
కరీంనగర్ : జిల్లాకేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి ఎదుర్కోలు వేడుకలు వైభవంగా జరిగాయి

సాయంత్రం ఆలయం నుంచి అశ్వవాహనంపై శ్రీవారు, గజవాహనంపై అమ్మవార్లు బయల్దేరి ప్రకాశంగంజ్‌లోని వరసిద్ది వినాయక ఆలయానికి చేరుకున్నారు

అక్కడ ఎదుర్కోలు కన్నులపండువగా సాగింది. ఉదయం వేంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై విహరించారు

నగర పద్మశాలి సంఘంవారు పద్మావతి అమ్మవారికి పుట్టింటి కానుకగా సారె సమర్పించారు






