భద్రకాళికి 11.7 కిలోల బంగారు కిరీటం
-
నేడు సీఎం కేసీఆర్ రాక
-
రేపు మొక్కు చెల్లింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం వరంగల్‌కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రకాళి అమ్మవారికి ఆదివారం మొక్కు చెల్లించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాౖటెన సందర్భంగా భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం ఇచ్చి మొక్కు తీర్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో మొక్కు చెల్లించుకుంటున్నారు. భద్రకాళి అమ్మవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం 11.70 కిలోల బంగారు కిరీటాన్ని తయారు చేయించింది. దీనికి రూ. 3.70 కోట్లు ఖర్చు చేశారు. జీఆర్టీ జువెల్లర్స్ ఈ కిరీటాన్ని తయారు చేసింది. బంగారు కిరీ టం మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా శనివారం సాయంత్రం వరంగల్‌కు వస్తున్నారు. హన్మకొండలోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం భద్రకాళి ఆలయానికి వెళ్లి కిరీటం మొక్కును చెల్లిస్తారు. భద్రకాళి అమ్మవారికి సమర్పించే బం గారు కిరీటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం రాత్రి భద్రకాళి ఆలయానికి వెళ్లి పరిశీలించారు. అదేవిధంగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కూడా సమీక్షించారు.