♦ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఉత్సవాలు నిర్వహించాడట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఒక నూత్న వస్త్రం మీద గరుడుని పటాన్ని చిత్రిస్తారు. దీన్ని ధ్వజస్తంభం మీద కొడితాడుతో కట్టి, పైకి ఎగుర వేస్తారు. ఇలా ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, భూతప్రేత యక్ష గÆ ధర్వ గణాలకు ఆహ్వాన పత్రం.
♦ నిత్యం ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు ∙స్వామి వారికి ఒకరోజు జరిగే అన్ని సేవలలో పాల్గొనే అవకాశం ఉదయాస్తమాన సేవకు ఉంది. ఈ సేవకు టికెట్ ధర అక్షరాలా పది లక్షల రూపాయలు.
♦ శ్రీవారికి ఏటా దాదాపు 800 కిలోల బంగారు కానుకల రూపంలో వస్తోంది.
♦ శ్రీవారికిచ్చే హారతి కోసం ఆలయంలో రోజుకు ఆరుకిలోల హారతి కర్పూరం వినియోగిస్తారు.
♦ తిరుమల కొండకు చేరుకునే నడకమార్గంలో మొత్తం 3500 మెట్లు ఉంటాయి.
♦ ప్రతి మంగళవారం శ్రీవారికి జరిపించే అష్టదళ పాద పద్మారాధన సేవలో భాగంగా 108 బంగారు పుష్పాలతో పూజిస్తారు. ఆ బంగారు పూలను చేయించ స్వామి వారికి బహుకరించింది గుంటూరుకు చెందిన షేక్ హుస్సేన్ అనే మహమ్మదీయుడు
♦ తిరుమలకొండపై కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని అఖిలాండం అంటారు.
♦ బ్రహ్మోత్సవాలకు పూర్వం తిరుక్కొడి తిరునాల్ అనే పేరుండేది. ధ్వజారోహణ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఇలా అనేవారు.
విశేష ఉత్సవాలు
Published Sun, Sep 9 2018 1:33 AM | Last Updated on Sun, Sep 9 2018 1:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment