మిస్సమ్మ సీన్‌ను ఎందుకు తీసేశారు? | Mahanati Missiamma Song Deleted Scene Out | Sakshi
Sakshi News home page

May 24 2018 6:47 PM | Updated on May 24 2018 7:02 PM

Mahanati Missiamma Song Deleted Scene Out - Sakshi

తొలగించిన దృశ్యంలోని సన్నివేశం

మహానటి చిత్ర విజయాన్ని టాలీవుడ్‌ మొత్తం ఆస్వాదిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నాగ్‌ అశ్విన్‌ మరియు నిర్మాతల సాహసాన్ని అభినందిస్తున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటికి తొలి రోజు నుంచే మంచి ఆదరణ లభిస్తోంది. ఇక చిత్ర నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను మేకర్లు ఒక్కోక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. తాజాగా తమిళ మిస్సమ్మ సినిమాలోని వారాయో వెన్నిలావే (రావోయి చందమామ) సాంగ్‌ సీన్‌ను విడుదల చేశారు. జెమినీ గణేషన్‌-సావిత్రి రోల్స్‌లో దుల్కర్‌-కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన సీన్‌ ఆకట్టుకునేలా ఉంది. అయితే బాగున్న ఈ సీన్‌ను ఎందుకు తీసేశారని? సినిమాలో ఉంచాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్‌ వద్ద రూ. 30 కోట్లకు పైగా సాధించటంతోపాటు ఓవర్సీస్‌లోనూ మహానటి ప్రభంజనం కొనసాగిస్తోంది. సమంత, విజయ్‌ దేవరకొం‍డ, రాజేంద్ర ప్రసాద్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని  స్వప్న, ప్రియాంక దత్‌లు సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement