
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటి కీర్తిసురేశ్ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు కీర్తి సురేశ్ కు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల కీర్తి మీడియాతో మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహానటి సినిమా విజయవంతం కావడంతో స్వామివారి దర్శించుకున్నట్టు కీర్తి చెప్పారు.
అదే విధంగా స్వామివారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామితో పాటు పెషావర్ పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామిజీ, ఉడిపి పీఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామిజీలు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పెషావర్ పీఠాధిపతి స్వామికి బంగారు పాదాలు విరాళంగా అందజేశారు.
కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 20 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment