అచ్చం సావిత్రి, జెమినీ గణేషన్‌లా... | Keerthi Suresh, Dulquer Salmaan Looks Like Savitri, Gemini Ganesan | Sakshi
Sakshi News home page

అచ్చం సావిత్రి, జెమినీ గణేషన్‌లా...

Published Fri, Mar 16 2018 11:51 AM | Last Updated on Fri, Mar 16 2018 11:51 AM

Keerti suresh mahanati photo - Sakshi

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటో

ప్రస్తుతం సినీ అభిమానులను దాదాపు ముప్పై, నలభైయేళ్లు వెనక్కు తీసుకెళ్లే పనిలో ఉన్నారు దర్శకులు. అందులో ఒకటి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న రంగస్థలం, మరొకటి నాగ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న మహానటి చిత్రం. 1980 నేపథ్యంలో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. ఈ సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్‌, టీజర్స్‌ చూసిన ప్రేక్షకులు అప్పటి కాలం అనుభూతికి లోనవుతున్నారు.

ఇక సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహానటి. అంటే దాదాపు యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి అప్పటి పరిస్థితులను తెరపై ఆవిష్కరిస్తున్నాడు నాగ్‌ అశ్విన్‌.అయితే మహానటికి సంబంధించిన సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్‌  ఫస్ట్‌ లుక్‌ మాత్రమే విడుదల అయింది. అయితే ఆ సినిమాలో ఇతర పాత్రలకు సంబంధించి ఎలాంటి న్యూస్‌తో పాటు ఫోటోలు బయటకు రాలేదు.

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం సావిత్రి, జెమినీ గణేషన్‌లను తలపించేలా కీర్తిసురేశ్‌, దుల్కర్‌ సల్మాన్‌ల ఫోటో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోను ఎవరైనా అభిమాని డిజైన్‌ చేసి ఉంటాడని కొంతమంది, మహానటి పోస్టర్‌ లీకైందని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా... ఈ చిత్రం మాత్రం నాటి తరం తారాగణాన్ని గుర్తుచేసేలా...సరికొత్త అనుభూతికి గురయ్యేలా చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ పోస్టర్‌ పై చిత్ర యూనిట్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement