venkateshwara swamy temple
-
లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవినేని అవినాష్ పూజలు
-
స్వర్ణగిరి : తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు)
-
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించిన మంత్రి రోజా
-
తిరుమల ఆలయం వద్ద భారీగా తరలివచ్చిన భక్తులు
-
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
-
స్వామివారి అలంకరణలో పువ్వులు ఎందుకు అంత ప్రత్యేకం అంటే..
-
Karimnagar: టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. కాగా, ఆలయ శంకుస్థాపన సందర్భంగా టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, శంఖువుకు, అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలతో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీవారి ఆలయం కరీంనగర్లో కొలువుదీరడం మా అదృష్టం. ఆలయానికి 10 ఎకరాల భూమి మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. మా విజ్ఞప్తిని మన్నించి టీటీడీ ఆలయం, 20కోట్లు మంజూరు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం మాకు దొరికిన అదృష్టం అని తెలిపారు. అనంతరం, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో మాదిరిగానే కరీంనగర్లోనూ సర్వకైంకకర్యాలు జరుగుతాయి. టీటీడీ తరఫున అర్చకులు, సిబ్బంది, ప్రసాదంతో పాలు తదితరాలు ఉంటాయి. కరీంనగర్, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వివేకా కేసు: ‘ఏబీఎన్, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి’ -
కరీంనగర్: వైభవంగా శ్రీవెంకటేశ్వర ఆలయ శంకుస్థాపన
-
జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలోని ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించిందని, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ - కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉందని, భక్తులు బాలాజీ ఆశీస్సులు కూడా అందుకోవచ్చని అన్నారు. ఈ ఆలయం నగరానికి దూరంగా ఉందని, ఇక్కడ 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జమ్మూ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. కాగా, ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆలయాల నిర్మిస్తున్నామని, ఇటీవల చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, అమరావతి, తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదేవిధంగా అహ్మదాబాద్, రాయపూర్‌లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవో వీరబ్రహ్మం, ఎస్పీ రాహుల్, సీవీఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్ నుంచి ఏపీకి 'అంతా క్షేమంగా'.. -
భార్య తో కలిసి శ్రీ వారిని దర్శించుకున్న నిఖిల్...
-
తిరుమల శ్రీవారి సన్నిధిలో మంత్రి రోజా
-
నిజామాబాద్ జిల్లా : శ్రీవారికి స్వర్ణకిరీటం సమర్పించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
-
ఇల్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షలు..
సాక్షి, సిద్దిపేట: సంక్రాంతి పండుగ తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలి పారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఆయన సిద్దిపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి కానుకగా సమర్పించారు. మంత్రి హరీశ్‌రావుతోపాటు భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ కిరీటాన్ని రూపొందించారు. అనంతరం ఆయన బస్తీ దవాఖానాను ప్రారంభించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్ మాట్లా డుతూ పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బస్తీ ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ఈ బస్తీ దవాఖానాను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
చంద్రగ్రహణం.. 12 గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 8:40 గంటలకు ఆలయ ద్వారాలను టీటీడీ మూసివేయనుంది. తిరిగి రాత్రి 7:20 గంటలకు మహాద్వారాలు తెరుచుకోనున్నాయి. సుమారు 12 గంటలపాటు తిరుమల ఆలయం మూసివేయనుంది. రాత్రి 8 గంటలకు శ్రీవారి దర్శనం పున:ప్రారంభం కానుంది. మరోవైపు.. టీటీడీ అధికారులు వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేస్తున్నారు. ఆలయం తిరిగి సాయంత్రం 6:30 గంటలకు తెరుచుకోనుంది. -
రుషికొండపై కొలువైన శ్రీనివాసుడు
కొమ్మాది (భీమిలి): సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖపట్నంలోని రుషికొండపై మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం బుధవారం వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం నుంచి సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో కలిసి శ్రీవారి ఆలయాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. స్వరూపానందేంద్రతో కలసి వైవీ సుబ్బారెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చేందుకు రెండేళ్ల క్రితం రూ. 26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది మార్చి 18న అంకురార్పణతో వైదిక కార్యక్రమాలు ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగాయన్నారు. అమరావతిలో కూడా శ్రీవారి ఆలయం పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కశ్మీర్లో 60 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో రానున్న రెండేళ్లలో వెయ్యి శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభించాల్సి ఉండగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా ఆయన రాలేకపోయారని, త్వరలో ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో ఆలయం నిర్మాణం శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రుషికొండలో టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలిపారు. వైఖానస ఆగమానుసారం శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్న దిగి వచ్చారన్నంత అద్భుతంగా ఉందన్నారు. వేదాలు, ఆగమాలు, దేవాలయాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆలయంలో స్వామి వారిని దర్శిస్తే సమస్త పాపాలు తొలగి కోరిన కోర్కెలు నెరవేరుతాయని వివరించారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రుషికొండలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంతో విశాఖ మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదాపీఠ ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్, మల్లాడి కృష్ణారావు, జేఈవోలు సదా భార్గవి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు, ఆగమ సలహాదారులు విష్ణు భట్టాచార్యులు పాల్గొన్నారు. -
‘త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తి’
సాక్షి, విశాఖపట్నం: టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయ పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా నిర్మించే వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని తెలిపారు. పది ఎకరాల స్థలంలో దేవాలయం నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. పరిపాలన రాజధాని కంటే ముందే ఆలయ నిర్మాణం చేయడం విశేషమన్నారు. గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి రూ. 17 కోట్లు మాత్రమే కేటాయించి, ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిదన్నారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి రూ. 28 కోట్లు కేటాయించిదని పేర్కొన్నారు. త్వరలో విశాఖ ఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు. -
ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్
సాక్షి, ఢిల్లీ : జమ్మూలో టీటీడీ నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం (శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు. త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని అక్కడి అధికారులకు సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలో ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణానికి పాలక మండలి సైతం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి బుధవారం జమ్మూకు వెళ్లి ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. వైవి సుబ్బారెడ్డితో పాటు జమ్మూ కలెక్టర్ సుష్మా చౌహాన్, అడిషనల్ డిప్యూటి కమిషనర్ శ్యాం సింగ్, కుమార్,అదనపు సీఈఓ వివేక్ వర్మ చైర్మన్ సహా పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు. (ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు) -
తెలంగాణ తిరుపతి ‘మన్యంకొండ’
సాక్షి, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతోంది. ఉలి ముట్టని స్వామి, చెక్కని పాదాలు, తవ్వని కోనేరు స్వామివారి దేవస్థానం ప్రత్యేకత. ఆర్థికస్తోమత లేని భక్తులు తిరుపతి వెళ్లకుండా మన్యంకొండ స్వామిని దర్శించుకుంటే అంతే పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. అంతటి విశిష్టత కలిగిన మన్యంకొండ పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఏటా స్వామివారి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఉమ్మడి జిల్లాలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. వివిధ డిపోల నుంచి మన్యంకొండ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉత్సవాలు తిరుపతి నుంచీ మన్యంకొండ స్టేజీ నుంచి దేవస్థానం వరకు ప్రత్యేక మినీ బస్సులను తెప్పించి నడుపుతారు. 3 కి.మీ. ఘాట్‌రోడ్డు మన్యంకొండ స్టేజీ నుంచి గుట్టపై వరకు సుమారు 3 కి.మీ. ఘాట్‌రోడ్డు ఉంది. ఎత్తయిన గుట్టపై స్వామి కొలువుదీరారు. చుట్టూ గుట్టలు, పచ్చని వాతావరణం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవస్థానానికి వచ్చే భక్తులు గుట్టపై నుంచి ఇరువైపులా నుంచి కిందికి చూస్తే చల్లని గాలి హాయిలో పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. దేవస్థానం ముందు కోనేరు ఉంది. అలాగే ఈ కోనేరుకు సమీపంలో ఉలి ముట్టని స్వామివారి పాదాలున్నాయి. ఈ పాదాలకు సమీపంలోని గుట్టపై గతంలో మునులు తపస్సు చేసిన గుహలున్నాయి. గతంలో ఇక్కడ మునులు తపస్సు చేసినందుకే ఈ ప్రాంతాన్ని మన్యంకొండగా వినతికెక్కినట్లు పురాణగాథ. అలాగే దిగువకొండ వద్ద అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. స్టేజీకి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఈ పుణ్యక్షేత్రం కొలువుదీరింది. దేవస్థానంలో ఏటా వందలాది వివాహాలు జరుగుతాయి. ఇలా వెళ్లాలి.. హైదరాబాద్ నుంచి కర్ణాటక, రాయచూర్, నారాయణపేట, ఆత్మకూర్, మక్తల్, యాద్గిర్‌కు బస్సులు మహబూబ్‌నగర్ మీదుగా మన్యకొండకు వెళ్తుంటాయి. మహబూబ్‌నగర్ నుంచి 19 కి.మీ. దూరంలో ఈ దేవస్థానం ఉంటుంది. అలాగే రాయచూర్ నుంచి రావాలంటే హైదరాబాద్‌కు వెళ్లే బస్సు ఎక్కి మన్యంకొండలో దిగవచ్చు. స్టేజీ నుంచి గుట్టపైకి ప్రత్యేక ఆటోల సౌకర్యం ఉంది. విశేష దినోత్సవాల్లో మినీ బస్సులు గుట్టపైకి వెళ్తుంటాయి. అలాగే రైలు మార్గం ద్వారా వెళ్లే ప్రయాణికులు ఇటు కర్నూల్, అటు హైదరాబాద్ నుంచి రావాలంటే మార్గమధ్యలోని కోటకదిర రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి మన్యంకొండ స్టేజీ వరకు ఆటోలు వెళ్తుంటాయి. -
తిరుమల: ఏపీ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి/తిరుమల: కలియుగ ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నైవేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్యాన్ని ఉదయం ఏడు గంటలకు మార్చింది. దీంతో అప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగే నైవేద్యం వరకూ స్వామివారిని 13 గంటలపాటు పస్తు ఉంచుతున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం వీవీఐపీ బ్రేక్ దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ముఖ్యంగా సోమవారం బాగా పెరిగిపోతోంది. దీంతో ఎల్–2, ఎల్–3 దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శ్రీవారి నైవేద్యం వేళలో కీలక మార్పులు చేస్తూ ఆదివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న నేవైద్యాన్ని ఉదయం ఏడు గంటలకే పూర్తిచేయాలని అర్చకులను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో తెలిపింది. ఈ నిర్ణయంపై హిందూ మత ప్రచారకులు మండిపడుతున్నారు. ఇది స్వామి వారికి మహా అపచారం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వామివారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది. దీనిని త్రికాల నివేదనగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాల అనంతరం ఉదయం ఐదున్నర గంటలకు స్వామి వారికి తొలివిడత నైవేద్యం సమర్పిస్తారు. దీనిని ప్రాతఃకాల ఆరాధనగా పిలుస్తారు. తొలి విడత నైవేద్యం అనంతరం వీవీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి. రెండో విడతగా మధ్యాహ్నం మళ్లీ నైవేద్యం సమర్పిస్తారు. మూడో విడతగా రాత్రి 8 గంటలకు జరుగుతుంది. వీవీఐపీ కోటా కింద భారీ సంఖ్యలో ఎల్–2, ఎల్–3 దర్శనాలను మధ్యాహ్నం ఎంతసేపైనా కొనసాగించడానికే ప్రభుత్వం మధ్యాహ్నం నైవేద్యం వేళలలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారమే ఎందుకంటే.. తిరుమలలో ప్రతి సోమవారం కల్యాణోత్సవ మండపంలో ‘విశేష పూజ’సేవ నిర్వహించాల్సి ఉండటం, అదే రోజు వీవీఐపీ బ్రేక్ దర్శనానికి బాగా డిమాండ్ ఉండటం వంటి కారణాలతో ప్రత్యేకించి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్య వేళలో మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. అలాగే, ఈ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామున తొలి విడత నైవేద్యం అనంతరం ఎల్–1 బ్రేక్ దర్శనాలు కొనసాగించి 7 గంటలకు మధ్యాహ్న నైవేద్యం పూర్తిచేసి ఆ తర్వాత ఎల్–2, ఎల్–3 దర్శనాలను ఎంతసేపైనా కొనసాగిస్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న నైవేద్య కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రభుత్వ తాజా ఆదేశాల కారణంగా ప్రతీ సోమవారం తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. అభ్యంతరాలతో ఆగమ సలహా మండలికి సిఫారసు మధ్యాహ్న నైవేద్యం వేళలో మార్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ విషయాన్ని పూర్తిస్థాయి పరిశీలనార్ధం ఆగమ సలహా మండలికి సిఫార్సు చేసినట్లు డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వీరి సలహా వచ్చే వరకు ప్రతి సోమవారం పాత పద్ధతిలోనే మధ్యాహ్న నైవేద్యం నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. శ్రీవారి ఆలయంలో ప్రతీ సోమవారం విశేషపూజ నిర్వహణకు తగినంత సమయం కోసం ఆలయ ప్రధాన అర్చకులు, ముగ్గురు ఆగమ పండితులు ఇతర అర్చకుల సలహా మేరకే మధ్యాహ్న నైవేద్యాన్ని సోమవారం ఉ.7 గంటలకు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాదలు అందజేశారు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో టాలీవుడ్ నటుడు నాని దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.