ఇల్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షలు.. | Harish Rao Presents Gold Crown to Sri Venkateshwara Swamy Temple In Siddipet | Sakshi
Sakshi News home page

ఇల్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షలు..

Published Tue, Jan 3 2023 12:59 AM | Last Updated on Tue, Jan 3 2023 8:34 AM

Harish Rao Presents Gold Crown to Sri Venkateshwara Swamy Temple In Siddipet - Sakshi

స్వర్ణ కిరీటాన్ని తీసుకెళ్తున్న  మంత్రి హరీశ్‌రావు  

సాక్షి, సిద్దిపేట: సంక్రాంతి పండుగ తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలి పారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఆయన సిద్దిపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి కానుకగా సమర్పించారు.

మంత్రి హరీశ్‌రావుతోపాటు భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ కిరీటాన్ని రూపొందించారు. అనంతరం ఆయన బస్తీ దవాఖానాను ప్రారంభించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌ మాట్లా డుతూ పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బస్తీ ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ఈ బస్తీ దవాఖానాను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఇతర నేతలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement