vijay antoni
-
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన బిచ్చగాడు 2 కలెక్షన్స్
-
ఈ సినిమాలో ఆ సీన్స్ కూడా ఉంటాయి: బిచ్చగాడు హీరో
సంగీతదర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని ఇంతకు ముందు కథానాయకుడిగా నటించి నిర్మించిన పిచ్చైక్కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'పిచ్చైక్కారన్– 2' (తెలుగులో బిచ్చగాడు-2) చిత్రాన్ని సొంతంగా నిర్మించి, సంగీతాన్ని అందించి, కథానాయకుడిగా నటించారు. (ఇది చదవండి: ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్) ఇందులో విశేషమేమిటంటే ఈ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా అవతారమెత్తడం. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఈయన సతీమణి ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రంలో కావ్య తాపర్ నాయకిగా నటించగా రాధారవి, వైజీ.మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, హరీష్ పేరడీ, జాన్స్ విజయ్, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి ఓమ్ నారాయణన్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన తాను ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. సాధారణంగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయనీ, తనకు మాత్రం పాటల చిత్రీకరణలో ప్రమాదం జరిగిందన్నారు. తాను సంగీతదర్శకుడిగానూ ఎవరి వద్దా పని చేయలేదనీ, చిత్రాలు చూసిన అనుభవమేనన్నారు. చిత్రం చాలా బాగా వచ్చిందనీ, ఇంతకు ముందు చిత్రాల్లో తనకు రొమాన్స్ సన్నివేశాలు పెద్దగా లేవనేవారనీ.. ఈ చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్) -
ఆసక్తి పెంచుతున్న విజయ్ ఆంటోని ‘హత్య’ ట్రైలర్, చూశారా?
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ .బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ని హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, జీవీజీ రాజు, దర్శకుడు హేమంత్ మధుకర్ అతిథులుగా పాల్గొని, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘‘హత్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వేరే భాష నుంచి వచ్చినా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు విజయ్ ఆంటోనీ. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. లైలా అనే అమ్మాయి హత్య చుట్టూ ఈ కథ నడుస్తుంది’’ అన్నారు బాలాజీ కుమార్. ‘‘త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు నిర్మాతలు. Here’s the Intriguing #HATYATRAILER ➡️https://t.co/XqzLT8Ex2B Best wishes to team #HATYA@vijayantony @DirBalajiKumar @ritika_offl @Meenakshiioffl@FvInfiniti @lotuspictures1 @bKamalBohra @Dhananjayang @pradeepfab @siddshankar_ @thinkmusicindia pic.twitter.com/6Viyglm50p — Nani (@NameisNani) August 15, 2022 -
బిచ్చగాడి పొలిటికల్ ఎంట్రీ
-
సైతాన్ చిత్రంలో సంగీత దర్శకుడు
సైతాన్ అంటే తెలియని వారుండరు. దుష్ట, దుర్మార్గులను సైతాన్‌తో పోల్చుతారు. అలాంటి సైతాన్ చిత్రంలో సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నటించనున్నారు. నాన్ చిత్రంతో నాయకుడిగా అవతారమెత్తిన ఈయన తాజాగా సలీంగా మారారు. ఈ చిత్రం ఈ నెల 29న తెరపైకి రానుంది. తన మరణం తథ్యం అని తెలియడంతో ఒక్క రోజు అయినా తాను కోరుకున్న ప్రకారం జీవించాలని ఆశించే ఒక యువకుడి ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం సలీం. ఇందులో వైద్యుడిగా నటించిన విజయ్ ఆంటోని సరసన తెలుగమ్మాయి అక్షా నటించారు. భారతిరాజా శిష్యుడు నిర్మల్‌కుమార్ దర్శకుడు. చిత్రానికి తానే సంగీతాన్ని అందించి శ్రీ గ్రీన్ స్టూడియో సంస్థతో కలిసి విజయ్ ఆంటోని నిర్మించారు. కాగా తదుపరి ఈయన మరో రెండు చిత్రాలలో నటించడానికి రెడీ అవుతున్నారు. అందులో ఒకటి ఇండియా పాకిస్థాన్. ఇందులో విజయ్ ఆంటోనికి జంటగా సుష్మా నటించనున్నారు. ఈ చిత్రానికి ధనశేఖర్ అనే నూతన సంగీత దర్శకుడు పని చేయడం విశేషం. దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు ఆనంద్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తదుపరి విజయ్ ఆంటోని నటించనున్న చిత్రానికి సైతాన్ అనే పేరును నిర్ణయించారు. ఇది హార్రర్ కథా చిత్రంగా తెరకెక్కనుంది.