Gold crown
-
ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయకుడికి, అనంత్ అంబానీ బంగారు కానుక
గణేష్ ఉత్సవాలకు మహారాష్ట్రలోని ముంబై నగరం పెట్టింది పేరు. అందులోనూ ముంబైలోని ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయక ఉత్సవం మరింత స్పెషల్‌గా ఉంటుంది. ఇప్పటికే లాల్బాగ్చా రాజా వినాయకుడి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తాజాగా పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, గణనాథునిపై తమ భక్తిని, గౌరవాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. ముఖ్యంగా అనంత అంబానీ, రాధిక వివాహం తర్వాత తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.నవ వరుడు అనంత్ అంబానీ ముంబైలోని వినాయకుడికి ఘనమైన కానుకను బహూకరించారు. 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.15 కోట్లు. ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. సంప్రదాయ మెరూన్ కలర్ దుస్తుల్లో విలువైన ఆభరణాలకు తోడు ఈ ఏడాది బంగారు కిరీటంతో భక్తుల పూజలందుకోనున్నాడు గణేశుడు.కాగా 'కింగ్ ఆఫ్ లాల్బాగ్' అని పిలిచే లాల్బాగ్చా రాజా ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మంటపం. ప్రతీ సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారు. గత పదిహేనేళ్లుగా అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారు అనంత్ అంబానీ.लालबागचा राजाचे, प्रसिद्धी माध्यमांसाठी फोटो सेशन गुरुवार दिनांक 5 सप्टेंबर 2024 रोजी संध्याकाळी ठिक 7 वाजता करण्यात आले आहे. त्या वेळेची क्षणचित्रे.#lalbaugcharaja Exclusive live on YouTube :https://t.co/XAHhCLjBM6 pic.twitter.com/fg07hI096z— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 5, 2024 -
ఇల్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షలు..
సాక్షి, సిద్దిపేట: సంక్రాంతి పండుగ తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలి పారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఆయన సిద్దిపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి కానుకగా సమర్పించారు. మంత్రి హరీశ్‌రావుతోపాటు భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ కిరీటాన్ని రూపొందించారు. అనంతరం ఆయన బస్తీ దవాఖానాను ప్రారంభించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్ మాట్లా డుతూ పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బస్తీ ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ఈ బస్తీ దవాఖానాను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
షిర్డీ సాయికి రూ. 33 లక్షలతో బంగారు కిరీటం
షిర్డీ: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మందా రామకృష్ణ(80) షిర్డీ సాయిబాబాకు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని శుక్రవారం అందజేశారు. ఈ విషయాన్ని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టు సీఈఓ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు. ఈ కిరీటం బరువు 707 గ్రాములు. 35 గ్రాముల అమెరికా వజ్రాలను కిరీటంలో పొదిగారు. ఈ సందర్భంగా డాక్టర్ మందా రామకృష్ణ మాట్లాడుతూ.. తాను భార్యతో కలిసి 1992లో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నానని చెప్పారు. ఆ సమయంలో సాయిబాబా ఆలయ పూజారి ఒక కిరీటాన్ని తమకు చూపించారని అన్నారు. అలాంటి కిరీటాన్నే సాయిబాబాకు అందజేస్తానని తన భార్యకు మాట ఇచ్చానన్నారు. అప్పట్లో తన వద్ద తగినంత డబ్బు లేదని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలో 15 ఏళ్లపాటు వైద్యుడిగా ప్రాక్టీస్ చేశానని, అలా వచ్చిన డబ్బుతో కిరీటం తయారు చేయించి, సాయిబాబా పాదాల వద్ద పెట్టానని వివరించారు. డాక్టర్ రామకృష్ణ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతిచెందారు. -
కొమురెల్లి మల్లన్నకు 6.5 కిలోల బంగారు కిరీటం
సాక్షి, సిద్దిపేట: కోర మీసాల కొమురెల్లి మల్లన్న ఇక స్వర్ణ కిరీటంతో దర్శనమివ్వనున్నారు. రూ.4 కోట్లు ఖర్చు చేసి 6.5కిలోల బంగారంతో కిరీటం తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మంత్రులు తన్నీరు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీలు హైదరాబాద్‌లో మంగళవారం సమావేశమయ్యారు. భక్తులు కానుకల రూపంలో అందించిన బంగారం, ఎస్బీఐ బాండ్ల ద్వారా వచ్చిన బంగారంతో కిరీటం తయారు చేయించేందుకు నిర్ణయించారు. దాని నమూనాను ఆవిష్కరించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి సీఎం నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రులు తెలిపారు. -
నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
భద్రకాళికి కిరీటం సమర్పించనున్న సీఎం ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం కడియం వరంగల్ : సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాకు రానున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి జిల్లాకు వచ్చి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో బిజీగా ఉన్న మఖ్యమంత్రి శనివారం రాలేకపోయారు. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం సమర్పిం చేందుకు వెళ్తున్నందున ముందురోజు వెళ్లకుండా అమ్మవారికి ధరింపజేసే రోజున వెళ్లాలని పండితులు సూచించిన మేరకు కార్యక్రమంలో మార్పు జరిగినట్లు సమాచారం. ఈమేరకు సీఎం కేసీఆర్ దంపతులు ఆదివారం ఉదయం 9.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మై దానంలో ఉదయం 10.15గంటలకు దిగుతా రు. అక్కడ నుంచి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. అనంతరం 10.40గంటలకు భద్రకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బంగారు కిరీట ధారణ చేస్తారు. మధ్యాహ్నం 12గంటల వరకు భద్రకాళి ఆలయంలో ఉంటారు. అక్కడి నుంచి మళ్లీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు కెప్టెన్ ఇంటి నుంచి బయలుదేరి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి 2.10గంటలకు హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
భద్రకాళికి 11.7 కిలోల బంగారు కిరీటం
నేడు సీఎం కేసీఆర్ రాక రేపు మొక్కు చెల్లింపు సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం వరంగల్‌కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రకాళి అమ్మవారికి ఆదివారం మొక్కు చెల్లించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాౖటెన సందర్భంగా భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం ఇచ్చి మొక్కు తీర్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో మొక్కు చెల్లించుకుంటున్నారు. భద్రకాళి అమ్మవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం 11.70 కిలోల బంగారు కిరీటాన్ని తయారు చేయించింది. దీనికి రూ. 3.70 కోట్లు ఖర్చు చేశారు. జీఆర్టీ జువెల్లర్స్ ఈ కిరీటాన్ని తయారు చేసింది. బంగారు కిరీ టం మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా శనివారం సాయంత్రం వరంగల్‌కు వస్తున్నారు. హన్మకొండలోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం భద్రకాళి ఆలయానికి వెళ్లి కిరీటం మొక్కును చెల్లిస్తారు. భద్రకాళి అమ్మవారికి సమర్పించే బం గారు కిరీటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం రాత్రి భద్రకాళి ఆలయానికి వెళ్లి పరిశీలించారు. అదేవిధంగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కూడా సమీక్షించారు. -
శ్రీవారికి రూ. కోటి విలువైన కిరీటం కానుక
తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు రూ. కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని బహుకరించాడు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు చెందిన బాలమురగన్ అపర్ణ అనే భక్తుడు ఈ కిరీటాన్ని కానుకగా ఇచ్చాడు. ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ను కలిసి కిరీటాన్ని అందజేశాడు.