Venkateswara Swamy
-
గరుడ వాహనంపై గోవిందుడు
తిరుమల: విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు గరుడునిపై మంగళవారం అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 6:30 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ లక్షలాది మంది భక్తుల సమక్షంలో అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనంపై దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని మలయప్ప అనుగ్రహించారు. ఈ సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్ పురాతన బ్రాస్లెట్ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను మలయప్పకు అలంకరించారు. భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది.గరుడ వాహనం ముందు భక్త బృందాల భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు విశేషంగా అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజు ఉదయం మంగళవారం శ్రీవారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. తిరుమలలో బుధవారం శ్రీవారి స్వర్ణ రథోత్సవం (రథరంగ డోలోత్సవం) జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణ రథంపై స్వామివారు ఊరేగనున్నారు. కిక్కిరిసిన తిరుమలగిరులు గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ వాహన సేవలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడవాహన సేవ కోసం నిరీక్షించారు. 2 లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం 1 గంటకే నిండిపోయాయి. -
28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న తిరుమలకు వెళ్లనున్నారు. 27వ తేదీ శుక్రవారం రాత్రికి ఆయన తిరుమల చేరుకుని.. మరుసటి రోజు (శనివారం) ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.మరోవైపు, తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ‘‘రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని.. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్సార్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మహా ప్రసాదం లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చి.. టీటీడీ ఔన్నత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై పుట్టెడు అబద్ధాలు -
ఘనంగా శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం
తిరుమల: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 5 వరకు ఈ సదస్సు జరుగనుంది. తొలి రోజు సదస్సులో 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయగా..ఈవో ఏవీ ధర్మారెడ్డి కార్యక్రమ సందర్భ పరిచయం చేశారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాలపై ఎస్వీబీసీ రూపొందించిన 40 నిమిషాల ఆడియో విజువల్‌ను ప్రదర్శించారు. తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి, విద్యాశ్రీషతీర్థ (బెంగళూరు), సిద్ధేశ్వరానంద భారతి (కుర్తాళం), మాతృశ్రీ రమ్యానంద (తిరుపతి), సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి (విజయవాడ), రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం), స్వస్వరూపానందగిరి స్వామి (శ్రీనివాసమంగాపురం), పరిపూర్ణానందగిరి స్వామి(ఏర్పేడు), విద్యాప్రసన్న తీర్థ (కర్ణాటక), విరజానంద స్వామి (కడప), విశ్వయోగి విశ్వంజి (గుంటూరు), సచ్చిదానంద సరస్వతి (తుని), హరితీర్థ స్వామీజీ (నెల్లూరు), ప్రకాశానంద సరస్వతి (విజయవాడ), మాతా శివానంద సరస్వతి, మాతా సుశ్రుశానంద (తేనెపల్లి), శివ దర్శనం మాతాజీ (ప్రొద్దుటూరు), స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి (ఉత్తరకాశీ), సత్యానంద భారతి (విజయవాడ), శ్రీ శివ స్వామి (గుంటూరు), దేవనాథ రామానుజ జీయర్ స్వామి (హైదరాబాద్), విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అనుగ్రహణ భాషణం చేశారు. మరింత గొప్పగా ధర్మ ప్రచారం: భూమన మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు భూమన తెలిపారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామన్నారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని చెప్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తోన్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందన్నారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
KCR: కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
చక్రస్నానంతో సేద తీరిన శ్రీనివాసుడు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవంతో స్వామివారు వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాల్లో ఊరేగి అలసిసొలసిన శ్రీవారు స్నపన తిరుమంజనం సేవలో సేద తీరారు. జీయర్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సాగింది. అనంతరం మంగళవాయిద్యాల నడుమ, వేదపండితుల వేదఘోష, అశేషభక్త జన గోవింద నామస్మరణల మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశయైన సుదర్శన చక్రత్తాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. భక్తులు సైతం ఈ పుష్కరిణిలో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. కాగా, తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆగమ శాస్త్రం ప్రకారం గరుడపతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాలు ముగించారు. -
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’(మత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(మూకుళ్లు)–శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు.సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. రాత్రి తొమ్మిది నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సర్వం సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం మూడు వేల మంది, గరుడసేవ కోసం మరో 700 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమల సీవీఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి శనివారం డీఎఫ్‌వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగ నాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 18వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవుతో తాడు ఉంటుంది. -
కమనీయంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు
-
శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక నిజాలు..!
-
విశాఖ వేదికగా మిలన్–2024
సాక్షి, అమరావతి: తూర్పు నావికాదళం విశాఖపట్నం వేదికగా వచ్చే ఫిబ్రవరిలో మిలన్–2024 నిర్వహించనుంది. తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. మిలన్–2024 నిర్వహణ వివరాలను సీఎంకు తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించే మిలన్–2024కు 57 దేశాల ప్రముఖులు, నౌకాదళాలు పాల్గొనే అవకాశముందని చెప్పారు. సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగవిుంచేందుకు తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ పెందార్కర్‌ను సీఎం జగన్ సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేయగా.. రాజేశ్ ముఖ్యమంత్రికి ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను బహూకరించారు. సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిశోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని తూర్పు నావికాదళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో శోభాయమానంగా శ్రీవారి వైభవోత్సవాలు (ఫొటోలు)
-
Hyderabad: ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకగా వెంకన్న వైభవోత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు.. తరలివచ్చిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఎన్టిఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్టిఆర్ స్టేడియం ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేని వారికోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నగరానికి తరలిరావడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు ముప్పవరపు హర్షవర్ధన్, బి.సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలివీ.. ఎన్టీఆర్ స్టేడియంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే రోజు వారి పూజా కార్యక్రమాలు 11న ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కొలుపు, అర్చన, 7.30 నుంచి 8.15 వరకు నివేదన, 8.15 నుంచి 8.30 వరకు పాద పద్మారాదన, ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రెండో నివేదన, 9.30 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, వీధి ఉత్సవం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5.30 గంటల నుచి 6.30 వరకు, వీధి ఉత్సవం సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు, రాత్రి కైంకర్యం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు, ఏకాంత సేవ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. 15న... 15వ తేదీన ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కోలుపు, అర్చన 7.30 నుంచి 8.15, నివేదన 8.15 నుంచి 8.30 వరకు, పాదపద్మారాధన, ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, పుష్పయాగం, రెండవ నివేదన 10.30 నుంచి 11 గంటల వరకు, సర్వదర్శనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, సహస్రదీపాలంకరణ సేవ, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6.30నుంచి 8.30 వరకు తోమాల సేవ అర్చన, నివేధన రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మలేసియాలో వైభవంగా శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం
సాక్షి హైదరాబాద్: మలేసియా లోని బాగాన్ డత్తోలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 23నుంచి 25వ తేదీ వరకు కన్నుల పండువగా సంప్రోక్షణ, స్వామి వారి కళ్యాణ ఉత్సవం జరిగాయి. మలేసియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 5000 మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే దత్తో ఖైరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలేసియా తెలుగు సంఘం గౌరవ సలహాదారు దత్తో డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు, అధ్యక్షులు డాక్టర్ వెంకట ప్రతాప్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సత్యసుధాకర్, వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
వెంకటేశ్వరస్వామి వేష ధారణలో తిరుపతి ఎంపి గురుమూర్తి
-
వెంకన్న వేషధారణలో ఎంపీ గురుమూర్తి
సాక్షి, తిరుపతి (కల్చరల్): తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర మహోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన గంగమ్మ తల్లి ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్రలో తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి గంగమ్మకు సోదరుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి వేషం ధరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ (ఫోటోలు)
-
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి
సాక్షి, తిరుమల: రామతీర్థంలో ప్రతిష్టించే విగ్రహాలు తిరుపతి నుంచి శుక్రవారం రోజు రామతీర్థానికి తరలించామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆలయాన్ని పునఃనిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు. మంత్రి దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనతంరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ... నూతన విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ట చేసి, రామ తీర్థం ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు. పూర్వవైభవం వచ్చేలా ఆలయ నిర్మాణం సంవత్సరాల కాలంలో పూర్తి చేసి, విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా మంత్రి వెల్లంపిల్లి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిశారు. బెజవాడ దుర్గమ్మ ప్రతిమ, ప్రసాదాన్ని స్వామివారికి అందజేసి, మంత్రి వెల్లంపల్లి ఆశీర్వాదాలను తీసుకున్నారు. -
శ్రీవారి పున్నమి గరుడ వాహన సేవ
-
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
-
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
వాషింగ్టన్: నగరంలో కనుల పండుగగా శ్రీనివాస కళ్యాణ వేడుకలు ‘తారా’ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ అరౌండ్) జనరల్ సెక్రటరీ 'సంతోష్ కుమార్ బచ్చు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ... శ్రీ వేంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల విగ్రహాలకు తిరుపతిలో కళ్యాణం జరిగేంత ఘనంగా వేద పండితులు, అర్చకుల చేత కళ్యాణ వేడుకలు జరిపించినట్లు పేర్కొన్నారు. నాదస్వర వాయిద్యాల మధ్య కోలాటం ఆడుతూ... స్వామి వారిని పల్లకిలో స్వాగతిస్తూ.. సుప్రభాత సేవతో స్వామివారిని, అమ్మవార్లను ఊరేగించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తి విన్యాసాలతో, గోవింద నామాలతో , విష్ణు సహస్ర , అన్నమాచార్య కీర్తనలతో భక్త బృందం పాల్గొని తన్మయత్వంలో మునిగితేలారు. అలాగే ఉదయం ఏర్పాటు చేసిన ఫలహారాన్ని, కళ్యాణం తర్వాత పంచిన మహాప్రసాదాన్ని భక్తులు ఆస్వాదించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు, వడ ప్రసాదం విరివిరిగా పంచామని, చివరగా పల్లకి సేవతో స్వామివారికి, అమ్మవార్లకి భక్తులంతా వీడ్కోలు పలికినట్లు ఆయన వివరించారు. స్వామివారి కళ్యాణం తర్వాత తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూ ఉచితంగా పంచడంతో భక్తులంతా హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. అనంతరం స్వామివారి కళ్యాణానికి హజరై విజయవంతం చేసిన భక్తులందరికి తారా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుమలేశుడు గరుడ సేవా
-
పెరుమాళ్లు తిరునాళ్లు
నిత్య కళ్యాణ చక్రవర్తిగా అలరారుతూ... అఖండ భక్తజనానికి ఆయువై నిలిచిన శ్రీవేంకటేశ్వరుడి రూపం చూసిన వారికి తనివి తీరదు. చూడాలనే కోరిక చావదు. నేడు నిత్యం లక్ష మందికిపైగా దర్శన భాగ్యం పొందుతున్న పవిత్ర సాలగ్రామ శిలా దివ్యమూర్తి.. దివ్యమంగళ విగ్రహాన్ని ఆ పాద మస్తకం భక్తులకు తెలియజెప్పే ప్రయత్నమే ఈ కథనం. బంగారుపద్మ పీఠంపై శ్రీవారి కనకపు పాదాలు... గజ్జలు, అందెలు, ఆపై ఘనమైన పట్టుపీతాంబరం... ఆ పీతాంబరం కుచ్చులపై జీరాడుతూ... వేలాడుతున్న సహస్ర నామాల మాలలు. బొడ్డుదగ్గర సూర్య కటాది అనబడే నందక ఖడ్గం, నడుమున బిగించి ఉన్న వడ్డాణం, బంగారు మొలతాడు, వజ్ర ఖచిత వరదహస్తం, తన పాదాలే పరమార్థమని చూపిస్తున్న వైకుంఠహస్తం. ఎడమవైపున ఉన్న కటిహస్తం, కౌస్తుభమణి నవరత్న హారాలు, వక్షస్థలంపై వ్యూహ లక్ష్మి, శ్రీదేవి భూదేవి పతకాల హారాలు, కంఠమాలలు, బంగారు యజ్ఞోపవీతం. చేతులకు నాగాభరణాలు, భుజకీర్తులు. భుజాల నుంచి పాదాల వరకు వ్రేలాడుతున్న సాలగ్రామ మాలలు. భక్తులకు అభయమొసగే శంఖు చక్రాలు. చరగని తరగని చిరుమందహాసంతో నల్లనిమోము కలిగి నిగనిగలాడే చెక్కిళ్లు కలిగి, దొండపండు వంటి పెదవులు... ఆ పెదవుల కింద చుబుకంపైన చక్కనైన తెల్లని కర్పూరపుచుక్క. సొగసైన నాసిక, నొసటన తెల్లని నామం, భక్తులను కరుణిస్తూ ఉన్న అరవిరిసిన చూపులు. శిరసుపై నవరత్నాల మకుటరాజం. ఆపైన బంగారు మకర తోరణం... ఇలా ఆ మూలమూర్తి నిలువెత్తుగా అలంకరింప బడ్డ సుగంధ మనోహర సుమమాలలతో నిగమ.. నిగమాంత వేద్యుడైన ఆ స్వామి వారిని దర్శించిన వారు రెప్పపాటు కాలమైనా...రెప్పవాల్చకుండా శ్రీవారిని తనివితీరా దర్శించి ఆనందపుటంచులను తాకుతున్నారు. తిరుమల కొండపై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అన్ని ఉత్సవాల కంటే విలక్షణమైనవి.. విశిష్టమైనవి... వైభవోపేతమైనవి. లోక క్షేమార్థం.. నిత్యపూజాహీన ప్రాయశ్చిత్తార్థం, నిత్యపూజాదోష ప్రాయశ్చిత్తార్థం, సర్వ అశుభ నివారణార్థం శ్రీవారి బ్రహ్మోత్సవాలు చేస్తారు. భగవంతుని మూలబింబంలో (ధ్రువబేరం) ఉండే శక్తి అభివృద్ధికి కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందుకే ఈ ఉత్సవాలను మహోత్సవాలని, తిరునాళ్లు అని, కల్యాణోత్సవాలు అని కూడా అంటారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో అశ్వయుజ శుద్ధపాడ్యమి మొదలు అశ్వయుజ శుద్ధదశమి వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా... జగజ్జేయమానంగా ఉత్సవాలు జరుపుతారు. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ దగ్గరుండి నిర్వహించటం వల్లే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరు. కలౌ వేంకటనాయకః సహజసుందర క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం దివ్యమైనది... సుందరమైంది... భవ్యమైంది... నిత్య నూతనమైంది. బ్రహ్మాండమంతా వెదికినా ఈ పుణ్యక్షేత్రంతో ఏ క్షేత్రమూ సాటి రాదని ప్రతీతి. తిరుమల క్షేత్రం ఎన్నో పేర్లతో... అనేక శిఖరాలు... వివిధ లోయలు.. తీర్థాలతో భూలోక వైకుంఠంగా వన్నెకెక్కింది. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఈ తిరుమల దివ్యక్షేత్రంలో విలసిల్లే దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి. ఈ స్వామి సకల దేవతాస్వరూపం. అందుకే ఈయన ‘కలౌ వేంకటనాయకః’ అని కీర్తింప బడ్డాడు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి. ఈ స్వామిని దర్శించటానికి దేశ నలుమూలల నుండే కాకుండా... ప్రపంచపు నలుమూలల నుండి, విశ్వాంతర్భాగాల నుండి రుషులు, దేవతలు, దిక్పాలురు వేంచేసి కనులపండువగా... తన్మయత్వంతో, అనన్యభక్తితో ప్రతినిత్యం స్వామిని దర్శిస్తుంటారు. బ్రహ్మాదిదేవతలంతా కూడా స్వర్గం నుండి శ్రీవేంకటాద్రికి వచ్చి నిత్యోత్సవాలను, బ్రహ్మోత్సవాలను భక్తి పూర్వకంగా తిలకిస్తారని ప్రతీతి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరుని వైభవం ఇంతా అంత కాదు. అమితవైభవం గా జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని తరిస్తారు. జన్మధన్యమైందని భావిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలకు చేరుకున్నవారు, స్వామి వారిని దర్శించుకున్న వారు∙ధన్యాత్ములు, పుణ్యాత్ములు. రాలేని వారు, చూడలేనివారు కనీసం మనోనేత్రాలతో వీక్షించినా ఫలదాయకమేనని శాస్త్రోక్తి.ఎంతటి అధికారి అయినా... దేశానికి రాజైనా... శ్రీవారి పడికావలి ముందు వరకు మాత్రమే అనుమతి. పడికావలి దాటాక శ్రీవేంకటేశ్వర స్వామి వారి మూలమూర్తి సువర్ణ పద్మపీఠంపై స్వయంవ్యక్త సాలగ్రామ శిలారూపంలో కొలువై ఉంటాడు. – తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి – ఫొటోలు: మోహనకృష్ణ కేతారి -
నీదా ఈ కొండ!
తిరుమల మాడవీథుల్లో వెడుతుంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమలనంబి దేవాలయం ఉంటుంది. ఎవరీ తిరుమలనంబి? ఈయనకు దేవాలయం ఏమిటి? పూర్వం శ్రీరంగంలో యమునాచార్యులవారు శిష్యులందర్నీ కూర్చోబెట్టుకుని ‘బ్రాహ్మీ ముహూర్తంలో వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి కావలసిన జలాలను తీసుకు రావడానికి వేంకటాచలం మీద ఎవరయినా ఉండగలరా?’ అని అడిగితే తిరుమలనంబి దానికి సిద్ధపడ్డాడు. ఆయనను శ్రీశైలపూర్వులు అని కూడా అంటారు. ఆయన రోజూ పాపనాశనానికి వెళ్ళి నీళ్ళు కుండతో తలమీద పెట్టుకుని మోసుకుంటూ గోవింద నామ స్మరణ చేస్తూ అభిషేకానికి తీసుకువస్తుండేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. వేంకటేశ్వరస్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి ‘తాతా, తాతా! దాహం వేస్తోంది. నీళ్ళు పొయ్యవా? అని అడుగుతాడు. ‘ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకువెడుతున్నా...తప్పుకో’’ అంటూ ముందుకు సాగిపోతుంటే... బాలకిరాతుడు వెనకనుంచి బాణం వేసి కుండకు చిల్లు కొట్టి నీళ్ళు తాగుతాడు. కుండ బరువు తగ్గడం గమనించిన తిరుమలనంబి వెనక్కి తిరిగి చూసేసరికి కుండనుంచి ధారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసిపట్టి తాగుతున్నాడు. ‘‘ఎంత దుర్మార్గపు పని చేసావురా, తాగొద్దంటే అవి తాగావా?...’’అని నిందించబోతుంటే... వెంటనే ఆ బాలుడు ‘‘తాతా! బెంగపడొద్దు. నీళ్ళకు పాపనాశనందాకా వెళ్ళడమెందుకు? ఇక్కడే ఉంది, ధార నీకు చూపిస్తాను, రా...అంటూ ఆ కొండలలోకి బాణం వేసి కొట్టాడు. ఆకాశగంగ అలా వచ్చింది. ఆలయంలో స్వామి అర్చకులమీద ఆవహించి ‘‘అభిషేకానికి ఈవేళ నుంచి పాపనాశనం నీళ్ళు అక్కరలేదు. ఆకాశగంగ నీళ్ళతో చెయ్యండి.’’ అని పురమాయించారు. ఇప్పుడు తిరుమలనంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పర్ణశాల ఉండేది. అక్కడ అనుష్ఠానం చేసుకుని స్వామివారి అభిషేకానికి పాపానాశనం నుంచి రోజూ తెల్లవారుఝూమునే చాలా సంవత్సరాలపాటు నీళ్ళు మోసుకొచ్చారు. అలా ఆయన్ని ఆప్యాయంగా తాతా! అని పిలుస్తూ ఆయన్ని తరింపచేసావా, ఎంత సులభసాధ్యుడవయ్యా తండ్రీ అని చెప్పడానికి....‘‘అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారు వారికి/ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు/మచ్చిక దొలక తిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చమాటలాడి నోచినవాడు/’’ అనీ అన్నమాచార్యులవారు కీర్తన చేసారు. మరి ఈ అనంతాచార్యులవారెవరు? ఈయన కొండమీద స్వామివారికి పూలుగుచ్చి దండలు సిద్ధం చేసేవారు. ఈయన ఒకరోజున తనపనిలో నిమగ్నమై ఉండగా రమ్మనమని స్వామివారు కబురు పంపారట. దానికి ఆచార్యులవారు ‘‘ఆయనకు వేరేపని ఏముంది కనుక, హాయిగా పీఠమెక్కి కూచుంటాడు. కబుర్లకోసం నాకు రావడం కుదరదు’ అని చెప్పిపంపి సాయంత్రం ఆ దండలన్నింటినీ గౌరవంగా ఒక బుట్టలో పెట్టుకుని వెళ్ళాడు. ‘‘నేను రమ్మంటే రానప్పుడు, నీ పూలదండలు నాకెందుకు, అక్కరలేదు ఫో!’’ అని స్వామివారు కసురు కున్నారట. దానికి అనంతాచార్యులవారు ‘నీవెవరు నన్నుపొమ్మనడానికి. నీదా ఈ కొండ? వరాహ స్వామిదగ్గర నీవు ఎలా పుచ్చుకుని వచ్చావో, అలా మా గురువుగారు వెళ్ళమంటే నేను వచ్చా. గురువుగారు దండలిమ్మన్నారు. వచ్చి ఇస్తుంటా. పుచ్చుకుంటే పుచ్చుకో. లేదంటే ఊరుకో. ఇక్కడ ఈ తలుపు కొయ్యకు తగిలించి పోతున్నా. నీ ఇష్టం. నేను మాత్రం నా పని వదిలి కబుర్లకు రాను’’ అని చెప్పి వెళ్ళిపోతుంటే స్వామివారే వెంటపడి ఆయనను బుజ్జగించి వెనక్కి తీసుకొచ్చారట. అంత పిచ్చి భక్తి చూపిన అనంతాళ్వారు వారికి వెట్టిచేసావా స్వామీ’’ అని అన్నమయ్య అంటున్నారు. -
తిరుమలలో నాలుగో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
విశేష ఉత్సవాలు
♦ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఉత్సవాలు నిర్వహించాడట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఒక నూత్న వస్త్రం మీద గరుడుని పటాన్ని చిత్రిస్తారు. దీన్ని ధ్వజస్తంభం మీద కొడితాడుతో కట్టి, పైకి ఎగుర వేస్తారు. ఇలా ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, భూతప్రేత యక్ష గÆ ధర్వ గణాలకు ఆహ్వాన పత్రం. ♦ నిత్యం ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు ∙స్వామి వారికి ఒకరోజు జరిగే అన్ని సేవలలో పాల్గొనే అవకాశం ఉదయాస్తమాన సేవకు ఉంది. ఈ సేవకు టికెట్ ధర అక్షరాలా పది లక్షల రూపాయలు. ♦ శ్రీవారికి ఏటా దాదాపు 800 కిలోల బంగారు కానుకల రూపంలో వస్తోంది. ♦ శ్రీవారికిచ్చే హారతి కోసం ఆలయంలో రోజుకు ఆరుకిలోల హారతి కర్పూరం వినియోగిస్తారు. ♦ తిరుమల కొండకు చేరుకునే నడకమార్గంలో మొత్తం 3500 మెట్లు ఉంటాయి. ♦ ప్రతి మంగళవారం శ్రీవారికి జరిపించే అష్టదళ పాద పద్మారాధన సేవలో భాగంగా 108 బంగారు పుష్పాలతో పూజిస్తారు. ఆ బంగారు పూలను చేయించ స్వామి వారికి బహుకరించింది గుంటూరుకు చెందిన షేక్ హుస్సేన్ అనే మహమ్మదీయుడు ♦ తిరుమలకొండపై కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని అఖిలాండం అంటారు. ♦ బ్రహ్మోత్సవాలకు పూర్వం తిరుక్కొడి తిరునాల్ అనే పేరుండేది. ధ్వజారోహణ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఇలా అనేవారు.