద్ధం అయ్యాను. ఆ తరువాత విశాల్‌తో నటిస్తున్న సండైకోళి–2, విక్రమ్‌తో నటిస్తున్న సామి స్క్వేర్ చిత్రాలు వరుసగా పూర్తి చేసిన తరువాత కొత్త చిత్రాలను అంగీకరించాలన్న నిర్ణయం తీసుకున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం కథ చెప్పడానికి వస్తున్న దర్శక నిర్మాతలను వెయిటింగ్లో పెడుతున్నాను. చేతిలో ఉన్న మూడు చిత్రాలు పూర్తి చేసిన తరువాత కొత్త చిత్రాలపై దృష్టి సారిస్తాను. ఇక పారితోషికం గురించి జరుగుతున్న ప్రచారం గురించి పట్టించుకోను. నా స్థాయికి తగ్గ పారితోషికాన్ని నిర్మాతలే ఇస్తున్నారు అని బదులిచ్చారు కీర్తి. -
'మహానటి’.. ఆ నలుగురు
బంజారాహిల్స్ : తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అద్భుతావిష్కరణ. ‘మహానటి’కిమహోన్నత ‘రూప’కల్పన. కీర్తి సురేష్‌లో సావిత్రిని పరకాయ ప్రవేశం చేసినట్లు తీర్చిదిద్దిన వైనం. ఆ నలుగురు సాంకేతిక నైపుణ్యానికితార్కాణం. ప్రేక్షకులను రంజింపజేసి.. మహానటి చిత్ర విజయంలో తమదైన పాత్ర పోషించారు వారు. కీర్తి సురేష్‌కు సావిత్రి పోలికలు, లుక్‌ను తీసుకురావడానికి నలుగురు సాంకేతిక నిపుణులు తెర వెనుక చేసిన కృషి అంతా ఇంతా కాదు. సావిత్రి నటించిన సినిమాలను ఒకటికి పదిసార్లు చూశారు. ఆమె హావభావాలు, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ ఒంటబట్టించుకున్నారు. కీర్తి సురేష్‌ను తెరపై జీవింపజేశారు. సావిత్రి రూపురేఖలను అచ్చుగుద్దినట్లు తీర్చిదిద్దడానికి కాస్ట్యూమర్ బొడ్డు శివరామకృష్ణ, హెయిర్‌స్టైలిస్ట్ రజబ్ అలీ, కాస్ట్యూమ్ స్పెషలిస్ట్ ఇంద్రాక్షి, మేకప్ మెన్ మూవేంద్రన్ కృషి అపురూపమైనది. వీరంతా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. మహానటి సినిమాకు ఎలా కష్టపడింది, ఆ సినిమా ఏ మేరకు పేరుతీసుకొచ్చిందనే విషయాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు. 190 హెయిర్ స్టైల్స్ మార్చాం నాది ముంబై. ఐదేళ్లుగా హెయిర్ స్టైలిస్ట్‌గా సినిమాల్లో పనిచేస్తున్నాను. అనుకోని వరంలా మహానటి సినిమాకు పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించడానికి సుమారు 20 సినిమాలు నెల రోజుల పాటు చూడాల్సివచ్చింది. మూగ మనసులు సినిమాను ఆరు రోజులు ఏకధాటిగా చూశా. అందులో సావిత్రి హెయిర్ స్టైల్‌ను అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌కు తీసుకొచ్చాను. ఒకే విగ్గును 190 హెయిర్ స్టైల్స్‌గా మార్చాం. సావిత్రి ఒక్కో సినిమాలో ఒక్కో హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకునేవారు. ఆమెది పొడవాటి జుట్టు. కీర్తి సురేష్‌ది తక్కువ జుట్టు. దీంతో విగ్గుతోనే సావిత్రిని తెరపై సృష్టించాల్సి వచ్చింది. ఇంకో వైపు సావిత్రి జుట్టు బాగా ఉంటే కీర్తి సురేష్‌ది సిల్కీ హెయిర్. దీంతో సావిత్రి జుట్టు తీసుకురావడానికి హెయిర్‌స్టైల్స్‌ను రకరకాలుగా మార్చాల్సి వచ్చింది. నా కెరీర్లోనే ఇదో అద్భుత అవకాశం. – రజబ్ అలీ, హెయిర్ స్టైలిస్ట్ 120 రోజుల కృషి ఫలితం ఇది.. మహానటి సినిమాకు 120 రోజుల పాటు పనిచేశా. పాత సినిమాలను ఔపోసన పట్టాను. ముఖ్యంగా నర్తనశాల, గుండమ్మకథ సినిమాలను పది రోజుల పాటు రేయింబవళ్లూ చూశాను. సావిత్రి హావభావాలు, ఆమె డ్రెస్సింగ్, ఆమె నడక, ఆమె కళ్లు ఎగరేసే తీరు ఇవన్నీ పరిశీలించాను. ఇంకో వైపు సావిత్రి చీర ఎలా కట్టుకుంటుంది, ఎలా నడుస్తుంది అన్నది ఈ సినిమాకు ఇంపార్టెంట్. ఇంకోవైపు సావిత్రి ఐనెక్ బ్లౌజ్‌లు వేసుకునేది. ఇప్పుడవి లేవు. ఆ తరహా బ్లౌజ్‌లను కుట్టించి సావిత్రి లుక్‌ను తెచ్చేందుకు చాలా కష్టపడ్డాను. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రి లాంటి మహానటిని తెరమీద కీర్తి సురేష్‌లో తీర్చదిద్దడానికి కృషి చేయడం సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి సావిత్రిని తెరపై చూపించాలంటే ఎంత కష్టమో తెలిసింది. – బొడ్డు శివరామకృష్ణ, కాస్ట్యూమర్ చీరకట్టుతోనే సావిత్రి అందం సావిత్రి అందమంతా చీరకట్టులోనే ఉండేది. సంప్రదాయ తెలుగు యువతిని చూడాలంటే సావిత్రిని చూడాల్సిందే. కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించాలంటే అప్పటి ఆమె కట్టు, బొట్టు బాగా ఆకళింపు చేసుకున్నా. ఇంకేముంది తగిన కాస్ట్యూమ్‌ను తగిన రీతిలో తీర్చిదిద్దాం. ఇందు కోసం రెండు నెలల పాటు కష్టపడ్డాం. సావిత్రి నడిచే విధానం, ఆమె చీరకట్టు గమనించడానికి చాలా రోజులు పట్టింది. అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌ను తెరపై చూపించాలంటే కాస్ట్యూమ్‌కు ఉన్న ప్రాధాన్యం గమనించాను. ఈ సినిమా ఇంత హిట్ కావడం నా జీవితంలోనే మరిచిపోలేనిది. ఇలాంటి సినిమాకు పనిచేయడం గర్వంగా ఉంది. – ఇంద్రాక్షి, స్టైలిస్ట్ ఆమె కళ్లతోనే భావాలు పలికించేవారు మహానటి సావిత్రి సినిమాను కీర్తి సురేష్‌తో తియ్యడం అందులో నేను మేకప్ మెన్‌గా ఉండటం అదృష్టమనే చెప్పాలి. సావిత్రి నటించిన 15 సినిమాలు రేయింబవళ్లూ చూసి ఆమె మేకప్‌ను గమనించాను. కీర్తి సురేష్‌కు ఎలా మేకప్ వేస్తే సావిత్రి లుక్ వస్తుందో అంచనాకు వచ్చాను. బ్లాక్ అండ్ వైట్ సీన్స్, కలర్ సీన్స్‌లో కీర్తి సురేష్ ఎలా ఉంటుంది, ఆ మేరకు మేకప్ ఎలా వేయాలి అన్నదానిపైనే దృష్టి సారించాను. సావిత్రి కళ్లు బాగుంటాయి. అవే కళ్లను కీర్తి సురేష్‌కు తీసుకురావాలంటే 20 రకాల వేరియేషన్స్‌ను తీసుకొచ్చాం. ముఖ్యంగా ఐబ్రోతోనే కీర్తి సురేష్‌కు సావిత్రి లుక్ అక్షరాలా ఒంటబట్టింది. సినిమా ఇంతగా హిట్ అవుతుందని మాకు షూటింగ్ సమయంలోనే తెలిసింది. ఎందుకంటే ఆ సినిమాకు పడుతున్న కష్టం దగ్గరుండి గమనించాను. – మూవేంద్రన్, మేకప్‌మెన్ -
ఒక నటుడిని గుడ్డిగా ప్రేమించాను..
తమిళసినిమా: సెలబ్రిటీల వ్యాఖ్యలకు, చర్యలకు మీడియా అధిక ప్రాముఖ్యత ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదీ సమంత లాంటి అందాల భామ, అగ్ర కథానాయకి గురించిన సంగతులైతే సామాజిక మాధ్యమాలు పట్టించుకోకుండా ఉంటాయా, ఇక నిజాలను నిర్భయంగా వెల్లడించడానికి ఎప్పుడూ సందేహించని నటి సమంత యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం తన నట ప్రయాణం కొనసాగుతుందని ముందుగానే వెల్లడించిన ఈ క్రేజీ నటి అదే విధంగా నటిస్తున్నారు. అంతే కాదు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు కూడా. సాధారణంగా పెళ్లి అయిన తరువాత హీరోయిన్లు తమ గత ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడరు. సమంత అందుకు విరుద్ధం అనే చెప్పాలి. ఇటీవల ఒక భేటీలో తన గత ప్రేమ గురించి ప్రస్తావించారు. ఆమె ఏమన్నారో చూద్దాం. మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం) చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర కథ నా జీవితంలో జరిగినట్లే భావించాను. అంటే నేనూ ఒక నటుడిని గుడ్డిగా ప్రేమించాను. ఆ తరువాత అతని నుంచి విడిపోయాను. అలా కాకుంటే నా జీవితం కూడా సావిత్రి జీవితంలా అయ్యేది. నా టైమ్ బాగుండడంతో నాగచైతన్యను కలిశాను అని సమంత పేర్కొన్నట్లు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇలాంటి విషయాలు చెప్పడానికి నిజంగా చాలా ధైర్యం కావాలి. అది సమంతలో కట్టలు కట్టలుగా ఉందని అర్థం అవ్వడం లేదూ! ఈ సంచలన నటి తాజాగా యూటర్న్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రం అన్నది గమనార్హం. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం సమంత కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళుతుందో చూడాలి. -
సావిత్రికి ‘చిత్రకళా’ నివాళి
విజయనగర్‌కాలనీ: మహానటి సావిత్రికి లలిత కళల విద్యార్థులు వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. మాసబ్‌ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ప్రాంగణంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో గురువారం క్రియేటివ్ మల్టీ మీడియా కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్ చిత్రకళా విభాగం విద్యార్థులు ఏర్పాటు చేసిన దివంగత నటి సావిత్రి చిత్ర కళాఖండాలను ‘మహానటి’ డైరెక్టర్ నాగఅశ్విన్, నిర్మాత ప్రియాంకదత్‌లు ప్రారంభించారు. సావిత్రి పెన్సిల్ స్కెచ్‌లు, పెయింటింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నాగఅశ్విన్, ప్రియాంకదత్‌లు నిర్మాత మాట్లాడుతూ.. మహానటి చిత్రానికి తాము ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన మహానటి సావిత్రి చిత్రాలు విద్యార్థుల ప్రతిభకు దర్పణం పడుతున్నాయన్నారు. ఈ చిత్రాలు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ‘మా’ అసోసియేషన్‌కు అందజేయనున్నట్లు క్రియేటివ్ మల్టీ మీడియా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ బి.రాజశేఖర్ తెలిపారు. ప్రదర్శనలో జూన్ 2 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిత్రాలను తిలకించవచ్చని సమన్వయకర్త వెంకట్ చౌదరి తెలిపారు. కార్యక్రమంలో ఫైనార్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎన్.వికాస్, పెయింటింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రీతి సంయుక్తలతో పాటు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చిన్నప్పటి ‘సావిత్రి’ నా మనుమరాలే..
తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తున్నంతకాలం తానూ గుర్తుంటానని ‘మహానటి’లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ అన్నారు. ‘మహానటి’ సినిమా విజయవంతమైన సందర్భంగా చేపట్టిన కృతజ్ఞతా పర్యటనలో భాగంగా చిత్రం యూనిట్ ఆదివారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. నటకిరీటి రాజేంద్రప్రసాద్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు థియేటర్లోప్రేక్షకుల్ని కలుసుకున్నారు. ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తున్నంతకాలం తానూ గుర్తుంటానని ‘మహానటి’లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ అన్నారు. ‘మహానటి’ విజయవంతమైన సందర్భంగా చిత్రం యూనిట్ కృతజ్ఞతా పర్యటన చేపట్టింది. ఆదివారం స్థానిక జేఎన్‌రోడ్‌లోని ఎంఆర్ఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ దర్శకుడు నాగ్అశ్విన్ ఆలోచనల నుంచే ఈ సినిమా వచ్చిందన్నారు. చిత్రనిర్మాణంలో ప్రియాంకదత్, స్వప్నదత్ ఎంతో సహకరించారన్నారు. టెక్నీషియన్లు అద్భుతంగా పనిచేశారని, సమంత, దుల్కర్, విజయ్ దేవరకొండతో పాటు సహనటులు ఎంతో ప్రతిభ కనబరిచారని అన్నారు. ముఖ్యం గా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియేల్ అ ద్భుతమైన ప్రతిభను కనబరిచారన్నారు. మహానటిలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ స్వంత తండ్రిలా ప్రోత్సహించారని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. సావిత్రి పాత్ర ను ఇచ్చిన నాగ్ అశ్విన్, నిర్మాతలతో పాటు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మహానటి’పై తెలుగువారి ప్రేమేవిజయానికి మూలం దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ తెలుగువారికి సావిత్రిపై ఉన్న ప్రేమే మహానటిని పెద్ద విజయవంతం చేసిందన్నారు. ఈసినిమా రూపకల్పనలో ఏదో శక్తి ముందుండి నడిపించిందని నమ్ముతున్నానన్నారు. సావిత్రి స్టార్ పవర్ ఎంతో 40 ఏళ్ళ తర్వాత కూడా మహానటి సినిమా రుజువు చేస్తోందన్నారు. మహానటి సావిత్రి జీవితం ఒక విజయవంతమైన సినిమాతో ముగిసి ఉంటే బాగుంటుందన్న కోరికతోనే ఈ సినిమా రూపొందించానన్నారు. 40 సంవత్సరాల జీవితకథను మూడు గంటల్లో చూపించేందుకు స్క్రీన్‌ప్లే రాయడమే చాలా కష్టంగా అనిపించిందని, అయితే కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు అందించారని అన్నారు. కేవీ చౌదరి పాత్ర గుర్తుండి పోతుంది.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘ఆ నలుగురు’ సినిమాలో రఘురామ్ పాత్రను ప్రేక్షకులు ఎంతగా గుర్తుంచుకున్నారో, మహానటిలో కేవీ చౌదరి పాత్రకూడా అంతగా గుర్తుండి పోతుందన్నారు. సావిత్రితో విభేదించి దూరమైన తరువాత ఆమెకు ఆరోగ్యం బాగోలేని సమయంలో కలుసుకున్న సీన్ అద్భుతంగా పండిందన్నారు. మహానటి సావిత్రి మళ్ళీపుట్టిందా అన్నంతగా కీర్తి సురేష్ ఆమె పాత్రలో ఆకట్టుకుందన్నారు. సావిత్రి పాత్రలో జీవించేందుకు ఆమె ఎంతగానో కష్టపడిందని ప్రశంసించారు. దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు నిజాయితీతో కష్టపడి పనిచేసిన మహానటి తెలుగుసినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. ‘బయోపిక్ ఎవరు చూస్తారులే’ అని అంతా పెదవి విరిచినా నాగ్అశ్విన్ ప్రతిభాపాటవాలతో మహానటిని ఒక క్లాసిక్‌గా నిలబెట్టారన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డేనియల్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని అన్నారు. స్వామి థియేటర్లో మహానటి యూనిట్ కృతజ్ఞతాపర్యటనలో భాగంగా ‘మహానటి’ యూనిట్ రాజమహేంద్రవరం స్వామి థియేటర్లో మ్యాట్నీషోలో ప్రేక్షకులను కలుసుకుంది. కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాదత్, స్వప్నదత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియేల్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘అమ్మాడీ’ కీర్తిసురేష్ మహానటిలోని సినిమాడైలాగులతో సందడి చేసింది. థియేటర్ యజమాని లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి ‘సావిత్రి’ నా మనుమరాలే.. ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించింది తన మనుమరాలేనని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆ పాప తన కూతురి కుమార్తె అన్నారు. నిర్మాత స్వప్నదత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డేనియల్, సినీ డిస్ట్రిబ్యూటర్ నెక్కంటి రామ్మోహరావు, థియేటర్ల యజ మానులు, మేనేజర్లు, డిస్ట్రిబ్యూటర్ పాల్గొన్నారు. -
‘మహానటి’ సావిత్రికి నిజమైన నివాళి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’చిత్రం అద్భుతంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా సావిత్రికి నిజమైన నివాళి అర్పించినట్లైందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖకు చెందిన ప్రత్యేక థియేటర్లో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, నిర్మాత అశ్వనీదత్ ఇతర ప్రముఖులతో కలిసి మహానటి చిత్రాన్ని వీక్షించారు. సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేసి సావిత్రి గొప్పతనాన్ని నేటి తరానికి అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంక దత్, సావిత్రి కీర్తిని తెలియజేసేలా సహజసిద్ధంగా నటించిన నటి కీర్తి సురేశ్‌ను వెంకయ్య అభినందించారు. మాయాబజార్లో సావిత్రి నటన ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. -
అచ్చం సావిత్రిలా హావభావాలు
మహానటి చిత్రం నుంచి తొలగించిన మరో సన్నివేశాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏఎన్నార్, సావిత్రి, జమున నటించిన దొంగరాముడు(1955) చిత్రంలోని రావోయి మా ఇంటికి.. మావోయ్.. మాటున్నది మంచి మాటున్నది... పాట వీడియోను రిలీజ్ చేశారు. సావిత్రి.. ఆర్.నాగేశ్వర రావులపై చిత్రీకరించిన పాట ఇది. కీర్తి సురేష్ అచ్చు సావిత్రిలానే హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటికి నాగ్ అశ్విన్ దర్శకుడు. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మహానటి: రావోయి మా ఇంటికి...
-
మహానటి : మిస్సమ్మ సీన్
-
మిస్సమ్మ సీన్‌ను ఎందుకు తీసేశారు?
మహానటి చిత్ర విజయాన్ని టాలీవుడ్ మొత్తం ఆస్వాదిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నాగ్ అశ్విన్ మరియు నిర్మాతల సాహసాన్ని అభినందిస్తున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటికి తొలి రోజు నుంచే మంచి ఆదరణ లభిస్తోంది. ఇక చిత్ర నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను మేకర్లు ఒక్కోక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. తాజాగా తమిళ మిస్సమ్మ సినిమాలోని వారాయో వెన్నిలావే (రావోయి చందమామ) సాంగ్ సీన్‌ను విడుదల చేశారు. జెమినీ గణేషన్-సావిత్రి రోల్స్‌లో దుల్కర్-కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన సీన్ ఆకట్టుకునేలా ఉంది. అయితే బాగున్న ఈ సీన్‌ను ఎందుకు తీసేశారని? సినిమాలో ఉంచాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా సాధించటంతోపాటు ఓవర్సీస్లోనూ మహానటి ప్రభంజనం కొనసాగిస్తోంది. సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న, ప్రియాంక దత్‌లు సంయుక్తంగా నిర్మించారు. -
సావిత్రి స్వీయ తప్పిదాలే...
సాక్షి, చెన్నై: దిగ్గజ నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ఇటు తెలుగులో, ‘నడిగయర్ తిలకం’ పేరుతో అటు తమిళ్లో సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమౌతోంది. అయితే సావిత్రి ఎదుగుదల.. పతనాన్ని కూలంకశంగా చూపించిన ఈ చిత్రంపై పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. తన తండ్రిని చిత్రంలో తప్పుడుగా చూపించారంటూ కమల సెల్వరాజ్(జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె) మహానటిపై పెదవి విరిచారు. (పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చెయ్యండి). ఇప్పుడు ఈ చిత్రంపై జెమినీ గణేషన్ సన్నిహితుడు, సీనియర్ నటుడు రాజేష్ కూడా స్పందించారు. సావిత్రి జీవితం అలా అయిపోవటానికి ఆమె స్వీయ తప్పిదాలే కారణమని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జెమినీ గణేషన్‌కు వివాహం అయిన సంగతి సావిత్రికి తెలుసు. అయినా ఆమె ఆయన్ని ప్రేమించింది. పెళ్లయిన వ్యక్తిని ప్రేమించడం నైతికత కాదన్నది ఆమెకు తెలీదా?. పైగా జెమినీ లైప్ స్టైల్, విలువలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. కానీ, అవేవీ పట్టించుకోకుండా సావిత్రి తప్పటడుగు వేసింది. ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు జెమినీ గణేషన్‌కు వివాహం చేసుకోవటమే’ అని రాజేష్ వ్యాఖ్యానించారు. ఇక సావిత్రి కూడా పలువురితో సంబంధాలు నడిపారంటూ కమల సెల్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై రాజేష్ స్పందించారు. (విబేధాలు కోరుకోవట్లేదు) ‘సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడలేను. కానీ, ఎంజీఆర్‌తో ఆమె నటించపోవటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విషయం మాత్రం తెలుసు’ అని పేర్కొన్నారు. సావిత్రి తాగుడు అలవాటు గురించి ప్రస్తావిస్తూ... ‘ ఉదాహరణకు సమాజంలో హోదా ఉన్న ఓ వ్యక్తి నన్ను తాగమని బలవంతపెడితే నేను తప్పకుండా తాగుతాను. మోడ్రన్ కల్చర్‌లో అదో భాగం. జెమినీ గణేషన్ కూడా సావిత్రిని అలానే ప్రొత్సహించారు. కానీ, ఆమె తాగుడుకు బానిసై పోయారు. అది కూడా ముమ్మాటికీ సావిత్రి తప్పే’ అని రాజేష్ పేర్కొన్నారు. సీనియర్ నటుడు రాజేష్ -
ప్రేమ వివాహం చేసుకుంటాను..
తమిళ సినిమా: నడిగైయార్ తిలగం తెలుగులో మహానటి చిత్రం అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణను పొందుతోంది. ఇందుకు చాలా కారణాలు, చిత్రం వెనుక ప్రతిభావంతులు పలువురు ఉన్నా, ప్రధాన కారణం నటి కీర్తీసురేశ్ అనడం అతిశయోక్తి కాదు. ఈ యువ నటి ఆ మహానటిగా ఒదిగిపోయారన్నది నిజం. అయితే ఈమె ఆ పాత్రలో నటన వెనుక శ్రమ, పట్టుదల, అవమాన భారం, ఎగతాళి, వేదన, కంటతడి, కసి, కృషి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటిఅన్ని టినీ అధిగమించి ఇవాళ సాధించాలన్న విజయ గర్వంతో పరిహాసం చేసిన వారి నోటితోనే శభాష్ అనిపించుకుంటున్నారు. అలాంటి కీర్తీసురేశ్ మనసులోని భావాలను చూద్దాం. దక్షిణాది సినీచరిత్రలో మహత్తరమైన సాధనను చేసిన నటి సావిత్రి. ఆమె పాత్రలో నటించే అవకాశం యువ నటినైన నాకు వచ్చిందన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సినిమాలో నేను సాధించాలనుకున్న లక్ష్యం ఇది. అంత తొందరగా దరి చేరుతుందని ఊహించలేదు అని మెరిసే కళ్లతో అన్న కీర్తీసురేశ్‌ను మీరీ సావిత్రి పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ వెలువడగానే చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారన్న ప్రశ్నకు బదులిస్తూ, అవన్నీ నాకు తెలుసు. నేను చాలా చిన్న అమ్మాయిని. అంత వెయిట్ అయిన పాత్రను తట్టుకోగలనా? అన్న అనుమానం రావడం సహజమే. అయితే అలాంటి వారందరికీ నడిగైయార్ తిలగం చిత్రం బదులిస్తుందని భావించాను. అయినా విమర్శలు నాకు కొత్తేమీ కాదు. తొడరి చిత్రంలో నటించినప్పుడే చాలా మంది ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. నా నవ్వు గురించి కొందరు తప్పు తప్పుగా విమర్శలు చేస్తున్నారు. ఏదో చెడాలోచనలతో అలాంటి కామెంట్ చేసేవారికి నేనుందుకు బదులివ్వాలి. ఇకపోతే మీరడిగిన ప్రశ్నకే వస్తే, సావిత్రి పాత్రలో నటించే అవకాశం రావడంతో అమ్మ చాలా సంతోషించారు. లెజెండ్ అయిన సావిత్రి పాత్రలో నటించే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పారు. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా పట్టించుకోవద్దు.నువ్వు దైర్యంగా నటించు అని నాకు బూస్ట్ ఇచ్చారు. అయితే బయట వాళ్లెవ్వరూ నన్ను పోత్సహించలేదు. పైగా ఇది సావిత్రికి పట్టిన గతి అంటూ ఎగతాళి చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు చేశారు. అప్పుడు నేను అప్సెట్ అయ్యాను. ఇంటిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాను. అప్పుడే నాలో కసి పెరిగింది. సావిత్రి పాత్రలో జీవించి తీరుతానని శపథం చేశాను. అందుకు తగ్గట్టుగా శ్రమించాను. అది ఇప్పుడు నెరవేరిందదని భావిస్తున్నాను. మహనటి సావిత్రి పాత్రను అవలీలగా నటించేశారు. ఇప్పుడు ఎలా ఫీల్అవుతున్నారన్న ప్రశ్నకు కథానాయికలు సినిమాల్లో సాధించడం ఎంత కష్టం అన్నది తెలుసుకున్నాను. సినీ తారల మరో ముఖం ప్రజలకు తెలియదు. అలాంటిది ఈ చిత్రంలో నటించిన తరువాత చాలా విషయాలను నేను తెలుసుకున్నాను. సావిత్రి సొంతంగా సినిమాలను నిర్మించారు, దర్శకత్వం చేశారు. ఆమె పాత్రలో నటించిన మీరు దర్శకత్వం, చిత్ర నిర్మాణం చేపడతారా, ప్రేమ వివాహం చేసుకుంటారాఅన్న ప్రశ్నకు అమ్మ మేనక, బామ్మ సరోజ నటీమణులే, అక్క పార్వతి కూడా సినిమా రంగంలోనే ఉంది. నాన్న నిర్మాత. అలా మాది సినిమా కుటుంబం. అయితే నేను మాత్రం ఎప్పటికీ నిర్మాతగా మారను. దర్శకత్వం అంటారా? అందకు అర్హత గానీ, ప్రతిభ గానీ నాకున్నాయని భావించడం లేదు. ఇకపోతే ప్రేమ వివాహం గురించి చెప్పాలంటే నేను ఇప్పుడే నటిగా ఎదుగుతున్నాను. కాబట్టి పెళ్లి ప్రస్తావన అనవసరం. ఇంకా చెప్పాలంటే మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. భవిష్యత్‌లో నాకు ఎవరిపైన అయినా ప్రేమ కలిగితే ఆ విషయాన్ని అమ్మానాన్నలకు ధైర్యంగా చెబుతాను. వారు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం చేసుకుంటాను. -
మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్
-
మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్
తమిళసినిమా: నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) ఇటీవలే తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు సావిత్రి పాత్రలో నటించిన నటి కీర్తీసురేశ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి కూడా చిత్రం బాగుందని ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి భర్త జెమినీగణేశన్ కూతురు, ప్రముఖ వైద్యురాలు కమలాసెల్వరాజ్ ఆ చిత్ర యూనిట్‌పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆమె బుధవారం ఒక వెబ్సైట్ విలేకరితో మాట్లాడుతూ నడిగైయిన్‌తిలగం చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ తీవ్రంగా ఆరోపించారు. తన తండ్రికి కళంకం ఆపాదించేలా చిత్రంలో చూపించారని అన్నారు. తన తండ్రి బిజీ నటుడన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అలాంటిది ఆయన అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు చూపించడమేంటని ప్రశ్నించారు. తొలిప్రేమ సావిత్రిపైనేనా? నాన్నకు తొలిసారిగా ప్రేమ కలిగింది సావిత్రి పైనే అనేలా చిత్రీకరించారని, అయితే అంతకు ముందు తన తల్లిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నారని అన్నారు. అంటే తన తల్లిపై ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించారు. నాన్నే సావిత్రికి మద్యం అలవాటు చేశారా? అదే విధంగా తన తండ్రే సావిత్రికి మద్యం సేవించడం అలవాటు చేసిన తాగుబోతుగా చిత్రంలో చూపించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురైయ్యానన్నారు. ఈ చిత్రంలో నాన్నను ప్రేక్షకులు అంగీకరించని నటుడిగా చిత్రీకరించారని, అలాంటప్పుడు ఆయనకు ప్రేక్షకులు కాదల్‌మన్నన్ ( ప్రేమరాజు) అనే పట్టం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సావిత్రి ప్రాప్తం చిత్రం చేయడానికి సిద్ధం అయినప్పుడు అంత పెద్ద నటి ఈ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని తన తండ్రి వద్దని చెప్పారన్నారు. ఎందరో ప్రముఖ నటులతో నటించిన సావిత్రికి ఆ నటులు సహాయం చేసి కాపాడవచ్చుగా అని అన్నారు. కానీ తన తండ్రే సావిత్రిని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకున్నారు నాన్న గురించి చెప్పాలంటే తనను ప్రేమించిన వారినే ఆయన పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన వారినెవరిని ఆయన చెడగొట్టలేదని అన్నారు. కుక్కను ఉసిగొల్పి గెంటేశారు ప్రాప్తం చిత్ర నిర్మాణం చేయాలన్న పంతంతో ఉన్న సావిత్రి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని చెప్పడానికి నాన్నతో కలసి తానూ ఆమె ఇంటికి వెళితే తమపై కుక్కను వదిలి గెంటేశారని, తాము కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి గోడ దూకి పారిపోవలసి వచ్చిందన్నారు. ఆ సంఘటన తరువాత నాన్న మళ్లీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని కమలా సెల్వరాజ్ చెప్పారు. -
హైదరాబాద్‌లో మహానటి ఇళ్లు.. ఎక్కడంటే!
సాక్షి, హైదరాబాద్ : అలనాటి నటి సావిత్రికి భాగ్యనగరంతోను అనుబంధం ఉంది. సినిమా షూటింగ్ కోసం తరచూ భాగ్యనగరానికి విచ్చేసే ఆమెకు నగరంలోని చెరువులు, తోటలు, పచ్చదనం అమితంగా ఆకట్టుకునేవి. అందుకే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు నిర్మించుకున్నారు. 1960 ప్రాంతంలో యూసఫ్ గూడలో ఎకరం స్థలంలో తన అభిరుచికి అనుగుణంగా రెండు భవనాలు నిర్మించారు. అందులో ఒక ఇంటి బాల్కనీలో కూర్చొని ఎదురుగా ఉన్న చెరువును చూస్తూ గడపటం ఆమె ఎక్కువగా ఇష్టపడే వారట. అప్పట్లో ఆ ఇంటిని సావిత్రి బంగ్లా అని పిలిచేవారు. ప్రస్తుతం ఆ చెరువు ప్రాంతంలో కృష్ణకాంత్ పార్కు ఏర్పాటైంది. తర్వాతి కాలంలో ఆ రెండు ఇళ్లు సావిత్రి అక్క భర్త మల్లికార్జునరావు సొంతమయ్యాయి. కాల క్రమేణా సావిత్రి బంగ్లా కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ భవనాల స్థానంలో పెద్ద అపార్ట్ మెంట్ ఒకటి వచ్చేసింది. ఇక ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మరేపుతోంది. -
అమ్మ మళ్లీ పుట్టింది
పునరపి జననం. పునరపి మరణం. జీవితం ఒక చక్రం. మన చేతిలో గీతల్లాగే కాలచక్రంలోనూ గీతలుంటాయి. వేగంగా తిరుగుతున్న చక్రం మధ్యలో మసక కనపడుతుంది. చక్రం ఆగినప్పుడే ఆ గీతలు కనపడతాయి. సావిత్రి జీవితం చక్రంలా తిరిగినన్ని రోజులు మసకే కనిపించింది. అది ఆగినప్పుడే ఆ గీతల కొలతలు మొదలయ్యాయి. ‘మహానటి’ సినిమా.. లేని గీతలు చెరిపేసి, మిగతా గీతలను రాయి మీద గీసింది. మహానటి ఒక మహా నిజం చెప్పింది. సావిత్రి మళ్లీ పుట్టింది... అంటోంది విజయ చాముండేశ్వరి. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సుమారుగా 30కోట్లతో నిర్మించిన ఈ సినిమా బిజినెస్ బాగుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సినిమా శాటిలైట్ రైట్స్ సుమారు 20 కోట్లపైగా పలుకుతున్నాయని సమాచారం. ఇక సినిమా టోటల్ షేర్ 75కోట్లకు చేరుకుటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘మహానటి’ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా..సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరీతో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ... సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది ? నాకు టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లి వచ్చినట్టుగా అనిపించింది. అమ్మతో పాటు మళ్లీ కొన్నాళ్లు జీవించినట్టుగా అనిపించింది. తల్లిని పిల్లలు అలా తెర మీద చూసుకునే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి? చాలా హ్యాపీగా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే ఇచ్చిన మాట తప్పకుండా ఒక సెలబ్రేషన్‌లా చూపిస్తాం సావిత్రిగారిని అన్న మాటను టీమ్ నిలబెట్టుకున్నారు. నిజంగానే సెలబ్రేషన్‌లా ఉంది సినిమా. ఉదయమే అశ్వనీదత్‌గారు ఫోన్ చేసి రెండు రోజుల నుంచి ఇంట్లో పెళ్లిలా ఉందమ్మా రెస్పాన్స్ చూస్తుంటే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ వల్ల అమ్మ మళ్లీ పుటింది అని అంటే.. లేదమ్మా అమ్మ వచ్చి మా పిల్లలందరితో సినిమా చేయించుకుంది అన్నారు దత్‌గారు. ఎక్కడా తప్పులు ఉన్నట్టుగా అనిపించలేదా? అస్సలు ఎక్కాడా అనిపించలేదు. వాస్తవాన్ని చూపించటం కూడా చాలా క్లాస్‌గా చూపించారు. అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో ఎవరెవరివో పేర్లు బయటకు చెప్పడం మాకు ఇష్టం లేదు. అందుకే జనరల్‌గా ఎవరో వచ్చి నగలు తీసుకు వెళ్లినట్టు ఎవరో ఆస్తిని సైన్ చేసుకున్నట్టు చూపించారు. కానీ పేర్లు ప్రస్థావించలేదు. ఆ నగల మూట సంఘటన మీకు గుర్తుందా? అది నాకు కళ్లకు కట్టినట్టుగా గుర్తు. స్కూల్ నుంచి వచ్చాను. బెడ్ మీద మూటలు ఉన్నాయి. ఎగ్జాజిరేషన్ అనుకుంటారు. బెడ్ మీద చాకలి మూట వేసినట్టుగా అన్ని నగలు మూట కట్టుకొని భుజాన వేసుకొని తీసుకొని వెళ్లిపోయేవారు. ఇన్కమ్ టాక్స్ వాళ్లు కూడా తీసుకొని వెళ్లారు కదా. అలా తీసుకువెళ్లి పోయినా మళ్లీ అమ్మ నగలు చేయించుకుంది. అయితే అన్ని కష్టాల్లో కూడా ఎవరైనా సహాయం కావాల్సి వస్తే చేసేది. అమ్మ చేతిలో ఏదీ ఆగదు. అన్నీ ఇచ్చేయటమే. పట్టు చీర అమ్మి మరీ ఇతరులకు డబ్బులు సహాయం చేశారా? పట్టు చీరలు , అవార్డ్స్ అమ్మారు. ఏదీ ఎగ్జాజిరేట్ చేయలేదు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఈ రెండు లక్షలు నేను సతీష్ (మీ తమ్ముడు) కోసం దాచాను. ఇవి మాత్రం ఎవ్వరికీ ఇవ్వను’ అని. సో ఫైనల్‌గా అమ్మ వెళ్లిపోయేటప్పటికి మిగిలింది ఆ రెండు లక్షలేనా? నంబర్‌గా సరిగ్గా చెప్పలేను. అమ్మ చెప్పింది క్యాష్ మాత్రమే. అమ్మ పోయేటప్పటికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు చైన్నై హబీబుల్లా రోడ్లో ఒక ఇల్లు. కొడైకెనాల్లో ఒక ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా ఏమీ లేకుండా పోయింది అని అంటే నేను ఒప్పుకోను. తమ్ముడికి నాకు వచ్చింది పంచుకున్నాము. ఆ తర్వాత తమ్ముడు ‘నేనిక్కడ ఉండను అక్కా వెళ్లిపోతాను’ అన్నాడు. తన వాటా అమ్మేసి యూఎస్ వెళ్లిపోయాడు. మీరు ఇప్పుడు హబీబుల్లా రోడ్లోనే ఉంటున్నారా? అక్కడే ఉండేవాళ్లం. రెండు సంవత్సరాల క్రితమే ఆ ఇల్లు అమ్మేసి ఎగ్మూర్‌కి వచ్చేశాం. అక్కడ ఉండటం కష్టంగా ఉంది. అక్కడ ఉంటే అమ్మ గురించే మనసు లాగుతుంది. సెంటిమెంట్‌గా అక్కడే ఉండాలి అని అంతకాలం ఉన్నాను. అక్కడి నుంచి ఎగ్మూర్‌లో మంచి అపార్ట్మెంట్కి వచ్చాం. చెప్పుకోవల్సిన అవసరం ఉంది. 2,650 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్. నయనతార, దర్శకుడు అట్లీ ఉండే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. అమ్మ ఏమీ లేకుండా పోయింది అనుకుంటున్నారు. మమ్మల్ని చూసైనా మీరు ఆ అభిప్రాయం మార్చుకోవాలి. చేతిలో క్యాష్ లేకపోవడంతో అవస్థ పడ్డారు అమ్మ. ఆస్తుల నుంచి క్యాష్ చేసుకోవడం అమ్మకు తెలియలేదు. సినిమా స్టార్టింగ్‌లో హాస్పిటల్లో సావిత్రి గారిని బయట కింద పడిలోబెట్టినట్టు చూపించారు. అదీ నిజమేనా? నిజమే. హాస్పిటల్‌కి వెళ్ళగానే స్ట్రెచర్ మీద పడుకోబెడతారు కదా. మన కోసం రూమ్స్ అన్నీ ఖాళీగా ఉండవు కదా. సినిమాలో స్క్రీన్‌ప్లే కోసం అలా బయట కింద పడుకోబెట్టారు. రూమ్ కోసం ఎదురు చూసే ఆ సమయంలో జరిగిన సంఘటన అది. అది కర్ణాటక అయ్యేసరికి వాళ్లు గుర్తించటానికి కొంచెం సమయం పట్టింది. వేరే అమ్మాయితో జెమినీ కనిపించగానే సావిత్రిగారు హర్ట్ అయ్యి జెమినీని దూరంపెట్టేసినట్టు సినిమాలో చూపించారు. నిజంగానే దూరంపెట్టారా? రానివ్వలేదు. అసలు రానిచ్చేవారు కాదు అమ్మ. నాన్న కొన్నిసార్లు గోడ దూకి కూడా వచ్చేవాళ్లు. షూట్ చేశారు కానీ లిమిటెడ్ టైమ్ కాబట్టి ఎడిటింగ్‌లో తీసేశారు. అమ్మ చుట్టు ఉండే బంధువులు నాన్నను రానివ్వలేదు. కొన్ని విషయాలు అమ్మ దగ్గర దాచేశారు కూడా. జెమినీగారు గోడ దూకి రావటానికి ప్రయత్నించారన్న విషయాన్ని కూడా తెలియకుండా చేశారా? ఆయన కూతురని చెప్పడం కాదు కానీ అందరూ కలిసి నాన్నను విలన్ చేశారు. ఆయన క్యారెక్టర్ కరెక్ట్‌గా చూపించారు సినిమాలో. నాన్నగారు అమ్మని చాలా ప్రేమించారు. తర్వాత ఆయన కూడా తాగటం మొదలెట్టారు. నాన్నగారి దగ్గరకు మీరు వెళ్లేవారా? మేం వెళ్లటం రావడం బాగానే జరిగాయి. ఆ విషయంలో ఏ అబ్జక్షన్ పెట్టలేదు. ఆవిడ కలవ లేదని కాని మమల్ని బాగానే వెళ్లనిచ్చేవారు. నాన్న పండగలకు మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కుడా వెళ్లేవాళ్లం. అద్దె ఇంట్లోకి వెళ్లిపోయారు. అదంతా గుర్తుందా? అన్నానగర్‌కి మారిపోయాం. అంతా గుర్తుంది. నాకు పెళ్లి అయిపోయి నేను దూరంగా ఉన్నాను. మళ్లీ చైన్నైకి వచ్చాను కానీ అమ్మ తను ఒక్కత్తే ఉండాలి ఎవ్వరితో సంబంధం వద్దూ అన్నట్టుగా ఉండిపోయింది. కీర్తీ యాక్టింగ్ ఎలా అనిపించింది తను యాక్ట్ చేసిందా? అమ్మలాగా జీవించిందా? అనిపించింది. అమ్మ ఎలా అయితే పసిపిల్లగా ఉన్నప్పుడు నా వల్ల కాదంటారా అనే సీన్స్‌లో నీవల్ల ఏమవుతుంది అని అంటే సినిమాల్లో చేసి చూపించింది. సినిమాలో మీకు ఎక్కువగా నచ్చిన సన్నివేశాలు ఏమిటి? అమ్మ ఎర్లీ ఏజ్ సీన్స్ అన్నీ బాగా నచ్చాయి. మ్యూజిక్, డైలాగ్స్ చాలా నచ్చాయి. విజయ చాముండేశ్వరి, కీర్తిసురేశ్ 2017 డిసెంబర్లో ‘సాక్షి’కి విజయ చాముండేశ్వరి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుండి కొన్ని ప్రధానాంశాలు మీ కోసం మీ అమ్మగారి చివరి రోజుల్లో మీ నాన్నగారు (నటుడు జెమినీ గణేశన్) పట్టించుకోలేదని, ఆస్పత్రిలో అనామకురాలిలా ఆమె ఉండేవారని అంటుంటారు... అమ్మ దగ్గరే ఉండేవారు నాన్న. స్పెషలిస్ట్ అనదగ్గ ఏ డాక్టర్నీ ఆయన వదిలిపెట్టలేదు. నేను, నా తమ్ముడు ఆస్పత్రికి వెళ్లి చూస్తుండేవాళ్లం. నిజానికి అమ్మను విదేశాలు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకున్నాం. నాన్న డాక్టర్స్‌తో మాట్లాడితే, ‘అసలు ప్రయాణం చేసే పరిస్థితి లేదు’ అన్నారు. అందుకని ఆగాం. ఇది తెలియనివాళ్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదని, సరైన చికిత్స చేయించలేదని, విదేశాలు తీసుకెళ్లలేదని అంటుంటారు. సావిత్రిగారు కోమాలో ఉన్నప్పుడు మీరు టీనేజ్‌లో ఉండి ఉంటారేమో? నాకప్పుడు 16 ఏళ్లు. అప్పటికి నా పెళ్లయింది. ఒక బాబు కూడా పుట్టాడు. ఈ వయసులో ఇంటికి పరిమితం కాకూడదని నాన్న చదివించారు. సరిగ్గా ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్‌లో అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పుడు బాబ్జీ పెద్దమ్మ (జెమినీ పెద్ద భార్య) ‘నువ్వు ఎగ్జామ్స్ గురించి పట్టించుకో. అమ్మని నాన్న చూసుకుంటారులే’ అని, నన్ను దగ్గరుండి తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాయించింది. ఎగ్జామ్, ఎగ్జామ్‌కి మధ్య గ్యాప్ వస్తుంది కదా.. అప్పుడు వెళ్లి అమ్మను చూసేదాన్ని. కళ్లు తెరచి అలా చూస్తుండేది. ఒక్కోసారి మాత్రం నా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకునేది. పిల్లలంటే ఇష్టం కాబట్టి, అప్పుడు చలనం వచ్చేదేమో. డాక్టర్లు ఆమెతో కంటిన్యూస్‌గా మాట్లాడమనే వాళ్లు. మేం ఏదేదో చెబుతుండేవాళ్లం. మరి.. అమ్మకు అవి అర్థమయ్యాయో లేదో తెలియదు. 19 నెలలు కోమాలో ఉండిపోయింది. అందులోంచి బయటకు రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. బాబ్జీ పెద్దమ్మ అంటే సావిత్రిగారి అక్కా? కాదు. మా నాన్నగారి పెద్ద భార్య. నాన్నగారి ఇంకో భార్య పుష్పవల్లి. ఆమె కూతురు రేఖ. ఇంకో కూతురు రాధ. నేను ఇంతకుముందు చెప్పిన పెద్దమ్మ అసలు పేరు అలమేలు. నాన్నగారు ‘బాబ్జీ’ అని పిలిచేవారు. మేం కూడా బాబ్జీ పెద్దమ్మా అనేవాళ్లం. ఆవిడకు నలుగురు కూతుళ్లు. అమ్మ, పెద్దమ్మ బాగుండేవాళ్లు. ఎక్కువ రోజులు హాలిడేస్ ఉంటే మేం కొడైకెనాల్ వెళ్లేవాళ్లం. అక్కడ అమ్మకో ఇల్లు. బాబ్జీ పెద్దమ్మకో ఇల్లు ఉండేది. పిల్లలమంతా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరుగుతూ ఆడుకునేవాళ్లం. పుష్పవల్లిగారు కూడా మీ బాబ్జీ పెద్దమ్మలా మీతో బాగుండేవారా? నాన్న అప్పుడప్పుడూ ఆవిడ ఇంటికి తీసుకు వెళ్లేవారు. ఆమె బాగానే మాట్లాడేది కానీ, బాబ్జీ పెద్దమ్మ అంత క్లోజ్ కాదు. అయితే అమ్మ, పుష్పవల్లి ఆంటీ బాగానే ఉండేవారు. మరి.. ఆవిడ పిల్లలు రేఖ, రాధతో మీ అనుబంధం? పిల్లలం బాగానే ఉండేవాళ్లం. రేఖ ముంబైలో ఉండేది. తన మూతి విరుపు, నవ్వు అమ్మలా ఉంటాయని పుష్పవల్లి ఆంటీ అంటుండేది. ‘నా కడుపున పుట్టింది. చేష్టలన్నీ నీవే’ అని రేఖ గురించి ఆంటీ అంటే అమ్మ నవ్వేది. చిన్నప్పుడు రేఖ, రాధతో మాకు క్లోజ్‌నెస్ పెద్దగా లేదు. పెద్దయ్యాక మాత్రం క్లోజ్ అయ్యాం. రేఖ అయితే ‘నాకు బిడ్డలు లేరు. యు ఆర్ మై బేబీ’ అని నన్ను అంటుంటుంది. నా తమ్ముడు (సతీష్) కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. రాధ కూడా అక్కడే ఉంటోంది. వాళ్లిద్దరి మధ్య రాకపోకలు ఉన్నాయి. ఎంత లేదన్నా ఒక్క తల్లి కడుపున పుట్టలేదు కాబట్టి, మీ అందరి మధ్యా చిన్నపాటి మిస్ అండర్స్టాండింగ్స్ అప్పుడప్పుడూ అయినా రావడం కామనే కదా? చిన్నప్పుడు లేవు కానీ, కొంచెం పెద్దయ్యాక పొరపొచ్చాలు వచ్చిన మాట వాస్తవమే. ఇటు యంగ్ అటు ఓల్డ్ కాని ఏజ్ ఒకటుంటుంది కదా. అప్పుడు చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయి. మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల కెరీర్ గురించి, బాగోగుల గురించీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మాకు పిల్లల భవిష్యత్తు ప్రధానంగా అనిపించింది. మా మధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా మాయమయ్యాయి. మా మధ్య రాకపోకలు బాగానే ఉంటున్నాయి. అమ్మానాన్న మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పిల్లలందరూ ఎలా ఉండేవాళ్లు? వాళ్లిద్దరికీ పడలేదని మాకు తెలియదు. ఎందుకంటే మా దగ్గర వాళ్లేమీ చెప్పలేదు. దాంతో మేమంతా బాగానే ఉండేవాళ్లం. ఒకవేళ తెలిసి ఉంటే ఆ మిస్ అండర్‌స్టాండింగ్స్‌ని పోగొట్టడానికి ఏదైనా చేసేదాన్నని మీకు అనిపిస్తోందా? ఆ ఫీలింగ్ ఉంది. అయితే అప్పుడు నాది టీనేజ్. ఇప్పుడు పదిహేను పదహారేళ్ల పిల్లలకు ఉన్నంత మెచ్యూర్టీ అప్పట్లో ఉండేది కాదు. పైగా అమ్మ పెంపకంలో మాకు కష్టాలు తెలియలేదు. లైఫ్ హ్యాపీగా గడిచిపోయేది. జెమినీగారి మొదటి, రెండో భార్య పిల్లలను కూడా మీతో పాటే సమానంగా చూసేవారా మీ అమ్మగారు? ఒకర్ని ఎక్కువగా మరొకర్ని తక్కువగా చూడటం అమ్మకు తెలియదు. మా బాబ్జీ పెద్దమ్మ కొంచెం స్ట్రిక్ట్. అందుకని పెద్దమ్మ పిల్లలు అమ్మ దగ్గర ఫ్రీగా ఉండేవాళ్లు. అమ్మ దగ్గరికొచ్చి జడలు వేయించుకునేవాళ్లు. జడలు వేసేంత తీరిక సావిత్రిగారికి ఉండేదా? ఈ విషయంలో అమ్మను మెచ్చుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు. ఏదైనా మనం ప్లాన్ చేసేదాన్ని బట్టే ఉంటుందని అమ్మ లైఫ్ చూసి తెలుసుకున్నాను. తనో స్టార్ అనే ఫీలింగ్ అమ్మకు ఉండేది కాదు. అందరి అమ్మలు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో మా అమ్మ కూడా అలానే చూసుకుంది. జెమినీ గణేశన్‌గారు సావిత్రిగారి ఆస్తి కొల్లగొట్టారనే సందేహం కొంతమందిలో అలానే ఉండిపోయింది... అది నిజం కాదు. అమ్మ ఆ ఇంటి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. మేం కూడా ఆ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండేవాళ్లం. అక్కణ్ణుంచి మేం ఏదీ ఆశించలేదు. అమ్మ ఆస్తుల్లో వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. అక్కణ్ణుంచి మేం ఏమీ తెచ్చుకోలేదు. అమ్మని నాన్న మోసం చేయలేదు కానీ, కొందరు బంధువులు మాత్రం చేశారు. మరి.. చివరి రోజుల్లో సావిత్రిగారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారనే అభిప్రాయం ఎందుకు బలపడింది.. సావిత్రిగారి అంతిమ క్రియలు ఎవరింట్లో జరిగాయి? కొందరి ఊహలకు అంతు ఉండదు. అమ్మ ఎన్నో సినిమాలు చేసింది. ఆవిడకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి? నాన్న ఆవిణ్ణి దయనీయ స్థితిలో వదిలేయలేదు. చివరి కార్యక్రమాలన్నీ నాన్న ఇంటి (చెన్నై, నుంగంబాక్కమ్) లోనే జరిగాయి. బాబ్జీ పెద్దమ్మ, పుష్పవల్లి పెద్దమ్మ దగ్గరుండి జరిపించారు. మీరు కూడా మీ అమ్మగారిలా అందంగా ఉంటారు కదా.. మరి ఆవిడలా హీరోయిన్ కావాలనుకోలేదా? అమ్మ స్టార్ కావడంతో చిన్నప్పుడు మాకంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అమ్మతో కలసి ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టేసేవారు. సినిమాకెళ్లినా, హోటల్‌కెళ్లినా... ఎక్కడికెళ్లినా ప్రైవసీ ఉండేది కాదు. దాంతో చాలా మిస్సయినట్లుగా అనిపించేది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్లాలనుకోలేదు. అమ్మకి కూడా ఆ ఫీలింగ్ లేదు. నాది పాత పద్ధతి అనిపించవచ్చేమో కానీ, ఇంటి పట్టున ఉండి భర్త–పిల్లలను బాగా చూసుకుంటే చాలు వేరే ఏ వ్యాపకం అవసరంలేదనుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్లను తప్పుబట్టడంలేదు. నా ఫీలింగ్ చెప్పానంతే. పిల్లలు పెరిగే టైమ్‌కి తల్లిదండ్రుల అవసరం చాలా ఉంటుంది. ఉదయం ఉరుకుల పరుగులతో బయటికెళ్లి, సాయంత్రం పిల్లలతో గడిపే తీరిక లేకపోతే ఏం లాభం? అమ్మా నాన్నల పరంగా మేం మిస్సయిన విషయం ఒకటుంది. స్కూల్లో ‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’ అంటే వచ్చే వాళ్లు కాదు. ఫోన్లో టీచర్స్‌తో మాట్లాడినా.. మిగతా పిల్లల్లా మన అమ్మానాన్న రాలేదే? అనే ఫీలింగ్ ఉండేది. మీ అమ్మగారు అమాయకత్వం నిండిన పాత్రలు కొన్ని చేశారు.. నిజంగా కూడా అలానే ఉండేవారని మా ఫీలింగ్? ఎగ్జాట్లీ. అమ్మ చాలా ఇన్నోసెంట్. తలుపు తట్టి ఎవరేం అడిగినా కాదనేది కాదు. మా పిల్లలకు బాగాలేదనో.. మా ఆవిడకు బాగాలేదనో.. ఇలా రకరకాల కారణాలు చెప్పి, డబ్బులు తీసుకెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఫేస్ డల్‌గా పెట్టుకుంటే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా హెల్ప్ చేసేది. -
’సిని’మా కథ
-
సావిత్రమ్మ
-
అచ్చం సావిత్రి, జెమినీ గణేషన్‌లా...
ప్రస్తుతం సినీ అభిమానులను దాదాపు ముప్పై, నలభైయేళ్లు వెనక్కు తీసుకెళ్లే పనిలో ఉన్నారు దర్శకులు. అందులో ఒకటి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న రంగస్థలం, మరొకటి నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న మహానటి చిత్రం. 1980 నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. ఈ సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ చూసిన ప్రేక్షకులు అప్పటి కాలం అనుభూతికి లోనవుతున్నారు. ఇక సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహానటి. అంటే దాదాపు యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి అప్పటి పరిస్థితులను తెరపై ఆవిష్కరిస్తున్నాడు నాగ్ అశ్విన్.అయితే మహానటికి సంబంధించిన సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల అయింది. అయితే ఆ సినిమాలో ఇతర పాత్రలకు సంబంధించి ఎలాంటి న్యూస్‌తో పాటు ఫోటోలు బయటకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సావిత్రి, జెమినీ గణేషన్‌లను తలపించేలా కీర్తిసురేశ్, దుల్కర్ సల్మాన్ల ఫోటో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోను ఎవరైనా అభిమాని డిజైన్ చేసి ఉంటాడని కొంతమంది, మహానటి పోస్టర్ లీకైందని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా... ఈ చిత్రం మాత్రం నాటి తరం తారాగణాన్ని గుర్తుచేసేలా...సరికొత్త అనుభూతికి గురయ్యేలా చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ పోస్టర్ పై చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
స్త్రీశక్తిని చూపిన పాట...
అమ్మ (సావిత్రి) దర్శకత్వంలో వచ్చిన ‘మాతృదేవత’ చిత్రంలో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. స్త్రీశక్తిని ప్రతిబింబించే పాట ఇది. ఈ పాటను డా. సి. నారాయణరెడ్డి ఎంతో అందంగా రాశారు. పదాలు వింటుంటేనే నాట్యం చేయాలనిపించేలా ఉంటాయి. పాటలో ‘మాత్రలు’ (సిలబుల్స్) అలా పరుగులు పెడుతుంటాయి. చిన్నప్పుడు ఈ పాటకు నేను డాన్స్ చేసేదాన్ని. ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ...’ అంటూ పాట ఎత్తుగడలోనే మహిళ ఎంత శక్తివంతమైనదో వివరించారు సినారె. అనురాగాన్ని పంచడంలోను, అవసరమైతే త్యాగం చేయడంలోనూ మహిళలే ముందు ఉంటారు... అని స్త్రీ ఔన్నత్యాన్ని చూపారు పల్లవిలో.మొదటి చరణంలో స్త్రీ గురించి చాలా సింపుల్‌గా... స్త్రీ అంటే చెలి, చెల్లి అనేది అందరూ చెబుతారు. ‘తల్లి’ అని సాధారణంగా చెప్పకుండా ‘రామయ్యనే కన్న తల్లి’ అని చెబుతూనే, ఆమె సకల భూప్రపంచానికే కల్పవృక్షం వంటిది అని స్త్రీ స్థానాన్ని ఎంతో ఉన్నతంగా చూపారు సినారె. ‘దేశానికి ప్రధాని అయినా ఒక కన్నతల్లి బిడ్డే’ అనే మాట వాడుకలో ఉంది. ఇక్కడ ఆ మాట గుర్తుకు వస్తుంది.రెండవ చరణంలో... ఆమె సహనం గురించి, ఆమె ప్రణయం గురించి మధురంగా వివరించారు. సహనానికి మారుపేరు సీత. అనురాగానికి మారు పేరు రాధ, తెలుగులో రామాయణం రాసిన మహిళ మొల్ల. కదన రంగంలో కత్తి దూసింది ఝాన్సీరాణి. ఇంతమంది మహిళలను గమనిస్తే, ఎవరి కోణం వారిదే. ఒక పక్క కవిత్వం రాయగలదు, మరోపక్క కదనరంగంలోకి ఉరకగలదు... అని స్త్రీలోని వివిధ పార్శా్వలు చూపారు. మూడవ చరణంలోకి ప్రవేశించేసరికి మహిళను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లారు. ముందు రెండు చరణాలకి మూడో చరణానికి ఎంతో తేడా ఉంటుంది. ‘‘తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాల సరులు...’’ అంటూ స్త్రీ గొప్పతనాన్ని వివరించిన ఒక్కో పదం వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఈ చరణంలో ఆడవారి అనురాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు రచయిత. స్త్రీలో సహనంతో పాటు శక్తి కూడా సమానంగా ఉంటుంది. బలం ఉండటం స్త్రీకి చాలా అవసరం. అవసరం ఏర్పడినప్పుడు తనకు తానుగా శారీరక బలం తెచ్చుకోగలదు స్త్రీ. ఆవిడ అబల కాదు సబల అని నిరూపించగలదు. సమస్యలను తట్టుకునే శక్తి కూడా మహిళలకే ఉంటుంది.... అనే అర్థం ఈ పాటలో చెప్పారు. ‘కన్న కడుపున చిచ్చు రగిలెనా కరవులపాలౌను దేశం / తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం’ ... తల్లి మనసుకి కష్టం కలిగించితే దేశమే సర్వనాశనమవుతుంది, ఆవిడను మించిన దైవమే లేదంటూ ఈ పాటను ముగించారు సినారె. మొదటి చరణం చాలా సింపుల్‌గా ప్రారంభమై, రెండవ చరణంలో జనరలైజ్ చేసి, క్రమేపీ మూడవ చరణంలోకి వచ్చేసరికి స్త్రీశక్తిని చూపారు. మహిళా శక్తిని ఈ పాటలో చూపినంతగా మరే పాటలోనూ చూపలేదేమో అనిపిస్తుంది. ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్త్రీ ఔన్నత్యాన్ని పాట రూపంలో చెప్పడం చాలా బావుంది. ఈ పాటను పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందనిపిస్తుంది. కవిత్వ పరంగా ఈ పాట మనసుకి హత్తుకుంటుంది. – వైజయంతి -
వెండి వెన్నెల జాబిలి!
చిత్రం: సిరిసంపదలు రచన: ఆత్రేయ సంగీతం: మాస్టర్ వేణు గానం: ఘంటసాల, ఎస్. జానకి కొన్ని పాటలు బాగుంటాయి. కొన్ని పాటలు ఆనందింప చేస్తాయి. కొన్ని పాటలు కలకాలం మనసులో పదిలంగా దాగుంటాయి. అదిగో... అలా మనసులో దాగిందే... ఈ ‘వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’ పాట.ఇవాళ చాలా మంది (నాతో సహా) కవులు మామూలు సంభాషణల్లా రాస్తున్న పాటల శైలి పాత సినిమాల్లో కవులు వాడిందే! అందులో దిట్ట పింగళి. అదే శైలిని అందుకున్న మరో కలం ఆత్రేయది. ఆ పెన్నులోంచి ఒలికిందే ఈ ‘వెండి వెన్నెల’. ఈ పాటలో గమ్మత్తయిన సంగతి.. పల్లవిలా మొదలైన పాదాల కన్నా అనుపల్లవి పాపులర్ అవడం! పాట ఎక్కడో మధ్యలో ఎత్తుకున్నట్టుగా మొదలవుతుంది. తర్వాత బాణీని అనుసంధానించిన తీరు మాత్రం సంగీత దర్శకుని ప్రతిభకు కట్టిన పట్టం!‘ఈ పగలు రేయిగా.. పండు వెన్నెలగ మారినదేమి చెలీ? ఆ కారణమేమి చెలీ..?’ అని ప్రశ్నిస్తూ మళ్ళీ తనే దానికి జవాబుగా .. ‘వింత కాదు నా చెంతనున్నది... వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి..’ అని అసలైన కారణంతో పల్లవి తొడగడం కవి చమత్కారం! ప్రసాద్ (ఏఎన్నార్) ఎంత సరసుడో .. పద్మ (సావిత్రి) అంత గడుసరి. చూపు విసిరినా కనులు కలపదు. కలసి నడిచినా చేయి కలపదు. ఇచ్చినట్టే ఇచ్చి మనసు దాచుకొంటుంది. ఆ పెదాలు కూడా మునిపంట బిగించే ఉంచింది మరి. నవ్వితే మగాడు చొరవ తీసుకోడూ? ‘మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు? పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు...’ అని అతనూ పసిగట్టాడు. ఏఎన్నార్, సావిత్రి హావభావాల గురించి ప్రత్యేకంగా పట్టం కట్టాల్సిన అవసరం లేదు. ‘సిరి సంపదలు’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించిన ఈ పాట తెలియని వారుండరు. డాబా మీద ఎన్ని రేడియోలు రాత్రి పూట ఈ పాట వింటూ ఆ వెన్నెలలో తడిసి వుండవు? అమ్మాయిలకు ఇష్టమైనా ఆ విషయం చెప్పకుండా అబ్బాయిలతో పోయే నయగారాలు ఈ పాటలో కుర్రాడు ఎంతో అందంగా చెప్పాడు. అందుకు తగ్గ సావిత్రి సొగసు పాటని ఆహ్లాద పరిచింది. కన్నుల అల్లరి.. సిగ్గులతో మెరిసే బుగ్గల ఎరుపు.. ఆ మనసుని అలా పట్టిచ్చేస్తాయి.. ‘కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి యేమార్చేవు? చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు..’ అని గుట్టు విప్పుతున్నాడు. ఒక్కటేమిటి.. ఆమె ప్రతి కదలికలోని తడబాటుకు పసందైన మాటలు విసురుతూ కట్టి పడేస్తున్నాడు. ఈ పాటలో అన్నిటికీ మించి ఒక అద్భుతమైన కవి భావం అందలం ఎక్కించదగింది. ప్రియురాలి జడలో తెల్లగా మెరిసిపోయే మల్లెలను అద్దంగా పోలుస్తూ అవి ఆమె నవ్వుని అందులో చూపిస్తున్నాయని చెప్పడం నిరుపమానం! అపురూపం!! మరువలేని భావం! ‘నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను..’ అన్న భావ వ్యక్తీకరణ ఆత్రేయ రాసిన ఈ మొత్తం పాటలో శిరోధార్యం అనదగిన వాక్యం! ఆ అమ్మాయితో ‘అలుక చూపి అటు వైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వకు.. నీ నవ్వుని జడలో మల్లెలే అద్దంగా చూపుతున్నాయి..’ అనడం మరువలేని భావం!ఈ చిత్రంలోని ఈ పాట ఎంతో మందిని అలరించింది.. నన్ను కూడా..! – డా. వైజయంతి - డా. వనమాలి గీత రచయిత -
నా కూతురు చావుకు కారణమైన కార్తీక్‌ను శిక్షించాలి
-
కార్తీక్ గురించి ఎప్పుడూ చెప్పలేదు..
సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె చావుకు కారణం అయిన కార్తీక్‌ను చంపేయాలంటూ మృతురాలు సంధ్యారాణి తల్లి సావిత్రి అన్నారు. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యపై కిరోసిన్ పోసి నిప్పు అంటించడంతో...తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. సంధ్యారాణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురు చావుకు కారణమైన కార్తీక్ ను కూడా చంపాలి. అప్పుడే నా కూతురుకు న్యాయం జరిగినట్టు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే కార్తీక్‌ను శిక్షించాలి. సంధ్య ఎప్పుడు కార్తీక్ గురించి నాకు చెప్పలేదు. కార్తీక్ ఎవరో మాకు తెలియదు.’ అని అన్నారు. సంధ్య కుటుంబాన్ని ఆదుకోవాలి మరోవైపు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ...ఈ రోజు ఉదయం మృతురాలు సంధ్యారాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. నేరానికి పాల్పడ్డ కార్తీక్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి...సంధ్యారాణి కుటుంబాన్ని ఆదుకోవాలని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నారు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు ఈ కేసులో నిర్లక్ష్యం వహించారన్నారు. ఇలాంటి ఘటనలు వారానికి ఆరు కేసులు గాంధీ ఆస్పత్రికి వస్తున్నాయన్నారు. నగరంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమించా... సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన కార్తీక్‌ను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్యకేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సందర్భంగా కార్తీక్ పలు విషయాలు వెల్లడించాడు. ‘ అయిదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమిస్తున్నా. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కొద్దిరోజులుగా సంధ్యారాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నిన్న కూడా ఆమెను బతిమిలాడాను. నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. నన్ను నిరాకరించడంతోనే కిరోసిన్ పోసి నిప్పు అంటించాను. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాను.’ అని తెలిపాడు. -
'మహానటి' సర్ ప్రైజ్!
అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను అశ్వినిదత్ కూతురు స్వప్నా దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తోంది. సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా మహానటి చిత్రానికి సంబంధించి ఓ సర్ ప్రైజ్‌ను అభిమానులకు అందించారు. సావిత్రి అభిమానుల కోసం మహానటి లోగో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో సావిత్రి నటించిన సినిమాలోని కొన్ని డైలాగులు ఉన్నాయి. మాయాబజార్ సినిమాలో ఉన్న మాయాపేటికను ఓపెన్ చేయగానే.. సమ్ స్టోరీస్ ఆర్ మీన్ టుబీ ఎపిక్ అంటూ.. మహానటి లోగో వస్తుంది. మహానటి లోగో ప్లే అవుతుంటే వచ్చే మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా మహానటి చిత్ర విడుదల తేదీలను కూడా ప్రకటించారు. 2018 మార్చి 29న మహానటి విడుదల కానుంది. మహాకావ్యంలాంటి ఓ చారిత్రక సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది అంటూ మహానటి లోగోకు సంబంధించిన వీడియోను కీర్తి సురేష్ ట్వీట్ చేశారు. సమంత మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు.. ఎస్వీఆర్ పాత్రలో, దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేషన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, విజయ్, షాలిని పాండే, ప్రగ్యా జైస్వాల్, మాళవికా నాయర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి మహానటి సినిమాను తెరకెక్కిస్తున్నారు. Some stories are meant to be #Epic Happy to be a part of this History ! 😊🙏 #HBDSavitri See you at theatres on 29th March 2018! 😃 #Mahanati #NadigaiyarThilagam following soon @VyjayanthiFilms https://t.co/CyaJZuzX7Q — Keerthy Suresh (@KeerthyOfficial) December 6, 2017 -
మహానటి
పండు వెన్నెల, నిండు జాబిలి అని మహానటి సావిత్రిని పోల్చడం అంటే.. చెప్పిందే చెప్పడం. కొత్తగా కూడా ఆమె కోసం ఏమీ కవిత్వాన్ని సృష్టించలేం. చిరునవ్వు వెలుగు సావిత్రి. చిరుగాలి అల్లరి సావిత్రి. కళ్లే కాదు, ఆమె మౌనమూ ఒక చక్కటి పలకరింపు. సహజ నటి అంటారు కదా.. అది సహజత్వం మాత్రమే కాదు. నటనలోని సంపూర్ణత్వం కూడా! మంచి మంచి సినిమాలను మన కోసం మిగిల్చి వెళ్లిన సావిత్రి.. జయంతి నేడు. ఆ సందర్భంగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరితో ‘సాక్షి’ సంభాషణ. మీ అమ్మగారి గురించి మాట్లాడగానే మీకు గుర్తొచ్చే విషయాలు? అందమైన ఆ నవ్వు, చిలిపితనం, ఎప్పుడూ హ్యాపీగా ఉండటం. ఇవే గుర్తొస్తాయి. నిజమే.. ఆ నవ్వు, కొన్ని పాత్రల్లో చూపించిన చిలిపితనాన్ని మేమూ మరచిపోలేం.. మీరు సినిమాల్లో చూసినవి. నేను అమ్మను రియల్ లైఫ్‌లో దగ్గరగా చూశాను. ‘దేవదాసు’ సినిమాలో ఎర్లీ స్టేజెస్‌లో కొంచెం కొంటెగా, హ్యాపీగా కనిపిస్తుంది కదా.. రియల్ లైఫ్‌లోనూ అలానే ఉండేది. అమ్మ 45 ఏళ్లు మాత్రమే బతికింది. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఆవిడ హ్యాపీగా ఉండటమే నాకు తెలుసు. కానీ, సావిత్రిగారిది ‘ట్రాజెడీ లైఫ్’ అనే ఇమేజ్ మిగిలిపోయింది. అది బాధగా ఉంటుంది కదా... అవును. జనరల్‌గా సినిమా ఫీల్డ్ అనేటప్పటికి ఏ విషయాన్నయినా ఎక్కువ చేసి చెబుతారు. అసలు ఏమీ జరిగి ఉండదు. ఓ వార్త పుట్టిస్తారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఆ వార్త చేరేలోపు పెద్దదైపోతుంది. చివరికి బెలూన్ని బాంబ్లా చూపించేస్తారు. అమ్మ విషయంలో అదే జరిగింది. మీ అమ్మగారి చివరి రోజుల్లో మీ నాన్నగారు (నటుడు జెమినీ గణేశన్) పట్టించుకోలేదని, ఆస్పత్రిలో అనామకురాలిలా ఆమె ఉండేవారని కూడా అంటుంటారు... అమ్మ దగ్గరే ఉండేవారు నాన్న. స్పెషలిస్ట్ అనదగ్గ ఏ డాక్టర్నీ ఆయన వదిలిపెట్టలేదు. నేను, నా తమ్ముడు ఆస్పత్రికి వెళ్లి చూస్తుండేవాళ్లం. నిజానికి అమ్మను విదేశాలు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకున్నాం. నాన్న డాక్టర్స్‌తో మాట్లాడితే, ‘అసలు ప్రయాణం చేసే పరిస్థితి లేదు’ అన్నారు. అందుకని ఆగాం. ఇది తెలియనివాళ్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదని, సరైన చికిత్స చేయించలేదని, విదేశాలు తీసుకెళ్లలేదని అంటుంటారు. సావిత్రిగారు కోమాలో ఉన్నప్పుడు మీరు టీనేజ్‌లో ఉండి ఉంటారేమో? నాకప్పుడు 16 ఏళ్లు. అప్పటికి నా పెళ్లయింది. ఒక బాబు కూడా పుట్టాడు. ఈ వయసులో ఇంటికి పరిమితం కాకూడదని నాన్న చదివించారు. సరిగ్గా ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్‌లో అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పుడు బాబ్జీ పెద్దమ్మ ‘నువ్వు ఎగ్జామ్స్ గురించి పట్టించుకో. అమ్మని నాన్న చూసుకుంటారులే’ అని, నన్ను దగ్గరుండి తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాయించింది. ఎగ్జామ్, ఎగ్జామ్‌కి మధ్య గ్యాప్ వస్తుంది కదా.. అప్పుడు వెళ్లి అమ్మను చూసేదాన్ని. అమ్మ దగ్గరకెళ్లి ‘నేనూ, తమ్ముడూ బాగున్నాం. బాగా చదువుకుంటున్నాం’ అని బాబ్జీ పెద్దమ్మ చెప్పమనేది. అలానే చెప్పేదాన్ని. కోమాలో ఉండేవారు కాబట్టి, మీరలా చెప్పినప్పుడు సావిత్రిగారిలో చలనం ఉండేది కాదు.. కళ్లు తెరచి అలా చూస్తుండేది. ఒక్కోసారి మాత్రం నా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకునేది. పిల్లలంటే ఇష్టం కాబట్టి, అప్పుడు చలనం వచ్చేదేమో. డాక్టర్లు ఆమెతో కంటిన్యూస్‌గా మాట్లాడమనే వాళ్లు. మేం ఏదేదో చెబుతుండేవాళ్లం. మరి.. అమ్మకు అవి అర్థమయ్యాయో లేదో తెలియదు. 19 నెలలు కోమాలో ఉండిపోయింది. అందులోంచి బయటకు రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. బాబ్జీ పెద్దమ్మ అంటే సావిత్రిగారి అక్కా? కాదు. మా నాన్నగారి పెద్ద భార్య. ఆవిడ కూడా అమ్మను బాగానే పట్టించుకునేది. ఆవిడకు ఎంతమంది పిల్లలు. రేఖ (నటి) పుష్పవల్లిగారి కూతురు కదా? అవును. నాన్నగారి ఇంకో భార్య పుష్పవల్లి కూతురు రేఖ. తనకో సిస్టర్ (రాధ) కూడా ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన పెద్దమ్మ అసలు పేరు అలమేలు. నాన్నగారు ‘బాబ్జీ’ అని పిలిచేవారు. మేం కూడా బాబ్జీ పెద్దమ్మా అనేవాళ్లం. ఆవిడకు నలుగురు కూతుళ్లు. ‘దగ్గరుండి పెద్దమ్మ ఎగ్జామ్స్ రాయించారు’ అని చెప్పారంటే.. మీరంతా బాగా ఉండేవారన్న మాట.. అమ్మ, పెద్దమ్మ బాగుండేవాళ్లు. ఎక్కువ రోజులు హాలిడేస్ ఉంటే మేం కొడైకెనాల్ వెళ్లేవాళ్లం. అక్కడ అమ్మకో ఇల్లు. బాబ్జీ పెద్దమ్మకో ఇల్లు ఉండేది. పిల్లలమంతా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరుగుతూ.. ఆడుకునేవాళ్లం. పుష్పవల్లిగారు కూడా మీ బాబ్జీ పెద్దమ్మలా మీతో బాగుండేవారా? నాన్న అప్పుడప్పుడూ ఆవిడ ఇంటికి తీసుకు వెళ్లేవారు. ఆమె బాగానే మాట్లాడేది కానీ, బాబ్జీ పెద్దమ్మ అంత క్లోజ్ కాదు. అయితే అమ్మ, పుష్పవల్లి ఆంటీ బాగానే ఉండేవారు. మరి.. ఆవిడ పిల్లలు రేఖ, రాధతో మీ అనుబంధం? పిల్లలం బాగానే ఉండేవాళ్లం. రేఖ ముంబైలో ఉండేది. తన మూతి విరుపు, నవ్వు అమ్మలా ఉంటాయని పుష్పవల్లి ఆంటీ అంటుండేది. ‘నా కడుపున పుట్టావు. చేష్టలన్నీ ఆవిడవే’ అని ఆంటీ అంటే అమ్మ నవ్వేది. చిన్నప్పుడు రేఖ, రాధతో మాకు క్లోజ్‌నెస్ పెద్దగా లేదు. పెద్దయ్యాక మాత్రం క్లోజ్ అయ్యాం. రేఖ అయితే ‘నాకు బిడ్డలు లేరు. యు ఆర్ మై బేబీ’ అని నన్ను అంటుంటుంది. నా తమ్ముడు (సతీష్) కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. రాధ కూడా అక్కడే ఉంటోంది. వాళ్లిద్దరి మధ్య రాకపోకలు ఉన్నాయి. ఎంత లేదన్నా ఒక్క తల్లి కడుపున పుట్టలేదు కాబట్టి, మీ అందరి మధ్యా చిన్నపాటి మిస్ అండర్స్టాండింగ్స్ అప్పుడప్పుడూ అయినా రావడం కామనే కదా? చిన్నప్పుడు లేవు కానీ, కొంచెం పెద్దయ్యాక పొరపొచ్చాలు వచ్చిన మాట వాస్తవమే. ఇటు యంగ్ అటు ఓల్డ్ కాని ఏజ్ ఒకటుంటుంది కదా. అప్పుడు చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయి. మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల కెరీర్ గురించి, బాగోగుల గురించీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మాకు పిల్లల భవిష్యత్తు ప్రధానంగా అనిపించింది. మా మధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా మాయమయ్యాయి. మా మధ్య రాకపోకలు బాగానే ఉంటున్నాయి. అమ్మానాన్న మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పిల్లలందరూ ఎలా ఉండేవాళ్లు? వాళ్లిద్దరికీ పడలేదని మాకు తెలియదు. ఎందుకంటే మా దగ్గర వాళ్లేమీ చెప్పలేదు. దాంతో మేమంతా బాగానే ఉండేవాళ్లం. ఒకవేళ తెలిసి ఉంటే.. ఆ మిస్ అండర్‌స్టాండింగ్స్‌ని పోగొట్టడానికి ఏదైనా చేసేదాన్నని ఇప్పుడు మీకు అనిపిస్తోందా? ఆ ఫీలింగ్ ఉంది. అయితే అప్పుడు నాది టీనేజ్. ఇప్పుడు పదిహేను పదహారేళ్ల పిల్లలకు ఉన్నంత మెచ్యూర్టీ అప్పట్లో ఉండేది కాదు. పైగా అమ్మ పెంపకంలో మాకు కష్టాలు తెలియలేదు. లైఫ్ హ్యాపీగా గడిచిపోయేది. జెమినీ గణేశన్‌గారి మొదటి, రెండో భార్య పిల్లలను కూడా మీతో పాటే సమానంగా చూసేవారా మీ అమ్మగారు? ఒకర్ని ఎక్కువగా మరొకర్ని తక్కువగా చూడటం అమ్మకు తెలియదు. మా బాబ్జీ పెద్దమ్మ కొంచెం స్ట్రిక్ట్. అందుకని పెద్దమ్మ పిల్లలు అమ్మ దగ్గర ఫ్రీగా ఉండేవాళ్లు. అమ్మ దగ్గరికొచ్చి జడలు వేయించుకునేవాళ్లు. జడలు వేసేంత తీరిక సావిత్రిగారికి ఉండేదా? ఈ విషయంలో అమ్మను మెచ్చుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు. ఏదైనా మనం ప్లాన్ చేసేదాన్ని బట్టే ఉంటుందని అమ్మ లైఫ్ చూసి తెలుసుకున్నాను. తనో స్టార్ అనే ఫీలింగ్ అమ్మకు ఉండేది కాదు. అందరి అమ్మలు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో మా అమ్మ కూడా అలానే చూసుకుంది. జెమినీ గణేశన్‌గారు సావిత్రిగారి ఆస్తి కొల్లగొట్టారనే సందేహం కొంతమందిలో అలానే ఉండిపోయింది... అది నిజం కాదు. ఎవరూ ఎవరి ఆస్తినీ కొల్లగొట్టలేదు. మా అమ్మగారు మా ఇంటికి ఏమైనా కొంటే, ఆ ఇంటికీ కొనాల్సిందే. ఆ మధ్య ఓ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు నేను చెవికి జూకాలు పెట్టుకుని వెళ్లాను. అటు నాన్నవైపు బంధువుల్లో ఒకామె దగ్గర కూడా అలాంటిదే ఉంది. ‘మీ అమ్మ కొనిచ్చిందే’ అన్నారు. అమ్మ ఏదైనా ఇష్టంగా కొనిచ్చిందే తప్ప ఎవరూ అడిగి కొనిపించుకోలేదు. కానీ, అమ్మ ఆ ఇంటి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. మేం కూడా ఆ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండేవాళ్లం. అక్కణ్ణుంచి మేం ఏదీ ఆశించలేదు. అమ్మ ఆస్తుల్లో వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. అక్కణ్ణుంచి మేం ఏమీ తెచ్చుకోలేదు. అమ్మని నాన్న మోసం చేయలేదు కానీ, కొందరు బంధువులు మాత్రం చేశారు. ∙మరి.. చివరి రోజుల్లో సావిత్రిగారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారనే అభిప్రాయం ఎందుకు బలపడింది.. సావిత్రిగారి అంతిమ క్రియలు ఎవరింట్లో జరిగాయి? కొందరి ఊహలకు అంతు ఉండదు. అమ్మ ఎన్నో సినిమాలు చేసింది. ఆవిడకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి? నాన్న ఆవిణ్ణి దయనీయ స్థితిలో వదిలేయలేదు. చివరి కార్యక్రమాలన్నీ నాన్న ఇంటి (చెన్నై, నుంగంబాక్కమ్) లోనే జరిగాయి. బాబ్జీ పెద్దమ్మ, పుష్పవల్లి పెద్దమ్మ దగ్గరుండి జరిపించారు. అది సరే.. మీరు కూడా మీ అమ్మగారిలా అందంగా ఉంటారు కదా.. మరి ఆవిడలా హీరోయిన్ కావాలనుకోలేదా? అమ్మ స్టార్ కావడంతో చిన్నప్పుడు మాకంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అమ్మతో కలసి ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టేసేవారు. సినిమాకెళ్లినా, హోటల్‌కెళ్లినా... ఎక్కడికెళ్లినా ప్రైవసీ ఉండేది కాదు. దాంతో చాలా మిస్సయినట్లుగా అనిపించేది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్లాలనుకోలేదు. అమ్మకి కూడా ఆ ఫీలింగ్ లేదు. నాది పాత పద్ధతి అనిపించవచ్చేమో కానీ, ఇంటి పట్టున ఉండి భర్త–పిల్లలను బాగా చూసుకుంటే చాలు.. వేరే ఏ వ్యాపకం అవసరంలేదనుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్లను తప్పుబట్టడంలేదు. నా ఫీలింగ్ చెప్పానంతే. పిల్లలు పెరిగే టైమ్‌కి తల్లిదండ్రుల అవసరం చాలా ఉంటుంది. ఉదయం ఉరుకుల పరుగులతో బయటికెళ్లి, సాయంత్రం పిల్లలతో గడిపే తీరిక లేకపోతే ఏం లాభం? అమ్మా నాన్నల పరంగా మేం మిస్సయిన విషయం ఒకటుంది. స్కూల్లో ‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’ అంటే వచ్చే వాళ్లు కాదు. ఫోన్లో టీచర్స్‌తో మాట్లాడినా.. మిగతా పిల్లల్లా మన అమ్మానాన్న రాలేదే? అనే ఫీలింగ్ ఉండేది. మీ అమ్మగారు అమాయకత్వం నిండిన పాత్రలు కొన్ని చేశారు.. నిజంగా కూడా అలానే ఉండేవారని మా ఫీలింగ్? ఎగ్జాట్లీ. అమ్మ చాలా ఇన్నోసెంట్. తలుపు తట్టి ఎవరేం అడిగినా కాదనేది కాదు. మా పిల్లలకు బాగాలేదనో.. మా ఆవిడకు బాగాలేదనో.. ఇలా రకరకాల కారణాలు చెప్పి, డబ్బులు తీసుకెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఫేస్ డల్‌గా పెట్టుకుంటే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా హెల్ప్ చేసేది. మరి.. అలా ఇవ్వొద్దని మీరు, మీ తమ్ముడూ చెప్పేవాళ్లు కాదా? అప్పుడు మాకంత వయసు లేదు. నాన్న మాత్రం, ‘వాళ్లు చెబుతున్నది నిజమా? కాదా? తెలుసుకుని హెల్ప్ చేస్తే బాగుంటుంది’ అనేవారు. అయినా అమ్మ పట్టించుకునేది కాదు. మనకి ఇంత డబ్బుంది కదా.. ఇస్తే ఏం పోతుంది? అనే ధోరణిలో ఉండేది. ఇప్పుడు సావిత్రిగారి లైఫ్ ఆధారంగా వైజయంతీ మూవీస్ ‘మహానటి’ తీస్తున్నారు కదా.. దర్శకుడు నాగ అశ్విన్ మీకు కథ చెప్పారా? చెప్పారు. కొన్ని విషయాలు అడిగితే చెప్పాను. షూటింగ్ చేస్తున్న టైమ్‌లో కూడా ఏదైనా డౌట్ వస్తే, ఫోన్ చేస్తున్నారు. చెబుతున్నాను. దాసరిగారి డైరెక్షన్లో మీ అబ్బాయి అభినయ్ ‘యంగ్ ఇండియా’ మూవీ ద్వారా పరిచయమయ్యారు కదా.. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం? అమ్మమ్మ బ్యాగ్రౌండ్ చూపించి, అభినయ్ చాన్సులు తెచ్చుకోవాలనుకోలేదు. అప్పుడు దాసరిగారు కూడా ఫొటోషూట్ చేసి, కరెక్ట్‌గా ఉంటాడని తీసుకున్నారు. ఆ తర్వాత చాలా కథలు విన్నాం. కొన్ని నచ్చాయి. అయితే మంచి ప్రొడ్యూసర్ సెట్ కాలేదు. నచ్చని కథలకు మంచి ప్రొడ్యూసర్స్ కుదిరారు. అయినా ఆ సినిమాలు చేసి ఏం లాభం? అన్నీ ప్రాపర్‌గా కుదిరితేనే చేద్దామనుకుంటున్నాం. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ లైఫ్ స్టోరీతో తీసిన తమిళ సినిమా ‘రామానుజన్’లో టైటిల్ రోల్ చేశారు అభినయ్. గెటప్ చాలా బాగుంది... థ్యాంక్స్. ఆ సినిమా చాన్స్ కూడా దానంతటదే వచ్చింది. మంచి క్యారెక్టర్. అభినయ్ చాలా బాగా చేశాడనే పేరు కూడా వచ్చింది. జనరల్‌గా మంచి బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు పిల్లల కోసం సినిమాలు తీస్తున్నారు.. మీకా ఆలోచన? అభినయ్‌తో ఈ మాటే అన్నాను. ‘వారసుల కోసం కొందరు సొంత బేనర్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. నేను, నాన్న (గోవింద రావు) నీకోసం సినిమాలు తీయడంలేదనే బాధ ఉంటే చెప్పు. కోట్లు కోట్లు లేకపోయినా సినిమాలు తీసే స్థితి అయితే ఉంది’ అన్నాను. అభినయ్ ఒప్పుకోలేదు. ‘అమ్మమ్మ ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి. ఆ మనీతో సినిమాలు వద్దు. నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని, అవకాశాలు తెచ్చుకుంటాను’ అన్నాడు. కాలిఫోర్నియాలో ఉన్న మీ తమ్ముడి గురించి? తమ్ముడి పిల్లలు కూడా సెటిలయ్యారు. తను హ్యాపీ. మేం అప్పు డప్పుడూ వెళుతుంటాం. అమ్మ మా కోసం కష్టపడింది. మేమంతా ఆనందంగా ఉన్నాం. చిన్నప్పుడు తెలియలేదు కానీ, పెద్దయ్యాక ‘ఇంత ఆస్తి సంపాదించడానికి అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో’ అనిపిస్తుంటుంది. అప్పుడు మాత్రం గుండె కలుక్కుమంటుంది. – డి.జి.భవాని నేడు సావిత్రి జయంతి సందర్భంగా ‘మహానటి సావిత్రి కళాపీఠం’ ఆధ్వర్యంలో విజయవాడలోని ‘తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం’లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ‘‘ఈ సందర్భంగా ‘మిస్ ఏషియా ఇంటర్నేషనల్ 2016’ ఫస్ట్ రన్నరప్ రష్మీ ఠాగూర్‌కి మహానటి సావిత్రి పురస్కారాన్ని అందించనున్నాం’’ అని కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షులు పి. శ్రీనివాస్ తెలిపారు. సావిత్రిగారు ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ – నాగ అశ్విన్ ‘ఎవడే సుబ్రమణ్యం’తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు నాగ అశ్విన్. ప్రస్తుతం సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలు నాగ అశ్విన్ మాటల్లోనే... సావిత్రిగారి జీవిత కథతో సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? ఆమె ‘ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్’ అని నా ఒపీనియన్. ఆవిడ జీవితాన్ని ప్రజలు మరచిపోక ముందే చెప్పాలనిపించింది. అందుకే ‘మహానటి’ మొదలుపెట్టా. ఆవిడ జీవితంలో మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి? ఫిమేల్ ఆర్టిస్టులకు మేల్ ఆర్టిస్ట్‌ల కన్నా తక్కువ పారితోషికం ఉంటుంది. బాలీవుడ్లో దీపికా పదుకోన్ వంటి హీరోయిన్లు ఈ విషయం గురించి అప్పుడప్పుడూ చెబుతుంటారు. కానీ, 60 ఏళ్ల క్రితం సావిత్రిగారు తనతో పాటు యాక్ట్ చేసిన హీరోలకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. హిందీలో మధుబాల వంటి హీరోయిన్లకు కూడా అది సాధ్యం కాలేదు. దీన్నిబట్టి సావిత్రిగారి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ తరానికి చెందిన మీరు సావిత్రిగారి గురించి వాళ్లూ వీళ్లు చెబితేనో, సినిమాలు చూశో తెలుసుకుని ఉంటారు.. ఆవిడ గురించి సినిమా తీయాలని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పుడు అమ్మమ్మవాళ్లు ఏ సినిమా చూసినా అందులో దాదాపు సావిత్రిగారు ఉండేవారు. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ.. ఇలాంటివన్నీ అన్నమాట. అలా నాకు సావిత్రిగారు స్క్రీన్ మీద పరిచయమయ్యారు. ఆవిడ ఎంత గొప్ప నటో తెలిసింది. కొంచెం పెద్దయ్యాక ఆవిడ లైఫ్ గురించి తెలుసుకున్నాను. సీనియర్ డైరెక్టర్స్ కూడా చెప్పారు. అవన్నీ విన్నప్పుడు ఇలాంటి మంచి నటి లైఫ్‌ని స్క్రీన్ మీద సెలబ్రేట్ చేయాల్సిందే అనుకున్నా. ఈ సినిమా ఓ సెలబ్రేషన్‌లా ఉంటుంది. సావిత్రిగారి పాత్రకు కీర్తీ సురేశ్ న్యాయం చేస్తున్నారా? ఓ సినిమా బాగా రావాలంటే కాస్టింగ్, టెక్నికల్ డిపార్ట్మెంట్, నేచర్ అన్నీ సహకరించాలి. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ఓ పదేళ్ల క్రితం కీర్తీ ఈ పాత్రకు సరిపోయి ఉండేది కాదు. మరో పదేళ్ల తర్వాతా సరిపోయి ఉండేది కాదు. రైట్ టైమ్‌లో ఈ రోల్ చేస్తోంది. పర్ఫార్మెన్స్ బాగుంది. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - సావిత్రి
-
ఆకాశ వీధిలో అందాల జాబిలి
మనుషుల్ని పోలిన మనుషులు ఈ లోకంలో ఏడుగురు ఉంటారని ఓ సామెత. అందులో ఇద్దర్ని దర్శకుడు నాగ అశ్విన్ గుర్తించారు. ఆ ఇద్దరూ ఎవరంటే... సావిత్రి, కీర్తీ సురేశ్. ఏంటి...నమ్మడం లేదా? అయితే... ఓసారి పక్కనున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోనూ... అందులో కళ్లనూ చూడండి. ఫొటోలో ఉన్నదెవరు? సావిత్రే కదూ! అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.ఫొటోలో ఉన్నది కీర్తీ సురేశ్. సావిత్రి జీవితకథతో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా‘మహానటి’. ఇందులో సావిత్రిగా కీర్తీ సురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం కీర్తి పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ క్యాప్షన్‌తో ఆమె ఫస్ట్ లుక్ విడుదలచేశారు. ఇందులో కీర్తీ సురేశ్ కళ్లు అచ్చం సావిత్రి కళ్లలానే ఉన్నాయి కదూ! ‘మహానటి’తో పాటు పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్సంస్థ నిర్మిస్తున్న సినిమాలోనూ కీర్తీ సురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని లుక్‌నూ విడుదల చేశారు. తెరపైనా దర్శకులే!? క్రిష్ తెలుసుగా... ‘గమ్యం, వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు తీసిన దర్శకుడు. ఆయనతో పాటు నటుడు, ‘ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద’ చిత్రాల దర్శకుడుఅవసరాల శ్రీనివాస్ త్వరలో తెరపైనా దర్శకులుగా కనిపించే అవకాశాలున్నాయి. సావిత్రి కథతో రూపొందుతోన్న ‘మహానటి’లో ఆమెతో పనిచేసిన దర్శకుల పాత్రలు కూడా ఉన్నాయి.‘మాయాబజార్’ తీసిన కేవీ రెడ్డి, ‘మిస్సమ్మ’ తీసిన ఎల్వీ ప్రసాద్ పాత్రలు కథలో కీలకమట! వీరిద్దరిలో కేవీ రెడ్డి పాత్రకు క్రిష్‌ను, ఎల్వీ ప్రసాద్ పాత్రకు అవసరాలను అనుకుంటున్నారట. మరి, ఈ దర్శకులు ఇద్దరూ తెరపై దిగ్గజ దర్శకుల పాత్రల్లో కనిపించడానికి ఏమంటారో!! -
కింగ్ ఆఫ్ రొమాన్స్
‘కాదల్ మన్నన్’.. అంటే ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’ అని అర్థం. తమిళ నటుడు జెమినీ గణేశన్ టైటిల్ ఇది. ఆయన తర్వాత అక్కడ ఈ బిరుదుని ఎవరూ సొంతం చేసుకోలేదు. అయితే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో స్వప్నా దత్ నిర్మిస్తున్న ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ చేస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్‌ని విడుదల చేశారు. ఈ లుక్ చూసినవాళ్లు కాదల్ మన్నన్లానే ఉన్నాడని అంటున్నారు. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటిస్తోన్న ఈ చిత్రంలో సమంత కీలక పాత్ర చేస్తున్నారు. -
సావిత్రిగా మారడానికి బరువు పెరగాలా?
తమిళ సినిమా: మహానటి సావిత్రి జీవిత చరిత్ర తమిళం, తెలుగు భాషల్లో వెండితెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో యువ నటి కీర్తీసురేశ్ నటిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తీనా? అని ఆశ్చర్యపోయిన వాళ్లూ, తను సావిత్రిలా ఎలా మారుతుందనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. సావిత్రి ఆది నుంచి కొంచెం బొద్దుగా ఉండేవారు. కీర్తీసురేశ్ సన్నగా ఉంటుంది. దీంతో కీర్తీని దర్శక నిర్మాతలు బాగా లావెక్కాలని ఆంక్షలు విధించినట్లూ, అందుకు తను అంగీకరించినట్లూ, కాదు నిరాకరించినట్లూ రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం నటి అనుష్క తను బరువును సుమారు 80 కేజీల వరకూ పెంచి నటించారు. అలాంగే నటి కీర్తీసురేశ్ కూడా సావిత్రి పాత్ర కోసం బరువు పెంచి నటిస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ విషయంపై ఈ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ప్రోస్థేటిక్ మేకప్ ద్వారా తాను సావిత్రిలా బొద్దుగా మారుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ మధ్య అవ్వై షణ్ముగి చిత్రం కోసం విశ్వనటుడు కమలహాసన్ ఈ ప్రోస్థేటిక్ మేకప్‌తోనే ఆంటీగా మారి అలరించారన్నది గమనార్హం. పాపం ఈ మేకప్ గురించి తెలియక అనుష్క తన శరీరాన్ని భారీగా పెంచుకుని ఆనక తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. బాహుబలి–2 చిత్రంలో అనుష్కను నాజూగ్గా చూపించడానికి దర్శకుడు రాజమౌళి రూ.కోట్లు ఖర్చు చేయాల్సివచ్చింది. అనుష్క పరిస్థితిని గ్రహించే కీర్తీసురేశ్ బరువు పెరగరాదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. -
బాలయ్య కన్నా ముందే ఎన్టీఆర్..?
మహానటుడు నందమూరి తారాకరామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ లోగా మరో నందమూరి వారసుడు ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నాడట. నటనతో పాటు రూపంలోనూ సీనియర్ ఎన్టీఆర్‌కు దగ్గరగా కనిపించే యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలో తాత పాత్రలో కనిపించే అవకాశం ఉంది. మహానటి పేరుతో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు జూనియర్‌ను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్, మహానటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఓకె చెప్తే బాలయ్య కన్నా ముందే సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో తారక్ దర్శనమివ్వనున్నాడు. -
సావిత్రీ ఇంకొంచెం బరువు పెరగాలమ్మా!
మలయాళీ కుట్టి కీర్తీ సురేశ్ కొంచెం బొద్దుగానే కనిపిస్తారు. ఇతర కథానాయికలతో పోలిస్తే ఆమె కాస్త లావుగానే ఉంటారనే చెప్పుకోవాలి. కానీ, దర్శకుడు నాగ అశ్విన్‌కు మాత్రం ఈ మలయాళీ కుట్టి సన్నగా కనిపించారు. వెంటనే... ‘ఇంకొంచెం బరువు పెరగలామ్మా’ అని రిక్వెస్ట్ చేశారట! ఎందుకంటే... ఆయన కీర్తీ సురేశ్‌ను కథానాయికగానో... కీర్తీ సురేశ్గానో... చూడడం లేదు. ఆమెలో అలనాటి మేటినటి సావిత్రిని చూస్తున్నారు. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ అశ్విన్ రూపొందిస్తున్న ‘మహానటి’లో కీర్తీ సురేశ్ సావిత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. సావిత్రి యంగ్‌స్టర్‌గా ఉన్నప్పటి సీన్స్ తీస్తున్నారిప్పుడు. ముప్ఫై–నలభై ఏళ్ల వయసులో సావిత్రి కొంచెం లావుగా, బొద్దుగా ఉండేవారు. సో, సావిత్రిగా నటిస్తున్న కీర్తీ సురేశ్ కూడా కథ పరంగా కొన్ని సీన్స్‌లో లావుగా కనిపించాలి కదా! అందుకే, దర్శకుడు కీర్తీ సురేశ్‌ను బరుపు పెరగమని అడిగారన్న మాట! -
హీరోయిన్ బరువు పెంచేందుకు తంటాలు
చెన్నై: ‘నేను శైలజా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి కీర్తి సురేష్‌కు... ఆమె ఫిజిక్ ఇప్పుడు సమస్యగా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. సావిత్రి మాదిరి గెటప్ వేయించి కీర్తి సురేష్‌తో చిత్రీకరణ కూడా మొదలెట్టారు. అయితే ఈ గెటప్ చిత్రాలు లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో సావిత్రిలా... కీర్తి సురేష్‌కు గెటప్ నప్పలేదే, ఇంకా లావైతే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో దర్శక నిర్మాతల్ని హీరోయిన్ బరువు సమస్య ఆలోచనలో పడేసిందని సమాచారం. కీర్తి సురేష్‌ను బరువు పెంచాలని దర్శక నిర్మాతలు ముందుగా చెప్పినప్పుడు సరేనన్న ఈ బ్యూటీ ఆ తరువాత అది కష్టం అని చేతులెత్తేసిందట. ఆమెకు అనుష్క బాధలు గుర్తు కొచ్చాయో ఏమో..? ఓ సినిమా కోసం సుమారు 80 కిలోల బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి పడని తంటాలు లేవు. బాహుబలి–2 చిత్ర నిర్మాతలకు తన బరువు విషయంలో భారీ ఖర్చునే పెట్టించారనే ప్రచారం హల్చల్ చేసింది. చివరిగా గ్రాఫిక్స్‌తో అనుష్క బరువును తగ్గించారు. కాగా, మహానది చిత్రంలో కీర్తిసురేష్ బరువు ఇదే తీరున పెంచాలన్న నిర్ణయానికి ఆ చిత్ర నిర్మాతలు వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్ర షోషిస్తుండగా, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తొలి షెడ్యూల్లో మాయాబజార్ మేకింగ్
లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తుండగా అనుష్క, సమంతలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో షూటింగ్లో భాగంగా తొలి షెడ్యూల్ లో ఓ సాంగ్ మేకింగ్‌ను షూట్ చేస్తున్నారు. మాయాబజార్ సినిమాలోని ఓ పాట షూటింగ్ సందర్భాన్ని ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఐదు రోజుల్లోనూ ముగియనుంది. రెండో షెడ్యూల్‌ను మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్ 25 రోజుల పాటు కొనసాగనుంది. కోలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, యంగ్ హీరో విజయ్ దేవరకొండలు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మహానటి సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. -
మరణమూ విడదీయలేదు
శ్రీకాకుళం: అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరం తోడుగా ఉంటామని బాసలు చేసుకున్నారు. జీవన మలి సంధ్య వరకు చేసిన బాసలను నిలబెట్టుకుంటూ ఒకరి కోసం ఒకరు బతికారు. ఆఖరుకు మరణంలోనూ విడిపోకుండా ఒకరి వెంట మరొకరు నడిచారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం ధనుకువాడ గ్రామానికి చెందిన మెండ సావిత్రి(65) బుధవారం వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఆమె మృతితో భర్త శ్రీరాములు(70) విలవిలలాడిపోయారు. తల్లి మరణించిన విషయాన్ని కందుకూరులో ఉంటున్న వారి కుమారుడు విశ్వనాథంకు స్థానికులు తెలియజేశారు. గురువారం ఉదయానికి గ్రామానికి చేరుకుంటానని, అప్పటి వరకు మృతదేహాన్ని ఉంచాలని ఆయన కోరడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే, భార్య మృతి చెందినప్పటి నుంచి ఆమె పార్థివ దేహం పక్కనే ఉన్న భర్త శ్రీరాములు చాలా సేపటి నుంచి కదలకుండా ఉండడం స్థానికులు గమనించారు. ఏమైందని పరిశీలించి చూస్తే ఆయన కూడా తుది శ్వాస విడిచారని వారికి అర్థమైంది. ఈ భార్యాభర్తలు మరణించడంతో ధనుకువాడ గ్రామంలో విషాదం అలముకుంది. వీరికి ఒక కొడుకు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
సావిత్రీ గణేశుడు
అలనాటి అందాలతార సావిత్రి జీవితంలో కీలక వ్యక్తి తమిళ నటుడు ‘జెమిని’ గణేశన్. సావిత్రి జీవిత కథతో నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ సంస్థ ‘మహానటి’ సినిమా తీయనున్నట్టు ప్రకటించగానే... ‘జెమిని’ గణేశన్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది? ఎవరు నటిస్తారు? అనే డిస్కషన్ మొదలైంది. తమిళ హీరో సూర్య నుంచి ప్రకాశ్‌రాజ్ వరకు పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు, ‘జెమిని’ గణేశన్ పాత్రకు మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడు, మణిరత్నం ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్‌ను తీసుకున్నారు. తొలుత తెలుగు, తమిళ భాషల్లో తీయాలనుకున్న ఈ సినిమాను ఇప్పుడు మలయాళంతో కలిపి మూడు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సావిత్రిగా కీర్తీ సురేశ్, జర్నలిస్ట్‌గా సమంత నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారంలో మొదలు కానుంది. అనుష్కను ఈ సినిమాలో కీలక పాత్ర (భానుమతి/జమున?) కు సంప్రదించిన సంగతి తెలిసిందే. -
సావిత్రీ... నిన్నొదల!
అందాల అభినేత్రి సావిత్రి జీవిత కథతో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ నిర్మించనున్న సినిమా ‘మహానటి’. ఇందులో సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించనున్న సంగతి తెలిసిందే. మరి, సమంత ఏ పాత్ర చేస్తున్నారంటే... కథను ముందుకు నడిపించే విలేకరి పాత్రలో కనిపించనున్నారు. 80వ దశకంలో విలేకరులను స్ఫూర్తిగా తీసుకుని సమంత లుక్‌ను నాగ అశ్విన్ డిజైన్ చేశారట. ‘‘సావిత్రి గురించి తెలుసుకోవాలని పట్టు వదలకుండా రీసెర్చ్ చేసే జర్నలిస్ట్‌గా సమంత కనిపిస్తారు. సినిమాలోని కథ కూడా ఈ జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సావిత్రి చరిత్రను విలేకరి వివరిస్తారు’’ అని యూనిట్ వర్గాల సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీత దర్శకుడు. -
ఒకరి జీవితం పండించి తను మాత్రం రాలిపోయే 'గోరింటాకు'
నాటి సినిమా సృష్టిలో ఏమీ ఆశించినవి కొన్ని ఉంటాయి. పైగా ఇవ్వడమే వాటి ధర్మమనుకుంటాయి. పూలు సువాసననిచ్చి వాడిపోతాయి. మబ్బులు చినుకులు రాల్చి కరిగిపోతాయి. ఏరు దప్పిక తీర్చి కదిలెళ్లిపోతుంది. పంట ఫలాన్ని ఇచ్చి లుప్తమైపోతుంది. పురుషుల విషయంలో కొందరు స్త్రీలు కూడా ఇలాగే ఉంటారు. వారి జీవితాన్ని నిస్వార్థంగా పండించి తాము మాత్రం నిశ్శబ్దంగా రాలిపోతారు. రాము (శోభన్‌బాబు) తన జీవితంలో ఇద్దరు స్త్రీలను అలాంటివాళ్లుగా చూశాడు. ఒకరు తల్లి (సావిత్రి). మరొకరు స్నేహితురాలు స్వప్న (సుజాత). తల్లికి భర్త వల్ల జీవితంలో ఎటువంటి సంతోషమూ లేదు. అతడు తాగుబోతు. వ్యసనపరుడు. ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని బంగారం లాంటి ఇంటిని అలక్ష్యం చేసినవాడు. చివరకు ముక్కుపచ్చలారని కన్నకూతురు ఒక రోజు ముచ్చటపడి గోరింటాకు పెట్టుకుంటే అదే రోజున ఆ పిల్ల చావుకు కారణమవుతాడు. అయినా సరే తల్లి అతని బాగే కోరింది. భర్తలో మార్పే ఆశించింది. అతడి కోసం తన జీవితాన్ని గోరింటాకులా మార్చడానికి ప్రయత్నించింది. స్వప్న కూడా అంతే. మెడికల్ కాలేజీలో రాము క్లాస్మేట్. అతడి కాలేజీ ఫీజు ఆమే కట్టింది. అతడు హాస్టల్లో ఉండి అవస్థలు పడుతుంటే తన ఇంటికి తెచ్చి ఔట్‌హౌస్‌లో చోటు చూపించింది. బట్టలు ఉతకడానికి పని మనిషిని పెట్టింది. చెంబు ఇస్త్రీతో అవస్థలు పడుతుంటే కొత్త బట్టలు కొనిచ్చింది. అతడి పట్ల ఆమె మనసులో ఎంతో అనురాగం. ఆమె పట్ల కూడా అతడి మనసులో ఎంతో అనుబంధం. కాని వాళ్లు ఒకటి తలిస్తే స్వప్న తండ్రి మరొకటి తలిచాడు. అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు పెళ్లయ్యాక ఇంకా పెద్ద ఇంటి కోడలు కావాలని భావించాడు. ఇది రాముకు తెలిసింది. తన ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడ్డాడు. అతడు భయపడటంతో ఆమె తెగువ చూపలేకపోయింది. మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రాము డాక్టర్ కావడంలో కీలకపాత్ర పోషించిన ఆమె అతణ్ణి వదులుకొని దూరం వెళ్లిపోయింది. కాని వెళ్లిన ఆమె సుఖంగా లేదు. పెళ్లి చేసుకున్నవాడు ఇది వరకే మరొకరికి తాళి కట్టి ఉన్నాడు. ఇది పెద్ద దెబ్బ. కాని ఆమె భీరువు కాదు. అతడి భరతం పట్టి తిరిగి వచ్చింది. కాని అప్పటికే రాము తనకు ఎదురు పడిన ఒక డిస్ట్రబ్డ్ పేషంట్ (వక్కలంక పద్మ)కు సన్నిహితం అయి ఉంటాడు. నిజమే కావచ్చు. కాని పెళ్లి పెటాకులై తిరిగి వచ్చిన స్వప్నను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంది. చేసుకోమని కోరే హక్కు ఆమెకూ ఉంది. కాని ఆమె అలా చేయదు. రామును చేసుకుంటే అతడు సన్నిహితమైన అమ్మాయికి క్షోభ కలగవచ్చు. ప్రాణం కోల్పోవచ్చు. అందుకే స్వప్న తను ‘కుమారి’గానే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటుంది. రాము జీవితం నుంచి శాశ్వతంగా అడ్డుతొలగిపోతుంది. అతని జీవితాన్ని అన్ని విధాల పండించి ఆమె మాత్రం విధి తరంగాలలో ఎక్కడో తప్పిపోయింది. 1979లో వచ్చిన ‘గోరింటాకు’ ఇప్పటికీ తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచి ఉంది. నిర్మాత మురారి, కథకురాలు కె.రామలక్ష్మి, దర్శకుడు దాసరి నారాయణరావు, సంగీతకారుడు కె.వి. మహదేవన్... ఇంకా నటీనటులు అందరూ కలిసి ఆ సినిమాను తెలుగువారికి ప్రియమైన సినిమాగా మార్చారు. స్త్రీ కోరుకునేది పురుషుడి అనురాగం. అతడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా వంచన చేసినా ఆమె సహనంగా అతడిని ఆదరిస్తుంది. మార్పు కోరుకుంటుంది. అతడి బాగు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతుంది. స్త్రీ తాలూకు లోతైన ఈ భారతీయ స్వభావాన్ని చూపడం వల్లే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అయితే అదే సమయంలో స్త్రీ ఎదురు తిరిగితే ఏమవుతుందో స్వప్న పాత్ర ద్వారా చూపిస్తారు. తనను మోసం చేసి తాళి కట్టిన దొంగ మొగడి ముఖాన తాళి తెంచి విసిరి కొట్టే సన్నివేశం గొప్ప ఇంపాక్ట్ చూపుతుంది. శోభన్‌బాబు, సుజాత ఈ సినిమాలో ఎంతో ముచ్చటగా అందంగా కనిపిస్తారు. నటిస్తారు. అలనాటి సూపర్‌స్టార్ సావిత్రి కథకు నిండుదనం తెస్తుంది. కథకు పెద్ద రిలీఫ్‌గా రమాప్రభ–చలం జంట. ఉత్తరాంధ్ర యాసలో వాళ్లిద్దరూ ఆకట్టుకుంటాడు. ‘ఏటంటావంటే నానేటంటాను... నువ్వేటంటే నానూ అదే అంటాను’ అని రమాప్రభ విజృంభిస్తుంది. దేవులపల్లి – గోరింటా పూచింది కొమ్మా లేకుండా, వేటూరి– కొమ్మకొమ్మకో సన్నాయి, ఆత్రేయ– చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది, శ్రీశ్రీ– ఇలాగ వచ్చి అలాగ తెచ్చి వంటి పాటలు ఈ సినిమాలో మహదేవన్ వల్ల నిలిచి వెలిగాయి. వెలుగుతున్నాయి. విశాఖ అందాలు, ఔట్‌డోర్‌లో తీసిన సన్నివేశాలు ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గా ఉంటాయి.దాసరి సినిమాలు చాలా ఉండొచ్చు. కాని ఇది ప్రత్యేకం. ఎంతో బాగా పండి ఎప్పటికీ రాలిపోని గోరింటాకు ఇది. కూనిరాగం వస్తోంది... ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం... మీరూ కాడుకోండి. – కె -
జమునగా సమంత?
సమంత సీనియర్ నటి జమునగా మారనున్నారా? అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఈ కథేంటో చూద్దామా ‘మహానటి సావిత్రి జీవిత కథ వెండితెర రూపం దాల్చనున్న విషయం తలిసిందే. ఇండియన్ సినిమా మరువలేని, మరపురాని మహానటి సావిత్రి. ఆమె సినీ జీవితం నేటి నటీమణులకు స్ఫూర్తి అయితే వ్యక్తిగత జీవితం ఒక పాఠం. అలాంటి పలు ఆసక్తికరమైన సావిత్రి జీవితకథను మహానటి పేరుతో తెలుగులోనూ, నడిగైయన్ తిలగం పేరుతో తమిళంలోనూ ఏక కాలంలో తెరకెక్కనుంది. యువ దర్శకుడు నాగఅశ్వన్ దర్శకత్వం వహించనున్న ఇందులో మహానటి సావిత్రి పాత్రలో యువ క్రేజీ నటి కీర్తీసురేశ్ నటించనున్నారు. ఈ పాత్ర కోసం ఈ బ్యూటీ తనను సావిత్రి రూపంలోకి మలచుకోవడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో చెన్నై చిన్నది సమంత కూడా ఒక ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. ఆమె పాత్ర ఏమటన్నదానికి కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట నటి సావిత్రి సమకాలీన నటి జమున. ఆ పాత్రగా నటి సమంత మారనున్నారని సమాచారం. జమున కూడా తన అసాధారణ నటనతో తమిళం, తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకున్న గొప్పనటి. అయితే మహానటి సావిత్రి జీవిత కథా చిత్రంలో నటి జమున పాత్ర ఏమిటన్నది ఆసక్తికరమైన అంశం. సావిత్రి, జమున మంచి స్నేహితురాళ్లు, ఒక సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని అంటారు. అలాంటి అంశాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించనున్నారా? అదే విధంగా నటి సావిత్రి జీవితంలో నటుడు, ఆమె భర్త జెమినీగణేశన్ ది కీలక పాత్ర. ఈ చిత్రంలో ఆయన పాత్రను ఎవరు పోషించనున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న నడిగైయన్ తిలగం(మహానటి) చిత్రంపై చిత్ర పరిశ్రమలో కుతూహలం నెలకొందన్నది మాత్రం నిజం. -
ఇంతకీ మహానటి ఎవరు?
ఆనాడు, ఈనాడు, ఏనాడు భారతీయ సినిమా మరువలేని మహానటి సావిత్రి. తమిళం, తెలుగు మొదలగు పలు భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సావిత్రిని తమిళ ప్రజలు నట తిలకవతిగా అభిమానించారు. పాత్రలకు ఆమె వన్నెనా? ఆమెకు పాత్రలు బలమా? అన్న ప్రశ్నకు నిస్సందేహంగా సావిత్రినే పాత్రలకు వన్నె అని ఎవరైనా అంటారు. అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న తొలి నటీమణి సావిత్రినే. అదే విధంగా ఖరీదైన కారు, ఆడంబరమైన బంగ్లాలో జీవనం సాగించిన మొట్టమొదటి నటి సావిత్రి అంటారు. అలాంటి నట విశారద చివరి దశలో ఏమి లేకుండా జీవితాన్ని సాగించారు. ఆ మహానటి జీవిత చరిత్రను వెండి తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యువ దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఇందులో సావిత్రి పాత్రను పోషించే నటి ఎవరన్నది ఇంత వరకూ ఒక స్పష్టత రాలేదు. అయితే ఆ పాత్రకు చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నటి సమంత సావిత్రిగా నటించనున్నారనే ప్రచారం కొన్ని రోజులు సాగింది. ఆ తరువాత ఆమె వెనుకడుగు వేశారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆపై బాలీవుడ్ భామ విద్యాబాలన్, నిత్యామీనన్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా మరో ప్రచారం హల్చల్ చేస్తోంది. సావిత్రి జీవిత చరిత్రలో యువ క్రేజీ నటి కీర్తీసురేశ్ నటించనున్నారదే ఆ ప్రచారం. అదే విధంగా మరో కీలక పాత్రలో నటి సమంత నటించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో సావిత్రిగా నటించే వారెవరన్నది ఇంకా క్లారిటీ లేదు. పూర్తి వివరాలు అధికారిక పూర్వంగా ప్రకటించే వరకూ ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. కాగా సమంత తమిళంలో మూడు చిత్రాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక కీర్తీసురేశ్ చేతిలోనూ మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్యకు జంటగా నటిస్తున్న తానాసేర్నద కూటం, మరోకటి తెలుగులో నాని సరసన పక్కాలోకల్ చిత్రంతో పాటు, పవన్ కల్యాణ్‌తో ఆన 25వ చిత్రంలో నటించనున్నారు. ఇక విజయ్‌తో రొమాన్స్ చేసిన భైరవా చిత్రం సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
మహానటి లిస్ట్‌లో మరోపేరు
దేశం గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవితకథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగఅశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై చాలా కాలం అవుతున్న ఇంతవరకు పట్టా లెక్కలేదు. ముఖ్యంగా మహానటి సావిత్రి పాత్ర కోసం నటిని ఎంపిక చేయడమే యూనిట్ సభ్యులకు కష్టమవుతోంది. ఇప్పటికే మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఈ లిస్ట్‌లో మరో పేరు వినిపిస్తోంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్‌ను ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ కీర్తీ పేరునైన యూనిట్ సభ్యులు ప్రకటిస్తారో లేక మరోసారి రూమర్స్ అంటూ కొట్టిపారేస్తారో చూడాలి. -
మహానటిగా నటిస్తున్నది ఎవరు ?
-
మసకబారని మహానటి
నేడు సావిత్రి వర్ధంతి ఆమె పేరు నిశ్శంకర సావిత్రి. తెలుగు, తమిళ ప్రజల గుండెల్లో నుండి చెరిగిపోని మహానటి. ఏ పద్మ పుష్పమూ ఆమె సిగలోకి చేరలేదు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్నీ ఆమె అందుకోలేదు. రఘుపతి వెంకయ్య పురస్కారానికీ ఆమె నోచుకోలేదు. అయినా అవార్డులకు అతీతమైనది సావిత్రి. గత 100 ఏళ్లలో అత్యుత్తమ భారతీయ నటుడిగా గుర్తింపుపొందిన ఎన్.టి. రామారావు ఆమె గురించి మాట్లాడుతూ – ‘‘సావిత్రితో నటించడం గొప్ప అనుభవం. ఆమె దర్శకుని ఆలోచనలను మెరుగుదిద్దుతుంది. ఒక్కోసారి ఆమెను అందుకోగలమా! అని భయపడ్డ సంఘటనలూ ఉన్నాయి’’ అన్నారు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు. శివాజీ గణేశన్ లాంటి గొప్ప నటుడు కూడా సావిత్రి సరసన నటించాలంటే ఒకింత జంకేవారు. వందేళ్లలో వచ్చిన అత్యుత్తమ భారతీయ చిత్రంగా ‘మాయాబజార్’ గుర్తింపు పొందింది. ఆ చిత్రం చూసిన రాజ్‌కపూర్ అట్లాంటిది వందేళ్లకు కూడా మళ్లీ రాదని చెప్పారు. ఆ సినిమా గురించి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘మాయాబజారులో డ్యూయెట్లు పాడిన నేను హీరో కాదు. కృష్ణుడు పాత్ర వేసిన ఎన్.టి. రామారావు కూడా హీరో కాదు, ఘటోత్కచుని పాత్ర వేసిన ఎస్.వి. రంగారావు కూడా హీరో కాదు. ఆ సినిమాలో నిజమైన హీరో ఎవరంటే... సావిత్రి’ అన్నారు. ప్రముఖ చిత్రం మిస్సమ్మలో ఎన్.టి. రామారావు, సావిత్రి ఒక జంటగా; నాగేశ్వరరావు, జమున ఒక జంటగా నటించారు. మొదట్లో ఆమె పోషించిన (మేరీ / మహాలక్ష్మి) పాత్రకు సావిత్రిని అనుకోలేదు. ఆమె స్థానంలో భానుమతి ఉండాల్సింది. జమున (సీత) పాత్రకు సావిత్రి ఉండాల్సింది. నిర్మాతలు ఆలూరి చక్రపాణి, బి. నాగిరెడ్డి. దర్శకుడు ఎల్.వి. ప్రసాద్. నిర్మాణ సమయంలో భానుమతి ఆలస్యంగా వస్తున్నారని, చక్రపాణి ఆమె ఎదుటనే అంతవరకు తీసిన 4 రీళ్లను తగులబెట్టి, ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చి ఇంటికి పంపారు. (నిజానికి, భానుమతి ఆలస్యంగా రావడానికి ఆ సమయంలో ఆమె చేస్తున్న వరలక్ష్మీ వ్రతాలు కారణం). భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకొని సావిత్రి ఉండాల్సిన స్థానంలో జమునను తీసుకొని సినిమాను పూర్తి చేశారు. తరువాతి జీవితంలో ఈ విషయాన్ని తాత్వికంగా తీసుకున్న భానుమతి ‘‘పోనీ లెండి, నా మూలాన ఒక మహానటికి అవకాశం వచ్చింది కదా!’’ అని నచ్చచెప్పుకున్నారు. సావిత్రి పుట్టింది చిర్రావూరు, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. (డిసెంబర్ 6, 1935) (విక్కీపీడియాతో సహా అనేక చోట్ల ఆమె జన్మించింది. జనవరి 4, 1936గా నమోదయింది. అనేక వ్యయప్రయాసలకోర్చి రచించిన ‘ఎ లెజెండరీ యాక్ట్రెస్, మహానటి సావిత్రి’ పుస్తకంలో వీఆర్ మూర్తి, వీ శోభరాజుగార్లు జనన–మరణ రిజిస్టర్ని అడిగి, పక్కా ఆధారాలతో ఆమె పుట్టిన తేదీని డిసెంబర్ 6, 1935గా నిర్ధారించారు) ఆరు నెలల వయస్సులో తండ్రి నిశ్శంకర గురవయ్య మరణించారు. సంగీతం, నృత్యం అభ్యసించిన సావిత్రి, సుంకర కనకారావు ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ సంగీత నాట్యమండలి, ఎన్.టి. రామారావు బావగారైన పుండరీకాక్షయ్య ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఆర్ట్స్ థియేటర్, పెదనాన్న కె.వి. చౌదరి నడిపించే నవభారత నాట్యమండలి తరఫున నాటకాల్లో కొంతకాలం నటించింది. తరువాత సినిమాల కోసం ఆ కుటుంబం మద్రాసు వెళ్లింది. కోన ప్రభాకరరావుకు రాజకీయ నేపథ్యంతో పాటు కళలపై అభినివేశం ఉంది. ఆయన బాపట్లలో పుట్టి మద్రాసులో లా పూర్తిచేశారు. 1967, 1972, 1978లో కాంగ్రెస్ నుండి అసెంబ్లీకి ఎన్నికైనారు. కొంతకాలం ఆం.ప్ర. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980–81లో అసెంబ్లీ స్పీకర్‌గా, భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో సభ్యునిగా, పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్రల గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాలకంటేSముందు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేశారు. 1949లో కె.ఎస్. ప్రకాశరావు నిర్మించి, ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘ద్రోహి’ చిత్రంలో ప్రతినాయకుడి భూమిక పోషించారు. 1951లో ఆయన దర్శకత్వం వహించిన ‘రూపవతి’ నటనాపరంగా సావిత్రికి మొదటి చిత్రం. అంతకుముందు ‘సంసారం’ చిత్రంలో నాగేశ్వరరావు సరసన నటించడానికి అవకాశం వచ్చింది. అయితే అప్పటికే ప్రఖ్యాతులైన నాగేశ్వరరావు సరసన మొదటిసారే నటిస్తున్నప్పుడు కలిగే సహజమైన భయాందోళనలతో నామమాత్రమైన చిన్న పాత్ర పోషించింది. తరువాత ‘పాతాళభైరవి’లో ఓ నృత్యానికి మాత్రమే పరిమితమైంది. ఆ రకంగా చూస్తే సినిమా రంగంలో సావిత్రిది గతుకుల ఆరంభమనే చెప్పాలి. 1952లో వచ్చిన ‘పెళ్లిచేసి చూడు’, తమిళ సినిమా ‘కళ్యాణం పన్నిపార్’ సావిత్రిని సినిమా రంగంలో నిలదొక్కుకోనిచ్చాయి. 1953లో వచ్చిన ‘దేవదాసు’ సినిమా ఆమెకు పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. 1952లో సావిత్రికి జెమినీ గణేశన్‌తో మద్రాసులోని చాముండేశ్వరి దేవాలయంలో రహస్యంగా పెళ్లయింది. చాలారోజుల వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. కొన్నేళ్ల తర్వాత లక్స్ సబ్బు అడ్వర్టయిజ్మెంట్ కోసం సావిత్రి గణేశ్ అని సంతకం చేయడంతో అది బయటకు పొక్కింది. అప్పటికే పెళ్లయిన జెమినీ గణేశన్‌తో మరో పెళ్లికి తన తల్లి, పెదనాన్న ఒప్పుకోరని పెళ్లిని రహస్యంగా ఉంచింది సావిత్రి.జెమిని గణేశన్‌ను ఒక జ్చిbజ్టీu్చ∙lౌఠ్ఛిటగా భావించవచ్చు. ఆయనది ఆడవాళ్లను ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీ. ఈ విషయంలో ఆయనకు, ప్రముఖ హాలీవుడ్ నటుడు గ్యారీ కూపర్‌కు పోలికలున్నాయంటారు. అలమేలు అనే ఆవిడతో ఆయనకు అసలు పెళ్లి జరిగింది. ఆ తరువాత తెలుగు నటి పుష్పవల్లితో సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రముఖ హిందీ నటి రేఖ, ఆమె చెల్లెలు రాధ వారి సంతానం. 1966లో 12 ఏళ్ల ప్రాయంలో, తెలుగు సినిమా ‘రంగులరాట్నం’తో సినీరంగ ప్రవేశం చేశారు రేఖ. పుష్పవల్లి సోదరి సూర్యప్రభ వేదాంతం రాఘవయ్య (దేవదాసు సినిమా దర్శకుడు) గారి భార్య. జెమినీ గణేశన్‌కు సావిత్రికి సాన్నిహిత్యం ఏర్పడి పెళ్లికి దారితీసింది. (సాంకేతికంగా జెమినీ గణేశన్కిది రెండవ పెళ్లి). వారి సంతానం విజయ చాముండేశ్వరి, శ్రీరామ నారాయణ సతీష్‌కుమార్. విజయ చాముండేశ్వరి మద్రాసులోనూ, సతీశ్‌కుమార్ అమెరికాలోనూ స్థిరపడ్డారు. జెమినీ గణేశన్‌తో పెళ్లయిన తరువాత 15, 20 ఏళ్ళ దాకా తాను తప్పు చేశానేమో అన్న సందేహం అంతగా కలగలేదు సావిత్రికి. తన భార్య అలమేలుకు, తమ ఇద్దరి మధ్య ప్రేమ గురించి తెలుసనీ, ఆమెకు తన సంబంధం పట్ల అభ్యంతరం లేదని జెమినీ గణేశన్ చెప్పడమూ ఒక కారణం కావచ్చు. కొంతకాలం తర్వాత జెమినీ గణేశన్ నిరాదరణతో సావిత్రికి జీవితంలో అసంతృప్తి మొదలైంది. సావిత్రికి నటనాపరంగా అత్యుత్తమ పురస్కారం ‘చివరకు మిగిలేది’ చిత్రం ద్వారా లభించింది. 1960లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రానికి ప్రముఖ రచయిత బుచ్చిబాబు అదే పేరుతో రాసిన గొప్ప నవలకు సంబంధం లేదు. ఆయన పేరు మెన్నేని సత్యనారాయణ. మూడుసార్లు ఎంపీగా, ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా, వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గ సభ్యునిగా వ్యవహరించారు. అడపాదడపా వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ విలేకరుల నుండి ఆదరణ పొందారు. సత్యనారాయణరావు గారిని కలుపుకుని ‘చివరికి మిగిలేది’ చిత్ర నిర్మాతలు దాదాపు 10 మంది. ఇందులో ముఖ్యులు అప్పుడు యువజన కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న సత్యనారాయణరావు, వి. పురుషోత్తమరెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి. ఈ విషయం తెలిసి అప్పటి మంత్రివర్గ సభ్యుడు బ్రహ్మానందరెడ్డి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి ‘వీరు ఉత్సాహవంతులైన యువకులు, వీరికి సహాయం చేయండి’ అని కోరారు. నిర్మాతలు నాగేశ్వరరావుని నటించమని కోరారు. అయితే, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల అమెరికాకు వెళ్లవలసి వస్తుందనీ, ఫలితంగా షూటింగ్‌కు అంతరాయం కలగొచ్చనీ, అందువల్ల నటించలేనని చెప్పారు. బాలయ్య, కాంతారావుల పేర్లను నిర్మాతలకు సూచించి, స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించారు. నిర్మాతలు మద్రాసులో సావిత్రిని కలిసి చిత్రంలో నటించమంటే, తన షెడ్యూల్ చాలా బిజీగా ఉందనీ, నటించలేనని చెప్పారు. బలమైన కారణం మాత్రం నిర్మాతలు అపరిచితులు, కొత్తవారు కావడమే. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక, వి. పురుషోత్తంరెడ్డి, యం సత్యనారాయణరావులు నాగేశ్వరరావును కలిసి ‘ఏ విధంగానైనా మీరు ఆమెను ఒప్పించాలి’ అని ప్రాధేయపడ్డారు. నాగేశ్వరరావు సావిత్రికి ఫోన్ చేసి, ‘చూడు సావిత్రీ... మనం అర్టిస్టులం. మన తృప్తికొరకు మనం కొన్ని చేయాలి. మనం బతకాలంటే ప్రజల తృప్తి కొరకు ఎక్కువ సినిమాలు చేయాల్సి వస్తుంది. నీకు ఈ సినిమా అపారమైన పేరు తెచ్చిపెడుతుంది’’ అని చెప్పారు. సావిత్రి ఒప్పుకుంది.నాగేశ్వరరావు అటు బాలయ్య, కాంతారావులను, ఇటు సావిత్రినే కాకుండా మద్రాసులోని విజయా డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్ చేసి సహకరించమని చెప్పారు. చివరకు మిగిలేది ఇతివృత్తం – ఒక మానసిక రోగిని మామూలు మనిషిని చేయడానికి నర్సు అతన్ని ప్రేమించినట్లు నటిస్తుంది. పోనుపోను నటనకు, ప్రేమకు హద్దు చెరిగిపోయి అతనితో నిజంగానే ప్రేమలో పడుతుంది. అతను మామూలు మనిషవుతాడు. నర్సు ప్రేమ రోగి అవుతుంది. ఇక మరో వృత్తాంతం ఏమిటంటే... మందాడి ప్రభాకర్‌రెడ్డి అనే ఆర్టిస్టుది నల్గొండ జిల్లా. తుంగతుర్తి పట్టణం. ఆయన వృత్తిరీత్యా డాక్టర్. 1955 నుండి 1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదివారు. 1959లో విడుదలైన ‘మా ఇంటి మహాలక్ష్మి’ సినిమా దర్శకుడైన గుత్తా రామినీడు ‘చివరకు మిగిలేది’ సినిమాకు కూడా దర్శకుడు. ‘మా ఇంటి మహాలక్ష్మి షూటింగ్ కొరకు హైదరాబాద్‌కు వచ్చిన రామినీడు అంతర్గత కళాశాలల నాటక పోటీలో బహుమతి ప్రదానోత్సవానికి వచ్చారు. అక్కడ బహుమతి అందుకున్న ప్రభాకర్‌రెడ్డి తరువాత రామినీడును కలిసి ‘నేను సినిమాలకు పనికొస్తానా?’ అని అడిగారు. రామినీడు అతనికి ధైర్యం చెప్పారు. రామినీడు ‘చివరికి మిగిలేది’ సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు ప్రభాకర్‌రెడ్డిని గుర్తుపెట్టుకుని అతనికి డాక్టర్ పాత్రలో సినిమా రంగంలో తొలి అవకాశం ఇచ్చారు. అయితే.... అప్పటికే ఉన్నత శిఖరాన్ని చేరుకున్న సావిత్రితో నటించడానికి, అప్పుడే ఎంట్రీ చేసిన ప్రభాకర్‌రెడ్డి మానసికంగా సిద్ధంగా లేరు. ఒక సన్నివేశంలో, సావిత్రిని ప్రభాకర్‌రెడ్డి చెంపదెబ్బ కొట్టాలి. ఆ పని చేయడానికి ఆయనకు ముచ్చెమటలు పోస్తున్నాయి. పరిస్థితి గమనించిన సావిత్రి ఒక మగ జూనియర్ ఆర్టిస్టును పిలిచి చెంపదెబ్బ కొట్టారు. ఆ సందర్భంలో ఒక మహిళ మరో మగవాడిని చెంపదెబ్బ కొట్టడం ప్రొవొకేటివ్గా పనిచేసింది. ప్రభాకర్‌రెడ్డికి ధైర్యం చెప్పి రిలాక్స్డ్గా నటించమని ప్రోత్సహించారు సావిత్రి. సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా ముగిసింది. ఆ తరువాత ప్రభాకర్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 472 సినిమాల్లో నటించారు. 27 సినిమాలు నిర్మించారు. 21 చిత్రాలకు కథారచన చేశారు. ‘భూమికోసం’ చిత్రంలో నటించిన ప్రభాకర్‌రెడ్డి సలహా మేరకు అందులో తెరంగేట్రం చేసిన ‘లలితా రాణి’ పేరును ‘జయప్రద’గా (ఎం. ప్రభాకరరెడ్డి గారి వదిన పేరు జయప్రద) మార్చారు. ఈ చిత్రంలో పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కె.జి. సత్యమూర్తి (శివసాగర్) రెంజిమ్ పేరుతో రాసిన ‘చిన్నారీ చిలకమ్మా, చెల్లీ చంద్రమ్మా’ అనే పాటను జయప్రదపై చిత్రీకరించారు. సావిత్రి నటించి, ఆమె మృతి తరువాత. చివరిగా 1985లో విడుదలైన ‘అందరికంటే మొనగాడు’లో ప్రభాకర్‌రెడ్డి నటించడం ఒక ఆసక్తికరమైన ఘటన.‘చివరకు మిగిలేది’ సినిమా 1960 ఏడాదికి ఉత్తమ తెలుగు సినిమాగా ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకుంది. సావిత్రి ఉత్తమ నటిగా రాష్ట్రపతి పురస్కారమందుకున్నారు. తాను నటించిన చిత్రాలన్నిటిలోనూ ‘చివరకు మిగిలేది’లో పోషించిన పాత్ర తనకెంతో నచ్చిందని సావిత్రి చెప్పారు. అయితే ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ ‘దేవదాసు (1953)’ పార్వతి పాత్ర, ‘కన్యాశుల్కం’ (1955)లో మధురవాణి పాత్ర, ‘మాయాబజార్’ (1957)లో శశిరేఖ పాత్ర, సావిత్రి నటజీవితంలో కలికితురాయిలని భావిస్తారు. కొంత విచ్చలవిడిగా ఖర్చుపెట్టి, కొంత వితరణశీలిగా దానం చేసి, మరికొంత మత్తుపదార్థాల వ్యసనానికి బానిసై చాలా డబ్బు పోగొట్టుకుంది సావిత్రి. అదే కాకుండా సావిత్రి సంపాదించిన ఆస్తుల్లో కొన్ని ఇన్‌కంటాక్స్ కేసుల్లో కరిగిపోయాయి. ఆమె కొన్నాళ్లు కూతురు విజయచాముండేశ్వరి దగ్గర ఉన్నారు. అయితే ఆమె పేదరికంలో చనిపోయిందని కొంతమందిలో ఉన్న అభిప్రాయం సరైంది కాదు. చనిపోయేనాటికి ఆమెకు కొన్ని ఆస్తులు మద్రాసు, హైదరాబాద్, బెంగుళూరులలోనూ ఉన్నాయని చెప్తారు. సినీ విమర్శకుడు నందగోపాల్‌కు ఇచ్చిన ఆఖరి ఇంటర్వూ్యలో సావిత్రి తన మనసులో మాటను వెలిబుచ్చారు. – ‘‘నా సమాధిపై నిలిపే సంస్మరణ ఫలకం మీద చెక్కే చివరి వాక్యాలు ఇలా ఉండాలి. ‘జీవితంలోనూ, మరణంలోనూ మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతున్నది. ఎవ్వరూ ఇచ్చట సానుభూతితో వేడి కన్నీటిబొట్టు విడువనక్కర్లేదు. సమాజం దృష్టిలో ఏ తారైనా హీనంగా చూడబడకుండా ఉండటానికి ఇచ్చట నిద్రిస్తున్న మరణం లేని మహా ప్రతిభకు స్మృతిచిహ్నంగా ఒక చిన్ని పూలమాలికను ఉంచండి. అది చాలు’’ అన్నారామె.ఆమెను మనం స్మరించుకున్న రోజున ఆమె అంగీకరించే ఒక చిన్ని పూలమాలికతోపాటు, ఆమె వారించినా కూడా, ఒక వేడి నిట్టూర్పును విడవకుండా ఉండలేం. ఒక బరువెక్కిన కన్నీటి చుక్కను కార్చకుండానూ ఉండలేం. సావిత్రికి వచ్చిన చెప్పుకోదగ్గ గుర్తింపులు: ► 1960లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రంలో నటనకు రాష్ట్రపతి పురస్కారం. ► 1961లో మద్రాసు ఆళ్వార్‌పేటలో ‘శ్రీనివాస గాంధీనిలయం’ అనే సామాజిక సేవా సంస్థ ‘నడిగయర్ తిలకం’ బిరుదునిచ్చి సత్కరించడం. నడిగయర్ తిలకం అంటే నటీశిరోమణి అని అర్థం. ► 1964లో ఆంధ్ర మహిళా సభకు అనుబంధ సంస్థ అయిన ఆంధ్ర యువతీ మండలి ‘మహానటి’ బిరుదునిచ్చి సత్కరించడం. ► 1968లో తమిళనాడు ప్రభుత్వం తరఫున, అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై గారి చేతుల మీదుగా ‘కలైమామణి’ పురస్కారం. ► ‘‘నా దృష్టిలో సినిమా రంగంలో ముగ్గురు స్త్రీ శిల్పులున్నారు. రాయిని ఉలితో కొడుతూ అందమైన శిల్పాన్ని శిల్పి సృష్టిస్తాడు. కేవలం ఒక ఓర చూపుతో, కనుబొమ ముడితో, పెదవి కదలికతో, చిరునవ్వుతో, తల తిప్పడంతో ఎలాంటి భావాన్నైనా ప్రదర్శించగల ఆ ముగ్గురు స్త్రీ శిల్పుల్లో ఇద్దరు మన తెలుగువారు కావడం యావత్తు భారతదేశం గర్వించదగ్గ విషయం. మన సినిమా రంగంలోని ఆ స్త్రీ శిల్పులు సావిత్రి, జి. వరలక్ష్మి, మూడవ ఆమె హిందీ నటి మీనాకుమారి’’ – శ్రీశ్రీ. ► శ్రీశ్రీ ఉటంకించిన ముగ్గురు స్త్రీ శిల్పుల్లో ఒకరైన మీనాకు మారి సినిమాల్లో ఎక్కువగా దుఃఖపూరితమైన పాత్రలే పోషించారు. సావిత్రి కొన్ని సరదా పాత్రలు, కొన్ని సమతు ల్యమైన పాత్రలు, కొన్ని దుఃఖపూరితమైన పాత్రలు పోషిం చారు. ఇద్దరివీ సంతృప్తికరమైన వైవాహిక జీవితాలు కావు. ► గొప్ప నటి అయిన మీనా కుమారి సావిత్రి గురించి ఇలా చెప్పారు – ‘సావిత్రి నటన చూస్తుంటే చాలాసార్లు నా నటన గురించి నాకే సందేహాలు కలుగుతాయి. భావస్ఫోరకమైన కళ్లు, ఆకర్షణీయమైన పెదవులు, సందర్భోచితమైన హావభావాలు, అన్నీ కలిపి ఆమెను అత్యున్నత నటీమణుల సరసన ఉంచుతాయి.’’ ► సావిత్రికన్నా 7 సంవత్సరాలు పెద్దదైన, ముగ్గురు స్త్రీ శిల్పుల్లో మూడవ వారైన జి. వరలక్ష్మి సంతృప్తికరంగానే జీవితం గడిపారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విభిన్నమైన అనుభవాలను చవిచూశారు. నిర్మాత కె.ఎస్. ప్రకాశరావును పెళ్లి చేసుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు 1995లో రఘుపతి వెంకయ్య పురస్కారమిచ్చారు. ► ఒక సందర్భంలో జి. వరలక్ష్మి ‘అమాయకురాలైన సావిత్రికి రెండవ వివాహం చట్టరీత్యా చెల్లదని తెలియదు’ అని చెప్పడం జరిగింది. 78 ఏళ్ల చివరి దశలో జెమినీ గణేశన్ 36 ఏళ్ల క్రిస్టియన్ అమ్మాయి, నర్సు అయిన జూలియానాను పెళ్లి చేసుకున్నారు. ఈ దశలో పెళ్లేమిటని అడిగితే ముదుసలి దశలో పిన్నవయస్కురాలే సరైన పరిచర్యలు చేయగలుగుతుందన్నారు. కొంతకాలం తరువాత జూలియానా జెమినీ గణేశన్ నుండి విడాకులు తీసుకున్నారు. జీవితంలో సరైన ఆదరణ, ఆప్యాయత చూపని తండ్రి జెమినీ గణేశన్ దహన సంస్కారాలకు రేఖ వెళ్లలేదు. ► 1953లో వచ్చిన దేవదాసు చిత్రం సావిత్రి నటనా జీవితానికి ఒక పెద్ద మలుపు. సావిత్రి మాటల్లో – ‘‘నేను పార్వతి లాంటి కష్టమైన పాత్రను ఎప్పుడూ చేయలేదు. ఈ పాత్రను పోషించవలసి వుందని తెలియగానే చక్రపాణి గారి పుస్తకం (దేవదాసు అనువాదం) అయిదుసార్లు చదివాను. ప్రతిసారి పార్వతి పాత్రలో లీనమైపోయేదాన్ని. ఆ పాత్రను గురించి తలచుకుంటేనే ఏడుపు వచ్చేది. నా పాత్రను నిర్వహించడానికి డైరెక్టరు గారు (వేదాంతం రాఘవయ్య) పూర్తి అవకాశాలిచ్చారు. నాకు తృప్తి లేక మళ్లీ షాట్ తీయమంటే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా తీసేవారు. అనేకమార్లు నాకు ఆ సంభాషణలు చెబుతుంటేనే పార్వతి జీవితమంతా జ్ఞాపకం వచ్చి దుఃఖం పొంగివచ్చేది. అసలీ పిక్చర్లో గ్లిసరిన్ వాడే అవకాశమే కలగలేదు. షాట్ అయిపోయాక కూడా ఏడ్చేసేదాన్ని. ఒకవంక డైరెక్టర్ గారు (వేదాంతం రాఘవయ్య) కూడా ఏడ్చేస్తుండేవారు. మాకే విచిత్రంగా ఉండేది.’’ ► దానధర్మాల విషయంలో సావిత్రిది ఎముకలేని చెయ్యి. ఒకసారి ప్రఖ్యాత గాయని సుశీల సినీరంగంలోని సీనియర్ల సహాయార్థం విరాళాల కోసం సావిత్రి దగ్గరకు వెళ్లింది. సావిత్రి పర్సులో ఎంత డబ్బుంతో లెక్కపెట్టకుండానే ఉన్న డబ్బంతా తీసి ఇచ్చేసింది. ఒకసారి ఒళ్లంతా బంగారు నగలు వేసుకుని తన భర్త జెమినీ గణేశన్‌ను వెంటబెట్టుకుని ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి మద్రాసుకు వచ్చినప్పుడు కలిసి, తాను ధరించిన ఒక్కొక్క నగను ఒలుచుకుంటూ జాతీయ రక్షణ నిధికి ఇచ్చివేశారు. పేద విద్యార్థుల సహాయార్థం ముఖ్యమంత్రి యంజిఆర్ వేసుకున్న పూలదండను వేలం వేస్తే అందరికంటే ఎక్కువ ధరకు పాడి, ఆ తరువాత కట్టడానికి చేతిలో డబ్బు లేక బంగారం అమ్మి అవస్థలుపడ్డ వ్యక్తి సావిత్రి. ► జ్ఞానపీuŠ‡ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ ‘‘గాలి నిండా సువాసనను నింపే మంచి గ్రంధపు ముక్క వంటిది సావిత్రి! చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూర తునక వంటిది సావిత్రి!’’ అన్నారు. ► ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావుతో, బాపు, రమణలు అన్నారట – ‘‘ఈ విశ్వంలో మానవాళికి ... ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే ఆకాశం! ఒకే సావిత్రి... ఈ సినిమా ప్రపంచానికి!’’ వి.కె. ప్రేమ్‌చంద్ 98480 52486 – వి.కె. ప్రేమ్‌చంద్ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - సావిత్రి.
-
సావిత్రి పాత్రను వదిలేశారు ఎందుకో తెలుసా?
నటనకు భాష్యం చెప్పిన నటి సావిత్రి. ఎంజీఆర్, శివాజీగణేశన్, జెమినీగణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి నట దిగ్గజాలకు దీటుగా నటించి ఖ్యాతి గడించిన మహానటి సావిత్రి. ఆ నటవిశారదకు సాటి లేరు. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నట్లు సమాచారం. నాగ్అశ్విన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రను నటి సమంత నటించడానికి ముందుకు వచ్చారు. సావిత్రి లాంటి గొప్ప నటి పాత్రలో నటించడం అదృష్టం అని కూడా వెల్లడించిన సమంత అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఆహార్యమే. సావిత్రి తొలి రోజుల్లో చాలా లావుగా ఉండేవారు. ఆ తరువాత బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారు. అదే విధంగా సమంతను బరువు పెరువు పెరగాల్సిందిగా దర్శక నిర్మాతలు కోరారట. ఇప్పటికే నాగచైతన్యతో పెళ్లికి సిద్ధం అవుతున్న సమంత అదే విధంగా తన కొత్త చిత్రాలకు బరువు పెరగడం వల్ల సమస్యలు తలెత్తుతాయని భయపడి ఆ చిత్రాన్నే వదిలేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అందాల నటి అనుష్క ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం భారీగా బరువు పెంచి, ఆ తరువాత బాహుబలి–2 చిత్రం కోసం బరువు తగ్గలేక నానా తంటాలు పడిన విషయం తెలిసిందే. ఇవన్నీ ఆలోచించిన సమంత సావిత్రి పాత్ర నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇప్పుడు సావిత్రి పాత్ర కోసం నటి నిత్యామీనన్ సీన్ లోకి వచ్చినట్లు తెలిసింది.ఆమెను ఎంపిక చేసే విషయం గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. -
మహానటి సావిత్రిగా నిత్యామీనన్
నటిగా అభినేత్రి సావిత్రిని కీర్తించడం సాహసమే అవుతుంది. సినిమా ఉన్నంత కాలం ఈ మహానటి గుర్తుండిపోతుంది. దిగ్గజాల్లాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళంలో ఎమ్జీఆర్, శివాజీగణేశన్, జెమినిగణేశన్ వంటి నటులకు దీటుగా నటించిన మేటి నటి సావిత్రి. ఆమె నిజ జీవితం వెలుగు నీడ అనాలో, చీకటి వెలుగు అనాలో తెలియదు గానీ, ఒక చరిత్ర అని మాత్రం చెప్పవచ్చు. అలాంటి అత్యున్నత నటి సావిత్రిని అనుకరించడం అన్యులకు సాధ్యం కాదు. అయితే అలాంటి ప్రయత్నానికి ఇప్పుడు యువ నటి నిత్యామీనన్ సాహసిస్తుండడం విశేషం. సావిత్రి జీవితాన్ని తెరకెక్కించనున్నారు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. ఇదీ ఆయనకు ఒక సాహసమే అనక తప్పదు. కాగా ఆయన సావిత్రి నిజ జీవితాన్ని సునిశితంగా శోధించి కథను సిద్ధం చేసుకున్నారట. దాన్ని తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో సావిత్రి పాత్రకు నటి నిత్యామీనన్ అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించ గా తను పచ్చజెండా ఊపారని కోలీవుడ్ వర్గాల సమాచారం. చిత్రం డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తారల బయోగ్రఫీతో చిత్రాలు తెరకెక్కడం అన్నది అరుదైన విషయమే. ఆ మధ్య శృంగార తార సిల్క్‌స్మిత జీవిత చరిత్రతో హిందీలో ద డర్టీ పిక్చర్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అందులో స్మిత పాత్రలో నటించిన ప్రముఖ నటి విద్యాబాలన్ జాతీయ అవార్డును అందుకున్నారు. అయితే ఆ కథకు సావిత్రి జీవిత కథకు చాలా వ్యత్యాసం ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
'మహానటి'గా మలయాళీ బ్యూటీ
-
'మహానటి'గా మలయాళీ బ్యూటీ
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు నాగ అశ్విన్ తన రెండో ప్రయత్నంగా ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన మహానటి సావిత్రి జీవిత చరిత్రను వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు హీరోయిన్ వేట కూడా కొనసాగుతోంది. నటిగా ఎన్నో అద్భుత విజయాలను సాధించిన సావిత్రి పాత్రలో నటించేందుకు సరైన నటి ఎవరన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తొలుత ఈ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ను తీసుకుంటారన్న టాక్ వినిపించింది. అయితే దర్శకుడు ఈ వార్తలను ఖండించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఆ తరువాతే నటీనటుల ఎంపిక మొదలు పెడతామని ప్రకటించాడు. అయితే తాజాగా మహానటి పాత్రకు మరో హీరోయిన్ ను సంప్రదించారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నిత్యామీనన్ ను మహానటి సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు నాగ అశ్విన్, నిత్యా మీనన్ కు కథ కూడా వినిపించాడట.. అయితే నిత్యా నుంచి ఎలాంటి హామి రాలేదన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై ఆమె త్వరలోనే తన నిర్ణయం ప్రకటించనుంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.