
హీరోగా, నిర్మాతగా, గేయ రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్నారు విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఆయన ప్రస్తుతం తన 25వ చిత్రం ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు నిర్మిస్తున్నారు.
తాజాగా భద్రకాళి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్ధం, అహంకారం అంతం అవును’.. అంటూ ప్రారంభమైన ఈ టీజర్‌లో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడనేది అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఫ్యామిలీ మెన్‌లా, మరోసారి గ్యాంగ్‌స్టర్‌లా, ఇంకో సందర్భంలో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు.
రూ.190 కోట్ల కుంభకోణం చుట్టూ కథ తిరిగేలా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చివర్లో వచ్చే డైలాగ్ సస్పెన్స్‌కు తెరదీసింది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ కనిపించనంత స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనియే సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. భద్రకాళి సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
చదవండి: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్‌బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..!
Comments
Please login to add a commentAdd a comment