Keerthi Suresh
-
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
-
సన్నగా ఎందుకు అయ్యారు కీర్తి అని ప్రశ్నించిన బిత్తిరి సత్తి
-
అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన తండ్రి
మలయాళ నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్గా సౌత్ ఇండియాలో నిలదొక్కుకుంది. సావిత్రి బయోపిక్ మహానటిలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ అవార్డు అందుకుంది. కానీ ఆమెకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు. కానీ కీర్తి పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడం జరుగుతోంది. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కాలక్రమంలో అవన్నీ అబద్ధమని కూడా తేలింది. ఈసారి, ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కలిసి ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. స్పందించిన కీర్తి సురేష్ తండ్రి అనిరుధ్ రవిచందర్‌తో ఆమె పెళ్లి పుకార్లపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ ఇలా స్పందించారు. ' కీర్తి- అనిరుధ్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రచారాలు అన్నీ నిరాధారమైనవి, వాటిలో ఏ మాత్రం కూడా నిజం లేదు. కీర్తి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఇలాంటివి చాలానే ఉన్నాయి. తాజాగా కీర్తి, అనిరుధ్ గురించి ఎవరో కావాలనే ఒక వార్తను క్రియేట్ చేసి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు.' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో కీర్తి సురేష్ కూడా అనిరుధ్‌తో పెళ్లి పుకార్లను ఖండించింది. టైమ్స్ నౌతో ఆమె మాట్లాడుతూ.. అది తప్పుడు వార్త అని అనిరుధ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. పెళ్లి రూమర్స్ ఎందుకు వచ్చాయ్ అయితే, కీర్తి సురేష్, అనిరుధ్ రవిచందర్ పెళ్లిపై పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదని గమనించాలి. రెమో (శివ కార్తికేయ), గ్యాంగ్ (సూర్య), అజ్ఞాతవాసి వంటి మరెన్నో చిత్రాల కోసం కీర్తి, అనిరుధ్ కలిసి పనిచేశారు. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా అంటారు. ఇటీవల ఆమె జవాన్‌లోని అనిరుద్ బ్లాక్ బస్టర్ సాంగ్ చలేయా.. పాటకు డైరెక్టర్ అట్లీ భార్య కృష్ణ ప్రియతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. అది కూడా భారీగా వైరల్ అయింది. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి పుకార్లు కొన్ని నెలల క్రితం దుబాయ్‌కి చెందిన ఫర్హాన్ అనే వ్యాపారవేత్తతో కీర్తి సురుష్ సంబంధంలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో పెళ్లి పుకార్లకు ఆజ్యం పోసింది. అయితే, ఈ వార్త వైరల్ కావడంతో, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడని ఆమె స్పష్టం చేసింది. ఆ సమయంలో ఆమె తండ్రి కూడా ఈ వార్తలను తిప్పికొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆమె మరోకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. త్వరలో తన మిస్టరీ మ్యాన్ గురించి చెప్తానని వెల్లడించింది. (ఇదీ దచవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లా..? హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023 తమిళం, మలయాళ సినిమాలలో తమ సత్తా చాటిన నటీనటులకు సెప్టెంబర్ 16న అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తెలుగు,కన్నడ సినిమాలకు చెందిన అవార్డులు కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. దీంతో సైమా అవార్డ్స్ 2023 వేడుక ముగిసింది. తమిళ్ నుంచి విక్రమ్ సినిమాకు గాను కమల్ హాసన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ సారి త్రిష,అనిరుధ్, కీర్తి సురేష్, మణిరత్నం,మాధవన్ వంటి సూపర్ స్టార్స్‌కు అవార్డ్స్ దక్కాయి. తమిళ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (తమిళం): (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ దర్శకుడు (తమిళం): లోకేష్ కనగరాజ్ (విక్రమ్) * ఉత్తమ నటుడు (తమిళం): కమల్ హాసన్ (విక్రమ్) * ఉత్తమ నటి (తమిళం): త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేష్ (సాని కాయిదం) తెలుగులో చిన్ని * ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (విక్రమ్) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1) * ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్ టీనా * ఉత్తమ సహాయ నటుడు (తమిళం): కాళీ వెంకట్ (గార్గి) * ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్) * ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే) * ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల * ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి) * ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే) * ఉత్తమ నూతన నటి: అదితి శంకర్ (విరుమాన్) * ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం * ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ - 1) (ఇదీ చదవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లి.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) -
జిమ్‌లో నేషనల్ క్రష్ రష్మిక.. శారీలో మత్తెక్కిస్తోన్న మహానటి!
►ఆరెంజ్ డ్రెస్‌లో మాళవిక మోహనన్ హాట్ లుక్స్! ►జిమ్‌లో చెమటోడుస్తున్న నేషనల్ క్రష్ రష్మిక! ►షర్ట్ ధరించి అనసూయ హోయలు! ►తన అందంతో కవ్విస్తోన్న ఆషిక రంగనాథ్! ►నేచర్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఆదా శర్మ! ►బ్లాక్ అండ్ వైట్ శారీలో మత్తెక్కిస్తోన్న మహానటి! View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
కీర్తి సురేశ్ అందంగా ఉండేందుకు.. అవి వాడుతుందట!
తమిళ నటి కీర్తీ సురేశ్ తెలుగు, తమిళం, మలయాళం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే దసరా సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే చిరంజీవి సినిమా బోళా శంకర్‌లో అతడికి చెల్లిగా నటించి మంచి నటిగా మార్కులు కొట్టేసింది. కళ్లు చెదిరే అందంతో, క్యూట్ లుక్స్‌తో మతిపోగొట్టే కీర్తీ తన అందం వెనుక దాగున్న రహస్యం గురించి పంచుకుంది. బ్యూటీ సీక్రెట్ మానసిక, శారీరక ఉల్లాసం కోసం నేను ప్రతిరోజూ యోగా చేస్తాను. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి.. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాను. చర్మసంరక్షణలో సహజమైన పద్ధతుల్నే పాటిస్తాను. అంటే.. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్క్రబ్ చేసుకోవడం.. పచ్చి పసుపు కొమ్ము పేస్ట్‌లో కొన్ని చిక్కటి పాలు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటాను. షూటింగ్ లేని సమయంలో మేకప్‌కి దూరంగా ఉంటాను. అని చెబుతోంది కీర్తి. (చదవండి: వన్నె తరగని నయన తార బ్యూటీ రహస్యం ఇదే..ఆ క్రీమ్ లేకుండా..) -
కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్ ఇదేనా?
ఒకటి రెండు చిత్రాలు ప్లాప్ అయితే ఆ చిత్రాల్లో నటించిన హీరోయిన్లను ఐరన్‌లెగ్ అనీ, వారి పని అయిపోయిందని సినీ వర్గాల్లో ప్రచారం జరగడం పరిపాటిగా మారింది. అయితే అలా ఒకటి రెండు చిత్రాల ప్లాప్‌లతో హీరోయిన్ల కెరీర్‌ను అంచనా వేయడం సరికాదు. నటి కీర్తి సురేష్ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కీర్తీసురేశ్ అక్కడ కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టాలీవుడ్లోకి రంగప్రవేశం చేశారు. (ఇదీ చదవండి; Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) ఇక్కడ మహానటి చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో కీర్తీసురేశ్ చాప్టర్ క్లోజ్ అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇటీవల తెలుగులో నటించిన దసరా, తమిళంలో నటించిన మామన్నన్ చిత్రాల విజయాలు ఆమెను మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చాయి. తాజాగ భోళా శంకర్‌లో కూడా చిరంజీవికి చెల్లెలుగా నటించింది. దీంతో కీర్తి మళ్లీ బిజీ నాయకిగా మారారు. అంతేకాదు బాలీవుడ్లో బెర్త్‌ను ఖరారు కూడా చేసుకున్నారు. నిజానికి కీర్తి సురేష్‌కు ఇంతకు ముందే హిందీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈమె బాలీవుడ్ ఎంట్రీకి ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ బ్యూటీని తమిళ యువ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు తీసుకెళుతున్నారని సమాచారం. తమిళంలో నటుడు విజయ్ హీరోగా వరుసగా మూడు హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల బాలీవుడ్‌లోకి ప్రవేశించి షారూక్ ఖాన్ హీరోగా జవాన్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా నటి నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా తాజాగా అట్లీ బాలీవుడ్లో నిర్మాతగా పరిచయం అవుతూ నటి కీర్తి సురేష్‌ను అక్కడకు తీసుకెళ్తున్నారు. తమిళంలో విజయ్ హీరోగా ఆయన తెరకెక్కించిన తెరి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో విజయ్ పాత్రను వరుణ్ ధావన్ పోషించనున్నారని, నటి సమంత పాత్రలో కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. కాగా ఎమీజాక్సన్ పాత్రలో నటి వామిక గబ్బి నటించనున్నట్లు తెలిసింది. దీనికి కలీస్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు తమిళంలో జీవా హీరోగా కీ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
వడివేలు పేరు చెప్పగానే షాక్ అయ్యాను: ఉదయనిధి స్టాలిన్
కోలీవుడ్ ప్రముఖ హీరో, నిర్మాత, తమిళనాడు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మామన్నన్'. నటి కీర్తి సురేష్ నాయకిగా నటించిన ఇందులో వడివేలు, ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. (ఇదీ చదవండి: జవాన్ ట్రైలర్: నేను విలనైతే ఏ హీరో నాముందు నిలబడలేడు) ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం 'ఆరుకల్ ఆరు కన్నాడీ' పెద్ద విజయం సాధించిందన్నారు. కాగా ఇప్పుడు తన చివరి చిత్రం 'మామన్నన్' మంచి ఓపినింగ్స్ సాధిస్తూ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని 510 థియేటర్లలో విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రెండవ వారంలో కూడా 470 థియేటర్లలో రన్ అవుతోందని చెప్పారు. ఇంత మంచి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం చేస్తున్నప్పుడు చాలా అనుభవాలను చవి చూశామన్నారు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) చిత్ర ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సన్నివేశాలను నాలుగు రోజులు పాటు చిత్రీకరించినట్లు చెప్పారు. షూటింగ్ మొదలైన 8 రోజులు వరకు దర్శకుడు మారి సెల్వరాజ ఏం తీస్తున్నారో అర్థం కాలేదన్నారు. తర్వాత క్రమంగా అవగాహన వచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు తండ్రిగా వడివేలు పేరు చెప్పగానే షాక్‌కు గురయ్యానన్నారు. అయితే ఇందులో వడివేలు నటించకపోతే ఈ చిత్రమే వద్దు వేరే చిత్రం చేద్దామని మారి సెల్వరాజ అన్నారన్నారు. ఆయనకు ఈ నమ్మకంతో ఈ చిత్రాన్ని అప్పగించానో దాన్ని పూర్తి చేశారని అన్నారు. మామన్నన్ చిత్రం 9 రోజుల్లోనే రూ.52 కోట్లు వసూలు చేసిందని, తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రం ఇదని ఆయన పేర్కొన్నారు. తెలుగులో మామన్నన్ జులై 14న 'నాయకుడు' పేరుతో విడుదల కానుంది. -
తెలుగులోకి వచ్చేస్తున్న తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమా
కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా కీర్తి సురేష్, వడివేలు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మామన్నన్' జూన్ 29న విడుదలై అక్కడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఉదయనిధి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన ఈ చిత్రంపై పలు విమర్శలు వచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అతని కెరీర్లో బెస్ట్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్) ఇతర భాషల్లో హిట్ టాక్ వచ్చి.. భారీగా ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను టాలీవుడ్లో కూడా విడుదల చేస్తుంటారు. తెలుగులో 'నాయకుడు' అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు. జులై 14వ తేదీన ఈసినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఆరురోజులకు గాను రూ. 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక తెలుగులో విడుదల అయిన తర్వాత ఏమేరకు కలెక్ష్న్స్ రాబడుతుందో చూడాలి. 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ
దక్షిణాదిన స్టార్ కథానాయికగా పేరు తెచ్చుకున్నారు కీర్తిసురేష్. ఆమె ఒక పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే... మరోపక్క కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఆమె మదిలో చాలా ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క నటిగా దూసుకుపోతున్నా, మరోపక్క వదంతులు వలయంలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ, ప్రేమికుడు వంటి ప్రచారం ఈమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు చదువుతుంటే బాధేస్తుందని కీర్తిసురేషే ఇటీవల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ) ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ మధ్య తెలుగులో బిజీగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె అక్కడ నటిస్తున్న చిత్రాలలో 'మామన్నన్' ఒకటి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న తెరపైకి రానుంది. దీంతో కీర్తిసురేష్ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ మామన్నన్ ఒక రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో తనది చాలా సీరియస్ పాత్ర అని తెలిపారు. సమీకాలంలో తనకు ఈ తరహా పాత్రలే వస్తున్నాయన్నారు. (ఇదీ చదవండి: 'నేనో ఇంజనీర్ని.. హీరోయిన్ అవుతాననుకోలేదు') ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అడుగుతున్నారని, ఆ విషయం గురించి ఆలోచించాలని అన్నారు. దీంతో రాబోయేరోజుల్లో రాజకీయ ప్రవేశం చేస్తారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ ఊహాగానాల్లో నిజమే కావచ్చని పలువురు తెలుపుతున్నారు. ప్రస్థుతం ఆమె తాజా చిత్రంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టింది. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కీర్తి పొలిటికల్ ఎంట్రీ ఉండవచ్చని తెలుస్తోంది. కానీ గతంలోనూ కీర్తి సురేష్ బీజేపీలో చేరుతుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయగా ఆమె తల్లి మేనక వాటిలో నిజం లేదని, తమ కూతురుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలేదని స్పష్టం చేసింది. కానీ ఈ బ్యూటీ మాత్రం రాబోయే రోజుల్లో రాజమౌళి, శంకర్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. -
కలర్ ఫోటో సుహాసిని విలన్ ని చేసిన కీర్తి సురేష్
-
బోళా శంకర్ అదిరిపోయే అప్డేట్ ఫాన్స్ కి పూనకాలే..!
-
కీర్తి సురేష్ పెళ్లి పై ఆమే తండ్రి సీరియస్
-
కీర్తి సురేష్ లా సతమతమౌతున్న సీత రామం హీరోయిన్
-
దసరా మూవీ మేకింగ్ వీడియో
-
నాని దసరా.. ట్రైలర్ మామూలుగా లేదుగా..!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ' చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ' అనే పాటతో మొదలైంది. నాని ఫుల్ మాస్ లుక్‌లో అలరించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడో లిరికల్ చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను ధీ - రామ్ మిర్యాల ఆలపించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. పక్కా జానపథ యాసలో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. -
న్యాచురల్ స్టార్ 'దసరా' అప్డేట్.. ఊరమాస్ లుక్‌లో నాని
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దసరా'. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నానికి జోడీగా కీర్తి సురేశ్ ఈ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనెల 3న 'ధూమ్ ధామ్ దోస్తాన్' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి రిలీజైన పోస్టర్లో నాని లుక్ పక్కా మాస్‌ను తలపిస్తోంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. నాని ఇంతకు ముందెన్నడు చేయని మాస్ లుక్‌లో అభిమానులను అలరించబోతున్నారు. ఈ సినిమాలో కొత్త నానిని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల చేయనున్నారు. -
24 హత్యలు చేసిన కీర్తి సురేష్.. ఆసక్తిగా ట్రైలర్
Keerthy Suresh As Killer In Chinni Movie And Trailer Released: 'మహానటి' కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రాన్ని 'చిన్ని' పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. ఈ మూవీలో ధనుష్ సోదరుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషించాడు. ఇది వరకు రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఎన్ని మర్డర్లు చేశావని' రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు అడగడంతో మూవీ ట్రైలర్ ప్రారంభమైంది. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ తాము చేసిన హత్యల గురించి చెప్పే పద్ధతి ఉత్కంఠంగా ఉంది. వీరిద్దరి యాక్టింగ్ సూపర్బ్ అనేలా ఉంది. 24 మందిని చంపి తాను చేయబోయే 25వ హత్య గురించి చెప్పడం క్రూరంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ పగ, ప్రతికారం, క్రైమ్ నేపథ్యంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్‌గా పని చేసిన చిన్ని ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వ వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మే 6 నుంచి ప్రసారం కానుంది. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ 'కళావతి సాంగ్'పై కళావతి స్టెప్పులు.. నెట్టింట వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘డీ గ్లామరస్’ హీరోయిన్లు.. దేనికైనా రెడీ
హీరోయిన్ అంటే అమాయకంగా ఉండి.. హీరో ఏడిపిస్తే ఉడుక్కుని.. నాలుగు పాటల్లో స్టెప్పులేసి... ఎండ్ కార్డులో గ్రూపు ఫొటోలో కనిపించే రోజులు పోయాయి. ‘గ్లామరస్ హీరోయిన్’ అనిపించుకున్న నాయికలు ‘డీ గ్లామరస్’గా కనిపిస్తున్న రోజులు ఇవి. క్యారెక్టర్ కోసం క్యారెక్టర్‌కి తగినట్లుగా కనబడుతున్నారు. 2021లో తెరపై నాయికల క్యారెక్టర్ కనబడింది. ఆ క్యారెక్టర్స్‌ని చూద్దాం. ‘పరేశానురా.. పరేశానురా.. ప్రేమన్నదే పరేశానురా’.. అంటూ ‘ధృవ’లో మెరుపు తీగలా కనిపించిన రకుల్ ప్రీత్‌సింగ్‌ని చూసి యూత్ పరేశాన్ అయ్యారు. కెరీర్ ఆరంభించిన ఏడేళ్లల్లో రకుల్ చేసినవన్నీ గ్లామరస్ రోల్సే కాబట్టి ‘గ్లామరస్ హీరోయిన్’ అనే స్టాంప్ బలంగా పడిపోయింది. అయితే అందుకు భిన్నంగా ‘కొండపొలం’లో గొర్రెల కాపరి ఓబులమ్మగా కనిపించారామె. ఈ అమ్మాయి ఎప్పుడూ గ్లామర్ పాత్రలే చేస్తుందేంటి? అనే ముద్రను ఓబులమ్మ చెరిపేయగలుగుతుందని రకుల్ నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. రకుల్ కంటే సీనియర్ అయిన ప్రియమణి ఖాతాలో కూడా గ్లామరస్ క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. అయితే ‘నారప్ప’లో సుందరమ్మగా నల్లని మేకప్‌తో ఆకట్టుకున్నారు ప్రియమణి. మరోవైపు హీరోయిన్గా దూసుకెళుతున్న రష్మికా మందన్నా కూడా గ్లామర్ ఇమేజ్‌కి దూరంగా వెళ్లడానికి వెనకాడలేదు. ఇటీవల రిలీజైన ‘పుష్ప’లో ‘సామీ.. సామీ’ అంటూ అసలు సిసలైన పల్లె పిల్లలా కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచారీ బ్యూటీ. గ్లామర్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోయిన్లకు రచయితలు డీ–గ్లామరస్ రోల్స్ రాయడం, ఆ పాత్రలను సవాల్‌గా తీసుకుని నాయికలు ఒప్పుకోవడం అనేది మంచి మార్పు. మంచి మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే. 2022లోనూ తారల ‘క్యారెక్టర్ కనబడే’ పాత్రలు మరిన్ని వస్తున్నాయి. 2022లోనూ... 2021లో ‘నారప్ప’లో సుందరమ్మగా కనిపించిన ప్రియమణి ‘విరాటపర్వం’లో నక్సలైట్‌గా కనిపించనున్నారు. అడవిలో ఉండేవాళ్లు ఎలా ఉంటారు? కమిలిపోయిన చర్మంతో, ఎర్రబారిన జుత్తుతో.. ఈ సినిమాలో ప్రియమణి ఇలానే కనిపించనున్నారు. ఇదే సినిమాలో మరో సీనియర్ తార, దాదాపు డీ–గ్లామరస్ రోల్స్ చేసే నందితా దాస్ కూడా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఇక నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ అంటే సాయిపల్లవి డేట్స్ ఉన్నాయేమో కనుక్కోండి అంటుంది ఇండస్ట్రీ. సాయిపల్లవి మీద గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించినదానికన్నా కాస్త డిఫరెంట్‌గా ‘విరాటపర్వం’లో కనిపించనున్నారామె. నిజానికి 2021లోనే ‘విరాటపర్వం’ విడుదల కావాలి. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక నటనకు అవకాశం ఉన్న పాత్ర, ఫుల్ ట్రెడిషనల్‌గా కనిపించే పాత్ర అంటే మహానటికి ఫోన్ వెళుతుంది. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అంత అద్భుతంగా ఒదిగిపోయారు కీర్తీ సురేష్. కీర్తికి గ్లామరస్ హీరోయిన్ ట్యాగ్ లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించని విధంగా తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో కనిపించనున్నారామె. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. -
పెద్దన్న మూవీ రివ్యూ
టైటిల్ : పెద్దన్న నటీనటులు : రజనీకాంత్, నయనతార, కీర్తి సురేశ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, మీనా, ఖుష్బు తదితరులు నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్ దర్శకత్వం : శివ సంగీతం : డి. ఇమాన్ సినిమాటోగ్రఫీ : వెట్రీ విడుదల తేది : నవంబర్ 4,2021 సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద దీపావళి సంబరాలను ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య గురువారం(నవంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్దన్న’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘పెద్దన్న’కథేంటంటే? తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన వీరన్న(రజనీకాంత్)కు చెల్లి కనకమహాలక్ష్మీ అలియాస్ కనకమ్(కీర్తి సురేశ్) అంటే అమితమైన ప్రేమ. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో చెల్లిని గారాబంగా పెంచాడు. చెల్లి సంతోషం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా వెనకాడడు. అంత ప్రేమగా చూసుకునే అన్నయ్య చూసిన పెళ్లి సంబంధం కాదని.. కనకమహాలక్ష్మీ కలకత్తాకు పారిపోతుంది. అసలు కనకమహాలక్ష్మీ అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఎందుకు పారిపోయింది? కలకత్తాలో ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? మరికొద్ది గంటల్లో పెళ్లి ఉండగా పారిపోయిన చెల్లి విషయంలో వీరన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చెల్లికి వచ్చిన సమస్యలను ఎలా తీర్చాడు? చివరకు ఈ అన్నా చెల్లెళ్లు ఎలా కలిశారు అనేదే ‘పెద్దన్న’కథ. ఎవరెలా చేశారు? సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వయసు పెరుగుతున్నా.. స్టామినా మాత్రం తగ్గడంలేదు. తనదైన స్టైల్, యాక్టింగ్‌తో ఇప్పటికీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘పెద్దన్న’కూడా పూర్తిగా రజనీకాంత్ జనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. గ్రామపెద్ద వీరన్న పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. తనదైన పంచ్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సినిమా భారాన్ని మొత్తం తనపై వేసుకొని నడిపించాడు. తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు. ఇక వీరన్న చెల్లెలు కనకమహాలక్ష్మీ పాత్రలో కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రే కీలకం. కథను మలుపుతిప్పే కనకమ్ పాత్రలో కీర్తి పరకాయప్రవేశం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుత నటనను కనబర్చింది. ఇక లాయర్ పార్వతిగా నయనతార తన పాత్రకు న్యాయం చేసింది. విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ ఆకట్టుకున్నారు. మీనా, ఖుష్బూలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ‘పెద్దన్న’కథను పక్కా రజనీకాంత్ ఇమేజ్‌కి సరితూగే విధంగా రాసుకున్నాడు దర్శకుడు శివ. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ అంతా రజనీ అభిమానులు అశించే డైలాగ్స్, ఫైట్స్, స్టైల్‌తో ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథలో ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా సాగుతుంది. ఎన్నో సినిమాల్లో చూసిన చెల్లెలు సెంటిమెంట్ సీన్స్‌తో సెకండాఫ్‌ని నెట్టుకొచ్చాడు. కథలో ఎమోషనల్ సీన్స్ పండించడానికి స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా కసరత్తు చేయలేదనే అభిప్రాయం కలుగుతుంది. అలాగే మీనా, ఖుష్బుల పాత్రలు కూడా పేలవంగా అనిపిస్తాయి.రజనీకాంత్ సినిమా కాబట్టే వాళ్లు ఆ పాత్రలు చేయడానికి ముందుకొచ్చారేమోనని అనిపిస్తుంది. సినిమా ముగుస్తుందనే సమయంలో విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ పాత్రలను పరిచయం చేసి కథను సాగదీశాడనే అభిప్రాయం కలుగుతుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ సీన్స్‌లో కీర్తిసురేశ్ తనను కాపాడుతున్న దెవరో తెలియక అయోమయంగా ముఖం పెట్టడం.. చెల్లికి కనిపించకుండా విలన్స్‌ని అన్న కొట్టడం... ఇవన్నీ రొటీన్ సీన్స్లాగానే అనిపిస్తాయి. ఇక కమర్షియల్ సినిమా ఎండింగ్ స్టైల్లోనే ఈ సినిమా కూడా ముగించాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. ఇమాన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. హాలీ హాలీ.. సాంగ్ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నీవేశాలకు ప్రాణం పోశాడు. వెట్రీ సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సన్నివేశాలను తెరపై చాలా బాగా చూపించాడు. ఎడిటర్ రెబెన్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'సర్కారు వారి పాట' సెట్లో నమ్రత సందడి
Namrata And Keerthy’s BTS picture from SVP: మహేశ్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. దీంతో మహేశ్ తన ఫ్యామిలీని తీసుకొని స్పెయిన్ వెళ్లారు. ఓ వైపు మహేశ్ సినిమా షూటింగులో పాల్గొంటూనే మరోవైపు వెకేషన్లో ఉన్నారు. తాజాగా సర్కారు వారి పాట చిత్రీకరణలో స్పెయిన్‌లో ముగిసింది. చివరి రోజున సినిమా సెట్స్‌లో మహేశ్ భార్య నమ్రత సందడి చేసింది. సాంగ్ షూట్ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఆమె కీర్తి సురేశ్‌తో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కానుంది. చదవండి: ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. Hyper Aadi: ఏడాదికి హైపర్ ఆది ఎంత సంపాదిస్తున్నాడంటే.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్
చెన్నై: నటి కీర్తి సురేష్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తన మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్‌తో కలిసి భూమిత్ర బ్రాండ్ పేరుతో స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దీనిపై కీర్తి మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో సౌందర్యాన్ని మెరుగుపరిచే విధంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను పెద్దఎత్తున తయారు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి : నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్ డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన -
పర్ఫెక్ట్ పార్ట్నర్తో బీచ్ ఒడ్డున పిక్నిక్.. ఇంకేం కావాలి: కీర్తి సురేశ్
మహానటి కీర్తి సురేశ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ సందడి చేస్తోంది. తన వ్యక్తి గత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ, తరచూ యోగా, ఫిట్నెస్ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. దీంతో ఆమె వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వరల్డ్ పిక్నిక్ డేకు తనకు సరైన తోడు దొరికిందంటూ పిక్నిక్ వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫొట్లోలు వైరల్ అవుతున్నాయి. ‘సరైన తోడు, ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ తీరాన పిక్నిక్ ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటూ కీర్తి తన పెంపుడు కుక్క నైక్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. కాగా కీర్తి సురేశ్ ప్రస్తుతం మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె తాజాగా నటించిన‘గుడ్ లక్ సఖి’ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తన నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ తరహాలోనే గుడ్ లక్ సఖి కూడా ఓటీటీలో రాబోతోందంటూ రూమార్స్ వచ్చాయి. అయితే మేకర్స్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా త్రివిక్రమ్, కారణం అదేనట!
సాధారణంగా మనలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి.ఆ సెంటిమెంట్లు ఫాలో అయితేనే అనుకున్న పని అనుకున్న విధంగా జరుగుతుందని నమ్ముతారు. ఇక చిత్రపరిశ్రమలో అయితే ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువ. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ వేడుకల వరకు దర్శకనిర్మాతలు, హీరోలు ఒక్కో సమయంలో ఒక్కో విధమైన సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా హీరో నితిన్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరైతే విజయం వరిస్తుందని బలంగా నమ్ముతున్నాడు. అందుకే రంగ్‌దే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్‌ని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం(మార్చి 21)శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్నాడు. గతేడాది నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆ సెంటిమెంట్‌తోనే రంగ్‌దే సినిమాకి త్రివిక్రమ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిననట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్‌కి నితిన్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఆ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరు మరింత క్లోజ్ అయ్యారు. శిష్యుడిగా తన దగ్గర్నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు నితిన్. అప్పట్నుంచి నితిన్ బ్యాక్ చేస్తూనే ఉన్నాడు త్రివిక్రమ్. అప్పట్లో ఆయన అందించిన కథతో ఛల్ మోహన్ రంగా సినిమా చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేసినపుడు కూడా అండదండలు అందించాడు. ఇప్పుడు రంగ్ దే సినిమాకు కూడా ఈయన వెంటే ఉన్నాడు. మరి నితిన్ సెంటిమెంట్ ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే మార్చి 26 వరకు వేచి చూడాల్సిందే. చదవండి: వాళ్లిద్దరూ హ్యాండిచ్చారు : నితిన్ హీరోయిన్ కనబడుట లేదు: డోంట్ వర్రీ అంటున్న పోలీసులు -
హీరో ఊరించాడు.. కంట్రోల్ చేసుకోలేకపోయిన నటి
మనముందు ఎన్నో టేస్టీ వెరైటీలు ఊరిస్తున్నా డైట్ పేరుతో నోరు కట్టేసుకుంటాం. అయితే మన కళ్లముందే కావాలని మనల్ని ఊరిస్తూ తింటే అస్సలు ఆగలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే నటి కీర్తి సురేష్‌కు సైతం ఎదురైంది. పాపం డైట్లో ఉన్న కీర్తి..తన మానాన ఫ్రూట్స్ తింటుండగా, హీరో నితిన్ మాత్రం పిజ్జాతో ఊరిస్తుంటాడు. మొదట నో పిజ్జా అని భీష్మించుకున్నా...కాసేపటికే నోట్లో నీళ్లు ఊరిపోయాయి. దీంతో డైట్‌ని పక్కన పెట్టేసి చీటింగ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోగా, ఇది నెటిజన్లను ఆకట్టుకుంటుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) ప్రస్తుతం నితిన్- కీర్తి సురేష్ జంటగా ‘రంగ్‌దే’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలె విడుదలైన ‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. చదవండి : (రంగ్‌దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!) ('ఆ నటుడితో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో') -
‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసిందిగా...
సాక్షి, హైదరాబాద్: నితిన్ లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ ప్రమోషన్లో భాగంగా ప్రిన్స్ మహేహ్‌బాబు అందమైన మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు.‘‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట లిరికల్ వీడియోను అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సింగర్ సిధ్ శ్రీరాంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాక్ స్టార్, అమేజింగ్ అంటూ ఇద్దరినీ పొగడ్తల్లో ముంచెత్తారు సూపర్ స్టార్. అటు డీఎస్పీ, సిద్ శ్రీరాం డెడ్లీ కాంబినేషన్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చస్తున్నారు.విడుదలైన కొన్ని క్షణాల్లోనే లక్షకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్‌దే' మూవీలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు చెక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ ఈ సినిమా కూడా బంపర్‌హిట్ అనే అంచనాలతో ఉన్నారు. -
మిస్ ఇండియా మూవీ రివ్యూ
టైటిల్ : మిస్ ఇండియా నటీనటులు : కీర్తి సురేశ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా, నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తదితరులు నిర్మాణ సంస్థ: ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత: మహేష్ కోనేరు దర్శకత్వం: నరేంద్రనాథ్ సంగీతం: ఎస్.ఎస్. థమన్ సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్ లోపేజ్, సుజిత్ వాసుదేవ్ ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : నవంబరు 4, 2020 ( నెట్‌ఫ్లిక్స్) థియేటర్లు మూతబడి 8 నెలలు కావస్తోంది. కరోనా కారణంగా పెద్ద పెద్ద సినిమాలేవీ వెండితెరపై ప్రదర్శించే అవకాశం లేకపోయినప్పటికీ.. మహానటి కీర్తి సురేష్ అభిమానులకు మాత్రం ఓటీటీ.. ఆ వెలితి లేకుండా చేసింది. చాలా వరకు ఆమె చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ దశలో ఉండగానే లాక్డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాలు రిలీజ్ చేయడమే తప్ప వేరొక మార్గం లేదని తెలిసినప్పటికీ బడా నిర్మాతలు ఎవరూ ఆ సాహసం చేయలేదు. కానీ కీర్తి అభినయం, నటనా కౌశలంపై ఉన్న నమ్మకంతో ఆమె నటించిన ‘పెంగ్విన్’ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు మూవీ మేకర్స్. దాని ఫలితం ఎలా ఉన్నా ఇప్పుడు కీర్తి సురేష్ ‘‘మిస్ ఇండియా’’ అనే మరో సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ ట్రైలర్‌తో మ్యాజిక్ చేసిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం. కథ: మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కంటుంది మానస సంయుక్త( కీర్తి సురేశ్). ఎప్పటికైనా తన సొంత బ్రాండ్‌ను స్థాపించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి తనేంటో ప్రపంచానికి తెలియజేయాలనే పట్టుదలతో ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ లంబసింగిలో తన తాతయ్య (రాజేంద్రప్రసాద్) బాల్యంలో రుచి చూపించిన హెర్బల్ టీపై మక్కువ పెంచుకున్న మానస.. దానినే తన బిజినెస్‌గా మలచుకోవాలనే ఆలోచనతో ఉంటుంది. అకడమిక్స్‌లో మార్కులు సాధించడం కంటే కూడా ఓ లక్ష్యంతో ముందుకు సాగడంలోనే అసలైన మజా ఉంటుందని తన తండ్రి చెప్పిన మాటలు కూడా చిన్నతనంలోనే ఆమెపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో అనుకోని కారణాల వల్ల అమెరికాకు చేరుకున్న మానస.. అక్కడ తన ఆలోచనలను ఎలా అమలు చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఒక మహిళగా, యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాగిన మానస ప్రయాణంలో కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) సృష్టించిన అడ్డుంకులేమిటి? ఆశయం కోసం ప్రేమను కూడా పక్కనపెట్టిన మానస తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? ఇంతకీ మిస్ ఇండియా బ్రాండ్‌లో ఉన్న గొప్పదనం ఏమిటి? అన్నదే మిగతా కథ. విశ్లేషణ: నువ్వెంత గొప్పవాడివో ఈ ప్రపంచానికి చాటి చెబుతా అంటూ మానస తన తాతయ్యతో చెప్పిన మాటలకు కొనసాగింపుగా సాగిన ఈ కథలో మొదట.. హీరోయిన్ కుటుంబ పరిస్థితులు, వెనువెంటనే వాళ్లు అమెరికాకు చేరుకోవడం వంటి సీన్లు సగటు మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటలకు కాస్త భిన్నంగా సాగుతాయి. ఇక సెకండ్ హాఫ్‌లో అసలైన కథ మొదలవుతుంది. కాఫీ వ్యాపారంలో నంబర్ వన్‌గా కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) కారణంగా మానసకు ఎదురైన తొలి ఓటమితో కథలో వేగం పుంజుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన ఇండియన్ ఛాయ్‌కు తిరుగులేదని ప్రతీ సీన్ గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మాయే కదా వ్యాపారం ఎలా చేస్తుంది, విజయం ఎలా సాధిస్తుంది అనుకునే వారికి ఈ సినిమా మంచి సమాధానం. అంతర్లీనంగా మహిళా సాధికారికతకు పెద్దపీట వేసినా, కథను వినోదాత్మకంగా సాగించడంలోనూ దర్శకుడు నరేంద్రనాథ్ కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచే కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడం అనే కాన్సెప్ట్ కూడా రొటీన్‌గా ఉన్నా.. కీర్తి సురేష్ వంటి నటిని ఈ కథకు ఎంపిక చేసుకోవడం ద్వారా హైప్ క్రియేట్ చేయగలిగాడు. అయితే సినిమా ఆసాంతం దానిని కొనసాగించలేకపోయాడు. ఎవరెలా నటించారు? మహానటి సినిమాతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న కీర్తి ఈ సినిమాలోనూ తన మార్కు నటనతో మంచి మార్కులే కొట్టేశారు. ఇక తానే టాప్‌లో ఉండాలనే స్వార్థం, ఓ మహిళ తనకు పోటీరావడాన్ని ఏమాత్రం సహించని విలన్ పాత్రలో ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపిస్తూనే కైలాశ్ శివకుమార్‌గా జగపతిబాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా వంటి సీనియర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తమ పరిధి మేర ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అల్టిమేట్‌గా ఛాయ్‌కు, కాఫీకు జరిగే యుద్ధంలో ఛాయ్ గెలుస్తుందని చూపించడంలో సీన్లు కొంచెం లాగ్ అయ్యాయని చెప్పవచ్చు. రొటీన్‌గా ఉన్న కథను.. ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. థమన్ సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఓవరాల్‌గా మంచి సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఆశించినంత మేర వినోదం అందించలేదనే అనిపిస్తుంది. ‘‘మిస్ ఇండియా’’ బ్రాండ్ ఛాయ్ ఘుమఘుమలు అనుకున్న స్థాయిలో సువాసనలు వెదజల్లలేదనే చెప్పవచ్చు! కాకపోతే ఒక్కసారి మాత్రం ‘ఛాయ్’ను కళ్లతోనే టేస్ట్ చేసి ఆనందించవచ్చు!! -
మహేశ్ చిత్రంలో నివేదా?
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అరవింద్ స్వామి నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. (మహేశ్‌తో 'జనగణమన' నా డ్రీమ్) తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం నివేదా థామస్‌ను చిత్ర బృందం ఎంపిక చేసిందని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆమెతో చర్చలు జరిపారని తెలుస్తోంది. నటన పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నివేదా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘దర్బార్’ చిత్రంలో ఈ మలయాళ ముద్దుగుమ్మ రజనీకాంత్ కూతురుగా నటించి ఆకట్టుకుంది. (మహేశ్-సితు పాప స్విమ్మింగ్ పోటీ) కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు పాటలను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా షూటింగ్‌కు అన్నీ కుదిరాక చిత్రీకరణ స్టార్ట్ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా మహేశ్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. (మహేశ్ సరసన కీర్తి) -
ఆ చిత్రంలో కీర్తి స్థానంలో ప్రియమణి
దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి లక్కీ చాన్స్ కొట్టేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ చిత్రం నుంచి కీర్తి సురేశ్ తప్పుకోవడంతో ప్రియమణి ఆ పాత్రను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం మైదాన్. భారత ఫుట్‌బాల్ మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశారు. జీ స్టూడియోస్, బోని కపూర్ మైదాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి కీర్తి డ్రాప్ అయ్యారు. కీర్తి ఈ చిత్రంలో పెద్ద వయస్కురాలి పాత్రలో నటించాల్సి ఉండగా.. అందుకు ఆమె సరిపోదని చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రం అంగీకరించినప్పుడు కీర్తి కొద్దిగా బరువుగా ఉన్నారని.. ప్రస్తుతం ఆమె సన్నబడ్డారని నిర్మాతలు తెలిపారు. కీర్తి కూడా తను ఆ పాత్రకు సరిపోననే భావనలో ఉండటంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పకున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ చిత్రంలో కీర్తి పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం నిర్మాతలు ప్రియమణిని సంప్రదించగా.. ఆమె కూడా ఆసక్తి కనబరిచినట్టుగా సమాచారం. కాగా, ప్రసుత్తం ప్రియమణి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో శశికళ పాత్రలో నటిస్తున్నారు. -
మ్యాజికల్ మైల్స్టోన్
కెరీర్లో ‘మైల్స్టోన్’ అని చెప్పుకునే అవకాశాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ‘మహానటి’ రూపంలో కీర్తీ సురేష్ కెరీర్లో ఓ మంచి మైల్స్టోన్ వచ్చి చేరింది. నటిగా సినిమా సినిమాకీ ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళుతోన్న కీర్తి ఇప్పుడు తన కెరీర్లో ‘మ్యాజికల్ మైల్స్టోన్’ చేరుకున్నానని అంటున్నారు. మరి.. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అవకాశం అంటే.. ఏదో మ్యాజిక్ జరిగినట్లే కదా. రజనీ 168వ సినిమాలో కీర్తీకి ఈ చాన్స్ దక్కింది. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ‘‘రజనీకాంత్ సార్ సరసన నటించడం అనేది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంలాంటిది. నా సినిమా కెరీర్లో ఇదొక ‘మ్యాజికల్ మైల్స్టోన్’’ అన్నారు కీర్తీ సురేష్. -
క్రీడల నేపథ్యంలో...
కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో క్రీడల నేపథ్యంలో కామెడీచిత్రం తెరకెక్కుతోంది. ‘హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్’ వంటి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన హైదరాబాదీ ఫిల్మ్‌మేకర్ నగేశ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పించనున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్ పూర్తిచేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చిరంతన్ భట్, సహ నిర్మాత: శ్రావ్యా వర్మ. -
అక్కడ తగ్గాల్సిందే!
నటి కీర్తీసురేశ్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలో నటిగా ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి అన్నది తెలిసిందే. సాధారణంగా మొదట్లో కమర్శియల్ చిత్రాల్లో చాలా లైట్ పాత్రల్లో నటించాలని చాలా మంది కోరుకుంటారు. అదే విధంగా వర్ధమాన నటీమణులను నమ్మి ఏ దర్శక నిర్మాత బరువైన పాత్రలను ఆఫర్ చేయడానికి సాహసించరు. అయితే లక్కీగా కీర్తీకి అలాంటి పాత్ర మహానటి చిత్రం రూపంలో వరించింది. ఈ సినిమాలో నాటి మేటి నటి సావిత్రిగా నటించడానికి కొందరు పరిహసించారు కూడా. అయినా దర్శకుడి సూచనలతో కీర్తీసురేశ్ తన పనిని సమర్థవంతంగా చేసింది. ఇవాళ సావిత్రి పాత్ర అంటే కీర్తీసురేశ్‌నే చేయాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారు. అయితే అంతకుముందు కూడా రజనీమురుగన్, రెమో వంటి కమర్శియల్ చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు. కాగా మహానటి చిత్రం తరువాత కీర్తీసురేశ్ స్థాయి పూర్తిగా మారిపోయారు. దానికి తగ్గట్టుగానే ఈ బ్యూటీ కథలను ఎంచుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక చాలా మంది హీరోయిన్లు మొదట్లో ఆచితూచి అడుగులు వేసి ఆ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలు చేస్తారు. అలాంటిది కీర్తీసురేశ్‌కు మొదట్లోనే అలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ కథ చిత్రాల అవకాశాలు తలుపు తట్టడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో కథానాయకి సెంట్రిక్ పాత్రలో నటిస్తున్నారు. దీనికి నరేంద్రనాథ్ దర్శకుడు. దీనితో పాటు మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. లక్కీగా తొలి హిందీ చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో కథానాయికల్ని బొద్దుగా ఉంటే అంగీకరించరు. అందుకే దక్షిణాదిలో పాపులర్ అయిన కథానాయికలు బాలీవుడ్కెళితే స్లిమ్ కావలసిందే. నటి తమన్నా, కాజల్‌అగర్వాల్, ఇలియానా వంటి వారు బాలీవుడ్లో అవకాశం వస్తే ముందుగా చేసే పని బరువు తగ్గడం. ఎంతగా అంటే జీరోసైజ్ అంటారే అంతగా. నటి తాప్సీ కూడా బరువు బాగా తగ్గడం వల్లే బాలీవుడ్లో పాగా వేయగలిగింది. ఇప్పుడు నటి కీర్తీసురేశ్ అందుకు కసరత్తులు చేయక తప్పలేదు. నిజానికి కీర్తీది ఏమంత భారీ కాయం కాదు. అయినా ఇంకా బరువు తగ్గాల్సిన పరిస్థితి. అక్కడి వారి అభిరుచి అంతే. అందుకనుగణంగా కీర్తీ మారిపోయారు. -
స్క్రీన్ టెస్ట్
అబ్బాయి అవ్వగా మారాలా? ఏ అవకరం లేని వ్యక్తి అవిటివాడిగా కనిపించాలా? మంచి అందగాడు గూని ఉన్న వ్యక్తిగా అగుపించాలా? సిల్వర్ స్క్రీన్‌పై స్లిమ్‌గా కనిపించాల్సిన హీరోయిన్ బొద్దుగా కనిపించాలా? తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా కలరింగ్ ఇవ్వాలా? సినిమాకి ఏదైనా సాధ్యమే. ఇప్పటివరకూ అలా విభిన్న పాత్రల్లో కనిపించిన కొందరు స్టార్స్‌తో ఈ వారం స్పెషల్. 1. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన సంచలన చిత్రం ‘విచిత్ర సోదరులు’. ఆ చిత్రంలోని ఓ పాత్రలో మరుగుజ్జుగా నటించారు కమల్. అలా మరుగుజ్జుగా కనపడటానికి ఆయనకు ఎన్నో నెంబర్ షూ వాడారో తెలుసా? (అవి స్పెషల్‌గా తయారు చేశారు. ఆ షూ సైజు ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఎ) 10 బి) 18 సి) 12 డి) 14 2. ‘కలిసి ఉంటే కలదు సుఖం’లో యన్టీఆర్ అవిటివాడిగా నటించారు. తాపి చాణక్య దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఘంటసాల బి) రాజన్ నాగేంద్ర సి) మాస్టర్ వేణు డి) ఎస్. రాజేశ్వరరావు 3. ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘లడ్డూబాబు’. దోమకాటు వల్ల అతని శరీర బరువు 50 కిలోలు పెరిగిపోతుంది. రవిబాబు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నరేశ్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) పూర్ణ బి) ఫర్జానా సి) ఈషా రెబ్బా డి) భూమికాచావ్లా 4. ఇప్పటివరకూ దాదాపు గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన నయనతార ఏ చిత్రంలో నల్లని మేకప్‌తో కనిపించారో చెప్పుకోండి? ఎ) ఐరా బి) రాజా–రాణి సి) మాయ డి) డోరా 5. రామ్‌చరణ్ పల్లెటూరి అమాయకునిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఆ చిత్రంలో ఆయన సౌండ్ ఇంజనీర్ (చెవిటివానిగా)లాగా నటించి మెప్పిం చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో రామ్‌చరణ్ అన్న పాత్రలో నటించిన నటుడెవరో గుర్తుందా? ఎ) సందీప్ కిషన్ బి) అరుణ్ విజయ్ సి) నందు డి) ఆది పినిశెట్టి 6. శ్రీదేవి హీరోయిన్గా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘పదహారేళ్ల వయసు’. ఆ చిత్రంలో హీరో వికలాంగుడు. తెలుగులో ఆ పాత్రను చంద్రమోహన్ చేశారు. అదే పాత్రను తమిళంలో ఎవరు చేశారో తెలుసా? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) పార్తిబన్ డి) శరత్‌కుమార్ 7. వైవిధ్యమైన పాత్రలు చేసే విక్రమ్ ‘కాశి’ చిత్రంలో గుడ్డివానిగా, ‘శివపుత్రుడు’ చిత్రంలో మతి స్థిమితం లేని వ్యక్తిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ‘ఐ’ చిత్రంలో గూనివానిగా మారి కురూపిగా కనిపించారు. ఆ కురూపి పాత్ర కోసం ఆయన ఎన్ని కిలోల బరువు తగ్గారో తెలుసా? (ఆ టైమ్‌లో ఆయన బరువు 49 కిలోలు) ఎ) 45 బి) 25 సి) 35 డి) 42 8. ‘ప్రేమిస్తే’ చిత్రవిజయంతో ఆ చిత్రకథానాయకుడు భరత్ ‘ప్రేమిస్తే’ భరత్‌గా మారారు. ఆ చిత్రంలో అతను పిచ్చివానిగా చేసిన పాత్రతో మంచి నటునిగా పేరు సంపాదించాడు. ఆ సినిమాలోని ‘జన్మ నీదేలే, మరుజన్మ నీదేలే జతను విడిచావో, చితికి పోతాలే’ అనే సూపర్‌హిట్ పాట రచయిత ఎవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) వెన్నెలకంటి సి) వేటూరి డి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 9. సావిత్రి నిజజీవిత పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఆ చిత్రంలోని 1980ల నాటి జర్నలిస్ట్ పాత్రలో నటించిన నటి ఎవరో గుర్తున్నారా? ఆ చిత్రంలో ఆమె నత్తి పాత్రలో నటించారు. ఎవరామె? ఎ) కీర్తీ సురేశ్ బి) అంజలి సి) సమంత డి) త్రిష 10. నాని కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. అందులో మతిమరుపు పాత్రలో నాని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు . ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) సాయిపల్లవి డి) నివేదా థామస్ 11. శుభ్రంగా ఉండాలి, కానీ అతి శుభ్రం వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయి. ఇదే కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) విజయ్ దేవరకొండ బి) శర్వానంద్ సి) నాని డి) మంచు విష్ణు 12. హీరో బాలకృష్ణ కురూపిగా నటించిన చిత్రం ‘భైరవద్వీపం’. ఆ చిత్రంలోని ఆయన నటనకు చాలా మంచి పేరొచ్చింది. ఆ చిత్రదర్శకుడు ఎవరో తెలుసా? ఎ) దాసరి నారాయణరావు బి) కోడి రామకృష్ణ సి) సింగీతం శ్రీనివాసరావు డి) రవిరాజా పినిశెట్టి 13 వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాలు ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆయన తీసిన మూడో సినిమాలో హీరో పూర్తిగా అంధుడు. ఆ పాత్రలో నటించిన హీరో ఎవరు? ఎ) వెంకటేశ్ బి) రవితేజ సి) కళ్యాణ్‌రామ్ డి) సాయిధరమ్ తేజ్ 14. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా’ అని ‘ప్రేమించు’ చిత్రంలో హీరోయిన్ లయ పాడుతుంది. లయ ఆ చిత్రంలో అంధురాలిగా నటించింది. ఆ పాట చాలా పెద్ద హిట్. ఆ పాటకు సంగీతాన్ని అందించిందెవరో తెలుసా? ఎ) కల్యాణీ మాలిక్ బి) యం.యం. శ్రీలేఖ సి) కోటి డి) రాజ్ 15. బాలీవుడ్ చిత్రం ‘బర్ఫీ’లో హీరో రణ్‌బీర్ కపూర్ చెవిటి, మూగ. ఆ సినిమాలోని హీరోయిన్ మతి స్థిమితం లేని పాత్రలో నటించారు. ఆ హీరోయిన్ పేరేంటి? ఎ) అనుష్కా శర్మ బి) ఇలియానా సి) కంగనా రనౌత్ డి) ప్రియాంకా చోప్రా 16. శోభన్‌బాబుకి ఆంధ్రుల అందగాడు అని పేరు. కానీ ‘చెల్లెలి కాపురం’ సినిమాలో శోభన్‌బాబు అంద విహీనమైన పాత్రలో కనిపిస్తారు. ఆ సినిమా పెద్ద హిట్. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) వి. మధుసూదన్ రావు బి) కె. విశ్వనాథ్ సి) ఆదుర్తి సుబ్బారావు డి) పి.సి. రెడ్డి 17. హీరో సూర్య వెరైటీ పాత్రలకు పెట్టింది పేరు. ఆయన నటించిన ఓ చిత్రంలో ఏ విషయాన్నైనా ఎక్కువసేపు గుర్తు పెట్టుకోలేడు. అందుకే ఏ విషయాన్నైనా తన కెమెరాలో ఫొటో తీసుకొని గుర్తు పెట్టుకుంటాడు. ఆ చిత్రంలో నయనతార ఓ హీరోయిన్ కాగా మరో హీరోయిన్ ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) తమన్నా బి) జ్యోతిక సి) సదా డి) ఆసిన్ 18. హీరో రాజేంద్రప్రసాద్ ఓ చిత్రంలో ఎత్తు పళ్లతో, సోడా బుడ్డి అద్దాలు పెట్టుకుని అంద వికారమైన పాత్రలో నటించారు. ఈ సినిమా పేరేంటో తెలుసా? ఎ) సుందరాంగుడు బి) అందగాడు సి) మాయలోడు డి) కొబ్బరిబోండం 19. తమిళ దర్శకడు బాల దర్శకత్వం వహించే సినిమాల్లోని హీరోలు రెగ్యులర్ హీరోల్లా ఉండరు. ఆయన ప్రతి సినిమాలో హీరోల్ని రకరకాలుగా ప్రెజెంట్ చేస్తారు. ఓ చిత్రంలో హీరో సినిమా అంతా మెల్ల కన్నుతో ఉండేట్లు చేశారు. ఆ సినిమా పేరు ‘వాడు–వీడు’. మెల్ల కన్ను పాత్రలో చేసిన ఆ హీరో ఎవరు? ఎ) ఆర్య బి) విశాల్ సి) కార్తీ డి) విక్రమ్ 20. చిరంజీవి హీరోగా నటించిన ‘ఆపద్భాందవుడు’ చిత్రంలో హీరోయిన్‌కి పిచ్చెక్కుతుంది. ఆమె మెంటల్ హాస్పిటల్లో ఉందని అక్కడికి వెళ్లడానికి చిరంజీవి కూడా పిచ్చివాడిగా నటిస్తాడు. పిచ్చి అమ్మాయిగా నటించిన ఆ బాలీవుడ్ భామ ఎవరు? ఎ) మీనాక్షీ శేషాద్రి బి) సోనాలీ బింద్రే సి) సమీరా రెడ్డి డి) నగ్మా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) సి 3) డి 4) ఎ 5) డి 6) ఎ 7) బి 8) సి 9) సి 10) ఎ 11) బి 12) సి 13) బి 14)బి 15) డి 16) బి 17) డి 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
‘మహానటి’ రాక కోసం ఎదురుచూస్తున్నా’
హీరోయిన్ కీర్తిసురేశ్‌కు ప్రశంసలు కొత్త కాదు. రెమో, రజనీమురుగన్, భైరవా, సండైకోళి, సామీ స్క్వేర్, సర్కార్ ఇలా మాస్ మసాలా చిత్రాల్లో నటించిన రాని పేరు ఒక్క మహానటితో తెచ్చుకుంది కీర్తి. అంతగా ఆ మహానటి (సావిత్రి) పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంతో ఎందరి నుంచో ప్రశంసలు అందుకున్నారు. అయితే మహానటిని మెచ్చుకునేవారి జాబితాలోకి తాజాగా మరొకరు చేరారు. దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ తన సోషల్ మీడియాలో కీర్తిపై ప్రశంసలు కురిపించింది. ‘మహానటి సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, ఆత్రుతగా ఉంది. బాలీవుడ్‌కు స్వాగతం అని క్యాప్షన్‌తో ఫోటో పోస్టు చేసింది జాన్వీ. తాజాగా కీర్తికి బాలీవుడ్ అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో నటుడు అజయ్‌దేవ్‌గన్‌తో నటించడానికి రెడీ అవుతోంది. ఇది బయోపిక్ చిత్రం కావడం విశేషం. ప్రముఖ భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, శిక్షకుడు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ జీవిత చరిత్రతో అమిత్‌శర్మ తెరకెక్కించనున్న చిత్రం ఇది. ఇందులో అజయ్‌కు జోడిగా నటిస్తుంది కీర్తి. ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ పాత్రలో నటించనుండగా ఆయనకు భార్యగా నటి కీర్తిసురేశ్ తెరపై కనిపించనుంది. -
ఆర్ఆర్ఆర్ : ప్రచారంలో ఉన్న కథలేంటి?
త్రీ ఆర్స్.. ఎన్టీ రామారావు, రామ్‌చరణ్, రాజమౌళి... కాంబినేషన్ అదుర్స్..టూ ఆర్స్... యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసేస్తారు.మరి.. టేకింగో.. రాకింగ్ మౌళి అక్కడ. కథ? డౌటే లేదబ్బా... విజయేంద్రప్రసాద్ కలం పదునైనది.సినిమా టైటిల్.. ఇంకా పెట్టలేదు. ఫిల్మ్‌నగర్ గాసిప్పురాయుళ్లు ‘రామరావణ రాజ్యం’ అని పెట్టేశారు.మరి.. యూనిట్ ఇదే కన్ఫార్మ్ చేసేస్తారా?వెయిట్ అండ్ సీ.అన్నట్లు... ఆర్ అండ్ ఆర్ (ఎన్టీ రామారావు, రామ్‌చరణ్) సరసన కే అండ్ కే (కీర్తీ సురేశ్, కియారా అద్వానీ) కథానాయికలుగా కుదిరారట. ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. ఇంకా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఏయే విషయాలు ప్రచారం అవుతున్నాయంటే... మ్యాటర్‌లోకి రండి. ప్రచారంలో ఉన్న కథలేంటి? ‘ఈగ’ సినిమా ప్రారంభోత్సవం రోజున రాజమౌళి ఆ సినిమా కథంతా చెప్పేశారు. ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రం కూడా ఫలానా అంటూ కొంచెం ఐడియా చెప్పారు. కానీ ఈ సినిమా గురించి మొత్తం టీమ్ అంతా సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది.. అంతా సిల్వర్ స్క్రీన్ మీదే అన్నట్టుగా. కానీ ఈలోపు ఖాళీగా ఉన్న ఊహారాయుళ్లంతా విజయేంద్రప్రసాద్ ఏం కథ రాసి ఉండొచ్చో అని ఊహించి కొన్ని కథలు అల్లేస్తున్నారు. ఒక కథాంశం ప్రకారం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ అన్నదమ్ములు. అందులో ఒకరు దొంగ, మరొకరు పోలీస్. ఈ దొంగా పోలీస్ గేమ్‌తో సినిమా సాగబోతోందని టాక్.ఇంకో కథాంశం ప్రకారం... 1920 ప్రాంతంలో జరిగే కథతో ఈ సినిమా సాగుతుందట. మరోవైపు ఎన్టీఆర్ అండ్ రామ్‌చరణ్‌లను బాక్సింగ్ చాంపియన్స్‌గా చూపించబోతున్నారన్నది ఊహల్లో ఉన్న మరో కథ. ఇలా రోజుకొకటి ‘ఇదే సినిమా కథ’ అని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అసలు కథేంటో విజయేంద్రప్రసాద్‌కే ఎరుక.తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన కథలతోనే రాజమౌళి దాదాపు అన్ని సినిమాలూ తెరకెక్కించారు. కేవలం ‘మర్యాద రామన్న’ సినిమాకు మాత్రమే ఆయన కజిన్ కంచి కథ అందించారు. ఇప్పటి వరకూ విజయేంద్రప్రసాద్ మాస్ మసాలా, స్పోర్ట్స్ డ్రామా, పీరియాడికల్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ.. ఇలా అన్ని జానర్స్‌ని టచ్ చేస్తూ వస్తున్నారు. రాజమౌళి తీయబోయే నెక్ట్స్ సినిమాకి ఎటువంటి గ్రాఫిక్స్ అవసరం లేని కథను ఇస్తున్నట్లు విజయేంద్రప్రసాద్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఆయన ప్రస్తావించింది ‘ఆర్ఆర్ఆర్’ గురించేనా? అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు చేస్తోన్న చిత్రకథాంశం ఎలా ఉండబోతోంది అని అటు ఇండస్ట్రీ ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. షూటింగ్ వివరాలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి గతేడాది నవంబర్ 18న హింట్ ఇచ్చారు రాజమౌళి. ఆ తర్వాత సినిమా అధికారిక అనౌన్స్మెంట్ రావడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఈ నెల 11న సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. షూటింగ్ ఈ నెల 19న స్టార్ట్ కానుంది. తొలుత ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఫైట్సీన్స్ను షూట్ చేస్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కొత్తలుక్‌లోకి వచ్చేశారు. కొన్ని నెలల క్రితం ఈ ఇద్దరూ లుక్ టెస్ట్ కోసం విదేశాలు వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించని కొత్త లుక్‌లో ఈ ఇద్దర్నీ చూడొచ్చని ఆశించవచ్చు.రాజమౌళి షూటింగ్‌ని తపస్సులా చేస్తాడంటారు. అందులో నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడరట. అందుకే తాజాగా ఈ చిత్రం జరిగే షూటింగ్ స్పాట్లోనే తన ఆఫీస్‌ని కూడా ఏర్పాటు చేయించుకున్నారు. ఆఫీస్ మాత్రమే కాదు.. అది ఇల్లు కూడా. ఈ షూటింగ్ జరిగే అన్ని రోజులు అక్కడే ఎక్కువ శాతం ఉండొచ్చని టాక్. షూటింగ్ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ చివర గండిపేట్ వద్ద కొన్ని ఎకరాల్లో ఈ సినిమాకు సంబంధించిన సెట్‌ని డిజైన్ చేశారని సమాచారం. మరి ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే చేస్తారా? అవుట్ డోర్ లొకేషన్స్‌కు వెళ్తారో? లేదో వేచి చూడాలి.రాజమౌళి సినిమాలో కథానాయిక అవకాశం అంటే ఏ హీరోయిన్ అయినా నో చెప్పాలనుకోదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులు అలాంటివి. తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో హీరోయిన్గా చాలా మంది పేర్లు వినిపించాయి. ఆర్ ఆర్ ఆర్కు మరో ఆర్ కలిసేలా ప్రస్తుతం రైజింగ్‌లో ఉన్న రష్మికా మండన్నాను కథానాయికగా తీసుకుంటారని కొందరు గాసిప్‌రాయుళ్లు ఊహించారు. ‘మహానటి’ సినిమాలో సూపర్బ్‌గా నటించిన కీర్తీ సురేశ్‌ను తీసుకుంటారని కొందరు అన్నారు. అంతలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో వచ్చిన కథానాయిక చాన్స్‌కు సమంత నో అన్నారని వార్తలు వచ్చాయి. ‘రాజమౌళి సినిమాకు మీరు నో చెప్పారట’ అని ఆమెను అడిగితే.. రాజమౌళిగారి సినిమాకు నేనెందుకు నో చెబుతాను అని సమంత ఓ విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఈ ఊహలు ఇలా ఉండగానే ఈ సినిమాను ఈ నెల 11న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు ఈ చిత్రనిర్మాత డీవీవీ దానయ్య. సో.. మూవీ లాంచింగ్ రోజున ఆ లక్కీ హీరోయిన్స్ ఎవరో అందరికీ తెలిసిపోతుందని సంబరపడిన మూవీ లవర్స్‌కు నిరాశే ఎదురైంది. మూవీ ఓపెనింగ్ రోజు హీరోయిన్ల పేర్లను కాకుండా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులతో సహా అందరి పేర్లను చెప్పారు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఇందులో హీరోయిన్లు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం కోసం సినీ ప్రియులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ, రామ్‌చరణ్‌కు జోడీగా కీర్తీ సురేశ్ నటించనున్నారని విశ్వసనీయవర్గాల తాజా సమాచారం. త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. రాకింగ్ మౌళి సినిమా సక్సెస్ అవ్వడానికి సరైన సూత్రం లేదంటారు. ప్రేక్షకుడికి సినిమా ఎందుకు నచ్చుతుందో, ఎలాంటి చిత్రం ఆడుతుందో అంచనా వేయడం కష్టం. కానీ రాజమౌళి దగ్గర ఉన్న ఆ సూత్రమేంటి? ప్రతి సినిమాతో ప్రేక్షకుల మీద ఏదో మ్యాజిక్ జల్లుతారు. ఇప్పటివరకూ ఆయన ‘బాహుబలి’ 2 భాగాలతో కలిపి పదకొండు సినిమాలు తీస్తే అన్నీ హిట్. ఆ హిట్ సీక్రెట్ ఏంటి? రాజమౌళిని అడిగితే ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అంటారేమో. ఎన్టీఆర్ ఆయన్ను ‘జక్కన్న’ అని పిలుస్తారు. సినిమాని శిల్పం చెక్కినట్లు చెక్కుతారు. ఇప్పుడు జక్కన్న శిల్పం చెక్కే పనిలో ఫుల్ బిజీ. ఆ శిల్పాన్ని 2020లో సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించబోతున్నారు. సాంకేతిక నిపుణలు స్క్రీన్ ప్లే–దర్శకత్వం: రాజమౌళి నిర్మాత: డీవీవీ దానయ్య కథ: విజయేంద్ర ప్రసాద్ కెమెరా: సెంథిల్ కుమార్ సంగీతం: కీరవాణి ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ స్టైలింగ్: రమా రాజమౌళి ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, మదన్ కార్కీ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్: వి. శ్రీనివాస మోహన్ -
పులిముందు వేషాలా?
‘కత్తిని చూసి భయపడటానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డని’, ‘జాతరలో పులివేషాలు వేయొచ్చు..కానీ, పులిముందే వేషాలు వేయకూడదు’... ‘పందెంకోడి 2’ చిత్రంలోని ఇలాంటి డైలాగులు విశాల్ అభిమానుల్ని అలరిస్తున్నాయి. విశాల్, కీర్తీ సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రల్లో ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ–‘‘ఇటీవల విడుదలైన ‘పందెంకోడి 2’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. రేపు(ఆదివారం) హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు. -
నా లక్ష్యం అదే: కీర్తీసురేశ్
సాక్షి, సినిమా: ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని సాధించుకోవడానికి కృషి, పట్టుదల చాలా అవసరం. అలా కీర్తీసురేశ్ నటనే లక్ష్యంగా సినీ రంగప్రవేశం చేసింది. నటించడానికి ఇంట్లో అంగీకరించకపోయినా, వారిని ఒప్పించి ఇప్పుడు మెప్పు పొందుతోంది. తొలి చిత్రం నిరాశ పరిచినా దాన్ని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన ఈ యువ నటి రెండో చిత్రం నుంచే విజయ పరంపరను కొనసాగిస్తోంది. అయితే మహానటి సావిత్రి జీవిత చరిత్రలో ఆమె పాత్రను పోషించి అద్భుత అభినయంతో సావిత్రిని కళ్ల ముందించిందనే చెప్పాలి. విమర్శకులను సైతం మెప్పించిన కీర్తీసురేశ్‌కు మరోసారి సావిత్రి పాత్రలో నటించే అవకాశం తలుపు తట్టిందంటే ఆమె నటిగా ఎంత పరిణితి చెందిందో, ఎంత అంకిత భావంతో నటించిదో అర్థం చేసుకోవచ్చు. అవును తెలుగులో ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో సావిత్రి పాత్రకు ఆ చిత్ర దర్శకుడు క్రిష్ కీర్తీసురేశ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా కీర్తీసురేశ్‌కు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ బ్యూటీ స్టార్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతోంది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడిందట ఈ అమ్మడు. అర్థం కాలా? అదేనండీ కీర్తీ తన పారితోషికాన్ని పెంచేసిందట. సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. అయితే ఇదంతా వదంతులు మాత్రమేనని కీర్తీసురేశ్ కొట్టి పారేస్తోంది. మరి ఈ బ్యూటీ మాటేమిటో చూద్దామా! నేను డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ రంగంలోకి రాలేదు. మంచి కథా చిత్రాల్లో నటించి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నదే ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం. దాని వైపే నా పయనం సాగుతోంది. శ్రమకు తగ్గ పారితోషికం, అది చిన్న మొత్తం అయినా సంతృప్తిగా లభిస్తే చాలు అంటోంది. -
‘మహానటి’ మరో డిలీటెడ్ వీడియో హల్చల్
సాక్షి, హైదరాబాద్: లెజెండరీ నటి హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ అప్రతిహతంగా దూసుకపోతోంది. అటు విమర్శకుల ప్రశంసలతోపాటు ఇటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన కీర్తి సురేష్ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడితో పాటు ఇతర సిబ్బందిపై కూడా ప్రశంసంల వర్షం కురుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే డిలిటెడ్ సన్నివేశాల వీడియోలు ఆకట్టుకుంటున్న తీరు మరో ఎత్తు. మహానటి సినిమా ఎంత సంచలన విజయాన్నిసృష్టిస్తోందో..అంతకంటే ఎక్కువగా డిలీటెడ్ సీన్లు, వీడియోలు యూట్యూబ్‌లో హల్ చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రప్రసాద్, హీరోయిన్ కీర్తి సురేష్‌పై చిత్రీకరించిన ఒక ఆసక్తికర సన్నివేశం నెట్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన డిలీటెడ్ వీడియోలు, సన్నివేశాలు ఇప్పటికే పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చాలా పాటలను, సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసివేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా ఎంజాయ్ చేయండి! -
ఓవర్సిస్లో దూసుకెళ్తోన్న ‘మహానటి’
అలనాటి అందాలనటి సావిత్రికి ఘన నివాళిగా నిలిచింది ‘మహానటి’. నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్, సావిత్రి పాత్రకు ప్రాణం పోశారు. సినిమా విడుదలైనప్పటి నుంచి వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఓవర్సిస్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుతం మహానటి ఓవర్సిస్లో 2.5 డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహానటి సినిమాకు కాలం కూడా కలసి వస్తోంది. ఈ వారం విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ రాకపోవడం కూడా మహానటికి కలిసి వచ్చే అంశం. ఈ సినిమా లాంగ్‌రన్‌లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందంటున్నారు విశ్లేషకులు. Savitramma continues to rule the box office! Thank you for 2.5 Million 😊 #Mahanati Thank You Everyone.@SwapnaCinema @KeerthyOfficial @dulQuer @Samanthaprabhu2 @TheDeverakonda @nagashwin7 @adityamusic @NirvanaCinemas @dancinemaniac pic.twitter.com/nnc2uqGBsq — Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 29, 2018 -
శ్రీవారిని దర్శించుకున్న కీర్తిసురేశ్
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటి కీర్తిసురేశ్ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు కీర్తి సురేశ్ కు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కీర్తి మీడియాతో మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహానటి సినిమా విజయవంతం కావడంతో స్వామివారి దర్శించుకున్నట్టు కీర్తి చెప్పారు. అదే విధంగా స్వామివారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామితో పాటు పెషావర్ పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామిజీ, ఉడిపి పీఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామిజీలు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పెషావర్ పీఠాధిపతి స్వామికి బంగారు పాదాలు విరాళంగా అందజేశారు. కొనసాగుతున్న రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 20 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది. -
కీర్తీకి కమల్ ప్రశంసలు
తమిళసినిమా : నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సావిత్రి పాత్రలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందించిన చిత్రం నడిగైయార్ తిలగం. దుల్కర్సల్మాన్, సమంత, అర్జున్‌రెడ్డి ఫేమ్ విజయ్‌దేవరకొండ, శాలిని పాండే, నాగ్‌చైతన్య, రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం శక్రవారం తెరపైకి వచ్చింది. సావిత్రి ప్రారంభ దశను మహానటిగా వెలిగిన దశను, వ్యక్తిగత అంశాలను సమతుల్యంగా ఏ ముఖ్య విషయాన్ని మిస్ కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత దృశ్యకావ్యంగా చిత్రాన్ని మలిచారు. చిత్ర షూటింగ్ దశలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్నా? అంటూ ఆక్షేపణ చేసిన వారు ఇప్పుడు ఆహా ఏం అభినయం అంటూ ప్రశంసిస్తున్నారు. విశ్వనటుడు కమలహాసన్ కూడా నటి కీర్తీసురేశ్‌ను శుక్రవారం ప్రత్యేకంగా తన ఇంటికి పిలిపించి మరీ అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నటి కీర్తీసురేశ్ తన ట్విట్టర్లో పేర్కొంటూ కమలహాసన్ ప్రశంసలు లభించడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా పేర్కొన్నారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అన్నారు. ఇలా కీర్తీసురేశ్‌ను అభినందించిన వారిలో సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రముఖులెందరో ఉన్నారు. ఇంతకు ముందు కీర్తీపై వ్యంగాస్త్రాలు సంధించిన నెటిజన్లు ఇప్పుడు ఆమె నటనను కీర్తిస్తుండడం విశేషం. చిత్రం నిర్మాణంలో ఉండగా సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్ నటించడానికి సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీనియర్ నటి జమున వంటి వారి వ్యాఖ్యలకు కీర్తీసురేశ్ చిత్రం చూడకుండా విమర్శించడమా అంటూ గట్టిగానే బదులిచ్చారు. అప్పుడే ఆమెలోని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. అలా కీర్తీసురేశ్ గెలిచారు. మహానటి సావిత్రి మాదిరిగానే ఆమె జీవిత చరిత్ర వెండితెరపై చిరస్మరణీయమైంది. -
ఎంత బాగుందంటే.. ఎంత బాగుందో చెప్పలేనంత!
‘మహానటి’ విడుదలైనప్పటి నుంచి సినీ ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. విమర్శకులు సైతం ఈ సినిమాలో లోపాలు చూపెట్టలోకపోతున్నారు. రివ్యూలు కూడా ‘మహానటి’ సినిమాను సావిత్రికి ఘన నివాళిగా పేర్కొన్నాయి. ఇదొక క్లాసిక్ సినిమా, మహానటి సావిత్రి సినీ చరిత్రలో ఎలా నిలిచిఉంటుందో.. ఈ ‘మహానటి’ కూడా సినీ చరిత్రలో నిలిచి ఉంటుందని సినీ అభిమానులు అంటున్నారు. తాజాగా మహానటిపై నాని స్పందిస్తూ.. ఎంత బాగుంది అంటే.. ఎంత బాగుందో చెప్పలేనంత అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘కీర్తి సురేశ్ తప్ప మరెవ్వరూ సావిత్రి గారి పాత్రను ఇంత బాగా పోషించలేరు. నాగి (డైరెక్టర్ నాగ్ అశ్విన్) ని చూస్తే గర్వంగా ఉంది. స్వప్నా, ప్రియాంక, దుల్కర్, సామ్, విజయ్, డాని, మిక్కిజే అందరికీ ధన్యవాదాలు’అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. #Mahanati Entha bagundhantey ... Entha bagundho cheppalenantha.@KeerthyOfficial only person who can play this role better than you is Savithri gaaru :)#Nagi super proud of you Swapna,Priyanka,Dulquer,sam,vijay, Dani,MickeyJ and to the entire team .. Thank you 🤗 — Nani (@NameisNani) 11 May 2018 -
మహాద్భుతం
‘‘సావిత్రిగారి గురించి రాసే అర్హత తెచ్చుకున్నాకే ఆమె కథ రాస్తా’... ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణి ఇలానే అంటుంది. కానీ సావిత్రి లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాక, ఇన్స్పైర్ అయ్యి అనుభవం పెరిగే వరకూ ఆగకుండా రాస్తుంది. ఆ మాటకొస్తే.. ‘మహానటి’ తీయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ వయసు, అనుభవం ఎంత? చాలా చాలా తక్కువ. అయినా కన్విక్షన్, ప్యాషన్ ఉంటే వయసు, అనుభవంతో పనేంటి? పైగా సావిత్రి లైఫ్ హిస్టరీ తెలుసుకున్నాక నాగ్ అశ్విన్‌కి ఆమె అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అదే ‘మహానటి’ జీవితాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేలా చేసింది. టైటిల్ రోల్లో కీర్తీ సురేష్, జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ తదితర తారలతో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘నాగ్ అశ్విన్ బ్రహ్మాండంగా తీశాడు.. కీర్తీ నటన అద్భుతం’ అంటు న్నారు. ట్వీటర్ ద్వారా కొందరు ప్రముఖులు తమ అనుభూతిని పంచుకున్నారు. 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (మే, 9) భారీ వర్షం. చాలా పెద్ద సినిమా (జగదేక వీరుడు అతిలోక సుందరి) తీశామనే ఆనందం. ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు.. ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు. మరుసటిరోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. మా అశ్వనీదత్‌గారికి ఆ రోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. సరిగ్గా అదే రోజున ‘మహానటి’ విడుదలైంది. ఆ రోజున ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో ఈ రోజు ‘మహానటి’ నిర్మించడానికీ అంతే ధైర్యం కావాలి. సావిత్రిగారి చరిత్రను తరతరాలకు అందించిన స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్‌కి ధన్యవాదాలు. సావిత్రి పాత్రలో కీర్తీ జీవించింది. జెమినీ గణేశన్‌గా దుల్కర్ నటన అద్భుతం. నాగ్ అశ్విన్, చిత్ర యూనిట్‌కు నా అభినందనలు. – దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మహానటి క్లాసిక్, ఇన్స్పిరేషనల్ బయోపిక్. కీర్తీ సురేశ్ ‘మాయాబజార్’ డ్యాన్స్‌లతో సావిత్రిగారిని తిరిగి తీసుకువచ్చింది. సమంతా అదరగొట్టింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి క్లాసిక్ మాకు అందించినందుకు వైజయంతీ మూవీస్‌కు స్పెషల్ థ్యాంక్స్. – ‘మెర్సల్’ ఫేమ్ దర్శకుడు అట్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ పెర్ఫార్మెన్స్ నేను చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ల్లో ఒకటి. కేవలం ఇమిటేటింగ్ కాదు, సావిత్రి గారి పాత్రకు ప్రాణం పోసింది. దుల్కర్ ఈజ్ ఫెంటాస్టిక్. నేను అతని ఫ్యాన్ అయిపోయా. కంగ్రాట్స్ నాగ్ అశ్విన్, స్వప్నా. మీ నమ్మకం, డిటర్మినేషన్ అద్భుతం. – దర్శకుడు రాజమౌళి థ్యాంక్యూ నాగ్ అశ్విన్.. ఈ సినిమా తీసినందుకు. సావిత్రిగారు అమరులు. నీ రైటింగ్, నీ రీసెర్చ్, నీ స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు. నాగీ ఆలోచనను, అతని కన్విక్షన్‌ను నమ్మి ఈ సినిమాను నిర్మించినందుకు స్వప్నా, ప్రియాంకకు కంగ్రాట్స్. టేక్ ఏ బౌ గర్ల్స్. సమంతా.. ఇలాంటి పాత్ర ఎంచుకోవడం గ్రేట్. నీ రోల్‌ను కమాండబుల్గా చేశావు. క్లైమాక్స్‌లో నీ నటన చాలా రోజులు గుర్తుండిపోతుంది. – దర్శకుడు వంశీ పైడిపల్లి నాగ్ అశ్విన్ నన్ను సావిత్రిగారి ఎరాలోకి తీసుకువెళ్లిపోయారు. ఏం సినిమా... ఇలాంటి పాత్ర చేసే అవకాశం కీర్తీ సురేశ్‌కి రావడం నిజంగా బ్లెస్డ్. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చైతన్య సూపర్బ్. స్వప్నా అండ్ టీమ్‌కు కంగ్రాట్స్. – దర్శకుడు మారుతి నాగ్ అశ్విన్, స్వప్నా, వైజయంతి మూవీస్ బోల్డ్ ఆలోచన ఇది. అద్భుతమైన నటీనటులతో సినిమా ఎగ్జిక్యూట్ చేశారు. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నా. ప్రతి ఒక్కరి నటన నచ్చింది. ‘కీర్తీ యూ కిల్డ్ ఇట్’. సమంతా.. నన్ను ఏడిపించేశావ్. దుల్కర్.. నువ్వు సూపర్. మోహన్‌బాబుగారు, విజయ్, క్రిష్, ప్రకాశ్ రాజ్ అందరూ కన్విన్సింగ్‌గా చేశారు. తాత రోల్లో చైతన్యను చూడటం హ్యాపీగా ఉంది. హార్ట్ ఈజ్ హ్యాపీ. – సుశాంత్ -
మహిళా శక్తి.. సమంత
మహానటి సినిమాలో ఎక్కువ శాతం మహిళలే పనిచేశారు. నిర్మాతలు మహిళలే. లీడ్ క్యారక్టర్ కూడా మహిళే. ఈ సినిమా కోసం ఎక్కువ మంది మహిళలే పనిచేశారని ఆడియో వేడుకల్లో కింగ్ నాగ్ కూడా పేర్కొన్నారు. ఒక సినిమా మొదలు కావాలంటే మొదటగా కావాల్సింది నిర్మాతలే. నిర్మాతలు ధైర్యం చేస్తేనే గొప్ప సినిమాలు వస్తాయి. మహానటి సినిమా నిర్మాతలు ప్రియాంక, స్వప్నలు ధైర్యం చేసి ఈ సినిమా బాధ్యతను తీసుకున్నారు. తెరపై ఆ మహానటి సాధించిన విజయాల్ని మళ్లీ అదే తెరపై ఆవిష్కరించేందుకు ఈ మహిళమణులు పూనుకున్నారు. అందుకే ‘మహానటి’ రూపు దాల్చింది. అలనాటి మహానటి సావిత్రిని గుర్తుకు తెచ్చేలా నటించడం మామూలు విషయం కాదు. కీర్తి సురేశ్ మాత్రం సావిత్రి పాత్రకోసమే పుట్టిందేమో అన్నట్టుగా జీవించేసినట్టుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు అచ్చం సావిత్రిని గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. తెర వెనుక ఇంకా ఎందరో మహిళామణుల కష్టం దాగి ఉంది. ఈ సినిమా విడుదలై సంచలనాలు సృష్టిస్తుందని, అప్పుడు ఈ క్రెడిట్ అంతా సినిమాకు పనిచేసిన మహిళలదే అవుతుందని అందుకే మహిళా శక్తి అని సమంత ట్వీట్ చేసి ఉంటుంది. కీర్తి సురేశ్, సమంత, షాలినీ, దుల్కర్ సల్మాన, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, క్రిష్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘మహానటి’మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Girl power 💪💪#Mahanatipromotions #Mahanation9th @VyjayanthiFilms @KeerthyOfficial pic.twitter.com/Dp9HPhMHcT — Samantha Akkineni (@Samanthaprabhu2) May 6, 2018 -
వాళ్లే నన్ను మెచ్చుకుంటారు : కీర్తి సురేశ్
లెజండరీ వ్యక్తుల జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమాల్లో నటించే అవకాశం రావాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం ఆ అదృష్టం కీర్తి సురేశ్‌కు దక్కింది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో ఆమె టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే మహానటి టీజర్ కూడా విడుదలైంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ పూర్తిగా లీనమైపోయిందంటూ కొందరు మెచ్చుకొంటుంటే.. మరి కొందరు మాత్రం ఆ పాత్రకు కీర్తి న్యాయం చేయలేక పోయారంటూ ట్రోల్ చేస్తున్నారు. తనకు సంబంధించి ఇలా మిశ్రమ స్పందన రావడంతో కీర్తి సురేశ్ ఒకింత ఉద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఒక వేడుకలో పాల్గొన్న కీర్తి మాట్లాడుతూ.. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారే సినిమా విడుదలైన తర్వాత మెచ్చుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ పాత్ర కోసం కీర్తి ఎంతగానో కష్టపడిందని.. అందుకే ఈ విధంగా స్పందించిందని ఆమె సన్నిహితులు తెలిపారు. -
నాకు ఆమె డబ్బింగా!
సాక్షి సినిమా: నా పాత్రకు ఆ నటి డబ్బింగ్ చెప్పారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ ఇంతకు ముందు నటించిన చిత్రాలు వేరు, తాజాగా నటించిన నడిగైయార్ తిలగం చిత్రం వేరు. ఈ చిత్రం కీర్తీసురేశ్‌కు ప్రత్యేకం అన్న మాట చాలా చిన్నదే అవుతుంది. మహానటి సావిత్రి పాత్రలో నటించే అవకాశం రావడం అంత సులభం కాదు. ఆమెలా నటించడం సాధారణ విషయం కాదు. సావిత్రి జీవిత చిరిత్రతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ మహానటి పేరుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇతర ప్రధాన పాత్రల్లో సమంత, దుల్కర్సల్మాన్, మోహన్‌బాబు, విజయ్‌దేవరకొండ ఇలా పలువురు నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని మే 9న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కీర్తీసురేశ్ పాత్రకు సీనియర్ నటి భానుప్రియ డబ్బింగ్ చెప్పారనే ప్రచారంసామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి స్పందించిన కీర్తిసురేశ్ తన పాత్రకు నటి భానుప్రియ డబ్బింగ్ చెప్పారనే ప్రచారంలో నిజం లేదన్నారు. రెండుభాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, ఇప్పటికే తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ పూర్తి చేశానని, నడిగైయార్ తిలగం తమిళ వెర్షన్‌కు ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నానని పేర్కొన్నారు. నటి భానుప్రియ ఈ చిత్రంలో నటించారన్నారు. మొత్తం మీద ఈ ద్విభాషా చిత్రంలో నటి భానుప్రియ కూడా నటించారన్న విషయాన్ని కీర్తీసురేశ్ వెల్లడించారు. అయితే అది ఏ పాత్ర అన్నది ఆసక్తిగా మారిందిప్పుడు. ఇదిలా ఉండగా నటి కీర్తీసురేశ్ తాజాగా తన పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారట. అందులో తన చిత్రాలవివరాలను అభిమానులు తెలుసుకునేఅవకాశం ఉంటుందన్నమాట. -
సావిత్రి కీర్తి
సావిత్రిని ప్రేమించాలా? గౌరవించాలా?అప్పటి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగినవాళ్లకు ఎప్పటికీ ఉండే సందిగ్ధమే ఇది.అవేం కాదు కానీ సావిత్రిని కీర్తించాల్సిందే.సజీవంగా ఇంకో సావిత్రిలా నటించడం, పాత్రలో జీవించడం ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. అయినా ‘మహానటి’... సావిత్రి ‘కీర్తి’కి అద్దం పడుతుంది. ‘మహానటి’ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ‘ఎవరీ నాగ్ అశ్విన్’? ‘ఎవడే సుబ్రమణ్యం’ రిలీజ్ తర్వాత చాలామంది అడిగిన ప్రశ్న ఇది. ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాలా లేదే? కాన్సెప్ట్ వండర్ఫుల్. ‘ఎవడే.. ’ సినిమాని చూసినవాళ్లు వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది. ఫస్ట్ మూవీకే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్న నాగ్ అశ్విన్ వెంటనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తీస్తాడని చాలామంది ఊహించి ఉంటారు. అయితే ఎవరూ ఊహించని విధంగా మహానటి సావిత్రి బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. అసలీ ఆలోచన నాగ్ అశ్విన్‌కి ఎప్పుడు వచ్చింది? అంటే.. ‘ఎవడే సుబ్రమణ్యం’ తీస్తున్నప్పుడే. నెక్స్›్టసినిమా ఏంటి? అని చిత్రనిర్మాత స్వప్నా దత్ అడిగితే.. సింపుల్‌గా సావిత్రిగారి లైఫ్ హిస్టరీ అన్నారు నాగ్. అంత పెద్ద ప్రాజెక్ట్‌ని తలెత్తుకోవడం అంటే తల పండిపోయిన దర్శకుల వల్లే సాధ్యం. అందుకే స్వప్న షాకయ్యారు. నాగ్‌కి కూడా సెకండ్ థాట్ లేకపోలేదు. ‘మన అనుభవం, వయసు సరిపోతుందా?’ అని ఆలోచించారు. ఎంతగా ఆలోచించారంటే దాదాపు రెండేళ్లు. ఫైనల్లీ ఈ మూవీ తీయాలని ఫిక్సయ్యారు. నాగ్ అశ్విన్‌కి సావిత్రి గురించి ఏం తెలుసు? చిన్నప్పుడు చూసిన విషయాలు, జరిగిన సంఘటనలు మనసులో నిలిచిపోతాయ్. అలా చిన్నప్పుడు అమ్మమ్మతో పాటు చూసిన సావిత్రి సినిమాలు నాగ్ అశ్విన్‌కి ఆమెను పరిచయం చేశాయి. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ.. చిత్రాలు చూసిన నాగ్ అశ్విన్‌కి సావిత్రి ఎంత గొప్ప నటో అర్థమైంది. పెద్దయ్యాక సావిత్రి జీవితం గురించి తెలుసుకుని చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఫైనల్లీ తన రెండో సినిమాకి ఆమె జీవిత కథనే ఎంచుకున్నారు. కొన్ని పుస్తకాల రిఫరెన్స్, కొందరు దర్శకులు చెప్పిన విశేషాలు, సావిత్రి సినిమాలు చూసి... ఎంతో రీసెర్చ్ చేసి, ఈ కథ తయారు చేసుకున్నారు. నేను సావిత్రిగారిలానా..? భయపడ్డ కీర్తీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు సావిత్రి క్యారెక్టర్‌కి ఏ హీరోయిన్నీ అనుకోలేదు. పూర్తయ్యాక ‘కీర్తి సురేష్’ అయితే బాగుంటుందని దర్శకుడికి అనిపించింది. కానీ ప్రియాంకా దత్, స్వప్నా దత్‌కి మాత్రం కీర్తీ్త సూట్ అవుతుందా? అని డౌట్. అయితే వైజయంతీ మూవీస్ అధినేత (ప్రియాంక, స్వప్న, స్రవంతిల తండ్రి) అశ్వనీదత్‌కి మాత్రం డౌటే లేదు. ‘కీర్తీ యాప్ట్’ అన్నారు. సో.. సావిత్రిగా కీర్తీయే అని ఫిక్సయ్యారు. కీర్తీకి కథ చెప్పడానికి వెళ్లారు. కథ విన్నప్పుడు అంత పెద్ద హీరోయిన్, మహానటి పాత్రను నేను పోషించగలనా? అని డౌట్ పడ్డారు కీర్తీ్త. అయితే ‘మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు చేయగలుగుతారు’ అని ఆమెను ఒప్పించారు. ‘దేవదాసు’లోని పార్వతి గెటప్‌లో టెస్ట్ షూట్ ఏదైనా క్యారెక్టర్‌కి ఒక హీరోయిన్ని అనుకున్నాక లుక్ టెస్ట్ చేశాక కానీ పూర్తి సంతృప్తి లభించదు. వన్ ఫైన్ డే కీర్తీకి సావిత్రిలా మేకప్ చేసి, టెస్ట్ షూట్ చేశారు. మేకప్ వేసుకుని కీర్తీ బయటకు రాగానే ‘పర్ఫెక్ట్ చాయిస్’ అని టీమ్ ఫిక్సయింది. నాగ్ అశ్విన్ విజన్‌కు ఆశ్చర్యపోయారట. ఫస్ట్ టెస్ట్ షూట్‌కి ‘దేవదాసు’ చిత్రంలో సావిత్రి చేసిన పారు గెటప్‌ని ప్లాన్ చేశారు. ఆ ఫొటోషూట్ చూసి ‘అదుర్స్’ అననివాళ్లు లేరు. ఫోర్ ఏజ్ గ్రూప్స్‌లో సావిత్రి క్యారెక్టర్ ఒకటి కాదు.. రెండు కాదు.. వందకు పైగా గెటప్స్‌లో కీర్తి సురేష్‌తో ఫొటోషూట్ చేశారు. ఇంతకీ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ ఏయే ఏజ్‌లో కనిపిస్తుంది? అంటే.. మొత్తం నాలుగు దశలలో కనిపిస్తారు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఓల్డేజ్‌లో ఈ పాత్ర ఉంటుందని తెలిసింది. అంటే.. సినిమాల్లోకి వచ్చిన కొత్త, స్టార్‌డమ్‌కి చేరుకున్న దశ, సినిమాలకు దూరం కావడం, ఆ తర్వాతి దశను చూపిస్తారని ఊహించవచ్చు. మెయిన్ షూట్ మొదలయ్యాక సావిత్రిలా తయారవ్వడానికి కీర్తీకి సుమారు రెండు గంటలు పట్టేది. సావిత్రి ఫొటో పక్కన పెట్టుకుని అది చూస్తూ రెడీ అయ్యేవారట. అందుకే ఫొటోలు లీక్ కాలేదు జన్రల్‌గా పెద్ద సినిమాలకు సంబంధించి తమంతట తాము అధికారికంగా ఫొటోలు విడుదల చేసేవరకూ అవి బయటకు లీక్ కాకూడదనుకుంటారు. దర్శకుడు శంకర్ అయితే షూటింగ్ లొకేషన్లోకి ఎవరూ సెల్‌ఫోన్ తీసుకు రాకూడదని నిబంధన విధించారు. అయినా ‘2.0’ ఫొటోలు లీకయ్యాయి. అయితే ‘మహానటి’ ఫొటోలు చిత్రబృందం విడుదల చేసేవరకూ బయటకు రాకపోవడం విశేషం. పైగా సినిమాకి పని చేసిన అందరూ సెల్ఫోన్లు తీసుకెళ్లేవారట. అయినా ఎవరూ దొంగచాటుగా ఫొటోలు లీక్ చేయకపోవడానికి కారణం సావిత్రి మీద ఉన్న గౌరవం అని యూనిట్ సన్నిహిత వర్గాల్లో ఒకరు తెలిపారు. అందరూ ఎంతో ప్రేమించి, ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారని పేర్కొన్నారు. దీన్నిబట్టి యూనిట్ మెంబర్స్ సినిమాని ఓన్ చేసుకుంటే ‘లీక్’ అనేది ఉండదని అర్థం చేసుకోవచ్చు. అవుట్ డోర్ షూటింగ్స్ అప్పుడు యూనిట్‌కి తిప్పలు తప్పలేదు. ఎవరో చాటుమాటుగా ఫొటోలు తీయడానికి ప్రయత్నించడం, వాళ్లను వారించడం జరిగేది. అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన ‘మాయాబజార్’ సెట్లో తీసిన అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు పాటలు హైలైట్‌గా నిలుస్తాయట. ఈ సెట్‌ని క్రియేట్ చేయడానికి సుమారు 100 మంది 20 రోజులు వర్క్ చేశారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఆర్టిస్టులు వచ్చారట. 97 ఏళ్ల పెయింటర్.. నారాయణ ఇప్పుడు ఏదైనా డిజిటల్లో సులువుగా చేసుకోవచ్చు. అయితే న్యాచురాల్టీ కోసం మ్యానువల్ వర్క్ చేయించడం కూడా జరుగుతుంటుంది. అలా ఈ సినిమాలో కనిపించే మబ్బులు, చెట్లను పెయింటింగ్ వేయించారట. బాలీవుడ్ చిత్రాలు ‘మొఘలీ ఆజామ్, ప్యాసా’ వంటివాటికి హ్యండ్ పెయింటింగ్స్ చేసిన నారాయణ ‘మహానటి’కి పెయింటర్‌గా చేశారు. ఆయన వయసు 97. ఆ వయసులో ఆయన 20 అడు గుల నిచ్చెన ఎక్కి పెయింటింగ్స్ వేయడం యూనిట్లో ఉన్న చిన్నవాళ్లకు ఇన్స్పిరేషన్. ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నప్పుడు గతంలో తాను ఒక సావిత్రి సినిమాకి వర్క్ చేశానని, ఆ సినిమా పేరు గుర్తు లేదని నారాయణ అన్నారట. నారాయణకు ఇదే చివరి సినిమా. మొన్నీ మధ్యనే ఆయన మరణించారు. అక్కడక్కడా బ్లాక్ అండ్ వైట్.. మిగతాది కలర్.. మహానటికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డానీ సంచెజ్ లోపెజ్‌ని తీసుకున్నారు. ఆయన ప్రొఫైల్ చూసి, నాగ్ అశ్విన్ ఇన్స్పైర్ అయ్యారట. ఇండియా మీద డానీకి ఉన్న గౌరవం చూసి, ఈ సినిమాకి కెమెరామేన్‌గా తీసుకున్నారట. సినిమా ఆల్మోస్ట్ కలర్లో ఉంటుంది. అక్కడక్కడా బ్లాక్ అండ్ వైట్ సీన్స్ కనిపిస్తాయి. కెమెరా వర్క్ ఐఫీస్ట్‌గా నిలుస్తుందట. అందుకు శనివారం రిలీజైన టీజర్ ఓ ఉదాహరణ. నాలుగు రకాల బొట్లు సావిత్రిని గుర్తు చేసుకోగానే ఆమె చక్కని ముఖారవిందం మన కళ్ల ముందు మెదులుతుంది. అలాగే ఎక్కువగా నిలువు బొట్టులో గుర్తొస్తారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మొత్తం నాలుగు రకాల బొట్లు వాడారని తెలిసింది. రకరకాల సైజ్‌లో నిలువు బొట్టు, గుండ్రని బొట్టు వాడారట. మామూలుగా సావిత్రి మిడిల్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఒకలాంటి బొట్టు, పెద్ద వయసులో ఇంకో రకం బొట్టు, ఇంట్లో ఉన్నప్పుడు విభూది పెట్టుకునేవారట. ఆ విషయాలను ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి దగ్గర తెలుసుకుని, అలానే ఫాలో అయ్యారట. అప్పట్లో కళ్లకు కాటుక వాడేవారు. ఈ సినిమాలో కీర్తీ కూడా కాటుక దిద్దుకున్నారు. పై రెప్పలకు మాత్రం ఐలైనర్ వాడారట. చెన్నై నుంచి సవరాలు సావిత్రి జుత్తు కొంచెం వంకీలు తిరిగి ఉంటుంది. కీర్తి సురేష్ హెయిర్ కూడా దాదాపు అలానే ఉన్నప్పటికీ ఇంకొంచెం కర్లీగా చేయించుకున్నారట. జడ, ముడి.. ఇలా రకరకాల స్టైల్స్‌లో ఆమె కనిపిస్తారట. పొడవాటి జుత్తు కోసం చెన్నై నుంచి సవరాలు తెప్పించుకున్నారట. అలాగే, ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్‌ని పిలిపించుకున్నారట. ఇవన్నీ కూడా కీర్తీ తనంతట తాను ఎక్కువ కేర్ తీసుకుని, ప్లాన్ చేసుకున్నారట. వందకు పైగా చీరలు.. సావిత్రి కట్టూ బొట్టూ అందరికీ ఇష్టం. నిజానికి ఇప్పుడు ‘డిజైనర్ శారీస్, బ్లౌజెస్’ అంటున్నారు కానీ అవి అప్పటి ఫ్యాషనే. అప్పటి చీరలను, జాకెట్టులను తయారు చేయించడానికి బాలీవుడ్ డిజైనర్ గౌరంగ్ షాని పిలిపించారు. ‘మహానటి’ కథ విన్నాక ‘నేనీ సినిమాని కచ్చితంగా చేస్తా’ అన్నారట. అప్పట్లో సావిత్రి కట్టిన చీరలను తయారు చేయడానికి ఆయన బోలెడంత రీసెర్చ్ చేశారు. పది మంది టీమ్‌తో నాలుగు నెలల పాటు రీసెర్చ్ చేసి, ‘స్పె షల్ ఫ్యాబ్రిక్’ తెప్పించి, చీరలు డిజైన్ చేశారు. ఒక్క ‘మాయాబజార్’ ఘట్టంలో వచ్చే చీర నేయడానికే మూడు నెలలు పట్టిందట. ఇక, నగల తయారీకి ఆరు నెలలు పట్టింది. అచ్చంగా జెమినీలా.. సావిత్రి జీవితంలో తమిళ నటుడు జెమినీ గణేశన్ కీలక వ్యక్తి. ఆయన్ను ప్రేమించి, పెళ్లాడారామె. జెమినీ తమిళీయుడు కాబట్టి, ఆ పాత్రను వేరే భాషకు చెందిన నటుడితో చేయించాలనుకున్నారు. మమ్ముట్టి తనయుడు, హీరోగా దూసుకెళుతోన్న దుల్కర్ సల్మాన్ అయితే బాగుంటుందని తనని అప్రోచ్ అయ్యారు. దుల్కర్ సెకండ్ థాట్ లేకుండా సినిమా ఒప్పుకున్నారట. ఆయన కాస్ట్యూమ్స్‌ని అర్చనా రావ్ డిజైన్ చేశారు. నైన్టీన్ఎయిటీస్లో మధురవాణి క్యారెక్టర్ ఇందులో సమంత జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించనున్నారు. ఈ పాత్ర నైన్టీన్ఎయిటీస్లో ఉంటుంది. అంటే.. సావిత్రి కెరీర్ ఎండింగ్లో వచ్చే పాత్ర అని ఊహించవచ్చు. సో.. సావిత్రి లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనో, ఆమె జీవితం గురించి రాయాలని ఆరాటపడే జర్నలిస్ట్గానో సమంత కనిపిస్తారని ఊహించవచ్చు. వాస్తవానికి టైటిల్ రోల్ చేసింది కీర్తి సురేషే అయినా సినిమాని లీడ్ చేసేది మాత్రం మధురవాణి పాత్రే అట. మిడ్డీస్, చుడీదార్స్, శారీస్లో సమంత కనిపిస్తారని తెలిసింది. ఫొటో జర్నలిస్ట్‌గా విజయ్ దేవరకొండ కనిపిస్తారట. అలనాటి కారు.. కెమెరా ‘మహానటి’ టీజర్లో అలనాటి కారు కనిపించడం గమనించే ఉంటారు. అప్పటి కెమెరాలు, గ్రామ్‌ఫోన్ ఇలా.. ఎన్నో వస్తువులు మనకీ సినిమాలో కనిపిస్తాయి. ఇప్పటికీ అవి లభ్యమవుతున్నాయి. దొరకనవి చేయించారు. కొన్ని రెంట్‌కి తీసుకున్నారు. షూట్ మొదలుపెట్టక ముందే ఒక బ్యాంక్ తయారు చేసుకున్నారట. కావాల్సిన వస్తువులన్నీ సేకరించాకే షూట్ మొదలుపెట్టారని సమాచారం. మాయాబజార్ ప్రియదర్శిని మాయాబజార్లో ప్రియదర్శిని హైలైట్. ఈ పెట్టె తయారీకి 15 రోజులు పట్టిందట. మూడుసార్లు తయారు చేయించినా సంతృప్తిగా అనిపించలేదట. నాలుగో ప్రియదర్శిని పర్ఫెక్ట్గా కుదరడంతో దాన్ని ఓకే చేశారు. ‘శివమ్, ఘాజీ’ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా చేసిన అవినాష్ కొల్లా వర్క్ చేశారు. సీనియర్ ఆర్ట్ డిజైనర్ ‘తోట తరణి’ ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు. -
మహానటిని వదల్లేక!
సావిత్రిలా నడవటం, చూడటం. పెదవి విరవడం, డ్యాన్స్ చేయడం... ఇలా కొన్ని నెలలుగా కీర్తీ సురేశ్ తనను తాను సావిత్రిలా ఊహించుకున్నారు. అందుకే ఇక ఆమెలా అభినయించే అవకాశం లేదని ఫీలయ్యారు. ‘మహానటి’ షూటింగ్ చివరి రోజున కీర్తీ సురేశ్ ఎమోషన్ అయ్యారు. సావిత్రి చిత్రపటం దగ్గర దీపం వెలిగించారు. చెమర్చిన కళ్లతో చిత్రబృందం నుంచి వీడ్కోలు తీసుకున్నారామె. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కథానాయిక కీర్తీ సురేశ్ నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత ప్రియాంకా దత్ మాట్లాడుతూ – ‘‘మహానటి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీలక పాత్రలు చేసిన మోహన్‌బాబుగారు, రాజేంద్ర ప్రసాద్‌గారు స్ట్రాంVŠ సపోర్ట్‌గా నిలబడ్డారు. కీర్తీ సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ ఇలా భారీ తారాగణంతో మా బ్యానర్లో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు రుణపడి ఉంటాం. మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
అచ్చం సావిత్రి, జెమినీ గణేషన్‌లా...
ప్రస్తుతం సినీ అభిమానులను దాదాపు ముప్పై, నలభైయేళ్లు వెనక్కు తీసుకెళ్లే పనిలో ఉన్నారు దర్శకులు. అందులో ఒకటి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న రంగస్థలం, మరొకటి నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న మహానటి చిత్రం. 1980 నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. ఈ సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ చూసిన ప్రేక్షకులు అప్పటి కాలం అనుభూతికి లోనవుతున్నారు. ఇక సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహానటి. అంటే దాదాపు యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి అప్పటి పరిస్థితులను తెరపై ఆవిష్కరిస్తున్నాడు నాగ్ అశ్విన్.అయితే మహానటికి సంబంధించిన సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల అయింది. అయితే ఆ సినిమాలో ఇతర పాత్రలకు సంబంధించి ఎలాంటి న్యూస్‌తో పాటు ఫోటోలు బయటకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సావిత్రి, జెమినీ గణేషన్‌లను తలపించేలా కీర్తిసురేశ్, దుల్కర్ సల్మాన్ల ఫోటో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోను ఎవరైనా అభిమాని డిజైన్ చేసి ఉంటాడని కొంతమంది, మహానటి పోస్టర్ లీకైందని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా... ఈ చిత్రం మాత్రం నాటి తరం తారాగణాన్ని గుర్తుచేసేలా...సరికొత్త అనుభూతికి గురయ్యేలా చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ పోస్టర్ పై చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఆ విషయం నాకు చాలా బాధ కలిగించింది?
కీర్తిసురేశ్ తన గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కీర్తీ తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో బిజీగా ఉన్నారు. కీర్తీ ఇండస్ట్రీలో కథానాయకి చాలా వేగంగా ఎందిగిందన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె ఇతర హీరోయిన్ల అవకాశాలను కొట్టేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయ్ 62వ చిత్రంలో మొదట రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశం ఇప్పుడు కీర్తీని వరించింది. ప్రస్తుతం సండైకోళి-2 చిత్రంలో విశాల్‌కు జంటగా నటిస్తున్నారు. అదే విధంగా సామి-2లో విక్రమ్‌తో కూడా జత కడుతున్నారు. ఇందులో మరోనాయకిగా త్రిషను ఎంపిక చేశారు. అయితే ముందు అంగీకరించిన త్రిష ఆ తరువాత అనూహ్యంగా సారీ మీతో నాకు సెట్ కాలేదంటూ వైదొలగింది. ఈమె తప్పుకోవడానికి కారణం కూడా కీర్తీనేననే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రం కోసం కీర్తీసురేశ్ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేశారనే ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ప్రచారం కీర్తీసురేశ్ దృష్టికి వెళ్లిన వెంటనే తాను స్పందిస్తూ.. మొదట రెండు విషయాల గురించి స్పష్టం చేయాలన్నారు. అందులో తాను అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనకు తగ్గ పారితోషికాన్నే నిర్మాతలు చెల్లిస్తున్నారని చెప్పారు. ఇక రెండో అంశం సండైకోళి- 2 చిత్రం కథను దర్శకుడు చెప్పినప్పుడు తన పాత్ర నచ్చడంతో నటించడానికి అంగీకరించానని అన్నారు. ఈ చిత్రంలో త్రిష కూడా నటిస్తున్నారని అప్పుడు దర్శకుడు చెప్పారని, ఆ తరువాత తను ఎందుకు తప్పుకున్నారో తనకు తెలియదని అన్నారు. ఇలాంటి ప్రచారం ఎవరు? ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. ఇటీవల తాను నటించిన తెలుగు చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సంప్రదాయబద్ధంగా ఉంటుందని చీర కట్టుకుని వెళ్లాను. అయితే దాని గురించి విమర్శలు చేశారని, మొదట వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, తరువాత బాధ కలిగిందని కీర్తిసురేశ్ పేర్కొన్నారు. కాగా కీర్తి పవన్‌కల్యాణ్‌తో నటించిన తెలుగు చిత్రం అజ్ఞాతవాసి ఈ నెల 10వ తేదీన, సూర్యతో రొమాన్స్ చేసిన తమిళ చిత్రం తానాసేర్న్‌ద కూట్టం ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుండడం విశేషం. ఇక విజయ్‌తో నటించనున్న చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
గ్యాంగ్ .. బ్యాంగ్.. దుమ్మురేపిన సూర్య
సాక్షి, హైదరాబాద్: ‘గ్యాంగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య డ్యాన్సులతో దుమ్మురేపారు. తొలిసారి ఈ సినిమాలో తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకొన్నానని, తన ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానని సూర్య అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న తమ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ వేడుకలో హీరోయిన్ కీర్తిసురేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటి రమ్యకృష్ణతోపాటు పలువురు చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. -
హిట్టయ్యారు సెట్టయ్యారు!
తెలుగు ఈ ఏడాది కళకళలాడింది! ప్రపంచ మహాసభల సంగతి కాదు. పరభాషా హీరోయిన్లతో తెలుగు స్క్రీన్ ఒక వెలుగు వెలిగింది. కేరళ అమ్మాయిలు నివేథా థామస్ (22), అనూ ఇమ్మాన్యుయేల్ (20), కీర్తీ సురేశ్ (25); తమిళమ్మాయి సాయిపల్లవి (25); జబల్పూర్ బబ్లీ.. షాలినీ పాండే (24).. తెలుగు వెండి తెరకు బంగారు తళుకు బెళుకులు అద్ది, యువహృదయాలపై నాలుగు గుద్దులు గుద్ది.. తమకే పాపం తెలియనట్టు నెక్స్›్ట ప్రాజెక్ట్‌కి వెళ్లిపోయారు.ఒక్కొక్కరి ముఖాలు చూడండి ఎలా ఉన్నాయో! రోజు మార్నింగ్ లేవగానే పరగడుపున ఓ కప్పు అమృతం, మధ్యాహ్నం లంచ్‌కి మకరందం కలిపిన తేలికపాటి జ్యూస్‌లతో చిన్న కునుకు, రాత్రికి సప్పర్‌లో మైల్డ్‌గా ఓ గుప్పెడు తిండి గింజలు.. దేవకన్యల రెసిపీని ఎవరో దొంగిలించుకుని వచ్చి వీళ్లకు ఇచ్చినట్లున్నారు! యాక్టింగ్ మాత్రం? క్యారెక్టర్ని కర్కశంగా తొక్కి తైతక్కలాడేస్తున్నారు. కరకర నమిలి మింగేస్తున్నారు. ఎలా ఇంత ఈజ్ సాధించారు? ట్రైనింగ్ కొంతే.. ఇన్‌పుట్‌గా. మిగతాదంతా ఇన్‌బిల్ట్ కావచ్చు. బ్లడ్‌లో అభినయాన్ని మిక్స్ చేసి బ్రహ్మదేవుడు పై నుంచి నేరుగా కిందికి వీళ్లైదుగుర్నీ జారవిyì చినట్లున్నాడు! అక్కడి నుంచి మన డైరెక్టర్లు తెచ్చేసుకున్నారు. నివేథా థామస్ మూడు సినిమాల్లో; సాయి పల్లవి, అనూ ఇమ్మాన్యుయేల్ రెండ్రెండు సినిమాల్లో, కీర్తి సురేశ్, షాలినీ పాండే ఒక్కొక్క మూవీలో ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఎట్రాక్షన్ అయ్యారు. న్యూ ఇయర్‌లోనూ కొత్త పాత్రల్లో మెస్మరైజ్ చెయ్యబోతున్నారు. ఎల్లుండే న్యూ ఇయర్. ఈ ఐదుగురు అమ్మాయిల గురించి కాస్త కాస్త అయినా చెప్పుకోకపోతే 2017 కంప్లీట్ అయినట్లు ఉండదు. 2018 మొదలు కాబోతున్నట్లూ ఉండదు. నివేథా థామస్ ఈ ఏడాది.. ‘నిన్ను కోరి’, ౖ‘జె లవ కుశ’, ‘జూలియట్.. లవర్ ఆఫ్ ఇడియట్’ చిత్రాల్లో నటించారు. ‘నిన్ను కోరి’ లవ్ మూవీ. మామూలు లవ్ కాదు. కాంప్లికేటెడ్ లవ్. మనిషొక దగ్గర, మనసొక దగ్గర ఉన్న పల్లవి క్యారెక్టర్లో.. మనిషి దగ్గరే మనసూ ఉండాలన్న ఎమోషన్స్‌కి ఒబే అవుతూ నివేథ ఇచ్చిన అభినయం ఔట్‌స్టాండింగ్. నాని హీరో. హీరోకి గట్టి పోటీ ఇచ్చింది నివేథ.రెండో చిత్రం ‘జై లవ కుశ’లో ‘జై’ మీద ప్రతీకారంతో రగిలిపోతుంటుంది నివేథ. ఎందుకంటే జై కారణంగా ఆమె అన్న చనిపోతాడు. అదీ ఆమె కోపం. జై మీద ప్రేమ ఉన్నట్లు నమ్మించి, అతణ్ణి ఫినిష్ చేయాలి. అదీ ఆమె ప్లాన్. పగనీ, ప్రేమనీ ఏకకాలంలో డెలివరీ చేయడం మాటలా! నివేథ చేసింది.మూడో మూవీ ‘జూలియట్.. లవర్ ఆఫ్ ఇడియట్’. హీరో ఒక మెంటల్. మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. ‘నేనిలాగే ఉంటాను’ అంటాడు. వాడు ఆమెను ప్రేమిస్తే ఆమె వాడిని ప్రేమించవలసి వస్తుంది. షాకుల మీద షాకులు ఇస్తుంటాడు నివేథకి. అలాంటి వాడితో వేగడానికి, వేగుతున్నట్లు యాక్ట్ చెయ్యడానికి ఎంత క్యాలిబర్ కావాలి! అంత క్యాలిబర్తోనూ తనేమిటో చూపించింది నివేథ. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్.. ఈ ఏడాది అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన తెలుగు సినిమాలు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఓ తింగరి కామెడీ. రాజ్ తరుణ్ తింగరితనానికి తగినట్టుగా, అతడి ప్రేయసిగా నంగి నంగిగా నటించడం, నవ్వించడం అనూ పార్ట్. చక్కగా యాక్ట్ చేసింది. ‘ఆక్సిజన్’ అయితే అనూకు దాదాపుగా ఒక చాలెంజ్. గోపీచంద్ ఎత్తుగా, బలంగా ఉంటాడు. ఆయన పక్కన అంతే బలమైన హీరోయిన్ రాశీఖన్నా ఉంటుంది. అనూ స్మాల్ బర్డ్. అయినాగానీ చంద్‌ని చాంద్ కా తుక్డాగా ట్రిమ్ చేసింది. రాశీని ఓవర్టేక్ చేసింది. ఆ కళ్లు.. ఆ చూపు.. అనూకి గిఫ్ట్. కీర్తీ సురేశ్ ఈ ఏడాది తెలుగులో చేసింది ఒకటే మూవీ. ‘నేను లోకల్’లో కీర్తిగా. ఆ ఒక్క దెబ్బతో 2018లో ఆమె రెండు మూవీలు చేయబోతోంది. కథ మామూలే. నాన్న మాట జవదాటని అమ్మాయి, ఆ అమ్మాయిని ప్రేమించే ఓ అబ్బాయి. గొప్ప కాన్ఫ్లిక్ట్. ఈజీగా చేసేసింది కీర్తి. కళ్లతో, బుగ్గల్తో సగం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది. లవ్లీ ఫేస్ కట్స్. పర్ఫెక్ట్ ఫీలింగ్స్. నాని ఆమెను డిస్టర్బ్ చేయాలని చూస్తుంటాడు. కీర్తి డిస్టర్బ్ కాదు. మూవీ ఎండింగ్‌కి వస్తున్నప్పుడు మాత్రం తను డిస్టర్బ్ అయి, నానీని డిస్టర్బ్ చేస్తుంది. కష్టమైన క్యారెక్టర్. మనకు ఇష్టమైన క్యారెక్టర్ అయిపోతుంది.. సినిమా అయ్యేలోగా. ‘ఫిదా’ గురించి చెప్పేదేముంది? ఉంది! సాయి పల్లవి యాక్షన్‌కే కదా ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయింది. అందగత్తె అనడానికి లేదు. కాదనీ అనడానికి లేదు. తెలుగురాని ఒక తమిళమ్మాయి తెలంగాణ తెలుగులో కవ్వించడం, కొట్లాడడం, పోట్లాడ్డమే అందం అయింది. ఆ ముఖం మీద ఆ మొటిమలేంటి అని ఎవరూ అనుకోలేదు. లోపల లవ్ ఉంచుకుని, బయటికి లేనట్లుగా నటించడం సాయి పల్లవికే చెల్లిందేమో. ‘వచ్చిండే..’ అని పాటకు సాయి పల్లవి మాత్రమే డ్యాన్స్ చెయ్యగలదు. సాయి పల్లవిదే ఈ ఏడాది ఇంకో సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. లేటెస్ట్ రిలీజ్. తెలంగాణా ఇంటీరియర్స్‌కి, సాయి పల్లవికీ బాగా సెట్ అయినట్లుంది. ఈ మూవీలోనూ ఆ అమ్మాయి యాటిట్యూడ్ లంగరేసి లాగేస్తుంది. నానీని, మనల్నీనూ. నివేథ, అనూ, కీర్తీ, సాయి, షాలినీ.. ఈ ఐదుగురూ ఒకే కాలేజీలోని క్లాస్‌మేట్స్‌లా ఉంటారు. తెలుగు ఇండస్ట్రీకి ఒకే టైమ్‌లో భలే సెట్ అయ్యారు. అంతా బిలో ట్వెంటీ ఫైవ్. నాలుగు భాషల్లో నటిస్తున్నారు. నాలుగు భాషల్లోనూ మాట్లాడతారు. ఐదుగురిలో ఉన్న ఒకే పోలిక ఏంటంటే.. చూడ్డానికి ఒకేలా ఉన్నా నటనలో ఎవరికీ ఎవరితో పోలిక లేకపోవడం. న్యూ ఇయర్లో రిలీజ్ అవుతున్న ‘అజ్ఞాతవాసి’లో అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ‘మహానటి’లో కీర్తి సురేశ్, షాలినీ పాండే నటిస్తున్నారు. నివేథా థామస్ కేరళలోని కన్ననూర్‌లో పుట్టింది. ప్రస్తుతం బి.ఆర్క్ ఫైనలియర్ చదువుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 3, కథానాయికగా తమిళ, మలయాళ, తెలుగులో 13 సినిమాల్లో యాక్ట్ చేసింది. అనూ ఇమ్మాన్యుయేల్ పుట్టిందీ, ఉంటున్నదీ చికాగోలో. హోమ్ టౌన్ కేరళలోని తళత్తంగyì . హయ్యర్ స్టడీస్ ఇంకా పూర్తి కాలేదు. ఇంతవరకు తెలుగు, తమిళ, మలయాళం కలిపి ఆరు చిత్రాల్లో నటించింది. అజ్ఞాతవాసి, నాపేరు సూర్య, నాగచైతన్యతో చేస్తున్న మూవీ.. మేకింగ్‌లో ఉన్నాయి. కీర్తి సురేశ్ జన్మస్థలం కేరళలోని త్రివేండ్రం. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. మోడలింగ్‌లో కూడా కొన్నాళ్లు ఉంది. మొత్తం 14 సినిమాలు చేసింది. తెలుగులో ప్రస్తుతం అజ్ఞాతవాసి, మహానటి చిత్రాల్లో నటిస్తోంది. సాయిపల్లవి తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది. మెడిసిన్ చేసి సినిమాల్లోకి వచ్చింది. ఐదు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి తెలుగు, రెండు తమిళ సినిమాలున్నాయి. షాలినీ పాండే మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో పుట్టింది. యాక్టింగ్ మీద ప్రేమతో ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చేసింది. ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చింది. ‘అర్జున్‌రెడ్డి’ ఆమె ఫస్ట్ మూవీ. ‘మహానటి’.. మేకింగ్‌లో ఉంది. న్యూ ఇయర్లో వీళ్లవే మరికొన్ని సినిమాలు, కొత్తగా వచ్చేవాళ్లతో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయితే మన తెలుగు సినిమాలకు, తెలుగు భాషకు ఢోకా లేనట్లే. షాలినీ పాండే! ‘అర్జున్‌రెడ్డి’లో ఆమె చేసింది తక్కువ. అర్జున్‌రెడ్డికి చేసింది చాలా ఎక్కువ. కథని డ్రైÐŒ చేసింది షాలినీనే. తక్కువ మాట్లాడి, ఎక్కువ కవర్ చేయడం తేలికేం కాదు. అర్జున్‌రెడ్డి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు మౌనం, అర్జున్‌రెడ్డితో గొడవ పడ్డప్పుడు మౌనం, అమ్మానాన్న అర్జున్‌రెడ్డికి కాకుండా వేరేవాడికిచ్చి పెళ్లి చేస్తుంటే మౌనం.. ప్రతి ఫ్రేమ్‌లోనూ షాలిని మాటల కన్నా, మౌనమే ఎక్కువగా ధ్వనించింది. భాష లేకుండా భావాలతో నటనని ప్రదర్శించడం అంత ఈజీ ఏం కాదు. కానీ షాలినీ చేసింది. ప్రేమలో ఉన్న ఒక అమ్మాయి.. సొంతవాళ్లకు, తన సొంతం అనుకున్న వాడికీ మధ్య ఎలా నలిగిపోతుందో షాలినీ చూపించింది. బలహీనమైన కథని కూడా బలంగా నడిపించే టానిక్ షాలినీ చిరునవ్వులో ఒలుకుతూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీకి మరొక ప్రామిసింగ్ యాక్ట్రెస్ షాలినీ. -
ఎటో వెళ్లిపోయింది మనసు!
సండేని ఫన్‌డేగా ఫుల్ జోష్‌తో దిల్ ఖుష్ అయ్యేలా ఎంజాయ్ చేయాలనుకున్నారు హీరోయిన్ సమంత. కానీ, దర్శకుడు నాగ అశ్విన్ షూట్ ప్లాన్ చేయడంతో సమంత షూట్లో జాయినైపోయారు. వృత్తి పట్ల సమంతకు అంత డెడికేషన్. సెట్లో సమంత యాక్షన్ ఇరగదీసేస్తున్నారు కానీ షూట్ గ్యాప్‌లోనే ఎటో వెళ్లిపోయింది మనసు అన్నట్లు ఆలోచిస్తున్నట్లున్నారట. అందుకే నాగ అశ్విన్‌పై సరదాగా సెటైర్ వేశారీ బ్యూటీ. ‘‘ప్రజెంట్ నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ లిస్ట్‌లో నాగ అశ్విన్ లేరు. సరదాగా గడపాల్సిన నా సండే.. వర్క్ అంటూ సెట్లో గడిచిపోయింది’’ అని సమంత పేర్కొన్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగఅశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మహానటి’లో కీర్తీ సురేశ్ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. మెహన్‌బాబు, దుల్కర్సల్మాన్, సమంత, దర్శకుడు క్రిష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇటీవల 1980 కాలం నాటి లూనా ఫొటోను సమంత బయటపెట్టారు. ఇప్పుడు ఆ కాలంనాటి ఎమ్‌టీఎస్ ఫొటో ఒకటి (ఇన్సెట్లో చూడొచ్చు) ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
వాయింపుడు షురూ!
జీప్సీలో సూపర్ స్పీడ్‌తో వచ్చి సడన్ బ్రేక్ వేసి, ఎంట్రీ ఇచ్చారు హీరో విక్రమ్. విలన్స్ వైపు కోపంగా చూశారు. ఇంకేముంది? వాయింపుడు షూరూ అయ్యింది. అయితే అది ఏ రేంజ్లో అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూస్తేనే కిక్ వస్తుంది అంటున్నారు చిత్రబృందం. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నైలో 20 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్‌తోపాటు, కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాకు వర్క్ చేస్తోన్న కెమెరామన్ ప్రియన్ గత నెలలో మరణించారు. ఆ ప్లేస్‌లో మరో కెమెరామన్ వెంకటేష్‌ను తీసుకున్నారు. ఈ సినిమాకి ‘స్వామి స్క్వేర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2003లో వచ్చిన ‘స్వామి’కి ఇది సీక్వెల్. ఈ సంగతి ఇలా ఉంచితే.. మరోవైపు విక్రమ్, తమన్నా జంటగా నటిస్తున్న ‘స్కెచ్’ చిత్రం ఆడియోను డిసెంబర్ 15లోగా రిలీజ్ చేసి, చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
వి ఫర్ విశ్వాసం
ఎవరికి ఉండాలి? ఎందుకు ఉండాలి? అంటే... అవకాశం ఇచ్చినవారి పట్ల విశ్వాసంగా ఉండాలి. అలా ఉండాలని రూలేం లేదు. అది వ్యక్తుల విజ్ఞత, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు హీరో అజిత్ – దర్శకుడు శివలను తీసుకుందాం. వేదాలం, వీరం, వివేగమ్... ఇలా ‘వి’ అక్షరం పేరున్న మూడు హిట్ సిన్మాలు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అవకాశం ఇచ్చిన అజిత్ పట్ల దర్శకుడు శివకు విశ్వాసం ఉండాలా? లేక మూడు హిట్ సిన్మాలిచ్చారు కాబట్టి శివ పట్ల అజిత్ విశ్వాసంగా ఉండాలా? అంటే... సమాధానం చెప్పడం కష్టమే. అయితే.. తమిళంలో స్టార్ హీరోగా దూసుకెళుతోన్న అజిత్.. అప్‌కమింగ్ డైరెక్టర్ శివకు అవకాశం ఇవ్వడం మాత్రం గ్రేటే. ఇంతకీ విశ్వాసం గురించి ఈ రేంజ్లో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... అజిత్ హీరోగా శివ దర్శకత్వం వహించనున్న నాలుగో చిత్రానికి ‘విశ్వాసం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో అజిత్ పోలీసాఫీసర్‌గా నటించబోతున్నారట. ‘‘జనవరిలో షూటింగ్‌ను స్టార్ట్ చేసి దీపావళికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని సత్య జ్యోతి ఫిలిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి సిద్దార్థ్ పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు కాజల్, కీర్తీ సురేశ్ పేర్లను పరిశీలిస్తున్నారని కోలీవుడ్ టాక్. అదీ గాక... ఆల్రెడీ అజిత్–శివ కాంబినేషన్లోనే వచ్చిన ‘వివేగమ్’ చిత్రంలో కాజల్, ‘హాసిని’ పాత్రలో నటించారు. సో... కాజల్‌నే ఫైనల్ హీరోయిన్గా ఫిక్స్ అవుతారని కొందరు గాసిప్ రాయుళ్లు జోస్యం చెబుతున్నారు. మరి వీళ్లేనా? లేక మరోకరు ఎవరైనా ఈ ఛాన్స్ కొట్టేస్తారా? అనేది తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగక తప్పదు. ‘విశ్వాసం’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
న్యూ లుక్
ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మొదలు కావడానికి ఇంకో రెండు నెలలు ఉంది. కొత్త సంవత్సరంలో మొదటి నెల షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. ఈలోపు ఈ చిత్రంలో నటించబోయే నాయికలు, సహాయ నటీనటుల గురించి చర్చలు మొదలయ్యాయి. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్‌లను తీసుకున్నారని ఓ టాక్. పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలో ఉందని మరో టాక్. తాజాగా, టబు పేరు సీన్లోకొచ్చింది. ఓ కీలక పాత్రకు ఆమెను తీసుకున్నారని సమాచారం. ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్లో నదియా సెకండ్ ఇన్నింగ్స్ వైభవంగా మొదలయ్యాయి. టబు పాత్రను కూడా త్రివిక్రమ్ ఆ రేంజ్లో డిజైన్ చేశారట. ఇప్పటికే అఖిల్ ‘హలో’ లో, నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ సినిమాలోనూ టబు కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఫైనల్లీ ఈ పొడుగుకాళ్ల సుందరి ఎన్ని సినిమాల్లో కనిపిస్తారో చూడాలి. ఆ సంగతలా ఉంచితే, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపిస్తారట. ఈ మధ్య దాదాపు అన్ని సినిమాల్లోనూ గడ్డంతో కనిపించిన చిన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో క్లీన్ షేవ్‌లో చాక్లెట్ బాయ్‌లా కనిపిస్తారని టాక్. -
సంక్రాంతి సందడిలో...
టాలీవుడ్, కోలీవుడ్... ఇలా భాష ఏదైనా సంక్రాంతికి సినిమాల సందడి జోరుగా ఉంటుంది. ఎన్ని సినిమాలు విడుదలైనా పండక్కి బోలెడన్ని టిక్కెట్లు తెగాల్సిందే... సినిమాలకు కలెక్షన్ల పంట పండాల్సిందే. వచ్చే సంక్రాంతి బరిలో ‘నేనుంటా’ అంటున్నారు సూర్య. విఘ్నేష్ శివన్ దర్శత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘థానా సేంద కూట్టమ్’. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారన్నది కోలీవుడ్ ఖబర్. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ‘సొడక్కు...’ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్లో థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలనుకుంటు న్నారటని కోలీవుడ్ టాక్. హిందీ హిట్ ‘స్పెషల్ ఛబ్బీస్’ స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. -
మీతో సెట్ కాదులే సామి!
ఏంటి సామి... పబ్లిగ్గా త్రిష అంత మాట అనేశారు? మీతో సెట్ కాదంటూ వాళ్లకు ఎంత స్ట్రయిట్‌గా చెప్పేశారో? చెన్నై కోడంబాక్కమ్‌లో ఎక్కడ చూసినా ఇప్పుడిదే గుసగుస! అసలేం జరిగింది? అంటే... త్రిషకు నచ్చలేదు. ‘సామి–2’ టీమ్ క్రియేటివిటీ త్రిషకు అస్సలు నచ్చలేదు. దాంతో ‘కష్టమండీ! మీతో నాకు సెట్ కాదులెండి. నేను ఈ సినిమాలో నటించలేను’ అని ‘సామి–2’ టీమ్‌తో చెప్పారట. అంతేనా... ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ‘సామి–2’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని ట్వీటారు. అదీ సంగతి! తెర వెనుక వినిపిస్తోన్న గుసగుస ఏంటంటే... విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’లో త్రిషే హీరోయిన్. ఇప్పుడా సిన్మాకి సీక్వెల్‌గా ‘సామి–2’ రూపొందుతోంది. ఈ సీక్వెల్లో త్రిషతో పాటు కీర్తీ సురేశ్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సామి–2’లో త్రిష కంటే కీర్తీ సురేశ్ రోల్ లెంగ్త్ ఎక్కువట! దాంతో త్రిషకు కోపం వచ్చి, సినిమా నుంచి తప్పుకున్నారట! ఆ సంగతి బయటకు చెప్పకుండా, ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ అని త్రిష అంటున్నారని చెన్నై ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’ అంటే ఇదేనేమో!! అన్నట్టు... ఈ సామెత పేరుతో వచ్చిన వెంకటేశ్ సినిమాలో హీరోయిన్ త్రిషాయే. -
చేయనంటే చేయను!
సినిమా అన్నాక.. గ్లామర్ సీన్ అన్నాక హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించక తప్పదు. ‘సీన్ డిమాండ్ చేస్తే తప్పదు కదండీ. అక్కడ లిప్ లాక్ చేయకపోతే సీన్ పండదు. ఆ సీన్లో బికినీలోనే కనిపించాలి. లేకపోతే తేలిపోతుంది. అందుకే చేశా’ అని కొందరు కథానాయికలు అంటుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ హోమ్లీ క్యారెక్టర్స్‌లో కనిపిస్తోన్న ‘నేను శైలజ’ ఫేమ్ కీర్తీ సురేశ్ కూడా భవిష్యత్తులో ఇలాంటి చిలక పలుకులు పలుకుతారన్నది చాలామంది ఊహ. కానీ, ‘నేను గ్లామర్ పాత్రలు చేయనంటే చేయను’ అని కుండబద్దలు కొట్టేశారీ మలయాళ బ్యూటీ. ‘‘నాకు గ్లామర్ పాత్రలు సరిపడవు. సంప్రదాయంగా ఉంటేనే ప్రేక్షకులు నన్ను ఇష్టపడతారు. అందుకే గ్లామర్ పాత్రలు తిరస్కరిస్తున్నా. ఇదే విషయం గురించి ఐదేళ్ల తర్వాత అడిగినా నా సమాధానం ఇదే. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నా’’ అంటున్నారు కీర్తి. ప్రస్తుతం పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ సినిమాలో ఓ నాయికగా, ‘మహానటి’లో టైటిల్ రోల్లో చేస్తున్నారామె. -
మాయాబజార్లో మిసెస్ నాగచైతన్య!
జస్ట్... తొమ్మిదంటే తొమ్మిది రోజుల క్రితమే సమంత రూత్ ప్రభు... అక్కినేని సమంతగా మారారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కి చెక్కేయకుండా నాగచైతన్య, సమంత తమ తమ సినిమాల షూటింగ్స్‌కి డేట్స్ ఇచ్చేశారు. సమంత అయితే నిన్న మొన్నటి వరకు ‘రాజుగారి గది 2’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. సోమవారం ‘మహానటి’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ప్రొఫెషన్ మీద అంత శ్రద్ధ కాబట్టే్ట, ఆమె టాప్ హీరోయిన్ అయ్యారు. ‘మహానటి’ సంగతికొస్తే... అలనాటి గొప్ప నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగఅశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాటి క్లాసిక్ ‘మాయాబజార్’లో సావిత్రి చేసిన శశిరేఖ పాత్రకు సంబంధించిన సీన్స్‌ని తీస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. సమంత జర్నలిస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఉదయాన్నే ‘మహానటి’ షూట్లో జాయిన్ అయ్యేందుకు స్టార్ట్ అయ్యాను. నెర్వస్‌గా, ఎగై్జట్‌మెంట్‌గా ఉంది. న్యూ బిగినింగ్’’ అని సమంత పేర్కొన్నారు. కథానాయిక అయ్యి దాదాపు ఏడేళ్లయింది. ఇప్పుడు న్యూ బిగినింగ్ ఏంటీ అనుకుంటున్నారా? అప్పుడు ‘కుమారి సమంత’గా సెట్స్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ‘మిసెస్ నాగచైతన్య’గా వెళుతున్నారు కదా. అందుకే అలా అన్నారు. -
మళ్లీ నటించేందుకు..
తమిళసినిమా: చెన్నై చిన్నది బ్యాక్ టూ యాక్ట్‌కు రెడీ అయిపోయారు. కోలీవుడ్‌లోనే కాదు దక్షిణాదిలోనే లక్కీయస్ట్ నటి అంటే సమంతనే అనాలి. ఏలాంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండా ప్రేమించిన ప్రియుడు, అదీ ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన యువ నటుడిని ఇరుకుటుంబ పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసిన వేదికపై పెళ్లి చేసుకున్న నటి సమంత. గత ఆరో తేదీన పెళ్లి వేడుకలో అమాంతం మునిగి తేలిన సమంత ముందుగానే ఒక విషయాన్ని వెల్లడించారు. పెళ్లైన మూడో రోజునే షూటింగ్లో పాల్గొంటానన్నదే ఆ ప్రకటన. అన్న మాట నిలబెట్టుకుంటూ పెళ్లి అయిన రెండు రోజులకే సమంత తన మామ నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది–2 చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక వారం కూడా గడవ కుండానే బ్యాక్ టూ యాక్ట్ అంటూ తాను నటిస్తున్న మహానది షూటింగ్లో శనివారం పాల్గొన్నట్లు సినీ వర్గాల సమాచారం. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత విలేకరిగా ఒక కీలకపాత్రను పోషిస్తున్నారని తెలిసింది. తదుపరి సమంత తమిళంలో అంగీకరించిన చిత్రాల షూటింగ్లో వరుసగా పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఇరుంబుతిరై, సూపర్ డీలక్స్, శివకార్తికేయన్‌తో ఒక చిత్రం అంటూ మూడు చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. విజయ్‌తో నటించిన మెర్శల్ చిత్రం దీపావళి పండగ సందర్భంగా తెరపైకి రానుంది. -
సూర్య చిత్ర షూటింగ్‌కు అడ్డంకులు
తమిళసినిమా: నటుడు సూర్య, కీర్తీసురేశ్ జంటగా నటిస్తున్న తానాసేర్న్‌ద కూటం చిత్రానికి బ్రాహ్మణుల ఎఫెక్ట్ తగిలింది. నటుడు సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించి కథానాయకుడిగా నటిస్తున్న తానాసేర్న్‌ద కూటం చిత్రానికి విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ బుధవారం ఉదయం తంజావూరు, తిరువైయ్యారు సమీపంలోని కావేరినది తీరంలో అనుమతి పొంది చిత్రీకరణను నిర్వహించారు. సూర్యతో పాటు 200 మంది డాన్సర్లు పాల్గొనగా పాటను చిత్రీకరించారు. ఆ ప్రాంతంలో పెద్దలకు కర్మకాండలు వంటి పుణ్య కార్యాలు చేయడానికి జనం పోటెత్తారు.అయితే పురోహితులు ఆ కార్యాలను నిర్వహించడానికి తానాసేర్న్‌ద కూటం చిత్ర షూటింగ్ ఆటంకంగా మారింది. ఉదయం ఆరు గంటలకే ఆ ప్రాంతానికి చేరుకున్న చిత్ర యూనిట్ ఆ ప్రాంతంలో ఇతరులెవరూ రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడి పుణ్యకార్యాలను ఆచరించడానికి వచ్చిన పురోహితులు చిత్ర వర్గాలు అడ్డగించడాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సంఘటన తెలిసిన దక్షిణ భారత బ్రాహ్మణ సంఘం, తిరువైయ్యారు శాఖ అధ్యక్షుడు శ్రీనివాసన్,మాజీ అధ్యక్షుడు అండి, కార్యదర్శిశీను తిరువైయ్యారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ వృత్తికి, ప్రజల పుణ్యకార్యాలకు ఆటంకం కలిగించే విధంగా చిత్ర షూటింగ్‌ను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. తమని నది నుంచి వారు ఎలా బయటకు పంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిధులకు అనుమతి ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో సీఐ శివరాజ్, ఎస్ఐ సురేశ్ వెంటనే నదీ ప్రాంతానికి వెళ్లి చిత్ర యూనిట్ వర్గాలతో చర్చించి షూటింగ్‌ను మధ్యాహ్నం 12 గంటల తరువాతనే నిర్వహించాలని చెప్పడంతో చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ రద్దు చేసుకోవలసి వచ్చింది. -
మళ్లీ శింబుతోనా?
సంచలన నటుడు శింబు పేరెత్తితే నే నటి హన్సిక బెంబేలెత్తిపోతున్నారనిపిస్తోంది. ఆయనతో రెండు చిత్రాల్లో నటించిన ఈ ఉత్తరాది భామ ఆ చిత్రాల షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య లవ్ మొదలైంది.అది ఎంతవరకు వెళ్లిందంటే పేళ్లి అంచుల వరకు. అయితే ఆ పెళ్లి కథ మాత్రం పలు ప్రకంపనల తరువాత కంచికే చేరింది. మొత్తం మీద శింబు హన్సిక నటించిన వాలు చిత్రం అతి కష్టం మీద పూర్తి అయ్యి తెరపైకి వచ్చింది. మరో చిత్రం వేట్టై మన్నన్‌కు ఇంకా మోక్షం కలగలేదు. శింబు తాజాగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. కాగా అందులో ఒక పాత్రలో 1980 పాత పాత్రలో నటించడం విశేషం.కాగా ఈ పాత్రకు జంటగా నటి శ్రీయ నటిస్తున్నారు. మెయిన్ నాయకి పాత్రలో హన్సిక నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఆమె చెవిన పడింది. అంతే అయ్యయ్యో అంటూ బెంబేలెత్తిపోయింది. శింబు సరసన మళ్లీనా? అంటూ అదంతా అసత్య ప్రసారం అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే శింబు మొదటి మాజీ ప్రియురాలు నయనతార ఇటీవల ఇదునమ్మఆళు చిత్రంలో ఆయనతో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా తాజా చిత్రం అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరో మాజీ ప్రియురాలు హన్సికను నటింపచేయాలని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. ఇదే విషయం కాస్త అటూ ఇటుగా ప్రచారం అవడంతో హన్సిక కంగారు పడిపోయారట. ఇప్పుడీ చిత్రంలో నటి కీర్తీసురేశ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. -
ఆమే నా రోల్‌మోడల్
నయనతార తనకు రోల్‌మోడల్ అంటున్నారు. యువ నటి కీర్తీసురేశ్. నీ నవ్వే చాలు పూబంతీ అన్న పాటను ఈ బ్యూటీకి సరైన వర్ణన అనొచ్చు. ఇటీవల ఒక కార్యక్రమంలో సీనియర్ దర్శకుడొకరు కీర్తీ నటించనక్కర్లేదు. తన నవ్వు కోసమే అభిమానులు సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు అని అన్నారు. అంత వశీకరణ నవ్వు ఆమెది. ఇప్పటికీ తన చిత్రాలు తెరపైకి వచ్చింది రెండే అయినా 10,15 సక్సెస్ఫుల్ చిత్రాలంత ప్రాచుర్యాన్ని పొందారు. ఒక్క రజనీమురుగన్ కీర్తీసురేశ్‌ను చాలా ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టిందని చెప్పకతప్పదు. తన బాబీసింహాతో నటించిన పాంబుసండై, ధనుష్ సరసన నటించిన తొడరి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో రెమో, విజయ్‌కు జంటగా ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. విజయ్ 60వ చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకున్న కీర్తి ఆయన సహృదయుడు, సెట్లో ఉంటే చాలా సరదాగా ఉంటారు అంటూ పొగడ్తల పురాణం మొదలెడుతున్నారు. తన అభిమాన హీరో విజయ్ అని అన్న కీ ర్తి నటిగా తనకు స్ఫూర్తి మాత్రం నయనతార అని అన్నారు. ఆమెలో మీకు అంతగా నచ్చిన అంశం ఏమిటన్న ప్రశ్నకు నయనతారకు హిందీలో ఎన్నో అవకాశాలు వచ్చినా అటు వైపు కన్నెత్తి చూడకుండా ఇక్కడే నటిస్తున్నారన్నారు. ఉన్నది వదిలి లేనిదాని కోసం పరుగెత్తాలని ఆశ పడకూడదన్న ఆమె ఫార్ములా తనకు బాగా నచ్చిందని, తాను అదే ఫార్ములాను అనుసరిస్తున్నానని కీర్తీసురేశ్ పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది ప్రేమ విషయంలో నయనను స్ఫూర్తిగా తీసుకోకుంటే బెటర్.