
ముత్యాల తలంబ్రాలు. మంగళవాయిద్యాలు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు. విశేషాలంకరణాలు. గోవింద నామస్మరణలు. భక్తజన జయజయ ధ్వానాల మధ్య శ్రీదేవి– భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీలక్ష్మీ నారాయణస్వామి కల్యాణ వేడుక శుక్రవారం రమణీయంగా జరిగింది

మార్కెట్ రోడ్డు వేంటేశ్వరాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడి కల్యాణం ఆధ్యాంతం కన్నుల పండువగా సాగింది

మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు

అన్నమాచార్య సంకీర్తనలు, సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు అలరించాయి





















